Tuesday, September 27, 2011

మనసు బండి

గుప్పెడంత ఈ గుండెలో ఎన్ని రాగాలో.. చెబుదాం అంటే మాట రాదు, ఊరుకుందాం అంటే మనసు ఒప్పుకోదు !
అయినా నా మనసు మీద చెప్పలేనంత కోపంగా ఉంది నాకు. అస్సలు చెప్పిన మాట వినదు.. ఒకటి, రెండు అంటే పరవాలేదు,  అది పాడిన ప్రతీ  రాగం నన్నూ పాడమంటే ఎలా! ఉదయాన్నే 5 గంటలకు అలారం మోగితే దాన్ని snooze చేసి చేసి 6 గంటల వరకు నన్ను బజ్జోపెడుతోంది. ఆఫీస్ ఏమో 7.30 కి. నేను బాక్స్ పెట్టుకొని ఇంటి నుండి బయలుదేరి నా "super Activa" (అవును మరి.. 7 years అయింది దాన్ని కొని. ఇప్పటికి దాని మీద వెళుతుంటే ఆహ్ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. అదంటే నాకు చాల ప్రేమ! దారి మధ్యలో సడన్ గా ఆగిపోయినపుడు తన్ని తిట్టుకున్నా, ఎప్పుడూ పెట్రోల్ కొట్టించుకునే బంక్ లో "ఏంటి మేడం ఇంకా బండి మార్చరా, లోన్ అయినా తీసుకొని కొత్తది కొనండి మేడం" అన్నపుడు లేని పరువును ని కూడా తీసేస్తోంది ఇది అని ఎగిరెగిరి తన్నాలనిపించినా, బస్సు లో ఉండే జనాల చెమట వాసన నుండి, కాళ్ళు తొక్కేసి కనీసం సారీ అయిన చెప్పకుండా చిరుబురులాడే బొద్దు ఆంటీల (బండ ఆంటీ అంటే ఒప్పుకోరు గా) నుండి, ఏంటమ్మా చిల్లర లేకపోతే టికెట్ ఎలా ఇస్తారు నేనేం చిల్లర కొట్టు పెట్టుకోలేదు ఇక్కడ ప్రతీ ఒక్కడికి చిల్లర ఇచ్చుకుంటూ కూర్చోవడానికి" అంటూ విసుక్కొనే conductor నుండి, ఇలా పలు విధాలయిన హింసల నుండి తప్పించే నా సూపర్ బైక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం) లో ఆఫీస్ కు వెళ్లేసరికి 7.45 దాటుతూ ఉంటుంది. రోజు ఇదే పాట. Attendance register లో నేమో నిజాయితీ గా వెళ్ళిన టైం ఏ రాస్తాను (నిజాయితీనా పాడా మొన్నే ఒకడు తప్పు టైం వేసి దొరికిపోతే మా Mrs. of Mr. Chennai అడ్డమైన గడ్డి పెట్టింది దాన్ని చూసి జడుసుకొని అసలు టైం రాసాను ) అందుకే అస్సలు క్రమశిక్షణ లేదు అంటూ పెద్దగా చిన్న క్లాసు తీసుకుంది. ఇంకేం చేయగలను? అంతా  నీ వల్లే అంటూ నా మనసు ని నిందిస్తే అమాయకంగా నిశబ్ధం పాటించింది! ఆఫీసు లో online games వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్న వినదు. సినిమాలు చూడొద్దు బుద్ధిగా బుక్స్ చదువుకో అంటే ఒప్పుకోదు.  ఈ మనసు బండి లో విహరించడం ఎంత ఆనందంగ ఉంటుందో.. బ్రేక్స్ లేని దీనిలో  ప్రయాణం అంతే రిస్కీ గా ఉంటుంది. అమ్మో సరి నేను రేపు కలుస్తా మా Mrs. of Mr. Chennai వస్తోంది..  టాటా !

3 comments:

శిశిర said...

:) బాగా రాస్తున్నారు.

Priya said...

మీకు నచ్చినందుకు కృతజ్ఞతలండీ :)

శోభ said...

"మనసు బండిలో విహరించడం ఎంత ఆనందంగా ఉంటుందో.. బ్రేక్స్ లేని దీనిలో ప్రయాణం అంతే రిస్కీగా ఉంటుంది.." అయినా హాయిగానే ఉంటుందిగా.. ఎంచక్కా ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా విహరించేయొచ్చు కదా.. :)..

నైస్ పోస్ట్ ప్రియా...

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, September 27, 2011

మనసు బండి

గుప్పెడంత ఈ గుండెలో ఎన్ని రాగాలో.. చెబుదాం అంటే మాట రాదు, ఊరుకుందాం అంటే మనసు ఒప్పుకోదు !
అయినా నా మనసు మీద చెప్పలేనంత కోపంగా ఉంది నాకు. అస్సలు చెప్పిన మాట వినదు.. ఒకటి, రెండు అంటే పరవాలేదు,  అది పాడిన ప్రతీ  రాగం నన్నూ పాడమంటే ఎలా! ఉదయాన్నే 5 గంటలకు అలారం మోగితే దాన్ని snooze చేసి చేసి 6 గంటల వరకు నన్ను బజ్జోపెడుతోంది. ఆఫీస్ ఏమో 7.30 కి. నేను బాక్స్ పెట్టుకొని ఇంటి నుండి బయలుదేరి నా "super Activa" (అవును మరి.. 7 years అయింది దాన్ని కొని. ఇప్పటికి దాని మీద వెళుతుంటే ఆహ్ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. అదంటే నాకు చాల ప్రేమ! దారి మధ్యలో సడన్ గా ఆగిపోయినపుడు తన్ని తిట్టుకున్నా, ఎప్పుడూ పెట్రోల్ కొట్టించుకునే బంక్ లో "ఏంటి మేడం ఇంకా బండి మార్చరా, లోన్ అయినా తీసుకొని కొత్తది కొనండి మేడం" అన్నపుడు లేని పరువును ని కూడా తీసేస్తోంది ఇది అని ఎగిరెగిరి తన్నాలనిపించినా, బస్సు లో ఉండే జనాల చెమట వాసన నుండి, కాళ్ళు తొక్కేసి కనీసం సారీ అయిన చెప్పకుండా చిరుబురులాడే బొద్దు ఆంటీల (బండ ఆంటీ అంటే ఒప్పుకోరు గా) నుండి, ఏంటమ్మా చిల్లర లేకపోతే టికెట్ ఎలా ఇస్తారు నేనేం చిల్లర కొట్టు పెట్టుకోలేదు ఇక్కడ ప్రతీ ఒక్కడికి చిల్లర ఇచ్చుకుంటూ కూర్చోవడానికి" అంటూ విసుక్కొనే conductor నుండి, ఇలా పలు విధాలయిన హింసల నుండి తప్పించే నా సూపర్ బైక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం) లో ఆఫీస్ కు వెళ్లేసరికి 7.45 దాటుతూ ఉంటుంది. రోజు ఇదే పాట. Attendance register లో నేమో నిజాయితీ గా వెళ్ళిన టైం ఏ రాస్తాను (నిజాయితీనా పాడా మొన్నే ఒకడు తప్పు టైం వేసి దొరికిపోతే మా Mrs. of Mr. Chennai అడ్డమైన గడ్డి పెట్టింది దాన్ని చూసి జడుసుకొని అసలు టైం రాసాను ) అందుకే అస్సలు క్రమశిక్షణ లేదు అంటూ పెద్దగా చిన్న క్లాసు తీసుకుంది. ఇంకేం చేయగలను? అంతా  నీ వల్లే అంటూ నా మనసు ని నిందిస్తే అమాయకంగా నిశబ్ధం పాటించింది! ఆఫీసు లో online games వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్న వినదు. సినిమాలు చూడొద్దు బుద్ధిగా బుక్స్ చదువుకో అంటే ఒప్పుకోదు.  ఈ మనసు బండి లో విహరించడం ఎంత ఆనందంగ ఉంటుందో.. బ్రేక్స్ లేని దీనిలో  ప్రయాణం అంతే రిస్కీ గా ఉంటుంది. అమ్మో సరి నేను రేపు కలుస్తా మా Mrs. of Mr. Chennai వస్తోంది..  టాటా !

3 comments:

 1. :) బాగా రాస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చినందుకు కృతజ్ఞతలండీ :)

   Delete
 2. "మనసు బండిలో విహరించడం ఎంత ఆనందంగా ఉంటుందో.. బ్రేక్స్ లేని దీనిలో ప్రయాణం అంతే రిస్కీగా ఉంటుంది.." అయినా హాయిగానే ఉంటుందిగా.. ఎంచక్కా ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా విహరించేయొచ్చు కదా.. :)..