Tuesday, September 27, 2011

నిజమైన అందం

అందం.. ఒక అధ్బుతం ! మోములో కాదు మనసులో ఉంటుంది అది. ఈ రోజు అలాటి అందమైన మనసులను  చూసాను నేను ! అసలే లేట్ అయిపోయింది ఈ దిక్కుమాలిన సిగ్నల్స్ వేరే ప్రాణం తీయడానికి అని విసుక్కుంటూ నిలబడ్డాను. అప్పుడు చూసాను ఆ అందాన్ని! సూటు బూటు వేసుకొని, ఒక చేతిలో లాప్ టాప్, మరొక చేతిలో శరవనాభవన్  క్యారీ బాగ్ తో ఒక పెద్దాయన హడావిడిగా Ford Fiesta కార్ నుండి కిందకు దిగి డ్రైవర్ మీద పెద్దగా కేకలు వేసి  గబగబా ముందుకి నడిచాడు. ఇంతలో అక్కడే ఫుట్ పాత్  మీద పడుకొని ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు లేచి, ఆ పెద్దాయన వెనుక వెళుతూ తమ చిన్న పొట్ట (నిజానికి అక్కడ ఎండిపోయిన ఎముకలు తప్ప మరేమీ లేవు) మీద చెయ్యి పెట్టుకొని  ఏదో అడుగుతున్నారు (బహుశా తినడానికి ఏమైనా ఇవ్వమని కావచ్చు)  ఆ పెద్దాయనేమో కళ్ళెర్రజేసి చీదరించుకుంటూ అరిచారు అయినా ఈ మొండి పిల్లలు వదిలితేనా మరి? వెనుకే వెళ్లి విసిగించారు ఇహ ఆయనేమి చేయలేననుకున్నారు కాబోలు తనలో తానే గొణుక్కుంటూ పరుగులాటి నడకతో ముందు వెనుక చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న ఒక కార్ ని గుద్దుకున్నారు. ఇదంతా 90 సెకండ్స్ లో  జరిగింది. నేను ఆ షాక్ నుండి తేరుకొని చూసేలోపు ఆయన వెంటపడిన ఆ ఇద్దరు పిల్లలో ఒకడు అక్కడున్న వారిని బ్రతిమాలుతున్నాడు మరొకడు పరుగులంకిoచుకున్నాడు భయపడి పారిపోతున్నాడేమో అనుకుంటూ బండి పక్కన పెట్టి ఆ పెద్దాయన దగ్గరకు పరుగు తీసాను కాని ఏం చెయ్యాలో పాలుపోలేదు.. అంత సీరియస్ దెబ్బలు కావు కాని కాస్త రక్తం పోతోంది, ఆయన స్పృహలో లేరు. ఇంతలో ఇందాక పరుగుపెట్టిన పిల్లాడు ట్రాఫ్ఫిక్ పోలీసు ని తీసుకొని వచ్చాడు, ఆయన చూసి  అంబులెన్స్ కి కాల్ చేసారు. అక్కడంతా గొడవ గొడవగా ఉంది. గుద్దిన కార్ ఆయనను పోలీస్ యేవో ఆయనకుతోచిన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అప్పుడు చూసాను పరిశీలనగా ఆ పిల్లల వైపు ! మురికి బాగా పేరుకుపోయి, అక్కడక్కడ చిరిగి ఉన్న షర్ట్, దుమ్ము పట్టేసిన మోహము, భూతద్దం పెట్టి చూసిన ఎక్కడా చెంచ మాంసం కూడా కనిపించట్టుగా ఎండిపోయి ఉన్న వాళ్ళ శరీరాలు, వారి కళ్ళలో తప్ప మరి ఎక్కడా తేమ అనేది లేదు! అక్కడ అంత మంది ఉన్నా ఎవ్వరు రాలేదు, వచ్చినా ఎవరికి వారు చూస్తూ ఉండిపోయారు (నేను కూడా). కాని వాళ్ళు మాత్రం స్పందిoచగలిగారు! అదే ఈ పిల్లలో ఒకడికి ఇలా జరిగి ఉంటె కనీసం ఆ పెద్దాయన తిరిగి చూస్తాడని కూడా నేను అనుకోను. మేము అడిగినపుడు ఇవ్వలేదు కదా తిక్కకుదిరింది అనుకోకుండా పసి వాళ్ళైనా చక్కగా ఆలోచించారు. వారి బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో వారి మనసులు అంత స్వచ్చం గా ఉన్నాయి. అక్కడి నుండి వచ్చేప్పుడు వారి కళ్ళలో అమాయత్వమే కాదు అంతులేని ఆనందాన్ని, ఒకలాటి మెరుపుని చూసాను. (ఈ రోజు ఆఫీసు కి గంటన్నర్ర లేట్ అయినా అసలు ఆ ఆలోచనే లేదు నాకు!) Its a great day..  చాలా మంది చూడలేని నిజమైన అందాన్ని చూడగలిగాను ! 

9 comments:

లక్ష్మీ నరేష్ said...

bagundi...chinna chinna santhoshaalu, manasu ni nadipisthaayi...sayam aa peddayana cheyakapoyina choosina manasunna meeru cheyochu..emantaaru

Priya said...

Appudu nenem chesaananna vishayanni cheppadam ippudu avasaram ledandi. Migathaa samayaallo kooda nenu, naalaati chaalaamandi thochinatlu, cheyagaliginantha saayam chesthuntaaru. But adi temporary gaane kaani vaariki permanent solution kaadu kadandee. Adi kooda manam mahaa ayithe 20, 30, .. .. mandiki saayam chesthaamanukondi mari migathaa vaari sangathenti? Ye party adhikaaramloki vachhinaa maamulu vaallake peddhagaa prayojanam undadantaaru. Ika ilaati vaalla sangathevito? Already yentho kontha unna middle class vaalla kante mundu thinadaaniki thindi, kaneesam padukovadaaniki goodu leni veella kosam yemainaa chesthe baagunnu. Naa vayase unna chaalaa mandi ammaayilu thama sareeranni kappukovadaaniki avasthalu paduthoo muduchukoni koorchovadam choosthuntaanu chaalaa saarlu. Konthamandiki battalu ivvagalanu mari migathaa vaallu??

Saayam cheyaalane manasu saadharana manishikante maru mukhyamgaa manalanu paalinche vaarikundaalani korukuntunnaanu.

లక్ష్మీ నరేష్ said...

priya garu, mee anni responses chadivaavu...deeniki matram javabu ivvlanipinchindi...

sayam chesthe, pondina vallu maha aithe a kshanam trupthi padatharemo,manasunna manushulaithe matram aa santhosham chala rojulu nadipisthundi...andariki sayam cheyalem kaani mana paridhi lo cheyagalam..sayamante unnadantha ivvamani kadu, unna danlonchi ivvamani...meekivanni telsu kani cheppalanipinchindi...chinnave..choodandi chali kalam vashtundi gaa..mana illalo boledanni patha duppatlu untaayi avi teesukelli roddu meeda padukunna musali vallako pillalakko ivvadam (idi nenu chesaanu)..ekkuva cheppesanemo, salahalu,sukthulu andaru cheptharu kada...

kaani nijangaa mee postlu bagunnay, vatini rase vidhanam, padala pondika ..mee matallo manasu kanipisthundi...

Priya said...

Thanks Naresh gaaru.. :)

శిశిర said...

మీ చుట్టూ ఉన్నవాటిపైన, జరుగుతున్నవాటిపైన మీ పరిశీలన బాగుందండి.

Priya said...

శిశిర గారు.. కృతజ్ఞతలండీ :)

sri mee snehithudu said...

very nice post priya

Priya said...

Thank you.. :)

శోభ said...

"వారి బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో, వారి మనసులు అంత స్వచ్ఛంగా ఉన్నాయి."... నిజమే ప్రియా చాలామంది చూడలేని నిజమైన అందాన్ని నువ్వు చూశావు..

అందుకేనేమో మన పెద్దలు పసిపిల్లలు దేవుళ్లతో సమానం అన్నారు. నన్నడిగితే ఈ పిల్లలు దేవుడికంటే గొప్పోళ్లే... ఇది నిజంగా నిజం.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, September 27, 2011

నిజమైన అందం

అందం.. ఒక అధ్బుతం ! మోములో కాదు మనసులో ఉంటుంది అది. ఈ రోజు అలాటి అందమైన మనసులను  చూసాను నేను ! అసలే లేట్ అయిపోయింది ఈ దిక్కుమాలిన సిగ్నల్స్ వేరే ప్రాణం తీయడానికి అని విసుక్కుంటూ నిలబడ్డాను. అప్పుడు చూసాను ఆ అందాన్ని! సూటు బూటు వేసుకొని, ఒక చేతిలో లాప్ టాప్, మరొక చేతిలో శరవనాభవన్  క్యారీ బాగ్ తో ఒక పెద్దాయన హడావిడిగా Ford Fiesta కార్ నుండి కిందకు దిగి డ్రైవర్ మీద పెద్దగా కేకలు వేసి  గబగబా ముందుకి నడిచాడు. ఇంతలో అక్కడే ఫుట్ పాత్  మీద పడుకొని ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు లేచి, ఆ పెద్దాయన వెనుక వెళుతూ తమ చిన్న పొట్ట (నిజానికి అక్కడ ఎండిపోయిన ఎముకలు తప్ప మరేమీ లేవు) మీద చెయ్యి పెట్టుకొని  ఏదో అడుగుతున్నారు (బహుశా తినడానికి ఏమైనా ఇవ్వమని కావచ్చు)  ఆ పెద్దాయనేమో కళ్ళెర్రజేసి చీదరించుకుంటూ అరిచారు అయినా ఈ మొండి పిల్లలు వదిలితేనా మరి? వెనుకే వెళ్లి విసిగించారు ఇహ ఆయనేమి చేయలేననుకున్నారు కాబోలు తనలో తానే గొణుక్కుంటూ పరుగులాటి నడకతో ముందు వెనుక చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న ఒక కార్ ని గుద్దుకున్నారు. ఇదంతా 90 సెకండ్స్ లో  జరిగింది. నేను ఆ షాక్ నుండి తేరుకొని చూసేలోపు ఆయన వెంటపడిన ఆ ఇద్దరు పిల్లలో ఒకడు అక్కడున్న వారిని బ్రతిమాలుతున్నాడు మరొకడు పరుగులంకిoచుకున్నాడు భయపడి పారిపోతున్నాడేమో అనుకుంటూ బండి పక్కన పెట్టి ఆ పెద్దాయన దగ్గరకు పరుగు తీసాను కాని ఏం చెయ్యాలో పాలుపోలేదు.. అంత సీరియస్ దెబ్బలు కావు కాని కాస్త రక్తం పోతోంది, ఆయన స్పృహలో లేరు. ఇంతలో ఇందాక పరుగుపెట్టిన పిల్లాడు ట్రాఫ్ఫిక్ పోలీసు ని తీసుకొని వచ్చాడు, ఆయన చూసి  అంబులెన్స్ కి కాల్ చేసారు. అక్కడంతా గొడవ గొడవగా ఉంది. గుద్దిన కార్ ఆయనను పోలీస్ యేవో ఆయనకుతోచిన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అప్పుడు చూసాను పరిశీలనగా ఆ పిల్లల వైపు ! మురికి బాగా పేరుకుపోయి, అక్కడక్కడ చిరిగి ఉన్న షర్ట్, దుమ్ము పట్టేసిన మోహము, భూతద్దం పెట్టి చూసిన ఎక్కడా చెంచ మాంసం కూడా కనిపించట్టుగా ఎండిపోయి ఉన్న వాళ్ళ శరీరాలు, వారి కళ్ళలో తప్ప మరి ఎక్కడా తేమ అనేది లేదు! అక్కడ అంత మంది ఉన్నా ఎవ్వరు రాలేదు, వచ్చినా ఎవరికి వారు చూస్తూ ఉండిపోయారు (నేను కూడా). కాని వాళ్ళు మాత్రం స్పందిoచగలిగారు! అదే ఈ పిల్లలో ఒకడికి ఇలా జరిగి ఉంటె కనీసం ఆ పెద్దాయన తిరిగి చూస్తాడని కూడా నేను అనుకోను. మేము అడిగినపుడు ఇవ్వలేదు కదా తిక్కకుదిరింది అనుకోకుండా పసి వాళ్ళైనా చక్కగా ఆలోచించారు. వారి బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో వారి మనసులు అంత స్వచ్చం గా ఉన్నాయి. అక్కడి నుండి వచ్చేప్పుడు వారి కళ్ళలో అమాయత్వమే కాదు అంతులేని ఆనందాన్ని, ఒకలాటి మెరుపుని చూసాను. (ఈ రోజు ఆఫీసు కి గంటన్నర్ర లేట్ అయినా అసలు ఆ ఆలోచనే లేదు నాకు!) Its a great day..  చాలా మంది చూడలేని నిజమైన అందాన్ని చూడగలిగాను ! 

9 comments:

 1. bagundi...chinna chinna santhoshaalu, manasu ni nadipisthaayi...sayam aa peddayana cheyakapoyina choosina manasunna meeru cheyochu..emantaaru

  ReplyDelete
  Replies
  1. Appudu nenem chesaananna vishayanni cheppadam ippudu avasaram ledandi. Migathaa samayaallo kooda nenu, naalaati chaalaamandi thochinatlu, cheyagaliginantha saayam chesthuntaaru. But adi temporary gaane kaani vaariki permanent solution kaadu kadandee. Adi kooda manam mahaa ayithe 20, 30, .. .. mandiki saayam chesthaamanukondi mari migathaa vaari sangathenti? Ye party adhikaaramloki vachhinaa maamulu vaallake peddhagaa prayojanam undadantaaru. Ika ilaati vaalla sangathevito? Already yentho kontha unna middle class vaalla kante mundu thinadaaniki thindi, kaneesam padukovadaaniki goodu leni veella kosam yemainaa chesthe baagunnu. Naa vayase unna chaalaa mandi ammaayilu thama sareeranni kappukovadaaniki avasthalu paduthoo muduchukoni koorchovadam choosthuntaanu chaalaa saarlu. Konthamandiki battalu ivvagalanu mari migathaa vaallu??

   Saayam cheyaalane manasu saadharana manishikante maru mukhyamgaa manalanu paalinche vaarikundaalani korukuntunnaanu.

   Delete
  2. priya garu, mee anni responses chadivaavu...deeniki matram javabu ivvlanipinchindi...

   sayam chesthe, pondina vallu maha aithe a kshanam trupthi padatharemo,manasunna manushulaithe matram aa santhosham chala rojulu nadipisthundi...andariki sayam cheyalem kaani mana paridhi lo cheyagalam..sayamante unnadantha ivvamani kadu, unna danlonchi ivvamani...meekivanni telsu kani cheppalanipinchindi...chinnave..choodandi chali kalam vashtundi gaa..mana illalo boledanni patha duppatlu untaayi avi teesukelli roddu meeda padukunna musali vallako pillalakko ivvadam (idi nenu chesaanu)..ekkuva cheppesanemo, salahalu,sukthulu andaru cheptharu kada...

   kaani nijangaa mee postlu bagunnay, vatini rase vidhanam, padala pondika ..mee matallo manasu kanipisthundi...

   Delete
  3. Thanks Naresh gaaru.. :)

   Delete
 2. మీ చుట్టూ ఉన్నవాటిపైన, జరుగుతున్నవాటిపైన మీ పరిశీలన బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. శిశిర గారు.. కృతజ్ఞతలండీ :)

   Delete
 3. "వారి బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో, వారి మనసులు అంత స్వచ్ఛంగా ఉన్నాయి."... నిజమే ప్రియా చాలామంది చూడలేని నిజమైన అందాన్ని నువ్వు చూశావు..