Wednesday, September 28, 2011

అపురూపం

Google image

మనసు ఎంత మెత్తనిదో కదా.. ఊరికే భాదపడుతుంది, చిన్న విషయానికే కంగారు పడుతుంది, నచ్చనిది జరిగితే నొచ్చుకుంటుంది, ఇష్టమైన వ్యక్తిని చూస్తే ఉబ్భితబ్బిబ్బవుతుంది, ఇక ఆ వ్యక్తి పక్కనే ఉంటే దాన్ని పట్టుకోవడం కష్టమే! నాకు తెలిసి సృష్టిలో అంత్యంత  విలువైనది, అందమైనది, ఆశ్చర్యకరమైనది, వింతైనది మనసే! ఒకే సారి ఎన్ని ఆలోచిస్తుంది? కోపం, బాధ, సంతోషం, చిరాకు, ప్రశాంతత, ఇలా అన్ని భావాలని తనలో పొదువుకుంటుంది. పుట్టినప్పటి నుండి, కను మూసేంత వరకు మన భావాలు, రహస్యాలు, భద్రం గా దాచుకుంటుంది. ఇంత విలువైన మనసులో మనలో చాలా మంది ద్వేషం, కోపం, పగ, చిరాకు, స్త్రెస్స్, జరిగిపోయిన వాటి గురించిన ఆలోచనలు, జరగవు అని తెలిసిన వాటి గురించి వేదన, ఒకరు మాట్లాడలేదని బాధ, ఇది లేదు, అది కాదు అంటూ గందరగోళం, అబ్బా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెత్త పెట్టుకుంటున్నారు?  వాళ్ళ మనసులు పాడుచేసుకున్నది చాలక తమతో ఉన్న వారిని కూడా disturb చేస్తుంటారు!   జీవితం  ఒక గొప్ప వరం. జీవితాన్ని జీవించాలి. కాని కొంత మంది ఆవేశంలోనో, కోపంలోనో, ఎవరో ఏదో అన్నరానో , తమ జీవితాలను తీరని దుఖంతో నింపేసుకుంటున్నారు లేకపోతే అంతం చేసుకుంటున్నారు! నిజమే  emotions అనేవి చాల strong గా ఉంటాయి. వీటి నుండి బయటపడడం అంత ఈజీ కాదు అలా అని అసాధ్యమూ కాదు. ఆ క్షణంలో (మరింకెంతసేపైన  కావచ్చు) గాజు ముక్కతో గుండెను చీరినట్లే ఉంటుంది దాని వల్ల ఎంతో వేదన.. అది మహా అయితే  కొన్ని నిముషాల నుండి  ఒక ఏడాది వరకు. కాని అప్పుడు తీసుకునే నిర్ణయాల తాలూకూ ప్రభావం అలా ఉండదు! జీవితాంతం వెంటాడుతుంది. మొన్న ఎక్కడో (బెంగుళూరు అనుకుంట)  ఒక అబ్బాయి "మన మధ్య ఉన్న relationship ఈ రోజుతో తెగిపోయింది, నువ్వు నాకు వద్దు" అన్నట్లు facebook  లో పోస్ట్ చేసాడని అతని గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య  చేసుకుందిట! ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినపుడు జాలి కాదు కదా చెంపలు వాయిoచాలన్నంత కోపం వస్తుంది.  జీవితం లో ప్రతీ క్షణం ఎంతో అమూల్యమైనది దానిని పూర్తిగా ఆస్వాదించగలగడం ఒక అదృష్టం.  రేపు రాబోయే సమస్య గురించి ఈ రోజు నుండే బాధ పడడం వలన ఒరిగేది ఏమి లేదు సరికదా ఈ రోజు ఉన్న ఆనందం కూడా పోతుంది ! కాని చాలా మంది తెలిసీ చేసే పొరపాటు ఇది! ఇది చాల చిన్న విషయం గా కనబడే పెద్ద విషయం ! జీవితం చాలా చిన్నది ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు.. జరగబోయేది ఎలాగూ జరిగే తీరుతుంది కనుక ఎప్పుడో ఏదో అవుతుంది (అది మరొక గంటలోనే కావచ్చు లేదా మరెపుడైన కావచ్చు) అని దాని గురించి ఆలోచిస్తూ మనశ్శాoతిని కోల్పోతే ఆ సమయం మన జీవితం వృధా అవుతుంది. లైఫ్ లో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి, ఆనందించండి, ఆ ఆనందాన్ని మీతో ఉన్న వారికీ పంచండి. సంతోషం లో ఎవరైనా నవ్వుతారు కాని విషం చిమ్మే విషాదంలో కూడా నవ్వుతూ సంతోషాన్ని పంచే వాడే నిజమైన మనిషి (ఇది నా లాటి చాలా మంది అభిప్రాయం సుమీ!) .  

8 comments:

లక్ష్మీ నరేష్ said...

nijame...aa samayam lo samayamanam kolpovadam sadhaaranam, kaani dani valla pakka vallaki nastam jarigithe చెంపలు వాయిoచాలన్నంత mohamatam lekunda cheyochu...

Priya said...

Kadaa..

శిశిర said...

బాగా చెప్పారు.

Priya said...

Thanks andi :)

అనూ said...

Well said. మీ అభిప్రాయమే నాదీనూ. నేనూ 'నిజమైన మనిషి ' గా మిగలాలని అనుకుంటున్నాను.

Priya said...

థాంక్స్ అనూ గారూ!
మనసుని మన స్వాధీనంలో పెట్టుకుంటే అది సుసాధ్యమే :)

harikunderu said...

ఇప్పుడే మీ బ్లాగ్ లో పోస్టులు చదవటం మొదలు పెట్టాను. మీ వ్రాత శైలి చాలా బాగుంది. తెలుగు భాష అడుగడుగుకి అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటివి చదవటం ఎంతో ఆహ్లాదంగా ఉంది.

Priya said...

మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్ హరి గారు :)

వారం క్రితమే మీ కామెంట్ పబ్లిష్ చేశాను గానీ రిప్లై ఇవ్వలేకపోయాను. సారీ.. ఈ వేళే ఇంటర్నెట్ మళ్ళీ ఆక్టివేట్ అయిందండి. By the way.. మీ బ్లాగ్ చదివాను. బావుందండి :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Wednesday, September 28, 2011

అపురూపం

Google image

మనసు ఎంత మెత్తనిదో కదా.. ఊరికే భాదపడుతుంది, చిన్న విషయానికే కంగారు పడుతుంది, నచ్చనిది జరిగితే నొచ్చుకుంటుంది, ఇష్టమైన వ్యక్తిని చూస్తే ఉబ్భితబ్బిబ్బవుతుంది, ఇక ఆ వ్యక్తి పక్కనే ఉంటే దాన్ని పట్టుకోవడం కష్టమే! నాకు తెలిసి సృష్టిలో అంత్యంత  విలువైనది, అందమైనది, ఆశ్చర్యకరమైనది, వింతైనది మనసే! ఒకే సారి ఎన్ని ఆలోచిస్తుంది? కోపం, బాధ, సంతోషం, చిరాకు, ప్రశాంతత, ఇలా అన్ని భావాలని తనలో పొదువుకుంటుంది. పుట్టినప్పటి నుండి, కను మూసేంత వరకు మన భావాలు, రహస్యాలు, భద్రం గా దాచుకుంటుంది. ఇంత విలువైన మనసులో మనలో చాలా మంది ద్వేషం, కోపం, పగ, చిరాకు, స్త్రెస్స్, జరిగిపోయిన వాటి గురించిన ఆలోచనలు, జరగవు అని తెలిసిన వాటి గురించి వేదన, ఒకరు మాట్లాడలేదని బాధ, ఇది లేదు, అది కాదు అంటూ గందరగోళం, అబ్బా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెత్త పెట్టుకుంటున్నారు?  వాళ్ళ మనసులు పాడుచేసుకున్నది చాలక తమతో ఉన్న వారిని కూడా disturb చేస్తుంటారు!   జీవితం  ఒక గొప్ప వరం. జీవితాన్ని జీవించాలి. కాని కొంత మంది ఆవేశంలోనో, కోపంలోనో, ఎవరో ఏదో అన్నరానో , తమ జీవితాలను తీరని దుఖంతో నింపేసుకుంటున్నారు లేకపోతే అంతం చేసుకుంటున్నారు! నిజమే  emotions అనేవి చాల strong గా ఉంటాయి. వీటి నుండి బయటపడడం అంత ఈజీ కాదు అలా అని అసాధ్యమూ కాదు. ఆ క్షణంలో (మరింకెంతసేపైన  కావచ్చు) గాజు ముక్కతో గుండెను చీరినట్లే ఉంటుంది దాని వల్ల ఎంతో వేదన.. అది మహా అయితే  కొన్ని నిముషాల నుండి  ఒక ఏడాది వరకు. కాని అప్పుడు తీసుకునే నిర్ణయాల తాలూకూ ప్రభావం అలా ఉండదు! జీవితాంతం వెంటాడుతుంది. మొన్న ఎక్కడో (బెంగుళూరు అనుకుంట)  ఒక అబ్బాయి "మన మధ్య ఉన్న relationship ఈ రోజుతో తెగిపోయింది, నువ్వు నాకు వద్దు" అన్నట్లు facebook  లో పోస్ట్ చేసాడని అతని గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య  చేసుకుందిట! ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినపుడు జాలి కాదు కదా చెంపలు వాయిoచాలన్నంత కోపం వస్తుంది.  జీవితం లో ప్రతీ క్షణం ఎంతో అమూల్యమైనది దానిని పూర్తిగా ఆస్వాదించగలగడం ఒక అదృష్టం.  రేపు రాబోయే సమస్య గురించి ఈ రోజు నుండే బాధ పడడం వలన ఒరిగేది ఏమి లేదు సరికదా ఈ రోజు ఉన్న ఆనందం కూడా పోతుంది ! కాని చాలా మంది తెలిసీ చేసే పొరపాటు ఇది! ఇది చాల చిన్న విషయం గా కనబడే పెద్ద విషయం ! జీవితం చాలా చిన్నది ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు.. జరగబోయేది ఎలాగూ జరిగే తీరుతుంది కనుక ఎప్పుడో ఏదో అవుతుంది (అది మరొక గంటలోనే కావచ్చు లేదా మరెపుడైన కావచ్చు) అని దాని గురించి ఆలోచిస్తూ మనశ్శాoతిని కోల్పోతే ఆ సమయం మన జీవితం వృధా అవుతుంది. లైఫ్ లో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి, ఆనందించండి, ఆ ఆనందాన్ని మీతో ఉన్న వారికీ పంచండి. సంతోషం లో ఎవరైనా నవ్వుతారు కాని విషం చిమ్మే విషాదంలో కూడా నవ్వుతూ సంతోషాన్ని పంచే వాడే నిజమైన మనిషి (ఇది నా లాటి చాలా మంది అభిప్రాయం సుమీ!) .  

8 comments:

 1. nijame...aa samayam lo samayamanam kolpovadam sadhaaranam, kaani dani valla pakka vallaki nastam jarigithe చెంపలు వాయిoచాలన్నంత mohamatam lekunda cheyochu...

  ReplyDelete
 2. బాగా చెప్పారు.

  ReplyDelete
 3. Well said. మీ అభిప్రాయమే నాదీనూ. నేనూ 'నిజమైన మనిషి ' గా మిగలాలని అనుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అనూ గారూ!
   మనసుని మన స్వాధీనంలో పెట్టుకుంటే అది సుసాధ్యమే :)

   Delete
 4. ఇప్పుడే మీ బ్లాగ్ లో పోస్టులు చదవటం మొదలు పెట్టాను. మీ వ్రాత శైలి చాలా బాగుంది. తెలుగు భాష అడుగడుగుకి అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటివి చదవటం ఎంతో ఆహ్లాదంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్ హరి గారు :)