Friday, September 14, 2012

క్షమించు మనసా..నేను నేనే ఎందుకయ్యానో? అసలు ఎందుకు పుట్టానో? ఇంకా ఎందుకు బ్రతుకుతున్నానో?

ఛీ ఛీ.. ఏవిటి ఇలా ఆలోచిస్తున్నాను? "విషం చిమ్మే విషాదంలోనూ నవ్వగలిగే వాడే నిజమైన మనిషి" అని నమ్మే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?! "ఎవరెమంటే ఏం.. దేవునికి, అంతరాత్మకు తప్ప మరొకరికి బదులు చెప్పాల్సిన పని లేదు.. అయినా లోకులు కాకులు వారిని పట్టించుకుంటే జీవితంలో ముందడుగు వేయడం కష్టం" అనుకునే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?? "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని అనిపించిన ప్రతి సారి "నాకే ఎందుకు జరగకూడదు? మరెవరికో ఎందుకు జరగాలి? నేను దీన్ని ఎదుర్కోగలను కనుకనే నాకే జరుగుతోంది" అని సమర్ధించుకునే నేనేనా ఇలా నిస్సహాయంగా నిరీక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాను?! ఆశ్చర్యంగానే ఉంది. కాని నిజమే.. నేనే ఇలా ఆలోచిస్తున్నాను!

నేను ఎంతో అభిమానించే ఆవిడ "ప్రేమగా" అన్న మాటలకు ఒక్కసారిగా నా మనస్సు ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎప్పటిలాగానే గుండెనిండా గాయాలు, అగాధంలాటి ఒంటరితనం. బేలగా  నా వైపు చూస్తే, పెదవులు
నవ్వుతున్నా కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి. దాంతో అది వణికిపోతోంది. ఇప్పుడు నేనెలా దాన్ని సముదాయించనూ? ఎంతో కష్టపడి చందమామ కథలు చెప్పి, లేని పోని ఊహలు పుట్టించి, జరగని వాటిని జరుగుతాయి చూడు అని నమ్మబలికి, తనకోసం కృత్రిమ ప్రశాంతతను సృష్టించి జోల పాడితే.. అవన్నీ నిజమని నమ్మి అమాయకంగా ఆనందపడే నా మనసుని చూసి మురుసుకున్నాను. కాని ఇప్పుడు మళ్ళీ తను వాస్తవాన్ని గ్రహించి వణికిపోతుంటే నేనేమని ధైర్యం చెప్పను? "నువ్వు ఉత్తినే బాధపడకు. ఇప్పుడేమైందని? ఛీ ఛీ ఇలాటి చిన్న విషయాల కోసం ఏడుస్తావా నువ్వూ..? హవ్వ!"  అంటూ దగ్గరికెళితే "మళ్ళీ మాయమాటలు చెప్పకు"  పొమ్మంటూ దూరంగా తోసేసింది.   

నా బుగ్గల మీద కారుతున్న కన్నీటి చారలను చెరపడానికి చిరుగాలి చేసే చిరు ప్రయత్నాలు  విఫలమవుతున్నాయి. ఎప్పుడూ దగ్గరకు తీసుకునే మనసు కూడా పొమ్మంది. ఏం చేయను? ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే నా జీవితంలో అన్నీ ముళ్ళ చెట్లే.. ఒక్క పూలమొక్క అయినా లేదు. అయినప్పటికీ ఆ ముళ్ళ చెట్ల మధ్య ఉండే గడ్డిపూలను తలుచుకొని సంబరపడబోయాను కాని ఆ జ్జ్ఞాపకాల దారిలో ఉండే రాకాసి ముళ్ళు గుచ్చుకోవడంతో ఇదిగో ఇలా నిస్సహాయంగా కూర్చున్నాను. 

"రక్తసంబంధం ఉంటేనే ప్రేమా? లేకపోతే? మరి నా రక్తసంబంధికులు మాత్రం నన్నెందుకిలా ఒంటరితనానికి బందీని చేసారు? అవును. నేను అనాధనే.. అందరు ఉన్న అనాధను. ఇంతకూ అనాధ అంటే ఏవిటి? ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఎందుకు నాకీ క్షోభ? ఎన్నాళ్ళని వినాలి ఆ మాట?" అని మనసు మూగగా రోదిస్తుంటే నేనెలా ఆపనూ? నా రక్తసంబంధికులు అదే అంటారు.. బయటి వాళ్ళూ అదే అంటారు! ఎలా అయ్యాను నేను అనాధను? ఎందుకయ్యాను? గుడ్డిగా అభిమానించి నా వాళ్ళూ, నా వాళ్ళూ అని వెంపర్లాడుతూ ప్రేమ చూయించినందుకూ, అదే సన్నిహిత్యంతో వారిముందు నేను నేనుగా ఉన్నందుకు వారు నాకిచ్చిన బిరుదు "తింగరి, అనాధ, పిచ్చిమాలోకం". "నువ్వు దిక్కులేని దానివి.. ..... ... .. ... " అంటున్నపుడు  కనురెప్పల చాటున చివ్వున ఉబికిన కన్నీటినీ, ఉక్కిరిబిక్కిరయి మనసు పడ్డ వేదననూ పంటి బిగువున దాచిపెట్టి చిరునవ్వు నవ్వితే దాని అర్ధం నేను తింగరిననా? ఏమన్నా పట్టించుకోను.. తేలిగ్గా తీసుకోగలననా?!!! 
 
అయ్యో.. నాకు ఇంకాస్త శక్తి ఉంటే బాగుణ్ణు. నా మనసులోని మౌన రాగాన్ని విని మాట్లాడలేక మూగాబోవడం కాకుండా తనను ఊరడించగలిగితే బాగుణ్ణు.  అయినా మనసా..! నీ మౌనరాగాన్ని నే వింటున్నాలే..  నా నిస్సహాయతను మన్నించి మదనపడక ముందుకి సాగిపో.. !
      
8 comments:

Padmarpita said...

మనసులోని భావాన్ని బాగారాసారు...అభినందనలు!

Priya said...

మీ అభినందనలకు కృతజ్ఞతలు, Padmarpita గారు!

srinivasarao vundavalli said...

Koodali.org lo just ala browse chestu unte mee blog kanipinchindi..chala baaga raasaru..

Priya said...

Chaala thanks Srinivasarao gaaru :)

లక్ష్మీ నరేష్ said...

ఛీ ఛీ.. ఏవిటి ఇలా ఆలోచిస్తున్నాను? "విషం చిమ్మే విషాదంలోనూ నవ్వగలిగే వాడే నిజమైన మనిషి" అని నమ్మే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?! "ఎవరెమంటే ఏం.. దేవునికి, అంతరాత్మకు తప్ప మరొకరికి బదులు చెప్పాల్సిన పని లేదు.. అయినా లోకులు కాకులు వారిని పట్టించుకుంటే జీవితంలో ముందడుగు వేయడం కష్టం" అనుకునే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?? "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని అనిపించిన ప్రతి సారి "నాకే ఎందుకు జరగకూడదు? మరెవరికో ఎందుకు జరగాలి? నేను దీన్ని ఎదుర్కోగలను కనుకనే నాకే జరుగుతోంది" అని సమర్ధించుకునే నేనేనా ఇలా నిస్సహాయంగా నిరీక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాను?!

Best lines, every time I remind in hard times as it is.....chala chala bagundi, konchem badha ga kooda

Priya said...

Thanks Naresh gaaru. Its part of life andi. Anni rakaala bhaavalu kalisthene kadaa jeevithaaniki andam :)

Chinni said...

అర్థమైంది..కానీ చాలా బాధగా అనిపించింది.

Priya said...

:)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, September 14, 2012

క్షమించు మనసా..నేను నేనే ఎందుకయ్యానో? అసలు ఎందుకు పుట్టానో? ఇంకా ఎందుకు బ్రతుకుతున్నానో?

ఛీ ఛీ.. ఏవిటి ఇలా ఆలోచిస్తున్నాను? "విషం చిమ్మే విషాదంలోనూ నవ్వగలిగే వాడే నిజమైన మనిషి" అని నమ్మే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?! "ఎవరెమంటే ఏం.. దేవునికి, అంతరాత్మకు తప్ప మరొకరికి బదులు చెప్పాల్సిన పని లేదు.. అయినా లోకులు కాకులు వారిని పట్టించుకుంటే జీవితంలో ముందడుగు వేయడం కష్టం" అనుకునే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?? "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని అనిపించిన ప్రతి సారి "నాకే ఎందుకు జరగకూడదు? మరెవరికో ఎందుకు జరగాలి? నేను దీన్ని ఎదుర్కోగలను కనుకనే నాకే జరుగుతోంది" అని సమర్ధించుకునే నేనేనా ఇలా నిస్సహాయంగా నిరీక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాను?! ఆశ్చర్యంగానే ఉంది. కాని నిజమే.. నేనే ఇలా ఆలోచిస్తున్నాను!

నేను ఎంతో అభిమానించే ఆవిడ "ప్రేమగా" అన్న మాటలకు ఒక్కసారిగా నా మనస్సు ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎప్పటిలాగానే గుండెనిండా గాయాలు, అగాధంలాటి ఒంటరితనం. బేలగా  నా వైపు చూస్తే, పెదవులు
నవ్వుతున్నా కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి. దాంతో అది వణికిపోతోంది. ఇప్పుడు నేనెలా దాన్ని సముదాయించనూ? ఎంతో కష్టపడి చందమామ కథలు చెప్పి, లేని పోని ఊహలు పుట్టించి, జరగని వాటిని జరుగుతాయి చూడు అని నమ్మబలికి, తనకోసం కృత్రిమ ప్రశాంతతను సృష్టించి జోల పాడితే.. అవన్నీ నిజమని నమ్మి అమాయకంగా ఆనందపడే నా మనసుని చూసి మురుసుకున్నాను. కాని ఇప్పుడు మళ్ళీ తను వాస్తవాన్ని గ్రహించి వణికిపోతుంటే నేనేమని ధైర్యం చెప్పను? "నువ్వు ఉత్తినే బాధపడకు. ఇప్పుడేమైందని? ఛీ ఛీ ఇలాటి చిన్న విషయాల కోసం ఏడుస్తావా నువ్వూ..? హవ్వ!"  అంటూ దగ్గరికెళితే "మళ్ళీ మాయమాటలు చెప్పకు"  పొమ్మంటూ దూరంగా తోసేసింది.   

నా బుగ్గల మీద కారుతున్న కన్నీటి చారలను చెరపడానికి చిరుగాలి చేసే చిరు ప్రయత్నాలు  విఫలమవుతున్నాయి. ఎప్పుడూ దగ్గరకు తీసుకునే మనసు కూడా పొమ్మంది. ఏం చేయను? ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే నా జీవితంలో అన్నీ ముళ్ళ చెట్లే.. ఒక్క పూలమొక్క అయినా లేదు. అయినప్పటికీ ఆ ముళ్ళ చెట్ల మధ్య ఉండే గడ్డిపూలను తలుచుకొని సంబరపడబోయాను కాని ఆ జ్జ్ఞాపకాల దారిలో ఉండే రాకాసి ముళ్ళు గుచ్చుకోవడంతో ఇదిగో ఇలా నిస్సహాయంగా కూర్చున్నాను. 

"రక్తసంబంధం ఉంటేనే ప్రేమా? లేకపోతే? మరి నా రక్తసంబంధికులు మాత్రం నన్నెందుకిలా ఒంటరితనానికి బందీని చేసారు? అవును. నేను అనాధనే.. అందరు ఉన్న అనాధను. ఇంతకూ అనాధ అంటే ఏవిటి? ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఎందుకు నాకీ క్షోభ? ఎన్నాళ్ళని వినాలి ఆ మాట?" అని మనసు మూగగా రోదిస్తుంటే నేనెలా ఆపనూ? నా రక్తసంబంధికులు అదే అంటారు.. బయటి వాళ్ళూ అదే అంటారు! ఎలా అయ్యాను నేను అనాధను? ఎందుకయ్యాను? గుడ్డిగా అభిమానించి నా వాళ్ళూ, నా వాళ్ళూ అని వెంపర్లాడుతూ ప్రేమ చూయించినందుకూ, అదే సన్నిహిత్యంతో వారిముందు నేను నేనుగా ఉన్నందుకు వారు నాకిచ్చిన బిరుదు "తింగరి, అనాధ, పిచ్చిమాలోకం". "నువ్వు దిక్కులేని దానివి.. ..... ... .. ... " అంటున్నపుడు  కనురెప్పల చాటున చివ్వున ఉబికిన కన్నీటినీ, ఉక్కిరిబిక్కిరయి మనసు పడ్డ వేదననూ పంటి బిగువున దాచిపెట్టి చిరునవ్వు నవ్వితే దాని అర్ధం నేను తింగరిననా? ఏమన్నా పట్టించుకోను.. తేలిగ్గా తీసుకోగలననా?!!! 
 
అయ్యో.. నాకు ఇంకాస్త శక్తి ఉంటే బాగుణ్ణు. నా మనసులోని మౌన రాగాన్ని విని మాట్లాడలేక మూగాబోవడం కాకుండా తనను ఊరడించగలిగితే బాగుణ్ణు.  అయినా మనసా..! నీ మౌనరాగాన్ని నే వింటున్నాలే..  నా నిస్సహాయతను మన్నించి మదనపడక ముందుకి సాగిపో.. !
      
8 comments:

 1. మనసులోని భావాన్ని బాగారాసారు...అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు కృతజ్ఞతలు, Padmarpita గారు!

   Delete
 2. Koodali.org lo just ala browse chestu unte mee blog kanipinchindi..chala baaga raasaru..

  ReplyDelete
  Replies
  1. Chaala thanks Srinivasarao gaaru :)

   Delete
 3. ఛీ ఛీ.. ఏవిటి ఇలా ఆలోచిస్తున్నాను? "విషం చిమ్మే విషాదంలోనూ నవ్వగలిగే వాడే నిజమైన మనిషి" అని నమ్మే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?! "ఎవరెమంటే ఏం.. దేవునికి, అంతరాత్మకు తప్ప మరొకరికి బదులు చెప్పాల్సిన పని లేదు.. అయినా లోకులు కాకులు వారిని పట్టించుకుంటే జీవితంలో ముందడుగు వేయడం కష్టం" అనుకునే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?? "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని అనిపించిన ప్రతి సారి "నాకే ఎందుకు జరగకూడదు? మరెవరికో ఎందుకు జరగాలి? నేను దీన్ని ఎదుర్కోగలను కనుకనే నాకే జరుగుతోంది" అని సమర్ధించుకునే నేనేనా ఇలా నిస్సహాయంగా నిరీక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాను?!

  Best lines, every time I remind in hard times as it is.....chala chala bagundi, konchem badha ga kooda

  ReplyDelete
  Replies
  1. Thanks Naresh gaaru. Its part of life andi. Anni rakaala bhaavalu kalisthene kadaa jeevithaaniki andam :)

   Delete
  2. అర్థమైంది..కానీ చాలా బాధగా అనిపించింది.