Friday, October 12, 2012

గోరింట జ్ఞాపకం

రోజూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్ రిపేర్ చేస్తుండడంతో వేరే దారిలో వెళుతున్నాను ఒక వారం, పది రోజులగా. ఓ ఇంటి పెరట్లో పేద్ద గోరింటాకు చెట్టు చూసాను. ఎప్పుడో ఫిబ్రవరిలో మా అక్క పెళ్ళికి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పటివరకు ఖాళీ చేతులే. కోన్ పెట్టుకోవడం కంటే వట్టి చేతులతో ఉండడం నయం అనుకొని విరక్తిగా జీవితం గడుపుతున్న సమయంలో ఎర్రటి రంగుతో  నా అరచేతులను, కాళ్ళను నింపి అల్లుకుపోవడానికి సిద్ధమన్నట్లున్న గోరింటాకు చెట్టుని చూడగానే మనసు పారేసుకున్నాను. ఎవరైనా ఉంటారేమో అడిగి కోసుకుందాం కదా అనుకుంటే.. ఎక్కడా ఎవరూ కనబడరే! కొన్ని రోజులు చూసి చూసి ఇక ఆగలేక శుభ ముహూర్తం
చూసుకొని పర్మిషన్ లేకుండానే కోసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఎప్పుడూ రోడ్ మీద ఎవరో ఒకరు తచ్చాడుతునే ఉన్నారు. ఎప్పటిమాములుగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆఫీసుకి వెళుతూ,
ఈ రోజైనా ఎవ్వరు లేకపోతే బాగుణ్ణు అనిపించినా మన అదృష్టం ఎంత స్ట్రాంగో తెలుసును కనుక "ఆ..ఇప్పుడు కూడా ఎవరోకరు తిరుగుతూనే ఉండుంటారులే" అనుకుంటూనే ఆశగా చూసాను. ఆశ్చర్యం! అక్కడ ఎవ్వరూ లేరు! రెగులర్ గా వాకింగ్ కి వెళ్ళేవాళ్ళు కూడా కనబడలేదు. కళ్ళు పెద్దవి చేసుకొని దిక్కులు చూస్తుంటే గోరింటాకు చెట్టు అక్కినేని నాగేశ్వరావు గారి స్టైల్లో "కమాన్.. డోంట్ వేస్ట్ ది టైం" అన్నట్లు వినిపించింది. రోడ్ కీ, ఆ ఇంటి పెరడుకి మధ్యలో ఒక ఖాళీ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఖర్మ కాలి ఆరోజు చీర కట్టుకొని ఉన్నాను. కష్టమేమో అనిపించింది కాని మనసుని కన్విన్స్ చేయలేక నా బండిని రోడ్ మీదే కాస్త పక్కగా ఆపి, చీర కుచ్చిళ్ళు చేత్తో పట్టుకుంటూ జడ వెనక్కు వేసుకొని అటు ఇటూ చూస్తూ లోపలికి నడిచాను.  రోడ్ మీద నుండి చూడడానికి ఆ పిచ్చి మొక్కలు చిన్నగానే కనిపించాయి కాని నడుస్తుంటే తెలిసింది బాగా గుబురుగా ఉన్నాయని. ఇలా సుతారంగా నడిస్తే నేను గోరింటాకు కోసుకొనే లోపు రోజు గడిచిపోతుందనిపించి లాభం లేదని కొంగు, కుచ్చిళ్ళూ కలిపి చీరలో దోపుకొని గబగబా కంచు మొక్కలను తప్పించుకుంటూ.. చీరకు పట్టిన ముళ్ళు తీసుకుంటూ ఎలాగో చెట్టుదగ్గరకు చేరుకున్నాను. "పాపం నేను! గోరింటాకు కోసం ఎన్ని తిప్పలు పడ్డానో" అని నా మీద నేనే జాలిపడి వెనుదిరిగి చూసాను. అక్కడున్న పిచ్చి మొక్కలు, చెత్తకుప్పా అవీ దాటుకుంటూ రాగలిగినందుకు పొంగిపోయి, గోరింటాకు చెట్టుని చూసి పరవశించిపోతూ ప్రేమగా తడిమి ఒక్క రెబ్బ కోసానంతే. "ఏయ్య్.. యారదు? అంగె  ఎన్న పన్రే  (ఏయ్ ఎవరది? అక్కడేం చేస్తున్నావ్?)" అని పేద్ద పొలికేక వినిపించింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూస్తే ఒక ముసలాయన
కర్ర చేత్తో పట్టుకొని మరీ నిలబడి ఉన్నారు. ఆ ఉదయం ఎంతో చల్లగా ఉన్నా కూడా చెమటలు పోసేసాయి నాకు.
"ఒన్నూ ఇల్ల తాతా..  ఇరుంగ నా వరే (ఏమి లేదు తాతా.. ఉండండి నేను వస్తున్నా)" అంటూ ఎంత వేగంగా లోపలికి వెళ్ళానో అంతే వేగంతో రోడ్ మీదకు  వచ్చేసాను. ఆయన ఉన్న వైపు అడుగులు వేస్తూనే చెప్పాను. గోరింటాకు కోసమని వెళ్లానని, అడుగుదామని చూసినా ఎవ్వరూ కనబడకపోయే సరికి నేనే కోయబోయానని. ఆయన ఏమి మాట్లాడకుండా కర్రతో కొట్టడానికి వస్తున్న పోజ్ లో నా వైపు పరిగెట్టేసరికి ఏం జరుగుతుందో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా "అయ్యో.. తాతా ఎదో తెరియామె పణ్ణిటేన్ మన్నిచుడుంగో (అయ్యో తాతా ఏదో తెలియక చేసాను క్షమించండి)" అంటూ నా బండి దగ్గరకు పరిగెట్టేసాను. ఆ కంగారులో ఆయన ఏం చేస్తున్నారో.. ఏమవుతోందో చూడకుండానే బండి స్టార్ట్ చేసి స్పీడ్ గా ముందుకి వెళ్ళిపోయాను. 

"ఛీ ఛీ! అంతా నీ వల్లే. ఏ ఇప్పుడు గోరింటాకు లేకపోతే ఏమైపోతుంది? ఇంకా నయం అక్కడ ఎవ్వరూ లేరు కనుక సరిపోయింది. ఉంటే ఎంత పరువు నష్టం? పైగా ఆగి ఆయనతో మాట్లాడి రాకుండా పరిగెట్టుకోచ్చేసావ్!" అని నానా విధాలుగా తిట్టుకుంటునే "నేనేం బంగారమా తీసుకెళ్ళబోయాను? అస్సలు ఏం చెప్తున్నానో కూడా వినకుండా మనవరాలి వయసున్న పిల్లను అలా కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చేస్తాడా? ఆ తాతయ్యకు అసలు మనసే లేదు. సో నేను చెప్పకుండా రావడంలో తప్పు లేదు" అని సమర్దించుకున్నాను. ఈ సంఘటన పుణ్యమా అని గోరింటాకుతో నా పరిచయం గురించి మీతో చెప్పుకోవాలని ఆశ కలిగింది.

నా చిన్నపుడొక సారి, ఆంధ్రలో ఉన్న మా మేనత్తా వాళ్ళింటికి నన్ను తీసుకొనివెళ్ళింది అమ్మ. దసరానో దీపావళో మరి గుర్తులేదు. ఇంకా రావలసిన వాళ్ళందరూ రాలేదు. కాని ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నేనూ.. మా విజ్జత్త కూతురు రిషి, మౌని కలిసి ఆడుకుంటుంటే విజ్జత్త వచ్చి మౌని తో "అచ్యుతాంబ గారు గోరింటాకు నూరిస్తానన్నారు వెళ్లి ఈ గిన్నెలో పట్రామ్మ. ఇదిగో చేత్తో ముట్టుకోకు ఈ స్పూన్ తో తియ్యి రోట్లో నుండి. చెయ్యి పండిపోతే ఇంకేం పెట్టుకోలేవు" అంది. దానికి మౌని "ఏ.. ఎప్పుడూ నాకే చెప్తావ్. చెల్లిని వెళ్ళమనొచ్చుగా.. నేను వెళ్ళను" అని మారం చేసింది. తప్పక "రిషి తల్లులు.. నువ్వు బంగారం కదమ్మా మాట వింటావు. వెళ్లి పట్రామ్మ.. నీకే మంచి డిజైన్ పెడుతుంది కమలత్త" విజ్జత్త అన్న మాటలకు మా అమ్మ కూడా వంత పాడుతూ "అవును రిషి మంచి పిల్ల. దానికే మంచి డిజైన్ పెడతాను. ఎక్కువ పాయసం పెడతాను" అంది. అదేమో మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. "ఇదిగో ప్రియాక్కని తోడు తీసుకెళ్ళు. త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయండి. వచ్చేదారిలో పప్పలు కొనుక్కోండి" అంటూ మౌని చూడకుండా ఇద్దరి చేతుల్లోను చెరొక రూపాయి పెట్టి గిన్నె, స్పూనూ ఇచ్చింది. మేము జోలీ జోలీ గా బుజాల మీద చేతులేసుకొని బయటకు వెళ్ళాం. పక్క వీధిలో ఉందట ఇల్లు. కాని నాలుగడుగులు వేయగానే "ఐస్ ఐస్.. సేమ్య ఐస్.. పాలయిస్.. ద్రాక్షా ఐస్" అని వినిపించింది. "ఐసూ.. ఆగండి వస్తున్నాం" అనరిచింది రిషి. "సరే అయితే.. నాకు ఇల్లు  తెలీదుగా నువ్వెళ్ళి గోరింటాకు పట్రా
నేను వెళ్లి మనిద్దరికీ ఐస్ కొనుక్కొస్తా" అన్నాను. "అస్కు బస్కు ఏమ్మా ఎప్పట్లగా నాది కూడా తినేద్దామనా? కుదరదు. అదిగో ఆ చివ్వరిల్లె. వెళ్లి నువ్వే గోరింటాకు పట్రా నేనే ఐస్ కొనుక్కొస్తా" అంది. అవును అప్పటికే చాలాసార్లు కబుర్లు చెప్పి దాని ఐస్ క్రీంలు తినేసాను. అవంటే నాకు అంత పిచ్చి మరి. నేను కుదరదు నువ్వే పట్రా.. నేనే కొంటానని గొడవచేస్తే "అసలేమి వద్దు. పద వెళ్లి పోదాం" అనేసింది. అది నా వల్ల  కాదుగా.. కాళ్ళీడ్చుకుంటూ గోరింటాకు కోసం వెళుతూవెనకెనక్కి చూసుకుంటూ
అచ్యుతాంబ గారింటి వైపు నడిచాను. కాస్త ముందుకి వెళ్ళగానే బోల్డంత గోరింటాకు రోడ్ మీద పడిపోయి కనబడింది! "అమ్మో.. ఎలగ పారేసుకున్నారో!" నని ఆశ్చర్యపడిపోతూ "పోగొట్టుకున్నవాళ్ళు మళ్ళీ వచ్చేలోపే గిన్నెలో
వేసేసుకొని తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే ఇప్పుడు అంత దూరం ఎవరు నడుస్తారు" అని కంగారు కంగారుగా
స్పూన్తో గిన్నెలో వేసుకుంటుంటే  కంపుకొట్టింది. "ఛీ ఛీ చెన్నైలోనే బాగుంటుంది గోరింటాకు. ఇక్కడేదో కంపొస్తోంది" అని ముఖం చిట్లించుకునే రిషిదెక్కడ నా ఐస్ తినేస్తుందో నని గబగబా గిన్నెలో వేసేసుకొని పరిగెట్టాను. బుద్దిగా బండ మీద కూర్చొని ఐస్ తింటోంది. మరొక చేతిలో నాది భద్రంగా పెట్టుకుంది తినకుండా! వెళ్లి నాది నేను తీసుకొని గిన్నె దాని చేతికిచ్చి "ఇంటికి వెళదాం నడు" అన్నాను. ఇంటికి వచ్చాక గోరింటాకు గిన్నెని టేబుల్ మీద పెట్టి విజ్జత్తకు చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాం. "ఏదో కంపుకొడుతోంది ఇల్లంతా" అని వెతుక్కుంటే నా చెప్పుల నుండి వస్తుందని గ్రహించి వాటిని కడిగే పనిలో పడింది అత్త. ఈ లోపు మిగతా వాళ్ళు రావడం కబుర్లు చెప్పుకొని గోరింటాకు పెట్టుకోవడానికి నేను ముందంటే నేను ముందని గొడవలు పడి మరీ  పెట్టుకోవడం.. జరుగుతోంది. పెట్టుకుంటున్నపుడు "ఏదో కంపు కొడుతోంది కదా పిన్ని" అన్నదానికి జవాబుగా "ప్రియా పేడ తొక్కొచ్చిందమ్మా. బయట అంట్లున్నాయని ఆ చెప్పులు బాత్రూంలోనే కడిగేసాను. ఆ స్మెల్లే ఇల్లంతా స్ప్రెడ్ అయినట్లుంది" అంది విజ్జత్త.

కాసేపటికి "అయ్యో.. ఇంకా ఇద్దరు ముగ్గురున్నారే పెట్టుకోవలసిన వాళ్ళూ.. గోరింటాకంతా అయిపొయింది. ఇప్పుడెలా" అనడం విని అక్కడే ఆడుకుంటున్న నేను "ఇంకక్కడ బోల్డంతుందిగా.. నేనెళ్లి పట్రానా..? రూపాయిస్తేనే మరి?" అన్నాను. "బోలెడంత ఎక్కడుందే..? ఎంత రుబ్బిందావిడ?" అంది. "ఆవిడ కాదు. రోడ్ మీద. పాపం ఎవరో పారేసుకున్నారు. ఇంకా అక్కడ బోల్డుంది" అన్నాను. వాళ్లకు అనుమానమొచ్చి చేతులు వాసన చూసుకుంటే "పేడ"!!!! ఎన్ని గొడవలేసుకొని పెట్టుకున్నారో అన్నే గొడవలతో పోటీ పడుతూ కడుక్కున్నారు.
పెట్టుకోని వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు (అందులో మేము కూడా ఉన్నాం. ఎక్కడ చేరిపేసుకుంటామోనని రాత్రికి పెట్టొచ్చులే అనుకున్నారట). అప్పుడింక అందరూ మా అమ్మ మీద పడ్డారు!
అమ్మ నన్ను తిట్టలేదు.. నవ్వుతూ "పాపం దానికి పేడంటే ఏం తెలుసే? కోన్ లో ఉన్నట్లుగా ఉండేసరికి గోరింటాకే అనుకొనుండుంటుంది. అయినా మీకు తెలుసుగా? పెట్టుకునేడపుడు మీకే తెలియలేదు!?  చిన్నది.. దానికేం తెలుసే? పోనీయండి. " అని వెనకేసుకొచ్చింది!

ఫస్ట్ చిరాగ్గా ఫీల్ అయి నసిగినా.. కాసేపటి తర్వాత అందరూ నవ్వేసారు. ఇప్పటికీ గోరింటాకు కోసి పంపమని అడిగితే
"మనుషులు పెట్టుకునేదా? నీ స్పెషల్ గోరింటాకా?" అని ఏడిపిస్తుంటారు :)

35 comments:

Chinni said...

ప్రియా.. చాలా బాగా వ్రాసావు.

Priya said...

D :D
అన్న మాట నిలబెట్టుకున్నావుగా చిన్నీ!:)

Chinni said...

:D:D..ప్రియా..మీ స్పెషల్ గోరింటాకు అదిరింది..Nice:D

Sravya Vattikuti said...

వామ్మో ఏంటండీ ఇది నిజమా ????????

Priya said...

మరీను.. :P

Priya said...

అవునండీ!

రాధిక(నాని ) said...

బాగున్నాయండి మీ గోరింటాకు జ్ఞాపకాలు.

Yohanth said...

:)Ha ha

Padmarpita said...

"పాపం దానికి పేడంటే ఏం తెలుసే?"ఎంత అమాయకులో:-)

thanooj said...

priya garru evariki cheppanani promise chesthay nenu meeko secret chepthanu .emandee gorintaaku gurinchi ea ammayina raasthundhi meeru 21 va shathabdhapu yuvathila alochinchi guns meeda gaani landmines meeda gaani granades meeda gaani raayandi meeku popularity rakapothey nannu adagandee.

పరిమళం said...

yaaakkkk :) :)

Priya said...

hahhahaha... :)

Priya said...

అవునండీ నిజమే.. :)
చెన్నైలో అప్పటికి ఎప్పుడూ చూడలేదు. సో ఆ రోడ్ మీద పడి ఉన్నది గోరింటాకే అనేసుకున్నాను! పైగా ఆంధ్రాలో గోరింటాకు బావుండదు చెన్న్నైయే అన్నివిధాలా బెస్టు అని మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను (అప్పుడు) కూడాను :P

Priya said...

Nijamenandee..! Thappakundaa popularity vasthundi police department punyamaani! Asalevitandi meeru? Andari chethaa naaku cheppu debbalu cheevatlu pettisthe kaani vadilelaa leru..?! Gamanisthunnaanu gamanisthunnaanu.. meeru parichayamainappati gamanisthunaanu.. :D

Priya said...

:)

Priya said...

కృతజ్ఞతలు రాధిక గారు!

Anonymous said...

:D navvaapukolekapoyanandi. Meru raase posts chaduvtunnapudu edo chaduvtunnattu kaakunda choostunna feeling vastundandi. Alage prati postlonu me manasu kanipistundi. Actually naku blogger account ledu anduke ninna rasina postni inta latega chaduvtunna. Me blogni follow avatanikaina account create chesukovali

Harsha

Priya said...

Mee abhimaanaaniki thanks Harsha gaaru :)

sndp said...

baga rasatunaru andi...
keep it up..

Priya said...

:) Thanks Sandeep gaaru..

ప్రేరణ... said...

parvaledulendi peda kudaa anti bacterial kada, nice humorous:)

Priya said...

:) Thanks andee!

yahoo said...

big story

Priya said...

Hmm.. what to do..

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... అసలు..
పాపం కదండీ.. ;) ః) ః)
హహహ...

నాకు ఒకటు గుర్తు వస్తుందండి. చిన్నప్పుడు నానమ్మ వాళ్లింట్లో అమ్మ ఇలాగే గోరింటాకు కోసి పట్రమ్మంది. గుట్టలు గుట్టలు కోసేశాను. నేనే నూరతాను నా చేతిలో నా పేరు గోరింటాకు తో రాయాలి అని డీల్.
ఎనకా ముందూ చూసుకోకుండా నూరేశాను. చివరాఖరున చూసుకుంటే, అప్పటికే నా రెండు చేతులూ ఇంచ్ కూడా గ్యాప్ లేకుమ్డా ఎర్రగా పండిపోయాయి ;( ;( ;(
అమ్మ ఒకటే నవ్వు.. ;) ;)

నైస్ పోస్ట్ అండీ

Priya said...

థాంక్ యూ రాజ్ గారు :)
మీ చిన్ననాటి సంగతి చాలా తియ్యగా ఉంది వినడానికి. అయినా అప్పుడు గోరింటాకు పెట్టుకోలేకపోయానని బాధపడకండీ.. కావాలంటే ఇప్పుడు నేను కొరియర్ చేస్తాను పెట్టుకొని ఆఫీస్ లో అందరికీ చూయించి మురిసిపొండి ;) ;) (కోపగించుకోరుగా..? సరదాకే అన్నాను)

లక్ష్మీ నరేష్ said...

priya garu, padi padi navvuthunnanu..roddu meeda undi anagane veligindi.....pettukunnaka, adi peda ani teleegane valla mukhaalu choodaali, maa intlo aithe veepu vimanam motha mogi poyedi....

bhale raasaaru..

Priya said...

హహాహ్హ.. థాంక్స్ అండీ :)
నాక్కూడా మ్రోగేదే.. ఏదో మా అమ్మ పుణ్యమాని తప్పించుకున్నాను కాని ఇప్పటికీ కళ్ళతో వాళ్ళప్పుడు నూరిన కారాలు మిరియాలు జ్ఞాపకమే :D

ధాత్రి said...

బాగున్నాయండి..మీ గోరింటాకు ముచ్చట్లు..:)
పెద్ద సాహసమే చేసారన్నమాట..:)
నాకు కూడా ఆకు గోరింటాకే బాగా ఇష్టం..

Priya said...

ఏమాటకామాటే చెప్పుకోవాలి ధాత్రి గారు.. ఆకు గోరింటాకు ముందు ఈ కోనూ గీను ఎందుకూ పనికిరావు కదా.. :)

ధాత్రి said...

అవునండీ..నిజమే మరి..:))

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

nice chala bagundi

Priya said...

Thanks andi :)

Anvesh G said...

మీ "నా ప్రేమాయణ౦" బాగు౦దని నా ఫ్రె౦డ్ చెప్తే, చదవడ౦ మొదలు పెట్టి మీ బ్లాగ్ అ౦తా సైలె౦ట్ గా (ఒక పక్క "ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)" అ౦టూ వెనక పడుతున్నా సరే) విహరిస్తూ అన్ని పోస్ట్ లు చదువుతున్నా. ః) కానీ మీ "గొరి౦త జ్ణాపక౦" చదివాక నవ్వాపుకోలేక కామె౦ట్ పెడుతున్నా... మీ రచనీ శైలి నిజ౦గా అద్బుత౦. చదువుతూ ఉ౦టే భలే హాయిగా ఉ౦ది.

"బోల్డ౦త గోరి౦తాకు రోడ్ మీద........... అమ్మో ఎలాగ పారేసుకున్నారో" నిజ౦గా నవ్వలేక చచ్చా అనుకో౦డి......!!! ః) ః) భలే ఉ౦ది మీ "గొరి౦త జ్ణాపక౦"... :P

Priya said...

నా బ్లాగింటికి స్వాగతం అన్వేష్ గారు!
నా ప్రేమాయణాన్ని మీకు రికమండ్ చేసిన మీ ఫ్రెండ్ కి, నా బ్లాగ్ బావుందని మెచ్చినందుకు మీకూ హృదయపూర్వక కృతజ్ఞతలు.

వెంటపడినా కామెంట్ రాయని మీ చేత కామెంట్ చేయించిందంటూ, నా "గోరింట జ్ఞాపకం" ని మరోసారి చదువుకునేలా చేశారు. అందుక్కూడా థాంక్స్ :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, October 12, 2012

గోరింట జ్ఞాపకం

రోజూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్ రిపేర్ చేస్తుండడంతో వేరే దారిలో వెళుతున్నాను ఒక వారం, పది రోజులగా. ఓ ఇంటి పెరట్లో పేద్ద గోరింటాకు చెట్టు చూసాను. ఎప్పుడో ఫిబ్రవరిలో మా అక్క పెళ్ళికి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పటివరకు ఖాళీ చేతులే. కోన్ పెట్టుకోవడం కంటే వట్టి చేతులతో ఉండడం నయం అనుకొని విరక్తిగా జీవితం గడుపుతున్న సమయంలో ఎర్రటి రంగుతో  నా అరచేతులను, కాళ్ళను నింపి అల్లుకుపోవడానికి సిద్ధమన్నట్లున్న గోరింటాకు చెట్టుని చూడగానే మనసు పారేసుకున్నాను. ఎవరైనా ఉంటారేమో అడిగి కోసుకుందాం కదా అనుకుంటే.. ఎక్కడా ఎవరూ కనబడరే! కొన్ని రోజులు చూసి చూసి ఇక ఆగలేక శుభ ముహూర్తం
చూసుకొని పర్మిషన్ లేకుండానే కోసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఎప్పుడూ రోడ్ మీద ఎవరో ఒకరు తచ్చాడుతునే ఉన్నారు. ఎప్పటిమాములుగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆఫీసుకి వెళుతూ,
ఈ రోజైనా ఎవ్వరు లేకపోతే బాగుణ్ణు అనిపించినా మన అదృష్టం ఎంత స్ట్రాంగో తెలుసును కనుక "ఆ..ఇప్పుడు కూడా ఎవరోకరు తిరుగుతూనే ఉండుంటారులే" అనుకుంటూనే ఆశగా చూసాను. ఆశ్చర్యం! అక్కడ ఎవ్వరూ లేరు! రెగులర్ గా వాకింగ్ కి వెళ్ళేవాళ్ళు కూడా కనబడలేదు. కళ్ళు పెద్దవి చేసుకొని దిక్కులు చూస్తుంటే గోరింటాకు చెట్టు అక్కినేని నాగేశ్వరావు గారి స్టైల్లో "కమాన్.. డోంట్ వేస్ట్ ది టైం" అన్నట్లు వినిపించింది. రోడ్ కీ, ఆ ఇంటి పెరడుకి మధ్యలో ఒక ఖాళీ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఖర్మ కాలి ఆరోజు చీర కట్టుకొని ఉన్నాను. కష్టమేమో అనిపించింది కాని మనసుని కన్విన్స్ చేయలేక నా బండిని రోడ్ మీదే కాస్త పక్కగా ఆపి, చీర కుచ్చిళ్ళు చేత్తో పట్టుకుంటూ జడ వెనక్కు వేసుకొని అటు ఇటూ చూస్తూ లోపలికి నడిచాను.  రోడ్ మీద నుండి చూడడానికి ఆ పిచ్చి మొక్కలు చిన్నగానే కనిపించాయి కాని నడుస్తుంటే తెలిసింది బాగా గుబురుగా ఉన్నాయని. ఇలా సుతారంగా నడిస్తే నేను గోరింటాకు కోసుకొనే లోపు రోజు గడిచిపోతుందనిపించి లాభం లేదని కొంగు, కుచ్చిళ్ళూ కలిపి చీరలో దోపుకొని గబగబా కంచు మొక్కలను తప్పించుకుంటూ.. చీరకు పట్టిన ముళ్ళు తీసుకుంటూ ఎలాగో చెట్టుదగ్గరకు చేరుకున్నాను. "పాపం నేను! గోరింటాకు కోసం ఎన్ని తిప్పలు పడ్డానో" అని నా మీద నేనే జాలిపడి వెనుదిరిగి చూసాను. అక్కడున్న పిచ్చి మొక్కలు, చెత్తకుప్పా అవీ దాటుకుంటూ రాగలిగినందుకు పొంగిపోయి, గోరింటాకు చెట్టుని చూసి పరవశించిపోతూ ప్రేమగా తడిమి ఒక్క రెబ్బ కోసానంతే. "ఏయ్య్.. యారదు? అంగె  ఎన్న పన్రే  (ఏయ్ ఎవరది? అక్కడేం చేస్తున్నావ్?)" అని పేద్ద పొలికేక వినిపించింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూస్తే ఒక ముసలాయన
కర్ర చేత్తో పట్టుకొని మరీ నిలబడి ఉన్నారు. ఆ ఉదయం ఎంతో చల్లగా ఉన్నా కూడా చెమటలు పోసేసాయి నాకు.
"ఒన్నూ ఇల్ల తాతా..  ఇరుంగ నా వరే (ఏమి లేదు తాతా.. ఉండండి నేను వస్తున్నా)" అంటూ ఎంత వేగంగా లోపలికి వెళ్ళానో అంతే వేగంతో రోడ్ మీదకు  వచ్చేసాను. ఆయన ఉన్న వైపు అడుగులు వేస్తూనే చెప్పాను. గోరింటాకు కోసమని వెళ్లానని, అడుగుదామని చూసినా ఎవ్వరూ కనబడకపోయే సరికి నేనే కోయబోయానని. ఆయన ఏమి మాట్లాడకుండా కర్రతో కొట్టడానికి వస్తున్న పోజ్ లో నా వైపు పరిగెట్టేసరికి ఏం జరుగుతుందో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా "అయ్యో.. తాతా ఎదో తెరియామె పణ్ణిటేన్ మన్నిచుడుంగో (అయ్యో తాతా ఏదో తెలియక చేసాను క్షమించండి)" అంటూ నా బండి దగ్గరకు పరిగెట్టేసాను. ఆ కంగారులో ఆయన ఏం చేస్తున్నారో.. ఏమవుతోందో చూడకుండానే బండి స్టార్ట్ చేసి స్పీడ్ గా ముందుకి వెళ్ళిపోయాను. 

"ఛీ ఛీ! అంతా నీ వల్లే. ఏ ఇప్పుడు గోరింటాకు లేకపోతే ఏమైపోతుంది? ఇంకా నయం అక్కడ ఎవ్వరూ లేరు కనుక సరిపోయింది. ఉంటే ఎంత పరువు నష్టం? పైగా ఆగి ఆయనతో మాట్లాడి రాకుండా పరిగెట్టుకోచ్చేసావ్!" అని నానా విధాలుగా తిట్టుకుంటునే "నేనేం బంగారమా తీసుకెళ్ళబోయాను? అస్సలు ఏం చెప్తున్నానో కూడా వినకుండా మనవరాలి వయసున్న పిల్లను అలా కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చేస్తాడా? ఆ తాతయ్యకు అసలు మనసే లేదు. సో నేను చెప్పకుండా రావడంలో తప్పు లేదు" అని సమర్దించుకున్నాను. ఈ సంఘటన పుణ్యమా అని గోరింటాకుతో నా పరిచయం గురించి మీతో చెప్పుకోవాలని ఆశ కలిగింది.

నా చిన్నపుడొక సారి, ఆంధ్రలో ఉన్న మా మేనత్తా వాళ్ళింటికి నన్ను తీసుకొనివెళ్ళింది అమ్మ. దసరానో దీపావళో మరి గుర్తులేదు. ఇంకా రావలసిన వాళ్ళందరూ రాలేదు. కాని ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నేనూ.. మా విజ్జత్త కూతురు రిషి, మౌని కలిసి ఆడుకుంటుంటే విజ్జత్త వచ్చి మౌని తో "అచ్యుతాంబ గారు గోరింటాకు నూరిస్తానన్నారు వెళ్లి ఈ గిన్నెలో పట్రామ్మ. ఇదిగో చేత్తో ముట్టుకోకు ఈ స్పూన్ తో తియ్యి రోట్లో నుండి. చెయ్యి పండిపోతే ఇంకేం పెట్టుకోలేవు" అంది. దానికి మౌని "ఏ.. ఎప్పుడూ నాకే చెప్తావ్. చెల్లిని వెళ్ళమనొచ్చుగా.. నేను వెళ్ళను" అని మారం చేసింది. తప్పక "రిషి తల్లులు.. నువ్వు బంగారం కదమ్మా మాట వింటావు. వెళ్లి పట్రామ్మ.. నీకే మంచి డిజైన్ పెడుతుంది కమలత్త" విజ్జత్త అన్న మాటలకు మా అమ్మ కూడా వంత పాడుతూ "అవును రిషి మంచి పిల్ల. దానికే మంచి డిజైన్ పెడతాను. ఎక్కువ పాయసం పెడతాను" అంది. అదేమో మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. "ఇదిగో ప్రియాక్కని తోడు తీసుకెళ్ళు. త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయండి. వచ్చేదారిలో పప్పలు కొనుక్కోండి" అంటూ మౌని చూడకుండా ఇద్దరి చేతుల్లోను చెరొక రూపాయి పెట్టి గిన్నె, స్పూనూ ఇచ్చింది. మేము జోలీ జోలీ గా బుజాల మీద చేతులేసుకొని బయటకు వెళ్ళాం. పక్క వీధిలో ఉందట ఇల్లు. కాని నాలుగడుగులు వేయగానే "ఐస్ ఐస్.. సేమ్య ఐస్.. పాలయిస్.. ద్రాక్షా ఐస్" అని వినిపించింది. "ఐసూ.. ఆగండి వస్తున్నాం" అనరిచింది రిషి. "సరే అయితే.. నాకు ఇల్లు  తెలీదుగా నువ్వెళ్ళి గోరింటాకు పట్రా
నేను వెళ్లి మనిద్దరికీ ఐస్ కొనుక్కొస్తా" అన్నాను. "అస్కు బస్కు ఏమ్మా ఎప్పట్లగా నాది కూడా తినేద్దామనా? కుదరదు. అదిగో ఆ చివ్వరిల్లె. వెళ్లి నువ్వే గోరింటాకు పట్రా నేనే ఐస్ కొనుక్కొస్తా" అంది. అవును అప్పటికే చాలాసార్లు కబుర్లు చెప్పి దాని ఐస్ క్రీంలు తినేసాను. అవంటే నాకు అంత పిచ్చి మరి. నేను కుదరదు నువ్వే పట్రా.. నేనే కొంటానని గొడవచేస్తే "అసలేమి వద్దు. పద వెళ్లి పోదాం" అనేసింది. అది నా వల్ల  కాదుగా.. కాళ్ళీడ్చుకుంటూ గోరింటాకు కోసం వెళుతూవెనకెనక్కి చూసుకుంటూ
అచ్యుతాంబ గారింటి వైపు నడిచాను. కాస్త ముందుకి వెళ్ళగానే బోల్డంత గోరింటాకు రోడ్ మీద పడిపోయి కనబడింది! "అమ్మో.. ఎలగ పారేసుకున్నారో!" నని ఆశ్చర్యపడిపోతూ "పోగొట్టుకున్నవాళ్ళు మళ్ళీ వచ్చేలోపే గిన్నెలో
వేసేసుకొని తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే ఇప్పుడు అంత దూరం ఎవరు నడుస్తారు" అని కంగారు కంగారుగా
స్పూన్తో గిన్నెలో వేసుకుంటుంటే  కంపుకొట్టింది. "ఛీ ఛీ చెన్నైలోనే బాగుంటుంది గోరింటాకు. ఇక్కడేదో కంపొస్తోంది" అని ముఖం చిట్లించుకునే రిషిదెక్కడ నా ఐస్ తినేస్తుందో నని గబగబా గిన్నెలో వేసేసుకొని పరిగెట్టాను. బుద్దిగా బండ మీద కూర్చొని ఐస్ తింటోంది. మరొక చేతిలో నాది భద్రంగా పెట్టుకుంది తినకుండా! వెళ్లి నాది నేను తీసుకొని గిన్నె దాని చేతికిచ్చి "ఇంటికి వెళదాం నడు" అన్నాను. ఇంటికి వచ్చాక గోరింటాకు గిన్నెని టేబుల్ మీద పెట్టి విజ్జత్తకు చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాం. "ఏదో కంపుకొడుతోంది ఇల్లంతా" అని వెతుక్కుంటే నా చెప్పుల నుండి వస్తుందని గ్రహించి వాటిని కడిగే పనిలో పడింది అత్త. ఈ లోపు మిగతా వాళ్ళు రావడం కబుర్లు చెప్పుకొని గోరింటాకు పెట్టుకోవడానికి నేను ముందంటే నేను ముందని గొడవలు పడి మరీ  పెట్టుకోవడం.. జరుగుతోంది. పెట్టుకుంటున్నపుడు "ఏదో కంపు కొడుతోంది కదా పిన్ని" అన్నదానికి జవాబుగా "ప్రియా పేడ తొక్కొచ్చిందమ్మా. బయట అంట్లున్నాయని ఆ చెప్పులు బాత్రూంలోనే కడిగేసాను. ఆ స్మెల్లే ఇల్లంతా స్ప్రెడ్ అయినట్లుంది" అంది విజ్జత్త.

కాసేపటికి "అయ్యో.. ఇంకా ఇద్దరు ముగ్గురున్నారే పెట్టుకోవలసిన వాళ్ళూ.. గోరింటాకంతా అయిపొయింది. ఇప్పుడెలా" అనడం విని అక్కడే ఆడుకుంటున్న నేను "ఇంకక్కడ బోల్డంతుందిగా.. నేనెళ్లి పట్రానా..? రూపాయిస్తేనే మరి?" అన్నాను. "బోలెడంత ఎక్కడుందే..? ఎంత రుబ్బిందావిడ?" అంది. "ఆవిడ కాదు. రోడ్ మీద. పాపం ఎవరో పారేసుకున్నారు. ఇంకా అక్కడ బోల్డుంది" అన్నాను. వాళ్లకు అనుమానమొచ్చి చేతులు వాసన చూసుకుంటే "పేడ"!!!! ఎన్ని గొడవలేసుకొని పెట్టుకున్నారో అన్నే గొడవలతో పోటీ పడుతూ కడుక్కున్నారు.
పెట్టుకోని వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు (అందులో మేము కూడా ఉన్నాం. ఎక్కడ చేరిపేసుకుంటామోనని రాత్రికి పెట్టొచ్చులే అనుకున్నారట). అప్పుడింక అందరూ మా అమ్మ మీద పడ్డారు!
అమ్మ నన్ను తిట్టలేదు.. నవ్వుతూ "పాపం దానికి పేడంటే ఏం తెలుసే? కోన్ లో ఉన్నట్లుగా ఉండేసరికి గోరింటాకే అనుకొనుండుంటుంది. అయినా మీకు తెలుసుగా? పెట్టుకునేడపుడు మీకే తెలియలేదు!?  చిన్నది.. దానికేం తెలుసే? పోనీయండి. " అని వెనకేసుకొచ్చింది!

ఫస్ట్ చిరాగ్గా ఫీల్ అయి నసిగినా.. కాసేపటి తర్వాత అందరూ నవ్వేసారు. ఇప్పటికీ గోరింటాకు కోసి పంపమని అడిగితే
"మనుషులు పెట్టుకునేదా? నీ స్పెషల్ గోరింటాకా?" అని ఏడిపిస్తుంటారు :)

35 comments:

 1. ప్రియా.. చాలా బాగా వ్రాసావు.

  ReplyDelete
  Replies
  1. D :D
   అన్న మాట నిలబెట్టుకున్నావుగా చిన్నీ!:)

   Delete
 2. :D:D..ప్రియా..మీ స్పెషల్ గోరింటాకు అదిరింది..Nice:D

  ReplyDelete
 3. వామ్మో ఏంటండీ ఇది నిజమా ????????

  ReplyDelete
 4. బాగున్నాయండి మీ గోరింటాకు జ్ఞాపకాలు.

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలు రాధిక గారు!

   Delete
 5. "పాపం దానికి పేడంటే ఏం తెలుసే?"ఎంత అమాయకులో:-)

  ReplyDelete
  Replies
  1. అవునండీ నిజమే.. :)
   చెన్నైలో అప్పటికి ఎప్పుడూ చూడలేదు. సో ఆ రోడ్ మీద పడి ఉన్నది గోరింటాకే అనేసుకున్నాను! పైగా ఆంధ్రాలో గోరింటాకు బావుండదు చెన్న్నైయే అన్నివిధాలా బెస్టు అని మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను (అప్పుడు) కూడాను :P

   Delete
 6. priya garru evariki cheppanani promise chesthay nenu meeko secret chepthanu .emandee gorintaaku gurinchi ea ammayina raasthundhi meeru 21 va shathabdhapu yuvathila alochinchi guns meeda gaani landmines meeda gaani granades meeda gaani raayandi meeku popularity rakapothey nannu adagandee.

  ReplyDelete
  Replies
  1. Nijamenandee..! Thappakundaa popularity vasthundi police department punyamaani! Asalevitandi meeru? Andari chethaa naaku cheppu debbalu cheevatlu pettisthe kaani vadilelaa leru..?! Gamanisthunnaanu gamanisthunnaanu.. meeru parichayamainappati gamanisthunaanu.. :D

   Delete
 7. Anonymous13/10/12

  :D navvaapukolekapoyanandi. Meru raase posts chaduvtunnapudu edo chaduvtunnattu kaakunda choostunna feeling vastundandi. Alage prati postlonu me manasu kanipistundi. Actually naku blogger account ledu anduke ninna rasina postni inta latega chaduvtunna. Me blogni follow avatanikaina account create chesukovali

  Harsha

  ReplyDelete
  Replies
  1. Mee abhimaanaaniki thanks Harsha gaaru :)

   Delete
 8. baga rasatunaru andi...
  keep it up..

  ReplyDelete
 9. parvaledulendi peda kudaa anti bacterial kada, nice humorous:)

  ReplyDelete
 10. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... అసలు..
  పాపం కదండీ.. ;) ః) ః)
  హహహ...

  నాకు ఒకటు గుర్తు వస్తుందండి. చిన్నప్పుడు నానమ్మ వాళ్లింట్లో అమ్మ ఇలాగే గోరింటాకు కోసి పట్రమ్మంది. గుట్టలు గుట్టలు కోసేశాను. నేనే నూరతాను నా చేతిలో నా పేరు గోరింటాకు తో రాయాలి అని డీల్.
  ఎనకా ముందూ చూసుకోకుండా నూరేశాను. చివరాఖరున చూసుకుంటే, అప్పటికే నా రెండు చేతులూ ఇంచ్ కూడా గ్యాప్ లేకుమ్డా ఎర్రగా పండిపోయాయి ;( ;( ;(
  అమ్మ ఒకటే నవ్వు.. ;) ;)

  నైస్ పోస్ట్ అండీ

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ రాజ్ గారు :)
   మీ చిన్ననాటి సంగతి చాలా తియ్యగా ఉంది వినడానికి. అయినా అప్పుడు గోరింటాకు పెట్టుకోలేకపోయానని బాధపడకండీ.. కావాలంటే ఇప్పుడు నేను కొరియర్ చేస్తాను పెట్టుకొని ఆఫీస్ లో అందరికీ చూయించి మురిసిపొండి ;) ;) (కోపగించుకోరుగా..? సరదాకే అన్నాను)

   Delete
 11. priya garu, padi padi navvuthunnanu..roddu meeda undi anagane veligindi.....pettukunnaka, adi peda ani teleegane valla mukhaalu choodaali, maa intlo aithe veepu vimanam motha mogi poyedi....

  bhale raasaaru..

  ReplyDelete
  Replies
  1. హహాహ్హ.. థాంక్స్ అండీ :)
   నాక్కూడా మ్రోగేదే.. ఏదో మా అమ్మ పుణ్యమాని తప్పించుకున్నాను కాని ఇప్పటికీ కళ్ళతో వాళ్ళప్పుడు నూరిన కారాలు మిరియాలు జ్ఞాపకమే :D

   Delete
 12. బాగున్నాయండి..మీ గోరింటాకు ముచ్చట్లు..:)
  పెద్ద సాహసమే చేసారన్నమాట..:)
  నాకు కూడా ఆకు గోరింటాకే బాగా ఇష్టం..

  ReplyDelete
  Replies
  1. ఏమాటకామాటే చెప్పుకోవాలి ధాత్రి గారు.. ఆకు గోరింటాకు ముందు ఈ కోనూ గీను ఎందుకూ పనికిరావు కదా.. :)

   Delete
  2. అవునండీ..నిజమే మరి..:))

   Delete
 13. మీ "నా ప్రేమాయణ౦" బాగు౦దని నా ఫ్రె౦డ్ చెప్తే, చదవడ౦ మొదలు పెట్టి మీ బ్లాగ్ అ౦తా సైలె౦ట్ గా (ఒక పక్క "ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)" అ౦టూ వెనక పడుతున్నా సరే) విహరిస్తూ అన్ని పోస్ట్ లు చదువుతున్నా. ః) కానీ మీ "గొరి౦త జ్ణాపక౦" చదివాక నవ్వాపుకోలేక కామె౦ట్ పెడుతున్నా... మీ రచనీ శైలి నిజ౦గా అద్బుత౦. చదువుతూ ఉ౦టే భలే హాయిగా ఉ౦ది.

  "బోల్డ౦త గోరి౦తాకు రోడ్ మీద........... అమ్మో ఎలాగ పారేసుకున్నారో" నిజ౦గా నవ్వలేక చచ్చా అనుకో౦డి......!!! ః) ః) భలే ఉ౦ది మీ "గొరి౦త జ్ణాపక౦"... :P

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగింటికి స్వాగతం అన్వేష్ గారు!