Sunday, November 4, 2012

అక్క

"ఎలా ఉన్నావే? ఆఫీసుకి బయలుదేరుతున్నావా?" అంటున్న అక్క గొంతు వింటూ ఈ రోజు మొదలయింది. "హా బావున్నానక్కా. నువ్వెలా ఉన్నావ్? బొజ్జలో బుజ్జి పాప ఏమంటోంది? నేను ఇప్పుడే లేచా. నువ్వు తిన్నావా?" అన్నాను లేస్తూ. "ఆ బాగున్నానే. పాప కూడా బాగుంది. ఇప్పుడే లేచాం ఇద్దరం. స్నానం చేసి ఏమైనా తింటుండగా మొదలుపెడుతుంది తిరగడం" అంది నవ్వుతూ. నేనింకేదో మాట్లాడేలోపే "సరేలేవే నువ్వు జాగ్రత్త. ఏమైనా తిను. అత్తయ్య పిలుస్తున్నారు.. తరువాత చేస్తాలే" అని నేను సరే అనేలోపే కాల్ కట్ చేసేసింది. ఒకలాటి నిస్సత్తువ ఆవరించింది నన్ను. హూo.. ఎన్ని రోజులైంది తనను చూసి? పెళ్లి కాక ముందు తనను విడిచి ఒకటి రెండ్రోజులు మినహా ఎప్పుడూ ఉండలేదు. పెళ్ళైతే ఇన్ని మార్పులోస్తాయా? తనను ఇంటికి తీసుకురావాలంటే ముందు మా బావగారి అనుమతి, తరువాత అత్త గారు.. ఆ పైన మామగారు. ఎంతో బ్రతిమాలి ఒప్పించి తీసుకురావాలి!!!

హుమ్మ్.. ఏడాది అవుతోంది తను లేకుండా జీవించడం మొదలుపెట్టి. తను నాతో లేని ఈ రోజులు తీరని వెలితితో భారంగా వెళుతున్నాయి.. ఐ రియల్లీ మిస్ హర్. ఎంతో తక్కువగా నిదానంగా మాట్లాడుతుంది. ఎంత పెద్ద జోక్ అయినా తను నవ్వేపుడు చీమ చిటుక్కుమన్నంత శబ్దమూ రాదు! ఒద్దికగా ఒక చోట కూర్చొని పుస్తకాలు చదువుతునో, డ్రాయింగో, పెయింటింగో చేసుకుంటూ ఉంటుంది. కోపమొస్తే చూపుతో సరిపెట్టి అక్కడి నుండి నిష్క్రమిస్తుంది తప్ప వాదించదు! అదే నేనైతే.. మాట్లాడినా, నవ్వినా మినిమం ముప్పై మీటర్లు వినిపించాల్సిందే. క్షణం పాటు కుదురుగా ఒక చోట కూర్చోవడం అంటూ జరగదు. ఎప్పుడూ పరుగులే. అందుకే.. ముద్దుగా గడుసు గంగమ్మ, రాక్షసి లాటి బిరుదులు ప్రదానం చేసారు నాకు! కాని అంత సైలెంట్ గర్ల్ నన్ను చాలా వైలెంట్ సంఘటనలకు బలి చేసింది. వాటిలో రెండిటిని మీతో పంచుకుంటున్నా.. 

ఒక సారి అమ్మ మార్కెట్ కి వెళ్ళినపుడు అక్క సైలెంట్ గా టీవీ ఆన్ చేసింది. ఆ రోజు నాకేం బుద్ధి పుట్టిందో కాని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నా."చెల్లీ రా.. అమ్మ రావడానికి అరగంటైనా పడుతుంది. చక్కా సినిమా చూద్దాం" అంది.  "నీకు కుళ్ళి. నేను బుద్దిగా చదువుకుంటున్నానని. నేను రాను పో" అనేసి పుస్తకంలో దూరిపోయా. తను చూస్తున్నది నిజమో కాదోనన్న అనుమానంతో కాసేపు నన్నలా చూసింది. తను చూస్తున్న విషయం గమనించిన నేను మరీ సీరియస్గ నొసలు ముడి వేసి మరీ చదువుతున్నట్టు పెదాలు కదిపేసా. తను మళ్ళీ సినిమాలో మునిగిపోయి, ఉన్నట్టుండి  కెవ్వ్మంది. ఏం చదువుతున్నానో ఎందుకు చదువుతున్నానో అర్ధం కాక బుర్ర గోక్కుంటూ ఉన్న నేను ఆ అరుపుకి అదిరిపడ్డాను. "టామ్ అండ్ జెర్రీ మేజిక్ రింగ్ సినిమా వేసాడే. రా రా" అంది. అయినా రానని బెట్టు చేసి, తను  నీళ్ళు తాగడానికని వెళ్ళిన గాప్‌లో పుస్తకాన్ని అక్కడే వదిలేసి పాక్కుంటూ వెళ్లి  టీవీ ముందు కూర్చున్నాను.  అలా కూర్చున్నానో లేదో.. మా అమ్మ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి టీవీ చూస్తున్న నన్ను చూసి కోపోద్రేకురాలై  బేండ్ భాజా మోగించేసింది. ఆ అపురూప దృశ్యాన్ని మా అక్క చూసేసి ఇందాక నేను వదిలేసి వచ్చిన పుస్తకాన్ని చేత్తో పట్టుకొనొచ్చి "మా.. కొట్టకు మా.. అమ్మా" అంటూ ఆపింది. అప్పటికి చేతలాపి మాటలందుకుంది మా అమ్మ. "నీ కంటే పెద్దేదేనా అది? అదేమో బుద్దిగా చదువుకుంటుంటే నీకు సినిమాలు కావాల్సి వచ్చాయా? టీవీ మీద ఉన్నంత శ్రద్ధ పుస్తకం మీదుంటేగా? అయినా, తాను చెడిన కోతి ఊరంతా చెరిచిందని నువ్వు సినిమా చూస్తూ చదువుకునే దాన్ని కూడా చెడగొడదామని బయలుదేరావా?" అంటూ మళ్ళీ ఇంకో వాయ వేసింది. వీపు మండుతుండగా "అమ్మోయ్ బాబోయ్.. మ్మ్.. మ్మ్.. ఉహు ఉహు " అని ఏడుస్తూ కేకలు పెడుతూ పైకి పారిపోయి ఎస్కేప్ అయ్యాను. తరువాత నీతో మాట్లాడను పొమ్మని అక్క మీద అలిగినా తనసలే బ్రతిమాలే టైప్ కాదు కాబట్టి పెద్దగా బెట్టు చేసేదాన్ని కాదు. ఒక్కసారి సారీ చెబితే చాలు కళ్ళు తుడుచుకొని తనిచ్చిన పప్పలు తింటూ మళ్ళీ కబుర్లు చెప్పేదాన్ని.

ఓ రోజు సాయంత్రం అద్దం ముందు నిలబడి నా జుట్టుని చూసుకుంటూ చివర్లు పొడిబారినట్లుంటే తడిమి చూసుకుని "అక్కా చూడు నా జుట్టేలా అయిపోతోందో..." అన్నాను బాధపడుతూ. ఏదో ఒక సలహా ఇచ్చి ఊరుకోవచ్చుగా.. అహ ఊరుకోలేదు. "అది కట్ చేసేయాలి లేకపోతే ఇకపై పెరిగేది కూడా అలాగే రఫ్‌గా ఉంటుంది. చిట్లిపోతుంది కూడాను" అని కంగారు పెట్టేసింది. "అక్కా మరిప్పుడెలాగే? అమ్మ జుట్టు కత్తిరిస్తే తంతుందిగా? పైగా ఇప్పుడు నూనె కూడా పెట్టుకొనున్నాను" అన్నాను. "పరవాలేదు. అస్సలు తెలియకుండా నేను కత్తిరిస్తానుగా.." అంది. "అక్కంటే హీరో. అన్ని తెలుసు తనకు.." అన్న ఫీలింగ్‌లో ఉన్న నాకు పెద్ద భయాలూ, అనుమానాలు కలుగలేదు. సరే అని చెప్పి అమ్మ చూడకుండా కత్తెర తీసుకొచ్చి తన చేతికిచ్చాను. బెత్తుడు కట్ చేయబోతే "అమ్మో నా జుట్టు! వొద్దొద్దు. ఇదిగో ఇంత కత్తిరించు చాలు" అని హాఫ్ ఇంచ్ చూయించాను. "నీ మొహం. నీ మాత్రం దానికి కత్తిరించకపోతేనే?" అంటూ నేను చెప్పిన చోటే కత్తిర పెట్టి కాస్త ఇలా అందో లేదో మా అమ్మ "ప్రియమ్మా.. ఎక్కడున్నారు?" అని పెద్ద కేక పెట్టింది. తుళ్ళిపడి అమ్మొస్తుందేమోనని తలుపు వైపు చూసి నేనిటు తిరిగేలోపల టక్ టక్ మని కత్తిరించేసి ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తింది మా అక్క. అమ్మ పిలిచినందుకు కాబోలు అనుకుంటూ అద్దంలో చూసుకుని భోరుమన్నాను. ఏముంది.. ఒక వైపు మెడ వరకు, మరో వైపు బుజం వరకు కత్తిరించి ఉంది నా జుట్టు! నా రాగానికి అమ్మ లోపలి వచ్చింది ఏమైపోయిందో అనుకుంటూ. తీరా అక్కడ నేనున్న అవతారం  చూసి షాకయి "నీకిదేం మాయ రోగమే.. బంగారంలాటి జుట్టు కత్తిరించుకున్నావ్? నీ వెధవ్వేషాలకి ఒక అంతు పొంతూ లేకుండా పోతోంది" అని వొంగో బెట్టి వీపు మీద దబా దబా చరుస్తునే.. "కోతి, పిల్ల దెయ్యం, నా ప్రాణాలు తోడేస్తోంది" లాటి మాటలతో ఘనసత్కారం చేస్తుండగా అక్కొచ్చి ఆపింది ఆపత్భాంధురాల్లాగ! నా పరిస్థితిని ఏమని వివరించను? అసలే జుట్టంత కత్తిరించి పారేసింది రేపు స్కూల్‌కి ఎలా వెళ్ళాలిరా దేవుడా అని ఏడుస్తుంటే అమ్మొచ్చి ఉతికిపారేసింది పైగా  అసలు ఇదంతటికి కారణమైన దానిని రోల్ మోడల్‌గా తీసుకొమ్మని క్లాసు! ఈ కార్యక్రమం ముగిసాక మా అక్క మీద యుద్ధం ప్రకటిస్తే, పాపంగా పేస్ పెట్టి "కావాలని చేస్తానా చెప్పు కంగారులో చూసుకుండా..." అంది. హుం.. మరుసటి రోజు తిడుతూనే రెండు వైపులా సమంగా కత్తిరించి రెండు జడలు వేసి స్కూల్‌కి పంపింది అమ్మ. వెళ్ళాక చూడాలి నా తంటాలు.. అందరు నవ్వడమే. 8th క్లాస్ లో ఫలానా పిల్ల ఇలా వచ్చిందట అని నన్ను చూడ్డానికి ఎగబడి మరీ వచ్చారు :( . ఆ రోజు నుండి "Ms. ఇంటర్నెషనల్ పిలకలు" అన్న బిరుదు కూడా ప్రకటించేశారు స్కూల్లో.

అక్కతో ఎప్పుడూ సరదా గొడవలు, సంతోషాలే కాదండీ! తనే నా మొదటి గురువు. చదువే కాదు.. పెయింటింగ్ కూడా నేర్పింది! ఎలా ఉంటాయోనని ఊహల్లో పడనవసరం లేదండీ.. క్రింద ఫోటో  పెట్టానుగా :)

ఇది నా క్రియేటివిటి అంతా ఉపయోగించి  చేసుకున్న మొదటి పెయింటింగ్.

ఇప్పుడు  నా ఆలోచనంతా డిసెంబర్ నెలలో మా ఇంట పూయబోయే చిట్టిచామంతితో మా అక్క ఇంకెన్ని అద్బుతాలు చేయించేస్తుందో అని :) My god..  I just can't wait to hold her little hands.. :)     

55 comments:

Anonymous said...

Nice Paintings Ma'm !
Sweet Memories are so Sweet :)

Praveena said...

Hey Priya,
Very nice writing style & superb paintings :)

Priya said...

Thank you so much :)

Priya said...

Hi Pravena!
Very nice to see your comment. Thank you :)

వనజవనమాలి said...

:) paintings chaalaa baavunnaayi.

డేవిడ్ said...

ప్రియా గారు మీ అక్క చెల్లేల్ల కబుర్లు, మీ పేయింటింగ్స్ బాగున్నాయి... మీలో ఉన్న టాలెంట్ ను ఇలాగే కొనసాగించాలని అకాంక్షిస్తున్నాను

sndp said...

Silent girl and violent incidents..:p ,
baga rastaru ane anukuna paintings kuda bagunayi...

sndp said...

silent girl and violent incidents are superb...:p,
meru baga rastaru ani matrame anukuna paintings kuda baga vestaranamata gr8 :)

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు..
మీ పెయింటింగ్స్ కూడా సూపర్.. ప్రొఫెషనల్ లాగా వేశారు.;)

the tree said...

అక్క ప్రేమ బాగుంది, చిత్రాలు బాగున్నాయ్ అండి.

వేణూశ్రీకాంత్ said...

మీ అక్కా చెల్లెళ్ళ అనుబంధం బాగుందండీ...
పెయింటింగ్స్ కూడా చాలాబాగున్నాయ్. అంత చక్కని పెయింటింగ్ నేర్పించారు కనుక వదిలేద్దామంటే సరే లేదంటే కనుక తన చిట్టి చామంతికి మీరు బోలెడన్ని అల్లర్లు నేర్పించేసి మీ అక్కయ్యగారు ఆఅల్లరితో ముచ్చటైన అవస్థలు పడుతుంటే మీరు వికటాట్టహాసం చేసేయండి :-)

Chinni said...
This comment has been removed by the author.
Priya said...

Thanks andi :)

జయ said...

చాలా సరదాగా ఉందండి. మీ పైంటింగ్స్ అయితే నో వర్డ్! సో వండర్. ఎంత బాగున్నాయో.

కావ్యాంజలి said...

బాగున్నాయ్ ప్రియ గారు మీ జ్ఞాపకాలు :)

Priya said...

థాంక్స్ డేవిడ్ గారు.. :)
మా అక్క పెళ్లి తో సరదాలకు, ఆఫీస్ అర్జెంట్ ప్రాజెక్ట్స్ తో నా పెయింటింగ్‌లకు తాత్కాలిక ఆనకట్ట పడిందండి.. :(
త్వరలోనే మొదలుపెడతాను :)

Priya said...

థాంక్స్ సందీప్.. :)
అబ్బా.. కాసేపు "నువ్వు", మరి కాసేపు "మీరు" కాకుండా ముందు దేనికోదానికి ఫిక్స్ అయితే ఇంకా సూపర్బ్ గా ఉంటుంది :D

Priya said...

థాంక్ యూ, రాజ్ గారు.. మీరందరు బావుందంటుంటే చాలా సంతోషంగా ఉంది :)
పూర్తయిన తరువాత రోజుకి వంద సార్లు నేను చూసుకోవడం తప్ప బయట ఎవరికీ చూయించలేదు!! "ఇదీ ఓ పెయింటింగే?!" అని నోరెళ్ళబెడతారేమోనని జడుసుకున్నాను!

Priya said...

కృతజ్ఞతలండీ :)

Priya said...

మీరు చెప్పిన ప్లాన్ ఏదో బాగుంది వేణూ గారు. కాని చిక్కేంటంటే మా అక్క విషయంలో నేను ఎంత గొప్ప ప్లాన్ వేసినా ఘోరంగా బెడిసికొడుతుంతుంది! ఇప్పుడు మీరన్నట్టు చేసాననుకోండి.. బాడ్‌లక్ బాగా గాట్టిగా కౌగలించేసుకొని, నేను చిట్టి చామంతికి నేర్పిన అల్లర్లన్ని నా మీదకే దూసుకొచ్చేయొచ్చు! అందులో మా అక్క ప్రమేయం ఏమి ఉండదనుకోండీ.. కాని అలా జరిగిపోతుందంతే..!!

Priya said...

జయ గారు.. నా బ్లాగింట్లోకి స్వాగతం :)
మీకు నచ్చినందుకు, నన్ను మెచ్చినందుకు చాలా కృతజ్ఞతలండీ..

Priya said...

Thank you Kavyanjali gaaru :)

Chinni said...

పెయింటింగ్స్ బాగున్నాయి ప్రియా. అక్కా, చెల్లెళ్ల అల్లరి కూడా..:)

Lasya Ramakrishna said...

Nice paintings and nice post priya gaaru

Bindu said...

మీరు దెబ్బలు తిన్న సన్నివేసాలు అయినా నవ్వకుండా ఉందలేక పోయాను sorry :) అక్కలు అంతే కదా మరి, అల్లరి నేర్ప గలరు, దెబ్బలు తినిపించగలరు, నవ్వించగలరు, ఏడిస్తే లాలించగలరు. మీ టపా చదువుతుంటే మా అక్క గుర్తుకువచ్చింది :)

Priya said...

:) :)

Priya said...

Thank you Lasya gaaru :)

Priya said...

సారీ ఎందుకులే బిందు గారు.. అవన్నీ తలుచుకుంటే నాకే నవ్వొస్తోంది :D
నిజమే ఈ అక్కలు మేజిక్ చేసేస్తారు కాని మన మేజిక్ కి పడరు!! ఈ లాజిక్ ఏంటో నాకు అర్ధమై చావదు.

Sayaram said...

Paitings Adurs.....

Priya said...

Thank you... :)

srinivasarao vundavalli said...

బాగుంది ప్రియ గారు మీ అక్కా చెల్లెళ్ళ అల్లరి :)

thanooj said...

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ok

Priya said...

హహ్హహ్హహా.. థాంక్స్ శ్రీనివాస్ గారు.. :)
మా అమ్మకైతే తల నొప్పిగా ఉంటుందండీ (జరిగేడపుడు) :P

Priya said...

Thanks Thanooj :D

srinivasarao vundavalli said...

:)

ధాత్రి said...

మొత్తానికి మీ అక్క మిమ్మల్ని చాలా సార్లు బుక్ చేసారన్నమాట..
Anyway, చాల బాగుంది పోస్ట్ And మీ Painting కూడా..:)

Priya said...

ధాత్రి గారు.. నా బ్లాగ్‌కి స్వాగతం మరియు మీ కామెంట్ కి కృతజ్ఞతలు :)
అవునండీ.. చాలా సార్లు అనేకంటే ఆల్మోస్ట్ అన్ని సార్లు అనడం బావుంటుందేమో..

sunkara said...

HI Priya,
Writing style chala bagundi... keep writing. Oka blog lo purtiga chadavatam ide first time, ur narration is so impressive.

Priya said...

Hi Sunkara gaaru!
Welcome to my blog. Intha encouraging gaa comment chesinanduku chaalaa chaalaa chaalaaa thanks meeku :)

MURALI said...

నిన్నటి నుండీ మీ బ్లాగు మొత్తం చదువుతుండటం వలనేమో, మీ ఇంట్లోకి దూరిపోయి మీరు చెప్పే సంఘటనలన్నీ కళ్ళ ముందే చూస్తున్నట్టుగా ఉంది నాకు.

Priya said...

:) :)

Anonymous said...

Nice memories:)

Priya said...

థాంక్స్ అనూ గారూ!
మంచి జ్ఞాపకాల వలన లైఫ్‌లో కొన్ని నిముషాలు అదనపు తీయదనాన్ని సంతరించుకుంటాయి కదా.. :)

nagarani yerra said...

బాగుంది .ప్రియగారూ .చూడబోతే మీ అక్కే తెలివైన అమ్మాయి లా ఉంది .ధభీ ధభీలు ,చరుపులు అన్నీ .మీకేనా?

Priya said...

థాంక్స్ రాణి గారు. "చూడబోతే.. లా ఉంది" అని సందేహాలొద్దండీ.. కచ్చితంగా నూటికి వెయ్యి పాళ్ళు తనే తెలివిగలది.
మరే.. దభీ దభీమని చరుపులైనా, ముద్దు ముచ్చట్లయినా నాకే ఎక్కువ. మా అక్క సైలెంట్ అని, బాగా సెన్సిటివ్ అని పైగా పెద్దదని.. తననెప్పుడూ గౌరవంగా చూస్తారు. నేనే.. వాగుడుగాయనని, అల్లరిపిడుగునని, తిట్టినా దులుపుకు తిరుగుతానని, పైగా చిన్నదాన్నని.. సకల సత్కారాలు నాకే చేస్తుంటారు :P

..nagarjuna.. said...

ఇది మీ మొదటి పెయింటింగా!! మీరు సామాన్యులు కాదండీ.

మణులూ మాణిక్యాలు అడిగినా ఇవ్వను కాబట్టి కామెంట్ రాసేస్తున్నా :)

Priya said...

హహ్హహ్హ బ్లాగ్ లోకంలో మణులు, మాణిక్యాల కన్నా విలువైంది కామెంటే కదండీ.. సో రాసినందుకు, మీ మెచ్చుకోలుకు కూడా చాలా చాలా థాంక్స్ నాగార్జున గారు. అలాగే నా బ్లాగ్ కి స్నేహపూర్వకమైన స్వాగతం :)

Anonymous said...

దెయ్యంగారా?

Priya said...

:-? ఎన్నిసార్లు చదివినా మీరేం అడగొచ్చారో నాకు అస్సలు అర్ధంకావట్లేదండీ.

Anvesh G said...

వావ్.... రచనా శైలే అనుకున్నా, చిత్రలెఖన౦ కూడానా!!! మొదటి చిత్రమే ఇలా ఉ౦ద౦టే అబ్బో ఇప్పుడు కేక పుట్టి౦చెస్తు౦టారేమో... హహ్హా ః)

సకలకళాకోవిదురాలు ప్రియ నా??

బాగు౦ది... Nice Painting. :)

Priya said...

కాస్త ఆలశ్యంగా స్పందిస్తున్నాను మరోలా అనుకోకండీ.. వీలుపడలేదు మరి.

సకలకళలూ రావు గాని ఏదో మనసుకి నచ్చిన (వచ్చిన) పనులు మాత్రం ఇష్టంగా చేస్తుంటాను అంతే అన్వేష్ గారు.

Thanks for the comment :)

అన్వేష్ said...

:)

Anonymous said...

బాగుంది మీ బ్లాగు. మీ నవ్వులాగే. కొత్త పోస్ట్ ఎపుడు రాస్తారండి?

Priya said...

థాంక్స్ అండీ. కొత్త పోస్ట్.. రేపో, ఎల్లుండో పబ్లిష్ చేస్తాను.

శ్యామలీయం said...

మీ అల్లర్లు బాగున్నాయి చదవటానికి.

మా ఆమ్మగారు అంటుండేవారు. మగపిల్లలపొత్తు చిన్నప్పుడే, ఆడపిల్లలపొత్తు పెద్దయ్యాకే అని. అదేంటమ్మా అంటే ఆవిడ వివరణ కూడా ఇచ్చారు. మగపిల్లలు ఒరే అన్నయ్యా తమ్మయ్యా అని ఆప్యాయతలు ఒలకబోసుకొనేది చిన్నప్పుడే కాని పెద్దయ్యాక ఆస్తులకోసం తగవులు పడతారట. ఆడపిల్లలు చిన్నప్పుడు పువ్వులకోసమూ రిబ్బన్లకోసమూ తగవులాడుకుంటారు కాని పెద్దై ఎవరి అత్తారిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కచెల్లెళ్ళను చూడాలని తహతహలాడుతూ ఉంటారట. అదీ లోకం తీరు అని చెప్పారావిడ.

ఈ టపా చదివితే మా అమ్మగారి మాటలు గుర్తుకు వచ్చాయి.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Sunday, November 4, 2012

అక్క

"ఎలా ఉన్నావే? ఆఫీసుకి బయలుదేరుతున్నావా?" అంటున్న అక్క గొంతు వింటూ ఈ రోజు మొదలయింది. "హా బావున్నానక్కా. నువ్వెలా ఉన్నావ్? బొజ్జలో బుజ్జి పాప ఏమంటోంది? నేను ఇప్పుడే లేచా. నువ్వు తిన్నావా?" అన్నాను లేస్తూ. "ఆ బాగున్నానే. పాప కూడా బాగుంది. ఇప్పుడే లేచాం ఇద్దరం. స్నానం చేసి ఏమైనా తింటుండగా మొదలుపెడుతుంది తిరగడం" అంది నవ్వుతూ. నేనింకేదో మాట్లాడేలోపే "సరేలేవే నువ్వు జాగ్రత్త. ఏమైనా తిను. అత్తయ్య పిలుస్తున్నారు.. తరువాత చేస్తాలే" అని నేను సరే అనేలోపే కాల్ కట్ చేసేసింది. ఒకలాటి నిస్సత్తువ ఆవరించింది నన్ను. హూo.. ఎన్ని రోజులైంది తనను చూసి? పెళ్లి కాక ముందు తనను విడిచి ఒకటి రెండ్రోజులు మినహా ఎప్పుడూ ఉండలేదు. పెళ్ళైతే ఇన్ని మార్పులోస్తాయా? తనను ఇంటికి తీసుకురావాలంటే ముందు మా బావగారి అనుమతి, తరువాత అత్త గారు.. ఆ పైన మామగారు. ఎంతో బ్రతిమాలి ఒప్పించి తీసుకురావాలి!!!

హుమ్మ్.. ఏడాది అవుతోంది తను లేకుండా జీవించడం మొదలుపెట్టి. తను నాతో లేని ఈ రోజులు తీరని వెలితితో భారంగా వెళుతున్నాయి.. ఐ రియల్లీ మిస్ హర్. ఎంతో తక్కువగా నిదానంగా మాట్లాడుతుంది. ఎంత పెద్ద జోక్ అయినా తను నవ్వేపుడు చీమ చిటుక్కుమన్నంత శబ్దమూ రాదు! ఒద్దికగా ఒక చోట కూర్చొని పుస్తకాలు చదువుతునో, డ్రాయింగో, పెయింటింగో చేసుకుంటూ ఉంటుంది. కోపమొస్తే చూపుతో సరిపెట్టి అక్కడి నుండి నిష్క్రమిస్తుంది తప్ప వాదించదు! అదే నేనైతే.. మాట్లాడినా, నవ్వినా మినిమం ముప్పై మీటర్లు వినిపించాల్సిందే. క్షణం పాటు కుదురుగా ఒక చోట కూర్చోవడం అంటూ జరగదు. ఎప్పుడూ పరుగులే. అందుకే.. ముద్దుగా గడుసు గంగమ్మ, రాక్షసి లాటి బిరుదులు ప్రదానం చేసారు నాకు! కాని అంత సైలెంట్ గర్ల్ నన్ను చాలా వైలెంట్ సంఘటనలకు బలి చేసింది. వాటిలో రెండిటిని మీతో పంచుకుంటున్నా.. 

ఒక సారి అమ్మ మార్కెట్ కి వెళ్ళినపుడు అక్క సైలెంట్ గా టీవీ ఆన్ చేసింది. ఆ రోజు నాకేం బుద్ధి పుట్టిందో కాని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నా."చెల్లీ రా.. అమ్మ రావడానికి అరగంటైనా పడుతుంది. చక్కా సినిమా చూద్దాం" అంది.  "నీకు కుళ్ళి. నేను బుద్దిగా చదువుకుంటున్నానని. నేను రాను పో" అనేసి పుస్తకంలో దూరిపోయా. తను చూస్తున్నది నిజమో కాదోనన్న అనుమానంతో కాసేపు నన్నలా చూసింది. తను చూస్తున్న విషయం గమనించిన నేను మరీ సీరియస్గ నొసలు ముడి వేసి మరీ చదువుతున్నట్టు పెదాలు కదిపేసా. తను మళ్ళీ సినిమాలో మునిగిపోయి, ఉన్నట్టుండి  కెవ్వ్మంది. ఏం చదువుతున్నానో ఎందుకు చదువుతున్నానో అర్ధం కాక బుర్ర గోక్కుంటూ ఉన్న నేను ఆ అరుపుకి అదిరిపడ్డాను. "టామ్ అండ్ జెర్రీ మేజిక్ రింగ్ సినిమా వేసాడే. రా రా" అంది. అయినా రానని బెట్టు చేసి, తను  నీళ్ళు తాగడానికని వెళ్ళిన గాప్‌లో పుస్తకాన్ని అక్కడే వదిలేసి పాక్కుంటూ వెళ్లి  టీవీ ముందు కూర్చున్నాను.  అలా కూర్చున్నానో లేదో.. మా అమ్మ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి టీవీ చూస్తున్న నన్ను చూసి కోపోద్రేకురాలై  బేండ్ భాజా మోగించేసింది. ఆ అపురూప దృశ్యాన్ని మా అక్క చూసేసి ఇందాక నేను వదిలేసి వచ్చిన పుస్తకాన్ని చేత్తో పట్టుకొనొచ్చి "మా.. కొట్టకు మా.. అమ్మా" అంటూ ఆపింది. అప్పటికి చేతలాపి మాటలందుకుంది మా అమ్మ. "నీ కంటే పెద్దేదేనా అది? అదేమో బుద్దిగా చదువుకుంటుంటే నీకు సినిమాలు కావాల్సి వచ్చాయా? టీవీ మీద ఉన్నంత శ్రద్ధ పుస్తకం మీదుంటేగా? అయినా, తాను చెడిన కోతి ఊరంతా చెరిచిందని నువ్వు సినిమా చూస్తూ చదువుకునే దాన్ని కూడా చెడగొడదామని బయలుదేరావా?" అంటూ మళ్ళీ ఇంకో వాయ వేసింది. వీపు మండుతుండగా "అమ్మోయ్ బాబోయ్.. మ్మ్.. మ్మ్.. ఉహు ఉహు " అని ఏడుస్తూ కేకలు పెడుతూ పైకి పారిపోయి ఎస్కేప్ అయ్యాను. తరువాత నీతో మాట్లాడను పొమ్మని అక్క మీద అలిగినా తనసలే బ్రతిమాలే టైప్ కాదు కాబట్టి పెద్దగా బెట్టు చేసేదాన్ని కాదు. ఒక్కసారి సారీ చెబితే చాలు కళ్ళు తుడుచుకొని తనిచ్చిన పప్పలు తింటూ మళ్ళీ కబుర్లు చెప్పేదాన్ని.

ఓ రోజు సాయంత్రం అద్దం ముందు నిలబడి నా జుట్టుని చూసుకుంటూ చివర్లు పొడిబారినట్లుంటే తడిమి చూసుకుని "అక్కా చూడు నా జుట్టేలా అయిపోతోందో..." అన్నాను బాధపడుతూ. ఏదో ఒక సలహా ఇచ్చి ఊరుకోవచ్చుగా.. అహ ఊరుకోలేదు. "అది కట్ చేసేయాలి లేకపోతే ఇకపై పెరిగేది కూడా అలాగే రఫ్‌గా ఉంటుంది. చిట్లిపోతుంది కూడాను" అని కంగారు పెట్టేసింది. "అక్కా మరిప్పుడెలాగే? అమ్మ జుట్టు కత్తిరిస్తే తంతుందిగా? పైగా ఇప్పుడు నూనె కూడా పెట్టుకొనున్నాను" అన్నాను. "పరవాలేదు. అస్సలు తెలియకుండా నేను కత్తిరిస్తానుగా.." అంది. "అక్కంటే హీరో. అన్ని తెలుసు తనకు.." అన్న ఫీలింగ్‌లో ఉన్న నాకు పెద్ద భయాలూ, అనుమానాలు కలుగలేదు. సరే అని చెప్పి అమ్మ చూడకుండా కత్తెర తీసుకొచ్చి తన చేతికిచ్చాను. బెత్తుడు కట్ చేయబోతే "అమ్మో నా జుట్టు! వొద్దొద్దు. ఇదిగో ఇంత కత్తిరించు చాలు" అని హాఫ్ ఇంచ్ చూయించాను. "నీ మొహం. నీ మాత్రం దానికి కత్తిరించకపోతేనే?" అంటూ నేను చెప్పిన చోటే కత్తిర పెట్టి కాస్త ఇలా అందో లేదో మా అమ్మ "ప్రియమ్మా.. ఎక్కడున్నారు?" అని పెద్ద కేక పెట్టింది. తుళ్ళిపడి అమ్మొస్తుందేమోనని తలుపు వైపు చూసి నేనిటు తిరిగేలోపల టక్ టక్ మని కత్తిరించేసి ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తింది మా అక్క. అమ్మ పిలిచినందుకు కాబోలు అనుకుంటూ అద్దంలో చూసుకుని భోరుమన్నాను. ఏముంది.. ఒక వైపు మెడ వరకు, మరో వైపు బుజం వరకు కత్తిరించి ఉంది నా జుట్టు! నా రాగానికి అమ్మ లోపలి వచ్చింది ఏమైపోయిందో అనుకుంటూ. తీరా అక్కడ నేనున్న అవతారం  చూసి షాకయి "నీకిదేం మాయ రోగమే.. బంగారంలాటి జుట్టు కత్తిరించుకున్నావ్? నీ వెధవ్వేషాలకి ఒక అంతు పొంతూ లేకుండా పోతోంది" అని వొంగో బెట్టి వీపు మీద దబా దబా చరుస్తునే.. "కోతి, పిల్ల దెయ్యం, నా ప్రాణాలు తోడేస్తోంది" లాటి మాటలతో ఘనసత్కారం చేస్తుండగా అక్కొచ్చి ఆపింది ఆపత్భాంధురాల్లాగ! నా పరిస్థితిని ఏమని వివరించను? అసలే జుట్టంత కత్తిరించి పారేసింది రేపు స్కూల్‌కి ఎలా వెళ్ళాలిరా దేవుడా అని ఏడుస్తుంటే అమ్మొచ్చి ఉతికిపారేసింది పైగా  అసలు ఇదంతటికి కారణమైన దానిని రోల్ మోడల్‌గా తీసుకొమ్మని క్లాసు! ఈ కార్యక్రమం ముగిసాక మా అక్క మీద యుద్ధం ప్రకటిస్తే, పాపంగా పేస్ పెట్టి "కావాలని చేస్తానా చెప్పు కంగారులో చూసుకుండా..." అంది. హుం.. మరుసటి రోజు తిడుతూనే రెండు వైపులా సమంగా కత్తిరించి రెండు జడలు వేసి స్కూల్‌కి పంపింది అమ్మ. వెళ్ళాక చూడాలి నా తంటాలు.. అందరు నవ్వడమే. 8th క్లాస్ లో ఫలానా పిల్ల ఇలా వచ్చిందట అని నన్ను చూడ్డానికి ఎగబడి మరీ వచ్చారు :( . ఆ రోజు నుండి "Ms. ఇంటర్నెషనల్ పిలకలు" అన్న బిరుదు కూడా ప్రకటించేశారు స్కూల్లో.

అక్కతో ఎప్పుడూ సరదా గొడవలు, సంతోషాలే కాదండీ! తనే నా మొదటి గురువు. చదువే కాదు.. పెయింటింగ్ కూడా నేర్పింది! ఎలా ఉంటాయోనని ఊహల్లో పడనవసరం లేదండీ.. క్రింద ఫోటో  పెట్టానుగా :)

ఇది నా క్రియేటివిటి అంతా ఉపయోగించి  చేసుకున్న మొదటి పెయింటింగ్.

ఇప్పుడు  నా ఆలోచనంతా డిసెంబర్ నెలలో మా ఇంట పూయబోయే చిట్టిచామంతితో మా అక్క ఇంకెన్ని అద్బుతాలు చేయించేస్తుందో అని :) My god..  I just can't wait to hold her little hands.. :)     

55 comments:

 1. Anonymous4/11/12

  Nice Paintings Ma'm !
  Sweet Memories are so Sweet :)

  ReplyDelete
  Replies
  1. Thank you so much :)

   Delete
 2. Hey Priya,
  Very nice writing style & superb paintings :)

  ReplyDelete
  Replies
  1. Hi Pravena!
   Very nice to see your comment. Thank you :)

   Delete
 3. :) paintings chaalaa baavunnaayi.

  ReplyDelete
 4. ప్రియా గారు మీ అక్క చెల్లేల్ల కబుర్లు, మీ పేయింటింగ్స్ బాగున్నాయి... మీలో ఉన్న టాలెంట్ ను ఇలాగే కొనసాగించాలని అకాంక్షిస్తున్నాను

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ డేవిడ్ గారు.. :)
   మా అక్క పెళ్లి తో సరదాలకు, ఆఫీస్ అర్జెంట్ ప్రాజెక్ట్స్ తో నా పెయింటింగ్‌లకు తాత్కాలిక ఆనకట్ట పడిందండి.. :(
   త్వరలోనే మొదలుపెడతాను :)

   Delete
 5. Silent girl and violent incidents..:p ,
  baga rastaru ane anukuna paintings kuda bagunayi...

  ReplyDelete
 6. silent girl and violent incidents are superb...:p,
  meru baga rastaru ani matrame anukuna paintings kuda baga vestaranamata gr8 :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ సందీప్.. :)
   అబ్బా.. కాసేపు "నువ్వు", మరి కాసేపు "మీరు" కాకుండా ముందు దేనికోదానికి ఫిక్స్ అయితే ఇంకా సూపర్బ్ గా ఉంటుంది :D

   Delete
 7. బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు..
  మీ పెయింటింగ్స్ కూడా సూపర్.. ప్రొఫెషనల్ లాగా వేశారు.;)

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ, రాజ్ గారు.. మీరందరు బావుందంటుంటే చాలా సంతోషంగా ఉంది :)
   పూర్తయిన తరువాత రోజుకి వంద సార్లు నేను చూసుకోవడం తప్ప బయట ఎవరికీ చూయించలేదు!! "ఇదీ ఓ పెయింటింగే?!" అని నోరెళ్ళబెడతారేమోనని జడుసుకున్నాను!

   Delete
 8. అక్క ప్రేమ బాగుంది, చిత్రాలు బాగున్నాయ్ అండి.

  ReplyDelete
  Replies
  1. కృతజ్ఞతలండీ :)

   Delete
 9. మీ అక్కా చెల్లెళ్ళ అనుబంధం బాగుందండీ...
  పెయింటింగ్స్ కూడా చాలాబాగున్నాయ్. అంత చక్కని పెయింటింగ్ నేర్పించారు కనుక వదిలేద్దామంటే సరే లేదంటే కనుక తన చిట్టి చామంతికి మీరు బోలెడన్ని అల్లర్లు నేర్పించేసి మీ అక్కయ్యగారు ఆఅల్లరితో ముచ్చటైన అవస్థలు పడుతుంటే మీరు వికటాట్టహాసం చేసేయండి :-)

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన ప్లాన్ ఏదో బాగుంది వేణూ గారు. కాని చిక్కేంటంటే మా అక్క విషయంలో నేను ఎంత గొప్ప ప్లాన్ వేసినా ఘోరంగా బెడిసికొడుతుంతుంది! ఇప్పుడు మీరన్నట్టు చేసాననుకోండి.. బాడ్‌లక్ బాగా గాట్టిగా కౌగలించేసుకొని, నేను చిట్టి చామంతికి నేర్పిన అల్లర్లన్ని నా మీదకే దూసుకొచ్చేయొచ్చు! అందులో మా అక్క ప్రమేయం ఏమి ఉండదనుకోండీ.. కాని అలా జరిగిపోతుందంతే..!!

   Delete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. చాలా సరదాగా ఉందండి. మీ పైంటింగ్స్ అయితే నో వర్డ్! సో వండర్. ఎంత బాగున్నాయో.

  ReplyDelete
  Replies
  1. జయ గారు.. నా బ్లాగింట్లోకి స్వాగతం :)
   మీకు నచ్చినందుకు, నన్ను మెచ్చినందుకు చాలా కృతజ్ఞతలండీ..

   Delete
 12. బాగున్నాయ్ ప్రియ గారు మీ జ్ఞాపకాలు :)

  ReplyDelete
  Replies
  1. Thank you Kavyanjali gaaru :)

   Delete
 13. పెయింటింగ్స్ బాగున్నాయి ప్రియా. అక్కా, చెల్లెళ్ల అల్లరి కూడా..:)

  ReplyDelete
 14. Nice paintings and nice post priya gaaru

  ReplyDelete
  Replies
  1. Thank you Lasya gaaru :)

   Delete
 15. మీరు దెబ్బలు తిన్న సన్నివేసాలు అయినా నవ్వకుండా ఉందలేక పోయాను sorry :) అక్కలు అంతే కదా మరి, అల్లరి నేర్ప గలరు, దెబ్బలు తినిపించగలరు, నవ్వించగలరు, ఏడిస్తే లాలించగలరు. మీ టపా చదువుతుంటే మా అక్క గుర్తుకువచ్చింది :)

  ReplyDelete
  Replies
  1. సారీ ఎందుకులే బిందు గారు.. అవన్నీ తలుచుకుంటే నాకే నవ్వొస్తోంది :D
   నిజమే ఈ అక్కలు మేజిక్ చేసేస్తారు కాని మన మేజిక్ కి పడరు!! ఈ లాజిక్ ఏంటో నాకు అర్ధమై చావదు.

   Delete
 16. Paitings Adurs.....

  ReplyDelete
 17. బాగుంది ప్రియ గారు మీ అక్కా చెల్లెళ్ళ అల్లరి :)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహా.. థాంక్స్ శ్రీనివాస్ గారు.. :)
   మా అమ్మకైతే తల నొప్పిగా ఉంటుందండీ (జరిగేడపుడు) :P

   Delete
 18. aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ok

  ReplyDelete
 19. మొత్తానికి మీ అక్క మిమ్మల్ని చాలా సార్లు బుక్ చేసారన్నమాట..
  Anyway, చాల బాగుంది పోస్ట్ And మీ Painting కూడా..:)

  ReplyDelete
  Replies
  1. ధాత్రి గారు.. నా బ్లాగ్‌కి స్వాగతం మరియు మీ కామెంట్ కి కృతజ్ఞతలు :)
   అవునండీ.. చాలా సార్లు అనేకంటే ఆల్మోస్ట్ అన్ని సార్లు అనడం బావుంటుందేమో..

   Delete
 20. HI Priya,
  Writing style chala bagundi... keep writing. Oka blog lo purtiga chadavatam ide first time, ur narration is so impressive.

  ReplyDelete
  Replies
  1. Hi Sunkara gaaru!
   Welcome to my blog. Intha encouraging gaa comment chesinanduku chaalaa chaalaa chaalaaa thanks meeku :)

   Delete
 21. నిన్నటి నుండీ మీ బ్లాగు మొత్తం చదువుతుండటం వలనేమో, మీ ఇంట్లోకి దూరిపోయి మీరు చెప్పే సంఘటనలన్నీ కళ్ళ ముందే చూస్తున్నట్టుగా ఉంది నాకు.

  ReplyDelete
 22. Anonymous10/6/13

  Nice memories:)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అనూ గారూ!
   మంచి జ్ఞాపకాల వలన లైఫ్‌లో కొన్ని నిముషాలు అదనపు తీయదనాన్ని సంతరించుకుంటాయి కదా.. :)

   Delete
 23. బాగుంది .ప్రియగారూ .చూడబోతే మీ అక్కే తెలివైన అమ్మాయి లా ఉంది .ధభీ ధభీలు ,చరుపులు అన్నీ .మీకేనా?

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాణి గారు. "చూడబోతే.. లా ఉంది" అని సందేహాలొద్దండీ.. కచ్చితంగా నూటికి వెయ్యి పాళ్ళు తనే తెలివిగలది.
   మరే.. దభీ దభీమని చరుపులైనా, ముద్దు ముచ్చట్లయినా నాకే ఎక్కువ. మా అక్క సైలెంట్ అని, బాగా సెన్సిటివ్ అని పైగా పెద్దదని.. తననెప్పుడూ గౌరవంగా చూస్తారు. నేనే.. వాగుడుగాయనని, అల్లరిపిడుగునని, తిట్టినా దులుపుకు తిరుగుతానని, పైగా చిన్నదాన్నని.. సకల సత్కారాలు నాకే చేస్తుంటారు :P

   Delete
 24. ఇది మీ మొదటి పెయింటింగా!! మీరు సామాన్యులు కాదండీ.

  మణులూ మాణిక్యాలు అడిగినా ఇవ్వను కాబట్టి కామెంట్ రాసేస్తున్నా :)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ బ్లాగ్ లోకంలో మణులు, మాణిక్యాల కన్నా విలువైంది కామెంటే కదండీ.. సో రాసినందుకు, మీ మెచ్చుకోలుకు కూడా చాలా చాలా థాంక్స్ నాగార్జున గారు. అలాగే నా బ్లాగ్ కి స్నేహపూర్వకమైన స్వాగతం :)

   Delete
 25. Anonymous22/7/13

  దెయ్యంగారా?

  ReplyDelete
  Replies
  1. :-? ఎన్నిసార్లు చదివినా మీరేం అడగొచ్చారో నాకు అస్సలు అర్ధంకావట్లేదండీ.

   Delete
 26. వావ్.... రచనా శైలే అనుకున్నా, చిత్రలెఖన౦ కూడానా!!! మొదటి చిత్రమే ఇలా ఉ౦ద౦టే అబ్బో ఇప్పుడు కేక పుట్టి౦చెస్తు౦టారేమో... హహ్హా ః)

  సకలకళాకోవిదురాలు ప్రియ నా??

  బాగు౦ది... Nice Painting. :)

  ReplyDelete
  Replies
  1. కాస్త ఆలశ్యంగా స్పందిస్తున్నాను మరోలా అనుకోకండీ.. వీలుపడలేదు మరి.

   సకలకళలూ రావు గాని ఏదో మనసుకి నచ్చిన (వచ్చిన) పనులు మాత్రం ఇష్టంగా చేస్తుంటాను అంతే అన్వేష్ గారు.

   Thanks for the comment :)

   Delete
 27. Anonymous13/8/13

  బాగుంది మీ బ్లాగు. మీ నవ్వులాగే. కొత్త పోస్ట్ ఎపుడు రాస్తారండి?

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అండీ. కొత్త పోస్ట్.. రేపో, ఎల్లుండో పబ్లిష్ చేస్తాను.

   Delete
 28. మీ అల్లర్లు బాగున్నాయి చదవటానికి.