Tuesday, November 27, 2012

చీరలు

అబ్బబ్బా.. ఈ నెల మొదట్లో నేను ఏ తోక... అహ తోకలు తొక్కే అవకాశమే లేదండీ.. అయితే గియితే బట్టలుతికేప్పుడు ఏ చీర కొంగో తొక్కుంటాను. అది ఏ కొంగు ప్రభావమో మరేమో గాని ఈ నెలలో అచ్చంగా 5 చీరలు సొంతమయ్యాయండి!!! అచ్చంగా అని ఎందుకన్నానంటే, నా దగ్గర 17 చీరలున్నా..  మా అక్కావాళ్ళింటికెళ్ళేడపుడు కావాలనే ఒక జత తక్కువ పట్టుకెపట్టుకెళ్లి (వీలైతే అసలేమి తీసుకెళ్లకుండానే.. :P ), వచ్చేడపుడు "అయ్యయో ఇప్పుడు వేసుకెళ్ళడానికి ఏమి లేవే.. హూ.. పోనిలే ఇంకేం చేస్తాను టైం అయిపోతోంది" అంటూ గబగబా కబోర్డ్ దగ్గరకెళ్ళి నచ్చిన చీర కట్టేసుకొని మళ్ళీ 2 నెలల వరకు వాళ్ళింటి వైపు కూడా తొంగి చూడను. ఈ లోపో, తర్వాతో అక్క ఇంటికొచ్చి గోల చేసి తీసుకెళ్ళిపోవడమో, అమ్మ చేత తెప్పించుకోవడమో చేస్తుంది. అలా కాకుండా అచ్చంగా నాకే ఐదు చీరలొచ్చాయి ఈ నెల.
మొదటి చీర మొన్న మా అక్క శ్రీమంతానికి అమ్మ కొనిచ్చింది. రెండోది వచ్చిన బంధువుల్లో ఒకరు కానుకగా ఇచ్చారు. మూడోది అక్కా వాళ్ళ అత్తింటి వాళ్ళు పెట్టారు. నాలుగోది దీపావళి సందర్భంగా మా అత్తగారు పెట్టారు. ఐదోది కార్తీక దీపం రోజున ఇంటికి వచ్చావు మహా లక్ష్మిలా అంటూ మా మేనేజర్ వాళ్ళ అమ్మ గారు పెట్టినది.
భలే భలే.. నా సంబరానికి అసలు హద్దే లేదండీ బాబు. ఆఫీస్ వర్క్, అక్క బొజ్జలో ఉన్న చిట్టి చామంతితో కబుర్లు, తనకు సేవలు, మరో వైపు ఇంటి పని.. పెళ్లి పని.. హబ్బ! వీటి మూలంగా ఈ నెలంతా మీతో ఏమీ పంచుకోలేకపోయాను. కాని ఈ చీరల సంబరాన్ని మాత్రం అణుచుకోలేక ఇలా వచ్చేసా :)
ఏంటీ ఈ మాత్రానికే ఇంత సంబరమా అనుకుంటున్నారా? అయ్యో.. చీరల మీద నాకున్న ప్రేమ అట్లాంటిట్లాంటిది కాదండీ బాబు. స్కూల్ చదివే వయసులో అమ్మ నిద్రపోతూ ఉంటే.. నచ్చిన చీరలన్నీ బయటకు తీసేసి.. కట్టుకోవడం రాక చుట్టేసుకొని అమ్మ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిలబడి మహా మురిసిపోయేదాన్ని :D అమ్మ పైకి "చీరలన్నీ పాడు చేసేస్తున్నావ్ కదుటే" అంటూ కసిరి విసుక్కున్నా.. నా కంటే ఎక్కువ మురిసిపోయేది అలా నన్ను చూసి! ఏ విషయంలోనైనా అలిగి తల మీదుగా నీళ్ళు పోసేసుకుని మంచం కిందకో, డైనింగ్ టేబుల్ కిందకో దూరి ఊ రాగం పాడుతూ వెక్కిళ్ళు పెడితే కాసేపు ఊరుకొని తర్వాత నాకు నచ్చే చీర ఏదైనా తీసుకొని అమ్మ కూడా లోపలి దూరి వచ్చి "బంగారు కొడుకు కదూ.. ముద్దుల మూటమ్మా ఇదీ.. అంటూ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని, ప్రియమ్మకి ఇప్పుడు అమ్మ చీర కడుతుందిగా" అంటూ లాలించి బయటకు తీసుకొచ్చేది.
చెప్పాలంటే చాలా విషయాలున్నాయి కాని ఇప్పుడు రాయలేకపోతున్నా.. మరొక పోస్ట్లో రాస్తానే.. ఇప్పటికైతే నా ట్రీట్ ఖాతాలో ఈ చాక్లెట్లు తిని మీరూ ఆనందించండి :)
Google image
 
24 comments:

Chinni said...

:):):)

Priya said...

Daanardham yevitammaai? :) :D

ధాత్రి said...

అయితే మీరు తోక కాదు కోక తొక్కారు...:)

Priya said...

కోక అంటే??

srinivasarao vundavalli said...

చీరనే కోక అని కూడా అంటారు ప్రియ గారు.

ధాత్రి said...

cheeranDI..cheeranu koka ani kooda antaaru..:)

మధురవాణి said...

అబ్బో.. అయిదు చీరలే! అయితే తప్పకుండా చాక్లెట్లు పంచాల్సిన విషయమే.. కంగ్రాట్స్.. :))

thanooj said...

ee cheerala gurinchi entandi.guns gurinchi rayamani cheppaga meeku

Priya said...

@ శ్రీనివాస్ గారు: కృతజ్ఞతలండీ సందేహాన్ని తీర్చినందుకు.. :)
@ ధాత్రి గారు: కొత్త మాట నేర్పారు. థాంక్స్ :)

Priya said...

కదండీ.. థాంక్స్ :) :)

ఇదే మొదటిసారి మీ నుండి కామెంట్ అందుకోవడం. చాలా సంతోషం మధురవాణి గారు :)

Priya said...

హహ్హ్హహ్హా.. మీరు చెప్పిన దానికి నేను అప్పుడే బదులిచ్చేసాగా తనూజ్ గారు..? చదివినట్లు లేరు మీరు?!!

వనజవనమాలి said...

:) :} Bless you with too many sarees !!

Priya said...

Wow.. Vanajavanamaali gaaru.. thanks andee :D
Ye moohurthaana ee comment raasaro theliyadu gaani.. mee aashirvaadam nijamaindandee!! Ninnane naa nischithaardham kosamani maa akka oka cheera ni gift chesindi :) :)

haritha said...

Hi priya,

when r u writing ur lovestory- part -5 ? waiting for that eagerly

haritha said...

Hi Priya,
When r u posting ur lovestory part-5 .Waiting for that post

By the way congrats on ur engagement

Priya said...

Hi Haritha!
Thanks for your comment. I'll post it before the second week of December.

And regarding my engagement, we are planning to fix it in the month of Jan.

Abbaa.. appudu jaragaboye daaniki ippude cheera koneyaalaa ani aascharyapovaddhu.. ;) next month paapa puttaaka thanu bayataku vellaledhu kadaa anduke mundugaane ichhesindi :)

sndp said...

ha ah ..jan lo inko chera vastadi le..)

డేవిడ్ said...

బాగుంది.

కావ్యాంజలి said...

బాగుంది....సో, చీరలో ఎప్పుడు కనిపిస్తున్నారు ప్రియ గారు :)

Priya said...

Thanks andi :)

Priya said...

kadah.. :) :)

Priya said...

Thanks! hahhahahha.. thvaralo Kaavya gaaru :)

శోభ said...

అమ్మో.. అన్ని కోకలే.. అయితే మీరు కోకల పండగ చేసేసుకున్నారన్నమాట. కానివ్వండి కానివ్వండి.. :)

ఈ టపా ఎంత సరదాగా ఉందో చెప్పలేను. రాత శైలి సింప్లీ సూపర్బ్. చక్కగా ఆకట్టుకునేలా చిలిపిగా, సరదాగా ఉంది. నాకు భలేగా నచ్చేసిందండోయ్..

పసితనం అల్లర్లు.. సరదాలు, ముచ్చట్లు, అలకలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తిరిగిరాని బాల్యపు తీపి జ్ఞాపకాలే.. అవి ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా అందర్నీ అలా బాల్యంలోకి పరుగెత్తించాల్సిందే..

నేనూ అలా వెళ్లిపోయాను మీ పోస్టు చదువుతుంటే.. అభినందనలు..

ఇన్నాళ్లూ మీ బ్లాగును ఎలా మిస్సయ్యానో అర్థం కావటం లేదు.. ఇకపై తప్పక ఫాలో అవుతాను.

Priya said...

శోభ గారూ మీ అభినందనలకు, నా బ్లాగ్ మీకు నచ్చినందుకూ కృతజ్ఞతలు :)
మీరింత స్వీట్ గా ఉన్నారేంటండీ?!!! నా పోస్ట్లు కంటే మీ స్పందనలే బావున్నాయి చదువుతుంటే. థాంక్ యు వెరీ మచ్ ఒన్స్ అగైన్.. :) :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, November 27, 2012

చీరలు

అబ్బబ్బా.. ఈ నెల మొదట్లో నేను ఏ తోక... అహ తోకలు తొక్కే అవకాశమే లేదండీ.. అయితే గియితే బట్టలుతికేప్పుడు ఏ చీర కొంగో తొక్కుంటాను. అది ఏ కొంగు ప్రభావమో మరేమో గాని ఈ నెలలో అచ్చంగా 5 చీరలు సొంతమయ్యాయండి!!! అచ్చంగా అని ఎందుకన్నానంటే, నా దగ్గర 17 చీరలున్నా..  మా అక్కావాళ్ళింటికెళ్ళేడపుడు కావాలనే ఒక జత తక్కువ పట్టుకెపట్టుకెళ్లి (వీలైతే అసలేమి తీసుకెళ్లకుండానే.. :P ), వచ్చేడపుడు "అయ్యయో ఇప్పుడు వేసుకెళ్ళడానికి ఏమి లేవే.. హూ.. పోనిలే ఇంకేం చేస్తాను టైం అయిపోతోంది" అంటూ గబగబా కబోర్డ్ దగ్గరకెళ్ళి నచ్చిన చీర కట్టేసుకొని మళ్ళీ 2 నెలల వరకు వాళ్ళింటి వైపు కూడా తొంగి చూడను. ఈ లోపో, తర్వాతో అక్క ఇంటికొచ్చి గోల చేసి తీసుకెళ్ళిపోవడమో, అమ్మ చేత తెప్పించుకోవడమో చేస్తుంది. అలా కాకుండా అచ్చంగా నాకే ఐదు చీరలొచ్చాయి ఈ నెల.
మొదటి చీర మొన్న మా అక్క శ్రీమంతానికి అమ్మ కొనిచ్చింది. రెండోది వచ్చిన బంధువుల్లో ఒకరు కానుకగా ఇచ్చారు. మూడోది అక్కా వాళ్ళ అత్తింటి వాళ్ళు పెట్టారు. నాలుగోది దీపావళి సందర్భంగా మా అత్తగారు పెట్టారు. ఐదోది కార్తీక దీపం రోజున ఇంటికి వచ్చావు మహా లక్ష్మిలా అంటూ మా మేనేజర్ వాళ్ళ అమ్మ గారు పెట్టినది.
భలే భలే.. నా సంబరానికి అసలు హద్దే లేదండీ బాబు. ఆఫీస్ వర్క్, అక్క బొజ్జలో ఉన్న చిట్టి చామంతితో కబుర్లు, తనకు సేవలు, మరో వైపు ఇంటి పని.. పెళ్లి పని.. హబ్బ! వీటి మూలంగా ఈ నెలంతా మీతో ఏమీ పంచుకోలేకపోయాను. కాని ఈ చీరల సంబరాన్ని మాత్రం అణుచుకోలేక ఇలా వచ్చేసా :)
ఏంటీ ఈ మాత్రానికే ఇంత సంబరమా అనుకుంటున్నారా? అయ్యో.. చీరల మీద నాకున్న ప్రేమ అట్లాంటిట్లాంటిది కాదండీ బాబు. స్కూల్ చదివే వయసులో అమ్మ నిద్రపోతూ ఉంటే.. నచ్చిన చీరలన్నీ బయటకు తీసేసి.. కట్టుకోవడం రాక చుట్టేసుకొని అమ్మ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిలబడి మహా మురిసిపోయేదాన్ని :D అమ్మ పైకి "చీరలన్నీ పాడు చేసేస్తున్నావ్ కదుటే" అంటూ కసిరి విసుక్కున్నా.. నా కంటే ఎక్కువ మురిసిపోయేది అలా నన్ను చూసి! ఏ విషయంలోనైనా అలిగి తల మీదుగా నీళ్ళు పోసేసుకుని మంచం కిందకో, డైనింగ్ టేబుల్ కిందకో దూరి ఊ రాగం పాడుతూ వెక్కిళ్ళు పెడితే కాసేపు ఊరుకొని తర్వాత నాకు నచ్చే చీర ఏదైనా తీసుకొని అమ్మ కూడా లోపలి దూరి వచ్చి "బంగారు కొడుకు కదూ.. ముద్దుల మూటమ్మా ఇదీ.. అంటూ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని, ప్రియమ్మకి ఇప్పుడు అమ్మ చీర కడుతుందిగా" అంటూ లాలించి బయటకు తీసుకొచ్చేది.
చెప్పాలంటే చాలా విషయాలున్నాయి కాని ఇప్పుడు రాయలేకపోతున్నా.. మరొక పోస్ట్లో రాస్తానే.. ఇప్పటికైతే నా ట్రీట్ ఖాతాలో ఈ చాక్లెట్లు తిని మీరూ ఆనందించండి :)
Google image
 
24 comments:

 1. Daanardham yevitammaai? :) :D

  ReplyDelete
 2. అయితే మీరు తోక కాదు కోక తొక్కారు...:)

  ReplyDelete
  Replies
  1. కోక అంటే??

   Delete
  2. చీరనే కోక అని కూడా అంటారు ప్రియ గారు.

   Delete
  3. cheeranDI..cheeranu koka ani kooda antaaru..:)

   Delete
  4. @ శ్రీనివాస్ గారు: కృతజ్ఞతలండీ సందేహాన్ని తీర్చినందుకు.. :)
   @ ధాత్రి గారు: కొత్త మాట నేర్పారు. థాంక్స్ :)

   Delete
 3. అబ్బో.. అయిదు చీరలే! అయితే తప్పకుండా చాక్లెట్లు పంచాల్సిన విషయమే.. కంగ్రాట్స్.. :))

  ReplyDelete
  Replies
  1. కదండీ.. థాంక్స్ :) :)

   ఇదే మొదటిసారి మీ నుండి కామెంట్ అందుకోవడం. చాలా సంతోషం మధురవాణి గారు :)

   Delete
 4. ee cheerala gurinchi entandi.guns gurinchi rayamani cheppaga meeku

  ReplyDelete
  Replies
  1. హహ్హ్హహ్హా.. మీరు చెప్పిన దానికి నేను అప్పుడే బదులిచ్చేసాగా తనూజ్ గారు..? చదివినట్లు లేరు మీరు?!!

   Delete
 5. :) :} Bless you with too many sarees !!

  ReplyDelete
  Replies
  1. Wow.. Vanajavanamaali gaaru.. thanks andee :D
   Ye moohurthaana ee comment raasaro theliyadu gaani.. mee aashirvaadam nijamaindandee!! Ninnane naa nischithaardham kosamani maa akka oka cheera ni gift chesindi :) :)

   Delete
 6. Hi priya,

  when r u writing ur lovestory- part -5 ? waiting for that eagerly

  ReplyDelete
 7. Hi Priya,
  When r u posting ur lovestory part-5 .Waiting for that post

  By the way congrats on ur engagement

  ReplyDelete
  Replies
  1. Hi Haritha!
   Thanks for your comment. I'll post it before the second week of December.

   And regarding my engagement, we are planning to fix it in the month of Jan.

   Abbaa.. appudu jaragaboye daaniki ippude cheera koneyaalaa ani aascharyapovaddhu.. ;) next month paapa puttaaka thanu bayataku vellaledhu kadaa anduke mundugaane ichhesindi :)

   Delete
 8. ha ah ..jan lo inko chera vastadi le..)

  ReplyDelete
 9. బాగుంది....సో, చీరలో ఎప్పుడు కనిపిస్తున్నారు ప్రియ గారు :)

  ReplyDelete
  Replies
  1. Thanks! hahhahahha.. thvaralo Kaavya gaaru :)

   Delete
 10. అమ్మో.. అన్ని కోకలే.. అయితే మీరు కోకల పండగ చేసేసుకున్నారన్నమాట. కానివ్వండి కానివ్వండి.. :)

  ఈ టపా ఎంత సరదాగా ఉందో చెప్పలేను. రాత శైలి సింప్లీ సూపర్బ్. చక్కగా ఆకట్టుకునేలా చిలిపిగా, సరదాగా ఉంది. నాకు భలేగా నచ్చేసిందండోయ్..

  పసితనం అల్లర్లు.. సరదాలు, ముచ్చట్లు, అలకలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తిరిగిరాని బాల్యపు తీపి జ్ఞాపకాలే.. అవి ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా అందర్నీ అలా బాల్యంలోకి పరుగెత్తించాల్సిందే..

  నేనూ అలా వెళ్లిపోయాను మీ పోస్టు చదువుతుంటే.. అభినందనలు..

  ఇన్నాళ్లూ మీ బ్లాగును ఎలా మిస్సయ్యానో అర్థం కావటం లేదు.. ఇకపై తప్పక ఫాలో అవుతాను.

  ReplyDelete
  Replies
  1. శోభ గారూ మీ అభినందనలకు, నా బ్లాగ్ మీకు నచ్చినందుకూ కృతజ్ఞతలు :)