Friday, December 7, 2012

ప్రేమతో..

ఈ రోజు నాకెంతో ప్రత్యేకం, సంతోషకరం. నా మనసుతో పాటు జీవితాన్నీ చిరునవ్వులమయం చేసిన నా ముద్దుల మూట పుట్టిన రోజు ఈ రోజు. ముందుగా తనకు నా ప్రేమపూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు :) 

Google image

ఈ శుభ సందర్భాన మీరు కూడా  మీ మంచి మనసుతో.. నా అనూ (తననే కాదూ.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని కూడా పనిలోపనిగా జ్ఞాపకం చేసుకోండీ.. నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యానందాలతో భగవంతుని దయందు వర్ధిల్లాలని ఆశీర్వదించాల్సిందిగా  కోరుతున్నాను :)

మేమిద్దరం కలిసి సెలెబ్రేట్ చేసుకునే నాలుగో పుట్టిన రోజు ఇది. మొదటి ఏడాది ఒక గ్రీటింగ్ కార్డ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను (ఎందుకంటే అప్పటికి నాకు అంత స్పెషల్ ఏమీ కాదు). రెండో ఏడాది బహుమతిగా తనకోసం నాన్-వెజ్, అందునా చేపలు వండడం నేర్చుకొని నానా తిప్పలూ పడి బెరుకు బెరుకుగా ముట్టుకుంటూ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ, ఆ వాసన పడక వాంతొచ్చినట్లు అనిపించినా తల తిప్పుకొని ఇదిగో.. ఇలా కడిగేసి..చక్కగా ఇగురు పెట్టాను. వేడి వేడి అన్నం, చేపల ఇగురు తన కోసం, మొక్క జొన్న గింజలు నాకోసం బాక్సుల్లో పెట్టుకొని బీచ్కెళ్ళి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తీసుకెళ్ళినవి బయటకు తీసాను. ముందు ఆశ్చర్యపోయి "ఛీ ఛీ ఇంకెప్పుడు నాకోసమని గాని మరే కారణం చేత గాని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం లాటి పిచ్చి పనులు చేయకు" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అయిష్టంగానే తిన్నాడు. నా మొహమయితే పూర్తిగా మాడిపోయింది. "వావ్.. చేపల కూర నా కోసం చేసావా?! హౌ స్వీట్" అంటూ ఆవురావురుమని తింటాడు.. ఆ తర్వాత నా సన్మాన కార్యక్రమం ఘనంగా చేస్తాడనుకుంటే, ఇలా క్లాస్ పీకి మొహం ముప్పై మూడొంకరలు తిప్పుతున్నాడేవిటో నని తెగ ఇదై పోయాను. పోనీ తిన్నాక పొగుడుతాడులేనని నన్ను నేను ఒదార్చుకున్నాను కాని అలా జరగలేదు సరికదా నాకంటే దారుణంగా మొహం మాడ్చుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో అర్ధమై చావక, "కూర బాగోలేదో ఏమో ఖర్మం" అనుకుని కదిపితే కొట్టేస్తాడేమోనని మౌనంగా కూర్చున్నాను. కాసేపటికి పాపమనిపించిందోమో "కూర చాలా బాగుంది. కాని ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టుకోకు. నాకు నచ్చదు సరేనా" అంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు. ఆ క్షణాన నాకు అర్ధమవలేదు కాని అర్ధమయ్యాక తను మరింత నచ్చేసాడు. ఏదో తెలియని భావాలతో పెద్దగా మాట్లాడుకోలేకపోయినా మరచిపోలేని అనుభూతిని సొంతం చేసుకున్నాం ఆ వేళ.

మూడో ఏడాది, అర్ధ రాత్రి బీచ్ లో కేక్ కట్ చేయించాలని భారీగా ప్లాన్ చేసాను గాని చెప్తే ఇంట్లో తంతారు. ఇంట్లో వాళ్ళ సంగతేమో గాని ముందు అనూనే ఉతికి ఆరేస్తాడు. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని బుద్ధిగా "రేపు ఉదయం ఐదు గంటలకు రా జాగింగ్కి వెళదాం" అని అసలు విషయాన్ని చెప్పకుండా "ఊ" అనే వరకు ఊరుకోకుండా విసిగించాను. "ఆ అది లేచినప్పుడులే" అనుకుని సరే అన్నాడట! నేనేమో నాలుగింటికే  ఫోన్లు చేసి ప్రాణాలు తోడేసాను. చివరకి, కాంపస్లో ఆ టైంకి బైక్ తీస్తే బయటకు రానివ్వరని పాపం ఆ చలిలో వణుక్కుంటూ సైకిల్ మీద గంటన్నర ప్రయాణం చేసి 5.30 కి చేరుకున్నాడు. ఇటు నేనేమో తనకు ఆకలేస్తుంది కదా బ్రేక్ ఫాస్ట్ కూడా తీసుకెళదామని ఆ పని కూడా ముగించుకునే సరికి 5.30 అయిపోయింది. కేకు, కాండల్, బ్రేక్ ఫాస్ట్, వాటర్ అన్నీ బాగ్ లో పెట్టుకొని గేటు దగ్గరకు వచ్చాక గుర్తొచ్చింది. అగ్గి పెట్టె మర్చిపోయానని! మళ్ళీ లోపలికి వెళ్లాను. అనూ ఏమో ఫోనులో తిట్లు "త్వరగా రా త్వరగా రా అని అర్ధరాత్రి నుండి గోల చేసి లేపేసి తీరా కష్టపడి ఇంత దూరం సైకిల్ తొక్కుకుంటూ వస్తే గంటయినా దేవీ గారు బయటకు రారు .. ... ... .." అని. అసలే ఎక్కడ తెల్లారిపోతుందోనని కంగారు పడుతూ పరుగులు పెడుతున్నానా.. అసలు ఎప్పుడైనా ఇంత పొద్దున్న లేచి ఉంటానా? ఎగ్జామ్స్ అప్పుడు అమ్మ, చెంబుడు నీళ్ళు మొహాన కొట్టి లేవవే లే అని అరిచి గీ పెట్టినా లేచానా??!! మొహం తుడుచుకొని అటు తిరిగి పడుకొనిపోలేదు.. హుం.. ఇప్పుడు ప్రేమ కొద్దీ సర్ప్రైస్ ఇద్దామని నాకు నేను గా లేచి ఇంత చేస్తే అర్ధం చేసుకోవట్లేదు చూడు అని బాగా బాధ పడ్డాను (ఈ విషయాలేవీ తనకు తెలియవుగా నన్న స్పృహ కూడా లేకుండా పోయింది నాకు :P ). ఎలాగో అవన్నీ మోసుకుంటూ ఆపసోపనాలు పడి ఐదూ నలభై ఐదుకి తనని చేరుకున్నాను. ముందు ఒక వింతగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి తరువాత కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయాడు. "అమ్మో తెల్లారిపోతోంది త్వరగా కట్ చెయ్" అని తొందరపెడితే తేరుకుని కేక్ కట్ చేసి నాకు తినిపించి తనూ తిన్నాడు :). మరి ఈ ఏడాదేమో తను వాళ్ళింట్లో... నేను ఇక్కడ :(  

ఇన్నేళ్ళలో ఎన్నో ముచ్చట్లు, సరదా తగాదాలు, చిన్న చిన్న అపార్ధాలు, అంతులేని ఆనందాలు, ఏవేవో ఊసులు, అందమైన అనుభవాలు... అధ్బుతం గడిచాయి రోజులన్నీ. నేనెన్నడు అనుకోలేదు నా జీవితం ఇంత రంగులమయంగా మారుతుందని! దేవుడు నాకెన్నో బహుమానాలిచ్చాడు.. కాని అనూ తో నా బంధమనే బహుమానం మాత్రం చాలా అమూల్యం, అపురూపం, ప్రత్యేకం. నేను శాశ్వతంగా నిద్రించే వరకు ఈ "అను"బంధాన్ని ఇంతే అందంగా ఉంచమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 

నేను అల్లరి చేస్తున్నపుడు చంటిపిల్లాడై నాతో ఆడతాడు.. అది శృతి మించినపుడు నాన్నలా మందలిస్తాడు. కలతచెంది కన్నీరు పెట్టినపుడు అమ్మలా ఆప్యాయంగా ఆదరించి,  తోబుట్టువులా ఓదారుస్తాడు. స్నేహితుడిలా మదిలోని సంగతులన్నీ పంచుకుంటాడు..తన చిలిపి చేష్టలతో మనసుకి చక్కిలిగింతలు పెడతాడు. ఇంతకంటే ఏం కావాలి? నేను కోరుకున్నంతకంటే గొప్ప మనస్తత్వమున్న, ప్రేమించగలిగిన తోడు దొరికింది నాకు!! ఈ విషయంలో మరోసారి దేవునికీ, మా అత్తమామ గార్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను (అంత చక్కగా అతన్ని తీర్చిదిద్దినందుకు). 

25 comments:

Vamsi said...

Nice. I wish him a very happy birthday & all the success.

Sri Latha said...

Sweet....... :D Bharath gaaru may your birthday be filled with sunshine and smiles, laughter, love, and cheer.

Saregani mundu me premayanam part 5 eppudu post chestaro cheppandi meru. Asalaa sangathe gurtunnattu lede meku?

Priya said...

Thank you very much, Vamsi gaaru :) :)
First comment meedhe. Aa intha poddhunne yevaru chadivuntaaru le anukuntune sign in chesaanu.. choosthe 2 comments! Thank you once again :)

Priya said...

Intha andham gaa wish chesinanduku chaalaa chaalaa thanks Latha gaaru. Marachipoledhu.. part 5 thvaralone post chesesthaanu :)

జలతారువెన్నెల said...

Birthday wishes to your husband.

చిన్ని ఆశ said...

చాలా అదృష్టవంతులు మీరు.
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అంతటి "అపురూపం" జీవితాన దక్కదు. మరింత అపురూపంగా జీవితాంతం కాపాడుకోంది.
అభినందనలు!

Priya said...

Thanks a lot :)

Priya said...

నిజమే పండు గారు.. ఏ జన్మలో ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నానో గాని... ఇంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. మీ అభినందనలకు సంపూర్ణ హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Harsha said...

Many more happy returns of the day Bharath garu!

srinivasarao vundavalli said...

Many more happy returns of the day to Anu!!

Priya said...

Thanks!

Priya said...

Thank you very much Srinivas gaaru :)

రాజ్ కుమార్ said...

పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ అభినందనలు ;)

ధాత్రి said...

మీ అనుబంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మా కిట్టయ్యకి చెప్పేసానండోయ్..
మీ 'అనూ' గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు...:)

శోభ said...

ఓ చంటిపిల్లాడిలా, నాన్నలా, అమ్మలా, తోబుట్టువులా, స్నేహితుడిలా... ఉండే భర్త దొరకడం ఓ వరం.. ఆ వరం అందరికీ దక్కదు.. ఆ వరాన్ని పొందిన మీరు అదృష్టవంతులు.. ఇంతలా ప్రేమించే భార్య దొరికిన మీవారు అంతకుమించిన అదృష్టవంతులు..

మీ అనుబంధం ఇలాగే కలకాలం వర్థిల్లాలని.. మీ జంట ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీవారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రియగారు.. :)

Priya said...

@ రాజ్ గారు & ధాత్రి గారు: కృతజ్ఞతలండీ :) :)

Priya said...

మీ ఆశీర్వచనాలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శోభ గారు :)
మీరు టపాలే కాదు..వాక్యలు కూడా అద్భుతంగా రాస్తున్నారు. ఎలా అంటే.. మనసుని తాకేలా.. :)

thanooj said...

life long meerilagey innocent(no offense) gaa undaalani korukuntoo

Anonymous said...

మీకు, మీ వారికి నా అభినందనలు. మరిన్ని ఆనందకరమైన రోజులు మీవి కావాలని కోరుకుంటూ..

-దీరు

Priya said...

Hahhahhahahaa... Thanks!

Priya said...

మీ అభినందనలకు కృతజ్ఞతలు దీరు గారు :)

sndp said...

belated happy bday bharath...
party matram ma priya ivali..:p

డేవిడ్ said...

belated happy birth day.....i wish him all success.

Priya said...

@ సందీప్: ఓయ్.. ఇది మరీ బావుంది. భరత్ కే కదా విషెస్ చెప్పావూ తననే పార్టీ అడుగు. ఇస్తానంటే నన్ను కూడా పిలువు జాయిన్ అవుతా ;) :P

@ డేవిడ్ గారు: ఆ అయిపోయిందిగా ఇప్పుడెందుకు విషెస్ చెప్పడం అనుకోకుండా ఓపికతో కామెంట్ పెట్టారు. చాలా కృతజ్ఞతలండీ మీ అభినందనలకు :)

కావ్యాంజలి said...

Hai priya gaaru....Belated Birthday wishes to bharath gaaru...

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, December 7, 2012

ప్రేమతో..

ఈ రోజు నాకెంతో ప్రత్యేకం, సంతోషకరం. నా మనసుతో పాటు జీవితాన్నీ చిరునవ్వులమయం చేసిన నా ముద్దుల మూట పుట్టిన రోజు ఈ రోజు. ముందుగా తనకు నా ప్రేమపూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు :) 

Google image

ఈ శుభ సందర్భాన మీరు కూడా  మీ మంచి మనసుతో.. నా అనూ (తననే కాదూ.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని కూడా పనిలోపనిగా జ్ఞాపకం చేసుకోండీ.. నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యానందాలతో భగవంతుని దయందు వర్ధిల్లాలని ఆశీర్వదించాల్సిందిగా  కోరుతున్నాను :)

మేమిద్దరం కలిసి సెలెబ్రేట్ చేసుకునే నాలుగో పుట్టిన రోజు ఇది. మొదటి ఏడాది ఒక గ్రీటింగ్ కార్డ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను (ఎందుకంటే అప్పటికి నాకు అంత స్పెషల్ ఏమీ కాదు). రెండో ఏడాది బహుమతిగా తనకోసం నాన్-వెజ్, అందునా చేపలు వండడం నేర్చుకొని నానా తిప్పలూ పడి బెరుకు బెరుకుగా ముట్టుకుంటూ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ, ఆ వాసన పడక వాంతొచ్చినట్లు అనిపించినా తల తిప్పుకొని ఇదిగో.. ఇలా కడిగేసి..చక్కగా ఇగురు పెట్టాను. వేడి వేడి అన్నం, చేపల ఇగురు తన కోసం, మొక్క జొన్న గింజలు నాకోసం బాక్సుల్లో పెట్టుకొని బీచ్కెళ్ళి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తీసుకెళ్ళినవి బయటకు తీసాను. ముందు ఆశ్చర్యపోయి "ఛీ ఛీ ఇంకెప్పుడు నాకోసమని గాని మరే కారణం చేత గాని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం లాటి పిచ్చి పనులు చేయకు" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అయిష్టంగానే తిన్నాడు. నా మొహమయితే పూర్తిగా మాడిపోయింది. "వావ్.. చేపల కూర నా కోసం చేసావా?! హౌ స్వీట్" అంటూ ఆవురావురుమని తింటాడు.. ఆ తర్వాత నా సన్మాన కార్యక్రమం ఘనంగా చేస్తాడనుకుంటే, ఇలా క్లాస్ పీకి మొహం ముప్పై మూడొంకరలు తిప్పుతున్నాడేవిటో నని తెగ ఇదై పోయాను. పోనీ తిన్నాక పొగుడుతాడులేనని నన్ను నేను ఒదార్చుకున్నాను కాని అలా జరగలేదు సరికదా నాకంటే దారుణంగా మొహం మాడ్చుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో అర్ధమై చావక, "కూర బాగోలేదో ఏమో ఖర్మం" అనుకుని కదిపితే కొట్టేస్తాడేమోనని మౌనంగా కూర్చున్నాను. కాసేపటికి పాపమనిపించిందోమో "కూర చాలా బాగుంది. కాని ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టుకోకు. నాకు నచ్చదు సరేనా" అంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు. ఆ క్షణాన నాకు అర్ధమవలేదు కాని అర్ధమయ్యాక తను మరింత నచ్చేసాడు. ఏదో తెలియని భావాలతో పెద్దగా మాట్లాడుకోలేకపోయినా మరచిపోలేని అనుభూతిని సొంతం చేసుకున్నాం ఆ వేళ.

మూడో ఏడాది, అర్ధ రాత్రి బీచ్ లో కేక్ కట్ చేయించాలని భారీగా ప్లాన్ చేసాను గాని చెప్తే ఇంట్లో తంతారు. ఇంట్లో వాళ్ళ సంగతేమో గాని ముందు అనూనే ఉతికి ఆరేస్తాడు. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని బుద్ధిగా "రేపు ఉదయం ఐదు గంటలకు రా జాగింగ్కి వెళదాం" అని అసలు విషయాన్ని చెప్పకుండా "ఊ" అనే వరకు ఊరుకోకుండా విసిగించాను. "ఆ అది లేచినప్పుడులే" అనుకుని సరే అన్నాడట! నేనేమో నాలుగింటికే  ఫోన్లు చేసి ప్రాణాలు తోడేసాను. చివరకి, కాంపస్లో ఆ టైంకి బైక్ తీస్తే బయటకు రానివ్వరని పాపం ఆ చలిలో వణుక్కుంటూ సైకిల్ మీద గంటన్నర ప్రయాణం చేసి 5.30 కి చేరుకున్నాడు. ఇటు నేనేమో తనకు ఆకలేస్తుంది కదా బ్రేక్ ఫాస్ట్ కూడా తీసుకెళదామని ఆ పని కూడా ముగించుకునే సరికి 5.30 అయిపోయింది. కేకు, కాండల్, బ్రేక్ ఫాస్ట్, వాటర్ అన్నీ బాగ్ లో పెట్టుకొని గేటు దగ్గరకు వచ్చాక గుర్తొచ్చింది. అగ్గి పెట్టె మర్చిపోయానని! మళ్ళీ లోపలికి వెళ్లాను. అనూ ఏమో ఫోనులో తిట్లు "త్వరగా రా త్వరగా రా అని అర్ధరాత్రి నుండి గోల చేసి లేపేసి తీరా కష్టపడి ఇంత దూరం సైకిల్ తొక్కుకుంటూ వస్తే గంటయినా దేవీ గారు బయటకు రారు .. ... ... .." అని. అసలే ఎక్కడ తెల్లారిపోతుందోనని కంగారు పడుతూ పరుగులు పెడుతున్నానా.. అసలు ఎప్పుడైనా ఇంత పొద్దున్న లేచి ఉంటానా? ఎగ్జామ్స్ అప్పుడు అమ్మ, చెంబుడు నీళ్ళు మొహాన కొట్టి లేవవే లే అని అరిచి గీ పెట్టినా లేచానా??!! మొహం తుడుచుకొని అటు తిరిగి పడుకొనిపోలేదు.. హుం.. ఇప్పుడు ప్రేమ కొద్దీ సర్ప్రైస్ ఇద్దామని నాకు నేను గా లేచి ఇంత చేస్తే అర్ధం చేసుకోవట్లేదు చూడు అని బాగా బాధ పడ్డాను (ఈ విషయాలేవీ తనకు తెలియవుగా నన్న స్పృహ కూడా లేకుండా పోయింది నాకు :P ). ఎలాగో అవన్నీ మోసుకుంటూ ఆపసోపనాలు పడి ఐదూ నలభై ఐదుకి తనని చేరుకున్నాను. ముందు ఒక వింతగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి తరువాత కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయాడు. "అమ్మో తెల్లారిపోతోంది త్వరగా కట్ చెయ్" అని తొందరపెడితే తేరుకుని కేక్ కట్ చేసి నాకు తినిపించి తనూ తిన్నాడు :). మరి ఈ ఏడాదేమో తను వాళ్ళింట్లో... నేను ఇక్కడ :(  

ఇన్నేళ్ళలో ఎన్నో ముచ్చట్లు, సరదా తగాదాలు, చిన్న చిన్న అపార్ధాలు, అంతులేని ఆనందాలు, ఏవేవో ఊసులు, అందమైన అనుభవాలు... అధ్బుతం గడిచాయి రోజులన్నీ. నేనెన్నడు అనుకోలేదు నా జీవితం ఇంత రంగులమయంగా మారుతుందని! దేవుడు నాకెన్నో బహుమానాలిచ్చాడు.. కాని అనూ తో నా బంధమనే బహుమానం మాత్రం చాలా అమూల్యం, అపురూపం, ప్రత్యేకం. నేను శాశ్వతంగా నిద్రించే వరకు ఈ "అను"బంధాన్ని ఇంతే అందంగా ఉంచమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 

నేను అల్లరి చేస్తున్నపుడు చంటిపిల్లాడై నాతో ఆడతాడు.. అది శృతి మించినపుడు నాన్నలా మందలిస్తాడు. కలతచెంది కన్నీరు పెట్టినపుడు అమ్మలా ఆప్యాయంగా ఆదరించి,  తోబుట్టువులా ఓదారుస్తాడు. స్నేహితుడిలా మదిలోని సంగతులన్నీ పంచుకుంటాడు..తన చిలిపి చేష్టలతో మనసుకి చక్కిలిగింతలు పెడతాడు. ఇంతకంటే ఏం కావాలి? నేను కోరుకున్నంతకంటే గొప్ప మనస్తత్వమున్న, ప్రేమించగలిగిన తోడు దొరికింది నాకు!! ఈ విషయంలో మరోసారి దేవునికీ, మా అత్తమామ గార్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను (అంత చక్కగా అతన్ని తీర్చిదిద్దినందుకు). 

25 comments:

 1. Vamsi7/12/12

  Nice. I wish him a very happy birthday & all the success.

  ReplyDelete
  Replies
  1. Thank you very much, Vamsi gaaru :) :)
   First comment meedhe. Aa intha poddhunne yevaru chadivuntaaru le anukuntune sign in chesaanu.. choosthe 2 comments! Thank you once again :)

   Delete
 2. Sweet....... :D Bharath gaaru may your birthday be filled with sunshine and smiles, laughter, love, and cheer.

  Saregani mundu me premayanam part 5 eppudu post chestaro cheppandi meru. Asalaa sangathe gurtunnattu lede meku?

  ReplyDelete
  Replies
  1. Intha andham gaa wish chesinanduku chaalaa chaalaa thanks Latha gaaru. Marachipoledhu.. part 5 thvaralone post chesesthaanu :)

   Delete
 3. చాలా అదృష్టవంతులు మీరు.
  ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అంతటి "అపురూపం" జీవితాన దక్కదు. మరింత అపురూపంగా జీవితాంతం కాపాడుకోంది.
  అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. నిజమే పండు గారు.. ఏ జన్మలో ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నానో గాని... ఇంత గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. మీ అభినందనలకు సంపూర్ణ హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

   Delete
 4. Harsha7/12/12

  Many more happy returns of the day Bharath garu!

  ReplyDelete
 5. Many more happy returns of the day to Anu!!

  ReplyDelete
  Replies
  1. Thank you very much Srinivas gaaru :)

   Delete
 6. పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ అభినందనలు ;)

  ReplyDelete
 7. మీ అనుబంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మా కిట్టయ్యకి చెప్పేసానండోయ్..
  మీ 'అనూ' గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు...:)

  ReplyDelete
 8. ఓ చంటిపిల్లాడిలా, నాన్నలా, అమ్మలా, తోబుట్టువులా, స్నేహితుడిలా... ఉండే భర్త దొరకడం ఓ వరం.. ఆ వరం అందరికీ దక్కదు.. ఆ వరాన్ని పొందిన మీరు అదృష్టవంతులు.. ఇంతలా ప్రేమించే భార్య దొరికిన మీవారు అంతకుమించిన అదృష్టవంతులు..

  మీ అనుబంధం ఇలాగే కలకాలం వర్థిల్లాలని.. మీ జంట ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీవారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రియగారు.. :)

  ReplyDelete
  Replies
  1. మీ ఆశీర్వచనాలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శోభ గారు :)
   మీరు టపాలే కాదు..వాక్యలు కూడా అద్భుతంగా రాస్తున్నారు. ఎలా అంటే.. మనసుని తాకేలా.. :)

   Delete
 9. @ రాజ్ గారు & ధాత్రి గారు: కృతజ్ఞతలండీ :) :)

  ReplyDelete
 10. life long meerilagey innocent(no offense) gaa undaalani korukuntoo

  ReplyDelete
 11. Anonymous8/12/12

  మీకు, మీ వారికి నా అభినందనలు. మరిన్ని ఆనందకరమైన రోజులు మీవి కావాలని కోరుకుంటూ..

  -దీరు

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు కృతజ్ఞతలు దీరు గారు :)

   Delete
 12. belated happy bday bharath...
  party matram ma priya ivali..:p

  ReplyDelete
 13. belated happy birth day.....i wish him all success.

  ReplyDelete
 14. @ సందీప్: ఓయ్.. ఇది మరీ బావుంది. భరత్ కే కదా విషెస్ చెప్పావూ తననే పార్టీ అడుగు. ఇస్తానంటే నన్ను కూడా పిలువు జాయిన్ అవుతా ;) :P

  @ డేవిడ్ గారు: ఆ అయిపోయిందిగా ఇప్పుడెందుకు విషెస్ చెప్పడం అనుకోకుండా ఓపికతో కామెంట్ పెట్టారు. చాలా కృతజ్ఞతలండీ మీ అభినందనలకు :)

  ReplyDelete
 15. Hai priya gaaru....Belated Birthday wishes to bharath gaaru...