Wednesday, December 19, 2012

ఓ వర్షం కురిసిన ఉదయం

నిద్రపోతున్న నా మొహాన్ని తెల్లగా తెల్లారకుండానే వచ్చి ముద్దాడుతున్న నీటి ముత్యాలను దుప్పటితో తుడిచేసుకొని కళ్ళు తెరవకుండానే "అమ్మా.. లాస్ట్ 10 మినిట్స్ ప్లీజ్.." అనేసి అటు వైపు తిరిగి  మత్తుగా ముడుచుకుని పడుకునేలోపు తట్టింది నా బుర్రకి. ఈ రోజు శనివారం కదా అమ్మ లేపదుగా?!! గాజుల శబ్దమూ రాలేదు.. "ప్రియమ్మా..." అన్న పిలుపూ వినబడలేదు! అంటే అమ్మ లేపలేదు. ఇంకెవ్వరు నన్ను లేపే ఛాన్స్ లేదు. ఆలోచిస్తుండగానే చిటపట చినుకుల రాగం చెవులను తాకింది. ఏంటి నిజంగా వర్షమా?! ఇది వర్షాకాలం కాదే.. హూం.. నేనున్నది  చెన్నైలో కదూ..! చప్పున ఇటు తిరిగి కిటికీ లోనుండి చూస్తే హోరున వర్షం.. అప్పటి వరకు అటు తిరిగి పడుకున్నందువల్ల నా తలా.. దుప్పటీ కాస్త తడిచాయి. నా మొహం మండిపోను.. స్పర్శ కూడా తెలిసిచావలేదే నాకు.. అనుకుంటూ లేచి కిందకు వెళ్లాను. 

అమ్మ కూడా ఇంకా లేవలేదు కాబోలు ఇంట్లో అలికిడే లేదు. హల్లో సోఫామీద మడత పెట్టి ఉంచిన దుప్పటి తీసి భుజాల మీదుగా కప్పుకొని టీవీ మీద ఉన్న కెమెరా పట్టుకొని వరండాలో కాళ్ళలో మొహం దాచుకొని కూర్చున్నాను. ఈ సమయంలో శ్రావ్యమైన సంగీతమూ వినగలిగితే.. ఎంత బావుణ్నో.. కాని లేచి వెళ్లి తెచ్చుకోవడానికి బద్ధకం. చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు  మూసుకున్నాను. నేను ఆశించినదానికన్నా మెల్లని  సంగీతం చెవిన పడుతోంది. అల్లంత దూరం నుండి ఎప్పుడెపుడు భూదేవిని ముద్దాడదామా అని దూసుకొస్తున్న చినుకుల శబ్దం నాలో ఉత్తేజాన్ని పెంచింది. ఆ అపురూప దృశ్యాన్ని చూడాలని కళ్ళు తెరిచాను. లేలేత ఆకులను.. విరిసీ విరియని పువ్వులను సుతిమెత్తంగా ముద్దాడుతున్న చినుకులని చూసి ముచ్చట పడి నాకు కనువిందుచేసిన కొన్ని దృశ్యాలను నా కెమెరాలో బంధించానిలా.. మీరు కూడా ఓ లూక్కేయండి మరి :)అప్పటికే వర్షం ఆగిపోయి కాస్త తుపర మాత్రం పడుతూవుంది అంతే. ఇక ఆగలేక.. మరిన్ని అందాలు చూడాలని సైకిల్ తీసుకొని బయటకు వెళ్లాను. ఎవ్వరు లేరు.. గాలికి ఊగి ఊగి అలసిపోయిన చెట్లు, నేల రాలిన పువ్వులనూ చూస్తూ కాస్త ముందుకెళితే.. బీచ్లోని అలలు ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించాయి. వాటిని నేను నేను వర్ణించలేను. నా బుద్ధి చాలదు. కనురెప్ప వేయకుండా చూస్తూ కూర్చుండిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో మరి.. క్రికెట్ ఆడుకోవడానికి వచ్చిన పిల్లల అరుపులతో తేరుకొని ఇంటి దారి పట్టి వస్తుంటే ఇదిగో.. ఈ కాకి కనిపించింది. ఎంత ముద్దుగా ఉందోనని ఫోటో తీసుకుని మా ఇంటి సందులోకి నడిచాను.

 కాని మా వీధి నా మీద అలిగింది. అన్నిటిని చూసి మురుసుకుని ఫోటోలు తీసి దాచుకున్నావ్ గాని నన్ను పట్టించుకోలేదని! నిన్ను మరువగలనా అంటూ దాన్నీ క్లిక్మనిపించాను.. :) :)

32 comments:

Chinni said...

బావుందామ్మాయి నీ ఫోటోగ్ర్రఫి..

Priya said...

థాంక్ యూ.. థాంక్ యు :D

ధాత్రి said...

బాగుంది ప్రియ.
చిటపట చినుకుల ఉదయ రాగం..:)

Priya said...

నచ్చింది కదా.. నేను హ్యాపీ అండీ :)

చెప్పాలంటే...... said...

Photos baavunnayi tapaato paatu gaa

Priya said...

Mallee yennaallaku vachhaaru Manju gaaru.. thanks andi mee raakaku, vaakhya ku :)

Madhu Mohan said...

"ఓ వర్షం కురిసిన రాత్రి .." అని "జంబలకిడిపంబ" సినిమాలో బ్రహ్మానందం చెప్పే డయలాగ్ గుర్తుకొచ్చింది.

Priya said...

అవునా..?! ఏమోనండి నేనా సినిమా పూర్తిగా చూడలేదు.. ఎన్నో సార్లు అనుకున్నాను చూడాలని. ప్చ్.. కుదరలేదు :(

డేవిడ్ said...

బాగుంది..

Anne SreeKanth said...

Me Photos awesome andi ...

Madhu Mohan said...

ఇక్కడ చూడండి.

http://www.youtube.com/watch?v=xUyWWg5f8wk

Priya said...

Thanks andi.. :)

Priya said...

థాంక్స్ మధు గారు :)

Priya said...

చాలా రోజుల తర్వాత కనిపించారు..! మీ వాఖ్యకు కృతజ్ఞతలు శ్రీకాంత్ గారు :)

Green Star said...

సూపర్ ఫోటోగ్రఫీ, వాటిని వర్ణించిన విధానం ఇంకా బాగుంది. ఇక నేను కూడా ఇలా ప్రక్రుతి సింగారించుకున్నప్పుడల్లా ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాను :)

Mee Sahitee Nestam rajavali said...

ma veedhi naa meeda aligindi. wah nice expression. prakruthi paravasyamaina me aksharala nadaka nice

sndp said...

vammo pics giyadame kadu,snaps kuda baga tistavanamata..ma

superb...

Priya said...

థాంక్స్ గ్రీన్ స్టార్ గారు!
నిర్ణయించేసుకున్నారు కదా.. మీరు ఫోటోలు తీసిన తర్వాత నాకూ చూయించండేం? మర్చిపోకూడదు మరి?

Green Star said...

ఓ, తప్పకుండ, కాని ఇప్పుడు ఇక్కడ చలి కాలం, మంచు పడుతుంది. ఎటు చూసినా ఆకులు రాలిన చెట్లే, తెల్లటి తెలుపే !! అయినా ప్రయత్నిస్తాను.

Priya said...

నా బ్లాగుకి స్వాగతమండీ :)
అలాగే నా అక్షరాల నడకను ఆస్వాదించి మీరు చేసిన వాఖ్యకు కృతజ్ఞతలు.

Priya said...

నచ్చినవన్నీ ఏదో ఒక రూపంలో దాచుకుంటుంటాను సందీప్. అందులో ఇదొక విధం :)
మీకూ నచ్చుతున్నాయిగా.. ఖుషీ ఖుషీ :D

Priya said...

అందులోనూ ఓ అందముంటుంది కదండీ.. వీలు చిక్కినపుడు ప్రయత్నించి ఫొటోస్ పంపండి :)

వనజవనమాలి said...

Manchi hobby! pics superb.

Priya said...

మీ మెచ్చుకోలుకి కృతజ్ఞతలు వనజవనమాలి గారు :)

శోభ said...

ఫొటోలు ఎంత బాగున్నాయో.. చూస్తుంటేనే వర్షంలో తడుస్తున్నంత హాయిగా ఉన్నాయి ఫొటోలు. ప్రతిదీ ఒకదానికొకటి పోటీ పడేలా ఉన్నాయి. అన్నట్టు మీ వీధి కూడా సూపర్బ్ ప్రియా.. నైస్ పోస్ట్... :)

Priya said...

థాంక్స్ శోభ గారు :)
మీకూ మా వీధి నచ్చిందన్నమాట.. మరింకెందుకు ఆలస్యం?
వచ్చేయండి ఓ మంచి రోజు చూసి :)

malli said...

న పేరు దుర్గ మల్లేశ్వర్ మీ గ్నపకాలు బగునాఇ

Priya said...

మీ స్పందనకు కృతజ్ఞతలు దుర్గ మల్లేశ్వర్ గారు :)

ఒక తెలుగింటి అబ్బాయి said...

ఫొటొస్... మీ అభిరుచులు.. ప్రేమ కబుర్లు...చీరల కబుర్లు..అన్ని అద్భుథః ...
మీ ప్రేమ కబుర్లు మద్యలో ఆపేసారేం .. చెప్పండి త్వరగా..
అవును మీరు చివరగ ఉంచిన ఆ వీధి ఫొటొ చాల చాల బాగుంది .. అసలు అది చెన్నైయేనా అని అనుమానం వచ్చింది...

Priya said...

తెలుగింటి అబ్బాయి గారు.. మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్ అండీ :)
పెళ్లి పనుల్లో బిజీ గా ఉండి ప్రేమ కబుర్లకు చిన్న బ్రేక్ ఇచ్చాను. త్వరలోనే పార్ట్ 7 పోస్ట్ చేస్తా.

మాది సౌత్ చెన్నై అండీ.. బీచ్ పక్కనే మా ఇల్లు. అందునా ఉదయాన్నే తుపర పడుతుండగా ఫోటో తీశానేమో చాలా ప్లెజెంట్ గా కనబడుతోంది :)

MURALI said...

మీ వీధి భలే ఉందండి.

Priya said...

థాంక్స్ మురళి గారు :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Wednesday, December 19, 2012

ఓ వర్షం కురిసిన ఉదయం

నిద్రపోతున్న నా మొహాన్ని తెల్లగా తెల్లారకుండానే వచ్చి ముద్దాడుతున్న నీటి ముత్యాలను దుప్పటితో తుడిచేసుకొని కళ్ళు తెరవకుండానే "అమ్మా.. లాస్ట్ 10 మినిట్స్ ప్లీజ్.." అనేసి అటు వైపు తిరిగి  మత్తుగా ముడుచుకుని పడుకునేలోపు తట్టింది నా బుర్రకి. ఈ రోజు శనివారం కదా అమ్మ లేపదుగా?!! గాజుల శబ్దమూ రాలేదు.. "ప్రియమ్మా..." అన్న పిలుపూ వినబడలేదు! అంటే అమ్మ లేపలేదు. ఇంకెవ్వరు నన్ను లేపే ఛాన్స్ లేదు. ఆలోచిస్తుండగానే చిటపట చినుకుల రాగం చెవులను తాకింది. ఏంటి నిజంగా వర్షమా?! ఇది వర్షాకాలం కాదే.. హూం.. నేనున్నది  చెన్నైలో కదూ..! చప్పున ఇటు తిరిగి కిటికీ లోనుండి చూస్తే హోరున వర్షం.. అప్పటి వరకు అటు తిరిగి పడుకున్నందువల్ల నా తలా.. దుప్పటీ కాస్త తడిచాయి. నా మొహం మండిపోను.. స్పర్శ కూడా తెలిసిచావలేదే నాకు.. అనుకుంటూ లేచి కిందకు వెళ్లాను. 

అమ్మ కూడా ఇంకా లేవలేదు కాబోలు ఇంట్లో అలికిడే లేదు. హల్లో సోఫామీద మడత పెట్టి ఉంచిన దుప్పటి తీసి భుజాల మీదుగా కప్పుకొని టీవీ మీద ఉన్న కెమెరా పట్టుకొని వరండాలో కాళ్ళలో మొహం దాచుకొని కూర్చున్నాను. ఈ సమయంలో శ్రావ్యమైన సంగీతమూ వినగలిగితే.. ఎంత బావుణ్నో.. కాని లేచి వెళ్లి తెచ్చుకోవడానికి బద్ధకం. చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు  మూసుకున్నాను. నేను ఆశించినదానికన్నా మెల్లని  సంగీతం చెవిన పడుతోంది. అల్లంత దూరం నుండి ఎప్పుడెపుడు భూదేవిని ముద్దాడదామా అని దూసుకొస్తున్న చినుకుల శబ్దం నాలో ఉత్తేజాన్ని పెంచింది. ఆ అపురూప దృశ్యాన్ని చూడాలని కళ్ళు తెరిచాను. లేలేత ఆకులను.. విరిసీ విరియని పువ్వులను సుతిమెత్తంగా ముద్దాడుతున్న చినుకులని చూసి ముచ్చట పడి నాకు కనువిందుచేసిన కొన్ని దృశ్యాలను నా కెమెరాలో బంధించానిలా.. మీరు కూడా ఓ లూక్కేయండి మరి :)అప్పటికే వర్షం ఆగిపోయి కాస్త తుపర మాత్రం పడుతూవుంది అంతే. ఇక ఆగలేక.. మరిన్ని అందాలు చూడాలని సైకిల్ తీసుకొని బయటకు వెళ్లాను. ఎవ్వరు లేరు.. గాలికి ఊగి ఊగి అలసిపోయిన చెట్లు, నేల రాలిన పువ్వులనూ చూస్తూ కాస్త ముందుకెళితే.. బీచ్లోని అలలు ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించాయి. వాటిని నేను నేను వర్ణించలేను. నా బుద్ధి చాలదు. కనురెప్ప వేయకుండా చూస్తూ కూర్చుండిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో మరి.. క్రికెట్ ఆడుకోవడానికి వచ్చిన పిల్లల అరుపులతో తేరుకొని ఇంటి దారి పట్టి వస్తుంటే ఇదిగో.. ఈ కాకి కనిపించింది. ఎంత ముద్దుగా ఉందోనని ఫోటో తీసుకుని మా ఇంటి సందులోకి నడిచాను.

 కాని మా వీధి నా మీద అలిగింది. అన్నిటిని చూసి మురుసుకుని ఫోటోలు తీసి దాచుకున్నావ్ గాని నన్ను పట్టించుకోలేదని! నిన్ను మరువగలనా అంటూ దాన్నీ క్లిక్మనిపించాను.. :) :)

32 comments:

 1. బావుందామ్మాయి నీ ఫోటోగ్ర్రఫి..

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ.. థాంక్ యు :D

   Delete
 2. బాగుంది ప్రియ.
  చిటపట చినుకుల ఉదయ రాగం..:)

  ReplyDelete
  Replies
  1. నచ్చింది కదా.. నేను హ్యాపీ అండీ :)

   Delete
 3. Replies
  1. Mallee yennaallaku vachhaaru Manju gaaru.. thanks andi mee raakaku, vaakhya ku :)

   Delete
 4. "ఓ వర్షం కురిసిన రాత్రి .." అని "జంబలకిడిపంబ" సినిమాలో బ్రహ్మానందం చెప్పే డయలాగ్ గుర్తుకొచ్చింది.

  ReplyDelete
  Replies
  1. అవునా..?! ఏమోనండి నేనా సినిమా పూర్తిగా చూడలేదు.. ఎన్నో సార్లు అనుకున్నాను చూడాలని. ప్చ్.. కుదరలేదు :(

   Delete
 5. Me Photos awesome andi ...

  ReplyDelete
  Replies
  1. చాలా రోజుల తర్వాత కనిపించారు..! మీ వాఖ్యకు కృతజ్ఞతలు శ్రీకాంత్ గారు :)

   Delete
 6. ఇక్కడ చూడండి.

  http://www.youtube.com/watch?v=xUyWWg5f8wk

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మధు గారు :)

   Delete
 7. సూపర్ ఫోటోగ్రఫీ, వాటిని వర్ణించిన విధానం ఇంకా బాగుంది. ఇక నేను కూడా ఇలా ప్రక్రుతి సింగారించుకున్నప్పుడల్లా ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాను :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ గ్రీన్ స్టార్ గారు!
   నిర్ణయించేసుకున్నారు కదా.. మీరు ఫోటోలు తీసిన తర్వాత నాకూ చూయించండేం? మర్చిపోకూడదు మరి?

   Delete
  2. ఓ, తప్పకుండ, కాని ఇప్పుడు ఇక్కడ చలి కాలం, మంచు పడుతుంది. ఎటు చూసినా ఆకులు రాలిన చెట్లే, తెల్లటి తెలుపే !! అయినా ప్రయత్నిస్తాను.

   Delete
  3. అందులోనూ ఓ అందముంటుంది కదండీ.. వీలు చిక్కినపుడు ప్రయత్నించి ఫొటోస్ పంపండి :)

   Delete
 8. ma veedhi naa meeda aligindi. wah nice expression. prakruthi paravasyamaina me aksharala nadaka nice

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి స్వాగతమండీ :)
   అలాగే నా అక్షరాల నడకను ఆస్వాదించి మీరు చేసిన వాఖ్యకు కృతజ్ఞతలు.

   Delete
 9. vammo pics giyadame kadu,snaps kuda baga tistavanamata..ma

  superb...

  ReplyDelete
  Replies
  1. నచ్చినవన్నీ ఏదో ఒక రూపంలో దాచుకుంటుంటాను సందీప్. అందులో ఇదొక విధం :)
   మీకూ నచ్చుతున్నాయిగా.. ఖుషీ ఖుషీ :D

   Delete
 10. Replies
  1. మీ మెచ్చుకోలుకి కృతజ్ఞతలు వనజవనమాలి గారు :)

   Delete
 11. ఫొటోలు ఎంత బాగున్నాయో.. చూస్తుంటేనే వర్షంలో తడుస్తున్నంత హాయిగా ఉన్నాయి ఫొటోలు. ప్రతిదీ ఒకదానికొకటి పోటీ పడేలా ఉన్నాయి. అన్నట్టు మీ వీధి కూడా సూపర్బ్ ప్రియా.. నైస్ పోస్ట్... :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శోభ గారు :)
   మీకూ మా వీధి నచ్చిందన్నమాట.. మరింకెందుకు ఆలస్యం?
   వచ్చేయండి ఓ మంచి రోజు చూసి :)

   Delete
  2. malli25/1/13

   న పేరు దుర్గ మల్లేశ్వర్ మీ గ్నపకాలు బగునాఇ

   Delete
  3. మీ స్పందనకు కృతజ్ఞతలు దుర్గ మల్లేశ్వర్ గారు :)

   Delete
 12. ఫొటొస్... మీ అభిరుచులు.. ప్రేమ కబుర్లు...చీరల కబుర్లు..అన్ని అద్భుథః ...
  మీ ప్రేమ కబుర్లు మద్యలో ఆపేసారేం .. చెప్పండి త్వరగా..
  అవును మీరు చివరగ ఉంచిన ఆ వీధి ఫొటొ చాల చాల బాగుంది .. అసలు అది చెన్నైయేనా అని అనుమానం వచ్చింది...

  ReplyDelete
  Replies
  1. తెలుగింటి అబ్బాయి గారు.. మీ కామెంట్ కి చాలా చాలా థాంక్స్ అండీ :)
   పెళ్లి పనుల్లో బిజీ గా ఉండి ప్రేమ కబుర్లకు చిన్న బ్రేక్ ఇచ్చాను. త్వరలోనే పార్ట్ 7 పోస్ట్ చేస్తా.

   మాది సౌత్ చెన్నై అండీ.. బీచ్ పక్కనే మా ఇల్లు. అందునా ఉదయాన్నే తుపర పడుతుండగా ఫోటో తీశానేమో చాలా ప్లెజెంట్ గా కనబడుతోంది :)

   Delete
 13. మీ వీధి భలే ఉందండి.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మురళి గారు :)

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)