Thursday, December 13, 2012

"చిన్ని నాన్నలు" అని పిలవబడుతున్న"నేను"

ఈ కొత్త ప్రపంచాన్ని.. మా వాళ్ళనూ, మరు ముఖ్యంగా ఎప్పుడూ కబుర్లు చెబుతూ అమ్మ బొజ్జ మీదుగానే నన్ను ముద్దులాడే మా పిచ్చి పిన్నినీ చూడాలనీ.. 12.12.12. న వస్తానని డాక్టర్ చెప్పిన మాటలను కాలరాస్తూ స్పెషల్ డేట్ కాకపోయినా పరవాలేదు త్వరగా మిమ్మల్నందరినీ కూడా పలకరించి ఆశిస్సులు తీసేసుకుందామని మొన్ననే అనగా డిసెంబర్ పదో తారీఖునే అమ్మను ఏడిపిస్తూ, ఆమెను ఏడిపించినందుకు నేనూ ఏడుస్తూ తెల్లవారుజామునే బొజ్జ నుండి బయటపడ్డాను. నేనూ అమ్మా ఇద్దరం క్షేమం. వారి మాట ప్రకారం కాకుండా నా ఇష్టానుసారంగా వచ్చేసినందుకో ఏమో గాని నా ఊపిరి తిత్తుల్లో గడ్డ ఉందని చెప్పి మా వాళ్ళందరిని బాగా ఏడిపించి నాకు నానా టెస్టులు చేసి బోలెడు డబ్బు గుంజి  "ఈ ఈ ఏమి లేదండీ. మా అనుమానం నిజం కాదు. మీ చిన్ని నాన్నలు బాగున్నారని చెప్పి" నన్ను వారికిచ్చేసి వాళ్ళను బ్రతికించారు. నన్ను ముద్దులాడే ఓపిక ప్రస్తుతానికి అమ్మకు లేదు.. ఆ ముచ్చటంతా మా పిన్నీ, అమ్మమ్మా, నానమ్మా తీరుస్తున్నారు. మీకు తెలుసా మా పిన్ని నాకు బోలెడు బట్టలు, బెడ్, కారియింగ్ బాగ్, చిన్ని చిన్ని చేడ్డీలు... ఇదిగో అలా నవ్వొద్దు నాకసలే సిగ్గు. నేను పుట్టాకా మొదట మా నాన్న చేతిలో పెట్టారు. నాకేమో అప్పటికే ఆకలి. మా నాన్న చొక్కా చప్పరిస్తే మా పిన్ని "అయ్యయో చిన్ని నాన్నలూ.. అలా చప్పరించకూడదు" అంటూ నన్ను లాగేసుకుంది. ఆ రోజంతా వాళ్ళను, వీళ్ళను.. నా చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ గడిపేశాను. అందరిని నవ్వుతూ వారి కళ్ళలోకి చూస్తూ పలకరిస్తున్నాను. ఈ మాత్రానికే నన్ను చూసుకొని వీళ్ళంతా తెగ మురిసిపోతున్నారు. నాకన్నీ మా పిన్ని పోలికలేనట చూసిన వాళ్ళందరు చెబుతుంటే మా నాన్న భలే ఉడుక్కుంటున్నాడు :P. నన్ను చూడ్డానికి రేపు మా బాబాయ్ వస్తున్నాడు. మా నాన్నేమో.. నల్ల బంగారమా మా అమ్మ చమనచాయా మా నానమ్మోళ్ళందరూ నల్ల బంగారాలేనా నేను కూడా అలాగే ఉంటానేమో అనుకున్నారంట అందరు. మరి నేనేమో మా అమ్మమ్మలా, పిన్నిలా మంచి రంగుతో పుట్టేసరికి మా నానమోళ్ళందరు తెగ మురిసిపోతున్నారు. మా నాన్న గురించి పిన్ని మా అమ్మ తో ఏమందో తెలుసా "అమ్మో కొడుకు పుట్టినప్పటి నుండి మీ ఆయన సల్మాన్ ఖాన్ పెద్దన్నయ్యలా నడుస్తున్నాడే" అని! అమ్మ కూడా నవ్వేసింది. నాన్నేమో వాళ్ళ స్నేహితులతో "అరేయ్! సింహం రా సింహం పుట్టింది" అని చెబుతూ మురిసిపోతున్నాడు. అసలు మా అమ్మోళ్ళింట్లో అందరూ ఆడపిల్లలే! అందుకే నేనూ ఆడపిల్లనవుతానని పిన్ని ఆశాశగా "చిట్టి చామంతి" అని పిలుచుకుంది. కాని నన్ను చేతుల్లోకి తీసుకోగానే కళ్ళ నిండా నీళ్ళతో నన్ను ముద్దు పెట్టుకుంటూ "చిన్ని నాన్నలు" అంది. ఇప్పుడు అందరు అలాగే పిలుస్తున్నారు నన్ను!  మరేమో మరీ.. నన్ను చూసి అందరు ఎన్నో నెలా ఎన్నో నెలా అనడుగుతుంటే అమ్మా, పిన్నీ భలే కంగారు పడిపోతున్నారు నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని :).  ముందు మా పిన్ని నేను పుట్టానని, అమ్మా నేనూ క్షేమం గా ఉన్నామని చెబుతూ 4 లైన్స్ లో ముగించేద్దామనుకుంది. కాని మా పిన్నిని ఒప్పించి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఇలా వచ్చాను. ఏంటీ.. మీకూ నన్ను చూడాలని ఉందా..? ఉష్.. ఇదిగో.. చూడండి. మా పిన్నికి చెప్పకండే నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని కంగారు పడుతుందిగా మరి.
ముద్దొస్తున్నా కదూ.. హ హ.. :D
నేను ఇంత కష్టపడి మిమ్మల్ని పలరించి ఆశిర్వచనాలు పొందుకుందామని వచ్చి బోలెడు కబుర్లు చెప్పాక అన్ని వినేసి  మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకు బాధేస్తుంది మరి :( 

23 comments:

Chinni said...

చిన్ని నాన్నలు...
పిన్నిని నీ అల్లరితో విసిగించేయాలి మరి..సరేనా!!!

స్వర్ణమల్లిక said...

Chinni bangaru tandri ki boledu aasissulu. Nindu nurellu arogyamga vardhillu tandree.
Kalyani

srinivasarao vundavalli said...

chala muddostunnadu chinni naannalu :)

కావ్యాంజలి said...

cute ga unnadu(nenu ante dhistem thagaladhule)....
Congrats pinni gaaru...maku party kaavali.. :)
mee akka bava ki kooda naa tharapuna congrats cheppandi :)

ధాత్రి said...

భలే ముద్దుగా ఉన్నావు నాన్నా..
నిన్ను చూసి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి నీకు కోపం తెప్పిస్తానా..:)

శ్రీవిద్య said...

chala bagunnadu chinni nannalu

haritha said...

God Bless u raa kanna!

Priya said...

వై చిన్నీ.. వై..?? వై దిస్ కొలవెరి?

ఫోటాన్ said...

చిన్నా!
వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్లానెట్ :)
చాలా బాగా రాసారండీ.. :)

Priya said...

Welcome to my blog Kalyani :)
Manchi manassutho chinni naannalaku meerandhinchina aasissulaku kruthajnathalu :)

శోభ said...

"చిన్ని నాన్నలు"... వినడానికి, అలా పిలవడానికి ఎంత బాగుందో.. నీ ప్రేమంతా పులుముకుని స్వచ్ఛంగా ఉందీ పిలుపు ప్రియా...

అచ్చంగా చిన్ని నాన్నలకు మాటలు వస్తే.. తన బుల్లి నోటితో మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అంతే ముద్దు ముద్దుగా నువ్వు చెప్పిన కబుర్లు ఎంత బాగున్నాయో.. అలా ఓ లోకంలోకి తీసుకెళ్తున్నాయంటే నమ్ము.. :)

చిన్ని నాన్నలకు "చిన్ని చిన్ని చెడ్డీలు"... ఎంత నవ్వొచ్చిందో.. అలా నవ్వుతున్నామో లేదో అప్పుడే చిన్ని నాన్నలు ఉడుక్కునేస్తున్నారు... పైగా నిన్నగాక మొన్న వస్తున్నాడు.. అప్పుడే సిగ్గట... హవ్వా.. :)

సర్లే తండ్రీ.. నీ చెడ్డీల గురించి మాకెందు చెప్దూ... :) సిగ్గుపడకు... చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నావు... ఇక సిగ్గుపడితే ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తావు... మేమందరం ముద్దుచేస్తూ సంతోషపడుతూ.. నీ అల్లరి పిన్ని, అమ్మల బాధ చూడలేం కదా.. పాపం నీకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని వాళ్ల కంగారు. అందుకే సిగ్గపడబోమాకు... :)

ప్రియా.. చిట్టి చామంతి అయితేనేం, చిన్ని నాన్నలు అయితేనేం.. ఆ దేవుడు స్వయంగా మన దగ్గరికి రాలేక ఇలా చామంతుల, నాన్నల రూపంలో మన ఒళ్లో ఆడుకునేందుకు పసిపిల్లల్లా వచ్చేస్తుంటారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.. ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు.

అమ్మో.. నా కామెంట్ నిడివి ఇప్పటికే ఎక్కువైందేమో.. చివరిగా ఓ మాట... "చిన్ని నాన్నలు నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ" నాన్నలకు బోలెడన్ని ముద్దులు... :)

Priya said...

Kada Srinivas gaaru.. thanks :)

Priya said...

Thanks Kaavya gaaru.. akkaa baavalaku mee abhinandanalanu thappaka theliyachesthaanu :) Party yegaa icchesthaanu daanidemundi.. yeppudu yekkado cheppeyandi ;)

Priya said...

థాంక్స్ ఆంటీ ;)

--
చిన్ని నాన్నలు

Priya said...

Welcome Srividhya gaaru :)
Thanks for your comment.

Priya said...

థాంక్స్ హరితాంటీ :)

--
చిన్ని నాన్నలు

డేవిడ్ said...

పెదవి ప్రమిదలో నవ్వుల దీపాలు వెలిగించుకొని కలకాలం సుఖంగా జీవించాలని ఆకాక్షింస్తూ..... "చిన్ని నాన్నలు" కు స్వాగతం.

Anonymous said...

నాకు బుడుగు కధలు గుర్తొస్తున్నాయి మీ చిన్నినాన్న మాటలు విన్నాక...ఇంత ముద్దు గారే చిన్ని నాన్న తో బాగా enjoy చెయ్యండి ప్రియ గారు. Warm wishes and love to chinninannalu !!
-దీరు

Siri said...

Congratulations! Priya,& family,
welcome to this beautiful and wonderful world Chinni naannalu,noorela paatu, aayurarogyala tho nithyam chirunavvulatho, chilipi allari tho, muddu matala tho,andari ni alaristhu, edigi,edigi,enno sadhinchi goppavadivi ayyi, andariki, mukyamga mee pinni ki manchi peru tevalani akanshistu
Sreedevi

sndp said...

hey chinni nanalu..,
pinni edipinchdam start chesyi..:)

Priya said...

@ Harsha gaaru, Shobha gaaru, David gaaru, Dheeru gaaru, Sreedevi gaaru and Sandeep: Habbaa.. mundu intha aalasyamgaa reply isthunnanduku kshamincheyandi chebuthaanu. Hammaya kshaminchesaaru.. :) thanks andi. Intlo net problem andi.. Chinni naannala punyamaa ani assalu time dorakka ee issue ni sort out cheyalekapoyaanu. Nindu manassutho chantaadini deevinchina mee andhariki peru perunaa hrudhayapoorvaka kruthajnathalu theliyajesukuntu aa deevenalu meekoo varthinchaalani devunni praardhisthunnaa. Idigo ippude sign chesi meetho vaadi kaburlu panchukundaamanukuntunnaanaa yekkadaa.. sariga thanks cheppelope kekalu modalu pettesaadu.. :) untaanandi.. mari :)

MURALI said...

హమ్మయ్య మొత్తానికి మీ బ్లాగులోని పోస్టులన్నీ చదివేసాను. ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటే చూడ ముచ్చటగా ఉంటుందో నిర్వచించాలంటే మీ అనుభవాలని ఉదహరణగా చూపితే చాలేమో అనిపించేంతలా నచ్చాయి. మీరు, మీ భరత్‌గారు ఒకసారి దిష్టి తీయించుకోండేం. (ఎందుకంటారా? చదువుతుండగా కాస్త జెలసీ వచ్చిందిలెండి అందుకు)

Priya said...

హహ్హహ.. పట్టుబట్టి కష్టపడి అన్ని పోస్ట్స్ చదివేశారా??!!
Thank you so much for the compliment, మురళి గారు :)
నిజంగా.. నా ప్రపంచం మీకూ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, December 13, 2012

"చిన్ని నాన్నలు" అని పిలవబడుతున్న"నేను"

ఈ కొత్త ప్రపంచాన్ని.. మా వాళ్ళనూ, మరు ముఖ్యంగా ఎప్పుడూ కబుర్లు చెబుతూ అమ్మ బొజ్జ మీదుగానే నన్ను ముద్దులాడే మా పిచ్చి పిన్నినీ చూడాలనీ.. 12.12.12. న వస్తానని డాక్టర్ చెప్పిన మాటలను కాలరాస్తూ స్పెషల్ డేట్ కాకపోయినా పరవాలేదు త్వరగా మిమ్మల్నందరినీ కూడా పలకరించి ఆశిస్సులు తీసేసుకుందామని మొన్ననే అనగా డిసెంబర్ పదో తారీఖునే అమ్మను ఏడిపిస్తూ, ఆమెను ఏడిపించినందుకు నేనూ ఏడుస్తూ తెల్లవారుజామునే బొజ్జ నుండి బయటపడ్డాను. నేనూ అమ్మా ఇద్దరం క్షేమం. వారి మాట ప్రకారం కాకుండా నా ఇష్టానుసారంగా వచ్చేసినందుకో ఏమో గాని నా ఊపిరి తిత్తుల్లో గడ్డ ఉందని చెప్పి మా వాళ్ళందరిని బాగా ఏడిపించి నాకు నానా టెస్టులు చేసి బోలెడు డబ్బు గుంజి  "ఈ ఈ ఏమి లేదండీ. మా అనుమానం నిజం కాదు. మీ చిన్ని నాన్నలు బాగున్నారని చెప్పి" నన్ను వారికిచ్చేసి వాళ్ళను బ్రతికించారు. నన్ను ముద్దులాడే ఓపిక ప్రస్తుతానికి అమ్మకు లేదు.. ఆ ముచ్చటంతా మా పిన్నీ, అమ్మమ్మా, నానమ్మా తీరుస్తున్నారు. మీకు తెలుసా మా పిన్ని నాకు బోలెడు బట్టలు, బెడ్, కారియింగ్ బాగ్, చిన్ని చిన్ని చేడ్డీలు... ఇదిగో అలా నవ్వొద్దు నాకసలే సిగ్గు. నేను పుట్టాకా మొదట మా నాన్న చేతిలో పెట్టారు. నాకేమో అప్పటికే ఆకలి. మా నాన్న చొక్కా చప్పరిస్తే మా పిన్ని "అయ్యయో చిన్ని నాన్నలూ.. అలా చప్పరించకూడదు" అంటూ నన్ను లాగేసుకుంది. ఆ రోజంతా వాళ్ళను, వీళ్ళను.. నా చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ గడిపేశాను. అందరిని నవ్వుతూ వారి కళ్ళలోకి చూస్తూ పలకరిస్తున్నాను. ఈ మాత్రానికే నన్ను చూసుకొని వీళ్ళంతా తెగ మురిసిపోతున్నారు. నాకన్నీ మా పిన్ని పోలికలేనట చూసిన వాళ్ళందరు చెబుతుంటే మా నాన్న భలే ఉడుక్కుంటున్నాడు :P. నన్ను చూడ్డానికి రేపు మా బాబాయ్ వస్తున్నాడు. మా నాన్నేమో.. నల్ల బంగారమా మా అమ్మ చమనచాయా మా నానమ్మోళ్ళందరూ నల్ల బంగారాలేనా నేను కూడా అలాగే ఉంటానేమో అనుకున్నారంట అందరు. మరి నేనేమో మా అమ్మమ్మలా, పిన్నిలా మంచి రంగుతో పుట్టేసరికి మా నానమోళ్ళందరు తెగ మురిసిపోతున్నారు. మా నాన్న గురించి పిన్ని మా అమ్మ తో ఏమందో తెలుసా "అమ్మో కొడుకు పుట్టినప్పటి నుండి మీ ఆయన సల్మాన్ ఖాన్ పెద్దన్నయ్యలా నడుస్తున్నాడే" అని! అమ్మ కూడా నవ్వేసింది. నాన్నేమో వాళ్ళ స్నేహితులతో "అరేయ్! సింహం రా సింహం పుట్టింది" అని చెబుతూ మురిసిపోతున్నాడు. అసలు మా అమ్మోళ్ళింట్లో అందరూ ఆడపిల్లలే! అందుకే నేనూ ఆడపిల్లనవుతానని పిన్ని ఆశాశగా "చిట్టి చామంతి" అని పిలుచుకుంది. కాని నన్ను చేతుల్లోకి తీసుకోగానే కళ్ళ నిండా నీళ్ళతో నన్ను ముద్దు పెట్టుకుంటూ "చిన్ని నాన్నలు" అంది. ఇప్పుడు అందరు అలాగే పిలుస్తున్నారు నన్ను!  మరేమో మరీ.. నన్ను చూసి అందరు ఎన్నో నెలా ఎన్నో నెలా అనడుగుతుంటే అమ్మా, పిన్నీ భలే కంగారు పడిపోతున్నారు నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని :).  ముందు మా పిన్ని నేను పుట్టానని, అమ్మా నేనూ క్షేమం గా ఉన్నామని చెబుతూ 4 లైన్స్ లో ముగించేద్దామనుకుంది. కాని మా పిన్నిని ఒప్పించి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఇలా వచ్చాను. ఏంటీ.. మీకూ నన్ను చూడాలని ఉందా..? ఉష్.. ఇదిగో.. చూడండి. మా పిన్నికి చెప్పకండే నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని కంగారు పడుతుందిగా మరి.
ముద్దొస్తున్నా కదూ.. హ హ.. :D
నేను ఇంత కష్టపడి మిమ్మల్ని పలరించి ఆశిర్వచనాలు పొందుకుందామని వచ్చి బోలెడు కబుర్లు చెప్పాక అన్ని వినేసి  మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకు బాధేస్తుంది మరి :( 

23 comments:

 1. చిన్ని నాన్నలు...
  పిన్నిని నీ అల్లరితో విసిగించేయాలి మరి..సరేనా!!!

  ReplyDelete
  Replies
  1. వై చిన్నీ.. వై..?? వై దిస్ కొలవెరి?

   Delete
 2. Chinni bangaru tandri ki boledu aasissulu. Nindu nurellu arogyamga vardhillu tandree.
  Kalyani

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog Kalyani :)
   Manchi manassutho chinni naannalaku meerandhinchina aasissulaku kruthajnathalu :)

   Delete
 3. chala muddostunnadu chinni naannalu :)

  ReplyDelete
  Replies
  1. Kada Srinivas gaaru.. thanks :)

   Delete
 4. cute ga unnadu(nenu ante dhistem thagaladhule)....
  Congrats pinni gaaru...maku party kaavali.. :)
  mee akka bava ki kooda naa tharapuna congrats cheppandi :)

  ReplyDelete
  Replies
  1. Thanks Kaavya gaaru.. akkaa baavalaku mee abhinandanalanu thappaka theliyachesthaanu :) Party yegaa icchesthaanu daanidemundi.. yeppudu yekkado cheppeyandi ;)

   Delete
 5. భలే ముద్దుగా ఉన్నావు నాన్నా..
  నిన్ను చూసి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి నీకు కోపం తెప్పిస్తానా..:)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ఆంటీ ;)

   --
   చిన్ని నాన్నలు

   Delete
 6. Replies
  1. Welcome Srividhya gaaru :)
   Thanks for your comment.

   Delete
 7. God Bless u raa kanna!

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ హరితాంటీ :)

   --
   చిన్ని నాన్నలు

   Delete
 8. చిన్నా!
  వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్లానెట్ :)
  చాలా బాగా రాసారండీ.. :)

  ReplyDelete
 9. "చిన్ని నాన్నలు"... వినడానికి, అలా పిలవడానికి ఎంత బాగుందో.. నీ ప్రేమంతా పులుముకుని స్వచ్ఛంగా ఉందీ పిలుపు ప్రియా...

  అచ్చంగా చిన్ని నాన్నలకు మాటలు వస్తే.. తన బుల్లి నోటితో మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అంతే ముద్దు ముద్దుగా నువ్వు చెప్పిన కబుర్లు ఎంత బాగున్నాయో.. అలా ఓ లోకంలోకి తీసుకెళ్తున్నాయంటే నమ్ము.. :)

  చిన్ని నాన్నలకు "చిన్ని చిన్ని చెడ్డీలు"... ఎంత నవ్వొచ్చిందో.. అలా నవ్వుతున్నామో లేదో అప్పుడే చిన్ని నాన్నలు ఉడుక్కునేస్తున్నారు... పైగా నిన్నగాక మొన్న వస్తున్నాడు.. అప్పుడే సిగ్గట... హవ్వా.. :)

  సర్లే తండ్రీ.. నీ చెడ్డీల గురించి మాకెందు చెప్దూ... :) సిగ్గుపడకు... చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నావు... ఇక సిగ్గుపడితే ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తావు... మేమందరం ముద్దుచేస్తూ సంతోషపడుతూ.. నీ అల్లరి పిన్ని, అమ్మల బాధ చూడలేం కదా.. పాపం నీకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని వాళ్ల కంగారు. అందుకే సిగ్గపడబోమాకు... :)

  ప్రియా.. చిట్టి చామంతి అయితేనేం, చిన్ని నాన్నలు అయితేనేం.. ఆ దేవుడు స్వయంగా మన దగ్గరికి రాలేక ఇలా చామంతుల, నాన్నల రూపంలో మన ఒళ్లో ఆడుకునేందుకు పసిపిల్లల్లా వచ్చేస్తుంటారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.. ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు.

  అమ్మో.. నా కామెంట్ నిడివి ఇప్పటికే ఎక్కువైందేమో.. చివరిగా ఓ మాట... "చిన్ని నాన్నలు నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ" నాన్నలకు బోలెడన్ని ముద్దులు... :)

  ReplyDelete
 10. పెదవి ప్రమిదలో నవ్వుల దీపాలు వెలిగించుకొని కలకాలం సుఖంగా జీవించాలని ఆకాక్షింస్తూ..... "చిన్ని నాన్నలు" కు స్వాగతం.

  ReplyDelete
 11. Anonymous14/12/12

  నాకు బుడుగు కధలు గుర్తొస్తున్నాయి మీ చిన్నినాన్న మాటలు విన్నాక...ఇంత ముద్దు గారే చిన్ని నాన్న తో బాగా enjoy చెయ్యండి ప్రియ గారు. Warm wishes and love to chinninannalu !!
  -దీరు

  ReplyDelete
 12. Congratulations! Priya,& family,
  welcome to this beautiful and wonderful world Chinni naannalu,noorela paatu, aayurarogyala tho nithyam chirunavvulatho, chilipi allari tho, muddu matala tho,andari ni alaristhu, edigi,edigi,enno sadhinchi goppavadivi ayyi, andariki, mukyamga mee pinni ki manchi peru tevalani akanshistu
  Sreedevi

  ReplyDelete
 13. hey chinni nanalu..,
  pinni edipinchdam start chesyi..:)

  ReplyDelete
 14. @ Harsha gaaru, Shobha gaaru, David gaaru, Dheeru gaaru, Sreedevi gaaru and Sandeep: Habbaa.. mundu intha aalasyamgaa reply isthunnanduku kshamincheyandi chebuthaanu. Hammaya kshaminchesaaru.. :) thanks andi. Intlo net problem andi.. Chinni naannala punyamaa ani assalu time dorakka ee issue ni sort out cheyalekapoyaanu. Nindu manassutho chantaadini deevinchina mee andhariki peru perunaa hrudhayapoorvaka kruthajnathalu theliyajesukuntu aa deevenalu meekoo varthinchaalani devunni praardhisthunnaa. Idigo ippude sign chesi meetho vaadi kaburlu panchukundaamanukuntunnaanaa yekkadaa.. sariga thanks cheppelope kekalu modalu pettesaadu.. :) untaanandi.. mari :)

  ReplyDelete
 15. హమ్మయ్య మొత్తానికి మీ బ్లాగులోని పోస్టులన్నీ చదివేసాను. ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటే చూడ ముచ్చటగా ఉంటుందో నిర్వచించాలంటే మీ అనుభవాలని ఉదహరణగా చూపితే చాలేమో అనిపించేంతలా నచ్చాయి. మీరు, మీ భరత్‌గారు ఒకసారి దిష్టి తీయించుకోండేం. (ఎందుకంటారా? చదువుతుండగా కాస్త జెలసీ వచ్చిందిలెండి అందుకు)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ.. పట్టుబట్టి కష్టపడి అన్ని పోస్ట్స్ చదివేశారా??!!