Friday, January 25, 2013

దొరికేశాయోచ్!!!

యేడాది క్రితం ఓ రోజు సాయంత్రం బీచ్ కి వెళ్ళినపుడు నా బీరువా లాకర్ కీస్  పోగొట్టేసాను.  "ఏంటీ..  అన్నేళ్ల క్రితం బీచ్లో పోగొట్టినవి ఇప్పుడు దొరికాయా నీకూ? మ్మ్.. ఇంకా..?" అన్నదేగా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం..? నాకర్ధమైపోయిందోచ్.. :P  కాని విషయమేంటంటే కీస్ పోయినప్పటి నుండి దాని వంక చూస్తూ లోపల ఉండిపోయిన నా విలువైన వస్తువులను తలుచుకుని రోజుకొక్కసారైనా బాధ పడేదాన్ని. "అంత బాధపడి చావకపోతే ఎవరినైనా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించుకోవచ్చుగా" విసుక్కుంటూ అక్క పారేసిన సలహాను పట్టుకొని నాన్న దగ్గరకు వెళితే.. "ష్యూర్ ష్యూర్.. చేసేద్దాం" అన్నారు కాని పని జరగలేదు. అమ్మ తో చెబితే "తిక్క కుదిరింది. లేకపోతే ఆడపిల్లకు అంత అజాగ్రత్తా! ఇదిగో ఆ తాళాల వాళ్ళను ఇంటికి గట్రా తీసుకొస్తే ఇల్లు చూసుకొని ఓ మంచి రోజు కన్నం వేస్తారు. నాలుగు గ్రీటింగ్ కార్డ్లు, పేపర్లు, పాత ఫోటోల కోసం ఇంటిని దొంగల పాలు చేస్తానంటే కాళ్ళు విరగ్గోడతా" అంటూ అనర్గళంగా అరగంట క్లాసు తీసుకుంది. చివరకు అక్క దగ్గరకే వెళ్లి ఆ తాళాల వాళ్ళు ఎక్కడుంటారే అని బ్రతిమాలితే "ఏమో.. నాకేం తెలుసు? వెతుక్కో" అనేసి తప్పించుకుంది. కొన్ని రోజులు ప్రయత్నించి తరువాత ఆ లాకర్ డోర్లోనే నా వస్తువులన్నిటిని చూసుకుంటూ తాళాల వాడి సంగతి మర్చిపోయాను. మొన్న మా బెడ్రూం లో ఫ్యాన్ పాడయిందని ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చాం. "నో" అంటారని ఊహిస్తూనే "మా బీరువా లాకర్ కీ పోయిందండి. అది తెరవడానికి మీకు సాధ్యపడుతుందా" అనడిగాను. టక్కున ఆయన "ఓ అదెంత పనమ్మా" అని ఐదు నిముషాల్లో ఓపెన్ చేసేశారు! అబ్బ!!!! 1,0000000 వాల్ట్స్ బల్బు లా వెలిగింది నా మొహం. ఇప్పటికీ వెలుగుతూనే ఉందనుకోండీ :)  మీతో షేర్ చేసుకుంటే గాని కుదుటపడనని మనసంటేను.. ఇలా వచ్చాను. 

ఇంతకూ దానిలో ఏమున్నాయో చెప్పలేదు కదూ మీకు? 27 ఫోటోలు.. అవన్నీ చాలా పాతవి ఒక్కటి తప్ప (మిగతా వాటితో పోలిస్తే). అన్నీ మీకు చూయించలేను గాని ఆ ఒక్క కొత్త ఫోటో మాత్రం చూయిస్తాను. ఇంకా 30+ గ్రీటింగ్ కార్డ్స్, డజను గాజులు, పాత డైరీ, ఒక బుల్లి డ్రెస్, నాకు మూడేళ్ళప్పటి నుండి దాచుకుంటున్న అరచేతిలో పట్టేంతటి బుజ్జి బ్లూ టెడ్డిబేర్, నేను 5th క్లాసు చదువుతున్నపుడు నాన్న నాకోసం చైనా నుండి తెచ్చిన గిఫ్ట్, నా సిరి సంపధలను కడుపులో దాచుకునే బాతు ఉన్నాయి. మీకూ చూడాలని ఉందా..? 

ఇవిగో.. 

కొన్ని కార్డ్స్ 

ఇదే నేను చెప్పిన కొత్త ఫోటో :). నేనూ, అనూ. 

ఈ కింద గ్రీటింగ్ మాత్రం నాన్నకు చాలా మురిపెం. విషయం ఏవిటంటే నేను 3rd క్లాసు చదువుతున్న రోజుల్లో నాన్న పుట్టిన రోజున ఇవ్వాలని  అమ్మ గ్రీటింగ్ కార్డు కొంది. "అలా ప్లైన్ గా ఇస్తే ఏం బావుంటుందిమా? ఏమైనా రాసి ఇవ్వు" అన్నాను. "ఏం రాస్తే బావుంటుందే" అని అడిగింది. నేను చాలా ఆలోచించి చించి "Many more happy returns of the day.. my dear sweet heart అని రాయి బావుంటుంది" అన్చేప్పేసి తుర్రుమనబోగా, "అదేదో నువ్వే రాసేసెయ్ ప్రియమ్మా.. నీ రైటింగ్ భలే బావుంటుంది గా" అని ఐస్ కూడా పెట్టేసరికి పొంగిపోతూ రాసి పెట్టాను. తీరా నాన్న దాన్ని చూసాక పడి పడి నవ్వారు. మాకేమి అర్ధం కాలేదు. అక్క గ్రీటింగ్ కార్డు తీసుకొని చూసి నాన్నలాగే నవ్వడం మొదలుపెట్టి కార్డుని అమ్మకిచ్చింది. అమ్మ కూడా చూసి నవ్వేసింది. అంతలా ఏముందబ్బా అని నేనూ తీసుకొని చూసాను. ఎంత చూసినా ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు. "అయినా ఎందుకొచ్చిందిలే.. చూసాక వాళ్ళు నవ్వారు కనుక నేనూ నవ్వాలి. లేకపోతే నాకేమి తెలీదనుకుంటారు" అని నేను కూడా విరగబడి కళ్ళల్లో నీళ్లోచ్చేలా నవ్వాను. ఈ లోపు నాన్న నన్ను దగ్గరకు తీసుకొని "Sweat heart" కాదు డార్లింగ్.. "Sweetheart" అన్నారు. ఇక నా ఎక్స్ప్రెషన్ మీ ఊహకే వదిలేస్తున్నా. Friday, January 25, 2013

దొరికేశాయోచ్!!!

యేడాది క్రితం ఓ రోజు సాయంత్రం బీచ్ కి వెళ్ళినపుడు నా బీరువా లాకర్ కీస్  పోగొట్టేసాను.  "ఏంటీ..  అన్నేళ్ల క్రితం బీచ్లో పోగొట్టినవి ఇప్పుడు దొరికాయా నీకూ? మ్మ్.. ఇంకా..?" అన్నదేగా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం..? నాకర్ధమైపోయిందోచ్.. :P  కాని విషయమేంటంటే కీస్ పోయినప్పటి నుండి దాని వంక చూస్తూ లోపల ఉండిపోయిన నా విలువైన వస్తువులను తలుచుకుని రోజుకొక్కసారైనా బాధ పడేదాన్ని. "అంత బాధపడి చావకపోతే ఎవరినైనా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించుకోవచ్చుగా" విసుక్కుంటూ అక్క పారేసిన సలహాను పట్టుకొని నాన్న దగ్గరకు వెళితే.. "ష్యూర్ ష్యూర్.. చేసేద్దాం" అన్నారు కాని పని జరగలేదు. అమ్మ తో చెబితే "తిక్క కుదిరింది. లేకపోతే ఆడపిల్లకు అంత అజాగ్రత్తా! ఇదిగో ఆ తాళాల వాళ్ళను ఇంటికి గట్రా తీసుకొస్తే ఇల్లు చూసుకొని ఓ మంచి రోజు కన్నం వేస్తారు. నాలుగు గ్రీటింగ్ కార్డ్లు, పేపర్లు, పాత ఫోటోల కోసం ఇంటిని దొంగల పాలు చేస్తానంటే కాళ్ళు విరగ్గోడతా" అంటూ అనర్గళంగా అరగంట క్లాసు తీసుకుంది. చివరకు అక్క దగ్గరకే వెళ్లి ఆ తాళాల వాళ్ళు ఎక్కడుంటారే అని బ్రతిమాలితే "ఏమో.. నాకేం తెలుసు? వెతుక్కో" అనేసి తప్పించుకుంది. కొన్ని రోజులు ప్రయత్నించి తరువాత ఆ లాకర్ డోర్లోనే నా వస్తువులన్నిటిని చూసుకుంటూ తాళాల వాడి సంగతి మర్చిపోయాను. మొన్న మా బెడ్రూం లో ఫ్యాన్ పాడయిందని ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చాం. "నో" అంటారని ఊహిస్తూనే "మా బీరువా లాకర్ కీ పోయిందండి. అది తెరవడానికి మీకు సాధ్యపడుతుందా" అనడిగాను. టక్కున ఆయన "ఓ అదెంత పనమ్మా" అని ఐదు నిముషాల్లో ఓపెన్ చేసేశారు! అబ్బ!!!! 1,0000000 వాల్ట్స్ బల్బు లా వెలిగింది నా మొహం. ఇప్పటికీ వెలుగుతూనే ఉందనుకోండీ :)  మీతో షేర్ చేసుకుంటే గాని కుదుటపడనని మనసంటేను.. ఇలా వచ్చాను. 

ఇంతకూ దానిలో ఏమున్నాయో చెప్పలేదు కదూ మీకు? 27 ఫోటోలు.. అవన్నీ చాలా పాతవి ఒక్కటి తప్ప (మిగతా వాటితో పోలిస్తే). అన్నీ మీకు చూయించలేను గాని ఆ ఒక్క కొత్త ఫోటో మాత్రం చూయిస్తాను. ఇంకా 30+ గ్రీటింగ్ కార్డ్స్, డజను గాజులు, పాత డైరీ, ఒక బుల్లి డ్రెస్, నాకు మూడేళ్ళప్పటి నుండి దాచుకుంటున్న అరచేతిలో పట్టేంతటి బుజ్జి బ్లూ టెడ్డిబేర్, నేను 5th క్లాసు చదువుతున్నపుడు నాన్న నాకోసం చైనా నుండి తెచ్చిన గిఫ్ట్, నా సిరి సంపధలను కడుపులో దాచుకునే బాతు ఉన్నాయి. మీకూ చూడాలని ఉందా..? 

ఇవిగో.. 

కొన్ని కార్డ్స్ 

ఇదే నేను చెప్పిన కొత్త ఫోటో :). నేనూ, అనూ. 

ఈ కింద గ్రీటింగ్ మాత్రం నాన్నకు చాలా మురిపెం. విషయం ఏవిటంటే నేను 3rd క్లాసు చదువుతున్న రోజుల్లో నాన్న పుట్టిన రోజున ఇవ్వాలని  అమ్మ గ్రీటింగ్ కార్డు కొంది. "అలా ప్లైన్ గా ఇస్తే ఏం బావుంటుందిమా? ఏమైనా రాసి ఇవ్వు" అన్నాను. "ఏం రాస్తే బావుంటుందే" అని అడిగింది. నేను చాలా ఆలోచించి చించి "Many more happy returns of the day.. my dear sweet heart అని రాయి బావుంటుంది" అన్చేప్పేసి తుర్రుమనబోగా, "అదేదో నువ్వే రాసేసెయ్ ప్రియమ్మా.. నీ రైటింగ్ భలే బావుంటుంది గా" అని ఐస్ కూడా పెట్టేసరికి పొంగిపోతూ రాసి పెట్టాను. తీరా నాన్న దాన్ని చూసాక పడి పడి నవ్వారు. మాకేమి అర్ధం కాలేదు. అక్క గ్రీటింగ్ కార్డు తీసుకొని చూసి నాన్నలాగే నవ్వడం మొదలుపెట్టి కార్డుని అమ్మకిచ్చింది. అమ్మ కూడా చూసి నవ్వేసింది. అంతలా ఏముందబ్బా అని నేనూ తీసుకొని చూసాను. ఎంత చూసినా ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు. "అయినా ఎందుకొచ్చిందిలే.. చూసాక వాళ్ళు నవ్వారు కనుక నేనూ నవ్వాలి. లేకపోతే నాకేమి తెలీదనుకుంటారు" అని నేను కూడా విరగబడి కళ్ళల్లో నీళ్లోచ్చేలా నవ్వాను. ఈ లోపు నాన్న నన్ను దగ్గరకు తీసుకొని "Sweat heart" కాదు డార్లింగ్.. "Sweetheart" అన్నారు. ఇక నా ఎక్స్ప్రెషన్ మీ ఊహకే వదిలేస్తున్నా.