Friday, January 25, 2013

దొరికేశాయోచ్!!!

యేడాది క్రితం ఓ రోజు సాయంత్రం బీచ్ కి వెళ్ళినపుడు నా బీరువా లాకర్ కీస్  పోగొట్టేసాను.  "ఏంటీ..  అన్నేళ్ల క్రితం బీచ్లో పోగొట్టినవి ఇప్పుడు దొరికాయా నీకూ? మ్మ్.. ఇంకా..?" అన్నదేగా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం..? నాకర్ధమైపోయిందోచ్.. :P  కాని విషయమేంటంటే కీస్ పోయినప్పటి నుండి దాని వంక చూస్తూ లోపల ఉండిపోయిన నా విలువైన వస్తువులను తలుచుకుని రోజుకొక్కసారైనా బాధ పడేదాన్ని. "అంత బాధపడి చావకపోతే ఎవరినైనా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించుకోవచ్చుగా" విసుక్కుంటూ అక్క పారేసిన సలహాను పట్టుకొని నాన్న దగ్గరకు వెళితే.. "ష్యూర్ ష్యూర్.. చేసేద్దాం" అన్నారు కాని పని జరగలేదు. అమ్మ తో చెబితే "తిక్క కుదిరింది. లేకపోతే ఆడపిల్లకు అంత అజాగ్రత్తా! ఇదిగో ఆ తాళాల వాళ్ళను ఇంటికి గట్రా తీసుకొస్తే ఇల్లు చూసుకొని ఓ మంచి రోజు కన్నం వేస్తారు. నాలుగు గ్రీటింగ్ కార్డ్లు, పేపర్లు, పాత ఫోటోల కోసం ఇంటిని దొంగల పాలు చేస్తానంటే కాళ్ళు విరగ్గోడతా" అంటూ అనర్గళంగా అరగంట క్లాసు తీసుకుంది. చివరకు అక్క దగ్గరకే వెళ్లి ఆ తాళాల వాళ్ళు ఎక్కడుంటారే అని బ్రతిమాలితే "ఏమో.. నాకేం తెలుసు? వెతుక్కో" అనేసి తప్పించుకుంది. కొన్ని రోజులు ప్రయత్నించి తరువాత ఆ లాకర్ డోర్లోనే నా వస్తువులన్నిటిని చూసుకుంటూ తాళాల వాడి సంగతి మర్చిపోయాను. మొన్న మా బెడ్రూం లో ఫ్యాన్ పాడయిందని ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చాం. "నో" అంటారని ఊహిస్తూనే "మా బీరువా లాకర్ కీ పోయిందండి. అది తెరవడానికి మీకు సాధ్యపడుతుందా" అనడిగాను. టక్కున ఆయన "ఓ అదెంత పనమ్మా" అని ఐదు నిముషాల్లో ఓపెన్ చేసేశారు! అబ్బ!!!! 1,0000000 వాల్ట్స్ బల్బు లా వెలిగింది నా మొహం. ఇప్పటికీ వెలుగుతూనే ఉందనుకోండీ :)  మీతో షేర్ చేసుకుంటే గాని కుదుటపడనని మనసంటేను.. ఇలా వచ్చాను. 

ఇంతకూ దానిలో ఏమున్నాయో చెప్పలేదు కదూ మీకు? 27 ఫోటోలు.. అవన్నీ చాలా పాతవి ఒక్కటి తప్ప (మిగతా వాటితో పోలిస్తే). అన్నీ మీకు చూయించలేను గాని ఆ ఒక్క కొత్త ఫోటో మాత్రం చూయిస్తాను. ఇంకా 30+ గ్రీటింగ్ కార్డ్స్, డజను గాజులు, పాత డైరీ, ఒక బుల్లి డ్రెస్, నాకు మూడేళ్ళప్పటి నుండి దాచుకుంటున్న అరచేతిలో పట్టేంతటి బుజ్జి బ్లూ టెడ్డిబేర్, నేను 5th క్లాసు చదువుతున్నపుడు నాన్న నాకోసం చైనా నుండి తెచ్చిన గిఫ్ట్, నా సిరి సంపధలను కడుపులో దాచుకునే బాతు ఉన్నాయి. మీకూ చూడాలని ఉందా..? 

ఇవిగో.. 

కొన్ని కార్డ్స్ 

ఇదే నేను చెప్పిన కొత్త ఫోటో :). నేనూ, అనూ. 

ఈ కింద గ్రీటింగ్ మాత్రం నాన్నకు చాలా మురిపెం. విషయం ఏవిటంటే నేను 3rd క్లాసు చదువుతున్న రోజుల్లో నాన్న పుట్టిన రోజున ఇవ్వాలని  అమ్మ గ్రీటింగ్ కార్డు కొంది. "అలా ప్లైన్ గా ఇస్తే ఏం బావుంటుందిమా? ఏమైనా రాసి ఇవ్వు" అన్నాను. "ఏం రాస్తే బావుంటుందే" అని అడిగింది. నేను చాలా ఆలోచించి చించి "Many more happy returns of the day.. my dear sweet heart అని రాయి బావుంటుంది" అన్చేప్పేసి తుర్రుమనబోగా, "అదేదో నువ్వే రాసేసెయ్ ప్రియమ్మా.. నీ రైటింగ్ భలే బావుంటుంది గా" అని ఐస్ కూడా పెట్టేసరికి పొంగిపోతూ రాసి పెట్టాను. తీరా నాన్న దాన్ని చూసాక పడి పడి నవ్వారు. మాకేమి అర్ధం కాలేదు. అక్క గ్రీటింగ్ కార్డు తీసుకొని చూసి నాన్నలాగే నవ్వడం మొదలుపెట్టి కార్డుని అమ్మకిచ్చింది. అమ్మ కూడా చూసి నవ్వేసింది. అంతలా ఏముందబ్బా అని నేనూ తీసుకొని చూసాను. ఎంత చూసినా ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు. "అయినా ఎందుకొచ్చిందిలే.. చూసాక వాళ్ళు నవ్వారు కనుక నేనూ నవ్వాలి. లేకపోతే నాకేమి తెలీదనుకుంటారు" అని నేను కూడా విరగబడి కళ్ళల్లో నీళ్లోచ్చేలా నవ్వాను. ఈ లోపు నాన్న నన్ను దగ్గరకు తీసుకొని "Sweat heart" కాదు డార్లింగ్.. "Sweetheart" అన్నారు. ఇక నా ఎక్స్ప్రెషన్ మీ ఊహకే వదిలేస్తున్నా. 22 comments:

కళ్యాణ్ said...

బాగుందండి.. చాలా sweet గా రాసారు.

Priya said...

థాంక్స్ కళ్యాణ్ గారూ :)

చిన్ని ఆశ said...

అందమైన జ్ఞాపకాలని గుర్తులుగా దాచుకుని, అంతకన్నా ఎంతో విలువగా చూసుకుంటున్న మీకు అభినందనలు. బీరువా తాళాలు పోయినా అన్నీ భద్రంగానే ఉన్నాయి గా? తెరవగానే ఎంత ఆత్రంగా అన్నీ చూసుకునుంటారో ఊహించగలము.
చాలా బాగుంది ఇలా అందరితోనూ పంచుకోవటం.
మనసు కుదుటపడింది చాలు :)

Anne SreeKanth said...

Chala bhaga rasaru andi... keep posting...

Green Star said...

మీ జ్ఞాపకాలు బాగున్నాయ్. మాతో పంచుకున్నందుకు సంతోషం.

నవజీవన్ said...

చాలా బాగా రాసారు మేడమ్..ఒకరి జ్ఞాపకాలు మరొకరితో పంచుకుంటే ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు ..మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

డేవిడ్ said...

ప్రియ గారు బాగున్నాయి మీ స్వీట్ మెమోరిస్.

Priya said...

మీ అభినందనలకు చాలా కృతజ్ఞతలు పండు గారూ :)
అవునండీ.. తెరవగానే నా వస్తువులన్నిటిని మళ్ళీ మళ్ళీ తాకుతూ, నానమ్మ, తాతయ్య, నాన్నల చిన్నప్పటి ఫోటోలూ అవీ మళ్ళీ అప్పుడు దాచుకున్న డబ్బులు చూసుకొని తెగ మురిసిపోయాను :)

Priya said...

SreeKanth gaaru.. thanks for the comment :)

Priya said...

థాంక్స్ అండీ.. మీతో పంచుకోవడం నాకూ చాలా సంతోషం :)

Priya said...

నా బ్లాగింట్లోకి స్వాగతం నవజీవన్ గారు :)
మేడం అన్నారు కదూ నన్నూ...?!! క్షణ కాలం గాల్లో తెలిపోయాను :P కాని నేను 90లో పుట్టానండీ చిన్నదాన్నే.. ప్రియ అనండి :)
తీపిజ్ఞాపకాలు ఇలా పంచుకోగలగడం నా భాగ్యమండీ.

Priya said...

మీకూ నచ్చాయిగా.. థాంక్స్ డేవిడ్ గారు :)

శోభ said...

అమ్మో... ఎన్ని ఆస్తులో.. చిన్ననాటి వస్తువులు, ఆ జ్ఞాపకాల కంటే విలువైన ఆస్తులు ఏముంటాయి ఎవరికైనా...

అలాంటి ఆస్తులు కలిగివున్న వారందరూ సంపన్నులే... అందుకే మన ప్రియమ్మ కూడా సంపన్నురాలే కదా... :)

మంచి జ్ఞాపకాలను మా అందరితో పంచుకున్నందుకు సంతోషం సుమండీ... :)

వేణూశ్రీకాంత్ said...

అమ్మో ఇంత అపురూపమైన సంపద ఉన్న లాకర్ కీ అసలు ఎలా పోగొట్టుకున్నారండీ :-) ఎనీవేస్ ఇపుడు తెరిచేశారు మీ సంపదని మళ్ళీ తనివితీరా చూస్కున్నారు కనుక ఆల్ హాపీస్ :-))) మాతో కూడా పంచుకున్నందుకు థాంక్స్... నేను చిన్నపుడు దాచుకున్న వస్తువులు గుర్తొచ్చాయి... ఇపుడవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలీదులెండి.

Priya said...

Thanks for the comment, Shobha gaaru. నా రాతలు ఎలా ఉన్నా వాటిని చదివి నా జ్ఞాపకాలను పంచుకునే మీ లాటి స్నేహితుల వలన నా సంబరం రెట్టింపవుతోంది :)

Priya said...

(Thank you very much for the comment)దరిద్రం గజ్జి కుక్కలా వెంటపడితే ఇలాగే జరుగుతుంటాయండీ కొన్ని సార్లు :P వీటిని చూసి మీరు మీ చిన్నప్పటి వస్తువులను గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది వేణు గారు. కాని మీ సంపద ఎక్కడుందో కూడా తెలియకపోవడం కాస్త బాధగా ఉంది. బట్ నథింగ్ తో వర్రీ అండీ ఇప్పుడు రాసుకున్నవి, కొనుక్కున్నవి జాగ్రత్తగా దాచేసి కొన్నేళ్ళు పోయాక చూసుకోండీ. ఏమంటారు?

హరే కృష్ణ said...

ప్రియ గారు,బాగా రాసారు

కార్డ్స్ తో పాటు బాతు చాలా బావుంది
దొరికినందుకు దొర్లి దొర్లి ఆనందాన్ని పంచుకున్నందుకు అభినందనలు :)

>>దరిద్రం గజ్జి కుక్కలా వెంటపడితే ఇలాగే జరుగుతుంటాయండీ కొన్ని సార్లు
ROFL

Priya said...

థాంక్స్ హరి గారూ :) చాన్నాళ్ళయింది మీ నుండి కామెంట్ అందుకొని! చాలా సంతోషం..

రాజ్ కుమార్ said...

హహహహ్.. బాగుందండీ ;)

Priya said...

Thanks Raj gaaru :)

MURALI said...

మీ ట్రెజర్ హంట్ సూపర్

Priya said...

థాంక్ యు........................ :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, January 25, 2013

దొరికేశాయోచ్!!!

యేడాది క్రితం ఓ రోజు సాయంత్రం బీచ్ కి వెళ్ళినపుడు నా బీరువా లాకర్ కీస్  పోగొట్టేసాను.  "ఏంటీ..  అన్నేళ్ల క్రితం బీచ్లో పోగొట్టినవి ఇప్పుడు దొరికాయా నీకూ? మ్మ్.. ఇంకా..?" అన్నదేగా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం..? నాకర్ధమైపోయిందోచ్.. :P  కాని విషయమేంటంటే కీస్ పోయినప్పటి నుండి దాని వంక చూస్తూ లోపల ఉండిపోయిన నా విలువైన వస్తువులను తలుచుకుని రోజుకొక్కసారైనా బాధ పడేదాన్ని. "అంత బాధపడి చావకపోతే ఎవరినైనా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించుకోవచ్చుగా" విసుక్కుంటూ అక్క పారేసిన సలహాను పట్టుకొని నాన్న దగ్గరకు వెళితే.. "ష్యూర్ ష్యూర్.. చేసేద్దాం" అన్నారు కాని పని జరగలేదు. అమ్మ తో చెబితే "తిక్క కుదిరింది. లేకపోతే ఆడపిల్లకు అంత అజాగ్రత్తా! ఇదిగో ఆ తాళాల వాళ్ళను ఇంటికి గట్రా తీసుకొస్తే ఇల్లు చూసుకొని ఓ మంచి రోజు కన్నం వేస్తారు. నాలుగు గ్రీటింగ్ కార్డ్లు, పేపర్లు, పాత ఫోటోల కోసం ఇంటిని దొంగల పాలు చేస్తానంటే కాళ్ళు విరగ్గోడతా" అంటూ అనర్గళంగా అరగంట క్లాసు తీసుకుంది. చివరకు అక్క దగ్గరకే వెళ్లి ఆ తాళాల వాళ్ళు ఎక్కడుంటారే అని బ్రతిమాలితే "ఏమో.. నాకేం తెలుసు? వెతుక్కో" అనేసి తప్పించుకుంది. కొన్ని రోజులు ప్రయత్నించి తరువాత ఆ లాకర్ డోర్లోనే నా వస్తువులన్నిటిని చూసుకుంటూ తాళాల వాడి సంగతి మర్చిపోయాను. మొన్న మా బెడ్రూం లో ఫ్యాన్ పాడయిందని ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చాం. "నో" అంటారని ఊహిస్తూనే "మా బీరువా లాకర్ కీ పోయిందండి. అది తెరవడానికి మీకు సాధ్యపడుతుందా" అనడిగాను. టక్కున ఆయన "ఓ అదెంత పనమ్మా" అని ఐదు నిముషాల్లో ఓపెన్ చేసేశారు! అబ్బ!!!! 1,0000000 వాల్ట్స్ బల్బు లా వెలిగింది నా మొహం. ఇప్పటికీ వెలుగుతూనే ఉందనుకోండీ :)  మీతో షేర్ చేసుకుంటే గాని కుదుటపడనని మనసంటేను.. ఇలా వచ్చాను. 

ఇంతకూ దానిలో ఏమున్నాయో చెప్పలేదు కదూ మీకు? 27 ఫోటోలు.. అవన్నీ చాలా పాతవి ఒక్కటి తప్ప (మిగతా వాటితో పోలిస్తే). అన్నీ మీకు చూయించలేను గాని ఆ ఒక్క కొత్త ఫోటో మాత్రం చూయిస్తాను. ఇంకా 30+ గ్రీటింగ్ కార్డ్స్, డజను గాజులు, పాత డైరీ, ఒక బుల్లి డ్రెస్, నాకు మూడేళ్ళప్పటి నుండి దాచుకుంటున్న అరచేతిలో పట్టేంతటి బుజ్జి బ్లూ టెడ్డిబేర్, నేను 5th క్లాసు చదువుతున్నపుడు నాన్న నాకోసం చైనా నుండి తెచ్చిన గిఫ్ట్, నా సిరి సంపధలను కడుపులో దాచుకునే బాతు ఉన్నాయి. మీకూ చూడాలని ఉందా..? 

ఇవిగో.. 

కొన్ని కార్డ్స్ 

ఇదే నేను చెప్పిన కొత్త ఫోటో :). నేనూ, అనూ. 

ఈ కింద గ్రీటింగ్ మాత్రం నాన్నకు చాలా మురిపెం. విషయం ఏవిటంటే నేను 3rd క్లాసు చదువుతున్న రోజుల్లో నాన్న పుట్టిన రోజున ఇవ్వాలని  అమ్మ గ్రీటింగ్ కార్డు కొంది. "అలా ప్లైన్ గా ఇస్తే ఏం బావుంటుందిమా? ఏమైనా రాసి ఇవ్వు" అన్నాను. "ఏం రాస్తే బావుంటుందే" అని అడిగింది. నేను చాలా ఆలోచించి చించి "Many more happy returns of the day.. my dear sweet heart అని రాయి బావుంటుంది" అన్చేప్పేసి తుర్రుమనబోగా, "అదేదో నువ్వే రాసేసెయ్ ప్రియమ్మా.. నీ రైటింగ్ భలే బావుంటుంది గా" అని ఐస్ కూడా పెట్టేసరికి పొంగిపోతూ రాసి పెట్టాను. తీరా నాన్న దాన్ని చూసాక పడి పడి నవ్వారు. మాకేమి అర్ధం కాలేదు. అక్క గ్రీటింగ్ కార్డు తీసుకొని చూసి నాన్నలాగే నవ్వడం మొదలుపెట్టి కార్డుని అమ్మకిచ్చింది. అమ్మ కూడా చూసి నవ్వేసింది. అంతలా ఏముందబ్బా అని నేనూ తీసుకొని చూసాను. ఎంత చూసినా ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు. "అయినా ఎందుకొచ్చిందిలే.. చూసాక వాళ్ళు నవ్వారు కనుక నేనూ నవ్వాలి. లేకపోతే నాకేమి తెలీదనుకుంటారు" అని నేను కూడా విరగబడి కళ్ళల్లో నీళ్లోచ్చేలా నవ్వాను. ఈ లోపు నాన్న నన్ను దగ్గరకు తీసుకొని "Sweat heart" కాదు డార్లింగ్.. "Sweetheart" అన్నారు. ఇక నా ఎక్స్ప్రెషన్ మీ ఊహకే వదిలేస్తున్నా. 22 comments:

 1. కళ్యాణ్25/1/13

  బాగుందండి.. చాలా sweet గా రాసారు.

  ReplyDelete
 2. థాంక్స్ కళ్యాణ్ గారూ :)

  ReplyDelete
 3. అందమైన జ్ఞాపకాలని గుర్తులుగా దాచుకుని, అంతకన్నా ఎంతో విలువగా చూసుకుంటున్న మీకు అభినందనలు. బీరువా తాళాలు పోయినా అన్నీ భద్రంగానే ఉన్నాయి గా? తెరవగానే ఎంత ఆత్రంగా అన్నీ చూసుకునుంటారో ఊహించగలము.
  చాలా బాగుంది ఇలా అందరితోనూ పంచుకోవటం.
  మనసు కుదుటపడింది చాలు :)

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు చాలా కృతజ్ఞతలు పండు గారూ :)
   అవునండీ.. తెరవగానే నా వస్తువులన్నిటిని మళ్ళీ మళ్ళీ తాకుతూ, నానమ్మ, తాతయ్య, నాన్నల చిన్నప్పటి ఫోటోలూ అవీ మళ్ళీ అప్పుడు దాచుకున్న డబ్బులు చూసుకొని తెగ మురిసిపోయాను :)

   Delete
 4. Chala bhaga rasaru andi... keep posting...

  ReplyDelete
  Replies
  1. SreeKanth gaaru.. thanks for the comment :)

   Delete
 5. మీ జ్ఞాపకాలు బాగున్నాయ్. మాతో పంచుకున్నందుకు సంతోషం.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అండీ.. మీతో పంచుకోవడం నాకూ చాలా సంతోషం :)

   Delete
 6. చాలా బాగా రాసారు మేడమ్..ఒకరి జ్ఞాపకాలు మరొకరితో పంచుకుంటే ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు ..మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగింట్లోకి స్వాగతం నవజీవన్ గారు :)
   మేడం అన్నారు కదూ నన్నూ...?!! క్షణ కాలం గాల్లో తెలిపోయాను :P కాని నేను 90లో పుట్టానండీ చిన్నదాన్నే.. ప్రియ అనండి :)
   తీపిజ్ఞాపకాలు ఇలా పంచుకోగలగడం నా భాగ్యమండీ.

   Delete
 7. ప్రియ గారు బాగున్నాయి మీ స్వీట్ మెమోరిస్.

  ReplyDelete
  Replies
  1. మీకూ నచ్చాయిగా.. థాంక్స్ డేవిడ్ గారు :)

   Delete
 8. అమ్మో... ఎన్ని ఆస్తులో.. చిన్ననాటి వస్తువులు, ఆ జ్ఞాపకాల కంటే విలువైన ఆస్తులు ఏముంటాయి ఎవరికైనా...

  అలాంటి ఆస్తులు కలిగివున్న వారందరూ సంపన్నులే... అందుకే మన ప్రియమ్మ కూడా సంపన్నురాలే కదా... :)

  మంచి జ్ఞాపకాలను మా అందరితో పంచుకున్నందుకు సంతోషం సుమండీ... :)

  ReplyDelete
  Replies
  1. Thanks for the comment, Shobha gaaru. నా రాతలు ఎలా ఉన్నా వాటిని చదివి నా జ్ఞాపకాలను పంచుకునే మీ లాటి స్నేహితుల వలన నా సంబరం రెట్టింపవుతోంది :)

   Delete
 9. అమ్మో ఇంత అపురూపమైన సంపద ఉన్న లాకర్ కీ అసలు ఎలా పోగొట్టుకున్నారండీ :-) ఎనీవేస్ ఇపుడు తెరిచేశారు మీ సంపదని మళ్ళీ తనివితీరా చూస్కున్నారు కనుక ఆల్ హాపీస్ :-))) మాతో కూడా పంచుకున్నందుకు థాంక్స్... నేను చిన్నపుడు దాచుకున్న వస్తువులు గుర్తొచ్చాయి... ఇపుడవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలీదులెండి.

  ReplyDelete
  Replies
  1. (Thank you very much for the comment)దరిద్రం గజ్జి కుక్కలా వెంటపడితే ఇలాగే జరుగుతుంటాయండీ కొన్ని సార్లు :P వీటిని చూసి మీరు మీ చిన్నప్పటి వస్తువులను గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది వేణు గారు. కాని మీ సంపద ఎక్కడుందో కూడా తెలియకపోవడం కాస్త బాధగా ఉంది. బట్ నథింగ్ తో వర్రీ అండీ ఇప్పుడు రాసుకున్నవి, కొనుక్కున్నవి జాగ్రత్తగా దాచేసి కొన్నేళ్ళు పోయాక చూసుకోండీ. ఏమంటారు?

   Delete
 10. ప్రియ గారు,బాగా రాసారు

  కార్డ్స్ తో పాటు బాతు చాలా బావుంది
  దొరికినందుకు దొర్లి దొర్లి ఆనందాన్ని పంచుకున్నందుకు అభినందనలు :)

  >>దరిద్రం గజ్జి కుక్కలా వెంటపడితే ఇలాగే జరుగుతుంటాయండీ కొన్ని సార్లు
  ROFL

  ReplyDelete
 11. థాంక్స్ హరి గారూ :) చాన్నాళ్ళయింది మీ నుండి కామెంట్ అందుకొని! చాలా సంతోషం..

  ReplyDelete
 12. హహహహ్.. బాగుందండీ ;)

  ReplyDelete
 13. మీ ట్రెజర్ హంట్ సూపర్

  ReplyDelete
  Replies
  1. థాంక్ యు........................ :)