Tuesday, February 12, 2013

మొగలిపూలు

 మొన్న నాకేమి తోచక ఏదో పుస్తకాలు తిరగేస్తుంటే ఈ కథ కనిపించింది. ఎందుకోగాని చాలా నచ్చింది. మీరూ ఓసారి చదివి చూడండి.
Google image

మే నెల.. ఎండ మండిపోతోంది. ఉదయం కాకుండా సూర్యుడు తాపాన్ని కుమ్మరిస్తున్నాడు. తెల్లవారుజామునే కుందేరుగట్టుకు పోయిన ముసిలయ్య అతికష్టం మీద నాలుగు మొగలిపొత్తులు పొదల్లోంచి తుంచేసరికి బారెడు పొడుగున ఎండెక్కేసింది. "ఇయాల్టికింతే.. మర్రొండ్రోజులదాకా పండవు పూలు"అనుకుంటూ మొగలిపూలు ఎండ వేడికి తగ్గకుండా పచ్చి ఆకుల్లో చుట్టి పదిలంగా పట్టుకున్నాడు. గట్టు దిగి రోడెక్కి వడివడిగా ఇంతింత అంగలు వేసుకుంటూ టౌన్ వైపు నడుస్తున్నాడు ముసిలయ్య. టౌన్లో బస్టాండ్ అతని వ్యాపార స్థలం. తన వాడకట్టలో పూలు కొనేవాళ్ళేవరూ లేరు. అక్కడంతా గంజికి గతి లేని కడుపేదలే. ఇక పూలకీ, సరదాలకీ ఎక్కడ తేగలరు? తలకి చవురే ఉండదు.. ఇక సిగలోకి పూలెందుకు? ఊళ్ళో అయినా ముసిలయ్య ఇంటింటికీ తిరిగి పూలమ్మడు. వేసవిలో కొల్లలుగా వచ్చే మల్లెలు, జాజులు, విరజాజులు, కనకాంబరాలు.. వీటికే మోజుపడతారు.ఆ మాలలు రోజూ విధిగా తలలో తురుముకుంటారు గాని, మొగలిపూలు కొనరు. మొగలిపూలకి అందం తక్కువ, పరిమళం ఎక్కువ. మిగతా అన్ని పూలకుండే సౌకుమార్యం, అందం మొగలిరేకుకుండదు. దాన్ని మాలగా కట్టుకోవడం కష్టం. ప్రత్యేకమైన పద్ధతిలో పువ్వులా అల్లి తలలో ముడుచుకోవాలి. పూలబజార్లో పావలాకి దోసెడు మల్లెలు పోస్తారు. పది పైసలిస్తే మరువం పెడతారు. ఒక మొగలిపొత్తు కనీసం రూపాయైనా ఉంటుంది. ఇక ఎవరు కొంటారు? అందువలన ముసిలయ్య వీధుల్లోకి తిరిగి పూలమ్ముకోవడం మానుకున్నాడు. అందువల్ల శ్రమే కాని ఆదాయం కనబడలేదు అతనికి. 

               పీర్లసావిడివద్ద ఆగాడు ముసిలయ్య. నేర్పుగా నాలుగు నిండుపొత్తుల్ని ఆరింటిక్రింద తయారుచేసాడు. లేకపోతే మళ్ళీ రెండు మూడు రోజులకు పూలు విచ్చుకునే వరకు పస్తే. చిరిగిన పైగుడ్డకు మొగలిపొత్తులు చుట్టి మళ్ళీ వేగంగా నడక సాగించాడు.  అక్కడినుండి రెండు మూడు మైళ్ళు నడిస్తే టౌన్ బస్టాండ్ వస్తుంది. అక్కడే ముసిలయ్య పూలకి కాస్త గిరాకి. కాయాకష్టం చేసుకునే పడుచుపిల్లలు, పుట్టింటినుండి అత్తింటికో, అత్తింటి నుండి పుట్టింటికో, మరో అన్నగారింటికో పోతూ ప్రయాణంలో పూలు, పళ్ళు కొనుక్కుంటారు. ముఖ్యంగా ఆ పల్లె పడుచులే ఈ మొగలిపూలు ఎక్కువగా ఇష్టపడతారు. 

              ముసిలయ్య నడుస్తునే ముఖం మీంచి దిగకారుతున్న చెమటలు చేత్తో తుడుచుకున్నాడు. నిమిష నిమిషానికి ఎండ తీవ్రత పెరిగిపోయి నిప్పులు కుమ్మరిస్తున్నట్లుంది. ముసిలయ్య సన్నగా, పొడవుగా, గాలివాటుకి వంగిపోయిన సర్విబొంగులా ఉంటాడు. పీచులు రేగి, ఎండుగడ్డిలావున్న పల్చనిజుట్టు, కండనేది లేకుండా కేవలం ఎముకల్ని కప్పివుంచిన చర్మం, పీక్కుపోయిన ముఖంలో ప్రస్ఫుటంగా అతికినట్లు కనిపిస్తున్న పెద్ద పెద్ద మిడిగుడ్లు... బారుగా వున్న నల్లని తారురోడ్డు మీద నడుస్తూనే ఉన్నాడు ముసిలయ్య. అతనికా నడకలవాటే! ఎండా, వాన, ఉదయం, సాయంత్రం ఇవేమీ పట్టవు ఇతనికి. అతని పాదాలు నిప్పులమీధైనా వడివడిగా నడవగలవు. ఎండలో నడిచి నడిచి కాయలు కాసిన ఆ పాదాలకు వేడి బాధ తెలీదు. నల్లని దుమ్ముకొట్టుకొని ఉన్న ఒళ్లంతా చమటకు చితచితలాడుతూ బురద పూసుకున్నట్లుంది. తన చేతిలోని మొగలిపూలు దారినపోతున్న ఏ ఆడపిల్లనైనా ఆకర్షిస్తాయేమోనని ఆశ. కదులుతున్న ఎర్రని గుడ్డతో అడపాదడపా అటు, ఇటు చూస్తున్నాడు.  

              అలా నిర్లిప్తంగా నడుచుకుంటూ అదిగో... టౌన్ బస్టాండ్కు వచ్చేసాడు ముసిలయ్య. ఒక్కక్షణం ఆగి ఎండి ఎముకలు కనబడుతున్న గుండెలనిండా గాలినింపుకొని ఒగుర్పు తీర్చుకున్నాడు.

              "మొగలిపూలు....  మొగలిపూలు" అంటూ బొంగురుగా అరుస్తూ బస్సుల్లో ఆడ ప్రయాణికులు కూర్చున్న కిటికీల దగ్గర ఆగి, ఆగి తిరుగుతున్నాడు.  

              "ఇదిగో.. ఎంత?"

              "రెండ్రుపాయలు..."
              "అబ్బో..! రూపాయే గదయ్యా"
              
               ముసిలయ్య తొందరపడదల్చుకోలేదు. ఇంకా టైముంది బస్సు కదలడానికి. ఒంగోలు బస్ దగ్గరకు వెళ్ళాడు ముసిలయ్య. బస్ కదలబోతోంది. డ్రైవరేక్కేసాడు. కండక్టర్ రైట్ కొడుతున్నాడు. చప్పున ఒక పిల్ల పిలిచింది. కిటికీలోంచి రెండ్రూపాయలిచ్చి ఒక పొత్తు అందుకుంది. 'ఆ పిల్ల కళ్ళలో మొగిలిపువ్వు మీద ఎంత ఆపేక్షో..' ముసిలయ్య గుండె అదోలా అయింది. 'బేరమాడకుండా చెప్పినంతా ఇచ్చింది పిచ్చితల్లి' ఆ పోత్తునిండా లేత రేకులుంచితే బాగుండేది' బస్సు కదిలిపోయింది. ఇందాకటి పేట బస్సు కదలబోతోంది.

                "రూపాయిన్నరియ్యమ్మా!" అన్నాడు ముసిలయ్య కిటికీ దగ్గర నిలబడి. ఆ పిల్ల లోపల్నించి కొసిరింది. "రూపాయి పావులా ఇత్తా" బస్సు హారను మోగింది. ఆలస్యం చేస్తే బేరం పోతుంది. ముసిలయ్య ఇక ఆలోచించకుండా రూపాయి పావులా పుచ్చుకొని మొగలి పొత్తందించాడు. 

              ఇలా చాలాసేపు తిరిగి అయినకాడికి మొత్తం పొత్తులమ్మేసాడు ముసిలయ్య. అసలు పన్నెండు రూపాయలు రావాలి. పదన్నా వస్తాయనుకున్నాను. ఎనిమిది రూపాయలే గిట్టాయి.

              చిల్లర రొంటిన దోపుకొని ఇంటిముఖం పట్టాడు ముసిలయ్య. త్రోవలో షావుకారు దగ్గర 'సోలెడు నూకలు.. పావులా చింతపండు... పదిపైసల ఉప్పు.. పావులా మిర్చి.. నీరుల్లి కట్టించుకున్నాడు.

             'నోనంతే గంజిలో మిరపకాయో, ఉప్పుగల్లో నంజుకొని తినీగల్ను.. పసిది... పిల్ల అల్లాడిపోద్ది.. రోంతపచ్చడి నూరితే సరిపోద్ది'....

              ఊరి చివర పోరంబోకు స్థలంలో ఒక మూలగా ఉంది ముసిలయ్య గుడిసె. భుజాన మూట వేలాడేసుకుని చేతులూపుకుంటూ వస్తున్న అయ్య దగ్గరకు గెంతుతూ వచ్చింది పదేళ్ళ ముత్తెం "అయ్యా.. అప్పుడే వచ్చేసినావా... ఎన్ని పూలమ్మినావే?" అని అడుగుతూ

              "అయన్నీ ఆనిక సెప్తాగాని బేగెల్లి పొయి ముట్టించుతల్లీ! రోంత గంజి కాసుకుందాం" అయ్యమాట వింటూనే గెంతుకుంటూ వెళ్ళింది ముత్తెం. గుడిసె ఇవతల మూడురాళ్ళు పేర్చి అమర్చిన పొయ్యిలో ఎండుచితుకులు రెండువేసి మంట చేసింది. కుండలో నీళ్ళుపోసి ఎసరు మరుగుతుంటే రెండు పిడికిళ్ళు నూకలు పోసాడు ముసిలయ్య. చిన్న బండమీద గుంద్రాయితో ఉల్లిపాయ, చిట్టెడంత చింతపండు, చిటికెడు ఉప్పు వేసి పచ్చడి తయారుచేసాడు. అయ్యా చల్లార్చి చేసిన గంజి తాగుతూ "అయ్యా....... మరే.... మరే....." అని సణుగుతుంటే "ఏటే తల్లా... మరే... మరే... అంటావేగాని ఏటో సెప్పవే...." అంటూ నడుం వాల్చాడు ముసిలయ్య. ఊరిచివర ఆరుబయలు ప్రదేశంలో గాలి నిరాటంకంగా వీస్తోంది. 

               కుందేరు సమీపంలో ఉన్న గుడిసెల మీదకు ఏటిమీంచి చల్లని గాలి తెరలుతెరలుగా వీస్తోంది. పొట్టనిండా ఉప్పుగల్లు నంజుకొని నూకలగంజి తాగాడేమో ముసిలయ్యకు కళ్ళుకూరుకొస్తున్నాయి. కటిక నేలమీద వాలి జోగుతున్న వాడల్లా.... " అయ్యా.... అయ్యా" అన్న ముత్తెం గుణుగుడు విని కళ్ళు తెరిచి "ఏటే బంగారు..... సెప్పవే?" 

               "అయ్యా మరే... రేపే....."
               "ఊం బేగిసెప్పమ్మా... నాకు తూలొస్తుంది"

               "అయ్యా మరే.... రేపే నాకో మొగిలిపోత్తియ్యవే" అంది గోముగా, అయ్య బొజ్జ మీద చిట్టిచేత్తో ప్రేమగా నిరుమతూ.
                "ఓలమ్మో... మొగిలిపోత్తే......... ఎందుకమ్మా నీకు?"
                 "ఎందుకేతి.... తలలో ఎత్తుకుంతానే" గుండ్రటి చిన్ని కళ్ళు ఆశగా తిప్పుతూ ఎర్రనూలు ముక్క ముడివేసి వేలెడు పిలక జడ ముందుకి వేసుకొని ముద్దుగా చెప్పింది ముత్తెం.

                ముసిలయ్య ప్రేమగా నవ్వాడు. "అబ్బోసి.....! నీ పిలక జెడకి మొగిలిపొత్తు కావాలంటే..... అద్సరేగాని ముత్తెవా! వోరు కుడతారే నీకు తల్లో పూలు" అంటుంటే పిల్ల తల్లి గుర్తొచ్చినట్టుంది. ముసిలయ్య గొంతు కదిలింది.

                "పోలక్క  కుడతదయ్యా...... ఇంచక్కా చిన్ని చిన్ని పూలు కట్టి జడనిండా కుడ్తది. ఇంచక్కుంటుందో.... అయ్యా ఒక్క పొత్తియ్యవే.. ఊ!"

                 "ఏటి ఒకపొత్తే......"
                 "ఊ ఒక్క పొత్తేగదయ్యా...." 
                 "మొగిలిపొత్తంటే మాటలే ఎర్రిపిల్లా... రెండ్రూపాలు"
                 
                 "అయితే ఏటేటి..." అలకగా మూతి ముడిచి గరుస్తూ అడిగింది ముత్తెం. కూతురు బుగ్గ పుణికి "ఏటీనేదే.. సిట్టితల్లే.. మొగిలిపూ నువ్ తల్లో ఎట్టుకుంటే మనయాపారం ఏంగావాలమ్మా.... గంజిలోకి నూకలేట్టొత్తాయే..." అనునయిస్తూ అన్నాడు ముసిలయ్య. 

                  అయ్య పూలమ్మి పైసలు తెస్తేనే అయ్యాల కూడని ముత్తేనికి తెలిసింది. అయినా తనడిగింది ఒక్క పొత్తేగందా! ముత్తెం మరేమీ మాట్లాడలేదు. పసిదాని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న నిరుత్సాహం ముసిలయ్య గుండెను కదిలించింది. 

                   "అట్టా దిగులు పదమాకే తల్లా... సూద్దార్లే... ఈతూరి ఎక్కువ పొత్తులు దొరుకుతే తీసుకుందు" ఆ ముక్కకే ముత్తెం ముఖం ఇంతైంది....... ఆనందం దీపంలా ముఖమంతా వెలిగింది. సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకోవడానికి వెళ్ళింది. రోజూ మొగలిపూలు కుట్టుకుని... చాకింటి గౌను వేసుకొని ఆడుకుంటున్నట్లు ముత్తేనికి ఎన్ని కలలో.............

                    రోజులు గడుస్తున్నాయి గాని అయ్య పువ్వు ఇవ్వనేలా! పిల్ల మనసులో ఆరాటం, కోరిక పెరిగిపోతోంది. (ఇంకా ఉందండీ.. అంతా దీనిలోనే రాస్తే పెద్దగా కనిపించి విసుగొస్తుందేమో అని, కథని రెండు భాగాలుగా రాస్తున్నాను. భయపడకండీ "నా ప్రేమాయణంలా" లా దీని నెక్స్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ని ఆలశ్యంగా పోస్ట్ చేయను :). మరికాసేపట్లో పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే అన్నిసార్లూ మీ ఓపికకి పరీక్ష పెట్టి మీతో అక్షింతలు వేయించుకోవడం నాకిష్టంలేదు :) ఇంతకూ కథెలా ఉంది??)

6 comments:

Chinni said...

Darling..
Waiting for the next part.. వెంటనే అంటే ఒక గంటలో వేస్తావేమోనని ఎదురు చూస్తున్నాను..

మాలా కుమార్ said...

katha baagundi .

చిన్ని ఆశ said...

కథ చాలా బాగుంది. రెండవ భాగమూ త్వరగా పెట్టేయండి. చివరికి ఏదో ట్రాజెడీ ముగింపు ఉంటుంది లా ఉంది కథలో....

Priya said...

Thanks andee..:)

Priya said...

నువ్వన్నట్లు వెంటనే ఓ గంటలోనే పోస్ట్ చేద్దామనుకున్నాను గాని శని వెంటపడి చేయలేకపోయాను డార్లింగ్.. జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశా.. త్వరత్వరగా చదివేసి నీ అభిప్రాయం చెప్పు :)

Priya said...

థాంక్స్ పండు గారూ.. :)
ఇప్పుడే రెండో భాగమూ పోస్ట్ చేసాను. ట్రాజెడీ అంటే.. నాకు అలా ఎండ్ అయె కథలంటే పెద్దగా ఇష్టముండవండీ. ఆ బాధ నన్ను అంత త్వరగా వదలదు. ఈ కథ ట్రాజెడీతో ముగియదు గాని కచ్చితంగా గుండెను మెలిపెట్టినట్లు ఉంటుంది. చదివి మీరే చెప్పండి పోనీ...

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

 1. Darling..
  Waiting for the next part.. వెంటనే అంటే ఒక గంటలో వేస్తావేమోనని ఎదురు చూస్తున్నాను..

  ReplyDelete
  Replies
  1. నువ్వన్నట్లు వెంటనే ఓ గంటలోనే పోస్ట్ చేద్దామనుకున్నాను గాని శని వెంటపడి చేయలేకపోయాను డార్లింగ్.. జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశా.. త్వరత్వరగా చదివేసి నీ అభిప్రాయం చెప్పు :)

   Delete
 2. కథ చాలా బాగుంది. రెండవ భాగమూ త్వరగా పెట్టేయండి. చివరికి ఏదో ట్రాజెడీ ముగింపు ఉంటుంది లా ఉంది కథలో....

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ పండు గారూ.. :)