Tuesday, February 12, 2013

మొగలిపూలు (చివరి భాగం)

                    "అయ్యా! యాడ్నించి తెత్తావే నువు పూలు.."
                    "కుందేర్నింఛి... లోతట్టుగట్టులో పొదలుంటాయ్... ఆడికి పోయి దొంటుకర్రతో లాగి కోత్తా...."
                    "మరందవా సేతికి......?"
                    " లోనికి అందుతాయ్.. పోగూడదు. దూరాన్నించే కొయ్యాల"
                    " ఆడ పాములుంటాయంట గదయ్యా, రాములమ్మ సెప్పింది"
                    " ఆ...... ఉంటాయ్. పూలోసనకి పురుగు, పుట్ర సేర్తది... పొదల్లోకి...! జాగరతగా... ఒడుపుగా తుంపాల పూలు"
                     "ఊహు!" అయ్యా గుండెమీద తలవాల్చి నిద్రకు జోగుతోంది ముత్తెం.
                      ' అదే ఆలాపన బిడ్డకి.. ఒక్క మొగిలిపూతెచ్చి పిల్లమురిపెం తీర్చలేకపోతుండ' పిల్ల తల నిరుముతూ తన అసమర్ధతకు బాధపడుతున్నాడు ముసిలయ్య.

                       పుట్టి బుద్ధెరిగికాడ్నించి ఓ గోనడగల.. ఓబొమ్మడగల.. ఇగో.. ఉప్పుడీ మొగిలిపువ్వే అడగతాంది.... పద్దాకా అదే ఆలాపన... తల్లికెంత మక్కువగుందో? ఎట్టాగైనా ఈసారి పిల్ల కోరిక తీర్సాల..." అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాడు ముసిలయ్య. 

                        మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతోంది. 'అయ్య ఊళ్ళోకెళ్ళిపోయిండు.. మల్ల పొద్దూకి వత్తడు' ముత్తెం గుడిసె తలుపులాగి బిగించికట్టి కుందేటివైపు పరుగుతీసింది. ఉత్సాహంతో పరుగుపెడుతున్న ఆ లేత పాదాలకు ఇసుక తిన్నెలమీద మండుతున్న ఎండవేడి తెలీటంలేదు. సంధించి విడిచిన బాణంలా రయ్ న ఒక్క పరుగుతో కుందేటి గట్టుకు చేరింది ముత్తెం.

                         "ఈడ్నించే నాగుంది... అయ్య పూలు తెత్తాడు" అనుకుని కిందికి ఏట్లోకి తొంగిచూసింది. ముత్తెం. నిండా ఎంతో ఆనందం, ఆత్రుత, గట్టుకు ఆనుకుని ఏటిచుట్టూ ఏవేవో చెట్లు, పొదలు.. ఏటిమీంచి వీస్తున్న గాలి ఎండ తీవ్రతను తగ్గిస్తోంది. ముత్తెం క్షణం ఆగి అలుపు తీర్చుకుంది. రోడ్డుకంటే ఎత్తుగా ఉన్న గట్టు మీదకి వచ్చి నిలబడింది. చింకిరిబింకిరిగా కళ్ళకడ్డుపడుతున్న వెంట్రుకలు పైకి తోసుకుంటూ కిందకు తొంగి చూసింది. కింద పెద్ద వలయంలా నీటి గుంట ఉంది. చుట్టూ అంచున లెక్కలేనన్ని తుప్పలు, పొదలు, ముళ్ళ మొక్కలు గజిబిజిగా అల్లుకొని ఉన్నాయి. ముత్తెం కళ్ళు చురుగ్గా తిప్పుతూ చుట్టూ చూసింది. 'ఈడ్నించే తెత్తాడా.... అయ్య పూలు... మరేటి మొగిలిపూలేడా అగపడవే...' అనుకుని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది. దట్టమైన చిట్టడవిలా ఉన్న ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ఏటికి ముందు భాగంలో దూరాన కొంతమేర రేవుగా చేసుకుని నీళ్ళకు వాడుకుంటారు. లోపలికి ఆవేపు, ఈవేపూ ఎవ్వరూ రారు. పూలమీద నిలవనీయని కోరిక ముత్తేన్నిలా తరుముకువచ్చింది.మొగలిపూలను వెతుక్కుంటూ గట్టంట అడుగులో అడుగేసుకుంటూ నడుస్తోంది ముత్తెం. తీరానికి అటు ఇటు అంతా మొగలి పొదలే. కాని పూలులేవు. ముత్తేనికవే మొగలి మొక్కలని తెలీదు. తీగెలు, తుప్పలు తప్పించుకుంటూ నడిచి నడిచి గట్టు మధ్యకు వచ్చేసింది. 

                            "ఈడాలేవు పూలు.. ఏటిసేద్దారి! అయ్యొచ్చేత్తాడేమో.. పొద్దోతోంది' అనుకుని నిరుత్సాహంతో వెనుతిరగబోతుండగా మురిపిస్తూ పొదల్లోంచి చూసిందో మొగలిమొగ్గ. అటు ఇటు కలవరంగా చూస్తున్న ముత్తెం కళ్ళు తళుక్కున మెరిసాయి. చుట్టూ కమ్మి ఉన్న ముళ్ళ ఆకుల మధ్యలోంచి లేలేత బంగారు రంగులో  మిలమిల మెరుస్తున్న పువ్వును చూసి ముత్తెం టక్కున ఆగిపోయింది. ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఆ చిన్నారి ముఖం వికసించింది.

                              "అగో... అదే మొగిలిపువ్వు.., బలే బలే..." అని అలసట మరచి ఆ పువ్వు కోసుకునే ప్రయత్నంలో పడింది.చేతిలో బారెడు పొడవున్న కర్రపుల్ల ఉంచుకొని చిన్న చిన్న అడుగులు జారకుండా నడుస్తూ గట్టుకిందకి వచ్చింది. "అయ్యకీపూ అగపడ్నేదు నాగుంది. అందుకే ఒగ్గేసిండు..." అనుకుంటే మనసెంతో సంభ్రమంతో నిండిపోయింది. పువ్వు తన సొంతమైపోయినట్టే మురిసిపోతూ దగ్గిరగా వచ్చేసింది. కర్ర కొన చీల్చి చీలికల మధ్య చిన్న పుల్లముక్క ఉంచి గుడ్డ పేలిక ముడేసింది. ఆమడ దూరంలో నిలబడి ముందుకు వంగి పువ్వు వంక చూస్తూ.. కర్ర పొదలో గుచ్చి లాగింది. పువ్వు తెగలేదు. మళ్ళీ బలంగా లాగింది. పొద కాస్త కదిలింది. పళ్ళు బిగించి బలమంతా పెట్టి లాగింది. మొగలిపొత్తు తెగి కర్రతో పైకి వచ్చింది. 'వచ్చేసినాది... అబ్బ... ఎంత పెద్ధ పువ్వో.... ఎంత బాగుండాదో..' అని పొంగిపోతూ కర్రలోంచి పువ్వును పదిలంగా తీసుకుంది. 'బేగి గుడిసెకి పోవాల... అయ్యకి పూ సూపింసాల.... అయ్యా ఏటంటాడో? అక్కసేత తలసుట్టు పూలల్లించుకోవాల....' అపురూపంగా పువ్వు సందిట పొదువుకుని ఒక్క ఉదుటున గట్టెక్కి రోడ్డుమీదకి వచ్చేసింది ముత్తెం.

                               మునిమాపువేళయింది. ముసిలయ్య పూల అమ్మకం పూర్తి చేసుకుని ఇంటిముఖం పట్టాడు. తడిగుడ్డకు చుట్టి అతని చేతిలో ఉన్న ఒకే ఒక్క మొగలిపొత్తు దోవంతా పరిమళాలు విరజిమ్ముతోంది. 

                              "ఇదిగో అబ్భాయ్... మొగలిపూలేనా! ఇటు తీసుకురా" అన్న పిలుపు విని చప్పున ఆగిపోయాడు. పెద్ద మేడముందు గేట్లో నిలబడి పిలుస్తోందో యువతి. పక్కనే ఓ చిన్న పిల్ల... పువ్వు కొనమని అమ్మని సతాయిస్తూ.. మారం చేస్తూ.

                              "కొంటానన్నాగా.. ఉండు.. రానీవాడ్ని..." అని సముదాయిస్తోంది తల్లి. ముసిలయ్య అటు చూసాడు. 'పువ్వు కోసం మారాం చేస్తున్నట్లుంది పిల్ల.. బేరం అడగకుండా కొంటదేమో...' ముసిలయ్య మనసు ఊగిసలాడింది. అడుగు వెనక్కి వేయబోయి ఆగిపోయాడు. 

                              "ఇది అమ్మడానికి కాదమ్మా" అనేసి కదిలాడు అక్కడ్నించి. వెనుకనుంచి చిన్నిచిన్ని పాదాలతో నేలని తన్నుతూ "అమ్మా.... పువ్వే.." అని ఆ పిల్ల ఏడుస్తూ మారాం చేయటం వినిపిస్తోంది. ముసిలయ్యకు ముత్తెం గుర్తుకువచ్చింది. తలనిండా పూలు కుట్టుకుని సంబరపడిపోయే కూతుర్ని తలుచుకుని మురిపెంగా నవ్వుకున్నాడు. ఇన్నాళ్ళకి పిల్లకోరిక తీరుతోందన్న సంతోషంతో త్వరత్వరగా నడిచి గుడిసెకి వచ్చేసాడు. "ముత్తెవా.. అమ్మాయ్... ముత్తెవా... బేగిరా.." అని అంత దూరంలోంచే పిలుస్తున్నాడు. "తను చేతిలో పువ్వు పెట్టినపుడు చూడాలి పిల్ల ముఖంలో ఆనందం..." తలుచుకుంటేనే ముసిలయ్య మనసంతా కూడా పులకరించిపోతోంది. "తనేం కట్టపడ్డా పిల్లదాన కోసమేగందా.. ఓ రెండ్రోజులు గంజి తాక్కుంటే సర" కష్టపడినా, నష్టపడినా ముద్దులకూతురి ముచ్చట కాదనలేని తండ్రే ముసిలయ్య. మరి అయ్య పిలుపుకి ముత్తెం బయటకి రాలేదు. ఎప్పుడూ ఆయాలకి గుడిసె ముంగిల పిల్లోళ్ళతో ఆడుకుంటూ అంత దూరంనుంచే పరుగున వచ్చి "అయ్యా... వచ్చేసినావా" అని సంబరపడుతూ కాళ్ళకు చుట్టేసుకునే కూతురు ఎదురుపడకపోయేసరికి ముసిలయ్య ఆరాటపడ్డాడు. గుడిసెలోపల, బయట అంతా వెదికి, ముత్తెం సావాసగాళ్ళను కూడా అడిగాడు. "మాకు తెల్దంటే.. మాకు తెల్ధన్నారు వాళ్ళు.." బిడ్డ ఎక్కడికి పోయిందో?" అని ఆలోచిస్తూ, ఎదురుచూస్తూ గుడిసె ముంగిట్లోనే కూలబడ్డాడు ముసిలయ్య. బిడ్డ క్షణం అవుపడకపోతే అతనికి కూడుసయించదు.

                             ఇంతలో వెనక నుంచి పరుగుపరుగున రొప్పుతూ వచ్చి "అయ్యా.. వచ్చీసినా" అంటూ అయ్యా మెడను వాటేసుకుంది ముత్తెం. ముసిలయ్య అలవికాని ఆనందంతో బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు. "ఏడకి బోయావమ్మా ఎవురికీ సెప్పకుండా.." ముత్తెం తండ్రి మాటకు బదులివ్వకుండా "అయ్యా.. నువ్వు కల్లు మూసుకో ముందు.." అంది గుబులు తీరిన గుండెతో ఆనందంగా నవ్వి. "ఏట్రా బంగారూ.. ఎందుకమ్మా" అన్నాడు ప్రేమగా. "కల్లు మూసుకోమన్నానా... కల్లు మూసుకుని సెయ్యట్టు.." అంది ముత్తెం వదలకుండా. "ఊ.. సరే" ముసిలయ్య కళ్ళుమూసుకున్నాడు నవ్వుకుంటూ. సాచిన అయ్య అరచేతిలో మూసిన తన గుప్పెట ఉంచి వదిలింది ముత్తెం. "ఇగ సూస్కో" అంది పకపకలాడుతూ. 
Google image

"ఏట్రా నానా.." అంటూ కళ్ళుతెరిచిన ముసిలయ్యకు అరచేతిలో చమటకు తడిసిన రెండ్రూపాయల కాగితం కనిపించింది. అంతులేని ఆశ్చర్యంతో చూస్తున్న అయ్యతో " ఏటయ్యా.. అట్టా సూత్తవ్..మందే ఆ డబ్బు.. కుందేటికి పోయి మొగిలి పూతెచ్చినానయ్యా.. ఓయమ్మడిగితే అమ్మేసినా..." ముసిలయ్య కూతురిని అపురూపంగా దగ్గరకు లాక్కున్నాడు. "ఇంకెప్పుడు ఆడకి పోమాకమ్మా.. పురుగు, పుట్ర ఉంటది... నీకేటైనా అయితే నే బతగ్గలనా.. సెప్పు" అంటూ కన్నీళ్ళతో, చేతిగుడ్డను చుట్టి తను తెచ్చిన పువ్వు ఆప్యాయంగా కూతురి కందించాడు. ముత్తెం నిదానంగా, నిరాసక్తంగా పువ్వు వంక చూసింది. "నాకెందుకయ్యా పువ్వు? అమ్మితే నూకలు కొనుక్కోచ్చుగందా.. నానూ అందుకే పూ అమ్మేసినానయ్యా.." ముసిలయ్య వింతగా కూతురి వంక చూసాడు. బతుకు భారం అప్పుడే మీదపడినట్లు అలసటగా ఉంది. తలరేగి, అక్కడక్కడా గీరుకుపోయి, దుమ్ముకొట్టుకుని ఉంది వళ్ళంతా.

                       నీరసంగా ఉన్న ఆ పసిముఖంలో చిరునవ్వు మాటున ఏదో తృప్తి...!

(అయిపోయింది. నిజానికి ఉదయాన్నే పోస్ట్ రాసిపెట్టేసానండీ.. లాస్ట్ లైన్ రాస్తూ ఉండగా పవర్ కట్ :(. 9 to 5. అందుకే ఆలశ్యమయింది. మొత్తానికి నాకెంతో నచ్చిన ఈ కథ మీకూ నచ్చిందనే ఆశిస్తున్నాను.. )  

31 comments:

ధాత్రి said...

చాలా బాగుంది ప్రియా గారు.
ఆ పిల్ల గుడిసె బయటకు రాకపొయేసరికి భయమేసింది పిల్లకేమైనా అయ్యిందేమొనని..
కధ హత్తుకుంది..
Thanks for sharing..:)

ధాత్రి said...

ఎందుకో తెలీదు..ఈ కధ చదువుతుంటే రాజన్న సినీమాలో
మల్లమ్మ అనే అమ్మాయి..తనని పెంచే తాత గుర్తొచ్చారు..

Priya said...

మీ కామెంట్ కి కృతజ్ఞతలు ధాత్రి గారూ.
చదువుతున్నపుడు నేను కూడా అచ్చూ మీలాగే భయపడ్డాను. అసలే అక్కడ పాములూ అవీ ఉంటాయంటారు కదా ఏమైనా అవుతుందేమో లేనిపోని గోల ఈ ట్రాజెడీ కథ మనకెందుకు బాబోయ్.. చదవడం ఆపేసి నచ్చినట్లుగా ముగింపు ఊహించుకుందామా అనుకున్నాను. కాని ఎందుకో ఆగలేక బిక్కుబిక్కుమంటూనే కొనసాగించాను. పూర్తయ్యాక నిజంగా ఎంతగా నా మనసుని హత్తుకుందంటే... మీ అందరితోను ఎట్టి పరిస్థితుల్లోను పంచుకోవాలనేంత! ఈ కథ మీకూ నచ్చడం చాలా ఆనందంగా ఉంది ధాత్రి.

రాజన్న సినిమా నేను చూడలేదు. రక్తపాతం ఎక్కువగా ఉంటుంది నీకు నచ్చదని ఫ్రెండ్ అంటేనూ. బాగుంటుందాండీ?

ధాత్రి said...

చాలా బాగుంటుందండీ ఎంతో అందమైన కధ..
ముఖ్యంగా 'మల్లమ్మా' అనె అమ్మయి కోసమైనా చూడాలీ..
రక్తపాతమంటారా
"భయమేస్తుందని హారర్ సినిమాలు చుడ్డం మానేస్తామా అదో బేడ్ హేబిట్"
ఇది అంతే రక్తపాతం కనిపించినపుడు కళ్ళు మూసేసుకోవడమే నాలాగా

Priya said...

హారర్ సినిమానా..? ఊరుకోండి ధాత్రి గారూ.. అసలే రాత్రిపూట.
మల్లమ్మ అనే క్యారెక్టర్లో ఆక్ట్ చేసిన పాప చాలా బాగా చేసిందని నేనూ విన్నానండి. ఆ రక్తపాతాలు గట్రా వచ్చినపుడు నేను కూడా కళ్ళుమూసుకుంటాను గాని నా మైండ్ ఊహించేసుకుంటూ ఉంటుందండి అక్కడేం జరుగుతుందో :( అదే అసలు ప్రాబ్లం. అయినా సరే..అందమైన కథ, బాగుంటుందని మీరు చెబుతున్నారు కనుక కచ్చితంగా చూస్తాను.

Sri Latha said...

కథ బాగుంది ప్రియగారు. నేనూహించుకున్నట్టే ఉన్నారు మీరు!!!!! మీ మాటల్లాగే ఎంతందంగా ముద్దుగున్నారో! కాని మీ ఫోటో చూస్తే ఈ ప్రియగారేనా అంత అల్లరి చేసేదనిపిస్తుంది? చీర మహత్యమేమో?

Priya said...

థాంక్స్ శ్రీలత గారూ :)
చీర మహత్యమే అయి ఉండాలి మరి :)

srinivasarao vundavalli said...

కథ చాలా బాగుంది ప్రియ గారు.

pallavi said...

Premayanam Part 6!!!!!!!!!!!!

Priya said...

కదండీ..! Thanks for the comment శ్రీనివాస్ గారూ :)

Priya said...

On the way... :)

Sravya Vattikuti said...

కథ తర్వాత చదువుతాలెండి కానీ , ఆ కుడిపక్క నేను అన్న కాప్షన్ క్రింద ఉన్న అమ్మాయి భలే ఉందండి :-)
మళ్ళీ దాని క్రింద పాట :P

శోభ said...

నీరసంగా ఉన్న ఆ పసిముఖంలో చిరునవ్వు మాటు ఏదో తృప్తి...!

హృద్యంగా ఉంది ప్రియా. ఆకలి, అవసరం, పేదరికం... చిన్ని చిన్ని సంతోషాలను కూడా దూరం చేసుకునేలా చేసేస్తుందనేందుకు ఆ పసిపాపే నిదర్శనం కదా...

రెండు రూపాయలు పోయినా పర్వాలేదు.. ఇంతా చేస్తుండేది కూతురి సంతోషం కోసమే కదా.. అనుకుంటూ తండ్రి...

ఆ పువ్వుల కోసం తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకున్న ఆ పసి హృదయం.. తండ్రి కష్టంముందు తన సంతోషం ఏ పాటిది అనుకుందో ఏమో... అందుకే అలా చేసింది... తండ్రి కష్టంలో కాస్తయినా సాయపడ్డానన్న తృప్తి ముందు.. పువ్వులు పెట్టుకోడంలో లేదని ఆ పసిదానికి ఎంతబాగా అర్థమైంది...

ఈ కథ నిజంగా చాలా చాలా బాగా నచ్చింది ప్రియా...

Chinni said...

పూవు తెంపుతూ ఆ అమ్మాయి ఎక్కడ పడిపోతుందో అని ఆత్రుతగా చదివాను, చివరికి ఆ అమ్మాయి పూవు అమ్మేసి వాళ్ల నాన్నకు ఇవ్వడం మనసుని కదిలించింది.
Thanks priya for sharing very heart touching story :):)
Nice story.

Kalyani said...

Very nice story.. Heart touching. ఎందుకో ఆ తండ్రి పాత్ర నా మనసుని బాగా కదిలించింది. చాలా బాధగా కూడా వుంది. చిన్న కడుపు నింపుకోటానికి కొంత మంది ఇన్ని కష్టాలు పడుతుంటే ఇంకొంతమందికి బంగారు పాత్రలో తినేంత ఐశ్వర్యం. ఇలాంటి వారి కోసం ఏమీ చేయలేని నా నిస్సహాయతని తిట్టుకుంటున్నాను. I hope I will be able to help someone in near future.

Priya said...

భలేగా ఉందా.. తనకి చెబుతాలెండి :P
పాట మీకూ నచ్చిందా శ్రావ్య..? భలే భలే.. thanks for the comment :)

Priya said...

:) I am happy. Thanks for the comment Shobha gaaru..

Priya said...

కల్యాణి గారూ మీరింత ఎమోషనల్ మాట్లాడారంటే నేనర్ధం చేసుకోగలను ఈ కథ మిమ్మల్ని ఎంతగా కదిలించిందో. బాధపడకండి కచ్చితంగా మీ వంతు సహాయం అందించే రోజు వస్తుంది. మీ మంచి మనసుకి నా అభినందనలు.

Priya said...

చెప్పానుగా చిన్నీ.. నేను కూడా అంతే భయపడుతూ భయపడుతూనే చదివాను. కథ పూర్తయ్యాక గుండెను మెలిపెట్టినట్లుగా ఫీల్ అయ్యాను. కామెంట్ చేసినందుకు థాంక్స్ రా..

డేవిడ్ said...

కథ బాగుంది ప్రియ గారు.

Priya said...

థాంక్స్ డేవిడ్ గారూ :)

చిన్ని ఆశ said...

బాగుందండీ కథ. ముగింపు విషాదం ఉంటుందేమో అనుకున్నాం. శుభమే. అయితే చిన్న వయసులో అయ్య పడే కష్టం తెలిశాక ఆ కష్టంలో పాలు పంచుకోవాలనుకోవటం, అప్పుడే బ్రతుకు భారాన్ని మోయాలన్న ఆలోచనా...అంతా చాలా సహజంగా ఉంది.
బొమ్మ చిన్న పిల్ల ది పెట్టుంటే ఇంకా నిండుదనం వచ్చేది ఈ కథకి.

Priya said...

ఆలశ్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి పండు గారు.
చిన్న పిల్ల పెయింటింగ్ కోసం చాలా వెదికాను గాని దొరకలేదండీ.. దొరికినవి మ్యాచ్ అవలేదు అందుకే ఏదో ఒకటిలే అని పెట్టేసా.

Lakshmi Raghava said...

మీ బ్లాగు, మీరూ, మీ పాటా ఎంతోబాగుందని చెప్పగలను ప్రియా...ఒక చిన్న హెల్ప్ కావాలి అడగచ్చు అనుకుంటే ఈ బామ్మకు ఒక మెయిల్ ఇస్తారా?... ఇదేదో అనుకునేరు ఏమీలేదు మీ బ్లాగు మీద వున్న కూర్ర్చుని వున్న అమ్మాయి బొమ్మ చాలా బాగుంది .అది వేసిన ఆర్టిస్టు పేరు ఏమిటో అని . నేనుకూడా ఒక చిన్న ఆర్టిస్టుని....కాపీ చేసినా తెలపాలిగాదా అని . మీకు అభ్యంతరం లేకపోతె తెలపండి
లక్ష్మి రాఘవ

Priya said...

బామ్మ గారూ.. మీ రాకకు, మాటలకు చాలా సంతోషం. మీరు నన్ను "మీరు" అని సంభోదిస్తుంటే నాకు ఏదోలా ఉంది. మనవరాలిలాటిదాన్నేగా.. చనువుగా "నువ్వు" అనేస్తే హ్యాపీ హ్యాపీ అయిపోతాను. ఆ పెయింటింగ్ పిక్ని ఇంటర్నెట్లో చాలా మంది వాడుతుండగా చూసి మీలాగే నేనూ దాని మీద మనసుపారేసుకున్నాను. ఒకరిని అడిగితే "ఆర్టిస్ట్ పేరు నాకూ తెలియదు గూగుల్ ఇమేజ్ సెర్చ్ లో దొరికింది. కావాలంటే మీరూ వెదకండీ" అన్నారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. ఆ ఫోటో అయితే మీకు మెయిల్ చేసాను :)

Sravya Vattikuti said...

Priya, here is the info about that artist !
http://navarasabharitham.blogspot.sg/2011/11/blog-post_04.html

Priya said...

Wow!!! Thank you sooooooo much for sharing, Sravya :)

నవజీవన్ said...

బడుగుజీవుల వ్యధలను చిత్రించిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలు ప్రత్యక్ష అనుభవం కలిగినివారే రాయగలరు. శైలి కూడా అమోఘం. ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రాసిన ఈ కథ హృదయాన్ని కదిలించింది. వీలయితే ఒక సారి రావిశాస్త్రి గారి "పువ్వులు" కథ దొరికితే చదవండి.ఈ కథ చదువుతుంటే నాకు ఆ కథ గుర్తుకువచ్చింది. పసిపిల్లల మనసులు పుష్పాలవలె సున్నితమైనవి. ఇలాంటి ఇతివృత్తాలలో ఈ భావనలు గుండెను పిండేసేలా ఉంటాయి.

Priya said...

ఓహ్! చాలా థాంక్స్ అండీ. మొగలిపువ్వులు కథయితే చదివాను గాని రచయిత్రి గారి గురించి మీరు చెప్పే వరకు తెలియదు. నిజమే ఇలాటి సున్నితమైన కథలు చదువుతున్నపుడు గుండె పిండినట్లవుతుందండీ నేనైతే ఇక ఆ రోజంతా అదే ఆలోచనలో ఉండిపోతుంటాను. అన్నట్లు.. మీరు చెప్పిన ఈ "పువ్వులు" కథ మీ దగ్గర స్కాన్ కాపీ గాని ఏమైనా ఉందా? లేకపోతే అది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా ప్లీజ్?

MURALI said...

పాపకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతూ చదివాను. Thank God
కథ చాలా బావుంది. Thanks for sharing

Priya said...

నేనూ అలాగే భయపడ్డాను మురళి గారూ చదివేడపుడు.
Thanks for the comment :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, February 12, 2013

మొగలిపూలు (చివరి భాగం)

                    "అయ్యా! యాడ్నించి తెత్తావే నువు పూలు.."
                    "కుందేర్నింఛి... లోతట్టుగట్టులో పొదలుంటాయ్... ఆడికి పోయి దొంటుకర్రతో లాగి కోత్తా...."
                    "మరందవా సేతికి......?"
                    " లోనికి అందుతాయ్.. పోగూడదు. దూరాన్నించే కొయ్యాల"
                    " ఆడ పాములుంటాయంట గదయ్యా, రాములమ్మ సెప్పింది"
                    " ఆ...... ఉంటాయ్. పూలోసనకి పురుగు, పుట్ర సేర్తది... పొదల్లోకి...! జాగరతగా... ఒడుపుగా తుంపాల పూలు"
                     "ఊహు!" అయ్యా గుండెమీద తలవాల్చి నిద్రకు జోగుతోంది ముత్తెం.
                      ' అదే ఆలాపన బిడ్డకి.. ఒక్క మొగిలిపూతెచ్చి పిల్లమురిపెం తీర్చలేకపోతుండ' పిల్ల తల నిరుముతూ తన అసమర్ధతకు బాధపడుతున్నాడు ముసిలయ్య.

                       పుట్టి బుద్ధెరిగికాడ్నించి ఓ గోనడగల.. ఓబొమ్మడగల.. ఇగో.. ఉప్పుడీ మొగిలిపువ్వే అడగతాంది.... పద్దాకా అదే ఆలాపన... తల్లికెంత మక్కువగుందో? ఎట్టాగైనా ఈసారి పిల్ల కోరిక తీర్సాల..." అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాడు ముసిలయ్య. 

                        మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతోంది. 'అయ్య ఊళ్ళోకెళ్ళిపోయిండు.. మల్ల పొద్దూకి వత్తడు' ముత్తెం గుడిసె తలుపులాగి బిగించికట్టి కుందేటివైపు పరుగుతీసింది. ఉత్సాహంతో పరుగుపెడుతున్న ఆ లేత పాదాలకు ఇసుక తిన్నెలమీద మండుతున్న ఎండవేడి తెలీటంలేదు. సంధించి విడిచిన బాణంలా రయ్ న ఒక్క పరుగుతో కుందేటి గట్టుకు చేరింది ముత్తెం.

                         "ఈడ్నించే నాగుంది... అయ్య పూలు తెత్తాడు" అనుకుని కిందికి ఏట్లోకి తొంగిచూసింది. ముత్తెం. నిండా ఎంతో ఆనందం, ఆత్రుత, గట్టుకు ఆనుకుని ఏటిచుట్టూ ఏవేవో చెట్లు, పొదలు.. ఏటిమీంచి వీస్తున్న గాలి ఎండ తీవ్రతను తగ్గిస్తోంది. ముత్తెం క్షణం ఆగి అలుపు తీర్చుకుంది. రోడ్డుకంటే ఎత్తుగా ఉన్న గట్టు మీదకి వచ్చి నిలబడింది. చింకిరిబింకిరిగా కళ్ళకడ్డుపడుతున్న వెంట్రుకలు పైకి తోసుకుంటూ కిందకు తొంగి చూసింది. కింద పెద్ద వలయంలా నీటి గుంట ఉంది. చుట్టూ అంచున లెక్కలేనన్ని తుప్పలు, పొదలు, ముళ్ళ మొక్కలు గజిబిజిగా అల్లుకొని ఉన్నాయి. ముత్తెం కళ్ళు చురుగ్గా తిప్పుతూ చుట్టూ చూసింది. 'ఈడ్నించే తెత్తాడా.... అయ్య పూలు... మరేటి మొగిలిపూలేడా అగపడవే...' అనుకుని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది. దట్టమైన చిట్టడవిలా ఉన్న ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ఏటికి ముందు భాగంలో దూరాన కొంతమేర రేవుగా చేసుకుని నీళ్ళకు వాడుకుంటారు. లోపలికి ఆవేపు, ఈవేపూ ఎవ్వరూ రారు. పూలమీద నిలవనీయని కోరిక ముత్తేన్నిలా తరుముకువచ్చింది.మొగలిపూలను వెతుక్కుంటూ గట్టంట అడుగులో అడుగేసుకుంటూ నడుస్తోంది ముత్తెం. తీరానికి అటు ఇటు అంతా మొగలి పొదలే. కాని పూలులేవు. ముత్తేనికవే మొగలి మొక్కలని తెలీదు. తీగెలు, తుప్పలు తప్పించుకుంటూ నడిచి నడిచి గట్టు మధ్యకు వచ్చేసింది. 

                            "ఈడాలేవు పూలు.. ఏటిసేద్దారి! అయ్యొచ్చేత్తాడేమో.. పొద్దోతోంది' అనుకుని నిరుత్సాహంతో వెనుతిరగబోతుండగా మురిపిస్తూ పొదల్లోంచి చూసిందో మొగలిమొగ్గ. అటు ఇటు కలవరంగా చూస్తున్న ముత్తెం కళ్ళు తళుక్కున మెరిసాయి. చుట్టూ కమ్మి ఉన్న ముళ్ళ ఆకుల మధ్యలోంచి లేలేత బంగారు రంగులో  మిలమిల మెరుస్తున్న పువ్వును చూసి ముత్తెం టక్కున ఆగిపోయింది. ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఆ చిన్నారి ముఖం వికసించింది.

                              "అగో... అదే మొగిలిపువ్వు.., బలే బలే..." అని అలసట మరచి ఆ పువ్వు కోసుకునే ప్రయత్నంలో పడింది.చేతిలో బారెడు పొడవున్న కర్రపుల్ల ఉంచుకొని చిన్న చిన్న అడుగులు జారకుండా నడుస్తూ గట్టుకిందకి వచ్చింది. "అయ్యకీపూ అగపడ్నేదు నాగుంది. అందుకే ఒగ్గేసిండు..." అనుకుంటే మనసెంతో సంభ్రమంతో నిండిపోయింది. పువ్వు తన సొంతమైపోయినట్టే మురిసిపోతూ దగ్గిరగా వచ్చేసింది. కర్ర కొన చీల్చి చీలికల మధ్య చిన్న పుల్లముక్క ఉంచి గుడ్డ పేలిక ముడేసింది. ఆమడ దూరంలో నిలబడి ముందుకు వంగి పువ్వు వంక చూస్తూ.. కర్ర పొదలో గుచ్చి లాగింది. పువ్వు తెగలేదు. మళ్ళీ బలంగా లాగింది. పొద కాస్త కదిలింది. పళ్ళు బిగించి బలమంతా పెట్టి లాగింది. మొగలిపొత్తు తెగి కర్రతో పైకి వచ్చింది. 'వచ్చేసినాది... అబ్బ... ఎంత పెద్ధ పువ్వో.... ఎంత బాగుండాదో..' అని పొంగిపోతూ కర్రలోంచి పువ్వును పదిలంగా తీసుకుంది. 'బేగి గుడిసెకి పోవాల... అయ్యకి పూ సూపింసాల.... అయ్యా ఏటంటాడో? అక్కసేత తలసుట్టు పూలల్లించుకోవాల....' అపురూపంగా పువ్వు సందిట పొదువుకుని ఒక్క ఉదుటున గట్టెక్కి రోడ్డుమీదకి వచ్చేసింది ముత్తెం.

                               మునిమాపువేళయింది. ముసిలయ్య పూల అమ్మకం పూర్తి చేసుకుని ఇంటిముఖం పట్టాడు. తడిగుడ్డకు చుట్టి అతని చేతిలో ఉన్న ఒకే ఒక్క మొగలిపొత్తు దోవంతా పరిమళాలు విరజిమ్ముతోంది. 

                              "ఇదిగో అబ్భాయ్... మొగలిపూలేనా! ఇటు తీసుకురా" అన్న పిలుపు విని చప్పున ఆగిపోయాడు. పెద్ద మేడముందు గేట్లో నిలబడి పిలుస్తోందో యువతి. పక్కనే ఓ చిన్న పిల్ల... పువ్వు కొనమని అమ్మని సతాయిస్తూ.. మారం చేస్తూ.

                              "కొంటానన్నాగా.. ఉండు.. రానీవాడ్ని..." అని సముదాయిస్తోంది తల్లి. ముసిలయ్య అటు చూసాడు. 'పువ్వు కోసం మారాం చేస్తున్నట్లుంది పిల్ల.. బేరం అడగకుండా కొంటదేమో...' ముసిలయ్య మనసు ఊగిసలాడింది. అడుగు వెనక్కి వేయబోయి ఆగిపోయాడు. 

                              "ఇది అమ్మడానికి కాదమ్మా" అనేసి కదిలాడు అక్కడ్నించి. వెనుకనుంచి చిన్నిచిన్ని పాదాలతో నేలని తన్నుతూ "అమ్మా.... పువ్వే.." అని ఆ పిల్ల ఏడుస్తూ మారాం చేయటం వినిపిస్తోంది. ముసిలయ్యకు ముత్తెం గుర్తుకువచ్చింది. తలనిండా పూలు కుట్టుకుని సంబరపడిపోయే కూతుర్ని తలుచుకుని మురిపెంగా నవ్వుకున్నాడు. ఇన్నాళ్ళకి పిల్లకోరిక తీరుతోందన్న సంతోషంతో త్వరత్వరగా నడిచి గుడిసెకి వచ్చేసాడు. "ముత్తెవా.. అమ్మాయ్... ముత్తెవా... బేగిరా.." అని అంత దూరంలోంచే పిలుస్తున్నాడు. "తను చేతిలో పువ్వు పెట్టినపుడు చూడాలి పిల్ల ముఖంలో ఆనందం..." తలుచుకుంటేనే ముసిలయ్య మనసంతా కూడా పులకరించిపోతోంది. "తనేం కట్టపడ్డా పిల్లదాన కోసమేగందా.. ఓ రెండ్రోజులు గంజి తాక్కుంటే సర" కష్టపడినా, నష్టపడినా ముద్దులకూతురి ముచ్చట కాదనలేని తండ్రే ముసిలయ్య. మరి అయ్య పిలుపుకి ముత్తెం బయటకి రాలేదు. ఎప్పుడూ ఆయాలకి గుడిసె ముంగిల పిల్లోళ్ళతో ఆడుకుంటూ అంత దూరంనుంచే పరుగున వచ్చి "అయ్యా... వచ్చేసినావా" అని సంబరపడుతూ కాళ్ళకు చుట్టేసుకునే కూతురు ఎదురుపడకపోయేసరికి ముసిలయ్య ఆరాటపడ్డాడు. గుడిసెలోపల, బయట అంతా వెదికి, ముత్తెం సావాసగాళ్ళను కూడా అడిగాడు. "మాకు తెల్దంటే.. మాకు తెల్ధన్నారు వాళ్ళు.." బిడ్డ ఎక్కడికి పోయిందో?" అని ఆలోచిస్తూ, ఎదురుచూస్తూ గుడిసె ముంగిట్లోనే కూలబడ్డాడు ముసిలయ్య. బిడ్డ క్షణం అవుపడకపోతే అతనికి కూడుసయించదు.

                             ఇంతలో వెనక నుంచి పరుగుపరుగున రొప్పుతూ వచ్చి "అయ్యా.. వచ్చీసినా" అంటూ అయ్యా మెడను వాటేసుకుంది ముత్తెం. ముసిలయ్య అలవికాని ఆనందంతో బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు. "ఏడకి బోయావమ్మా ఎవురికీ సెప్పకుండా.." ముత్తెం తండ్రి మాటకు బదులివ్వకుండా "అయ్యా.. నువ్వు కల్లు మూసుకో ముందు.." అంది గుబులు తీరిన గుండెతో ఆనందంగా నవ్వి. "ఏట్రా బంగారూ.. ఎందుకమ్మా" అన్నాడు ప్రేమగా. "కల్లు మూసుకోమన్నానా... కల్లు మూసుకుని సెయ్యట్టు.." అంది ముత్తెం వదలకుండా. "ఊ.. సరే" ముసిలయ్య కళ్ళుమూసుకున్నాడు నవ్వుకుంటూ. సాచిన అయ్య అరచేతిలో మూసిన తన గుప్పెట ఉంచి వదిలింది ముత్తెం. "ఇగ సూస్కో" అంది పకపకలాడుతూ. 
Google image

"ఏట్రా నానా.." అంటూ కళ్ళుతెరిచిన ముసిలయ్యకు అరచేతిలో చమటకు తడిసిన రెండ్రూపాయల కాగితం కనిపించింది. అంతులేని ఆశ్చర్యంతో చూస్తున్న అయ్యతో " ఏటయ్యా.. అట్టా సూత్తవ్..మందే ఆ డబ్బు.. కుందేటికి పోయి మొగిలి పూతెచ్చినానయ్యా.. ఓయమ్మడిగితే అమ్మేసినా..." ముసిలయ్య కూతురిని అపురూపంగా దగ్గరకు లాక్కున్నాడు. "ఇంకెప్పుడు ఆడకి పోమాకమ్మా.. పురుగు, పుట్ర ఉంటది... నీకేటైనా అయితే నే బతగ్గలనా.. సెప్పు" అంటూ కన్నీళ్ళతో, చేతిగుడ్డను చుట్టి తను తెచ్చిన పువ్వు ఆప్యాయంగా కూతురి కందించాడు. ముత్తెం నిదానంగా, నిరాసక్తంగా పువ్వు వంక చూసింది. "నాకెందుకయ్యా పువ్వు? అమ్మితే నూకలు కొనుక్కోచ్చుగందా.. నానూ అందుకే పూ అమ్మేసినానయ్యా.." ముసిలయ్య వింతగా కూతురి వంక చూసాడు. బతుకు భారం అప్పుడే మీదపడినట్లు అలసటగా ఉంది. తలరేగి, అక్కడక్కడా గీరుకుపోయి, దుమ్ముకొట్టుకుని ఉంది వళ్ళంతా.

                       నీరసంగా ఉన్న ఆ పసిముఖంలో చిరునవ్వు మాటున ఏదో తృప్తి...!

(అయిపోయింది. నిజానికి ఉదయాన్నే పోస్ట్ రాసిపెట్టేసానండీ.. లాస్ట్ లైన్ రాస్తూ ఉండగా పవర్ కట్ :(. 9 to 5. అందుకే ఆలశ్యమయింది. మొత్తానికి నాకెంతో నచ్చిన ఈ కథ మీకూ నచ్చిందనే ఆశిస్తున్నాను.. )  

31 comments:

 1. చాలా బాగుంది ప్రియా గారు.
  ఆ పిల్ల గుడిసె బయటకు రాకపొయేసరికి భయమేసింది పిల్లకేమైనా అయ్యిందేమొనని..
  కధ హత్తుకుంది..
  Thanks for sharing..:)

  ReplyDelete
 2. ఎందుకో తెలీదు..ఈ కధ చదువుతుంటే రాజన్న సినీమాలో
  మల్లమ్మ అనే అమ్మాయి..తనని పెంచే తాత గుర్తొచ్చారు..

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ కి కృతజ్ఞతలు ధాత్రి గారూ.
   చదువుతున్నపుడు నేను కూడా అచ్చూ మీలాగే భయపడ్డాను. అసలే అక్కడ పాములూ అవీ ఉంటాయంటారు కదా ఏమైనా అవుతుందేమో లేనిపోని గోల ఈ ట్రాజెడీ కథ మనకెందుకు బాబోయ్.. చదవడం ఆపేసి నచ్చినట్లుగా ముగింపు ఊహించుకుందామా అనుకున్నాను. కాని ఎందుకో ఆగలేక బిక్కుబిక్కుమంటూనే కొనసాగించాను. పూర్తయ్యాక నిజంగా ఎంతగా నా మనసుని హత్తుకుందంటే... మీ అందరితోను ఎట్టి పరిస్థితుల్లోను పంచుకోవాలనేంత! ఈ కథ మీకూ నచ్చడం చాలా ఆనందంగా ఉంది ధాత్రి.

   రాజన్న సినిమా నేను చూడలేదు. రక్తపాతం ఎక్కువగా ఉంటుంది నీకు నచ్చదని ఫ్రెండ్ అంటేనూ. బాగుంటుందాండీ?

   Delete
 3. చాలా బాగుంటుందండీ ఎంతో అందమైన కధ..
  ముఖ్యంగా 'మల్లమ్మా' అనె అమ్మయి కోసమైనా చూడాలీ..
  రక్తపాతమంటారా
  "భయమేస్తుందని హారర్ సినిమాలు చుడ్డం మానేస్తామా అదో బేడ్ హేబిట్"
  ఇది అంతే రక్తపాతం కనిపించినపుడు కళ్ళు మూసేసుకోవడమే నాలాగా

  ReplyDelete
  Replies
  1. హారర్ సినిమానా..? ఊరుకోండి ధాత్రి గారూ.. అసలే రాత్రిపూట.
   మల్లమ్మ అనే క్యారెక్టర్లో ఆక్ట్ చేసిన పాప చాలా బాగా చేసిందని నేనూ విన్నానండి. ఆ రక్తపాతాలు గట్రా వచ్చినపుడు నేను కూడా కళ్ళుమూసుకుంటాను గాని నా మైండ్ ఊహించేసుకుంటూ ఉంటుందండి అక్కడేం జరుగుతుందో :( అదే అసలు ప్రాబ్లం. అయినా సరే..అందమైన కథ, బాగుంటుందని మీరు చెబుతున్నారు కనుక కచ్చితంగా చూస్తాను.

   Delete
 4. కథ బాగుంది ప్రియగారు. నేనూహించుకున్నట్టే ఉన్నారు మీరు!!!!! మీ మాటల్లాగే ఎంతందంగా ముద్దుగున్నారో! కాని మీ ఫోటో చూస్తే ఈ ప్రియగారేనా అంత అల్లరి చేసేదనిపిస్తుంది? చీర మహత్యమేమో?

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీలత గారూ :)
   చీర మహత్యమే అయి ఉండాలి మరి :)

   Delete
 5. కథ చాలా బాగుంది ప్రియ గారు.

  ReplyDelete
  Replies
  1. కదండీ..! Thanks for the comment శ్రీనివాస్ గారూ :)

   Delete
 6. Premayanam Part 6!!!!!!!!!!!!

  ReplyDelete
 7. కథ తర్వాత చదువుతాలెండి కానీ , ఆ కుడిపక్క నేను అన్న కాప్షన్ క్రింద ఉన్న అమ్మాయి భలే ఉందండి :-)
  మళ్ళీ దాని క్రింద పాట :P

  ReplyDelete
  Replies
  1. భలేగా ఉందా.. తనకి చెబుతాలెండి :P
   పాట మీకూ నచ్చిందా శ్రావ్య..? భలే భలే.. thanks for the comment :)

   Delete
 8. నీరసంగా ఉన్న ఆ పసిముఖంలో చిరునవ్వు మాటు ఏదో తృప్తి...!

  హృద్యంగా ఉంది ప్రియా. ఆకలి, అవసరం, పేదరికం... చిన్ని చిన్ని సంతోషాలను కూడా దూరం చేసుకునేలా చేసేస్తుందనేందుకు ఆ పసిపాపే నిదర్శనం కదా...

  రెండు రూపాయలు పోయినా పర్వాలేదు.. ఇంతా చేస్తుండేది కూతురి సంతోషం కోసమే కదా.. అనుకుంటూ తండ్రి...

  ఆ పువ్వుల కోసం తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకున్న ఆ పసి హృదయం.. తండ్రి కష్టంముందు తన సంతోషం ఏ పాటిది అనుకుందో ఏమో... అందుకే అలా చేసింది... తండ్రి కష్టంలో కాస్తయినా సాయపడ్డానన్న తృప్తి ముందు.. పువ్వులు పెట్టుకోడంలో లేదని ఆ పసిదానికి ఎంతబాగా అర్థమైంది...

  ఈ కథ నిజంగా చాలా చాలా బాగా నచ్చింది ప్రియా...

  ReplyDelete
  Replies
  1. :) I am happy. Thanks for the comment Shobha gaaru..

   Delete
 9. పూవు తెంపుతూ ఆ అమ్మాయి ఎక్కడ పడిపోతుందో అని ఆత్రుతగా చదివాను, చివరికి ఆ అమ్మాయి పూవు అమ్మేసి వాళ్ల నాన్నకు ఇవ్వడం మనసుని కదిలించింది.
  Thanks priya for sharing very heart touching story :):)
  Nice story.

  ReplyDelete
  Replies
  1. చెప్పానుగా చిన్నీ.. నేను కూడా అంతే భయపడుతూ భయపడుతూనే చదివాను. కథ పూర్తయ్యాక గుండెను మెలిపెట్టినట్లుగా ఫీల్ అయ్యాను. కామెంట్ చేసినందుకు థాంక్స్ రా..

   Delete
 10. Kalyani14/2/13

  Very nice story.. Heart touching. ఎందుకో ఆ తండ్రి పాత్ర నా మనసుని బాగా కదిలించింది. చాలా బాధగా కూడా వుంది. చిన్న కడుపు నింపుకోటానికి కొంత మంది ఇన్ని కష్టాలు పడుతుంటే ఇంకొంతమందికి బంగారు పాత్రలో తినేంత ఐశ్వర్యం. ఇలాంటి వారి కోసం ఏమీ చేయలేని నా నిస్సహాయతని తిట్టుకుంటున్నాను. I hope I will be able to help someone in near future.

  ReplyDelete
  Replies
  1. కల్యాణి గారూ మీరింత ఎమోషనల్ మాట్లాడారంటే నేనర్ధం చేసుకోగలను ఈ కథ మిమ్మల్ని ఎంతగా కదిలించిందో. బాధపడకండి కచ్చితంగా మీ వంతు సహాయం అందించే రోజు వస్తుంది. మీ మంచి మనసుకి నా అభినందనలు.

   Delete
 11. కథ బాగుంది ప్రియ గారు.

  ReplyDelete
 12. థాంక్స్ డేవిడ్ గారూ :)

  ReplyDelete
 13. బాగుందండీ కథ. ముగింపు విషాదం ఉంటుందేమో అనుకున్నాం. శుభమే. అయితే చిన్న వయసులో అయ్య పడే కష్టం తెలిశాక ఆ కష్టంలో పాలు పంచుకోవాలనుకోవటం, అప్పుడే బ్రతుకు భారాన్ని మోయాలన్న ఆలోచనా...అంతా చాలా సహజంగా ఉంది.
  బొమ్మ చిన్న పిల్ల ది పెట్టుంటే ఇంకా నిండుదనం వచ్చేది ఈ కథకి.

  ReplyDelete
  Replies
  1. ఆలశ్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి పండు గారు.
   చిన్న పిల్ల పెయింటింగ్ కోసం చాలా వెదికాను గాని దొరకలేదండీ.. దొరికినవి మ్యాచ్ అవలేదు అందుకే ఏదో ఒకటిలే అని పెట్టేసా.

   Delete
 14. మీ బ్లాగు, మీరూ, మీ పాటా ఎంతోబాగుందని చెప్పగలను ప్రియా...ఒక చిన్న హెల్ప్ కావాలి అడగచ్చు అనుకుంటే ఈ బామ్మకు ఒక మెయిల్ ఇస్తారా?... ఇదేదో అనుకునేరు ఏమీలేదు మీ బ్లాగు మీద వున్న కూర్ర్చుని వున్న అమ్మాయి బొమ్మ చాలా బాగుంది .అది వేసిన ఆర్టిస్టు పేరు ఏమిటో అని . నేనుకూడా ఒక చిన్న ఆర్టిస్టుని....కాపీ చేసినా తెలపాలిగాదా అని . మీకు అభ్యంతరం లేకపోతె తెలపండి
  లక్ష్మి రాఘవ

  ReplyDelete
  Replies
  1. బామ్మ గారూ.. మీ రాకకు, మాటలకు చాలా సంతోషం. మీరు నన్ను "మీరు" అని సంభోదిస్తుంటే నాకు ఏదోలా ఉంది. మనవరాలిలాటిదాన్నేగా.. చనువుగా "నువ్వు" అనేస్తే హ్యాపీ హ్యాపీ అయిపోతాను. ఆ పెయింటింగ్ పిక్ని ఇంటర్నెట్లో చాలా మంది వాడుతుండగా చూసి మీలాగే నేనూ దాని మీద మనసుపారేసుకున్నాను. ఒకరిని అడిగితే "ఆర్టిస్ట్ పేరు నాకూ తెలియదు గూగుల్ ఇమేజ్ సెర్చ్ లో దొరికింది. కావాలంటే మీరూ వెదకండీ" అన్నారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. ఆ ఫోటో అయితే మీకు మెయిల్ చేసాను :)

   Delete
 15. Priya, here is the info about that artist !
  http://navarasabharitham.blogspot.sg/2011/11/blog-post_04.html

  ReplyDelete
  Replies
  1. Wow!!! Thank you sooooooo much for sharing, Sravya :)

   Delete
 16. బడుగుజీవుల వ్యధలను చిత్రించిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలు ప్రత్యక్ష అనుభవం కలిగినివారే రాయగలరు. శైలి కూడా అమోఘం. ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రాసిన ఈ కథ హృదయాన్ని కదిలించింది. వీలయితే ఒక సారి రావిశాస్త్రి గారి "పువ్వులు" కథ దొరికితే చదవండి.ఈ కథ చదువుతుంటే నాకు ఆ కథ గుర్తుకువచ్చింది. పసిపిల్లల మనసులు పుష్పాలవలె సున్నితమైనవి. ఇలాంటి ఇతివృత్తాలలో ఈ భావనలు గుండెను పిండేసేలా ఉంటాయి.

  ReplyDelete
  Replies
  1. ఓహ్! చాలా థాంక్స్ అండీ. మొగలిపువ్వులు కథయితే చదివాను గాని రచయిత్రి గారి గురించి మీరు చెప్పే వరకు తెలియదు. నిజమే ఇలాటి సున్నితమైన కథలు చదువుతున్నపుడు గుండె పిండినట్లవుతుందండీ నేనైతే ఇక ఆ రోజంతా అదే ఆలోచనలో ఉండిపోతుంటాను. అన్నట్లు.. మీరు చెప్పిన ఈ "పువ్వులు" కథ మీ దగ్గర స్కాన్ కాపీ గాని ఏమైనా ఉందా? లేకపోతే అది ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా ప్లీజ్?

   Delete
 17. పాపకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతూ చదివాను. Thank God
  కథ చాలా బావుంది. Thanks for sharing

  ReplyDelete
  Replies
  1. నేనూ అలాగే భయపడ్డాను మురళి గారూ చదివేడపుడు.