Sunday, March 17, 2013

అసలేమయిందంటే..

ఏమని చెప్పమంటారు నా తిప్పలు.. అబ్బబ్బా చుక్కలు కనిపించాయంటే నమ్మండీ! అయ్యో..  అసలు మీకు విషయం చెప్పలేదు కదూ. నేను పుట్టినపుడు నా పుట్టుకను మా వాళ్ళు రిజిస్టర్ చేయలేదండీ. స్కూల్ లో చేర్పించడానికీ  గట్రా ఏం చేసారో నాకు తెలియదు గాని ఇన్నేళ్ళు బర్త్ సర్టిఫికేట్  అవసరం అయితే రాలేదు. కాని ఉన్నట్టుండి దానితో అవసరపడి బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని "భలే ఈజీ ప్రాసెస్.. నా పని త్వరగా అయిపోతుంది" అని సంబరపడ్డాను కాని తరువాత తెలిసింది "పుట్టినంత తేలిక కాదు ఇన్నేళ్ళ తరువాత పుట్టుక ధృవీకరణ పత్రాన్ని సంపాదించడమంటే" అని! "బాబాయ్" అని తెలిసిన ఒకాయన   ఊరి పంచాయితీ పెద్ద అవడంతో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. "ఆ.. అదెంత పనీ? పది రోజుల్లో అయిపోతుంది. కానీ.. మరీ.. అదీ.. మరీ.. చాలా తిరగాలి.. మ్మ్.. నేనేమో బిజీ గా ఉంటుంటాను... అయినా నీ జీవితానికి ఉపయోగపడుతుందంటే అంతకంటేనా.. హ్హహ్హహ్హహ్హా... చాలా ముఖ్యమంటున్నావ్గా ... నువ్వు "మనసు పెడితే" పనయిపోతుంది త్వరగా. ఏంటి? నే చెప్పేది అర్ధమవుతుందా??" అన్నారు. అంత వివరంగా సాగదీసి నొక్కివక్కాణించాక అర్ధంకాకుండా పోతుందా?! "ఆ.. ఆ.. అలాగే. తప్పకుండా బాబాయ్. చాలా థాంక్స్" అన్నాను నవ్వుతూ. అప్పుడు మొదలయిందండీ "నా పని అవడం". 10th సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్.. అన్నీ ఇచ్చి నేనూ, అమ్మా 2 వారాలు అక్కడే కూర్చొని  RA గారు, RDO గారూ, MRO గారు, పంచాయితీ ఆఫీసు, బాబాయ్ గారి టీ, కాఫీ, పెట్రోల్, లంచ్, ఆయన శ్రీమతి గారి చీర, పిల్లల చేతిలో కర్చుకి చిల్లరా.. ఇలా చాలా విషయాల్లో "మనసు" పెట్టాల్సి వచ్చి పెట్టి, నా "మనసంతా" ఇక్కడే "కరిగిపోయిం"దన్న బాధలో కూరుకుపోయుండగా ఎట్టకేలకు "ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి మరో వారం, పది రోజుల్లో సర్టిఫికేట్ ని మీ ఇంటికి కొరియర్ చేస్తాం" అన్న వార్త చెవిన పడింది. ఈ వార్త రావడం ఆలశ్యం బాబాయ్ ఫోన్ నీళ్ళలో పడిపోయింది. అంచేత వారం, పది రోజుల్లో ఆయనకో మొబైల్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద నేనేం తెలుసుకున్నాంటే.. అహ వద్దులెండి లేనిపోని గొడవ. 

సో.. అదండీ విషయం. ఈ కారణం వలన అసలు ఇటువైపే రాలేకపోయాను. పండు, రాజ్ గార్ల కామెంట్స్ కి చాలా లేట్ గా రిప్లైలిచ్చాను. అన్నట్టూ చెప్పడం మరిచానండీ.. ఇంత చెత్తలోనూ కొన్ని మంచి విషయాలు జరిగాయి.  రాక రాక ఆంధ్రాకి వచ్చానని ఎంచక్కా బంధువుల ఇళ్ళన్నీ ఓ రౌండ్ వేశాను. చందనబ్రదర్స్ లో రెండు చీరలు కూడా కొనుక్కున్నాను :) ఇంతకంటే నన్ను హ్యాపీ హ్యాపీ చేసిన విషయమేంటంటే, ఇక్కడేమో (చెన్నైలో) కొబ్బరిబొండాం 30 రూపాయలు. అదే ఏలూరులో అయితే 10 రూపాయలే! 

Google image

ఆహా..!  రోజూ కొబ్బరికాయల పండగ చేసుకున్నానంటే నమ్మండి! మళ్ళీ ఇక్కడైతే ఉదయం ఆఫీస్, అమ్మో టైం, అదీ ఇదీ అంటూ ఉదయం ఏదో ఒక గడ్డి తిని వెళ్లడమో లేకపోతే శుభ్రంగా స్కిప్ చేయడమో జరుగుతుంది.  కాని ఏలూరులో పనీ పాటా లేక ఖాళీగా కూర్చున్నానేమో..  ఉదయం లేవగానే వేడివేడిగా మినపరొట్టి, ఇడ్లీ, సేమ్యా పులిహోర, దోశలు అంటూ రోజుకో వెరైటీ. మళ్ళీ అందులోకి రోటి పచ్చళ్ళు.. స్వయంగా నేనే దంచుకున్నవి! 

Google image

ఏమాటకామాట చెప్పుకోవాలండీ.. టమాటా పచ్చడి రుబ్బుకుని గిన్నెలోకి తీసేసిన తరువాత కాస్తంత వేడి వేడి అన్నం ఆ రోట్లో వేసుకొని దానికి అంటి ఉన్న పచ్చడితో కలుపుకుని తింటూ ఉంటే.. అబ్బహ్!! ఆ రుచి కచ్చితంగా రోటి నుండే వచ్చిందని నా ప్రఘాడ విశ్వాసం. మొత్తానికి ఈ ట్రిప్ మూడు ఇష్టాలూ ఆరు నష్టాలు బాగానే సాగింది. 