Sunday, March 17, 2013

అసలేమయిందంటే..

ఏమని చెప్పమంటారు నా తిప్పలు.. అబ్బబ్బా చుక్కలు కనిపించాయంటే నమ్మండీ! అయ్యో..  అసలు మీకు విషయం చెప్పలేదు కదూ. నేను పుట్టినపుడు నా పుట్టుకను మా వాళ్ళు రిజిస్టర్ చేయలేదండీ. స్కూల్ లో చేర్పించడానికీ  గట్రా ఏం చేసారో నాకు తెలియదు గాని ఇన్నేళ్ళు బర్త్ సర్టిఫికేట్  అవసరం అయితే రాలేదు. కాని ఉన్నట్టుండి దానితో అవసరపడి బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని "భలే ఈజీ ప్రాసెస్.. నా పని త్వరగా అయిపోతుంది" అని సంబరపడ్డాను కాని తరువాత తెలిసింది "పుట్టినంత తేలిక కాదు ఇన్నేళ్ళ తరువాత పుట్టుక ధృవీకరణ పత్రాన్ని సంపాదించడమంటే" అని! "బాబాయ్" అని తెలిసిన ఒకాయన   ఊరి పంచాయితీ పెద్ద అవడంతో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. "ఆ.. అదెంత పనీ? పది రోజుల్లో అయిపోతుంది. కానీ.. మరీ.. అదీ.. మరీ.. చాలా తిరగాలి.. మ్మ్.. నేనేమో బిజీ గా ఉంటుంటాను... అయినా నీ జీవితానికి ఉపయోగపడుతుందంటే అంతకంటేనా.. హ్హహ్హహ్హహ్హా... చాలా ముఖ్యమంటున్నావ్గా ... నువ్వు "మనసు పెడితే" పనయిపోతుంది త్వరగా. ఏంటి? నే చెప్పేది అర్ధమవుతుందా??" అన్నారు. అంత వివరంగా సాగదీసి నొక్కివక్కాణించాక అర్ధంకాకుండా పోతుందా?! "ఆ.. ఆ.. అలాగే. తప్పకుండా బాబాయ్. చాలా థాంక్స్" అన్నాను నవ్వుతూ. అప్పుడు మొదలయిందండీ "నా పని అవడం". 10th సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్.. అన్నీ ఇచ్చి నేనూ, అమ్మా 2 వారాలు అక్కడే కూర్చొని  RA గారు, RDO గారూ, MRO గారు, పంచాయితీ ఆఫీసు, బాబాయ్ గారి టీ, కాఫీ, పెట్రోల్, లంచ్, ఆయన శ్రీమతి గారి చీర, పిల్లల చేతిలో కర్చుకి చిల్లరా.. ఇలా చాలా విషయాల్లో "మనసు" పెట్టాల్సి వచ్చి పెట్టి, నా "మనసంతా" ఇక్కడే "కరిగిపోయిం"దన్న బాధలో కూరుకుపోయుండగా ఎట్టకేలకు "ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి మరో వారం, పది రోజుల్లో సర్టిఫికేట్ ని మీ ఇంటికి కొరియర్ చేస్తాం" అన్న వార్త చెవిన పడింది. ఈ వార్త రావడం ఆలశ్యం బాబాయ్ ఫోన్ నీళ్ళలో పడిపోయింది. అంచేత వారం, పది రోజుల్లో ఆయనకో మొబైల్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద నేనేం తెలుసుకున్నాంటే.. అహ వద్దులెండి లేనిపోని గొడవ. 

సో.. అదండీ విషయం. ఈ కారణం వలన అసలు ఇటువైపే రాలేకపోయాను. పండు, రాజ్ గార్ల కామెంట్స్ కి చాలా లేట్ గా రిప్లైలిచ్చాను. అన్నట్టూ చెప్పడం మరిచానండీ.. ఇంత చెత్తలోనూ కొన్ని మంచి విషయాలు జరిగాయి.  రాక రాక ఆంధ్రాకి వచ్చానని ఎంచక్కా బంధువుల ఇళ్ళన్నీ ఓ రౌండ్ వేశాను. చందనబ్రదర్స్ లో రెండు చీరలు కూడా కొనుక్కున్నాను :) ఇంతకంటే నన్ను హ్యాపీ హ్యాపీ చేసిన విషయమేంటంటే, ఇక్కడేమో (చెన్నైలో) కొబ్బరిబొండాం 30 రూపాయలు. అదే ఏలూరులో అయితే 10 రూపాయలే! 

Google image

ఆహా..!  రోజూ కొబ్బరికాయల పండగ చేసుకున్నానంటే నమ్మండి! మళ్ళీ ఇక్కడైతే ఉదయం ఆఫీస్, అమ్మో టైం, అదీ ఇదీ అంటూ ఉదయం ఏదో ఒక గడ్డి తిని వెళ్లడమో లేకపోతే శుభ్రంగా స్కిప్ చేయడమో జరుగుతుంది.  కాని ఏలూరులో పనీ పాటా లేక ఖాళీగా కూర్చున్నానేమో..  ఉదయం లేవగానే వేడివేడిగా మినపరొట్టి, ఇడ్లీ, సేమ్యా పులిహోర, దోశలు అంటూ రోజుకో వెరైటీ. మళ్ళీ అందులోకి రోటి పచ్చళ్ళు.. స్వయంగా నేనే దంచుకున్నవి! 

Google image

ఏమాటకామాట చెప్పుకోవాలండీ.. టమాటా పచ్చడి రుబ్బుకుని గిన్నెలోకి తీసేసిన తరువాత కాస్తంత వేడి వేడి అన్నం ఆ రోట్లో వేసుకొని దానికి అంటి ఉన్న పచ్చడితో కలుపుకుని తింటూ ఉంటే.. అబ్బహ్!! ఆ రుచి కచ్చితంగా రోటి నుండే వచ్చిందని నా ప్రఘాడ విశ్వాసం. మొత్తానికి ఈ ట్రిప్ మూడు ఇష్టాలూ ఆరు నష్టాలు బాగానే సాగింది. 

35 comments:

రాజ్ కుమార్ said...

పోన్లెండీ మొత్తానికి పనయ్యిందిగా... ఆన్ని సార్లు మనసు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా బాబాయ్ అంటారేంటండీ.? ;)

చెన్నై లో కొబ్బరి బొండాం ముప్పై నా? మాకే చీప్ అన్నమాట. (ఇరవై). మొత్తానికి బానే ఎంజాయ్ చేశారన్నమాట

Priya said...

తప్పదండీ.. అంతో ఇంతో సంస్కారం ఉంది కనుక అలాటి వాళ్ళను చూసి విరక్తిగా నవ్వుకోవడం, మహా అయితే మనసులో తిట్టుకోవడం తప్ప మరో మాట అనడానికి మనసురాదు కదండీ.

ఏంటీ??!!! 20 రూపాయలేనా?! అబ్బా.. ఎంత అదృష్టవంతులండీ మీరు!
ఎంజాయ్హ్? హుం.. ఆహారాన్ని చూసి ఆనందపడి "మనసు బాగా కరిగిపోయిం"దన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నా :)

వేణూశ్రీకాంత్ said...

అమ్మో అంతా !! హ్మ్.. కాస్త ఎదురు చూసే సమయమూ ఓపికుంటే మరీ ఇంత మనసుపెట్టాల్సిన అవసరం ఉండదు అనుకుంటానండీ. మీరు ఆ మనసు బాబయిగారిని కాంటాక్ట్ చేసి పొరపాటు చేశారేమో. పోన్లెండి ఏదైనా పనైపోయిందిగా. మీరన్నట్లు ఈ వంకన ఊర్లో చక్కగా ఎంజాయ్ చేశామనుకుని మురిసిపోడమే.

Priya said...

అవును వేణూ గారూ. ఆయన్ను కాంటాక్ట్ చేసి పొరపాటు చేశాను. నాకు ఆ ఊరు అస్సలు తెలియకపోవడంతో కాస్త తెలిసిన వాళ్ళు తోడుంటే సహాయంగా ఉంటుంది కదా అని ఆశపడ్డాను. మరీ ఇంత మనసుపెట్టాల్సి వస్తుందని తెలియలేదు. పని త్వరగా ఏమీ కాలేదండీ.. ఈ గోలంతా మొదలుపెట్టి 2 నెలలవుతోంది. ఎంతకీ మాటల్లో తప్ప చేతల్లో పని అవకపోవడంతో ఇక సెలవు పెట్టుకొని ఆ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తే, ఆల్మోస్ట్ అయిపొయింది.. 10 రోజుల్లో వచ్చేస్తుందని చెప్పి, మళ్ళీ "మీ సేవ" అని కొత్తగా పెట్టారు ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ ప్రాసెస్ రీస్టార్ట్ చేయాలన్నారు! సో సర్టిఫికేట్ చేతికి వచ్చే వరకు ప్రశాంతత ఉండదండీ :)

Sri Latha said...

Hmm

Rao S Lakkaraju said...

"బాబాయ్" గారు చేస్తున్నారు కాబట్టి సరిపోయింది గానీ, ఆ సర్టిఫికేట్ ఎల్లా తెచ్చుకోవాలో తెలుసుకోవటం చాలా కష్టం. ఎవరో చేసిపెడుతున్నారు. సంతోషించటమే.

వేణూశ్రీకాంత్ said...

హ్మ్... ఆల్ ద బెస్ట్ అండీ సాధ్యమైనంత త్వరలో మీచేతికొచ్చేయాలని కోరుకుంటున్నాను.

Priya said...

థాంక్స్ వేణూ గారు :)

Priya said...

అంతే కదండీ మరీ. Welcome to my blog and thanks for the comment Lakkaraju gaaru :)

పచ్చల లక్ష్మీనరేష్ said...

Priya garu, moththaaniki velli desoddharana chesi vachchaarannamaaata...annitikannaa, రోట్లో టమాటో పచ్చడి వేడి వేడి అన్నం నోరు ఊరింగ్స్.... బాగా సంపాయిస్తున్న సాఫ్ట్వేర్ పిల్ల కదా అని వాళ్ళ పిల్ల పెళ్లి ఖర్చులకి సంపాయిద్దాం అనుకున్న మీ "బాబాయి" గారిని నిరుత్సాహపరిచారు...

Priya said...

హహ్హహ్హహ్హహా.. కాని నేను సాఫ్ట్వేర్ పిల్లను కాను గా.. పబ్లిషింగ్ హౌస్ లో ఎడిటర్ని. చాన్నాళ్ళకు వచ్చారు నా బ్లాగింటికి. Thanks for the comment :)

నవజీవన్ said...

మొత్తానికి మీ కార్యం సఫలం అయినందుకు ధన్యవాదాలు. జన్మ ధృవీకరణ పత్రం పుణ్యమా అని మొత్తానికి ప్రకృతి అందాలు వీక్షించారు కదా! ఏదో మంచే జరిగింది కదా!:)

శోభ said...

ఇన్నాళ్లూ కనిపించకపోతే ఏవో పనుల్లో బిజీగా ఉన్నావనుకున్నా ప్రియా.. మొత్తానికి అక్కడ చేరావన్న మాట. మంచి అనుభవాలు.... పంచుకున్న తీరు బాగుంది...

ప్రతిదాంట్లోనూ మంచిని స్వీకరించి, చెడును వదిలేయటమే... లేకపోతే బ్రతకటం కష్టం రా.... కాదంటావా..?

చిన్ని ఆశ said...

పోనీండి బాబాయ్ పుణ్యమాని ఆంధ్రకొచ్చి అన్నీ అస్వాదించారు. ఆహా ఏమి రుచీ, తినరా మైమరచీ...అనుకుంటూ తినే ఘట్టాలెన్ని ఉంటాయి నిత్యం పరుగుల్లో సాగే ఈ జీవనయానంలో...ఇలా చిన్ని చిన్ని కోరికలని ఆస్వాదించటంలోనే దాగిఉంది సంతోషం!
Congratulations డిగ్రీకన్నా కష్టమైన, విలువైన బర్త్ సర్టిఫికేట్ సంపాదించినందుకు. ;)

Priya said...

థాంక్స్ ఫర్ ది కామెంట్ నవజీవన్ గారు :)
కాని ఇంకా నా పని సఫలం కాలేదండీ. ఈ రోజు మళ్ళీ బాబాయ్ ఫోన్ చేసి "వచ్చే నెల 13 తరువాత ఇస్తార్ట" అన్నారు :(
అవును నిజమేనండీ ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసాను.

Priya said...

థాంక్స్ శోభా. మీ అభిప్రాయంతో నేనూ ఏకీవబిస్తున్నాను. అయినా మీరు ఏదైనా చెబితే నేను కాదన్నానా? అహ.. కాదనగలనా అని?!

Priya said...

భలే.. అలవోకగా రాస్తారండీ మీరు కవితలు :) థాంక్స్ ఫర్ ది కామెంట్.
కాని చెప్పాను కదండీ ఇంకా సర్టిఫికేట్ చేతికి రాలేదని.. ఇప్పుడే అందిన వార్తేంటంటే, వచ్చే నెల 13 తరువాత దాన్ని నాకందజేయగలరని :(

డేవిడ్ said...

పోనిలెండి మొత్తానికి మీరు బర్త్ సర్టిఫికేట్ పుణ్యామా అని కొంత అనుభవాన్ని సాధించారు...అన్నట్లు మీ రోటి పచ్చళ్ళు నన్ను ఎక్కడికో తీసుకుపోయాయి.

చిన్ని ఆశ said...

హ హా ఇంకేం. Convocation తేది కూడా ప్రకటించేశారు ;)

Priya said...

హహ్హహ్హహ.. అలా అని ఆనందపడడమే.. ;)

Priya said...

అవునండీ :)
రోటి పచ్చళ్ళు నోరూరించాయా? మరింకెందుకండీ ఆలశ్యం? శ్రీమతి గారికి చెప్పేయండి వెంటనే కోరిక నెరవేరిపోతుందిగా.. :)

ఎగిసే అలలు..... · said...

చాలా బావుంది మీ అనుభవం ప్రియ గారు.. రోటి పచ్చళ్ళు గుర్తుకు చేశారు....

Priya said...

Welcome to my blog and thanks for the comment, Karthik gaaru :)

Anonymous said...

"మనసు పెట్టడం" అంటే అర్థం ఇదా?
మీరు కాయిన్ చేసారా లేక ఇంతకు ముందే ఉందా?

Priya said...

నా బ్లాగింటికి స్వాగతం బోనగిరి గారు :)
ఈ మాట ఇంతకు ముందు ఉందో లేదో నాకూ తెలియదండీ. బాబాయి నాకు గారు నేర్పిన అర్ధమిది.

ప్రియ said...

నా ఈ అంతర్జాల జీవితం లో...భయపడకండి సత్యనారాయణ లాగ వాయించను ..
చెప్పేదేంటంటే ...మొట్టమొదటిసారిగా ఒక బ్లాగ్ ని ఒక్క ముక్క కూడా వదలకుండా చదివానండీ , పొద్దున 10 కి మొదలు పెట్టా , మధ్యాహ్నం నిద్ర రమ్మని ఇందాకటి నించి కోటా గారు తన్నినట్టు తన్నుతున్నా కళ్ళమీద ఐస్ పెట్టి మరీ చదివేసా ...మధ్యలోనే తెలిసింది మీ బ్లాగ్ కి పిచ్చ ఫాను , కూలర్ అయిపోయానని :)
పాపం భరత్ గారిని అడిగానని చెప్పండి
మీ బ్లాగ్ అద్భుతః

Priya said...

హహ్హహ్హహహ్హ.. బ్లాగ్ బాగుందని చెబుతూనే మీ నిద్ర పాడుచేసిన పాపాన్ని నాకంటగట్టేసారు కదండీ :P

Thank you, thank you so much for the LoVeLy comment :)
తనను మీరడిగినట్లు తప్పక చెబుతాను.

MURALI said...

బాబాయిగారి ఫోటో కూడా పెట్టాల్సింది. నాలుగు కొబ్బరి కాయలు కొట్టేవాళ్ళం

శ్యామలీయం said...

ఎంతబాగా అడిగారూ, కామెంటు కేం‌ భాగ్యం అని! తప్పకుండా చెబుతాను.
మీ‌ టపా చాలా బాగుంది అని చెప్పటం ఉన్నమాట చెప్పటమే. తీరిక చూసుకొని మీ‌ బ్లాగు టపాలన్నీ చదివేయాలని నిర్ణయించుకున్నాను.

'మనసు పెట్టటం' అన్నమాటను భలే బాగా మోగించారు!

Priya said...

నా దరిద్రాన్ని నాతోనే పోనీ అని పెట్టలేదండీ.. :)

Priya said...

ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతమండీ!
మీ కామెంట్, నిర్ణయం రెండూ నాకు చాలా సంతోషకరం. అందుకు మీకు నా కృతజ్ఞతలు :)

ప్రవీణ్ మలికిరెడ్డి said...

మీరు చాలా అదృష్ట వంతులండీ మాతో పోల్చుకుంటే ... మా ఆవిడ PASSPORT కోసం కర్నూల్ లో అప్లై చేస్తే 2 నెలల తర్వాత కూడా హైదరాబాద్ చేరలేదు . ఆ తర్వాత వాళ్ళను వీళ్ళను కనుక్కుని, passport office లో ఎంక్వయిరీ చేసి, 7000 రూపాయలు డబ్బులు, 5 నెలలు బాగా మనసు పెడితే అప్పుడు వచ్చింది.

మీ ప్రేమాయణం చాల అందంగా వుంది. ఇప్పుడే కదా మొదలయింది (నేను మీ ప్రేమాయణం చదవడం). అంతలోనే అయిపోయిందా (పెళ్లి వరకు వచ్చిందా) అనిపించింది. ఇంకా ఉండుంటే బాగుండే అనిపించింది.

చివరలో కామెంట్ రాయమని అడిగే మాటలు చాల బావున్నాయి.

మీ అనుకి (అంటే భరతే కదా) హాయ్ చెప్పండి

Priya said...

నా బ్లాగ్ కి స్వాగతం ప్రవీణ్ గారు!

ఏం అదృష్టమండీ.. మీరు కర్చు పెట్టిన దానికంటే "2 ఆకులు" ఎక్కువే కర్చుపెడుతూ.. 8 నెలలకు పైనే తిరిగితే, సర్టిఫికేట్ పోయిన వారం అందింది చేతికి!.

నా ప్రేమాయణం ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయండీ. నేను బ్రతికి ఉన్నంత కాలం ప్రేమయితే కొనసాగుతూనే ఉంటుందనుకొండీ పెళ్లి పేరుతో.. అది వేరే విషయం.

నా మాటలు మీకు నచ్చినందుకు, మీ వాఖ్యకూ చాలా థాంక్స్. సాయంత్రం అనూతో (అదే.. భరత్ తో) మాట్లాడేడపుడు, మీ పుణ్యమాని నా బ్లాగ్ ఫాలోవర్స్ లిస్ట్ 45కి చేరిందనీ.. మీరు తనకు హాయ్ చెప్పమని చెప్పారని చెప్పాను. అనూ మీకు తన కృతజ్ఞతలు తెలుపమన్నాడు :)

ప్రవీణ్ మలికిరెడ్డి said...

మీ బ్లాగ్ కి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు .....

నేనన్నది మీ ప్రేమాయణం టపాల గురించి. అప్పుడే అయిపోయాయా అనిపించింది. ఇంకా టపాలు వున్నాయి అన్నారు కాబట్టి వీలు చూస్కుని update చేస్తున్నండి.

ఈ ప్రేమాయణం అంతా దేశముదురు సినిమా లో అలీ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు చూడండి, అలా చెప్తున్నారు.
కొత్తగా మీ బ్లాగ్ చూస్తున్న వాళ్ళకు మాత్రం (నాకు) తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుతగా వుంటుంది.

Certificate 8 months కి వచ్చిందా .. Good.... Congratulations ...

Priya said...

థాంక్స్ ప్రవీణ్ గారు!
నా ప్రేమాయణం పార్ట్ 7 సగం ఎప్పుడో రాసేసానండీ. ఇంకా సగం ఉంది. మాములు పోస్ట్స్ అయితే చక్కా రాసేసుకుంటున్నాను కాని, "ప్రేమాయణం" రాసేడపుడు మాత్రం సగం సమయం మెలికలు తిరుగుతూ అప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఆ లోకానికి వెళ్ళిపోతున్నాను.. సో బాగా టైం పట్టేస్తోంది :P

అయినా సరే, మీ కోసమయినా ఎట్టి పరిస్థితుల్లోను ఈ వారంలో పబ్లిష్ చేసేస్తానండీ :) (మరీ ఘాట్టిగా నమ్మేసి ఒకవేళ రాయలేకపోతే తిట్టుకోకండేం?.... ముందు జాగ్రత్త!)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Sunday, March 17, 2013

అసలేమయిందంటే..

ఏమని చెప్పమంటారు నా తిప్పలు.. అబ్బబ్బా చుక్కలు కనిపించాయంటే నమ్మండీ! అయ్యో..  అసలు మీకు విషయం చెప్పలేదు కదూ. నేను పుట్టినపుడు నా పుట్టుకను మా వాళ్ళు రిజిస్టర్ చేయలేదండీ. స్కూల్ లో చేర్పించడానికీ  గట్రా ఏం చేసారో నాకు తెలియదు గాని ఇన్నేళ్ళు బర్త్ సర్టిఫికేట్  అవసరం అయితే రాలేదు. కాని ఉన్నట్టుండి దానితో అవసరపడి బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని "భలే ఈజీ ప్రాసెస్.. నా పని త్వరగా అయిపోతుంది" అని సంబరపడ్డాను కాని తరువాత తెలిసింది "పుట్టినంత తేలిక కాదు ఇన్నేళ్ళ తరువాత పుట్టుక ధృవీకరణ పత్రాన్ని సంపాదించడమంటే" అని! "బాబాయ్" అని తెలిసిన ఒకాయన   ఊరి పంచాయితీ పెద్ద అవడంతో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. "ఆ.. అదెంత పనీ? పది రోజుల్లో అయిపోతుంది. కానీ.. మరీ.. అదీ.. మరీ.. చాలా తిరగాలి.. మ్మ్.. నేనేమో బిజీ గా ఉంటుంటాను... అయినా నీ జీవితానికి ఉపయోగపడుతుందంటే అంతకంటేనా.. హ్హహ్హహ్హహ్హా... చాలా ముఖ్యమంటున్నావ్గా ... నువ్వు "మనసు పెడితే" పనయిపోతుంది త్వరగా. ఏంటి? నే చెప్పేది అర్ధమవుతుందా??" అన్నారు. అంత వివరంగా సాగదీసి నొక్కివక్కాణించాక అర్ధంకాకుండా పోతుందా?! "ఆ.. ఆ.. అలాగే. తప్పకుండా బాబాయ్. చాలా థాంక్స్" అన్నాను నవ్వుతూ. అప్పుడు మొదలయిందండీ "నా పని అవడం". 10th సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్.. అన్నీ ఇచ్చి నేనూ, అమ్మా 2 వారాలు అక్కడే కూర్చొని  RA గారు, RDO గారూ, MRO గారు, పంచాయితీ ఆఫీసు, బాబాయ్ గారి టీ, కాఫీ, పెట్రోల్, లంచ్, ఆయన శ్రీమతి గారి చీర, పిల్లల చేతిలో కర్చుకి చిల్లరా.. ఇలా చాలా విషయాల్లో "మనసు" పెట్టాల్సి వచ్చి పెట్టి, నా "మనసంతా" ఇక్కడే "కరిగిపోయిం"దన్న బాధలో కూరుకుపోయుండగా ఎట్టకేలకు "ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి మరో వారం, పది రోజుల్లో సర్టిఫికేట్ ని మీ ఇంటికి కొరియర్ చేస్తాం" అన్న వార్త చెవిన పడింది. ఈ వార్త రావడం ఆలశ్యం బాబాయ్ ఫోన్ నీళ్ళలో పడిపోయింది. అంచేత వారం, పది రోజుల్లో ఆయనకో మొబైల్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద నేనేం తెలుసుకున్నాంటే.. అహ వద్దులెండి లేనిపోని గొడవ. 

సో.. అదండీ విషయం. ఈ కారణం వలన అసలు ఇటువైపే రాలేకపోయాను. పండు, రాజ్ గార్ల కామెంట్స్ కి చాలా లేట్ గా రిప్లైలిచ్చాను. అన్నట్టూ చెప్పడం మరిచానండీ.. ఇంత చెత్తలోనూ కొన్ని మంచి విషయాలు జరిగాయి.  రాక రాక ఆంధ్రాకి వచ్చానని ఎంచక్కా బంధువుల ఇళ్ళన్నీ ఓ రౌండ్ వేశాను. చందనబ్రదర్స్ లో రెండు చీరలు కూడా కొనుక్కున్నాను :) ఇంతకంటే నన్ను హ్యాపీ హ్యాపీ చేసిన విషయమేంటంటే, ఇక్కడేమో (చెన్నైలో) కొబ్బరిబొండాం 30 రూపాయలు. అదే ఏలూరులో అయితే 10 రూపాయలే! 

Google image

ఆహా..!  రోజూ కొబ్బరికాయల పండగ చేసుకున్నానంటే నమ్మండి! మళ్ళీ ఇక్కడైతే ఉదయం ఆఫీస్, అమ్మో టైం, అదీ ఇదీ అంటూ ఉదయం ఏదో ఒక గడ్డి తిని వెళ్లడమో లేకపోతే శుభ్రంగా స్కిప్ చేయడమో జరుగుతుంది.  కాని ఏలూరులో పనీ పాటా లేక ఖాళీగా కూర్చున్నానేమో..  ఉదయం లేవగానే వేడివేడిగా మినపరొట్టి, ఇడ్లీ, సేమ్యా పులిహోర, దోశలు అంటూ రోజుకో వెరైటీ. మళ్ళీ అందులోకి రోటి పచ్చళ్ళు.. స్వయంగా నేనే దంచుకున్నవి! 

Google image

ఏమాటకామాట చెప్పుకోవాలండీ.. టమాటా పచ్చడి రుబ్బుకుని గిన్నెలోకి తీసేసిన తరువాత కాస్తంత వేడి వేడి అన్నం ఆ రోట్లో వేసుకొని దానికి అంటి ఉన్న పచ్చడితో కలుపుకుని తింటూ ఉంటే.. అబ్బహ్!! ఆ రుచి కచ్చితంగా రోటి నుండే వచ్చిందని నా ప్రఘాడ విశ్వాసం. మొత్తానికి ఈ ట్రిప్ మూడు ఇష్టాలూ ఆరు నష్టాలు బాగానే సాగింది. 

35 comments:

 1. పోన్లెండీ మొత్తానికి పనయ్యిందిగా... ఆన్ని సార్లు మనసు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా బాబాయ్ అంటారేంటండీ.? ;)

  చెన్నై లో కొబ్బరి బొండాం ముప్పై నా? మాకే చీప్ అన్నమాట. (ఇరవై). మొత్తానికి బానే ఎంజాయ్ చేశారన్నమాట

  ReplyDelete
  Replies
  1. తప్పదండీ.. అంతో ఇంతో సంస్కారం ఉంది కనుక అలాటి వాళ్ళను చూసి విరక్తిగా నవ్వుకోవడం, మహా అయితే మనసులో తిట్టుకోవడం తప్ప మరో మాట అనడానికి మనసురాదు కదండీ.

   ఏంటీ??!!! 20 రూపాయలేనా?! అబ్బా.. ఎంత అదృష్టవంతులండీ మీరు!
   ఎంజాయ్హ్? హుం.. ఆహారాన్ని చూసి ఆనందపడి "మనసు బాగా కరిగిపోయిం"దన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నా :)

   Delete
 2. అమ్మో అంతా !! హ్మ్.. కాస్త ఎదురు చూసే సమయమూ ఓపికుంటే మరీ ఇంత మనసుపెట్టాల్సిన అవసరం ఉండదు అనుకుంటానండీ. మీరు ఆ మనసు బాబయిగారిని కాంటాక్ట్ చేసి పొరపాటు చేశారేమో. పోన్లెండి ఏదైనా పనైపోయిందిగా. మీరన్నట్లు ఈ వంకన ఊర్లో చక్కగా ఎంజాయ్ చేశామనుకుని మురిసిపోడమే.

  ReplyDelete
  Replies
  1. అవును వేణూ గారూ. ఆయన్ను కాంటాక్ట్ చేసి పొరపాటు చేశాను. నాకు ఆ ఊరు అస్సలు తెలియకపోవడంతో కాస్త తెలిసిన వాళ్ళు తోడుంటే సహాయంగా ఉంటుంది కదా అని ఆశపడ్డాను. మరీ ఇంత మనసుపెట్టాల్సి వస్తుందని తెలియలేదు. పని త్వరగా ఏమీ కాలేదండీ.. ఈ గోలంతా మొదలుపెట్టి 2 నెలలవుతోంది. ఎంతకీ మాటల్లో తప్ప చేతల్లో పని అవకపోవడంతో ఇక సెలవు పెట్టుకొని ఆ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తే, ఆల్మోస్ట్ అయిపొయింది.. 10 రోజుల్లో వచ్చేస్తుందని చెప్పి, మళ్ళీ "మీ సేవ" అని కొత్తగా పెట్టారు ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ ప్రాసెస్ రీస్టార్ట్ చేయాలన్నారు! సో సర్టిఫికేట్ చేతికి వచ్చే వరకు ప్రశాంతత ఉండదండీ :)

   Delete
  2. హ్మ్... ఆల్ ద బెస్ట్ అండీ సాధ్యమైనంత త్వరలో మీచేతికొచ్చేయాలని కోరుకుంటున్నాను.

   Delete
  3. థాంక్స్ వేణూ గారు :)

   Delete
 3. "బాబాయ్" గారు చేస్తున్నారు కాబట్టి సరిపోయింది గానీ, ఆ సర్టిఫికేట్ ఎల్లా తెచ్చుకోవాలో తెలుసుకోవటం చాలా కష్టం. ఎవరో చేసిపెడుతున్నారు. సంతోషించటమే.

  ReplyDelete
  Replies
  1. అంతే కదండీ మరీ. Welcome to my blog and thanks for the comment Lakkaraju gaaru :)

   Delete
 4. Priya garu, moththaaniki velli desoddharana chesi vachchaarannamaaata...annitikannaa, రోట్లో టమాటో పచ్చడి వేడి వేడి అన్నం నోరు ఊరింగ్స్.... బాగా సంపాయిస్తున్న సాఫ్ట్వేర్ పిల్ల కదా అని వాళ్ళ పిల్ల పెళ్లి ఖర్చులకి సంపాయిద్దాం అనుకున్న మీ "బాబాయి" గారిని నిరుత్సాహపరిచారు...

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహ్హహా.. కాని నేను సాఫ్ట్వేర్ పిల్లను కాను గా.. పబ్లిషింగ్ హౌస్ లో ఎడిటర్ని. చాన్నాళ్ళకు వచ్చారు నా బ్లాగింటికి. Thanks for the comment :)

   Delete
 5. మొత్తానికి మీ కార్యం సఫలం అయినందుకు ధన్యవాదాలు. జన్మ ధృవీకరణ పత్రం పుణ్యమా అని మొత్తానికి ప్రకృతి అందాలు వీక్షించారు కదా! ఏదో మంచే జరిగింది కదా!:)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ఫర్ ది కామెంట్ నవజీవన్ గారు :)
   కాని ఇంకా నా పని సఫలం కాలేదండీ. ఈ రోజు మళ్ళీ బాబాయ్ ఫోన్ చేసి "వచ్చే నెల 13 తరువాత ఇస్తార్ట" అన్నారు :(
   అవును నిజమేనండీ ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసాను.

   Delete
 6. ఇన్నాళ్లూ కనిపించకపోతే ఏవో పనుల్లో బిజీగా ఉన్నావనుకున్నా ప్రియా.. మొత్తానికి అక్కడ చేరావన్న మాట. మంచి అనుభవాలు.... పంచుకున్న తీరు బాగుంది...

  ప్రతిదాంట్లోనూ మంచిని స్వీకరించి, చెడును వదిలేయటమే... లేకపోతే బ్రతకటం కష్టం రా.... కాదంటావా..?

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శోభా. మీ అభిప్రాయంతో నేనూ ఏకీవబిస్తున్నాను. అయినా మీరు ఏదైనా చెబితే నేను కాదన్నానా? అహ.. కాదనగలనా అని?!

   Delete
 7. పోనీండి బాబాయ్ పుణ్యమాని ఆంధ్రకొచ్చి అన్నీ అస్వాదించారు. ఆహా ఏమి రుచీ, తినరా మైమరచీ...అనుకుంటూ తినే ఘట్టాలెన్ని ఉంటాయి నిత్యం పరుగుల్లో సాగే ఈ జీవనయానంలో...ఇలా చిన్ని చిన్ని కోరికలని ఆస్వాదించటంలోనే దాగిఉంది సంతోషం!
  Congratulations డిగ్రీకన్నా కష్టమైన, విలువైన బర్త్ సర్టిఫికేట్ సంపాదించినందుకు. ;)

  ReplyDelete
  Replies
  1. భలే.. అలవోకగా రాస్తారండీ మీరు కవితలు :) థాంక్స్ ఫర్ ది కామెంట్.
   కాని చెప్పాను కదండీ ఇంకా సర్టిఫికేట్ చేతికి రాలేదని.. ఇప్పుడే అందిన వార్తేంటంటే, వచ్చే నెల 13 తరువాత దాన్ని నాకందజేయగలరని :(

   Delete
  2. హ హా ఇంకేం. Convocation తేది కూడా ప్రకటించేశారు ;)

   Delete
  3. హహ్హహ్హహ.. అలా అని ఆనందపడడమే.. ;)

   Delete
 8. పోనిలెండి మొత్తానికి మీరు బర్త్ సర్టిఫికేట్ పుణ్యామా అని కొంత అనుభవాన్ని సాధించారు...అన్నట్లు మీ రోటి పచ్చళ్ళు నన్ను ఎక్కడికో తీసుకుపోయాయి.

  ReplyDelete
  Replies
  1. అవునండీ :)
   రోటి పచ్చళ్ళు నోరూరించాయా? మరింకెందుకండీ ఆలశ్యం? శ్రీమతి గారికి చెప్పేయండి వెంటనే కోరిక నెరవేరిపోతుందిగా.. :)

   Delete
 9. చాలా బావుంది మీ అనుభవం ప్రియ గారు.. రోటి పచ్చళ్ళు గుర్తుకు చేశారు....

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog and thanks for the comment, Karthik gaaru :)

   Delete
 10. Anonymous15/4/13

  "మనసు పెట్టడం" అంటే అర్థం ఇదా?
  మీరు కాయిన్ చేసారా లేక ఇంతకు ముందే ఉందా?

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగింటికి స్వాగతం బోనగిరి గారు :)
   ఈ మాట ఇంతకు ముందు ఉందో లేదో నాకూ తెలియదండీ. బాబాయి నాకు గారు నేర్పిన అర్ధమిది.

   Delete
 11. నా ఈ అంతర్జాల జీవితం లో...భయపడకండి సత్యనారాయణ లాగ వాయించను ..
  చెప్పేదేంటంటే ...మొట్టమొదటిసారిగా ఒక బ్లాగ్ ని ఒక్క ముక్క కూడా వదలకుండా చదివానండీ , పొద్దున 10 కి మొదలు పెట్టా , మధ్యాహ్నం నిద్ర రమ్మని ఇందాకటి నించి కోటా గారు తన్నినట్టు తన్నుతున్నా కళ్ళమీద ఐస్ పెట్టి మరీ చదివేసా ...మధ్యలోనే తెలిసింది మీ బ్లాగ్ కి పిచ్చ ఫాను , కూలర్ అయిపోయానని :)
  పాపం భరత్ గారిని అడిగానని చెప్పండి
  మీ బ్లాగ్ అద్భుతః

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహహ్హ.. బ్లాగ్ బాగుందని చెబుతూనే మీ నిద్ర పాడుచేసిన పాపాన్ని నాకంటగట్టేసారు కదండీ :P

   Thank you, thank you so much for the LoVeLy comment :)
   తనను మీరడిగినట్లు తప్పక చెబుతాను.

   Delete
 12. బాబాయిగారి ఫోటో కూడా పెట్టాల్సింది. నాలుగు కొబ్బరి కాయలు కొట్టేవాళ్ళం

  ReplyDelete
  Replies
  1. నా దరిద్రాన్ని నాతోనే పోనీ అని పెట్టలేదండీ.. :)

   Delete
 13. ఎంతబాగా అడిగారూ, కామెంటు కేం‌ భాగ్యం అని! తప్పకుండా చెబుతాను.
  మీ‌ టపా చాలా బాగుంది అని చెప్పటం ఉన్నమాట చెప్పటమే. తీరిక చూసుకొని మీ‌ బ్లాగు టపాలన్నీ చదివేయాలని నిర్ణయించుకున్నాను.

  'మనసు పెట్టటం' అన్నమాటను భలే బాగా మోగించారు!

  ReplyDelete
  Replies
  1. ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతమండీ!
   మీ కామెంట్, నిర్ణయం రెండూ నాకు చాలా సంతోషకరం. అందుకు మీకు నా కృతజ్ఞతలు :)

   Delete
 14. మీరు చాలా అదృష్ట వంతులండీ మాతో పోల్చుకుంటే ... మా ఆవిడ PASSPORT కోసం కర్నూల్ లో అప్లై చేస్తే 2 నెలల తర్వాత కూడా హైదరాబాద్ చేరలేదు . ఆ తర్వాత వాళ్ళను వీళ్ళను కనుక్కుని, passport office లో ఎంక్వయిరీ చేసి, 7000 రూపాయలు డబ్బులు, 5 నెలలు బాగా మనసు పెడితే అప్పుడు వచ్చింది.

  మీ ప్రేమాయణం చాల అందంగా వుంది. ఇప్పుడే కదా మొదలయింది (నేను మీ ప్రేమాయణం చదవడం). అంతలోనే అయిపోయిందా (పెళ్లి వరకు వచ్చిందా) అనిపించింది. ఇంకా ఉండుంటే బాగుండే అనిపించింది.

  చివరలో కామెంట్ రాయమని అడిగే మాటలు చాల బావున్నాయి.

  మీ అనుకి (అంటే భరతే కదా) హాయ్ చెప్పండి

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం ప్రవీణ్ గారు!

   ఏం అదృష్టమండీ.. మీరు కర్చు పెట్టిన దానికంటే "2 ఆకులు" ఎక్కువే కర్చుపెడుతూ.. 8 నెలలకు పైనే తిరిగితే, సర్టిఫికేట్ పోయిన వారం అందింది చేతికి!.

   నా ప్రేమాయణం ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయండీ. నేను బ్రతికి ఉన్నంత కాలం ప్రేమయితే కొనసాగుతూనే ఉంటుందనుకొండీ పెళ్లి పేరుతో.. అది వేరే విషయం.

   నా మాటలు మీకు నచ్చినందుకు, మీ వాఖ్యకూ చాలా థాంక్స్. సాయంత్రం అనూతో (అదే.. భరత్ తో) మాట్లాడేడపుడు, మీ పుణ్యమాని నా బ్లాగ్ ఫాలోవర్స్ లిస్ట్ 45కి చేరిందనీ.. మీరు తనకు హాయ్ చెప్పమని చెప్పారని చెప్పాను. అనూ మీకు తన కృతజ్ఞతలు తెలుపమన్నాడు :)

   Delete
 15. మీ బ్లాగ్ కి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు .....

  నేనన్నది మీ ప్రేమాయణం టపాల గురించి. అప్పుడే అయిపోయాయా అనిపించింది. ఇంకా టపాలు వున్నాయి అన్నారు కాబట్టి వీలు చూస్కుని update చేస్తున్నండి.

  ఈ ప్రేమాయణం అంతా దేశముదురు సినిమా లో అలీ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు చూడండి, అలా చెప్తున్నారు.
  కొత్తగా మీ బ్లాగ్ చూస్తున్న వాళ్ళకు మాత్రం (నాకు) తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుతగా వుంటుంది.

  Certificate 8 months కి వచ్చిందా .. Good.... Congratulations ...

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ప్రవీణ్ గారు!