Monday, April 22, 2013

ఫొటోస్!ఈ ఫోటోలో చిన్ని నాన్నల (అభి అని ముద్దుగా పిలుచుకుంటున్నాం) వయసు రెండు రోజులు. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా.. అమ్మో నా దిష్టే తగిలేట్టుంది! మీకు తెలుసుగా.. ఉమ్మనీరు తాగాడని బాబుగాడ్ని 5 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు :(. ఇంటికి తీసుకొచ్చేశాక ఎంచక్కా ఆడుకోవచ్చు అనుకుంటే వాడేమో..  

ఇదిగో.. ఎప్పుడూ ఇలాగే ఏదోఒక పోజ్లో మత్తుగా నిద్రపోయేవాడు. లేపినా లేచేవాడుకాదాయే..! ఒకవేళ లేచినా పాలు తాగుతూ మళ్ళీ బజ్జుకునేవాడు. ఆరా తీస్తే, కనీసం 2, 3 నెలల వరకు పిల్లలు అలాగే ఉంటారని తెలిసింది. 

మూణ్నేల్లే కదా..  ఇలా వాడి ముద్దు ముద్దు పాదాలను చూస్తూ  గడిపేయొచ్చులే అని ఊరుకున్నా. ఒక్కోసారి ఆగలేక నిద్రపోతున్నవాడిని ముద్దులాడదామని ప్రయత్నిస్తే.. 

వాడిలా గయ్యిమనేవాడు. మా అమ్మా, వాడి అమ్మా నా మీద కయ్యిమని కొట్టడానికి వచ్చేవారు. ఆ ఫోటో పెడితే బావుండదులెండి :P 

ఎలాగో రోజులు గడిచాయి. అభీ కి మూడో నెల వచ్చింది. పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదుగాని ఇదుగో అప్పుడప్పుడు ఇలా బోసినవ్వులు నవ్వడం, మాటలు వినడం లాటివి చేసాడు. 

నాలుగో నెలలో ముద్దులాడినా ఏమీ అనేవాడు కాదు సరికదా చెప్పే ఊసులకు "ఊ" కొట్టడం, ఫొటోస్కి పోజులివ్వడం, అలగడం, ఇంట్లో ఎవరైనా రెడీ అవుతుంటే ఎక్కడికో తీసుకెళుతున్నారని "ఉంగా ఉంగా" రాగాలు ఆలపిస్తూ ఉత్సాహంగా కాళ్ళు చేతులు టప టపా ఆడించి గంతులు వేయడంలాటివి చేసాడు.  

ఐదో నెల మొదట్లో  చూసిన వాళ్ళందరి వైపూ నవ్వులు విసురుతూ కొత్త కొత్త రాగాలు తీస్తూ  ఎంతో బుద్ధిమంతుడిలా వాళ్ళమ్మ కలిపిపెట్టే సెరిలాక్, పాలతో చేసిన బిస్కెట్ పేస్టు కొంచెం కొంచెం తిన్నాడు.  

కొద్ది రోజులకు బోర్లా పడడం నేర్చుకున్నాడు.. 

నా కొడుకు పెద్దోడైపోయాడమ్మా.. అని నేను తెగ మురిసిపోతూ హీరోలా తయారుచేసేసాను. 

వాడు కూడా నా మాటలకు ఫిక్స్ అయిపోయి నా సెరిలాక్ నేనే తింటానంటూ వాళ్ళమ్మతో ఇలా పోటీకి దిగాడు! వాళ్ళమ్మ వాడి నడ్డి మీద ఒకటి, నా వీపు మీద 2 వడ్డించింది (ఎంతైనా చెల్లిని కదా.. ప్రేమ!!). 

ఆఖరుకి ఇలా బుద్ధిగా ఓ చోట కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాం పిన్నీ కొడుకులం :) చూడండి పాపం! వాడింకా ఆ షాక్ నుండి తేరుకోలేదు :P 

ఇవే ఇప్పటి విశేషాలు. ముద్దుగారే మా ఇంటి మహారాజుని చూసి మీరూ మురిసిపోయుంటారని నాకు తెలుసండీ. కాని మరీ ఎక్కువ దిష్టి పెట్టేయకండే.. :P 