Monday, April 22, 2013

ఫొటోస్!ఈ ఫోటోలో చిన్ని నాన్నల (అభి అని ముద్దుగా పిలుచుకుంటున్నాం) వయసు రెండు రోజులు. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా.. అమ్మో నా దిష్టే తగిలేట్టుంది! మీకు తెలుసుగా.. ఉమ్మనీరు తాగాడని బాబుగాడ్ని 5 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు :(. ఇంటికి తీసుకొచ్చేశాక ఎంచక్కా ఆడుకోవచ్చు అనుకుంటే వాడేమో..  

ఇదిగో.. ఎప్పుడూ ఇలాగే ఏదోఒక పోజ్లో మత్తుగా నిద్రపోయేవాడు. లేపినా లేచేవాడుకాదాయే..! ఒకవేళ లేచినా పాలు తాగుతూ మళ్ళీ బజ్జుకునేవాడు. ఆరా తీస్తే, కనీసం 2, 3 నెలల వరకు పిల్లలు అలాగే ఉంటారని తెలిసింది. 

మూణ్నేల్లే కదా..  ఇలా వాడి ముద్దు ముద్దు పాదాలను చూస్తూ  గడిపేయొచ్చులే అని ఊరుకున్నా. ఒక్కోసారి ఆగలేక నిద్రపోతున్నవాడిని ముద్దులాడదామని ప్రయత్నిస్తే.. 

వాడిలా గయ్యిమనేవాడు. మా అమ్మా, వాడి అమ్మా నా మీద కయ్యిమని కొట్టడానికి వచ్చేవారు. ఆ ఫోటో పెడితే బావుండదులెండి :P 

ఎలాగో రోజులు గడిచాయి. అభీ కి మూడో నెల వచ్చింది. పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదుగాని ఇదుగో అప్పుడప్పుడు ఇలా బోసినవ్వులు నవ్వడం, మాటలు వినడం లాటివి చేసాడు. 

నాలుగో నెలలో ముద్దులాడినా ఏమీ అనేవాడు కాదు సరికదా చెప్పే ఊసులకు "ఊ" కొట్టడం, ఫొటోస్కి పోజులివ్వడం, అలగడం, ఇంట్లో ఎవరైనా రెడీ అవుతుంటే ఎక్కడికో తీసుకెళుతున్నారని "ఉంగా ఉంగా" రాగాలు ఆలపిస్తూ ఉత్సాహంగా కాళ్ళు చేతులు టప టపా ఆడించి గంతులు వేయడంలాటివి చేసాడు.  

ఐదో నెల మొదట్లో  చూసిన వాళ్ళందరి వైపూ నవ్వులు విసురుతూ కొత్త కొత్త రాగాలు తీస్తూ  ఎంతో బుద్ధిమంతుడిలా వాళ్ళమ్మ కలిపిపెట్టే సెరిలాక్, పాలతో చేసిన బిస్కెట్ పేస్టు కొంచెం కొంచెం తిన్నాడు.  

కొద్ది రోజులకు బోర్లా పడడం నేర్చుకున్నాడు.. 

నా కొడుకు పెద్దోడైపోయాడమ్మా.. అని నేను తెగ మురిసిపోతూ హీరోలా తయారుచేసేసాను. 

వాడు కూడా నా మాటలకు ఫిక్స్ అయిపోయి నా సెరిలాక్ నేనే తింటానంటూ వాళ్ళమ్మతో ఇలా పోటీకి దిగాడు! వాళ్ళమ్మ వాడి నడ్డి మీద ఒకటి, నా వీపు మీద 2 వడ్డించింది (ఎంతైనా చెల్లిని కదా.. ప్రేమ!!). 

ఆఖరుకి ఇలా బుద్ధిగా ఓ చోట కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాం పిన్నీ కొడుకులం :) చూడండి పాపం! వాడింకా ఆ షాక్ నుండి తేరుకోలేదు :P 

ఇవే ఇప్పటి విశేషాలు. ముద్దుగారే మా ఇంటి మహారాజుని చూసి మీరూ మురిసిపోయుంటారని నాకు తెలుసండీ. కాని మరీ ఎక్కువ దిష్టి పెట్టేయకండే.. :P 
  
24 comments:

srinivasarao vundavalli said...

ఫోటోలు బావున్నాయి ప్రియ గారు.. మీ నేరేషన్ కూడా :)

Chinni said...

అభి ఫోజులు, వాడి అల్లరి & నీ మాటలు అన్నీ చాలా బాగున్నాయ్ ప్రియా...

Priya said...

థాంక్స్ శ్రీనివాస్ గారు! పోస్ట్ పబ్లిష్ చేసిన 2 మినిట్స్ లోనే వచ్చిన మీ కామెంట్ చూసి చాలా హ్యాపీ హ్యాపీ అయిపోయాను :)

Lasya Ramakrishna said...

ప్రియ గారు, అభి ఫొటోస్ చాలా బాగున్నాయండి. వాడి అల్లరి మీరు వర్ణించిన తీరు ఇంకా బాగుంది :)

Priya said...

వాటితో పాటు నీ కామెంట్ కూడా చాలా బావుంది. థాంక్స్ చిన్నీ :)

Priya said...

థాంక్స్ లాస్య గారు! నేను వర్ణిస్తేనే ఇంత బావుందంటున్నారు ఇక వాడి అల్లరిని నేరుగా చూస్తే వదలరేమో.. :)

Dantuluri Kishore Varma said...

ఫోటోలు చాలా బాగున్నాయి. అభీకి శుభాశీస్సులు.

Priya said...

నా బ్లాగ్ కి స్వాగతం కిషోర్ వర్మ గారు!
మీ కామెంట్ కు, అభీ కి అందించిన ఆశిస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలు :)

ఎగిసే అలలు.... said...

nice.. chaalaa baavundi mee post..-:)

Priya said...

Thank you so much, Karthik gaaru :)

Chinni Aasa said...

మీ అభి ప్రతి milestone నీ చక్కగా capture చేసి పొందుపరిచారు. పెద్దయ్యాక అభికిది మరపు రాని "పిన్ని బహుమతి" గా ఉండిపోతుంది.

Priya said...

Thank you so much for the compliment, Pandu gaaru :)

శోభ said...

చిన్నినాన్నలు ఎంత ముద్దుగా ఉన్నాడో ప్రియా.....

ఇక్కడ పిన్ని పసిపిల్లా లేక అభి పసిపిల్లాడో అర్థం కానంతగా..... ఇద్దరూ పసితనపు మధురిమలు మా అందరికీ మీ బుజ్జి బుజ్జి మాటల్తో కళ్లకు కట్టారు..

ఫొటోలకు తగినట్లు బుజ్జిపాప ప్రియమ్మ వ్యాఖ్యానం సూపరో.... సూపర్.... అభిని ఇలా చూపినందుకు బోలెడన్ని థాంకులు ప్రియమ్మ (పిన్నమ్మ).... :)

Priya said...

Thank you very much for the sweeeeeeeeeeeeeeett comment, శోభ గారు :) అసలు కామెంట్స్ రాయడంలో మీకు మీరే సాటి!

వేణూశ్రీకాంత్ said...

హహహ ఫోటోలు వాటికి మీ వ్యాఖ్యానం రెండూ సూపరండీ :-) మీరు పెట్టద్దన్నా కొంచెం దిష్టిపెట్టేశాం మరి, వాళ్ళమ్మతో చెప్పి దిష్టితీయించేయండి :-))

రాజ్ కుమార్ said...

బుడ్డోడు భలే ఉన్నాడండీ.. ఎంచక్కా ఆడుకోండి.. నేను హాయ్ చెప్పానని చెప్పండి ;)

అర్జెంట్ గా దిష్టి తీసెయ్యండి ;

Priya said...

థాంక్స్ వేణూ గారు! పోస్ట్ పబ్లిష్ చేసినప్పటి నుండి ఇప్పటికి కనీసం 5, 6 సార్లైనా ఆ పని చేసుంటుందండీ వాళ్ళమ్మ :). ఇంత భయమున్నదానివి ఎందుకే పోస్ట్ చేయమన్నావ్ అంటే, "బ్లాగ్ నిండా నీ భజనే ఉండాలా? నీకు, భరత్ కి నా కొడుకేమైనా తీసిపోయాడా? దిష్టి తీసుకునే తిప్పలేవో నే పడతా కాని నెలకొక్క పోస్ట్ అయినా రాయి నా కొడుకు గురించి. ఇదిగో ఫోటోలతో సహా!" అంది.

Priya said...

థాంక్స్ రాజ్ గారు.. వాడితో నా ఆటలకు అంతే లేదు. కాని వాడి ఆటనే భరించడం కొంచెం కష్టంగా ఉంది. నన్ను ఎగిరెగిరి తన్ని, మొహమంతా రక్కేసి బోసి నోరేసుకుని తెగ నవ్వుతున్నాడు! అదే వాడికి ఆటట!!! మీరు హాయ్ చెప్పినట్లు తప్పక చెబుతాను :)

పైన వేణూ గారికి చెప్పినట్లు ఇప్పటికే చాలా సార్లు దిష్టి తీసేసిందండి వాళ్ళమ్మ. ఆఖరు రౌండ్ గా ఇందాకే మరోసారి దిష్టి తీసి బజ్జోపెట్టింది :)

vajra said...

అందం,అభినయంతో అభి మరియు మాటలు,సెన్స్ అఫ్ humor తో మీ రాతలు,ఫోటోలు ..రెండు బాగున్నాయి ప్రియ గారు..Nice work...

Priya said...

Thank you so much for the lovely comment, Vajra gaaru :)

డేవిడ్ said...

చిన్ని తండ్రి నిను చూడగా | వెయ్యి కళ్ళైన సరిపోవురా
ఇన్ని కళ్ళూ చూస్తుండగా | నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ ఒడిలోనే | దాగుండిపోరా....
అపుడప్పుడు పిన్నమ్మను (ప్రియమ్మను) రక్కుతూ ఉండిపోరా (నీకు దిష్టి తగిలిస్తున్నందుకు)
చాలా బాగున్నాయి ప్రియ గారు ఫోటొలు మరియు మీ వర్ణన

Priya said...

భలే మంచి పాటను గుర్తు చేసారండీ. అయినా డేవిడ్ గారూ.. నా మీద మీకేల ఇంత కసి :P
ఫోటోలు పెట్టమన్నది వాళ్ళమ్మయితే?! హహ్హహ్హహా thanks for the comment :)

MURALI said...

బాబు ఫోటోలు, మీ మాటలు రెండూ సూపర్. ఆతలు తారాస్థాయి చేరాలని ఆశిస్తూ :)

Priya said...

మురళి గారూ.. నా బ్లాగ్ కి స్వాగతం!
మీ కామెంట్ కు, ఆశిస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Monday, April 22, 2013

ఫొటోస్!ఈ ఫోటోలో చిన్ని నాన్నల (అభి అని ముద్దుగా పిలుచుకుంటున్నాం) వయసు రెండు రోజులు. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా.. అమ్మో నా దిష్టే తగిలేట్టుంది! మీకు తెలుసుగా.. ఉమ్మనీరు తాగాడని బాబుగాడ్ని 5 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు :(. ఇంటికి తీసుకొచ్చేశాక ఎంచక్కా ఆడుకోవచ్చు అనుకుంటే వాడేమో..  

ఇదిగో.. ఎప్పుడూ ఇలాగే ఏదోఒక పోజ్లో మత్తుగా నిద్రపోయేవాడు. లేపినా లేచేవాడుకాదాయే..! ఒకవేళ లేచినా పాలు తాగుతూ మళ్ళీ బజ్జుకునేవాడు. ఆరా తీస్తే, కనీసం 2, 3 నెలల వరకు పిల్లలు అలాగే ఉంటారని తెలిసింది. 

మూణ్నేల్లే కదా..  ఇలా వాడి ముద్దు ముద్దు పాదాలను చూస్తూ  గడిపేయొచ్చులే అని ఊరుకున్నా. ఒక్కోసారి ఆగలేక నిద్రపోతున్నవాడిని ముద్దులాడదామని ప్రయత్నిస్తే.. 

వాడిలా గయ్యిమనేవాడు. మా అమ్మా, వాడి అమ్మా నా మీద కయ్యిమని కొట్టడానికి వచ్చేవారు. ఆ ఫోటో పెడితే బావుండదులెండి :P 

ఎలాగో రోజులు గడిచాయి. అభీ కి మూడో నెల వచ్చింది. పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదుగాని ఇదుగో అప్పుడప్పుడు ఇలా బోసినవ్వులు నవ్వడం, మాటలు వినడం లాటివి చేసాడు. 

నాలుగో నెలలో ముద్దులాడినా ఏమీ అనేవాడు కాదు సరికదా చెప్పే ఊసులకు "ఊ" కొట్టడం, ఫొటోస్కి పోజులివ్వడం, అలగడం, ఇంట్లో ఎవరైనా రెడీ అవుతుంటే ఎక్కడికో తీసుకెళుతున్నారని "ఉంగా ఉంగా" రాగాలు ఆలపిస్తూ ఉత్సాహంగా కాళ్ళు చేతులు టప టపా ఆడించి గంతులు వేయడంలాటివి చేసాడు.  

ఐదో నెల మొదట్లో  చూసిన వాళ్ళందరి వైపూ నవ్వులు విసురుతూ కొత్త కొత్త రాగాలు తీస్తూ  ఎంతో బుద్ధిమంతుడిలా వాళ్ళమ్మ కలిపిపెట్టే సెరిలాక్, పాలతో చేసిన బిస్కెట్ పేస్టు కొంచెం కొంచెం తిన్నాడు.  

కొద్ది రోజులకు బోర్లా పడడం నేర్చుకున్నాడు.. 

నా కొడుకు పెద్దోడైపోయాడమ్మా.. అని నేను తెగ మురిసిపోతూ హీరోలా తయారుచేసేసాను. 

వాడు కూడా నా మాటలకు ఫిక్స్ అయిపోయి నా సెరిలాక్ నేనే తింటానంటూ వాళ్ళమ్మతో ఇలా పోటీకి దిగాడు! వాళ్ళమ్మ వాడి నడ్డి మీద ఒకటి, నా వీపు మీద 2 వడ్డించింది (ఎంతైనా చెల్లిని కదా.. ప్రేమ!!). 

ఆఖరుకి ఇలా బుద్ధిగా ఓ చోట కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాం పిన్నీ కొడుకులం :) చూడండి పాపం! వాడింకా ఆ షాక్ నుండి తేరుకోలేదు :P 

ఇవే ఇప్పటి విశేషాలు. ముద్దుగారే మా ఇంటి మహారాజుని చూసి మీరూ మురిసిపోయుంటారని నాకు తెలుసండీ. కాని మరీ ఎక్కువ దిష్టి పెట్టేయకండే.. :P 
  
24 comments:

 1. ఫోటోలు బావున్నాయి ప్రియ గారు.. మీ నేరేషన్ కూడా :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీనివాస్ గారు! పోస్ట్ పబ్లిష్ చేసిన 2 మినిట్స్ లోనే వచ్చిన మీ కామెంట్ చూసి చాలా హ్యాపీ హ్యాపీ అయిపోయాను :)

   Delete
 2. అభి ఫోజులు, వాడి అల్లరి & నీ మాటలు అన్నీ చాలా బాగున్నాయ్ ప్రియా...

  ReplyDelete
  Replies
  1. వాటితో పాటు నీ కామెంట్ కూడా చాలా బావుంది. థాంక్స్ చిన్నీ :)

   Delete
 3. ప్రియ గారు, అభి ఫొటోస్ చాలా బాగున్నాయండి. వాడి అల్లరి మీరు వర్ణించిన తీరు ఇంకా బాగుంది :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ లాస్య గారు! నేను వర్ణిస్తేనే ఇంత బావుందంటున్నారు ఇక వాడి అల్లరిని నేరుగా చూస్తే వదలరేమో.. :)

   Delete
 4. ఫోటోలు చాలా బాగున్నాయి. అభీకి శుభాశీస్సులు.

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం కిషోర్ వర్మ గారు!
   మీ కామెంట్ కు, అభీ కి అందించిన ఆశిస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలు :)

   Delete
 5. nice.. chaalaa baavundi mee post..-:)

  ReplyDelete
  Replies
  1. Thank you so much, Karthik gaaru :)

   Delete
 6. మీ అభి ప్రతి milestone నీ చక్కగా capture చేసి పొందుపరిచారు. పెద్దయ్యాక అభికిది మరపు రాని "పిన్ని బహుమతి" గా ఉండిపోతుంది.

  ReplyDelete
  Replies
  1. Thank you so much for the compliment, Pandu gaaru :)

   Delete
 7. చిన్నినాన్నలు ఎంత ముద్దుగా ఉన్నాడో ప్రియా.....

  ఇక్కడ పిన్ని పసిపిల్లా లేక అభి పసిపిల్లాడో అర్థం కానంతగా..... ఇద్దరూ పసితనపు మధురిమలు మా అందరికీ మీ బుజ్జి బుజ్జి మాటల్తో కళ్లకు కట్టారు..

  ఫొటోలకు తగినట్లు బుజ్జిపాప ప్రియమ్మ వ్యాఖ్యానం సూపరో.... సూపర్.... అభిని ఇలా చూపినందుకు బోలెడన్ని థాంకులు ప్రియమ్మ (పిన్నమ్మ).... :)

  ReplyDelete
  Replies
  1. Thank you very much for the sweeeeeeeeeeeeeeett comment, శోభ గారు :) అసలు కామెంట్స్ రాయడంలో మీకు మీరే సాటి!

   Delete
 8. హహహ ఫోటోలు వాటికి మీ వ్యాఖ్యానం రెండూ సూపరండీ :-) మీరు పెట్టద్దన్నా కొంచెం దిష్టిపెట్టేశాం మరి, వాళ్ళమ్మతో చెప్పి దిష్టితీయించేయండి :-))

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ వేణూ గారు! పోస్ట్ పబ్లిష్ చేసినప్పటి నుండి ఇప్పటికి కనీసం 5, 6 సార్లైనా ఆ పని చేసుంటుందండీ వాళ్ళమ్మ :). ఇంత భయమున్నదానివి ఎందుకే పోస్ట్ చేయమన్నావ్ అంటే, "బ్లాగ్ నిండా నీ భజనే ఉండాలా? నీకు, భరత్ కి నా కొడుకేమైనా తీసిపోయాడా? దిష్టి తీసుకునే తిప్పలేవో నే పడతా కాని నెలకొక్క పోస్ట్ అయినా రాయి నా కొడుకు గురించి. ఇదిగో ఫోటోలతో సహా!" అంది.

   Delete
 9. బుడ్డోడు భలే ఉన్నాడండీ.. ఎంచక్కా ఆడుకోండి.. నేను హాయ్ చెప్పానని చెప్పండి ;)

  అర్జెంట్ గా దిష్టి తీసెయ్యండి ;

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాజ్ గారు.. వాడితో నా ఆటలకు అంతే లేదు. కాని వాడి ఆటనే భరించడం కొంచెం కష్టంగా ఉంది. నన్ను ఎగిరెగిరి తన్ని, మొహమంతా రక్కేసి బోసి నోరేసుకుని తెగ నవ్వుతున్నాడు! అదే వాడికి ఆటట!!! మీరు హాయ్ చెప్పినట్లు తప్పక చెబుతాను :)

   పైన వేణూ గారికి చెప్పినట్లు ఇప్పటికే చాలా సార్లు దిష్టి తీసేసిందండి వాళ్ళమ్మ. ఆఖరు రౌండ్ గా ఇందాకే మరోసారి దిష్టి తీసి బజ్జోపెట్టింది :)

   Delete
 10. అందం,అభినయంతో అభి మరియు మాటలు,సెన్స్ అఫ్ humor తో మీ రాతలు,ఫోటోలు ..రెండు బాగున్నాయి ప్రియ గారు..Nice work...

  ReplyDelete
  Replies
  1. Thank you so much for the lovely comment, Vajra gaaru :)

   Delete
 11. చిన్ని తండ్రి నిను చూడగా | వెయ్యి కళ్ళైన సరిపోవురా
  ఇన్ని కళ్ళూ చూస్తుండగా | నీకు దిష్టెంత తగిలేనురా
  అందుకే అమ్మ ఒడిలోనే | దాగుండిపోరా....
  అపుడప్పుడు పిన్నమ్మను (ప్రియమ్మను) రక్కుతూ ఉండిపోరా (నీకు దిష్టి తగిలిస్తున్నందుకు)
  చాలా బాగున్నాయి ప్రియ గారు ఫోటొలు మరియు మీ వర్ణన

  ReplyDelete
 12. భలే మంచి పాటను గుర్తు చేసారండీ. అయినా డేవిడ్ గారూ.. నా మీద మీకేల ఇంత కసి :P
  ఫోటోలు పెట్టమన్నది వాళ్ళమ్మయితే?! హహ్హహ్హహా thanks for the comment :)

  ReplyDelete
 13. బాబు ఫోటోలు, మీ మాటలు రెండూ సూపర్. ఆతలు తారాస్థాయి చేరాలని ఆశిస్తూ :)

  ReplyDelete
  Replies
  1. మురళి గారూ.. నా బ్లాగ్ కి స్వాగతం!
   మీ కామెంట్ కు, ఆశిస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ :)

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)