Tuesday, May 14, 2013

ఉంగరాల పండుగ

ఏ మాటలతో ఈ పోస్ట్ మొదలుపెట్టాలో అస్సలు అర్ధం కావడంలేదండీ! ఛీ ఛీ.. రాయడానికి కూడా సిగ్గేంటండీ మరీ విడ్డూరం  కాకపోతేనూ??! అందుకే ఎలాగో చెప్పేస్తున్నా.. గత కొంత కాలంగా..  ఇదిగో, అదిగో అంటున్నా అణువైనా కదలని నా నిశ్చితార్ధ వేడుక మొన్న ఏడో తారీఖున జరిగింది :) (7th మే 2013). హమ్మయ చెప్పేశా. హూం ఇది రాయడానికే సిగ్గుతో వేళ్ళు ముందుకి కదల్లేదు! హహ్హ..  నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో. "ప్రేమ కబుర్లే పూస గుచ్చినట్లు చెప్పావ్? నిశ్చితార్దం గురించి చెప్పడానికి సిగ్గెందుకూ.. మరీను" అనేగా? నిజం చెప్పనా.. నాకూ అదే అర్ధంకావడంలేదు! ఆ వేళ నిజంగా దించిన తల ఎత్తలేదు నేను! లోలోపలేమో "అందరూ ఏం చేస్తున్నారో.. నన్నే చూస్తున్నారేమో.. భరత్ ఏం చేస్తున్నాడు? తను మాత్రం హాయిగా తలెత్తుకొని కూర్చొని ఉంటాడు కదూ.. అయినా నాకు మాత్రం  ఏం ఖర్మ? అయినా  ఇక్కడ సిగ్గుపడడానికేముంది? తలెత్తుకొని కూర్చో ప్రియా.. మళ్ళీ రమ్మన్నా ఈ సమయం తిరిగి రాదు సో  తలెత్తుకొని అందర్నీ, అన్నిటినీ చూడు" అంటూ బుర్రలో సవాలక్ష ఆలోచనలు. కాని ఎంత ప్రయత్నించినా తల మాత్రం ఎత్తలేకపోయానండీ. మధ్యలో ఓ సారి ధైర్యం చేసుకుని తలెత్తి చూసాను సంబరంగా. నన్నే చూస్తున్న మా అమ్మ నొసలు ముడి వేసి కళ్ళు పెద్దవి చేసింది. అంతే! మళ్ళీ యాధా మామూలుగా  టప్ మని తలదించేసాను. అందరి నవ్వులు, మాటలు వినడం తప్ప పెద్దగా ఏమీ చూడలేకపోయానన్నమాట.

నిశ్చితార్దం అనుకున్నప్పటి నుండీ నేనే అంటే నా కన్నా ఎక్ష్సైటెడ్ గా ఉన్నాడు భరత్! అయ్యయో..  ఏ విషయంలోనూ ఎటువంటి భావప్రకటనా చేయని తను ఎక్ష్సైట్ అవుతుంటే చూడలేకపోతున్నానే అని చాల బాధపడిపోయి, పోనిలే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి వాటిలో చూడొచ్చులే అని నన్ను నేనే ఒదార్చుకున్నాను. దేవుడు కరుణించాడు. దండలు మార్చుకునేప్పుడు అందరూ అక్షింతల హడావిడిలో ఉండేసరికి తన మెడలో దండ వేస్తూ కళ్ళెత్తి చూసాను అతని  మొహంలోకి.  నేననుకున్నట్లు ఆ కళ్ళు పులకరించిపోతూ లేవు సరికదా కనీసం నా వైపు కూడా చూడ్డంలేదు! నేను మెడలో దండ వేస్తోంటే అక్కడ ఎవరికో ఏదో సైగ చేస్తున్నాడు! ఆహ్! నాకైతే.. అబ్బహ్ వద్దులెండి బావుండదు. కాని నిజంగా "యాయ్.. ఇలా మళ్ళీ ఇంకెపుడైనా చేస్తావా? చేస్తావా? చేస్తావా? నా వైపు చూడకుండా ఉంటావా? ఉంటావా? ఉంటావా? " అంటూ  నెత్తిమీద మొత్తు మొత్తని మొత్తాలనిపించింది :). అప్పుడే నిశ్చితార్ధపు ఫోటోల మీద ఆశ వదిలేసుకున్నాను. అయినా ఏదో ఒక్క క్షణం అలా అయిందని మరీ నిరుత్సాహపడిపోకూడదని ధైర్యం చెప్పుకుని ప్రియని లోపలికి నెట్టి సిగ్గుల సిరిమల్లెను బయటకు లాక్కొచ్చాను.

నిజంగా నా మనసెక్కడో తెలిపోతూంది. మనసుపడ్డపుడు, ప్రేమలో ఉన్నపుడూ కలిగిన భావన/ఆనందం వేరు.. ఆ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకునే ప్రక్రియలో కలిగిన ఆనందం వేరు. అప్పటికి ఎన్నోసార్లు భరత్ ని చూసాను, కలిసాను. కాని ఆ రోజు ఎంత కొత్తగా అనిపించిందో! ఉంగరం తొడగడానికి తను నా చేయందుకున్నపుడైతే తనువంతా సన్నగా వణికింది. తన చేతికి నేను ఉంగరం పెట్టాల్సివచ్చినపుడు నేనుగా తన చేయందుకోవడానికి అస్సలు ధైర్యం చాల్లేదు! నవ్వొచ్చేస్తోంది.. కాని నవ్వకూడదు. "మీరందరూ లోపలిపొండి నే పెట్టుకుంటాలే" అనాలనిపించింది. గొంతు పెగల్లేదు :) మొత్తానికి ఎలాగో పెట్టేసాను. తరువాత దండలు మార్చుకోవాలన్నారు. తను నా మెడలో దండ వేస్తుంటే.. నిజం చెప్పొద్దూ (మీరేమైనా అనుకోండీ :P ) నా మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకుంటున్న భావన కలిగింది! నేను వేసేడపుడు ఏమైందో చెప్పానుగా.. :-/

అమ్మా, నాన్నా, అక్కా, బావా, అత్తగారు, మామగారు.. బంధువులూ మనసారా దీవిస్తూ మా తల మీద వేసిన అక్షింతలు ఏవో కొత్త కాంతులు నింపాయి మా ఇద్దరి మొహాల్లో. అప్పుడొచ్చారు నా స్నేహితులు గిఫ్ట్ ప్యాక్ మోసుకుంటూ. ముందు నా చేత నాలుగు అక్షింతలు  వేయించుకుని తరువాత నా మీద వాళ్ళు అక్షింతలు వేసారు ఒకొక్కరిగా.  అంతా అయిపోయాక మా అత్తగారిని "అత్తయ్యా నాకు ఈ చీర ఎలా ఉంది" అని అడిగాను. ఆవిడ "మేము తెచ్చిన చీరా బావుంది.. మా వాడు చూసిన చిన్నది ఇంకా బావుంది" అన్నారు నవ్వుతూ! ఇంతకూ మీకు ఆ చీర చూయించలేదుగా? ఇదిగో చూడండి. 

దండలు మార్చుకునే ముందు తీసిన ఫోటో ఇది. బావుందా? మ్మ్ అని ఊరుకోవడం కాదండీ.. దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వదించేయండి :). తనూ నేనూ ఇద్దరం ఉన్న ఫోటోనే పెడదాం అనుకున్నాను కాని, ప్రతి ఫోటోలోను ఏదో బద్ధ శత్రువుతో పోట్లాటకు దిగుతున్నట్లు, ఎవరితోనో బలవంతపు పెళ్లి చేస్తున్నట్లు పెట్టుకుని కూర్చున్నాడు మొహం!! అంచేత "నా ఫోటో పెట్టావో చంపేస్తా.. ఏవే ప్లీజ్ నీకు పుణ్యముంటుందే.." అని బెదిరించి బ్రతిమాలుకున్నాడని పెట్టడంలేదు :)