Tuesday, May 14, 2013

ఉంగరాల పండుగ

ఏ మాటలతో ఈ పోస్ట్ మొదలుపెట్టాలో అస్సలు అర్ధం కావడంలేదండీ! ఛీ ఛీ.. రాయడానికి కూడా సిగ్గేంటండీ మరీ విడ్డూరం  కాకపోతేనూ??! అందుకే ఎలాగో చెప్పేస్తున్నా.. గత కొంత కాలంగా..  ఇదిగో, అదిగో అంటున్నా అణువైనా కదలని నా నిశ్చితార్ధ వేడుక మొన్న ఏడో తారీఖున జరిగింది :) (7th మే 2013). హమ్మయ చెప్పేశా. హూం ఇది రాయడానికే సిగ్గుతో వేళ్ళు ముందుకి కదల్లేదు! హహ్హ..  నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో. "ప్రేమ కబుర్లే పూస గుచ్చినట్లు చెప్పావ్? నిశ్చితార్దం గురించి చెప్పడానికి సిగ్గెందుకూ.. మరీను" అనేగా? నిజం చెప్పనా.. నాకూ అదే అర్ధంకావడంలేదు! ఆ వేళ నిజంగా దించిన తల ఎత్తలేదు నేను! లోలోపలేమో "అందరూ ఏం చేస్తున్నారో.. నన్నే చూస్తున్నారేమో.. భరత్ ఏం చేస్తున్నాడు? తను మాత్రం హాయిగా తలెత్తుకొని కూర్చొని ఉంటాడు కదూ.. అయినా నాకు మాత్రం  ఏం ఖర్మ? అయినా  ఇక్కడ సిగ్గుపడడానికేముంది? తలెత్తుకొని కూర్చో ప్రియా.. మళ్ళీ రమ్మన్నా ఈ సమయం తిరిగి రాదు సో  తలెత్తుకొని అందర్నీ, అన్నిటినీ చూడు" అంటూ బుర్రలో సవాలక్ష ఆలోచనలు. కాని ఎంత ప్రయత్నించినా తల మాత్రం ఎత్తలేకపోయానండీ. మధ్యలో ఓ సారి ధైర్యం చేసుకుని తలెత్తి చూసాను సంబరంగా. నన్నే చూస్తున్న మా అమ్మ నొసలు ముడి వేసి కళ్ళు పెద్దవి చేసింది. అంతే! మళ్ళీ యాధా మామూలుగా  టప్ మని తలదించేసాను. అందరి నవ్వులు, మాటలు వినడం తప్ప పెద్దగా ఏమీ చూడలేకపోయానన్నమాట.

నిశ్చితార్దం అనుకున్నప్పటి నుండీ నేనే అంటే నా కన్నా ఎక్ష్సైటెడ్ గా ఉన్నాడు భరత్! అయ్యయో..  ఏ విషయంలోనూ ఎటువంటి భావప్రకటనా చేయని తను ఎక్ష్సైట్ అవుతుంటే చూడలేకపోతున్నానే అని చాల బాధపడిపోయి, పోనిలే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి వాటిలో చూడొచ్చులే అని నన్ను నేనే ఒదార్చుకున్నాను. దేవుడు కరుణించాడు. దండలు మార్చుకునేప్పుడు అందరూ అక్షింతల హడావిడిలో ఉండేసరికి తన మెడలో దండ వేస్తూ కళ్ళెత్తి చూసాను అతని  మొహంలోకి.  నేననుకున్నట్లు ఆ కళ్ళు పులకరించిపోతూ లేవు సరికదా కనీసం నా వైపు కూడా చూడ్డంలేదు! నేను మెడలో దండ వేస్తోంటే అక్కడ ఎవరికో ఏదో సైగ చేస్తున్నాడు! ఆహ్! నాకైతే.. అబ్బహ్ వద్దులెండి బావుండదు. కాని నిజంగా "యాయ్.. ఇలా మళ్ళీ ఇంకెపుడైనా చేస్తావా? చేస్తావా? చేస్తావా? నా వైపు చూడకుండా ఉంటావా? ఉంటావా? ఉంటావా? " అంటూ  నెత్తిమీద మొత్తు మొత్తని మొత్తాలనిపించింది :). అప్పుడే నిశ్చితార్ధపు ఫోటోల మీద ఆశ వదిలేసుకున్నాను. అయినా ఏదో ఒక్క క్షణం అలా అయిందని మరీ నిరుత్సాహపడిపోకూడదని ధైర్యం చెప్పుకుని ప్రియని లోపలికి నెట్టి సిగ్గుల సిరిమల్లెను బయటకు లాక్కొచ్చాను.

నిజంగా నా మనసెక్కడో తెలిపోతూంది. మనసుపడ్డపుడు, ప్రేమలో ఉన్నపుడూ కలిగిన భావన/ఆనందం వేరు.. ఆ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకునే ప్రక్రియలో కలిగిన ఆనందం వేరు. అప్పటికి ఎన్నోసార్లు భరత్ ని చూసాను, కలిసాను. కాని ఆ రోజు ఎంత కొత్తగా అనిపించిందో! ఉంగరం తొడగడానికి తను నా చేయందుకున్నపుడైతే తనువంతా సన్నగా వణికింది. తన చేతికి నేను ఉంగరం పెట్టాల్సివచ్చినపుడు నేనుగా తన చేయందుకోవడానికి అస్సలు ధైర్యం చాల్లేదు! నవ్వొచ్చేస్తోంది.. కాని నవ్వకూడదు. "మీరందరూ లోపలిపొండి నే పెట్టుకుంటాలే" అనాలనిపించింది. గొంతు పెగల్లేదు :) మొత్తానికి ఎలాగో పెట్టేసాను. తరువాత దండలు మార్చుకోవాలన్నారు. తను నా మెడలో దండ వేస్తుంటే.. నిజం చెప్పొద్దూ (మీరేమైనా అనుకోండీ :P ) నా మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకుంటున్న భావన కలిగింది! నేను వేసేడపుడు ఏమైందో చెప్పానుగా.. :-/

అమ్మా, నాన్నా, అక్కా, బావా, అత్తగారు, మామగారు.. బంధువులూ మనసారా దీవిస్తూ మా తల మీద వేసిన అక్షింతలు ఏవో కొత్త కాంతులు నింపాయి మా ఇద్దరి మొహాల్లో. అప్పుడొచ్చారు నా స్నేహితులు గిఫ్ట్ ప్యాక్ మోసుకుంటూ. ముందు నా చేత నాలుగు అక్షింతలు  వేయించుకుని తరువాత నా మీద వాళ్ళు అక్షింతలు వేసారు ఒకొక్కరిగా.  అంతా అయిపోయాక మా అత్తగారిని "అత్తయ్యా నాకు ఈ చీర ఎలా ఉంది" అని అడిగాను. ఆవిడ "మేము తెచ్చిన చీరా బావుంది.. మా వాడు చూసిన చిన్నది ఇంకా బావుంది" అన్నారు నవ్వుతూ! ఇంతకూ మీకు ఆ చీర చూయించలేదుగా? ఇదిగో చూడండి. 

దండలు మార్చుకునే ముందు తీసిన ఫోటో ఇది. బావుందా? మ్మ్ అని ఊరుకోవడం కాదండీ.. దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వదించేయండి :). తనూ నేనూ ఇద్దరం ఉన్న ఫోటోనే పెడదాం అనుకున్నాను కాని, ప్రతి ఫోటోలోను ఏదో బద్ధ శత్రువుతో పోట్లాటకు దిగుతున్నట్లు, ఎవరితోనో బలవంతపు పెళ్లి చేస్తున్నట్లు పెట్టుకుని కూర్చున్నాడు మొహం!! అంచేత "నా ఫోటో పెట్టావో చంపేస్తా.. ఏవే ప్లీజ్ నీకు పుణ్యముంటుందే.." అని బెదిరించి బ్రతిమాలుకున్నాడని పెట్టడంలేదు :)

51 comments:

Sravya V said...

హ హ ఆ మెదటి పేరా చదివి అయ్యో పాపం సిగ్గుతో తల ఎత్త లేదు ప్రియ అనుకున్నా , ఇంతా చేస్తే మీ అమ్మగారికి భయపడి తల ఎత్తలేదా ?:P

నెత్తి మీద మొత్తాలి అనిపించిందా, హ హ పాపం మీ భరత్ గారి భవిష్యత్తు నాకు 4D లో కనిపిస్తుంది :-)
Very nice and good luck to you both !
btw చీర బావుంది :-)

Priya said...

హహ్హహ... ఛ ఛ! నాకా? భయమా? నాకు మా అమ్మంటే భయమా? లేదు లేదు. మా అమ్మంటే నాకస్సలు భయంలేదు. అసలు భయమంటే మీనింగ్ తెలియని బ్లేడ్దండీ నాదీ.. :P

అయినా ఏంటండీ మీరందరునూ.. మా ఇంట్లోనేమో భరత్ ఫ్యూచర్ 70MM స్క్రీన్లో కనబడుతోందంటున్నారు.. మీరేమో 4D అంటున్నారు?!! ఊ ఊ.. ఊ ఊ.. నా వైపు మాట్లాడడానికి ఎవ్వరు లేరా????

Thank you so much for the wishes and compliment :)

రాజ్ కుమార్ said...

అభినందనలు ప్రియ గారూ..

అచ్చింతలు ఇవ్వకుండా ఆశీర్వదించమంటే ఎట్టా?
దీవించే అర్హత లేదు గానీ (ఇంకా రాలేదు అని కూడా కవి భావం) మీరూ, భరత్ గారూ ప్రతి రోజూ పండగలా పండగ చేసుకోవాలని (భాష అర్ధమవ్వక పోతే డిక్షనరీలు గట్రా వెతక్కండి, భావం క్యారీ అయ్యిందిగా) మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అంతా శుభమగు గాక.అలమలం

వేణూశ్రీకాంత్ said...

హహహ సో క్యూట్ :-) బాగుందండీ.. మంచివార్త చెప్పారు, చెప్పినవిధానం కూడా భలే ముచ్చటగా ఉంది. మీ ఇరువురికి హృదయపూర్వక అభినందనలు :-)

swathi said...

congratulations and best wishes for both of you

చిన్ని ఆశ said...

ప్రేమాయణం నుంచీ ఉంగరాల పండగ దాకా వచ్చేసారనమాట.
అదృష్టవంతులు.
అభినందనలు ఇరువురకీ!
దీర్ఘ సుమంగళీభవ!
Wish you both a happy, bright and colorful future!

జ్యోతి said...

మీ బ్లాగు ఇప్పుడే చూసాను. ఈ టపా మాత్రం బావుంది. అభినందనలు. కాని పాపం భరత్.. నాకో డౌట్ మీ ప్రతాపమంతా ఇక్కడ బ్లాగ్మాటల్లోనే అని.. నిజమేనా.

Chinni said...

ప్రియా,భరత్ ముందుగా అభినందనలు:) అయినా ప్రియా ఒకటి మొత్తాల్సింది ఎవరు చూడకుండా..:P

ధాత్రి said...

Congratulations Priya..:)

Anonymous said...

Congrats Priya....Your saree is super!!!!

MURALI said...

శుభం. సమస్త సన్మంగళానిభవంతు. దీర్ఘ సుమంగళీభవ. మీ దాంపత్యం ప్రతిరోజొక పండగలా సాగాలని ఆశిస్తున్నా.

Padmarpita said...

మీ ఇరువురికి హృదయపూర్వక అభినందనలు!

srinivasarao vundavalli said...

Congratulations Priya garu..
Have a happy and colorful life :)

pallavi said...

Congratulations andi :)
Happy for you!!
but we want to see the photos :)

శోభ said...

టపా ఆద్యంతం హాయిగా సాగిపోయింది ప్రియా...

మొత్తానికి ప్రియమ్మ పెళ్లికూతురైంది. అది సరేగానీ... ఇంత హ్యాపీ మూమెంట్లో మీ అనూ ఎందుకంత బిగుసుకుపోయాడు.

కారణం ఏమై ఉంటుందబ్బా...

ఏయ్ పిల్లా... ఓ వైపు తలొంచుకుని సిగ్గుపడుతూనే తనని ఎవరూ చూడకుండా మెల్లిగా గిల్లేసేవా ఏంటి...? :)

కూసింత నిన్న ఆటపట్టిద్దామని ఇలా అంటున్నాను అంతేనట.. సలేనా... :)

ఇద్దరూ చిలకా గోరింకల్లా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్షుతో, సుఖ సంతోషాలతో... బుల్లి బుల్లి గిల్లికజ్జాలతో.... బ్రతుకంతా ప్రేమతో.... జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... కాబోయే దంపతులకు ప్రేమపూర్వక శుభాభినందనలు.... :)

Priya said...

రాజ్ గారూ.. ప్రత్యేకంగా అక్షింతలెందుకు చెప్పండి? మీ మాటల జల్లే అక్షింతలు. మీదైన శైలిలో సింపుల్గా మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. కృతజ్ఞతలు :)

Priya said...

Thanks a lot, Venu gaaru :)

Priya said...

Thanks, Swathi gaaru :)

Priya said...

మీ అభినందనలకు, ఆశీర్వాదానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు పండు గారు :)
ఉంగరాల పండుగకు వచ్చేసాక వెనక్కి తిరిగి చూసుకుంటే "అమ్మో" అనిపిస్తోందండీ! ఎంత కష్టపడి కన్విన్స్ చేశామో. నిజమే.. మేము అదృష్టవంతులమేనండోయ్!

Priya said...

హహ్హహ్హహ.. నా బ్లాగ్ కి స్వాగతం జ్యోతి గారూ! మీ అభినందనలకు కృతజ్ఞతలు.
"పాపం భరత్" అంటూనే పరోక్షంగా "మీ ప్రతాపమంతా ఇక్కడ బ్లాగ్మాటల్లోనే అని నా డౌట్" అంటూ నను ఉసిగొల్పుతున్నారు.. :P పాపమండీ నా భరత్!

Priya said...

థాంక్స్ డార్లింగ్ :)
నిజమే అలా చేసుండాల్సిందేమో కాని తరువాత అమృతాంజన్ రాయాల్సింది నేనేగా.. మళ్ళీ ఆ తలనొప్పెందుకులే అని ఆలోచించి ఊరుకున్నా :P

Priya said...

థాంక్స్ ధాత్రి గారు :)
చాలా రోజులయిపోయింది మిమ్మల్ని చూసి! బావున్నారా?

Priya said...

Hahhahaha thank you............. :)

Priya said...

ఎంత మంగళకరంగా ఆశీర్వదించారు మురళి గారు!
హృదయపూర్వక కృతజ్ఞతలు :)

Priya said...

అందుకున్నాం పద్మ గారూ మీ అభినందనలు :)
చాలా కృతజ్ఞతలు!

Priya said...

Hearty thanks, Srinivas gaaru :)

Priya said...

Thanks a lot, Pallavi gaaru :)
Sure.. will try to post some more pics.

Priya said...

నిశ్చితార్దం జరిగినంతసేపూ కూడా తను నన్ను చూడనేలేదు అని నేనేడుస్తుంటే.. "నువ్వు గిల్లవేమో అందుకే బిగుసుకుపోయుంటాడు" అని ఆటపట్టించడం ఏమైనా బావుందా అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా :P

ఆటపట్టిస్తూనే ప్రేమపూర్వకంగా మనసారా దీవించిన మీకు నా హృదయపూర్వ కృతజ్ఞతలు శోభ గారు :)

శ్రీ said...

మీ టపా చదివిన తర్వాత మాటలు రావడం లేదండి
.. మీరు ప్రతిది చాల అందంగ చెపుతారు.. కళ్ళకుకట్టినట్టు .....కళ్ళ ముందె జరుగుతునట్టు..
మొత్తానికి సాధించారు .. నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు ..మీకు మీ అనుకు ..
ఈ సంధర్భంగ .. మీరు మీ ప్రేమకథలోని మిగతా బాగాలను త్వరితగతిన టపాల రూపం లొ తెలియచేయవలెనని విన్నవించుకుంటున్నాము..

Priya said...

శ్రీ గారూ.. మీ కామెంట్ చదివాక చాలా సంతోషమేసిందండీ. మీ అభినందలకు, నా బ్లాగ్ గురించి అన్న మాటలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నెక్స్ట్ పార్ట్ కాస్త రాశానండీ.. కాని ఆఫీస్ అండ్ పర్సనల్ పనుల్లో కాస్త బిజీ గా ఉండి కంప్లీట్ చేయలేకపోతున్నాను. కాని వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తానండీ :)

సిరిసిరిమువ్వ said...

అభినందనలు. మీ ప్రేమ కథ పెళ్ళి దాకా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానండి :)

Wishing both of you sweet and happy life together.

Priya said...

మీ అభినందనలకు చాలా కృతజ్ఞతలండీ :)
నిజం చెప్పాలంటే నేను కూడా ఆ రోజు ఎప్పుడెపుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఆ సమయం చాలా దగ్గరలోనే ఉందిలెండి... :) :)
Once again, thank you so much for the hearty wishes.

మధురవాణి said...

Hearty Congratulations to both of you! :-)

Priya said...

Thanks a lot, Madhura gaaru :)

sndp said...

akka.... all the best...... :)

Priya said...

Thanks naanna :)

డేవిడ్ said...

ప్రియ గారు ముందుగా మీకు, భరత్ కు శుభాభినందనలు...

అయినా ప్రియ గారు ఇది మరి అన్యాయం. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

"అతని మొహంలో నేననుకునట్లు కళ్ళు పులకరించిపోతూ లేవు సరికదా కనీసం నావైపు కూడా చూడ్డంలేదూ! నేను మెడలో దండ వేస్తుంటే అక్కడ ఎవరికో సైగ చేస్తున్నాడు.....కాని నిజంగా "యాయ్ ఇలా మళ్ళి ఇంకెప్పుడైనా చేస్తావా? చేస్తావా? నావైపు చూడకుండా ఉంటావా? ఉంటావా? ఉంటావా? అని నెత్తి మీద మొత్తు మొత్తాలనిపించిది" అని రాశారు.

మీ అమ్మాయిలకు పురుషుల (ఇక్కడ మా పురుషుల అని చదువుకొండి)మంచితనాన్ని అర్థం చేసుకొరండి. ఆ ఎక్సైటెడ్ సిచుయేషన్లో అబ్బాయిలు అమ్మయిలవైపు అలాగే చూస్తూ ఉంటే ఇకా ఇంతే సంగతులు. అలాంటి సిచుయేషన్లో అమ్మాయిల వైపు చుసి అబ్బాయిలు ఎన్ని పొరపాట్లు చేశారో మీకు ఏంతెలుసు...నేను నా ఎంగేజ్మెంట్లో మా రూపను (నా సహచరిని) అలాగే చూస్తూ ఉంగరాని రివర్స్ గా తొడిగాను...మా ఫ్రెండ్స్ అలాగే చూసే కొందరు దండను రివర్స్ వేయడం. మూడు ముళ్ళకు బదులు కొందరు నాలుగు, కొందరు రెండు, మరికొందరు ఐతే ఎక్కువ ముళ్ళు వేస్తే ఎమైన ప్రాబ్లమా అని అడిగారనుకోండి. నేను పెళ్ళిలో తాళి కట్టలేదు కాబట్టి మళ్ళి ఇంకో పొరపాటు చేసే అవకాశం రాలేదనుకోండి!.....ఆ ఎక్సైటెడ్ సిచుయేషన్లో మిమ్మల్ని చూస్తున్న ఆనందంలో ఏదైన పొరపాటు (ఉంగరం రివర్స్ తొడగడం లాంటిది, దండ రివర్స్ వేయడం లాంటివి) జరగకూడదని అలా ఏవరివైపో సైగ చేస్తున్నట్లు ఉండొచ్చు.... మీ మంచి కొసం భరత్ ఒక మంచి పని చేస్తె అంతదానికి ఇంతలేసి మాటలు అంటారా...వెంటనే భరత్ కు సరి చెప్పండి...చెప్పండి....చెప్పండి..

anyway...very good luck to you both

Priya said...

హహ్హహ్హహహ్హా... మీరు చెప్పిన సంగతులు భలే సరదాగా ఉన్నాయి డేవిడ్ గారూ. రూప గారితో మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనిపిస్తోంది :)

అయినా సరే.. నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. భరత్ నా వైపు చూడకపోవడం ముమ్మాటికీ తప్పు, తప్పు, తప్పంతే :P

Still, గౌరవనీయులు మీరు చెప్పారు కాబట్టి భరత్ కి సారీ చెప్పేస్తున్నా.. :)

Thank you very much for the wishes.

ప్రియ said...

ఆల్ ద బెస్ట్ , శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ,
మీ ఈ ప్రణయరాగ జీవితం 3మొట్టికాయలు,6 సిగ్గుదొంతరలతో హాయిగా సాగాలని కోరుకుంటున్నాను :)

"తాంబూలాలైపోయాయిగా ...పండగ చేస్కో ప్రియా ...ఫుల్ల్ మొత్తేయ్..." (ఇది నా ఒరిజినల్లు )

Priya said...

Thanks a lot Priya gaaru :)

ఆహ్ ఏం పండుగలెండి :-/
నిశ్చితార్దంలోనే తెలిసిపోయిందిగా :P

డేవిడ్ said...

"గౌరవనీయులు" అమ్మో ఎంత బరువైన పదం...దాన్ని మోయలేకపోతున్నా..:)

Priya said...

డేవిడ్ గారూ మీరే అలా అంటే మా బోటి వారు ఏమనాలి చెప్పండి? :)

MURALI said...

తర్వాత పోస్ట్ ఎప్పుడండీ?

మోహన said...

శుభాకంక్షలండీ.....మీ బ్లాగ్ మొత్తం చదివాను.చదువుతుంటే పక్కింటమ్మాయి,పక్కన కూర్చుని చెప్తున్నట్టుంది.

Priya said...

మరో 2, 3 రోజుల్లో మురళీ గారూ :)
ఏమీ అనుకోకండీ ఆంధ్రా కి వచ్చాను.. అందుకే ఆలశ్యంగా బదులిస్తున్నా.

Priya said...

Welcome to my blog, Mohana gaaru :)

మీ కామెంట్ కి, శుభాకాంక్షలకూ చాలా థాంక్స్ అండి. ఇప్పుడే మీ బ్లాగులో కొన్ని పోస్ట్స్ చదివాను.. చాలా బావున్నాయి.

By the way.. sorry for the late reply. ఊరిలో లేకపోవడం వలన మెయిల్స్ చెక్ చేసుకోలేకపోయాను.

మోహన said...

Thank you sooooo much priya garu:P

ప్రవీణ్ మలికిరెడ్డి said...

మీరు ఇరువురూ చల్లగా ఉండాలని, మీకంతా మంచే జరగాలని కోరుకుంటూ... శుభాకాంక్షలతో

ఉంగరాల పండగ అయ్యింది. మరి తలంబ్రాల పండగ ఎప్పుడు ?

ప్రవీణ్

Priya said...

మీ శుభాకాంక్షలకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ!
తలంబ్రాలు పోసుకునే శుభ సమయం ఎప్పుడో ఈ నెలాఖరులోపు నిశ్చయిస్తారట :)

రాధిక(నాని ) said...

ఇప్పుడే చూసా మీ ఉంగరాల పండగ జరిగిందని .హృదయపూర్వక అబినందనలు.

Priya said...

నా బ్లాగ్ కి స్వాగతం రాధిక గారు :)
మీ అభినందనలకు చాలా చాలా థాంక్స్.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, May 14, 2013

ఉంగరాల పండుగ

ఏ మాటలతో ఈ పోస్ట్ మొదలుపెట్టాలో అస్సలు అర్ధం కావడంలేదండీ! ఛీ ఛీ.. రాయడానికి కూడా సిగ్గేంటండీ మరీ విడ్డూరం  కాకపోతేనూ??! అందుకే ఎలాగో చెప్పేస్తున్నా.. గత కొంత కాలంగా..  ఇదిగో, అదిగో అంటున్నా అణువైనా కదలని నా నిశ్చితార్ధ వేడుక మొన్న ఏడో తారీఖున జరిగింది :) (7th మే 2013). హమ్మయ చెప్పేశా. హూం ఇది రాయడానికే సిగ్గుతో వేళ్ళు ముందుకి కదల్లేదు! హహ్హ..  నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో. "ప్రేమ కబుర్లే పూస గుచ్చినట్లు చెప్పావ్? నిశ్చితార్దం గురించి చెప్పడానికి సిగ్గెందుకూ.. మరీను" అనేగా? నిజం చెప్పనా.. నాకూ అదే అర్ధంకావడంలేదు! ఆ వేళ నిజంగా దించిన తల ఎత్తలేదు నేను! లోలోపలేమో "అందరూ ఏం చేస్తున్నారో.. నన్నే చూస్తున్నారేమో.. భరత్ ఏం చేస్తున్నాడు? తను మాత్రం హాయిగా తలెత్తుకొని కూర్చొని ఉంటాడు కదూ.. అయినా నాకు మాత్రం  ఏం ఖర్మ? అయినా  ఇక్కడ సిగ్గుపడడానికేముంది? తలెత్తుకొని కూర్చో ప్రియా.. మళ్ళీ రమ్మన్నా ఈ సమయం తిరిగి రాదు సో  తలెత్తుకొని అందర్నీ, అన్నిటినీ చూడు" అంటూ బుర్రలో సవాలక్ష ఆలోచనలు. కాని ఎంత ప్రయత్నించినా తల మాత్రం ఎత్తలేకపోయానండీ. మధ్యలో ఓ సారి ధైర్యం చేసుకుని తలెత్తి చూసాను సంబరంగా. నన్నే చూస్తున్న మా అమ్మ నొసలు ముడి వేసి కళ్ళు పెద్దవి చేసింది. అంతే! మళ్ళీ యాధా మామూలుగా  టప్ మని తలదించేసాను. అందరి నవ్వులు, మాటలు వినడం తప్ప పెద్దగా ఏమీ చూడలేకపోయానన్నమాట.

నిశ్చితార్దం అనుకున్నప్పటి నుండీ నేనే అంటే నా కన్నా ఎక్ష్సైటెడ్ గా ఉన్నాడు భరత్! అయ్యయో..  ఏ విషయంలోనూ ఎటువంటి భావప్రకటనా చేయని తను ఎక్ష్సైట్ అవుతుంటే చూడలేకపోతున్నానే అని చాల బాధపడిపోయి, పోనిలే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి వాటిలో చూడొచ్చులే అని నన్ను నేనే ఒదార్చుకున్నాను. దేవుడు కరుణించాడు. దండలు మార్చుకునేప్పుడు అందరూ అక్షింతల హడావిడిలో ఉండేసరికి తన మెడలో దండ వేస్తూ కళ్ళెత్తి చూసాను అతని  మొహంలోకి.  నేననుకున్నట్లు ఆ కళ్ళు పులకరించిపోతూ లేవు సరికదా కనీసం నా వైపు కూడా చూడ్డంలేదు! నేను మెడలో దండ వేస్తోంటే అక్కడ ఎవరికో ఏదో సైగ చేస్తున్నాడు! ఆహ్! నాకైతే.. అబ్బహ్ వద్దులెండి బావుండదు. కాని నిజంగా "యాయ్.. ఇలా మళ్ళీ ఇంకెపుడైనా చేస్తావా? చేస్తావా? చేస్తావా? నా వైపు చూడకుండా ఉంటావా? ఉంటావా? ఉంటావా? " అంటూ  నెత్తిమీద మొత్తు మొత్తని మొత్తాలనిపించింది :). అప్పుడే నిశ్చితార్ధపు ఫోటోల మీద ఆశ వదిలేసుకున్నాను. అయినా ఏదో ఒక్క క్షణం అలా అయిందని మరీ నిరుత్సాహపడిపోకూడదని ధైర్యం చెప్పుకుని ప్రియని లోపలికి నెట్టి సిగ్గుల సిరిమల్లెను బయటకు లాక్కొచ్చాను.

నిజంగా నా మనసెక్కడో తెలిపోతూంది. మనసుపడ్డపుడు, ప్రేమలో ఉన్నపుడూ కలిగిన భావన/ఆనందం వేరు.. ఆ ప్రేమ బంధాన్ని వివాహబంధంగా మార్చుకునే ప్రక్రియలో కలిగిన ఆనందం వేరు. అప్పటికి ఎన్నోసార్లు భరత్ ని చూసాను, కలిసాను. కాని ఆ రోజు ఎంత కొత్తగా అనిపించిందో! ఉంగరం తొడగడానికి తను నా చేయందుకున్నపుడైతే తనువంతా సన్నగా వణికింది. తన చేతికి నేను ఉంగరం పెట్టాల్సివచ్చినపుడు నేనుగా తన చేయందుకోవడానికి అస్సలు ధైర్యం చాల్లేదు! నవ్వొచ్చేస్తోంది.. కాని నవ్వకూడదు. "మీరందరూ లోపలిపొండి నే పెట్టుకుంటాలే" అనాలనిపించింది. గొంతు పెగల్లేదు :) మొత్తానికి ఎలాగో పెట్టేసాను. తరువాత దండలు మార్చుకోవాలన్నారు. తను నా మెడలో దండ వేస్తుంటే.. నిజం చెప్పొద్దూ (మీరేమైనా అనుకోండీ :P ) నా మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకుంటున్న భావన కలిగింది! నేను వేసేడపుడు ఏమైందో చెప్పానుగా.. :-/

అమ్మా, నాన్నా, అక్కా, బావా, అత్తగారు, మామగారు.. బంధువులూ మనసారా దీవిస్తూ మా తల మీద వేసిన అక్షింతలు ఏవో కొత్త కాంతులు నింపాయి మా ఇద్దరి మొహాల్లో. అప్పుడొచ్చారు నా స్నేహితులు గిఫ్ట్ ప్యాక్ మోసుకుంటూ. ముందు నా చేత నాలుగు అక్షింతలు  వేయించుకుని తరువాత నా మీద వాళ్ళు అక్షింతలు వేసారు ఒకొక్కరిగా.  అంతా అయిపోయాక మా అత్తగారిని "అత్తయ్యా నాకు ఈ చీర ఎలా ఉంది" అని అడిగాను. ఆవిడ "మేము తెచ్చిన చీరా బావుంది.. మా వాడు చూసిన చిన్నది ఇంకా బావుంది" అన్నారు నవ్వుతూ! ఇంతకూ మీకు ఆ చీర చూయించలేదుగా? ఇదిగో చూడండి. 

దండలు మార్చుకునే ముందు తీసిన ఫోటో ఇది. బావుందా? మ్మ్ అని ఊరుకోవడం కాదండీ.. దీర్ఘసుమంగళీభవ అని ఆశీర్వదించేయండి :). తనూ నేనూ ఇద్దరం ఉన్న ఫోటోనే పెడదాం అనుకున్నాను కాని, ప్రతి ఫోటోలోను ఏదో బద్ధ శత్రువుతో పోట్లాటకు దిగుతున్నట్లు, ఎవరితోనో బలవంతపు పెళ్లి చేస్తున్నట్లు పెట్టుకుని కూర్చున్నాడు మొహం!! అంచేత "నా ఫోటో పెట్టావో చంపేస్తా.. ఏవే ప్లీజ్ నీకు పుణ్యముంటుందే.." అని బెదిరించి బ్రతిమాలుకున్నాడని పెట్టడంలేదు :)

51 comments:

 1. హ హ ఆ మెదటి పేరా చదివి అయ్యో పాపం సిగ్గుతో తల ఎత్త లేదు ప్రియ అనుకున్నా , ఇంతా చేస్తే మీ అమ్మగారికి భయపడి తల ఎత్తలేదా ?:P

  నెత్తి మీద మొత్తాలి అనిపించిందా, హ హ పాపం మీ భరత్ గారి భవిష్యత్తు నాకు 4D లో కనిపిస్తుంది :-)
  Very nice and good luck to you both !
  btw చీర బావుంది :-)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ... ఛ ఛ! నాకా? భయమా? నాకు మా అమ్మంటే భయమా? లేదు లేదు. మా అమ్మంటే నాకస్సలు భయంలేదు. అసలు భయమంటే మీనింగ్ తెలియని బ్లేడ్దండీ నాదీ.. :P

   అయినా ఏంటండీ మీరందరునూ.. మా ఇంట్లోనేమో భరత్ ఫ్యూచర్ 70MM స్క్రీన్లో కనబడుతోందంటున్నారు.. మీరేమో 4D అంటున్నారు?!! ఊ ఊ.. ఊ ఊ.. నా వైపు మాట్లాడడానికి ఎవ్వరు లేరా????

   Thank you so much for the wishes and compliment :)

   Delete
 2. అభినందనలు ప్రియ గారూ..

  అచ్చింతలు ఇవ్వకుండా ఆశీర్వదించమంటే ఎట్టా?
  దీవించే అర్హత లేదు గానీ (ఇంకా రాలేదు అని కూడా కవి భావం) మీరూ, భరత్ గారూ ప్రతి రోజూ పండగలా పండగ చేసుకోవాలని (భాష అర్ధమవ్వక పోతే డిక్షనరీలు గట్రా వెతక్కండి, భావం క్యారీ అయ్యిందిగా) మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  అంతా శుభమగు గాక.అలమలం

  ReplyDelete
  Replies
  1. రాజ్ గారూ.. ప్రత్యేకంగా అక్షింతలెందుకు చెప్పండి? మీ మాటల జల్లే అక్షింతలు. మీదైన శైలిలో సింపుల్గా మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. కృతజ్ఞతలు :)

   Delete
 3. హహహ సో క్యూట్ :-) బాగుందండీ.. మంచివార్త చెప్పారు, చెప్పినవిధానం కూడా భలే ముచ్చటగా ఉంది. మీ ఇరువురికి హృదయపూర్వక అభినందనలు :-)

  ReplyDelete
 4. congratulations and best wishes for both of you

  ReplyDelete

 5. ప్రేమాయణం నుంచీ ఉంగరాల పండగ దాకా వచ్చేసారనమాట.
  అదృష్టవంతులు.
  అభినందనలు ఇరువురకీ!
  దీర్ఘ సుమంగళీభవ!
  Wish you both a happy, bright and colorful future!

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు, ఆశీర్వాదానికీ హృదయపూర్వక కృతజ్ఞతలు పండు గారు :)
   ఉంగరాల పండుగకు వచ్చేసాక వెనక్కి తిరిగి చూసుకుంటే "అమ్మో" అనిపిస్తోందండీ! ఎంత కష్టపడి కన్విన్స్ చేశామో. నిజమే.. మేము అదృష్టవంతులమేనండోయ్!

   Delete
 6. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. ఈ టపా మాత్రం బావుంది. అభినందనలు. కాని పాపం భరత్.. నాకో డౌట్ మీ ప్రతాపమంతా ఇక్కడ బ్లాగ్మాటల్లోనే అని.. నిజమేనా.

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహ.. నా బ్లాగ్ కి స్వాగతం జ్యోతి గారూ! మీ అభినందనలకు కృతజ్ఞతలు.
   "పాపం భరత్" అంటూనే పరోక్షంగా "మీ ప్రతాపమంతా ఇక్కడ బ్లాగ్మాటల్లోనే అని నా డౌట్" అంటూ నను ఉసిగొల్పుతున్నారు.. :P పాపమండీ నా భరత్!

   Delete
 7. ప్రియా,భరత్ ముందుగా అభినందనలు:) అయినా ప్రియా ఒకటి మొత్తాల్సింది ఎవరు చూడకుండా..:P

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ డార్లింగ్ :)
   నిజమే అలా చేసుండాల్సిందేమో కాని తరువాత అమృతాంజన్ రాయాల్సింది నేనేగా.. మళ్ళీ ఆ తలనొప్పెందుకులే అని ఆలోచించి ఊరుకున్నా :P

   Delete
 8. Congratulations Priya..:)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ధాత్రి గారు :)
   చాలా రోజులయిపోయింది మిమ్మల్ని చూసి! బావున్నారా?

   Delete
 9. Anonymous15/5/13

  Congrats Priya....Your saree is super!!!!

  ReplyDelete
  Replies
  1. Hahhahaha thank you............. :)

   Delete
 10. శుభం. సమస్త సన్మంగళానిభవంతు. దీర్ఘ సుమంగళీభవ. మీ దాంపత్యం ప్రతిరోజొక పండగలా సాగాలని ఆశిస్తున్నా.

  ReplyDelete
  Replies
  1. ఎంత మంగళకరంగా ఆశీర్వదించారు మురళి గారు!
   హృదయపూర్వక కృతజ్ఞతలు :)

   Delete
 11. మీ ఇరువురికి హృదయపూర్వక అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. అందుకున్నాం పద్మ గారూ మీ అభినందనలు :)
   చాలా కృతజ్ఞతలు!

   Delete
 12. Congratulations Priya garu..
  Have a happy and colorful life :)

  ReplyDelete
  Replies
  1. Hearty thanks, Srinivas gaaru :)

   Delete
 13. Congratulations andi :)
  Happy for you!!
  but we want to see the photos :)

  ReplyDelete
  Replies
  1. Thanks a lot, Pallavi gaaru :)
   Sure.. will try to post some more pics.

   Delete
 14. టపా ఆద్యంతం హాయిగా సాగిపోయింది ప్రియా...

  మొత్తానికి ప్రియమ్మ పెళ్లికూతురైంది. అది సరేగానీ... ఇంత హ్యాపీ మూమెంట్లో మీ అనూ ఎందుకంత బిగుసుకుపోయాడు.

  కారణం ఏమై ఉంటుందబ్బా...

  ఏయ్ పిల్లా... ఓ వైపు తలొంచుకుని సిగ్గుపడుతూనే తనని ఎవరూ చూడకుండా మెల్లిగా గిల్లేసేవా ఏంటి...? :)

  కూసింత నిన్న ఆటపట్టిద్దామని ఇలా అంటున్నాను అంతేనట.. సలేనా... :)

  ఇద్దరూ చిలకా గోరింకల్లా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్షుతో, సుఖ సంతోషాలతో... బుల్లి బుల్లి గిల్లికజ్జాలతో.... బ్రతుకంతా ప్రేమతో.... జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... కాబోయే దంపతులకు ప్రేమపూర్వక శుభాభినందనలు.... :)

  ReplyDelete
  Replies
  1. నిశ్చితార్దం జరిగినంతసేపూ కూడా తను నన్ను చూడనేలేదు అని నేనేడుస్తుంటే.. "నువ్వు గిల్లవేమో అందుకే బిగుసుకుపోయుంటాడు" అని ఆటపట్టించడం ఏమైనా బావుందా అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా :P

   ఆటపట్టిస్తూనే ప్రేమపూర్వకంగా మనసారా దీవించిన మీకు నా హృదయపూర్వ కృతజ్ఞతలు శోభ గారు :)

   Delete
 15. మీ టపా చదివిన తర్వాత మాటలు రావడం లేదండి
  .. మీరు ప్రతిది చాల అందంగ చెపుతారు.. కళ్ళకుకట్టినట్టు .....కళ్ళ ముందె జరుగుతునట్టు..
  మొత్తానికి సాధించారు .. నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు ..మీకు మీ అనుకు ..
  ఈ సంధర్భంగ .. మీరు మీ ప్రేమకథలోని మిగతా బాగాలను త్వరితగతిన టపాల రూపం లొ తెలియచేయవలెనని విన్నవించుకుంటున్నాము..

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ.. మీ కామెంట్ చదివాక చాలా సంతోషమేసిందండీ. మీ అభినందలకు, నా బ్లాగ్ గురించి అన్న మాటలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
   నెక్స్ట్ పార్ట్ కాస్త రాశానండీ.. కాని ఆఫీస్ అండ్ పర్సనల్ పనుల్లో కాస్త బిజీ గా ఉండి కంప్లీట్ చేయలేకపోతున్నాను. కాని వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తానండీ :)

   Delete
 16. అభినందనలు. మీ ప్రేమ కథ పెళ్ళి దాకా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానండి :)

  Wishing both of you sweet and happy life together.

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలకు చాలా కృతజ్ఞతలండీ :)
   నిజం చెప్పాలంటే నేను కూడా ఆ రోజు ఎప్పుడెపుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఆ సమయం చాలా దగ్గరలోనే ఉందిలెండి... :) :)
   Once again, thank you so much for the hearty wishes.

   Delete
 17. Hearty Congratulations to both of you! :-)

  ReplyDelete
  Replies
  1. Thanks a lot, Madhura gaaru :)

   Delete
 18. akka.... all the best...... :)

  ReplyDelete
 19. ప్రియ గారు ముందుగా మీకు, భరత్ కు శుభాభినందనలు...

  అయినా ప్రియ గారు ఇది మరి అన్యాయం. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

  "అతని మొహంలో నేననుకునట్లు కళ్ళు పులకరించిపోతూ లేవు సరికదా కనీసం నావైపు కూడా చూడ్డంలేదూ! నేను మెడలో దండ వేస్తుంటే అక్కడ ఎవరికో సైగ చేస్తున్నాడు.....కాని నిజంగా "యాయ్ ఇలా మళ్ళి ఇంకెప్పుడైనా చేస్తావా? చేస్తావా? నావైపు చూడకుండా ఉంటావా? ఉంటావా? ఉంటావా? అని నెత్తి మీద మొత్తు మొత్తాలనిపించిది" అని రాశారు.

  మీ అమ్మాయిలకు పురుషుల (ఇక్కడ మా పురుషుల అని చదువుకొండి)మంచితనాన్ని అర్థం చేసుకొరండి. ఆ ఎక్సైటెడ్ సిచుయేషన్లో అబ్బాయిలు అమ్మయిలవైపు అలాగే చూస్తూ ఉంటే ఇకా ఇంతే సంగతులు. అలాంటి సిచుయేషన్లో అమ్మాయిల వైపు చుసి అబ్బాయిలు ఎన్ని పొరపాట్లు చేశారో మీకు ఏంతెలుసు...నేను నా ఎంగేజ్మెంట్లో మా రూపను (నా సహచరిని) అలాగే చూస్తూ ఉంగరాని రివర్స్ గా తొడిగాను...మా ఫ్రెండ్స్ అలాగే చూసే కొందరు దండను రివర్స్ వేయడం. మూడు ముళ్ళకు బదులు కొందరు నాలుగు, కొందరు రెండు, మరికొందరు ఐతే ఎక్కువ ముళ్ళు వేస్తే ఎమైన ప్రాబ్లమా అని అడిగారనుకోండి. నేను పెళ్ళిలో తాళి కట్టలేదు కాబట్టి మళ్ళి ఇంకో పొరపాటు చేసే అవకాశం రాలేదనుకోండి!.....ఆ ఎక్సైటెడ్ సిచుయేషన్లో మిమ్మల్ని చూస్తున్న ఆనందంలో ఏదైన పొరపాటు (ఉంగరం రివర్స్ తొడగడం లాంటిది, దండ రివర్స్ వేయడం లాంటివి) జరగకూడదని అలా ఏవరివైపో సైగ చేస్తున్నట్లు ఉండొచ్చు.... మీ మంచి కొసం భరత్ ఒక మంచి పని చేస్తె అంతదానికి ఇంతలేసి మాటలు అంటారా...వెంటనే భరత్ కు సరి చెప్పండి...చెప్పండి....చెప్పండి..

  anyway...very good luck to you both

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహహ్హా... మీరు చెప్పిన సంగతులు భలే సరదాగా ఉన్నాయి డేవిడ్ గారూ. రూప గారితో మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనిపిస్తోంది :)

   అయినా సరే.. నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను. భరత్ నా వైపు చూడకపోవడం ముమ్మాటికీ తప్పు, తప్పు, తప్పంతే :P

   Still, గౌరవనీయులు మీరు చెప్పారు కాబట్టి భరత్ కి సారీ చెప్పేస్తున్నా.. :)

   Thank you very much for the wishes.

   Delete
 20. ఆల్ ద బెస్ట్ , శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ,
  మీ ఈ ప్రణయరాగ జీవితం 3మొట్టికాయలు,6 సిగ్గుదొంతరలతో హాయిగా సాగాలని కోరుకుంటున్నాను :)

  "తాంబూలాలైపోయాయిగా ...పండగ చేస్కో ప్రియా ...ఫుల్ల్ మొత్తేయ్..." (ఇది నా ఒరిజినల్లు )

  ReplyDelete
  Replies
  1. Thanks a lot Priya gaaru :)

   ఆహ్ ఏం పండుగలెండి :-/
   నిశ్చితార్దంలోనే తెలిసిపోయిందిగా :P

   Delete
 21. "గౌరవనీయులు" అమ్మో ఎంత బరువైన పదం...దాన్ని మోయలేకపోతున్నా..:)

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారూ మీరే అలా అంటే మా బోటి వారు ఏమనాలి చెప్పండి? :)

   Delete
 22. తర్వాత పోస్ట్ ఎప్పుడండీ?

  ReplyDelete
  Replies
  1. మరో 2, 3 రోజుల్లో మురళీ గారూ :)
   ఏమీ అనుకోకండీ ఆంధ్రా కి వచ్చాను.. అందుకే ఆలశ్యంగా బదులిస్తున్నా.

   Delete
 23. శుభాకంక్షలండీ.....మీ బ్లాగ్ మొత్తం చదివాను.చదువుతుంటే పక్కింటమ్మాయి,పక్కన కూర్చుని చెప్తున్నట్టుంది.

  ReplyDelete
 24. Welcome to my blog, Mohana gaaru :)

  మీ కామెంట్ కి, శుభాకాంక్షలకూ చాలా థాంక్స్ అండి. ఇప్పుడే మీ బ్లాగులో కొన్ని పోస్ట్స్ చదివాను.. చాలా బావున్నాయి.

  By the way.. sorry for the late reply. ఊరిలో లేకపోవడం వలన మెయిల్స్ చెక్ చేసుకోలేకపోయాను.

  ReplyDelete
  Replies
  1. Thank you sooooo much priya garu:P

   Delete
 25. మీరు ఇరువురూ చల్లగా ఉండాలని, మీకంతా మంచే జరగాలని కోరుకుంటూ... శుభాకాంక్షలతో

  ఉంగరాల పండగ అయ్యింది. మరి తలంబ్రాల పండగ ఎప్పుడు ?

  ప్రవీణ్

  ReplyDelete
  Replies
  1. మీ శుభాకాంక్షలకు హృదయపూర్వక కృతజ్ఞతలండీ!
   తలంబ్రాలు పోసుకునే శుభ సమయం ఎప్పుడో ఈ నెలాఖరులోపు నిశ్చయిస్తారట :)

   Delete
 26. ఇప్పుడే చూసా మీ ఉంగరాల పండగ జరిగిందని .హృదయపూర్వక అబినందనలు.

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం రాధిక గారు :)