Monday, June 17, 2013

నాన్న పరిచయం చేసిన మరో ప్రపంచం!

ఇందాక అనూ గారి బ్లాగ్లో వాళ్ళబ్బాయి పుస్తక పఠనం గురించి చదివాను. మా డాడీ కూడా నా చిన్నప్పుడు చాలా వర్రీ అయ్యేవారు నాకు పుస్తకాల మీద అస్సలు ఆశక్తి లేదని. ఇందాక ఆవిడ పోస్ట్ చదువుతుంటే నాకా విషయాలు గుర్తొచ్చాయి. దానికి సంబంధించినదే ఈ పోస్ట్. 

మా అక్క బాగానే చదివేది. నేను  స్కూల్ బుక్స్ అయితే తప్పదు కనుక విధిగా చదివేదాన్ని కాని, మరే పుస్తకమయినా చదవమంటే మాత్రం చేదు తిన్నట్లుగా మొహం పెట్టేదాన్ని! మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం.. లాటి  పనులు నాన్న నేర్పినపుడు ఎంతో ఆశక్తిగా నేర్చుకుని వాటి మీద మమకారాన్ని పెంచుకుని  శ్రద్ధగా చేసేదాన్ని. కాని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బలవంతం చేసినా  పుస్తకం మీదకు మాత్రం మనసు వెళ్ళేది కాదు. నాకు డాన్స్,  సంగీతం, ఆటలు..  ఎంతసేపూ వీటి మీదే  ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని డాడీ ఆయా క్లాసెస్ లో చేర్పించారు. స్కూల్ అయిపోయాక ఒక రోజు సాయంత్రం భరతనాట్యం, మరో రోజు వెస్టర్న్ డాన్స్, రోజు విడిచి రోజు ఉదయం స్కూల్ కి వెళ్ళే ముందు గంటసేపు సంగీతం క్లాస్. అలాగీ ప్రతి శని వారం డాడీ తో బాట్మింటన్ కోర్ట్ కి వెళ్లి ఆటలయ్యాక అటునుండి అటు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేదాన్ని

"అత్తగారు పక్కనలేని లోటు తీర్చడానికే నువ్వు పుట్టావే" అంటూ అమ్మ విసుక్కున్నా, "నువ్వు నాకే చెల్లిగా ఎందుకు పుట్టావే?" అని అక్క బాధపడినా, "ఏయ్.. మస్కిటో డిస్టర్బ్ చేయకు" అని డాడీ కసురుకున్నా.. మొత్తానికి మంచి పిల్లననే మరుసుకునేవారు! కాని డాడీ కి మాత్రం నేను పుస్తకాలు చదవడానికి ఇష్టపడకపోవడం వలన ఎంతో కోల్పోతున్నానని చాలా దిగులుగా ఉండేది. 

మా డాడీ కు పుస్తకాలంటే మహా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా వీలు కలుగజేసుకుని మరీ పుస్తక ప్రపంచంలో మునిగిపోతారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంచే మంచి మిత్రులని చెప్తుంటారు. నాకు పుస్తకాల మీద ఆశక్తి కలిగించడానికి నానా పాట్లు పడేవారు. అందులో భాగంగానే, ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినపుడు నాకు ఇష్టమైన బొమ్మలు మారు మాట్లాడకుండా  కొనిపెట్టేవారు. ఇంటికి వెళ్ళేడపుడు ధగ ధగ మెరిసిపోతున్న మొహంతో "థాంక్స్ డాడీ" అని చెప్పేదాన్ని. దానికి ఆయన డ్రైవింగ్ సీట్ లో నుండి కాస్త పక్కకు వంగి బుగ్గ చూయించేవారు.. నేను ముద్దు పెట్టేదాన్ని (ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంతే అనుకోండీ). వెంటనే ఆయన "చూడు. డాడీ నీకు ఇష్టమైంది చేసారు కదా.. ఇప్పుడు నువ్వు డాడీ కి ఇష్టమైంది చెయ్యాలి. సరేనా?" అనేవారు. నాకు వెంటనే సీన్ అర్ధమై మొహంలోధగ ధగలన్నీ వెలవెలబోయేవి :P. విషయమేంటంటే.. వారంలోపు ఏదో ఒక బుక్ చదివి నాన్నకు ఆ కథ చెప్పాలి. అదన్నమాట సంగతి. వెంటనే మొహం ముప్పై మూడు వంకరలు తిప్పేసి ఎన్నికల ముందు రాజకీయ నాయకులు చేసినట్లు "ఓహ్ ష్యూర్.. వై నాట్? రేపు మీకు రెండు కథలు వినిపిస్తాను " అంటూ లక్షణంగా ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేసేదాన్ని. నేను మాట మీద నిలబడే మనిషినండోయ్.. మరుసటి రోజు నిజంగానే కథలు చెప్పేదాన్ని.  హోం వర్క్ ఎక్కువ ఉందనీ, భరతనాట్యం టీచర్ కష్టమైన స్టెప్ నేర్పి రేపు చూస్తానన్నారనీ.. పోనీ నిద్రపోయే ముందు కొన్ని పేజీలయినా చదివి వినిపిద్దాం అంటే బాగా నిద్రొస్తోందనీ.. రేపు తప్పక చెబుతాననీ.. మా నాన్నకు విసుగొచ్చి అడగడం ఆపేవరకు రోజుకో కథ చెప్పేదాన్ని :P  

సడన్గా ఓ సండే మా డాడీ ఓ రోజు నాకో బంపరాఫర్ ఇచ్చారు ఒక షరతుతో. "షాపింగ్ కి వెళదాం పద. ప్రైస్ ఎంతైనా ఒకే. కాని రెండిటిని మించి కొనకూడదు" అని. తెలియనిదేముంది.. మనకు షాపింగ్ అంటే పిచ్చి కదా.. క్షణం ఆలశ్యం చేయకుండా ఎగురుకుంటూ వెంట వెళ్ళాను. తీరా చూస్తే నన్ను తీసుకెళ్ళింది "Landmark" కి! It's a complete book store :(. ఆయనకు ఏమైనా కావాలేమో.. ఇది అయిపోయాక తీసుకేళతారు అనుకుని కొంతలో కొంత సర్దుకున్నాను. ఈలోపు డాడీ "ఏంటి అలా నిలబడ్డావ్? Come on... go ahead" అన్నారు. ఫ్యూజ్ పోయింది నాకు. తెల్ల మొహం వేసుకుని అటు ఇటు తిరిగాను. అసలు ఆ పుస్తకాలు చూస్తేనే భయం వేసింది. "ఊ.. ఊ..  ఊ ఊ అసలే అమ్మ కూడా రాలేదు :(" ఎంచక్కా అమ్మయితే "చంటిదాన్ని ఎందుకు అలా పుస్తకాలు పుస్తకాలు అని భయపెడతావ్? రోజంతా స్కూల్లో చదివీ, నువ్వు చేర్పించిన క్లాసులన్నీ ముంగించుకుని  ఏదో కాసేపు కుదురుగా కుర్చుందామనుకుంటే పుస్తకాలని మళ్ళీ దాన్ని బెదరేస్తున్నావ్. అదెంతా దాని వయసెంత? పుస్తకాలకు జడిసి అది తిండి కూడా సరిగా తినడంలేదు" అని గుక్క తిప్పుకోకుండా వాదించేసి డాడీకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నన్ను తీసుకుని అక్కడి నుండి నిష్క్రమిస్తుంది. అమ్మ గుర్తు రాగానే "పోనీలే ఇంట్లో అమ్మ ఉంటుందిగా.. తప్పించుకోవచ్చు" అని ధైర్యంగా కంటికి నచ్చిన బుక్ ఏదో కొన్నాను. కాని నా ప్లాన్ వర్క్అవుట్ అవ్వలేదు. "మరి డబ్బు పెట్టి కొన్నదెందుకూ? అదేగా కొనుక్కుంది.. అంతవరకైనా చదివి తీరాల్సిందే" అని పట్టుబట్టారుఅది చదివి ముగించే వరకూ.. గారం గీరం జాంతానై. మొహం మీద సీరియస్ మాస్క్ వేసుకుని తిరిగారు నాతో. చచ్చినట్టు నెల రోజుల్లో కష్టపడి కంప్లీట్ చేసాను.  ఈ కింద ఫోటోలో కనిపించే పుస్తకమే అది.     ఆ తరువాత రాత్రి నిద్రపోయే ముందు.. నాన్నో, అక్కో లేక అమ్మో చదివి వినిపించే గుడ్ నైట్ స్టోరిలు తప్ప మళ్ళీ పుస్తకాల జోలికి వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి నుండీ నన్ను బాధపెట్టినవైనా, సంతోషపెట్టిన సందర్భాలయినా రాసుకోవడం అలవాటు. అలాగే ఓ రోజు నేను రాసుకుంటుండగా డాడీ వచ్చి "ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నది చదువుకోవడం నీకిష్టమేనా?" అని అడిగారు. "ఓ.. బావుంటాయిగా" అని బదులిచ్చాను. "ఎందుకు బావుంటాయి?" అనడిగారు. "ఎందుకంటే అవి.. అవి.. అవి నాకు ఇష్టమైన జ్ఞాపకాలు" అని చెప్పాను. దానికి ఆయన "నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలా రాసుకుంటూ ఉండుండొచ్చు కదా? అవి నీకు దొరికితే చదవడం ఇష్టమేనా?" అని అడిగారు మళ్ళీ. "యాహ్. ఇంట్రెస్టింగ్ గా  ఉంటాయి కదా" అన్నాను. డాడీ వెంటనే "ఎక్షాక్ట్లి! నీ ఫ్రెండ్ డైరీ, అది తన పర్సనల్. You can't read it. కాని కొంతమంది ఏం చేస్తున్నారంటే తాము రాసుకున్న వాటిని నలుగురూ చదివేందుకు అనుమతించి మార్కెట్ లో పెడుతున్నారు. డబ్బులు పెట్టి మరీ కొంటున్నారంటే.. వాటికి వేల్యూ ఉండి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే కదా అర్ధం? నువ్వు రాసేది ఆల్రెడీ నువ్వు ఎక్ష్పీరియన్స్ చేసిన విషయాలు. అవి మళ్ళీ చదివితేనే నీకు ఆనందంగా అనిపించినపుడు.. ఎదుటి వ్యక్తి ఎక్ష్పీరియన్స్ ని అతని రాతల్లో చదువుతూ నీకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏదో తెలుసుకున్నామని ఆనందంగా కూడా ఉంటుంది కదా..??" అన్నారు. ఏ మూడ్ లో ఉన్నానో కానీ అలా సూటిగా మనసుని తాకాయి ఆ మాటలు. 

పుస్తకాల మీద ఉన్న బెరుకు పోయి, వాటికి మెదడులో నేను రాసిపెట్టుకున్న డెఫినిషన్ మారిపోయింది! నిదానంగా చదవడం మొదలుపెట్టాను. నాకు చదవాలనిపించే బుక్స్ సెలెక్ట్ చేసుకోవడంలో డాడీ సహాయపడేవారు. ఇదిలా సాగుతుండగా నా 15th బర్త్ డే కి వినోదా (నా హాస్పిటల్ తిప్పల్లో చెప్పాగా..) ఈ కింద ఫోటోలో ఉన్న బుక్ ప్రెసెంట్ చేసింది. 

Google image

I really liked it. ఆ తరువాత నేను దాచుకున్న డబ్బులతో ఒక్క దాన్నే వెళ్లి ఈ బుక్ కొనుక్కున్నాను.

Google image

ఇది చదివిన తరువాత, I completely fell in love with books. కొన్ని రోజులకు పుస్తకాల పట్ల నాకు ఎంత మమకారం పెరిగిపోయిందంటే.. కొత్త బట్టలు సహితం బయటకు తీసేసి నా బీరువా నిండుగా పుస్తకాలు పేర్చుకునేంతగా! ఎక్కడకు వెళ్ళినా ఏదో ఒక బుక్ హ్యాండ్ బాగ్ లో పెట్టుకెళ్లడం, స్నేహితులు "ఒక్క సారి ఈ బుక్ ఇవ్వవా.. చదివి ఇచ్చేస్తాను" అంటే ఏదో నా ప్రాణాన్ని అడిగినట్లు బెదిరిపోవడం.. ఎవరైనా పుస్తకాలను రఫ్ గా హేండిల్ చేస్తే అడ్డమైన తిట్లు తిట్టుకోవడం లాటివి యధామామూలయిపోయాయి. ఇప్పుడు పుస్తకాలు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే చిరాగ్గా (భయంగా) ఉంది. 

ఇంత చక్కటి ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినందుకు పుష్తకం పట్టుకున్న ప్రతిసారీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను మనసులో.  

అలా మా అక్క పుణ్యమా అని పెయింటింగ్, నాన్న పుణ్యమా అని పుస్తకాలు తెలుసుకోగలిగాను. ఇవి చూసి మా అమ్మ ఎప్పటికైనా నాకు పాలు అలవాటు చేయాలని ఇప్పటికీ నా చుట్టూ తిరుగుతూనే ఉంది.. నేనూ మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. త్వరగా ఈ గోల కూడా వదిలిపోతే బావుండు!

Thursday, June 13, 2013

నా హాస్పిటల్ తిప్పలు!!

మొన్న (9/6/13) నా టైం బాగా బాడ్ అయిపోయి ఆ రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి ఉదయం నిద్ర లేచినప్పటినుండే నీరసంగా, వికారంగా అనిపిస్తూ ఉంది. అమ్మావాళ్ళు కూడా ఊరిలో లేరేమో.. బాగానే  ఇబ్బంది పడ్డాను. ఎలాగో కాస్త ఓపిక తెచ్చుకొని ఇల్లు ఊడ్చి, ఫ్రెషప్ అయి, ముందు రోజు ఉతికిన బట్టలు మడత పెట్టాను. తరువాత వంట చేద్దామని కిచెన్ రూంలోకి వెళ్లాను గాని తల తిరిగినట్లయి నిలబడలేక అక్కడ కనిపించిన బిస్కెట్ పాకెట్ తీసుకొని మంచం మీద వాలిపోయాను. కాళ్ళు చేతులు బాగా లాగేస్తూ విపరీతమయిన తల నొప్పి. ఏమైనా తింటే బెటర్ అవుతుందేమో అని బిస్కెట్స్ తిని నీళ్ళు తాగాను. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. కాసేపటికి వాంతులు మొదలయ్యాయి. నీళ్ళు తాగినా సహించలేదు. అలాగే పడుకొని ఉండిపోయాను. అక్క కి ఫోన్ చేద్దామని అనుకున్నాను గాని,  ఎందుకులే కంగారుపడుతుంది.. నిదానంగా నేనే పక్కనున్న హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుంది అని ఊరుకున్నాను. మధ్యాహ్నం రెండున్నరా మూడయ్యే సరికి కాస్త బెటర్గా ఫీల్ అవడం మొదలుపెట్టాను. ఓపిక వచ్చిందిగా కాస్త రసం చేసుకుని తిని వెళాదం కదా అని మళ్లీ వంట గదిలోకి వెళ్లాను. 2, 3 నిముషాలు బాగానే ఉన్నాను... తరువాత బాగా కళ్ళు తిరిగిపోయాయి. కష్టపడి రసమూ, అన్నం స్టవ్ మీద పెట్టి పక్కకి రాబోయెంతలో నేల మీద ఒరిగిపోయాను. పది నిముషాలకు గానీ లేవలేకపోయా! అలాగే మొండిగా లేచి అన్నం పెట్టుకుని గబగబా తిన్నాను (త్వరగా ఓపిక వచ్చేయాలని ఆత్రం మరి!). పావుగంటలోనే వాంతయిపోయింది! కాసేపటికి నీరసమయితే తగ్గింది కాని నిద్ర మాత్రం రాలేదు. ఎలాగు కాస్త ఓపిక వచ్చేసిందిగా రేపటికి పూర్తిగా నార్మల్ అయిపోతానులే.. ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి ఎందుకని, పడుకుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ "నా నేస్తం" కి వచ్చిన కామెంట్స్ కి రిప్లైలు ఇచ్చాను.  

ఈ లోపు నాకు అత్యంత ఆప్తురాలైన "వినోద" ఫోన్ చేసింది (ఆవిడ మా నాన్నగారి  ఫ్రెండు.. మా అమ్మ కంటే రెండేళ్ళు పెద్దది. నాకు పదిహేనేళ్ళ వయసప్పటి నుండి పరిచయం ఆవిడతో. గత నాలుగేళ్లలోనే నాకు మిక్కిలి ఆప్తురాలయింది. అమ్మ ఎంతో.. ఆవిడ అంత.  తెలిసిన వాళ్ళందరూ "అక్కా, వినోద" అని పిలుస్తుంటే నాకూ అదే అలవాటయింది :P. మాట్లాడేడపుడు బహువచనమే ఉపయోగిస్తాను కాని మనసులో, లేక ఎవరితోనైనా చెప్పేడపుడు మాత్రం ఏకవచనమే). ఫోన్ లో నా గొంతు విని కంగారు పడిపోయింది. ఏం లేదు.. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పినా వినకుండా ఇంటికి వచ్చింది. "అయ్యో.. ఇంత నీరసపడిపోయావేంటి?!! పద హాస్పిటల్ కి వెళదాం" అని బలవంతపెట్టింది.   అప్పటి వరకు పడుకుని ఉన్న నేను లేచి నిలబడ్డాను గాని మరుక్షణమే తూలిపోయాను! "అయ్యో.. జ్వరంగా కూడా ఉందే! బ్రెయిన్ పనిచేస్తోందా లేదా నీకు? బాలేనపుడు కనీసం చెప్పవా? అందులోను ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు.. నిలబడ్డానికే ఓపిక లేక తూలిపోతున్నావ్? కళ్ళు చూడు ఎలా మూతలు పడిపోతున్నాయో! అయినా హాస్పిటల్ కి వెళదాం అంటే బావున్నానని పళ్ళికిలిస్తున్నావేంటీ" అని నానా విధాలుగా క్లాసు పీకుతూ, తిడుతూ జబ్బ పట్టుకుని లాక్కెళ్ళి కార్లో కూర్చోబెట్టింది. పడుకుని ఉన్నంతసేపూ తెలియలేదు గానీ కూర్చున్నపుడు తెలిసింది నా పరిస్థితి ఎలా ఉందో! ఆవిడ ఏదో మాట్లాడు తోంది.. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. బీపీ, హార్ట్ బీట్ నార్మల్గానే ఉన్నాయిట ఉడుండి పల్స్ రేట్ మాత్రం కొంచెం తగ్గుతోందిట! "వెంటనే డ్రిప్స్ ఎక్కించాలి. చాలా వీక్ గా ఉంది అమ్మాయి. ఈ రాత్రికి అడ్మిట్ చెయ్యాల్సి వస్తుంది" అన్నారు డాక్టర్. వినోద అయితే చాలా టెన్షన్ పడిపోయింది. నేను తన చెయ్యి పట్టుకుని "ఇలా చూడండీ.. ఒక్కదాన్నే ఏం తింటానులే అని అశ్రద్ధ చేసి నిన్నంతా ఏమీ తినలేదు. ఈ వేళేమో వాంతులు. జ్వరంగా ఉందిగా అందుకే నీరసంగా ఉంది. కాసేపటికి మాములయిపోతాను. కంగారు పడకండీ" అని నవ్వాను (బలవంతంగా ప్రయత్నించాను). తను ఒక్క క్షణం నా వైపు తీవ్రంగా చూసి "O just shut up" అని కసురుతుండగా..  నర్స్, మూడు ఇంజక్షన్లు, ప్లాస్టర్, దూది వగైరాలతో ప్రత్యక్షమైపోయింది.  

నాకు నా బాధ కంటే ఇప్పుడు ఇంజక్షన్ పొడుస్తుంది అన్న బాధ ఎక్కువైపోయి, "సిస్టర్.. ప్లీజ్ మెల్లగా చేయండీ. ప్లీజ్... " అని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టేసాను. దానికి ఆవిడ "సరే సరే" అని నరం వెతుక్కుంది. దొరికి చస్తేగా..? ఒక చేత్తో నా చేతిని టైట్గా పట్టుకుని మరో చేత్తో టపా టపా కొడుతూ మరీ చూసింది. అయినా దొరకలేదట! "రెండు చేతుల్లోనూ పచ్చగా చక్కగా కొట్టొచ్చినట్లు కనబడుతుంటే,  నరాలు దొరకట్లేదని చావబాదుతుందేంటి? ఎవరి మీదో కోపం నా మీద తీర్చుకుంటోందా ఏంటి పాడు?" అని నా మనసు బోరుమంది. ఆ మాటే పైకి అందామనుకున్నాను కాని "అసలే తన చేతిలో ఇంజక్షన్ ఉంది. కోపం వచ్చి కసిగా పోడిచిందంటే చచ్చూరుకుంటాను.. ఎందుకులే లేనిపోయిన గొడవ? అసలే ఓపికలేదు" అని చేతుల్ని ఆవిడకు అప్పగించి తల అటు తిప్పుకొని దేవుణ్ణి తలుచుకున్నాను. కొంతసేపటికి ఒక చోట దూదితో తుడిచింది. "నరం దొరికేసిందనుకుంట.. ఇప్పుడు పొడుస్తుంది" అని ఘాట్టిగా కళ్ళు మూసుకుని "దేవుడా దేవుడా" అనుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ఈలోపు ఆవిడ ఆ ప్లేస్ వదిలేసి మరో చోట రుద్ది నేను కళ్ళు తెరిచి మూసేలోపు టక్కున పొడిచేసింది! భలే నొప్పి పుట్టిందిలెండి. పోనిలే ఈ సూదులగోల అయిపొయిందని ఊపిరి పీల్చుకుంటుండగానే, ఇంత పెద్ద సిరంజి తీసుకొచ్చి "బ్లడ్ టెస్ట్ చేయాలి చెయ్యి చూయించండి మేడం" అంది! ఏడుపొచ్చేసింది నాకు. మాట్లాడే ఓపిక లేదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది.. అందుకే ఇక అడ్డు కూడా చెప్పలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాను. ఆవిడే  నా చెయ్యందుకుని మళ్ళీ కాసేపు వెదికి ఒక చోట పొడిచింది. కాని బ్లడ్ రాలేదట. గుచ్చిన సూదినే కాస్త అటు ఇటూ తిప్పింది. అరిచే ఓపిక కూడా లేదు నాకు. కళ్ళ నుండి నీళ్ళు మాత్రం జారాయి. "రాంగ్ ప్లేస్.. మరో చోట ట్రై చేస్తాను" అంటూ ఇంకొక చోట గుచ్చింది. ఈ సారి బ్లడ్ వచ్చిందిలెండి.. అదృష్టం. 4ml బ్లడ్ తీసుకుపోయింది దొంగ మొహంది. నిజంగా బ్లడ్ టెస్ట్ కి 4ml అవసరమా అండి??  

కాసేపటికి మళ్ళీ డాక్టర్ వచ్చి చూసాక నన్ను ఎమర్జెన్సీ వార్డ్ నుండి నార్మల్ రూం కి షిఫ్ట్ చేశారు. వెళ్ళాక సిస్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మింగి, ఇంజెక్ట్ చేసిన డ్రిప్స్ ఎక్కించుకుంటూ పడుకున్నాను. కాసేపటికి వినోదా ను లోపలికి రావడానికి అనుమతించారు. తను వచ్చాక "అమ్మావాళ్లకు చెప్తే కంగారు పడతారు వద్దు అంటావు గాని మరి కనీసం మీ అక్కకు, భరత్కైనా చెప్పనా? ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం మంచిది కాదు" అంది. "ఎందుకు.. కంగారు పడతారు. ఇక అక్కైతే చంటి పిల్లాడిని పెట్టుకుని ఇప్పుడు హాస్పిటల్ కి వస్తాను అంటుంది. ఉదయానికి అంతా సర్దుకుంటుంది.. అప్పుడు నిదానంగా ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. సిస్టర్స్ ఉన్నారుగా మరేం పరవాలేదు" అన్నాను. "Why don't you understand? అయినా పోయి పోయి నిన్ను అడుగుతున్నాను చూడు" అంటూ భరత్ కి, అక్క కి కాల్ చేసి చెప్పేసింది. నేను ఫోన్ తీసుకుని, "బాగానే ఉన్నాను కంగారు పడనవసరం లేదు. అమ్మకు, డాడీ కి ఇప్పుడు చెప్పొద్దు. రేపు నేనే ఫోన్ చేస్తానులే" అని చెప్పి, మరో ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, తను వచ్చి రాత్రంతా నాతో హాస్పిటల్ లో ఉంది. ఎందుకంటే వినోదా ఆ బెడ్ మీద అడ్జస్ట్ అవ్వలేదని నాకు తెలుసు.  

మరుసటి రోజు ఉదయానికి నేను అనుకున్నట్లుగానే ఆల్మోస్ట్ మాములయిపోయాను. పొద్దుపొద్దున్నే అభీ గాడిని తీసుకుని అక్క, బావా వచ్చారు. అక్క చేత అక్షింతలు వేయించుకుంటుంటే, అప్పుడే వచ్చిన వినోద కూడా నాలుగు అందుకుంది. నీరసంగా ఉన్నానని వదిలేసారు గాని లేకపోతే చెరో చెంపా వాయించివుండేవారే! ఇక నన్ను ఆ రోజు మాధ్యహ్నానికే డిశ్చార్జ్ చేసేసారు. 

ఈ ఫోటో డిశ్చార్జ్ చేసే ముందు తీసిందే.. ఇలాటి ఫోటో అరుదు కదా అందుకే తీసి దాచుకున్నా :P.  ఇంతకీ డాక్టర్ తేల్చిందేటంటే, హిమోగ్లోబిన్, ఐరన్.... .... తక్కువగా ఉన్నాయి.. బెసికల్లీ వీక్ గా ఉంది.. పాలు, ఆకు కూరలు, పళ్ళు అంటూ బాగా తినాలి.. అలాగే ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని. మా అక్కా, వినోదా ఇద్దరూ నా మీద వార్ కి దిగారు. ఇంటికి వచ్చాక మా అక్కయితే "మాయ రోగమా తినడానికి? తినమంటే కొండలు, గుట్టలు మోస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెడతావ్. సూదులు పొడిపించుకుంటుంటే బావుందా? ఇకనైనా నీకు బుద్దోస్తే బావుండు" అంటూ లెఫ్ట్, రైట్, సెంటర్ వాయించేసింది. అంతా విన్నాక నిదానంగా అన్నాను "నేను బాగానే తింటున్నానుగా అక్కా.. పాలు, పెరుగే నచ్చవు. నేనేం చేయను" అన్నాను. "పాలు, పెరుగు మాత్రామా నచ్చవు? ఒక చపాతి తినవు, నెయ్యి తినవు, ... .. ... ... ... ... ... ......... నీ వెనుకే తిరుగుతూ బలవంతంగా తినిపించడానికి ఇంకా నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇదిగో.. ఆరోగ్యం పోయాక ఇక ఏమున్నా వేస్ట్ తెలుసుకో. అయినా బుద్ధున్నదెవతయినా స్పృహ తప్పుతోంది అని తెలిసినా కొంపలో కిక్కురుమనకుండా కూర్చుంటుందా? ఒక్క కాల్ చేయొచ్చుగా? ఏమైనా అయితే? ఛీ ఛీ.. ఏమో బాబు నీ ఇష్టం" అని, ముక్కుపుటలు అదురుతుండగా మొహం అటువైపు తిప్పేసుకుంది. అభీ గాడు నన్ను, వాళ్ళమ్మను మార్చి మార్చి చూస్తూ అప్పుడప్పుడు నవ్వుతున్నాడు. నేను సారీ చెప్పి మరింకేప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేసాను. భరత్ వేయాల్సిన అక్షింతలు కాస్త అటూ ఇటుగా మిగిలిపోయాయి. అంటే.. తను ట్రైనింగ్ కోసం బెంగుళూరు వెళ్ళాడు. సో ఫోన్లో కనుక పెద్దగా పడలేదు. అదన్నమాట సంగతి! 

Saturday, June 8, 2013

నా నేస్తం!

పగలంతా ఎర్రటి ఎండ! ఆంధ్రాలో ఎంచక్కా వర్షాలు పడుతుంటే ఇక్కడ ఇదేం ఖర్మరా బాబు అని చెన్నై మీద చిరాకు పడుతూ, అసలే ఊరెళ్ళోచ్చి అలసిపోయి ఉన్నానేమో.. సాధారణంగా పగలు నిద్రపోని నేను వంట పని, ఇంటి  పనీ ముగించేసి ఏదో తిన్నాననిపించి మంచం మీద వాలిపోయాను. ఇదిగో.. ఇందాకే  లేవడం!  సాయంత్రం అయిందిగా వాతావరణమయితే    హాయిగా అమ్మ ఒడిలా ఉంది కాని, ఇంట్లో ఎవ్వరూ లేని కారణం చేత దిగాలుగా చాలా లోన్లీగా అనిపించింది. బీచ్ నుండి వచ్చే చల్లని గాలి నన్ను వరండాలో కూర్చోబెడితే,  మా ఇంటి పందిరి మల్లెలు, సన్నజాజులూ మనసుకి ఆహ్లాదాన్ని పంచిపెట్టాయి.   కాసేపటికి "చీకటి పడిపోయింది! అమ్మో.. లైట్ అయినా వేసాను కాదూ" అనుకుంటుంటే.. "భయమెందుకులేవే మేమున్నా"మంటూ చందమామా, అతని చుట్టూ ముత్యాల్లా మెరిసే నక్షత్ర సైన్యం ధైర్యం చెప్పాయి. కన్నార్పకుండా నేను వాటినే చూస్తుంటే, దిష్టి తగులుతుందనో ఏమో?! ఆ అందమైన అద్భుతాల్ని తన వెనుక దాచేయాలని వేగంగా కదులుతున్నాయి మేఘాలు!! వావ్.. ఎంత అందమైన సృష్టి!!! వర్ణిద్దామంటే మాటలు రావడంలేదు.. చూద్దామంటే కనులు చాలడంలేదు! ప్రకృతిని మించిన నేస్తం/బంధువు వేరొకరుంటారా అండీ ఈ లోకంలో?!! నా దిగులూ బాధా అంతా గాలి ఎత్తుకెళ్ళిపోయి తన ప్రశాంతతను నాకు పంచింది. ఈ అందమైన అనుభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ.. ఇంత మంచి సృష్టిని కలుగజేసిన దేవునికి థాంక్స్ చెప్పుకుంటున్నాను :) 

ఈ సందర్భంగా నాకు నచ్చి, గూగుల్ నుండి సేవ్ చేసుకున్న కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి.. ఈ ఫోటో మాత్రం మా ఫ్యామిలీ & ఫ్రెండ్స్ అందరూ కలిసి "నాగాలా" కి ట్రెక్కింగ్ వెళ్ళినపుడు ఒక ఫ్రెండ్ తీశారు. 

మీకేమనిపిస్తోంది మంచులో తడిసిన ఈ మొగ్గని చూస్తే??

చూసే కళ్ళని బట్టి అందం అంటారు.. నిజమే! వాడిపోయినా, రేకలు ఊడినా ఇది చూడండి ఎంత బావుందో! ఆ ముచుక చూసారా ఆరెంజిష్ రెడ్ + ఎల్లో ఎవరో పెయింట్ అద్దిన్నట్లు ఆ రంగులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా.... !

ఇటువంటి  దారిలో రోజులతరబడి నడిచినా అలుపన్నది రాదేమో?!