Saturday, June 8, 2013

నా నేస్తం!

పగలంతా ఎర్రటి ఎండ! ఆంధ్రాలో ఎంచక్కా వర్షాలు పడుతుంటే ఇక్కడ ఇదేం ఖర్మరా బాబు అని చెన్నై మీద చిరాకు పడుతూ, అసలే ఊరెళ్ళోచ్చి అలసిపోయి ఉన్నానేమో.. సాధారణంగా పగలు నిద్రపోని నేను వంట పని, ఇంటి  పనీ ముగించేసి ఏదో తిన్నాననిపించి మంచం మీద వాలిపోయాను. ఇదిగో.. ఇందాకే  లేవడం!  సాయంత్రం అయిందిగా వాతావరణమయితే    హాయిగా అమ్మ ఒడిలా ఉంది కాని, ఇంట్లో ఎవ్వరూ లేని కారణం చేత దిగాలుగా చాలా లోన్లీగా అనిపించింది. బీచ్ నుండి వచ్చే చల్లని గాలి నన్ను వరండాలో కూర్చోబెడితే,  మా ఇంటి పందిరి మల్లెలు, సన్నజాజులూ మనసుకి ఆహ్లాదాన్ని పంచిపెట్టాయి.   కాసేపటికి "చీకటి పడిపోయింది! అమ్మో.. లైట్ అయినా వేసాను కాదూ" అనుకుంటుంటే.. "భయమెందుకులేవే మేమున్నా"మంటూ చందమామా, అతని చుట్టూ ముత్యాల్లా మెరిసే నక్షత్ర సైన్యం ధైర్యం చెప్పాయి. కన్నార్పకుండా నేను వాటినే చూస్తుంటే, దిష్టి తగులుతుందనో ఏమో?! ఆ అందమైన అద్భుతాల్ని తన వెనుక దాచేయాలని వేగంగా కదులుతున్నాయి మేఘాలు!! వావ్.. ఎంత అందమైన సృష్టి!!! వర్ణిద్దామంటే మాటలు రావడంలేదు.. చూద్దామంటే కనులు చాలడంలేదు! ప్రకృతిని మించిన నేస్తం/బంధువు వేరొకరుంటారా అండీ ఈ లోకంలో?!! నా దిగులూ బాధా అంతా గాలి ఎత్తుకెళ్ళిపోయి తన ప్రశాంతతను నాకు పంచింది. ఈ అందమైన అనుభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ.. ఇంత మంచి సృష్టిని కలుగజేసిన దేవునికి థాంక్స్ చెప్పుకుంటున్నాను :) 

ఈ సందర్భంగా నాకు నచ్చి, గూగుల్ నుండి సేవ్ చేసుకున్న కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి.. ఈ ఫోటో మాత్రం మా ఫ్యామిలీ & ఫ్రెండ్స్ అందరూ కలిసి "నాగాలా" కి ట్రెక్కింగ్ వెళ్ళినపుడు ఒక ఫ్రెండ్ తీశారు. 

మీకేమనిపిస్తోంది మంచులో తడిసిన ఈ మొగ్గని చూస్తే??

చూసే కళ్ళని బట్టి అందం అంటారు.. నిజమే! వాడిపోయినా, రేకలు ఊడినా ఇది చూడండి ఎంత బావుందో! ఆ ముచుక చూసారా ఆరెంజిష్ రెడ్ + ఎల్లో ఎవరో పెయింట్ అద్దిన్నట్లు ఆ రంగులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా.... !

ఇటువంటి  దారిలో రోజులతరబడి నడిచినా అలుపన్నది రాదేమో?!

24 comments:

చిన్ని ఆశ said...

చల్లని సాయంత్రం, చక్కని ప్రకృతి, మదిలో ఎంత బాధున్నా పోగొట్టకపోదా?
ప్రతాపం చాలించి సముద్రంలోకి సోలిపోతున్న సూర్యుడూ, నాగాలా అందాలూ, తడిసిన మొగ్గ స్వచ్ఛతా, వాడినా రంగుల సోయగాన్ని విరబూయిస్తున్న పువ్వు తొడిమా, రాలిన పువ్వుల బాటా...ఇన్ని అందాలు గుర్తుచేసుకుంటూ ఈ సాయంత్రాన్ని మీ సొంతం చేసుకున్నారు. ఇంకేం, ఎప్పుడు గుర్తుచేసుకున్నా పులకరించి పోటానికిది చాలదూ!

Padmarpita said...

ఎంత అహ్లాదంగా ఉన్నాయో పిక్స్

Priya said...

నిజమే పండు గారు.. నిన్నటి సాయంత్రమే కాదు, ప్రకృతిని తలచిన ప్రతి క్షణమూ నాదే.. :)
అన్నట్టు.. మీరు కామెంట్స్ ని కూడా కవితల్లా భలే అలవోకగా రాసేస్తారండీ!

Priya said...

కదు పద్మ గారూ!
Thanks for the comment :)

Anonymous said...

ఆనందో బ్రహ్మ!

హృదయం said...

ప్రియ గారు,మీ బ్లాగు ఇదే చూడటం.. చాలా బాగుంది.

Priya said...

సుస్వాగతం తాతగారు.. :)
మీరు నా బ్లాగ్ ని దర్శించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ వాఖ్యకు చాలా కృతజ్ఞతలు :)

Priya said...

Welcome to my blog andi!
మీ కామెంట్ కి చాలా థాంక్స్ :)

Anonymous said...

మీ బ్లాగుని ఇవాళే చూసాను. ఇంత చక్కగా ప్రకృతిని వర్ణించింది ఎవరా అని చదివీ చూసీ ఆనందించాను.కి ఉన్న ఎక్కువగా చదువుతున్న వాటిలో కొన్ని ని పై నుంచి కింద దాకా చూసాను. ఇక తప్పదమ్మాయ్. అన్నీ చదివేయాలిసిందే.

srinivasarao vundavalli said...

బావున్నాయి ప్రియ గారు ఫోటోస్ :)

డేవిడ్ said...

అందమైన ప్రకృతి గురించి అంతే అందమైన వర్ణణ...

పద్మ లత గద్దే said...

మీ బ్లాగ్ లోనికి నేను క్రొత్తగా అడుగుపెట్టానండి ప్రియగారూ!మీ పోస్టులు చూసాను. చాలా బాగా ఉన్నాయి.ప్రకృతి తోడుంటే నిజంగా ఒంటరితనమే తెలియదండీ.శుభాకాంక్షలండీ! మీరూ భరత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి.

Priya said...

ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం, అనూ గారు!

మీ పేరంటే నాకెంత ఇష్టమో!! ఎందుకో నా పోస్ట్స్ చదువుతానన్నారుగా.. సో మీకే తెలిసిపోతుందిలెండి :)

ఈ పేరుతో నాకు పరిచయమైన రెండావ (కాదు మొదటి) వ్యక్తి మీరు! శ్రమ అనుకోకుండా కామెంట్ చేసి నాకు పరిచయమైనందుకు, నా రాతలు న(మె)చ్చినందుకూ మీకు కృతజ్ఞతలు :)

Priya said...

వాటిని చూసి మీరూ ఆనందించి మెచ్చినందుకు చాలా థాంక్స్ శ్రీనివాస్ గారూ :)

Priya said...

నా బ్లాగింటికి స్వాగతం, పద్మ గారు!
అలాగే మీరు నా బ్లాగ్ గురించి చేసిన వాఖ్యకూ, మీ దీవెనకూ హృదయపూర్వక కృతజ్ఞతలు :)

Priya said...

మీ అందమైన వాఖ్యకు మనఃపూర్వక కృతజ్ఞతలు డేవిడ్ గారు :)

Anonymous said...

No more words. I really enjoyed reading ur blog.

Priya said...

Thank you soooo much :)

Pratap Reddy Devagri said...

సోదరి ప్రియ .... మొదటి సారి ని బ్లాగు చుడడం...చాలా బాగుంది...నీ రచనలు చాలా బాగునై...ఈ ఫొటోల అలవాటు నాకే అనుకున్న ....నీకు వుంది....( well oka phichodiki enko pichodini chuste kalige aanandam anta inta kaadu )...నీ పొస్ట్ లన్ని చదివాను .... ఉంగరాల సంగతి చెప్పావు కాని బ్యాండు సంగతి చెప్పలేదు..

Priya said...

నా బ్లాగ్ కి స్వాగతం అన్నయా!
హహ్హహహ్హ... మీరు చెబుతుంటే నాకూ ఆనందంగానే ఉంది నాలాటి పిచ్చి మీకూ ఉందని. నా రాతలను అభినందించినందుకు చాలా థాంక్స్. బ్యాండు సంగతి అంటే.. పెళ్లి గురించేనా? ఈ నెలాఖరుకి చెబుతాను :)

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ చక్కగా వర్ణించారు. ఫోటోలు కూడా బాగున్నాయ్.

Priya said...

చాలా థాంక్స్ వేణూ గారు :)

రాజ్ కుమార్ said...

Mee blog lo nen chadani posts choosaake ardham ayyindi nenu blogger loki login ayyi nelalu daatindi ani :)
Nice pics

Priya said...

అవునా..?! ఇలా అయితే ఎలా రాజ్ గారు..?? బ్లాగ్ తల్లి ఫీల్ అవ్వదూ..

థాంక్స్ :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Saturday, June 8, 2013

నా నేస్తం!

పగలంతా ఎర్రటి ఎండ! ఆంధ్రాలో ఎంచక్కా వర్షాలు పడుతుంటే ఇక్కడ ఇదేం ఖర్మరా బాబు అని చెన్నై మీద చిరాకు పడుతూ, అసలే ఊరెళ్ళోచ్చి అలసిపోయి ఉన్నానేమో.. సాధారణంగా పగలు నిద్రపోని నేను వంట పని, ఇంటి  పనీ ముగించేసి ఏదో తిన్నాననిపించి మంచం మీద వాలిపోయాను. ఇదిగో.. ఇందాకే  లేవడం!  సాయంత్రం అయిందిగా వాతావరణమయితే    హాయిగా అమ్మ ఒడిలా ఉంది కాని, ఇంట్లో ఎవ్వరూ లేని కారణం చేత దిగాలుగా చాలా లోన్లీగా అనిపించింది. బీచ్ నుండి వచ్చే చల్లని గాలి నన్ను వరండాలో కూర్చోబెడితే,  మా ఇంటి పందిరి మల్లెలు, సన్నజాజులూ మనసుకి ఆహ్లాదాన్ని పంచిపెట్టాయి.   కాసేపటికి "చీకటి పడిపోయింది! అమ్మో.. లైట్ అయినా వేసాను కాదూ" అనుకుంటుంటే.. "భయమెందుకులేవే మేమున్నా"మంటూ చందమామా, అతని చుట్టూ ముత్యాల్లా మెరిసే నక్షత్ర సైన్యం ధైర్యం చెప్పాయి. కన్నార్పకుండా నేను వాటినే చూస్తుంటే, దిష్టి తగులుతుందనో ఏమో?! ఆ అందమైన అద్భుతాల్ని తన వెనుక దాచేయాలని వేగంగా కదులుతున్నాయి మేఘాలు!! వావ్.. ఎంత అందమైన సృష్టి!!! వర్ణిద్దామంటే మాటలు రావడంలేదు.. చూద్దామంటే కనులు చాలడంలేదు! ప్రకృతిని మించిన నేస్తం/బంధువు వేరొకరుంటారా అండీ ఈ లోకంలో?!! నా దిగులూ బాధా అంతా గాలి ఎత్తుకెళ్ళిపోయి తన ప్రశాంతతను నాకు పంచింది. ఈ అందమైన అనుభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ.. ఇంత మంచి సృష్టిని కలుగజేసిన దేవునికి థాంక్స్ చెప్పుకుంటున్నాను :) 

ఈ సందర్భంగా నాకు నచ్చి, గూగుల్ నుండి సేవ్ చేసుకున్న కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి.. ఈ ఫోటో మాత్రం మా ఫ్యామిలీ & ఫ్రెండ్స్ అందరూ కలిసి "నాగాలా" కి ట్రెక్కింగ్ వెళ్ళినపుడు ఒక ఫ్రెండ్ తీశారు. 

మీకేమనిపిస్తోంది మంచులో తడిసిన ఈ మొగ్గని చూస్తే??

చూసే కళ్ళని బట్టి అందం అంటారు.. నిజమే! వాడిపోయినా, రేకలు ఊడినా ఇది చూడండి ఎంత బావుందో! ఆ ముచుక చూసారా ఆరెంజిష్ రెడ్ + ఎల్లో ఎవరో పెయింట్ అద్దిన్నట్లు ఆ రంగులు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా.... !

ఇటువంటి  దారిలో రోజులతరబడి నడిచినా అలుపన్నది రాదేమో?!

24 comments:

 1. చల్లని సాయంత్రం, చక్కని ప్రకృతి, మదిలో ఎంత బాధున్నా పోగొట్టకపోదా?
  ప్రతాపం చాలించి సముద్రంలోకి సోలిపోతున్న సూర్యుడూ, నాగాలా అందాలూ, తడిసిన మొగ్గ స్వచ్ఛతా, వాడినా రంగుల సోయగాన్ని విరబూయిస్తున్న పువ్వు తొడిమా, రాలిన పువ్వుల బాటా...ఇన్ని అందాలు గుర్తుచేసుకుంటూ ఈ సాయంత్రాన్ని మీ సొంతం చేసుకున్నారు. ఇంకేం, ఎప్పుడు గుర్తుచేసుకున్నా పులకరించి పోటానికిది చాలదూ!

  ReplyDelete
  Replies
  1. నిజమే పండు గారు.. నిన్నటి సాయంత్రమే కాదు, ప్రకృతిని తలచిన ప్రతి క్షణమూ నాదే.. :)
   అన్నట్టు.. మీరు కామెంట్స్ ని కూడా కవితల్లా భలే అలవోకగా రాసేస్తారండీ!

   Delete
 2. ఎంత అహ్లాదంగా ఉన్నాయో పిక్స్

  ReplyDelete
  Replies
  1. కదు పద్మ గారూ!
   Thanks for the comment :)

   Delete
 3. Anonymous9/6/13

  ఆనందో బ్రహ్మ!

  ReplyDelete
  Replies
  1. సుస్వాగతం తాతగారు.. :)
   మీరు నా బ్లాగ్ ని దర్శించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ వాఖ్యకు చాలా కృతజ్ఞతలు :)

   Delete
 4. ప్రియ గారు,మీ బ్లాగు ఇదే చూడటం.. చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog andi!
   మీ కామెంట్ కి చాలా థాంక్స్ :)

   Delete
 5. Anonymous9/6/13

  మీ బ్లాగుని ఇవాళే చూసాను. ఇంత చక్కగా ప్రకృతిని వర్ణించింది ఎవరా అని చదివీ చూసీ ఆనందించాను.కి ఉన్న ఎక్కువగా చదువుతున్న వాటిలో కొన్ని ని పై నుంచి కింద దాకా చూసాను. ఇక తప్పదమ్మాయ్. అన్నీ చదివేయాలిసిందే.

  ReplyDelete
  Replies
  1. ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం, అనూ గారు!

   మీ పేరంటే నాకెంత ఇష్టమో!! ఎందుకో నా పోస్ట్స్ చదువుతానన్నారుగా.. సో మీకే తెలిసిపోతుందిలెండి :)

   ఈ పేరుతో నాకు పరిచయమైన రెండావ (కాదు మొదటి) వ్యక్తి మీరు! శ్రమ అనుకోకుండా కామెంట్ చేసి నాకు పరిచయమైనందుకు, నా రాతలు న(మె)చ్చినందుకూ మీకు కృతజ్ఞతలు :)

   Delete
 6. బావున్నాయి ప్రియ గారు ఫోటోస్ :)

  ReplyDelete
  Replies
  1. వాటిని చూసి మీరూ ఆనందించి మెచ్చినందుకు చాలా థాంక్స్ శ్రీనివాస్ గారూ :)

   Delete
 7. అందమైన ప్రకృతి గురించి అంతే అందమైన వర్ణణ...

  ReplyDelete
  Replies
  1. మీ అందమైన వాఖ్యకు మనఃపూర్వక కృతజ్ఞతలు డేవిడ్ గారు :)

   Delete
 8. మీ బ్లాగ్ లోనికి నేను క్రొత్తగా అడుగుపెట్టానండి ప్రియగారూ!మీ పోస్టులు చూసాను. చాలా బాగా ఉన్నాయి.ప్రకృతి తోడుంటే నిజంగా ఒంటరితనమే తెలియదండీ.శుభాకాంక్షలండీ! మీరూ భరత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి.

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగింటికి స్వాగతం, పద్మ గారు!
   అలాగే మీరు నా బ్లాగ్ గురించి చేసిన వాఖ్యకూ, మీ దీవెనకూ హృదయపూర్వక కృతజ్ఞతలు :)

   Delete
 9. Anonymous10/6/13

  No more words. I really enjoyed reading ur blog.

  ReplyDelete
 10. Pratap Reddy Devagri14/6/13

  సోదరి ప్రియ .... మొదటి సారి ని బ్లాగు చుడడం...చాలా బాగుంది...నీ రచనలు చాలా బాగునై...ఈ ఫొటోల అలవాటు నాకే అనుకున్న ....నీకు వుంది....( well oka phichodiki enko pichodini chuste kalige aanandam anta inta kaadu )...నీ పొస్ట్ లన్ని చదివాను .... ఉంగరాల సంగతి చెప్పావు కాని బ్యాండు సంగతి చెప్పలేదు..

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం అన్నయా!
   హహ్హహహ్హ... మీరు చెబుతుంటే నాకూ ఆనందంగానే ఉంది నాలాటి పిచ్చి మీకూ ఉందని. నా రాతలను అభినందించినందుకు చాలా థాంక్స్. బ్యాండు సంగతి అంటే.. పెళ్లి గురించేనా? ఈ నెలాఖరుకి చెబుతాను :)

   Delete
 11. బాగుందండీ చక్కగా వర్ణించారు. ఫోటోలు కూడా బాగున్నాయ్.

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ వేణూ గారు :)

   Delete
 12. Mee blog lo nen chadani posts choosaake ardham ayyindi nenu blogger loki login ayyi nelalu daatindi ani :)
  Nice pics

  ReplyDelete
  Replies
  1. అవునా..?! ఇలా అయితే ఎలా రాజ్ గారు..?? బ్లాగ్ తల్లి ఫీల్ అవ్వదూ..