Thursday, June 13, 2013

నా హాస్పిటల్ తిప్పలు!!

మొన్న (9/6/13) నా టైం బాగా బాడ్ అయిపోయి ఆ రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి ఉదయం నిద్ర లేచినప్పటినుండే నీరసంగా, వికారంగా అనిపిస్తూ ఉంది. అమ్మావాళ్ళు కూడా ఊరిలో లేరేమో.. బాగానే  ఇబ్బంది పడ్డాను. ఎలాగో కాస్త ఓపిక తెచ్చుకొని ఇల్లు ఊడ్చి, ఫ్రెషప్ అయి, ముందు రోజు ఉతికిన బట్టలు మడత పెట్టాను. తరువాత వంట చేద్దామని కిచెన్ రూంలోకి వెళ్లాను గాని తల తిరిగినట్లయి నిలబడలేక అక్కడ కనిపించిన బిస్కెట్ పాకెట్ తీసుకొని మంచం మీద వాలిపోయాను. కాళ్ళు చేతులు బాగా లాగేస్తూ విపరీతమయిన తల నొప్పి. ఏమైనా తింటే బెటర్ అవుతుందేమో అని బిస్కెట్స్ తిని నీళ్ళు తాగాను. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. కాసేపటికి వాంతులు మొదలయ్యాయి. నీళ్ళు తాగినా సహించలేదు. అలాగే పడుకొని ఉండిపోయాను. అక్క కి ఫోన్ చేద్దామని అనుకున్నాను గాని,  ఎందుకులే కంగారుపడుతుంది.. నిదానంగా నేనే పక్కనున్న హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుంది అని ఊరుకున్నాను. మధ్యాహ్నం రెండున్నరా మూడయ్యే సరికి కాస్త బెటర్‌గా ఫీల్ అవడం మొదలుపెట్టాను. ఓపిక వచ్చిందిగా కాస్త రసం చేసుకుని తిని వెళాదం కదా అని మళ్లీ వంట గదిలోకి వెళ్లాను. 2, 3 నిముషాలు బాగానే ఉన్నాను... తరువాత బాగా కళ్ళు తిరిగిపోయాయి. కష్టపడి రసమూ, అన్నం స్టవ్ మీద పెట్టి పక్కకి రాబోయెంతలో నేల మీద ఒరిగిపోయాను. పది నిముషాలకు గానీ లేవలేకపోయా! అలాగే మొండిగా లేచి అన్నం పెట్టుకుని గబగబా తిన్నాను (త్వరగా ఓపిక వచ్చేయాలని ఆత్రం మరి!). పావుగంటలోనే వాంతయిపోయింది! కాసేపటికి నీరసమయితే తగ్గింది కాని నిద్ర మాత్రం రాలేదు. ఎలాగు కాస్త ఓపిక వచ్చేసిందిగా రేపటికి పూర్తిగా నార్మల్ అయిపోతానులే.. ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి ఎందుకని, పడుకుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ "నా నేస్తం" కి వచ్చిన కామెంట్స్ కి రిప్లైలు ఇచ్చాను.  

ఈ లోపు నాకు అత్యంత ఆప్తురాలైన "వినోద" ఫోన్ చేసింది (ఆవిడ మా నాన్నగారి  ఫ్రెండు.. మా అమ్మ కంటే రెండేళ్ళు పెద్దది. నాకు పదిహేనేళ్ళ వయసప్పటి నుండి పరిచయం ఆవిడతో. గత నాలుగేళ్లలోనే నాకు మిక్కిలి ఆప్తురాలయింది. అమ్మ ఎంతో.. ఆవిడ అంత.  తెలిసిన వాళ్ళందరూ "అక్కా, వినోద" అని పిలుస్తుంటే నాకూ అదే అలవాటయింది :P. మాట్లాడేడపుడు బహువచనమే ఉపయోగిస్తాను కాని మనసులో, లేక ఎవరితోనైనా చెప్పేడపుడు మాత్రం ఏకవచనమే). ఫోన్ లో నా గొంతు విని కంగారు పడిపోయింది. ఏం లేదు.. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పినా వినకుండా ఇంటికి వచ్చింది. "అయ్యో.. ఇంత నీరసపడిపోయావేంటి?!! పద హాస్పిటల్ కి వెళదాం" అని బలవంతపెట్టింది.   అప్పటి వరకు పడుకుని ఉన్న నేను లేచి నిలబడ్డాను గాని మరుక్షణమే తూలిపోయాను! "అయ్యో.. జ్వరంగా కూడా ఉందే! బ్రెయిన్ పనిచేస్తోందా లేదా నీకు? బాలేనపుడు కనీసం చెప్పవా? అందులోను ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు.. నిలబడ్డానికే ఓపిక లేక తూలిపోతున్నావ్? కళ్ళు చూడు ఎలా మూతలు పడిపోతున్నాయో! అయినా హాస్పిటల్ కి వెళదాం అంటే బావున్నానని పళ్ళికిలిస్తున్నావేంటీ" అని నానా విధాలుగా క్లాసు పీకుతూ, తిడుతూ జబ్బ పట్టుకుని లాక్కెళ్ళి కార్లో కూర్చోబెట్టింది. పడుకుని ఉన్నంతసేపూ తెలియలేదు గానీ కూర్చున్నపుడు తెలిసింది నా పరిస్థితి ఎలా ఉందో! ఆవిడ ఏదో మాట్లాడు తోంది.. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. బీపీ, హార్ట్ బీట్ నార్మల్‌గానే ఉన్నాయిట ఉడుండి పల్స్ రేట్ మాత్రం కొంచెం తగ్గుతోందిట! "వెంటనే డ్రిప్స్ ఎక్కించాలి. చాలా వీక్ గా ఉంది అమ్మాయి. ఈ రాత్రికి అడ్మిట్ చెయ్యాల్సి వస్తుంది" అన్నారు డాక్టర్. వినోద అయితే చాలా టెన్షన్ పడిపోయింది. నేను తన చెయ్యి పట్టుకుని "ఇలా చూడండీ.. ఒక్కదాన్నే ఏం తింటానులే అని అశ్రద్ధ చేసి నిన్నంతా ఏమీ తినలేదు. ఈ వేళేమో వాంతులు. జ్వరంగా ఉందిగా అందుకే నీరసంగా ఉంది. కాసేపటికి మాములయిపోతాను. కంగారు పడకండీ" అని నవ్వాను (బలవంతంగా ప్రయత్నించాను). తను ఒక్క క్షణం నా వైపు తీవ్రంగా చూసి "O just shut up" అని కసురుతుండగా..  నర్స్, మూడు ఇంజక్షన్లు, ప్లాస్టర్, దూది వగైరాలతో ప్రత్యక్షమైపోయింది.  

నాకు నా బాధ కంటే ఇప్పుడు ఇంజక్షన్ పొడుస్తుంది అన్న బాధ ఎక్కువైపోయి, "సిస్టర్.. ప్లీజ్ మెల్లగా చేయండీ. ప్లీజ్... " అని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టేసాను. దానికి ఆవిడ "సరే సరే" అని నరం వెతుక్కుంది. దొరికి చస్తేగా..? ఒక చేత్తో నా చేతిని టైట్‌గా పట్టుకుని మరో చేత్తో టపా టపా కొడుతూ మరీ చూసింది. అయినా దొరకలేదట! "రెండు చేతుల్లోనూ పచ్చగా చక్కగా కొట్టొచ్చినట్లు కనబడుతుంటే,  నరాలు దొరకట్లేదని చావబాదుతుందేంటి? ఎవరి మీదో కోపం నా మీద తీర్చుకుంటోందా ఏంటి పాడు?" అని నా మనసు బోరుమంది. ఆ మాటే పైకి అందామనుకున్నాను కాని "అసలే తన చేతిలో ఇంజక్షన్ ఉంది. కోపం వచ్చి కసిగా పోడిచిందంటే చచ్చూరుకుంటాను.. ఎందుకులే లేనిపోయిన గొడవ? అసలే ఓపికలేదు" అని చేతుల్ని ఆవిడకు అప్పగించి తల అటు తిప్పుకొని దేవుణ్ణి తలుచుకున్నాను. కొంతసేపటికి ఒక చోట దూదితో తుడిచింది. "నరం దొరికేసిందనుకుంట.. ఇప్పుడు పొడుస్తుంది" అని ఘాట్టిగా కళ్ళు మూసుకుని "దేవుడా దేవుడా" అనుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ఈలోపు ఆవిడ ఆ ప్లేస్ వదిలేసి మరో చోట రుద్ది నేను కళ్ళు తెరిచి మూసేలోపు టక్కున పొడిచేసింది! భలే నొప్పి పుట్టిందిలెండి. పోనిలే ఈ సూదులగోల అయిపొయిందని ఊపిరి పీల్చుకుంటుండగానే, ఇంత పెద్ద సిరంజి తీసుకొచ్చి "బ్లడ్ టెస్ట్ చేయాలి చెయ్యి చూయించండి మేడం" అంది! ఏడుపొచ్చేసింది నాకు. మాట్లాడే ఓపిక లేదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది.. అందుకే ఇక అడ్డు కూడా చెప్పలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాను. ఆవిడే  నా చెయ్యందుకుని మళ్ళీ కాసేపు వెదికి ఒక చోట పొడిచింది. కాని బ్లడ్ రాలేదట. గుచ్చిన సూదినే కాస్త అటు ఇటూ తిప్పింది. అరిచే ఓపిక కూడా లేదు నాకు. కళ్ళ నుండి నీళ్ళు మాత్రం జారాయి. "రాంగ్ ప్లేస్.. మరో చోట ట్రై చేస్తాను" అంటూ ఇంకొక చోట గుచ్చింది. ఈ సారి బ్లడ్ వచ్చిందిలెండి.. అదృష్టం. 4ml బ్లడ్ తీసుకుపోయింది దొంగ మొహంది. నిజంగా బ్లడ్ టెస్ట్ కి 4ml అవసరమా అండి??  

కాసేపటికి మళ్ళీ డాక్టర్ వచ్చి చూసాక నన్ను ఎమర్జెన్సీ వార్డ్ నుండి నార్మల్ రూం కి షిఫ్ట్ చేశారు. వెళ్ళాక సిస్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మింగి, ఇంజెక్ట్ చేసిన డ్రిప్స్ ఎక్కించుకుంటూ పడుకున్నాను. కాసేపటికి వినోదా ను లోపలికి రావడానికి అనుమతించారు. తను వచ్చాక "అమ్మావాళ్లకు చెప్తే కంగారు పడతారు వద్దు అంటావు గాని మరి కనీసం మీ అక్కకు, భరత్కైనా చెప్పనా? ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం మంచిది కాదు" అంది. "ఎందుకు.. కంగారు పడతారు. ఇక అక్కైతే చంటి పిల్లాడిని పెట్టుకుని ఇప్పుడు హాస్పిటల్ కి వస్తాను అంటుంది. ఉదయానికి అంతా సర్దుకుంటుంది.. అప్పుడు నిదానంగా ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. సిస్టర్స్ ఉన్నారుగా మరేం పరవాలేదు" అన్నాను. "Why don't you understand? అయినా పోయి పోయి నిన్ను అడుగుతున్నాను చూడు" అంటూ భరత్ కి, అక్క కి కాల్ చేసి చెప్పేసింది. నేను ఫోన్ తీసుకుని, "బాగానే ఉన్నాను కంగారు పడనవసరం లేదు. అమ్మకు, డాడీ కి ఇప్పుడు చెప్పొద్దు. రేపు నేనే ఫోన్ చేస్తానులే" అని చెప్పి, మరో ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, తను వచ్చి రాత్రంతా నాతో హాస్పిటల్ లో ఉంది. ఎందుకంటే వినోదా ఆ బెడ్ మీద అడ్జస్ట్ అవ్వలేదని నాకు తెలుసు.  

మరుసటి రోజు ఉదయానికి నేను అనుకున్నట్లుగానే ఆల్మోస్ట్ మాములయిపోయాను. పొద్దుపొద్దున్నే అభీ గాడిని తీసుకుని అక్క, బావా వచ్చారు. అక్క చేత అక్షింతలు వేయించుకుంటుంటే, అప్పుడే వచ్చిన వినోద కూడా నాలుగు అందుకుంది. నీరసంగా ఉన్నానని వదిలేసారు గాని లేకపోతే చెరో చెంపా వాయించివుండేవారే! ఇక నన్ను ఆ రోజు మాధ్యహ్నానికే డిశ్చార్జ్ చేసేసారు. 

ఈ ఫోటో డిశ్చార్జ్ చేసే ముందు తీసిందే.. ఇలాటి ఫోటో అరుదు కదా అందుకే తీసి దాచుకున్నా :P.  ఇంతకీ డాక్టర్ తేల్చిందేటంటే, హిమోగ్లోబిన్, ఐరన్.... .... తక్కువగా ఉన్నాయి.. బెసికల్లీ వీక్ గా ఉంది.. పాలు, ఆకు కూరలు, పళ్ళు అంటూ బాగా తినాలి.. అలాగే ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని. మా అక్కా, వినోదా ఇద్దరూ నా మీద వార్ కి దిగారు. ఇంటికి వచ్చాక మా అక్కయితే "మాయ రోగమా తినడానికి? తినమంటే కొండలు, గుట్టలు మోస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెడతావ్. సూదులు పొడిపించుకుంటుంటే బావుందా? ఇకనైనా నీకు బుద్దోస్తే బావుండు" అంటూ లెఫ్ట్, రైట్, సెంటర్ వాయించేసింది. అంతా విన్నాక నిదానంగా అన్నాను "నేను బాగానే తింటున్నానుగా అక్కా.. పాలు, పెరుగే నచ్చవు. నేనేం చేయను" అన్నాను. "పాలు, పెరుగు మాత్రామా నచ్చవు? ఒక చపాతి తినవు, నెయ్యి తినవు, ... .. ... ... ... ... ... ......... నీ వెనుకే తిరుగుతూ బలవంతంగా తినిపించడానికి ఇంకా నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇదిగో.. ఆరోగ్యం పోయాక ఇక ఏమున్నా వేస్ట్ తెలుసుకో. అయినా బుద్ధున్నదెవతయినా స్పృహ తప్పుతోంది అని తెలిసినా కొంపలో కిక్కురుమనకుండా కూర్చుంటుందా? ఒక్క కాల్ చేయొచ్చుగా? ఏమైనా అయితే? ఛీ ఛీ.. ఏమో బాబు నీ ఇష్టం" అని, ముక్కుపుటలు అదురుతుండగా మొహం అటువైపు తిప్పేసుకుంది. అభీ గాడు నన్ను, వాళ్ళమ్మను మార్చి మార్చి చూస్తూ అప్పుడప్పుడు నవ్వుతున్నాడు. నేను సారీ చెప్పి మరింకేప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేసాను. భరత్ వేయాల్సిన అక్షింతలు కాస్త అటూ ఇటుగా మిగిలిపోయాయి. అంటే.. తను ట్రైనింగ్ కోసం బెంగుళూరు వెళ్ళాడు. సో ఫోన్లో కనుక పెద్దగా పడలేదు. అదన్నమాట సంగతి! 

34 comments:

శరత్ 'కాలమ్' said...

మీకు ఏమయ్యిందోనని నన్ను కూడా ఖంగారు పెట్టేసారు.

Chinni said...

నిన్న నీ లంచ్ మెను విన్న వాళ్లెవరైనా చెప్తారు నువ్వు అలా తింటే ఇలానే ఉంటావని.. టైంకి బద్ధకించకుండా తినాలి..మనం ఎప్పుడూ చెప్పుకునే మాటలే అయినా ఇంకొకసారి:P

Anonymous said...

bagundandi!! mari ippatikina full ga set iyyara!! take good care of your health!!

Sri Latha said...

ముందు ఆ ఫోటో చూసి చాల కంగారుపడిపోయాను ప్రియగారు. పోస్ట్ మొత్తం చదివాక మీ మీద కోపమొస్తుంది. మీ అక్కయ్య చెప్పింది అక్షరాల నిజం. Please take care of your health.

Madhumitha said...

Too much అండి మీరు. ఆ ఇంజక్షన్ పార్ట్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నిద్ర కూడా మర్చిపోయి రాత్రంతా మీ బ్లాగ్‌లోని పోస్ట్లన్నీ చదివేశా. ప్రతి విషయాన్నీ మీరు బలే నిశితంగా పరిశీలిస్తారే? మండుటెండ కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది మీ మాటల్లో. Nice blog. I enjoyed reading it. By the way get well soon.

Anonymous said...

తిండి కలిగితె కండ కలదోయ్! కండ కలవాడేను మనిషోయ్!! :)

Priya said...

అయ్యో.. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండీ!
ఏమీ లేదు, ముందు రోజు తినకపోవడం.. ఆ రోజేమో జ్వరము, వాంతులు. అందుకే కాస్త నీరసపడ్డాను అంతే.

Priya said...

ఏయ్..! నిజంగా అంత బాడ్ మెనూనా చెప్పు? ఫ్రూట్స్ తిని జూస్ తాగాను. అది తక్కువేమీ కాదుగా? అయినా తినడానికి బద్ధకం కాదు చిన్నీ.. ఎందుకో ఒక్కదాన్నే ఉంటే మాత్రం తినబుద్ధి కాదు.

అన్నట్లు డార్లింగ్.. మనం ఎప్పుడూ చెప్పుకునే మాటలు కాదు. నేను ఎల్లప్పుడూ, నువ్వు అప్పుడప్పుడు చెప్పే మాటలు ;) లంచ్ ఒక్కటేగా నువ్వు తిన్నగా తినేది?

Priya said...

థాంక్స్ అండీ! ఇప్పుడు బావున్నాను. తప్పకుండా కేర్ తీసుకుంటాను :)

Priya said...

అయ్యో.. శ్రీ లత గారూ, మీరు మరీ నన్ను అపార్దం చేసుకుని కోపగించుకోకండీ. మా అక్క ఏదో నా మీద ప్రేమ కొద్దీ బాధలో అస్సలు నేనేమీ తిననట్లు మాట్లాడింది. నిజానికి నేను చక్కగానే తింటాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు :)

Priya said...

మధుమిత గారూ.. మీ వాఖ్యకూ, ప్రశంశకూ చాలా కృతజ్ఞతలండీ :)

Priya said...

నిజమే తాతగారూ! మీకు తెలుసా నాకూ కండలున్నాయి :) :)

Thanks for the comment.

డేవిడ్ said...

ప్రతి ఇంట్లో ఒక్కరైనా మీలాగే తిండి విషయంలో నిర్లక్షంగా ఉంటారు లెండీ. ...దానికి ఎవ్వరం ఏం చేయలేం..జాలి పడటం తప్పా...anyway take care and get well soon

Priya said...

డేవిడ్ గారూ.. నేను ఆహారాన్ని నిర్లక్ష్యం చేసే టైప్ కాదండీ. ఎప్పుడైనా ఒక్కసారి తినబుద్ధి కాక "ఆ తినొచ్చులే" అని వాయిదాలు వేస్తూ ఉంటాను అంతే.

అనవసరంగా పోస్ట్ రాశానేమో అనిపిస్తోంది. Anyway.. thanks for the comment.

శోభ said...

చాట్‌లో పలుకరిస్తూ.. ఎలా వున్నావురా అంటే..?

ఎలా ఉన్నాను అన్న దానికి రేపు సమాధానం చెబుతా అన్నావు... సమాధానం ఇదన్నమాట.

ముందు ఆ ఫొటో చూడగానే కంగారేసేసింది. తీరా చదివాక కోపం వస్తోంది. తిండి విషయంలో ఇంత బద్దకిస్టువని నాకిప్పటిదాకా తెలీదు సుమీ...

అక్క కాదు.. మరెవరైనా సరే ఇలాగే చివాట్లు పెట్టేస్తారు...

ఎలాగైతేనేం కోలుకున్నావుగా.. ఇంకెప్పుడూ ఇలా చేయకేం... ఇకపై అలా ఉండమన్నా ఉండవు... నరం దొరక్క ఇబ్బంది పడిన సందర్భం గుర్తు వస్తే ఇంకెప్పుడూ తినకుండా ఉండవులే. నిజంగా నరం దొరకలేదని చెబుతూ రాసినది చదువుతుంటే నిజ్జంగా చాలా చాలా బాధగా అనిపించింది.

నేనూ ఒంటరిగా ఉంటే తినలేను.. కానీ పూర్తిగా తినకుండా మాత్రం ఉండను... ఈ పోస్ట్ చూస్తుంటే తప్పకుండా కడుపునిండా తినాలి అని తీర్మానం చేసేసుకున్నాను.

ఒంట్లో బాలేక పోస్ట్ పెడితే.. ఇలా అందరూ చివాట్లు పెట్టేస్తున్నారని దిగులుపడకు ప్రియా... అందరూ నీ మంచి కోసమే కదా చెబుతోంది...

ఇంతమంది ప్రేమగా మందలిస్తున్నారంటే... నీపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకుంటావుగా... :)

చిన్ని ఆశ said...

అయ్యో చిన్న నీరసం హాస్పిటల్ దాకా లాక్కెళ్ళిందనమాట.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడి ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు స్ఫురించకపోదు.
Hope you feel better now!

వేణూశ్రీకాంత్ said...

ఫోటోతో ఖంగారుపెట్టేశారండీ. ఇపుడు క్షేమమేనని తెలుసుకుని సంతోషించాను. మీరు మరీ టూమచ్ అండీ తినాలని అనిపించకపోయినా మరీ ఇలా పడిపోయేదాక ఎలా వదిలేశారండీ. అసలు ఇది అరుదైన సంధర్బమంటూ అలా చేతిని ఫోటోతీసి పెట్టడం చూస్తే నవ్వూ కోపం రెండూ కలిసొస్తున్నాయ్ :) ముందు ముందు మరీ ఇంత అశ్రద్దచేయకండి.

Priya said...

అయ్యో.. మీరందరూ ఎందుకిలా అపార్దం చేసుకుంటున్నారో నాకు అర్ధంకావడం లేదు. ఒక్కదాన్ని ఉన్నపుడు ఆహారాన్ని అశ్రద్ధ చేస్తానన్నమాట నిజం. దానికి తోడు జ్వరం కూడా రావడంతో మొన్న ఇబ్బందిపడాల్సి వచ్చింది. కాని ఆ మరుసటి రోజుకే నేను పూర్తిగా కోలుకున్నాను. అంతేకాని ఆరోగ్యం విషయంలో నేను ఎలాటి ఛాన్స్ తీసుకోను. ప్రతి మనిషికీ ఒక్కో బలహీనత ఉంటుంది. నా బలహీనత ఒంటరిగా ఉన్నపుడు ఆహారాన్ని అశ్రద్ధ చేయడం. ఈ అలవాటుని మార్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను.

అన్ని రాగాలలానే ఈ రాగాన్నీ మీతో పంచుకున్నాను. అంతేగాని జాలి కోసమో మరొకటో కాదని అర్ధం చేసుకోగలరు. అయినా సరే.. ప్రేమతో/అభిమానంతో నన్ను మందలించిన మీకు, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను :)

Priya said...

అవునండీ. నిజమే.. ఆరోగ్యం నిజంగానే మాహాభాగ్యం పండు గారు. క్షణమైనా కుదురుగా కూర్చోని నన్ను రోజంతా మంచం మీద కుదేసింది! ఇప్పుడు యధా మామూలండీ... దుక్క ముక్కలా ఉన్నాను :)

Thanks for the comment!

Priya said...

అమ్మోయ్.. అస్సలు అశ్రద్ధ చేయను. బుద్దోచ్చేసింది :) అయినా మాములుగా అయితే అంత సీరియస్ అయుండేది కాదు వేణూ గారూ. మాయదారి జ్వరం, వాంతుల వలనే అంత దూరం వెళ్ళింది. ఇక ఆ ఫోటో సంగతికొస్తే.. :P హహ్హహహ్హ.. ఓపెన్ గా చెప్పాలంటే మా అక్క "ఒసేయ్ పిచ్చి ముండ. ఇంత వెర్రిదానివేంటే నువ్వు? ఖర్మ!" అంది.

Sravya V said...

Hey crazy girl, don't know what you say !! My goodness photo too devudaa !!!!!!!!!
Take good care Priya !

Anonymous said...

ఒక్కదాన్నీ తినడం ఎలాగా అనుకోవద్దు. బ్లాగ్లోకం లోకి వచ్చేసి మమ్మల్ని చూస్తూ(చదువుతూ) తినడమే. మీ "అనూ" బదులు నేను కేకలేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేయొద్దు... అందరినీ ఖంగారు పెట్టొద్దు.

Priya said...

మీరిచ్చిన ఐడియా ఏదో బావుంది అనూ గారూ.. ఫాలో అయిపోతాను! బాబోయ్.. ఇంకొక్కసారి ఇలా చేసే ఆశక్తి, ఓపికా రెండూ లేవండి బాబు. బాగా బుద్దోచ్చేసింది :)

Priya said...

You know what, I'm feeling a bit shy to reply to your comment. అందుకే కామెంట్ నిన్ననే పబ్లిష్ చేసాను కాని రిప్లై ఇవ్వలేదు. Especially after reading these lines.. "My goodness photo too devudaa !!!!!!!!!", I really don't understand what to say :)

So, finally I've decided to say.. "Sure, darling. I'll take care. Thanks for the comment".

Sravya V said...

హ హ అది తిట్టడం కాదు :-) తినకపోవటం తప్పే దాని కన్నా , కళ్ళు తిరిగి అలా అవుతుంటే ఎవరికీ చెప్పకుండా అలా ఒంటరి ఉండటం అనేది నిజంగా మంచి పని కాదు . ఎనీవే అంతా మంచిగానే ఉంది కదా ఇప్పుడు హాప్పీస్ !

surya prakash apkari said...

శ్రేయోభిలాషులకు అప్రియమయిన సత్యం నుడివి ప్రియ ఎన్నో మందలింపులు చీవాట్లు కోప్పడడాలు కడుపునిండా తిన్నారు!ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకోవడం అప్పుడప్పుడు పెనుప్రమాదానికి దారితీయవచ్చునని చదువరులంతా గుణపాటం నేర్చుకోవడానికి కనువిప్పు కాగలదు మీ టపా!అంత కష్టంలోనూ మీ నరం దొరక్క గుచ్చిగుచ్చి చూడడంలో మీకు తెలియకుండానే కించిత్ హాస్యమ్ కూడా పండించారు!

MURALI said...

అంత మొండితనం కూడదండీ బాబూ. కాస్త కళ్ళు తిరుగుతున్నాయనగానే త్వరగా తినటమో ఎవరికైనా ఫోన్ చెయ్యడమో చెయ్యాల్సింది.

ఈసారి నుండీ ఒక్కరే ఉండి వండుకోవాల్సి వస్తే "నేను ఈరోజు ఇది వండుకుతింటున్నా" అని ఒక పోస్ట్ ఫోటోలతో సహా మాకోసం వెయ్యండి. పుణ్యం, పురుషార్ధం కలిసొస్తాయి.

Priya said...

హహ్హహ.. నిజమే కాసేపటికి సర్దుకుంటుందిలే ఈ మాత్రం దానికి పక్క వాళ్ళను కంగారు పెట్టడం దేనికీ అనుకున్నాను కాని సిట్యువేషన్ అంత క్రిటికల్ గా ఉందని రియలైజ్ అవ్వలేదు. అవును భగవంతుని దయవల్ల అంతా మంచిగానే సాగింది. ఇప్పుడు ఆల్ హాప్పీస్ :)

Priya said...

అవునండీ.. బాగా తిన్నాను. తినీ తినీ కడుపునొప్పి కూడా వచ్చింది!
కాని మీరన్నది నిజమే. తెలిసో, తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయి. పోనీలెండి నా అనుభవాన్ని చూసి ఏవైనా ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటారు అంటే నాకు అంతకన్నా కావలిసిందేముంది?

మీ వాఖ్యకు చాలా కృతజ్ఞతలు. వస్తూ ఉండండి :)

Priya said...

హహ్హహ్హహ.. భలేవారే మీరు!
సరే.. కచ్చితంగా ఈ సారి అలాగే చేస్తానులెండి. పుణ్యం కోసం కాకపోయినా శ్రేయోభిలాషులు మీరు చెప్పినందుకు :)

ప్రవీణ్ మలికిరెడ్డి said...

కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోండి. అసలే తొందరలో పెళ్లి అంటున్నారు. పెళ్లి ఫొటోస్ బాగా రావాలంటే, ఫొటోస్ లో మీ అను కంటే మీరు బాగా గ్లామర్ గా పడాలంటే చూస్కోండి మరి.

అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా పండింది (ఇంజక్షన్ దగ్గర).

టపాలన్ని చదివి మళ్లీ కామెంటుతా.

Priya said...

ఇంజక్షన్ దగ్గర కామెడీయాహ్..? హహ్హహ్హహ్హ...

నిజమే ప్రవీణ్ గారు.. టైం కి తినేసి హాయిగా బజ్జుకుందామని నిర్ణయం తీసేసుకుని ఫాలో కూడా అయిపోతున్నాను. ఇక మీరు అన్న పెళ్లి ఫోటోలు.. నా గ్లామర్ కి తిండి నిద్రా పెద్దగా అవసరం లేదండి అనూ ఎలాగూ నా పక్కనే ఉంటాడుగా సో ఆటోమేటిక్ గా తన్నుకొచ్చేస్తుంది :D

మీరు చాలా మంచి వారు సుమండీ.. ఓపిగ్గా చదివి కామెంట్లు పెడుతున్నారు! థాంక్ యూ... థాంక్ యు :)

రాజ్ కుమార్ said...

Ee post elaa missayyanabbaa...
Ilaa vanta chesetappudooo, hospital lo join ayinappudoo photolu tiyyadam emitooo :)
Hihihihi

Food vishayam lo meeru nannu adarsham gaa teesukovaalani adesistunnaanu
Get well soon

Priya said...

<< Ilaa vanta chesetappudooo, hospital lo join ayinappudoo photolu tiyyadam emitooo :)
Hihihihi >> :P :)

మీ ఆదేశాన్ని శిరసావహిస్తున్నానని బ్లాగ్ముఖంగా చిరునవ్వుతో తెలుపుకుంటున్నాను :)
Thank you.Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, June 13, 2013

నా హాస్పిటల్ తిప్పలు!!

మొన్న (9/6/13) నా టైం బాగా బాడ్ అయిపోయి ఆ రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నిజానికి ఉదయం నిద్ర లేచినప్పటినుండే నీరసంగా, వికారంగా అనిపిస్తూ ఉంది. అమ్మావాళ్ళు కూడా ఊరిలో లేరేమో.. బాగానే  ఇబ్బంది పడ్డాను. ఎలాగో కాస్త ఓపిక తెచ్చుకొని ఇల్లు ఊడ్చి, ఫ్రెషప్ అయి, ముందు రోజు ఉతికిన బట్టలు మడత పెట్టాను. తరువాత వంట చేద్దామని కిచెన్ రూంలోకి వెళ్లాను గాని తల తిరిగినట్లయి నిలబడలేక అక్కడ కనిపించిన బిస్కెట్ పాకెట్ తీసుకొని మంచం మీద వాలిపోయాను. కాళ్ళు చేతులు బాగా లాగేస్తూ విపరీతమయిన తల నొప్పి. ఏమైనా తింటే బెటర్ అవుతుందేమో అని బిస్కెట్స్ తిని నీళ్ళు తాగాను. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. కాసేపటికి వాంతులు మొదలయ్యాయి. నీళ్ళు తాగినా సహించలేదు. అలాగే పడుకొని ఉండిపోయాను. అక్క కి ఫోన్ చేద్దామని అనుకున్నాను గాని,  ఎందుకులే కంగారుపడుతుంది.. నిదానంగా నేనే పక్కనున్న హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుంది అని ఊరుకున్నాను. మధ్యాహ్నం రెండున్నరా మూడయ్యే సరికి కాస్త బెటర్‌గా ఫీల్ అవడం మొదలుపెట్టాను. ఓపిక వచ్చిందిగా కాస్త రసం చేసుకుని తిని వెళాదం కదా అని మళ్లీ వంట గదిలోకి వెళ్లాను. 2, 3 నిముషాలు బాగానే ఉన్నాను... తరువాత బాగా కళ్ళు తిరిగిపోయాయి. కష్టపడి రసమూ, అన్నం స్టవ్ మీద పెట్టి పక్కకి రాబోయెంతలో నేల మీద ఒరిగిపోయాను. పది నిముషాలకు గానీ లేవలేకపోయా! అలాగే మొండిగా లేచి అన్నం పెట్టుకుని గబగబా తిన్నాను (త్వరగా ఓపిక వచ్చేయాలని ఆత్రం మరి!). పావుగంటలోనే వాంతయిపోయింది! కాసేపటికి నీరసమయితే తగ్గింది కాని నిద్ర మాత్రం రాలేదు. ఎలాగు కాస్త ఓపిక వచ్చేసిందిగా రేపటికి పూర్తిగా నార్మల్ అయిపోతానులే.. ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి ఎందుకని, పడుకుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతూ "నా నేస్తం" కి వచ్చిన కామెంట్స్ కి రిప్లైలు ఇచ్చాను.  

ఈ లోపు నాకు అత్యంత ఆప్తురాలైన "వినోద" ఫోన్ చేసింది (ఆవిడ మా నాన్నగారి  ఫ్రెండు.. మా అమ్మ కంటే రెండేళ్ళు పెద్దది. నాకు పదిహేనేళ్ళ వయసప్పటి నుండి పరిచయం ఆవిడతో. గత నాలుగేళ్లలోనే నాకు మిక్కిలి ఆప్తురాలయింది. అమ్మ ఎంతో.. ఆవిడ అంత.  తెలిసిన వాళ్ళందరూ "అక్కా, వినోద" అని పిలుస్తుంటే నాకూ అదే అలవాటయింది :P. మాట్లాడేడపుడు బహువచనమే ఉపయోగిస్తాను కాని మనసులో, లేక ఎవరితోనైనా చెప్పేడపుడు మాత్రం ఏకవచనమే). ఫోన్ లో నా గొంతు విని కంగారు పడిపోయింది. ఏం లేదు.. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పినా వినకుండా ఇంటికి వచ్చింది. "అయ్యో.. ఇంత నీరసపడిపోయావేంటి?!! పద హాస్పిటల్ కి వెళదాం" అని బలవంతపెట్టింది.   అప్పటి వరకు పడుకుని ఉన్న నేను లేచి నిలబడ్డాను గాని మరుక్షణమే తూలిపోయాను! "అయ్యో.. జ్వరంగా కూడా ఉందే! బ్రెయిన్ పనిచేస్తోందా లేదా నీకు? బాలేనపుడు కనీసం చెప్పవా? అందులోను ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు.. నిలబడ్డానికే ఓపిక లేక తూలిపోతున్నావ్? కళ్ళు చూడు ఎలా మూతలు పడిపోతున్నాయో! అయినా హాస్పిటల్ కి వెళదాం అంటే బావున్నానని పళ్ళికిలిస్తున్నావేంటీ" అని నానా విధాలుగా క్లాసు పీకుతూ, తిడుతూ జబ్బ పట్టుకుని లాక్కెళ్ళి కార్లో కూర్చోబెట్టింది. పడుకుని ఉన్నంతసేపూ తెలియలేదు గానీ కూర్చున్నపుడు తెలిసింది నా పరిస్థితి ఎలా ఉందో! ఆవిడ ఏదో మాట్లాడు తోంది.. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. బీపీ, హార్ట్ బీట్ నార్మల్‌గానే ఉన్నాయిట ఉడుండి పల్స్ రేట్ మాత్రం కొంచెం తగ్గుతోందిట! "వెంటనే డ్రిప్స్ ఎక్కించాలి. చాలా వీక్ గా ఉంది అమ్మాయి. ఈ రాత్రికి అడ్మిట్ చెయ్యాల్సి వస్తుంది" అన్నారు డాక్టర్. వినోద అయితే చాలా టెన్షన్ పడిపోయింది. నేను తన చెయ్యి పట్టుకుని "ఇలా చూడండీ.. ఒక్కదాన్నే ఏం తింటానులే అని అశ్రద్ధ చేసి నిన్నంతా ఏమీ తినలేదు. ఈ వేళేమో వాంతులు. జ్వరంగా ఉందిగా అందుకే నీరసంగా ఉంది. కాసేపటికి మాములయిపోతాను. కంగారు పడకండీ" అని నవ్వాను (బలవంతంగా ప్రయత్నించాను). తను ఒక్క క్షణం నా వైపు తీవ్రంగా చూసి "O just shut up" అని కసురుతుండగా..  నర్స్, మూడు ఇంజక్షన్లు, ప్లాస్టర్, దూది వగైరాలతో ప్రత్యక్షమైపోయింది.  

నాకు నా బాధ కంటే ఇప్పుడు ఇంజక్షన్ పొడుస్తుంది అన్న బాధ ఎక్కువైపోయి, "సిస్టర్.. ప్లీజ్ మెల్లగా చేయండీ. ప్లీజ్... " అని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టేసాను. దానికి ఆవిడ "సరే సరే" అని నరం వెతుక్కుంది. దొరికి చస్తేగా..? ఒక చేత్తో నా చేతిని టైట్‌గా పట్టుకుని మరో చేత్తో టపా టపా కొడుతూ మరీ చూసింది. అయినా దొరకలేదట! "రెండు చేతుల్లోనూ పచ్చగా చక్కగా కొట్టొచ్చినట్లు కనబడుతుంటే,  నరాలు దొరకట్లేదని చావబాదుతుందేంటి? ఎవరి మీదో కోపం నా మీద తీర్చుకుంటోందా ఏంటి పాడు?" అని నా మనసు బోరుమంది. ఆ మాటే పైకి అందామనుకున్నాను కాని "అసలే తన చేతిలో ఇంజక్షన్ ఉంది. కోపం వచ్చి కసిగా పోడిచిందంటే చచ్చూరుకుంటాను.. ఎందుకులే లేనిపోయిన గొడవ? అసలే ఓపికలేదు" అని చేతుల్ని ఆవిడకు అప్పగించి తల అటు తిప్పుకొని దేవుణ్ణి తలుచుకున్నాను. కొంతసేపటికి ఒక చోట దూదితో తుడిచింది. "నరం దొరికేసిందనుకుంట.. ఇప్పుడు పొడుస్తుంది" అని ఘాట్టిగా కళ్ళు మూసుకుని "దేవుడా దేవుడా" అనుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ఈలోపు ఆవిడ ఆ ప్లేస్ వదిలేసి మరో చోట రుద్ది నేను కళ్ళు తెరిచి మూసేలోపు టక్కున పొడిచేసింది! భలే నొప్పి పుట్టిందిలెండి. పోనిలే ఈ సూదులగోల అయిపొయిందని ఊపిరి పీల్చుకుంటుండగానే, ఇంత పెద్ద సిరంజి తీసుకొచ్చి "బ్లడ్ టెస్ట్ చేయాలి చెయ్యి చూయించండి మేడం" అంది! ఏడుపొచ్చేసింది నాకు. మాట్లాడే ఓపిక లేదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది.. అందుకే ఇక అడ్డు కూడా చెప్పలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాను. ఆవిడే  నా చెయ్యందుకుని మళ్ళీ కాసేపు వెదికి ఒక చోట పొడిచింది. కాని బ్లడ్ రాలేదట. గుచ్చిన సూదినే కాస్త అటు ఇటూ తిప్పింది. అరిచే ఓపిక కూడా లేదు నాకు. కళ్ళ నుండి నీళ్ళు మాత్రం జారాయి. "రాంగ్ ప్లేస్.. మరో చోట ట్రై చేస్తాను" అంటూ ఇంకొక చోట గుచ్చింది. ఈ సారి బ్లడ్ వచ్చిందిలెండి.. అదృష్టం. 4ml బ్లడ్ తీసుకుపోయింది దొంగ మొహంది. నిజంగా బ్లడ్ టెస్ట్ కి 4ml అవసరమా అండి??  

కాసేపటికి మళ్ళీ డాక్టర్ వచ్చి చూసాక నన్ను ఎమర్జెన్సీ వార్డ్ నుండి నార్మల్ రూం కి షిఫ్ట్ చేశారు. వెళ్ళాక సిస్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మింగి, ఇంజెక్ట్ చేసిన డ్రిప్స్ ఎక్కించుకుంటూ పడుకున్నాను. కాసేపటికి వినోదా ను లోపలికి రావడానికి అనుమతించారు. తను వచ్చాక "అమ్మావాళ్లకు చెప్తే కంగారు పడతారు వద్దు అంటావు గాని మరి కనీసం మీ అక్కకు, భరత్కైనా చెప్పనా? ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం మంచిది కాదు" అంది. "ఎందుకు.. కంగారు పడతారు. ఇక అక్కైతే చంటి పిల్లాడిని పెట్టుకుని ఇప్పుడు హాస్పిటల్ కి వస్తాను అంటుంది. ఉదయానికి అంతా సర్దుకుంటుంది.. అప్పుడు నిదానంగా ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. సిస్టర్స్ ఉన్నారుగా మరేం పరవాలేదు" అన్నాను. "Why don't you understand? అయినా పోయి పోయి నిన్ను అడుగుతున్నాను చూడు" అంటూ భరత్ కి, అక్క కి కాల్ చేసి చెప్పేసింది. నేను ఫోన్ తీసుకుని, "బాగానే ఉన్నాను కంగారు పడనవసరం లేదు. అమ్మకు, డాడీ కి ఇప్పుడు చెప్పొద్దు. రేపు నేనే ఫోన్ చేస్తానులే" అని చెప్పి, మరో ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, తను వచ్చి రాత్రంతా నాతో హాస్పిటల్ లో ఉంది. ఎందుకంటే వినోదా ఆ బెడ్ మీద అడ్జస్ట్ అవ్వలేదని నాకు తెలుసు.  

మరుసటి రోజు ఉదయానికి నేను అనుకున్నట్లుగానే ఆల్మోస్ట్ మాములయిపోయాను. పొద్దుపొద్దున్నే అభీ గాడిని తీసుకుని అక్క, బావా వచ్చారు. అక్క చేత అక్షింతలు వేయించుకుంటుంటే, అప్పుడే వచ్చిన వినోద కూడా నాలుగు అందుకుంది. నీరసంగా ఉన్నానని వదిలేసారు గాని లేకపోతే చెరో చెంపా వాయించివుండేవారే! ఇక నన్ను ఆ రోజు మాధ్యహ్నానికే డిశ్చార్జ్ చేసేసారు. 

ఈ ఫోటో డిశ్చార్జ్ చేసే ముందు తీసిందే.. ఇలాటి ఫోటో అరుదు కదా అందుకే తీసి దాచుకున్నా :P.  ఇంతకీ డాక్టర్ తేల్చిందేటంటే, హిమోగ్లోబిన్, ఐరన్.... .... తక్కువగా ఉన్నాయి.. బెసికల్లీ వీక్ గా ఉంది.. పాలు, ఆకు కూరలు, పళ్ళు అంటూ బాగా తినాలి.. అలాగే ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని. మా అక్కా, వినోదా ఇద్దరూ నా మీద వార్ కి దిగారు. ఇంటికి వచ్చాక మా అక్కయితే "మాయ రోగమా తినడానికి? తినమంటే కొండలు, గుట్టలు మోస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెడతావ్. సూదులు పొడిపించుకుంటుంటే బావుందా? ఇకనైనా నీకు బుద్దోస్తే బావుండు" అంటూ లెఫ్ట్, రైట్, సెంటర్ వాయించేసింది. అంతా విన్నాక నిదానంగా అన్నాను "నేను బాగానే తింటున్నానుగా అక్కా.. పాలు, పెరుగే నచ్చవు. నేనేం చేయను" అన్నాను. "పాలు, పెరుగు మాత్రామా నచ్చవు? ఒక చపాతి తినవు, నెయ్యి తినవు, ... .. ... ... ... ... ... ......... నీ వెనుకే తిరుగుతూ బలవంతంగా తినిపించడానికి ఇంకా నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇదిగో.. ఆరోగ్యం పోయాక ఇక ఏమున్నా వేస్ట్ తెలుసుకో. అయినా బుద్ధున్నదెవతయినా స్పృహ తప్పుతోంది అని తెలిసినా కొంపలో కిక్కురుమనకుండా కూర్చుంటుందా? ఒక్క కాల్ చేయొచ్చుగా? ఏమైనా అయితే? ఛీ ఛీ.. ఏమో బాబు నీ ఇష్టం" అని, ముక్కుపుటలు అదురుతుండగా మొహం అటువైపు తిప్పేసుకుంది. అభీ గాడు నన్ను, వాళ్ళమ్మను మార్చి మార్చి చూస్తూ అప్పుడప్పుడు నవ్వుతున్నాడు. నేను సారీ చెప్పి మరింకేప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేసాను. భరత్ వేయాల్సిన అక్షింతలు కాస్త అటూ ఇటుగా మిగిలిపోయాయి. అంటే.. తను ట్రైనింగ్ కోసం బెంగుళూరు వెళ్ళాడు. సో ఫోన్లో కనుక పెద్దగా పడలేదు. అదన్నమాట సంగతి! 

34 comments:

 1. మీకు ఏమయ్యిందోనని నన్ను కూడా ఖంగారు పెట్టేసారు.

  ReplyDelete
  Replies
  1. అయ్యో.. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండీ!
   ఏమీ లేదు, ముందు రోజు తినకపోవడం.. ఆ రోజేమో జ్వరము, వాంతులు. అందుకే కాస్త నీరసపడ్డాను అంతే.

   Delete
 2. నిన్న నీ లంచ్ మెను విన్న వాళ్లెవరైనా చెప్తారు నువ్వు అలా తింటే ఇలానే ఉంటావని.. టైంకి బద్ధకించకుండా తినాలి..మనం ఎప్పుడూ చెప్పుకునే మాటలే అయినా ఇంకొకసారి:P

  ReplyDelete
  Replies
  1. ఏయ్..! నిజంగా అంత బాడ్ మెనూనా చెప్పు? ఫ్రూట్స్ తిని జూస్ తాగాను. అది తక్కువేమీ కాదుగా? అయినా తినడానికి బద్ధకం కాదు చిన్నీ.. ఎందుకో ఒక్కదాన్నే ఉంటే మాత్రం తినబుద్ధి కాదు.

   అన్నట్లు డార్లింగ్.. మనం ఎప్పుడూ చెప్పుకునే మాటలు కాదు. నేను ఎల్లప్పుడూ, నువ్వు అప్పుడప్పుడు చెప్పే మాటలు ;) లంచ్ ఒక్కటేగా నువ్వు తిన్నగా తినేది?

   Delete
 3. Anonymous14/6/13

  bagundandi!! mari ippatikina full ga set iyyara!! take good care of your health!!

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అండీ! ఇప్పుడు బావున్నాను. తప్పకుండా కేర్ తీసుకుంటాను :)

   Delete
 4. ముందు ఆ ఫోటో చూసి చాల కంగారుపడిపోయాను ప్రియగారు. పోస్ట్ మొత్తం చదివాక మీ మీద కోపమొస్తుంది. మీ అక్కయ్య చెప్పింది అక్షరాల నిజం. Please take care of your health.

  ReplyDelete
  Replies
  1. అయ్యో.. శ్రీ లత గారూ, మీరు మరీ నన్ను అపార్దం చేసుకుని కోపగించుకోకండీ. మా అక్క ఏదో నా మీద ప్రేమ కొద్దీ బాధలో అస్సలు నేనేమీ తిననట్లు మాట్లాడింది. నిజానికి నేను చక్కగానే తింటాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు :)

   Delete
 5. Madhumitha14/6/13

  Too much అండి మీరు. ఆ ఇంజక్షన్ పార్ట్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నిద్ర కూడా మర్చిపోయి రాత్రంతా మీ బ్లాగ్‌లోని పోస్ట్లన్నీ చదివేశా. ప్రతి విషయాన్నీ మీరు బలే నిశితంగా పరిశీలిస్తారే? మండుటెండ కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది మీ మాటల్లో. Nice blog. I enjoyed reading it. By the way get well soon.

  ReplyDelete
  Replies
  1. మధుమిత గారూ.. మీ వాఖ్యకూ, ప్రశంశకూ చాలా కృతజ్ఞతలండీ :)

   Delete
 6. Anonymous14/6/13

  తిండి కలిగితె కండ కలదోయ్! కండ కలవాడేను మనిషోయ్!! :)

  ReplyDelete
  Replies
  1. నిజమే తాతగారూ! మీకు తెలుసా నాకూ కండలున్నాయి :) :)

   Thanks for the comment.

   Delete
 7. ప్రతి ఇంట్లో ఒక్కరైనా మీలాగే తిండి విషయంలో నిర్లక్షంగా ఉంటారు లెండీ. ...దానికి ఎవ్వరం ఏం చేయలేం..జాలి పడటం తప్పా...anyway take care and get well soon

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారూ.. నేను ఆహారాన్ని నిర్లక్ష్యం చేసే టైప్ కాదండీ. ఎప్పుడైనా ఒక్కసారి తినబుద్ధి కాక "ఆ తినొచ్చులే" అని వాయిదాలు వేస్తూ ఉంటాను అంతే.

   అనవసరంగా పోస్ట్ రాశానేమో అనిపిస్తోంది. Anyway.. thanks for the comment.

   Delete
 8. చాట్‌లో పలుకరిస్తూ.. ఎలా వున్నావురా అంటే..?

  ఎలా ఉన్నాను అన్న దానికి రేపు సమాధానం చెబుతా అన్నావు... సమాధానం ఇదన్నమాట.

  ముందు ఆ ఫొటో చూడగానే కంగారేసేసింది. తీరా చదివాక కోపం వస్తోంది. తిండి విషయంలో ఇంత బద్దకిస్టువని నాకిప్పటిదాకా తెలీదు సుమీ...

  అక్క కాదు.. మరెవరైనా సరే ఇలాగే చివాట్లు పెట్టేస్తారు...

  ఎలాగైతేనేం కోలుకున్నావుగా.. ఇంకెప్పుడూ ఇలా చేయకేం... ఇకపై అలా ఉండమన్నా ఉండవు... నరం దొరక్క ఇబ్బంది పడిన సందర్భం గుర్తు వస్తే ఇంకెప్పుడూ తినకుండా ఉండవులే. నిజంగా నరం దొరకలేదని చెబుతూ రాసినది చదువుతుంటే నిజ్జంగా చాలా చాలా బాధగా అనిపించింది.

  నేనూ ఒంటరిగా ఉంటే తినలేను.. కానీ పూర్తిగా తినకుండా మాత్రం ఉండను... ఈ పోస్ట్ చూస్తుంటే తప్పకుండా కడుపునిండా తినాలి అని తీర్మానం చేసేసుకున్నాను.

  ఒంట్లో బాలేక పోస్ట్ పెడితే.. ఇలా అందరూ చివాట్లు పెట్టేస్తున్నారని దిగులుపడకు ప్రియా... అందరూ నీ మంచి కోసమే కదా చెబుతోంది...

  ఇంతమంది ప్రేమగా మందలిస్తున్నారంటే... నీపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకుంటావుగా... :)

  ReplyDelete
  Replies
  1. అయ్యో.. మీరందరూ ఎందుకిలా అపార్దం చేసుకుంటున్నారో నాకు అర్ధంకావడం లేదు. ఒక్కదాన్ని ఉన్నపుడు ఆహారాన్ని అశ్రద్ధ చేస్తానన్నమాట నిజం. దానికి తోడు జ్వరం కూడా రావడంతో మొన్న ఇబ్బందిపడాల్సి వచ్చింది. కాని ఆ మరుసటి రోజుకే నేను పూర్తిగా కోలుకున్నాను. అంతేకాని ఆరోగ్యం విషయంలో నేను ఎలాటి ఛాన్స్ తీసుకోను. ప్రతి మనిషికీ ఒక్కో బలహీనత ఉంటుంది. నా బలహీనత ఒంటరిగా ఉన్నపుడు ఆహారాన్ని అశ్రద్ధ చేయడం. ఈ అలవాటుని మార్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను.

   అన్ని రాగాలలానే ఈ రాగాన్నీ మీతో పంచుకున్నాను. అంతేగాని జాలి కోసమో మరొకటో కాదని అర్ధం చేసుకోగలరు. అయినా సరే.. ప్రేమతో/అభిమానంతో నన్ను మందలించిన మీకు, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను :)

   Delete
 9. అయ్యో చిన్న నీరసం హాస్పిటల్ దాకా లాక్కెళ్ళిందనమాట.
  ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడి ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు స్ఫురించకపోదు.
  Hope you feel better now!

  ReplyDelete
  Replies
  1. అవునండీ. నిజమే.. ఆరోగ్యం నిజంగానే మాహాభాగ్యం పండు గారు. క్షణమైనా కుదురుగా కూర్చోని నన్ను రోజంతా మంచం మీద కుదేసింది! ఇప్పుడు యధా మామూలండీ... దుక్క ముక్కలా ఉన్నాను :)

   Thanks for the comment!

   Delete
 10. ఫోటోతో ఖంగారుపెట్టేశారండీ. ఇపుడు క్షేమమేనని తెలుసుకుని సంతోషించాను. మీరు మరీ టూమచ్ అండీ తినాలని అనిపించకపోయినా మరీ ఇలా పడిపోయేదాక ఎలా వదిలేశారండీ. అసలు ఇది అరుదైన సంధర్బమంటూ అలా చేతిని ఫోటోతీసి పెట్టడం చూస్తే నవ్వూ కోపం రెండూ కలిసొస్తున్నాయ్ :) ముందు ముందు మరీ ఇంత అశ్రద్దచేయకండి.

  ReplyDelete
  Replies
  1. అమ్మోయ్.. అస్సలు అశ్రద్ధ చేయను. బుద్దోచ్చేసింది :) అయినా మాములుగా అయితే అంత సీరియస్ అయుండేది కాదు వేణూ గారూ. మాయదారి జ్వరం, వాంతుల వలనే అంత దూరం వెళ్ళింది. ఇక ఆ ఫోటో సంగతికొస్తే.. :P హహ్హహహ్హ.. ఓపెన్ గా చెప్పాలంటే మా అక్క "ఒసేయ్ పిచ్చి ముండ. ఇంత వెర్రిదానివేంటే నువ్వు? ఖర్మ!" అంది.

   Delete
 11. Hey crazy girl, don't know what you say !! My goodness photo too devudaa !!!!!!!!!
  Take good care Priya !

  ReplyDelete
  Replies
  1. You know what, I'm feeling a bit shy to reply to your comment. అందుకే కామెంట్ నిన్ననే పబ్లిష్ చేసాను కాని రిప్లై ఇవ్వలేదు. Especially after reading these lines.. "My goodness photo too devudaa !!!!!!!!!", I really don't understand what to say :)

   So, finally I've decided to say.. "Sure, darling. I'll take care. Thanks for the comment".

   Delete
  2. హ హ అది తిట్టడం కాదు :-) తినకపోవటం తప్పే దాని కన్నా , కళ్ళు తిరిగి అలా అవుతుంటే ఎవరికీ చెప్పకుండా అలా ఒంటరి ఉండటం అనేది నిజంగా మంచి పని కాదు . ఎనీవే అంతా మంచిగానే ఉంది కదా ఇప్పుడు హాప్పీస్ !

   Delete
  3. హహ్హహ.. నిజమే కాసేపటికి సర్దుకుంటుందిలే ఈ మాత్రం దానికి పక్క వాళ్ళను కంగారు పెట్టడం దేనికీ అనుకున్నాను కాని సిట్యువేషన్ అంత క్రిటికల్ గా ఉందని రియలైజ్ అవ్వలేదు. అవును భగవంతుని దయవల్ల అంతా మంచిగానే సాగింది. ఇప్పుడు ఆల్ హాప్పీస్ :)

   Delete
 12. Anonymous14/6/13

  ఒక్కదాన్నీ తినడం ఎలాగా అనుకోవద్దు. బ్లాగ్లోకం లోకి వచ్చేసి మమ్మల్ని చూస్తూ(చదువుతూ) తినడమే. మీ "అనూ" బదులు నేను కేకలేస్తున్నాను. ఇంకోసారి ఇలా చేయొద్దు... అందరినీ ఖంగారు పెట్టొద్దు.

  ReplyDelete
  Replies
  1. మీరిచ్చిన ఐడియా ఏదో బావుంది అనూ గారూ.. ఫాలో అయిపోతాను! బాబోయ్.. ఇంకొక్కసారి ఇలా చేసే ఆశక్తి, ఓపికా రెండూ లేవండి బాబు. బాగా బుద్దోచ్చేసింది :)

   Delete
 13. శ్రేయోభిలాషులకు అప్రియమయిన సత్యం నుడివి ప్రియ ఎన్నో మందలింపులు చీవాట్లు కోప్పడడాలు కడుపునిండా తిన్నారు!ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలాంటి రిస్కులు తీసుకోవడం అప్పుడప్పుడు పెనుప్రమాదానికి దారితీయవచ్చునని చదువరులంతా గుణపాటం నేర్చుకోవడానికి కనువిప్పు కాగలదు మీ టపా!అంత కష్టంలోనూ మీ నరం దొరక్క గుచ్చిగుచ్చి చూడడంలో మీకు తెలియకుండానే కించిత్ హాస్యమ్ కూడా పండించారు!

  ReplyDelete
  Replies
  1. అవునండీ.. బాగా తిన్నాను. తినీ తినీ కడుపునొప్పి కూడా వచ్చింది!
   కాని మీరన్నది నిజమే. తెలిసో, తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయి. పోనీలెండి నా అనుభవాన్ని చూసి ఏవైనా ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటారు అంటే నాకు అంతకన్నా కావలిసిందేముంది?

   మీ వాఖ్యకు చాలా కృతజ్ఞతలు. వస్తూ ఉండండి :)

   Delete
 14. అంత మొండితనం కూడదండీ బాబూ. కాస్త కళ్ళు తిరుగుతున్నాయనగానే త్వరగా తినటమో ఎవరికైనా ఫోన్ చెయ్యడమో చెయ్యాల్సింది.

  ఈసారి నుండీ ఒక్కరే ఉండి వండుకోవాల్సి వస్తే "నేను ఈరోజు ఇది వండుకుతింటున్నా" అని ఒక పోస్ట్ ఫోటోలతో సహా మాకోసం వెయ్యండి. పుణ్యం, పురుషార్ధం కలిసొస్తాయి.

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహ.. భలేవారే మీరు!
   సరే.. కచ్చితంగా ఈ సారి అలాగే చేస్తానులెండి. పుణ్యం కోసం కాకపోయినా శ్రేయోభిలాషులు మీరు చెప్పినందుకు :)

   Delete
 15. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోండి. అసలే తొందరలో పెళ్లి అంటున్నారు. పెళ్లి ఫొటోస్ బాగా రావాలంటే, ఫొటోస్ లో మీ అను కంటే మీరు బాగా గ్లామర్ గా పడాలంటే చూస్కోండి మరి.

  అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా పండింది (ఇంజక్షన్ దగ్గర).

  టపాలన్ని చదివి మళ్లీ కామెంటుతా.

  ReplyDelete
  Replies
  1. ఇంజక్షన్ దగ్గర కామెడీయాహ్..? హహ్హహ్హహ్హ...

   నిజమే ప్రవీణ్ గారు.. టైం కి తినేసి హాయిగా బజ్జుకుందామని నిర్ణయం తీసేసుకుని ఫాలో కూడా అయిపోతున్నాను. ఇక మీరు అన్న పెళ్లి ఫోటోలు.. నా గ్లామర్ కి తిండి నిద్రా పెద్దగా అవసరం లేదండి అనూ ఎలాగూ నా పక్కనే ఉంటాడుగా సో ఆటోమేటిక్ గా తన్నుకొచ్చేస్తుంది :D

   మీరు చాలా మంచి వారు సుమండీ.. ఓపిగ్గా చదివి కామెంట్లు పెడుతున్నారు! థాంక్ యూ... థాంక్ యు :)

   Delete
 16. Ee post elaa missayyanabbaa...
  Ilaa vanta chesetappudooo, hospital lo join ayinappudoo photolu tiyyadam emitooo :)
  Hihihihi

  Food vishayam lo meeru nannu adarsham gaa teesukovaalani adesistunnaanu
  Get well soon

  ReplyDelete
  Replies
  1. << Ilaa vanta chesetappudooo, hospital lo join ayinappudoo photolu tiyyadam emitooo :)
   Hihihihi >> :P :)

   మీ ఆదేశాన్ని శిరసావహిస్తున్నానని బ్లాగ్ముఖంగా చిరునవ్వుతో తెలుపుకుంటున్నాను :)
   Thank you.   Delete