Monday, June 17, 2013

నాన్న పరిచయం చేసిన మరో ప్రపంచం!

ఇందాక అనూ గారి బ్లాగ్లో వాళ్ళబ్బాయి పుస్తక పఠనం గురించి చదివాను. మా డాడీ కూడా నా చిన్నప్పుడు చాలా వర్రీ అయ్యేవారు నాకు పుస్తకాల మీద అస్సలు ఆశక్తి లేదని. ఇందాక ఆవిడ పోస్ట్ చదువుతుంటే నాకా విషయాలు గుర్తొచ్చాయి. దానికి సంబంధించినదే ఈ పోస్ట్. 

మా అక్క బాగానే చదివేది. నేను  స్కూల్ బుక్స్ అయితే తప్పదు కనుక విధిగా చదివేదాన్ని కాని, మరే పుస్తకమయినా చదవమంటే మాత్రం చేదు తిన్నట్లుగా మొహం పెట్టేదాన్ని! మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం.. లాటి  పనులు నాన్న నేర్పినపుడు ఎంతో ఆశక్తిగా నేర్చుకుని వాటి మీద మమకారాన్ని పెంచుకుని  శ్రద్ధగా చేసేదాన్ని. కాని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బలవంతం చేసినా  పుస్తకం మీదకు మాత్రం మనసు వెళ్ళేది కాదు. నాకు డాన్స్,  సంగీతం, ఆటలు..  ఎంతసేపూ వీటి మీదే  ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని డాడీ ఆయా క్లాసెస్ లో చేర్పించారు. స్కూల్ అయిపోయాక ఒక రోజు సాయంత్రం భరతనాట్యం, మరో రోజు వెస్టర్న్ డాన్స్, రోజు విడిచి రోజు ఉదయం స్కూల్ కి వెళ్ళే ముందు గంటసేపు సంగీతం క్లాస్. అలాగీ ప్రతి శని వారం డాడీ తో బాట్మింటన్ కోర్ట్ కి వెళ్లి ఆటలయ్యాక అటునుండి అటు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేదాన్ని

"అత్తగారు పక్కనలేని లోటు తీర్చడానికే నువ్వు పుట్టావే" అంటూ అమ్మ విసుక్కున్నా, "నువ్వు నాకే చెల్లిగా ఎందుకు పుట్టావే?" అని అక్క బాధపడినా, "ఏయ్.. మస్కిటో డిస్టర్బ్ చేయకు" అని డాడీ కసురుకున్నా.. మొత్తానికి మంచి పిల్లననే మరుసుకునేవారు! కాని డాడీ కి మాత్రం నేను పుస్తకాలు చదవడానికి ఇష్టపడకపోవడం వలన ఎంతో కోల్పోతున్నానని చాలా దిగులుగా ఉండేది. 

మా డాడీ కు పుస్తకాలంటే మహా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా వీలు కలుగజేసుకుని మరీ పుస్తక ప్రపంచంలో మునిగిపోతారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంచే మంచి మిత్రులని చెప్తుంటారు. నాకు పుస్తకాల మీద ఆశక్తి కలిగించడానికి నానా పాట్లు పడేవారు. అందులో భాగంగానే, ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినపుడు నాకు ఇష్టమైన బొమ్మలు మారు మాట్లాడకుండా  కొనిపెట్టేవారు. ఇంటికి వెళ్ళేడపుడు ధగ ధగ మెరిసిపోతున్న మొహంతో "థాంక్స్ డాడీ" అని చెప్పేదాన్ని. దానికి ఆయన డ్రైవింగ్ సీట్ లో నుండి కాస్త పక్కకు వంగి బుగ్గ చూయించేవారు.. నేను ముద్దు పెట్టేదాన్ని (ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంతే అనుకోండీ). వెంటనే ఆయన "చూడు. డాడీ నీకు ఇష్టమైంది చేసారు కదా.. ఇప్పుడు నువ్వు డాడీ కి ఇష్టమైంది చెయ్యాలి. సరేనా?" అనేవారు. నాకు వెంటనే సీన్ అర్ధమై మొహంలోధగ ధగలన్నీ వెలవెలబోయేవి :P. విషయమేంటంటే.. వారంలోపు ఏదో ఒక బుక్ చదివి నాన్నకు ఆ కథ చెప్పాలి. అదన్నమాట సంగతి. వెంటనే మొహం ముప్పై మూడు వంకరలు తిప్పేసి ఎన్నికల ముందు రాజకీయ నాయకులు చేసినట్లు "ఓహ్ ష్యూర్.. వై నాట్? రేపు మీకు రెండు కథలు వినిపిస్తాను " అంటూ లక్షణంగా ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేసేదాన్ని. నేను మాట మీద నిలబడే మనిషినండోయ్.. మరుసటి రోజు నిజంగానే కథలు చెప్పేదాన్ని.  హోం వర్క్ ఎక్కువ ఉందనీ, భరతనాట్యం టీచర్ కష్టమైన స్టెప్ నేర్పి రేపు చూస్తానన్నారనీ.. పోనీ నిద్రపోయే ముందు కొన్ని పేజీలయినా చదివి వినిపిద్దాం అంటే బాగా నిద్రొస్తోందనీ.. రేపు తప్పక చెబుతాననీ.. మా నాన్నకు విసుగొచ్చి అడగడం ఆపేవరకు రోజుకో కథ చెప్పేదాన్ని :P  

సడన్గా ఓ సండే మా డాడీ ఓ రోజు నాకో బంపరాఫర్ ఇచ్చారు ఒక షరతుతో. "షాపింగ్ కి వెళదాం పద. ప్రైస్ ఎంతైనా ఒకే. కాని రెండిటిని మించి కొనకూడదు" అని. తెలియనిదేముంది.. మనకు షాపింగ్ అంటే పిచ్చి కదా.. క్షణం ఆలశ్యం చేయకుండా ఎగురుకుంటూ వెంట వెళ్ళాను. తీరా చూస్తే నన్ను తీసుకెళ్ళింది "Landmark" కి! It's a complete book store :(. ఆయనకు ఏమైనా కావాలేమో.. ఇది అయిపోయాక తీసుకేళతారు అనుకుని కొంతలో కొంత సర్దుకున్నాను. ఈలోపు డాడీ "ఏంటి అలా నిలబడ్డావ్? Come on... go ahead" అన్నారు. ఫ్యూజ్ పోయింది నాకు. తెల్ల మొహం వేసుకుని అటు ఇటు తిరిగాను. అసలు ఆ పుస్తకాలు చూస్తేనే భయం వేసింది. "ఊ.. ఊ..  ఊ ఊ అసలే అమ్మ కూడా రాలేదు :(" ఎంచక్కా అమ్మయితే "చంటిదాన్ని ఎందుకు అలా పుస్తకాలు పుస్తకాలు అని భయపెడతావ్? రోజంతా స్కూల్లో చదివీ, నువ్వు చేర్పించిన క్లాసులన్నీ ముంగించుకుని  ఏదో కాసేపు కుదురుగా కుర్చుందామనుకుంటే పుస్తకాలని మళ్ళీ దాన్ని బెదరేస్తున్నావ్. అదెంతా దాని వయసెంత? పుస్తకాలకు జడిసి అది తిండి కూడా సరిగా తినడంలేదు" అని గుక్క తిప్పుకోకుండా వాదించేసి డాడీకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నన్ను తీసుకుని అక్కడి నుండి నిష్క్రమిస్తుంది. అమ్మ గుర్తు రాగానే "పోనీలే ఇంట్లో అమ్మ ఉంటుందిగా.. తప్పించుకోవచ్చు" అని ధైర్యంగా కంటికి నచ్చిన బుక్ ఏదో కొన్నాను. కాని నా ప్లాన్ వర్క్అవుట్ అవ్వలేదు. "మరి డబ్బు పెట్టి కొన్నదెందుకూ? అదేగా కొనుక్కుంది.. అంతవరకైనా చదివి తీరాల్సిందే" అని పట్టుబట్టారుఅది చదివి ముగించే వరకూ.. గారం గీరం జాంతానై. మొహం మీద సీరియస్ మాస్క్ వేసుకుని తిరిగారు నాతో. చచ్చినట్టు నెల రోజుల్లో కష్టపడి కంప్లీట్ చేసాను.  ఈ కింద ఫోటోలో కనిపించే పుస్తకమే అది.     ఆ తరువాత రాత్రి నిద్రపోయే ముందు.. నాన్నో, అక్కో లేక అమ్మో చదివి వినిపించే గుడ్ నైట్ స్టోరిలు తప్ప మళ్ళీ పుస్తకాల జోలికి వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి నుండీ నన్ను బాధపెట్టినవైనా, సంతోషపెట్టిన సందర్భాలయినా రాసుకోవడం అలవాటు. అలాగే ఓ రోజు నేను రాసుకుంటుండగా డాడీ వచ్చి "ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నది చదువుకోవడం నీకిష్టమేనా?" అని అడిగారు. "ఓ.. బావుంటాయిగా" అని బదులిచ్చాను. "ఎందుకు బావుంటాయి?" అనడిగారు. "ఎందుకంటే అవి.. అవి.. అవి నాకు ఇష్టమైన జ్ఞాపకాలు" అని చెప్పాను. దానికి ఆయన "నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలా రాసుకుంటూ ఉండుండొచ్చు కదా? అవి నీకు దొరికితే చదవడం ఇష్టమేనా?" అని అడిగారు మళ్ళీ. "యాహ్. ఇంట్రెస్టింగ్ గా  ఉంటాయి కదా" అన్నాను. డాడీ వెంటనే "ఎక్షాక్ట్లి! నీ ఫ్రెండ్ డైరీ, అది తన పర్సనల్. You can't read it. కాని కొంతమంది ఏం చేస్తున్నారంటే తాము రాసుకున్న వాటిని నలుగురూ చదివేందుకు అనుమతించి మార్కెట్ లో పెడుతున్నారు. డబ్బులు పెట్టి మరీ కొంటున్నారంటే.. వాటికి వేల్యూ ఉండి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే కదా అర్ధం? నువ్వు రాసేది ఆల్రెడీ నువ్వు ఎక్ష్పీరియన్స్ చేసిన విషయాలు. అవి మళ్ళీ చదివితేనే నీకు ఆనందంగా అనిపించినపుడు.. ఎదుటి వ్యక్తి ఎక్ష్పీరియన్స్ ని అతని రాతల్లో చదువుతూ నీకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏదో తెలుసుకున్నామని ఆనందంగా కూడా ఉంటుంది కదా..??" అన్నారు. ఏ మూడ్ లో ఉన్నానో కానీ అలా సూటిగా మనసుని తాకాయి ఆ మాటలు. 

పుస్తకాల మీద ఉన్న బెరుకు పోయి, వాటికి మెదడులో నేను రాసిపెట్టుకున్న డెఫినిషన్ మారిపోయింది! నిదానంగా చదవడం మొదలుపెట్టాను. నాకు చదవాలనిపించే బుక్స్ సెలెక్ట్ చేసుకోవడంలో డాడీ సహాయపడేవారు. ఇదిలా సాగుతుండగా నా 15th బర్త్ డే కి వినోదా (నా హాస్పిటల్ తిప్పల్లో చెప్పాగా..) ఈ కింద ఫోటోలో ఉన్న బుక్ ప్రెసెంట్ చేసింది. 

Google image

I really liked it. ఆ తరువాత నేను దాచుకున్న డబ్బులతో ఒక్క దాన్నే వెళ్లి ఈ బుక్ కొనుక్కున్నాను.

Google image

ఇది చదివిన తరువాత, I completely fell in love with books. కొన్ని రోజులకు పుస్తకాల పట్ల నాకు ఎంత మమకారం పెరిగిపోయిందంటే.. కొత్త బట్టలు సహితం బయటకు తీసేసి నా బీరువా నిండుగా పుస్తకాలు పేర్చుకునేంతగా! ఎక్కడకు వెళ్ళినా ఏదో ఒక బుక్ హ్యాండ్ బాగ్ లో పెట్టుకెళ్లడం, స్నేహితులు "ఒక్క సారి ఈ బుక్ ఇవ్వవా.. చదివి ఇచ్చేస్తాను" అంటే ఏదో నా ప్రాణాన్ని అడిగినట్లు బెదిరిపోవడం.. ఎవరైనా పుస్తకాలను రఫ్ గా హేండిల్ చేస్తే అడ్డమైన తిట్లు తిట్టుకోవడం లాటివి యధామామూలయిపోయాయి. ఇప్పుడు పుస్తకాలు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే చిరాగ్గా (భయంగా) ఉంది. 

ఇంత చక్కటి ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినందుకు పుష్తకం పట్టుకున్న ప్రతిసారీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను మనసులో.  

అలా మా అక్క పుణ్యమా అని పెయింటింగ్, నాన్న పుణ్యమా అని పుస్తకాలు తెలుసుకోగలిగాను. ఇవి చూసి మా అమ్మ ఎప్పటికైనా నాకు పాలు అలవాటు చేయాలని ఇప్పటికీ నా చుట్టూ తిరుగుతూనే ఉంది.. నేనూ మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. త్వరగా ఈ గోల కూడా వదిలిపోతే బావుండు!

21 comments:

శోభ said...

పెద్ద పోస్ట్ కదా ప్రియా... చదువుతున్నాను...

హమ్మయ్యా... మొదటి కామెంట్ నాదే.... :)

Priya said...

హహ్హహ.. how sweet you are?!!!!
Thanks for the comment, Shobha gaaru :)

శోభ said...

అత్తగారు పక్కన లేని లోటు తీర్చేందుకు నువ్వు పుట్టావే... అని అమ్మ
నువ్వు నాకే చెల్లిగా ఎందుకు పుట్టావే అని అక్క
మస్కిటో అని ప్రేమగా కసిరే నాన్న...

ప్రియమ్మ ఎంత మంచమ్మాయో... వాళ్లకి తెలిస్తేగా... పోన్లే పాపం... :)

ఓహ్ ష్యూర్.. వై నాట్? రేపు మీకు రెండు కథలు వినిపిస్తాను.. రాజకీయ నాయకుల్లా వాగ్ధానాలు...

రాజకీయ నాయకుల్లాగా కాకుండా.. మాట నిలబెట్టుకుంటూ... నిజ్జంగా కథలు చెప్పావా.. గ్రేట్.. గ్రేట్... :)

మొత్తానికి పుస్తకాలపై బెరుకుపోయి.. డెఫినిషన్ మారిపోవడం.. దానికి దోహదం చేసిన విషయాలు... హత్తుకునేలా ఉన్నాయి.

ముఖ్యంగా... బీరువా నిండా కొత్త బట్టలకంటే, పుస్తకాలుంచుకునేందుకు ఇష్టపడటం.. ఎవరైనా పుస్తకం అడిగితే ప్రాణాన్నే అడిగినట్లుగా ఫీలవడం, పుస్తకాల్ని జాగ్రత్తగా చూసుకోలేనివాళ్లని తిట్టుకోడం... పుస్తకాలు లేని జీవితం చిరాగ్గా ఉంటుందనడం... నిజ్జంగా ఎంత బాగా నచ్చాయో, ఎంతగా మనసుని తాకాయో చెప్పలేను.

ఇంత మంచి ప్రపంచాన్ని పరిచయం చేసినందుకు నాన్నగారికి కృతజ్ఞతలు. మా అందరి తరపున కూడా...

నాన్న కోర్కె తీర్చావు.. మరి అమ్మ కోర్కెనూ తీర్చరాదూ... ఓ పనై పోతుందిగా... :) :) :)

Anonymous said...

కబుర్ల పోగే అనుకున్నా పుస్తకాల పురుగుకుడానా? :)

Priya said...

<> కదా..! అర్ధం చేసుకోవడంలేదు శోభ గారు :P

అమ్మ కోర్కె తీర్చానంటే ఓ పని కాదు, "నా" పని అయిపోతుంది :)

Thanks for the lovely comment.

Priya said...

హహ్హహ్హా.. కొంత వరకూ అవుననే చెప్పుకోవచ్చు తాతగారూ :)
Thank you very much for the comment.

చిన్ని ఆశ said...

బాగుంది. నాన్న, అక్కల ప్రోద్బలం వల్ల రెండు మంచి అలవాట్లు అలవరచుకున్నారు.
ఇక ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారేమో కదూ ఎప్పటికీ?
అదేనండీ, పాలు అలవాటు చేసుకునే ప్రాయం దాటిపోయిందేమో అని ;)

Priya said...

నిజమే పండు గారు. వాళ్ళిద్దరికీ నేనెప్పుడూ ఋణపడి ఉంటాను.
పాలు అలవాటు చేసుకునే ప్రాయం దాటిపోయిందని అందరూ గ్రహిస్తున్నారు.. మా నాన్న గారితో సహా. కాని మా అమ్మ మాత్రం పట్టువదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తోంది!! పెళ్లై అత్తగారింటికి వెళ్ళినా ఇల్లు మారుతుంది కాని ఇంటి చుట్టూ తిరగడం అనేది మాత్రం ఆగదు :(

Anonymous said...

భలేగా రాసారు ప్రియా. ఇందాక నా వ్యాఖ్యలు మా వాడికి వినిపించాను. బాగా ఆడుకుని వచ్చి మరి ఏం ఆలోచించాడో కానీ, నా గురించి మటుకు బ్లాగుల్లో రాయకు అని సీరియస్సుగా చెప్పేసి, పొద్దున పేపర్ అతనితో తెప్పించిన 'బాలభారతం' పుస్తకం చదువుతున్నాడు. మీరు రాసిన టపా గురించి అనగానే నా గురించి అంతా చెపుతున్నావా అని గోల పెడుతున్నాడు. రాయనీయడంలా.

Anonymous said...

I told my son about 'Great Expectations' just now showing ur blog n he immediately remembered 'Oliver Twist', by Charles Dickens. I gave him long back. I'm very happy for ur blog made him rmbr n thx to all the blogs. Many thanks Priyaaaaaa

MURALI said...

నిజంగా పుస్తకాలు చదవని వాళ్ళు ఏదో కోల్పోతున్నారని నాకనిపిస్తుంది. అందుకే ఎంతోమందికి బలవంతంగా పుస్తకాలు చదివే అలవాటు చేసాను. అప్పటికీ నేనే పుస్తకాలు కొనిచ్చినా నా బాధ పడలేకన్నట్టు చదివేవారు. వాళ్ళల్లో కొందరైనా కంటిన్యూ చెయ్యకపోతారా అని ఆశ.

Priya said...

:) నిజానికి నేనే మీకు థాంక్స్ చెప్పాలి. మీ పోస్ట్ పుణ్యమాని ఈ విషయాలన్నీ అందరితో పంచుకున్నాను. ముందు జస్ట్ కామెంటే రాసాను గాని ఆఖరున చూడబోతే అది ఓ చిన్న సైజ్ పోస్ట్ లా కనబడింది.. స్టిల్ బోలెడు విషయాలు మిగిలిపోయాయి. అందుకే ఇక పోస్టే రాసేశాను :P

Priya said...

థాంక్స్ అనూ గారు. ఆ వయసే అలాటిదిలెండి.. మీ అబ్బాయి ఇంకా చాలా మంచోడిలా ఉన్నాడు. సీరియస్సుగా చెప్పి ఊరుకున్నాడు! అదే నేనైతే ఇల్లు పీకి పందిరేద్దును :D

Priya said...

పుస్తకాలు చదవని వారు ఏదో కోల్పోవడం కాదు మురళీ గారూ.. ఎంతో కోల్పోతున్నారు. మీ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను :)

Anonymous said...

అత్తగారు పక్కన లేని లోటు తీర్చేందుకు నువ్వు పుట్టావే... అని అమ్మ.. baagundandi.. chaala baaga express chesaru .... mee post chaduvutu unte.. naaku kuda full ga interest vachhi oka book konesi.. 1-2 days lo full ga chadiveyyali anipistundi.....

Priya said...

చాలా థాంక్స్ అండీ. "చాలా బాగా ఎక్ష్ప్రెస్ చేశారు" అన్న మాట కంటే, "మీ పోస్ట్ చదువుతూ ఉంటే నాక్కూడా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఏదో ఒక బుక్ చదివేయాలని ఉంది" అన్నారు చూడండి. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. చాలా సంతోషంగా ఉంది. మీరు చదవడానికి ఎంచుకునే పుస్తకం బాగా పరిశీలించి ఎంచుకోండి. ఎందుకంటే చదివే మొదటి పుస్తకం బోర్ గా అనిపిస్తే మళ్ళీ పుస్తకాల వైపు చూడ్డానికి చాలా టైం పడుతుంది (స్వంత అనుభవం) :)

Anonymous said...

Hmmm...Priya garu meeru kuda na laage pusthaka purugaa ithe...nice andi...annattu mi amma gari korika theerchadam chala easy andi kallu muskoni noti ninda okesari palu poskoni mingeyandi...nenu roju ade chestha...:P

Anonymous said...

annattu marchi poyanandi...waiting for 'na premayanam part7....twaraga rayandii...

Priya said...

అవునా.. చాలా సంతోషమండీ :)
మీరెన్నైనా చెప్పండీ.. పాలు తాగడం మాత్రం నాకీ జన్మలో అలవడేట్టు లేదు. మీరు కనీసం ఎలాగోలా తాగుతున్నానంటున్నారుగా.. అభినందనలు అయితే.

పార్ట్ 7 ఈ వీకెండ్ లోపు పబ్లిష్ చేస్తానండీ.

Anonymous said...

your dad's explanation is too good

Priya said...

కదండీ.. Thank you and welcome to my blog :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Monday, June 17, 2013

నాన్న పరిచయం చేసిన మరో ప్రపంచం!

ఇందాక అనూ గారి బ్లాగ్లో వాళ్ళబ్బాయి పుస్తక పఠనం గురించి చదివాను. మా డాడీ కూడా నా చిన్నప్పుడు చాలా వర్రీ అయ్యేవారు నాకు పుస్తకాల మీద అస్సలు ఆశక్తి లేదని. ఇందాక ఆవిడ పోస్ట్ చదువుతుంటే నాకా విషయాలు గుర్తొచ్చాయి. దానికి సంబంధించినదే ఈ పోస్ట్. 

మా అక్క బాగానే చదివేది. నేను  స్కూల్ బుక్స్ అయితే తప్పదు కనుక విధిగా చదివేదాన్ని కాని, మరే పుస్తకమయినా చదవమంటే మాత్రం చేదు తిన్నట్లుగా మొహం పెట్టేదాన్ని! మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం.. లాటి  పనులు నాన్న నేర్పినపుడు ఎంతో ఆశక్తిగా నేర్చుకుని వాటి మీద మమకారాన్ని పెంచుకుని  శ్రద్ధగా చేసేదాన్ని. కాని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బలవంతం చేసినా  పుస్తకం మీదకు మాత్రం మనసు వెళ్ళేది కాదు. నాకు డాన్స్,  సంగీతం, ఆటలు..  ఎంతసేపూ వీటి మీదే  ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని డాడీ ఆయా క్లాసెస్ లో చేర్పించారు. స్కూల్ అయిపోయాక ఒక రోజు సాయంత్రం భరతనాట్యం, మరో రోజు వెస్టర్న్ డాన్స్, రోజు విడిచి రోజు ఉదయం స్కూల్ కి వెళ్ళే ముందు గంటసేపు సంగీతం క్లాస్. అలాగీ ప్రతి శని వారం డాడీ తో బాట్మింటన్ కోర్ట్ కి వెళ్లి ఆటలయ్యాక అటునుండి అటు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేదాన్ని

"అత్తగారు పక్కనలేని లోటు తీర్చడానికే నువ్వు పుట్టావే" అంటూ అమ్మ విసుక్కున్నా, "నువ్వు నాకే చెల్లిగా ఎందుకు పుట్టావే?" అని అక్క బాధపడినా, "ఏయ్.. మస్కిటో డిస్టర్బ్ చేయకు" అని డాడీ కసురుకున్నా.. మొత్తానికి మంచి పిల్లననే మరుసుకునేవారు! కాని డాడీ కి మాత్రం నేను పుస్తకాలు చదవడానికి ఇష్టపడకపోవడం వలన ఎంతో కోల్పోతున్నానని చాలా దిగులుగా ఉండేది. 

మా డాడీ కు పుస్తకాలంటే మహా ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా వీలు కలుగజేసుకుని మరీ పుస్తక ప్రపంచంలో మునిగిపోతారు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంచే మంచి మిత్రులని చెప్తుంటారు. నాకు పుస్తకాల మీద ఆశక్తి కలిగించడానికి నానా పాట్లు పడేవారు. అందులో భాగంగానే, ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినపుడు నాకు ఇష్టమైన బొమ్మలు మారు మాట్లాడకుండా  కొనిపెట్టేవారు. ఇంటికి వెళ్ళేడపుడు ధగ ధగ మెరిసిపోతున్న మొహంతో "థాంక్స్ డాడీ" అని చెప్పేదాన్ని. దానికి ఆయన డ్రైవింగ్ సీట్ లో నుండి కాస్త పక్కకు వంగి బుగ్గ చూయించేవారు.. నేను ముద్దు పెట్టేదాన్ని (ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంతే అనుకోండీ). వెంటనే ఆయన "చూడు. డాడీ నీకు ఇష్టమైంది చేసారు కదా.. ఇప్పుడు నువ్వు డాడీ కి ఇష్టమైంది చెయ్యాలి. సరేనా?" అనేవారు. నాకు వెంటనే సీన్ అర్ధమై మొహంలోధగ ధగలన్నీ వెలవెలబోయేవి :P. విషయమేంటంటే.. వారంలోపు ఏదో ఒక బుక్ చదివి నాన్నకు ఆ కథ చెప్పాలి. అదన్నమాట సంగతి. వెంటనే మొహం ముప్పై మూడు వంకరలు తిప్పేసి ఎన్నికల ముందు రాజకీయ నాయకులు చేసినట్లు "ఓహ్ ష్యూర్.. వై నాట్? రేపు మీకు రెండు కథలు వినిపిస్తాను " అంటూ లక్షణంగా ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేసేదాన్ని. నేను మాట మీద నిలబడే మనిషినండోయ్.. మరుసటి రోజు నిజంగానే కథలు చెప్పేదాన్ని.  హోం వర్క్ ఎక్కువ ఉందనీ, భరతనాట్యం టీచర్ కష్టమైన స్టెప్ నేర్పి రేపు చూస్తానన్నారనీ.. పోనీ నిద్రపోయే ముందు కొన్ని పేజీలయినా చదివి వినిపిద్దాం అంటే బాగా నిద్రొస్తోందనీ.. రేపు తప్పక చెబుతాననీ.. మా నాన్నకు విసుగొచ్చి అడగడం ఆపేవరకు రోజుకో కథ చెప్పేదాన్ని :P  

సడన్గా ఓ సండే మా డాడీ ఓ రోజు నాకో బంపరాఫర్ ఇచ్చారు ఒక షరతుతో. "షాపింగ్ కి వెళదాం పద. ప్రైస్ ఎంతైనా ఒకే. కాని రెండిటిని మించి కొనకూడదు" అని. తెలియనిదేముంది.. మనకు షాపింగ్ అంటే పిచ్చి కదా.. క్షణం ఆలశ్యం చేయకుండా ఎగురుకుంటూ వెంట వెళ్ళాను. తీరా చూస్తే నన్ను తీసుకెళ్ళింది "Landmark" కి! It's a complete book store :(. ఆయనకు ఏమైనా కావాలేమో.. ఇది అయిపోయాక తీసుకేళతారు అనుకుని కొంతలో కొంత సర్దుకున్నాను. ఈలోపు డాడీ "ఏంటి అలా నిలబడ్డావ్? Come on... go ahead" అన్నారు. ఫ్యూజ్ పోయింది నాకు. తెల్ల మొహం వేసుకుని అటు ఇటు తిరిగాను. అసలు ఆ పుస్తకాలు చూస్తేనే భయం వేసింది. "ఊ.. ఊ..  ఊ ఊ అసలే అమ్మ కూడా రాలేదు :(" ఎంచక్కా అమ్మయితే "చంటిదాన్ని ఎందుకు అలా పుస్తకాలు పుస్తకాలు అని భయపెడతావ్? రోజంతా స్కూల్లో చదివీ, నువ్వు చేర్పించిన క్లాసులన్నీ ముంగించుకుని  ఏదో కాసేపు కుదురుగా కుర్చుందామనుకుంటే పుస్తకాలని మళ్ళీ దాన్ని బెదరేస్తున్నావ్. అదెంతా దాని వయసెంత? పుస్తకాలకు జడిసి అది తిండి కూడా సరిగా తినడంలేదు" అని గుక్క తిప్పుకోకుండా వాదించేసి డాడీకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నన్ను తీసుకుని అక్కడి నుండి నిష్క్రమిస్తుంది. అమ్మ గుర్తు రాగానే "పోనీలే ఇంట్లో అమ్మ ఉంటుందిగా.. తప్పించుకోవచ్చు" అని ధైర్యంగా కంటికి నచ్చిన బుక్ ఏదో కొన్నాను. కాని నా ప్లాన్ వర్క్అవుట్ అవ్వలేదు. "మరి డబ్బు పెట్టి కొన్నదెందుకూ? అదేగా కొనుక్కుంది.. అంతవరకైనా చదివి తీరాల్సిందే" అని పట్టుబట్టారుఅది చదివి ముగించే వరకూ.. గారం గీరం జాంతానై. మొహం మీద సీరియస్ మాస్క్ వేసుకుని తిరిగారు నాతో. చచ్చినట్టు నెల రోజుల్లో కష్టపడి కంప్లీట్ చేసాను.  ఈ కింద ఫోటోలో కనిపించే పుస్తకమే అది.     ఆ తరువాత రాత్రి నిద్రపోయే ముందు.. నాన్నో, అక్కో లేక అమ్మో చదివి వినిపించే గుడ్ నైట్ స్టోరిలు తప్ప మళ్ళీ పుస్తకాల జోలికి వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి నుండీ నన్ను బాధపెట్టినవైనా, సంతోషపెట్టిన సందర్భాలయినా రాసుకోవడం అలవాటు. అలాగే ఓ రోజు నేను రాసుకుంటుండగా డాడీ వచ్చి "ఇప్పుడు నువ్వు రాసుకుంటున్నది చదువుకోవడం నీకిష్టమేనా?" అని అడిగారు. "ఓ.. బావుంటాయిగా" అని బదులిచ్చాను. "ఎందుకు బావుంటాయి?" అనడిగారు. "ఎందుకంటే అవి.. అవి.. అవి నాకు ఇష్టమైన జ్ఞాపకాలు" అని చెప్పాను. దానికి ఆయన "నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇలా రాసుకుంటూ ఉండుండొచ్చు కదా? అవి నీకు దొరికితే చదవడం ఇష్టమేనా?" అని అడిగారు మళ్ళీ. "యాహ్. ఇంట్రెస్టింగ్ గా  ఉంటాయి కదా" అన్నాను. డాడీ వెంటనే "ఎక్షాక్ట్లి! నీ ఫ్రెండ్ డైరీ, అది తన పర్సనల్. You can't read it. కాని కొంతమంది ఏం చేస్తున్నారంటే తాము రాసుకున్న వాటిని నలుగురూ చదివేందుకు అనుమతించి మార్కెట్ లో పెడుతున్నారు. డబ్బులు పెట్టి మరీ కొంటున్నారంటే.. వాటికి వేల్యూ ఉండి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే కదా అర్ధం? నువ్వు రాసేది ఆల్రెడీ నువ్వు ఎక్ష్పీరియన్స్ చేసిన విషయాలు. అవి మళ్ళీ చదివితేనే నీకు ఆనందంగా అనిపించినపుడు.. ఎదుటి వ్యక్తి ఎక్ష్పీరియన్స్ ని అతని రాతల్లో చదువుతూ నీకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏదో తెలుసుకున్నామని ఆనందంగా కూడా ఉంటుంది కదా..??" అన్నారు. ఏ మూడ్ లో ఉన్నానో కానీ అలా సూటిగా మనసుని తాకాయి ఆ మాటలు. 

పుస్తకాల మీద ఉన్న బెరుకు పోయి, వాటికి మెదడులో నేను రాసిపెట్టుకున్న డెఫినిషన్ మారిపోయింది! నిదానంగా చదవడం మొదలుపెట్టాను. నాకు చదవాలనిపించే బుక్స్ సెలెక్ట్ చేసుకోవడంలో డాడీ సహాయపడేవారు. ఇదిలా సాగుతుండగా నా 15th బర్త్ డే కి వినోదా (నా హాస్పిటల్ తిప్పల్లో చెప్పాగా..) ఈ కింద ఫోటోలో ఉన్న బుక్ ప్రెసెంట్ చేసింది. 

Google image

I really liked it. ఆ తరువాత నేను దాచుకున్న డబ్బులతో ఒక్క దాన్నే వెళ్లి ఈ బుక్ కొనుక్కున్నాను.

Google image

ఇది చదివిన తరువాత, I completely fell in love with books. కొన్ని రోజులకు పుస్తకాల పట్ల నాకు ఎంత మమకారం పెరిగిపోయిందంటే.. కొత్త బట్టలు సహితం బయటకు తీసేసి నా బీరువా నిండుగా పుస్తకాలు పేర్చుకునేంతగా! ఎక్కడకు వెళ్ళినా ఏదో ఒక బుక్ హ్యాండ్ బాగ్ లో పెట్టుకెళ్లడం, స్నేహితులు "ఒక్క సారి ఈ బుక్ ఇవ్వవా.. చదివి ఇచ్చేస్తాను" అంటే ఏదో నా ప్రాణాన్ని అడిగినట్లు బెదిరిపోవడం.. ఎవరైనా పుస్తకాలను రఫ్ గా హేండిల్ చేస్తే అడ్డమైన తిట్లు తిట్టుకోవడం లాటివి యధామామూలయిపోయాయి. ఇప్పుడు పుస్తకాలు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే చిరాగ్గా (భయంగా) ఉంది. 

ఇంత చక్కటి ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినందుకు పుష్తకం పట్టుకున్న ప్రతిసారీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను మనసులో.  

అలా మా అక్క పుణ్యమా అని పెయింటింగ్, నాన్న పుణ్యమా అని పుస్తకాలు తెలుసుకోగలిగాను. ఇవి చూసి మా అమ్మ ఎప్పటికైనా నాకు పాలు అలవాటు చేయాలని ఇప్పటికీ నా చుట్టూ తిరుగుతూనే ఉంది.. నేనూ మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. త్వరగా ఈ గోల కూడా వదిలిపోతే బావుండు!

21 comments:

 1. పెద్ద పోస్ట్ కదా ప్రియా... చదువుతున్నాను...

  హమ్మయ్యా... మొదటి కామెంట్ నాదే.... :)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ.. how sweet you are?!!!!
   Thanks for the comment, Shobha gaaru :)

   Delete
 2. అత్తగారు పక్కన లేని లోటు తీర్చేందుకు నువ్వు పుట్టావే... అని అమ్మ
  నువ్వు నాకే చెల్లిగా ఎందుకు పుట్టావే అని అక్క
  మస్కిటో అని ప్రేమగా కసిరే నాన్న...

  ప్రియమ్మ ఎంత మంచమ్మాయో... వాళ్లకి తెలిస్తేగా... పోన్లే పాపం... :)

  ఓహ్ ష్యూర్.. వై నాట్? రేపు మీకు రెండు కథలు వినిపిస్తాను.. రాజకీయ నాయకుల్లా వాగ్ధానాలు...

  రాజకీయ నాయకుల్లాగా కాకుండా.. మాట నిలబెట్టుకుంటూ... నిజ్జంగా కథలు చెప్పావా.. గ్రేట్.. గ్రేట్... :)

  మొత్తానికి పుస్తకాలపై బెరుకుపోయి.. డెఫినిషన్ మారిపోవడం.. దానికి దోహదం చేసిన విషయాలు... హత్తుకునేలా ఉన్నాయి.

  ముఖ్యంగా... బీరువా నిండా కొత్త బట్టలకంటే, పుస్తకాలుంచుకునేందుకు ఇష్టపడటం.. ఎవరైనా పుస్తకం అడిగితే ప్రాణాన్నే అడిగినట్లుగా ఫీలవడం, పుస్తకాల్ని జాగ్రత్తగా చూసుకోలేనివాళ్లని తిట్టుకోడం... పుస్తకాలు లేని జీవితం చిరాగ్గా ఉంటుందనడం... నిజ్జంగా ఎంత బాగా నచ్చాయో, ఎంతగా మనసుని తాకాయో చెప్పలేను.

  ఇంత మంచి ప్రపంచాన్ని పరిచయం చేసినందుకు నాన్నగారికి కృతజ్ఞతలు. మా అందరి తరపున కూడా...

  నాన్న కోర్కె తీర్చావు.. మరి అమ్మ కోర్కెనూ తీర్చరాదూ... ఓ పనై పోతుందిగా... :) :) :)

  ReplyDelete
  Replies
  1. <> కదా..! అర్ధం చేసుకోవడంలేదు శోభ గారు :P

   అమ్మ కోర్కె తీర్చానంటే ఓ పని కాదు, "నా" పని అయిపోతుంది :)

   Thanks for the lovely comment.

   Delete
 3. Anonymous17/6/13

  కబుర్ల పోగే అనుకున్నా పుస్తకాల పురుగుకుడానా? :)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హా.. కొంత వరకూ అవుననే చెప్పుకోవచ్చు తాతగారూ :)
   Thank you very much for the comment.

   Delete
 4. బాగుంది. నాన్న, అక్కల ప్రోద్బలం వల్ల రెండు మంచి అలవాట్లు అలవరచుకున్నారు.
  ఇక ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారేమో కదూ ఎప్పటికీ?
  అదేనండీ, పాలు అలవాటు చేసుకునే ప్రాయం దాటిపోయిందేమో అని ;)

  ReplyDelete
  Replies
  1. నిజమే పండు గారు. వాళ్ళిద్దరికీ నేనెప్పుడూ ఋణపడి ఉంటాను.
   పాలు అలవాటు చేసుకునే ప్రాయం దాటిపోయిందని అందరూ గ్రహిస్తున్నారు.. మా నాన్న గారితో సహా. కాని మా అమ్మ మాత్రం పట్టువదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తోంది!! పెళ్లై అత్తగారింటికి వెళ్ళినా ఇల్లు మారుతుంది కాని ఇంటి చుట్టూ తిరగడం అనేది మాత్రం ఆగదు :(

   Delete
 5. Anonymous17/6/13

  భలేగా రాసారు ప్రియా. ఇందాక నా వ్యాఖ్యలు మా వాడికి వినిపించాను. బాగా ఆడుకుని వచ్చి మరి ఏం ఆలోచించాడో కానీ, నా గురించి మటుకు బ్లాగుల్లో రాయకు అని సీరియస్సుగా చెప్పేసి, పొద్దున పేపర్ అతనితో తెప్పించిన 'బాలభారతం' పుస్తకం చదువుతున్నాడు. మీరు రాసిన టపా గురించి అనగానే నా గురించి అంతా చెపుతున్నావా అని గోల పెడుతున్నాడు. రాయనీయడంలా.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అనూ గారు. ఆ వయసే అలాటిదిలెండి.. మీ అబ్బాయి ఇంకా చాలా మంచోడిలా ఉన్నాడు. సీరియస్సుగా చెప్పి ఊరుకున్నాడు! అదే నేనైతే ఇల్లు పీకి పందిరేద్దును :D

   Delete
 6. Anonymous17/6/13

  I told my son about 'Great Expectations' just now showing ur blog n he immediately remembered 'Oliver Twist', by Charles Dickens. I gave him long back. I'm very happy for ur blog made him rmbr n thx to all the blogs. Many thanks Priyaaaaaa

  ReplyDelete
  Replies
  1. :) నిజానికి నేనే మీకు థాంక్స్ చెప్పాలి. మీ పోస్ట్ పుణ్యమాని ఈ విషయాలన్నీ అందరితో పంచుకున్నాను. ముందు జస్ట్ కామెంటే రాసాను గాని ఆఖరున చూడబోతే అది ఓ చిన్న సైజ్ పోస్ట్ లా కనబడింది.. స్టిల్ బోలెడు విషయాలు మిగిలిపోయాయి. అందుకే ఇక పోస్టే రాసేశాను :P

   Delete
 7. నిజంగా పుస్తకాలు చదవని వాళ్ళు ఏదో కోల్పోతున్నారని నాకనిపిస్తుంది. అందుకే ఎంతోమందికి బలవంతంగా పుస్తకాలు చదివే అలవాటు చేసాను. అప్పటికీ నేనే పుస్తకాలు కొనిచ్చినా నా బాధ పడలేకన్నట్టు చదివేవారు. వాళ్ళల్లో కొందరైనా కంటిన్యూ చెయ్యకపోతారా అని ఆశ.

  ReplyDelete
  Replies
  1. పుస్తకాలు చదవని వారు ఏదో కోల్పోవడం కాదు మురళీ గారూ.. ఎంతో కోల్పోతున్నారు. మీ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను :)

   Delete
 8. Anonymous19/6/13

  అత్తగారు పక్కన లేని లోటు తీర్చేందుకు నువ్వు పుట్టావే... అని అమ్మ.. baagundandi.. chaala baaga express chesaru .... mee post chaduvutu unte.. naaku kuda full ga interest vachhi oka book konesi.. 1-2 days lo full ga chadiveyyali anipistundi.....

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ అండీ. "చాలా బాగా ఎక్ష్ప్రెస్ చేశారు" అన్న మాట కంటే, "మీ పోస్ట్ చదువుతూ ఉంటే నాక్కూడా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఏదో ఒక బుక్ చదివేయాలని ఉంది" అన్నారు చూడండి. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. చాలా సంతోషంగా ఉంది. మీరు చదవడానికి ఎంచుకునే పుస్తకం బాగా పరిశీలించి ఎంచుకోండి. ఎందుకంటే చదివే మొదటి పుస్తకం బోర్ గా అనిపిస్తే మళ్ళీ పుస్తకాల వైపు చూడ్డానికి చాలా టైం పడుతుంది (స్వంత అనుభవం) :)

   Delete
 9. Anonymous20/6/13

  Hmmm...Priya garu meeru kuda na laage pusthaka purugaa ithe...nice andi...annattu mi amma gari korika theerchadam chala easy andi kallu muskoni noti ninda okesari palu poskoni mingeyandi...nenu roju ade chestha...:P

  ReplyDelete
 10. Anonymous20/6/13

  annattu marchi poyanandi...waiting for 'na premayanam part7....twaraga rayandii...

  ReplyDelete
 11. అవునా.. చాలా సంతోషమండీ :)
  మీరెన్నైనా చెప్పండీ.. పాలు తాగడం మాత్రం నాకీ జన్మలో అలవడేట్టు లేదు. మీరు కనీసం ఎలాగోలా తాగుతున్నానంటున్నారుగా.. అభినందనలు అయితే.

  పార్ట్ 7 ఈ వీకెండ్ లోపు పబ్లిష్ చేస్తానండీ.

  ReplyDelete
 12. Anonymous27/7/13

  your dad's explanation is too good

  ReplyDelete
  Replies
  1. కదండీ.. Thank you and welcome to my blog :)