Friday, July 12, 2013

కడప - చెన్నై

రెండు మూడు నెలల క్రితం వరకు భరత్ కడపలో లెక్చరర్ గా వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళేప్పుడు అవసరమవుతుందని తన బైక్ ని కూడా తీసుకెళ్ళాడు. తీరా అక్కడి నుండి ఇక్కడకు వచ్చేసేడపుడు దాని RC పోయేసరికి వేరే దారి లేక దాన్ని తెలిసిన వాళ్ళింట్లో పెట్టి వచ్చాడు. 

కొత్త RC రావడానికి ఇంకా టైం పట్టేట్లుందని, "వీలు చూసుకుని బండి మీదే వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది.. అంత పెద్ద దూరమేమీ కాదు. ఉదయం ఆరింటికల్లా కడపలో బయలుదేరితే ఎంత నిదానంగా వచ్చినా సాయంతానికి ఇల్లు చేరుకోవచ్చు" అన్నాడు. అమ్మో.. బైక్ మీద అంత దూరమా? చాలా రిస్క్ బాబు అని భయంగా అనిపించింది కాని "ఆ.. ఇప్పుడు కాదుగా. బయలుదేరినపుడు చూద్దాంలే" అని ఊరుకున్నా. ఆ రోజు రానే వచ్చింది (పోయిన ఆదివారం, 7/7/13). వారించినా వినలేదు. భయపడుతూనే సరే అన్నాను. వెళ్ళేడపుడు బస్‌లో వెళ్లి వచ్చేడపుడు బైక్ మీద రావడం అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉన్నాను కాని తను బయలుదేరే టైంకి టెన్షన్ పడిపోయాను. అస్సలు మనసు ఒప్పుకోలేదు. తనేమో ఆగట్లేదు. దాంతో ఇంట్లో ఒప్పించి నేనూ తనతో బయలుదేరాను. 

కోయంబేడ్ బస్టాండ్ కి వెళ్ళడానికి లోకల్ బస్ ఎక్కాం. అప్పుడు మొదలయింది నాలో వణుకు. ఎందుకో మనసు చాలా కీడు శంకించింది. నాకు అదే ఆఖరు రాత్రేమో అనిపించింది! ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాను. భరత్ చెయ్యి గట్టిగా పట్టుకుని తనను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ కూర్చున్నా. ఏడుపొక్కటే తక్కువ. ఏవేవో ఆలోచనలు. బయటేమో ఒకటే వర్షం. కోయంబేడ్ బస్టాండ్‌లో దిగాక, "అనూ నాకేమి బాలేదు. మరో రోజు వెళదాంలే. ఎందుకో మనసు కీడు శంకిస్తోంది" అన్నాను. తను నా వైపు విసుగ్గా చూసి అంతలోనే తమాయించుకుని "ఏం పర్లేదు నాన్న. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. దేవుణ్ణి ప్రార్దించుకో" అన్నాడు. 

కడప బస్ ఎక్కాక కూడా నా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ఎప్పుడూ గడగడా వాగేదాన్నల్లా మౌన మునిలా కూర్చున్నాను. భోరున కురిసే వర్షాన్ని చూసి ఎప్పుడూ కేరింతలు కొట్టేదాన్నల్లా.. అమ్మో వర్షం అని భయపడ్డాను. కాసేపటికి భరత్ హాయిగా నిద్రపోయాడు. నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటే ఇంకెక్కడ నిద్ర? హుం.. కొరివిదెయ్యంలా చూస్తూ బెదురు బెదురుగా కూర్చున్నాను. 

మధ్యరాత్రిలో సడెన్‌గా బస్ డబ్బాలా ఊగుతూ ఆల్మోస్ట్ ఓ పక్కగా ఒరిగిపోయినంత పని అయి నిలదొక్కుకుంది! నేనసలే చాలా ధైర్యంగా ఉన్నానేమో.. అంత చలిలోనూ చెమటలు పట్టేసాయి. పక్కనున్న మానవుణ్ణి తట్టినా చనలంలేదాయే.. హాయిగా గుర్రు పెట్టి పడుకున్నాడు!! "యెహే.. లే" అని కసురుకున్నాను.. బస్ పంక్చర్ అయిందంటూ లైట్స్ వేసి జనాలంతా హడావిడి చేశారు.. అయినాసరే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. చక్కా నిద్రపోయాడు. "ఓరి దేవుడో.. ఇంత కష్టపడి నిశ్చితార్దం వరకూ వచ్చాం. ఇంకా ఆ మూడు ముళ్ళూ పడనేలేదు. భగవంతుడా... ఈ లోపు......... " ........ "ఛీ ఛీ ఏమీ కాదు. మరీ చెండాలంగా అయిపోయానేంటి నేను? అస్సలు బుద్ధిలేదు నాకు. చావాలని రాసి పెట్టి ఉంటే చస్తాం ఇక అందులో భయపడడానికి ఏముందీ? భయపడ్డం వల్ల జరిగేది ఆగదు కదా.. పైగా ఉన్న సమయం వేస్ట్ అయిపోతోంది" ఈ ఆలోచన వచ్చాక ఇక భయపడలేదు (ట్రై చేశాను). బలవంతంగా నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరాల్సింది.. దారి పొడవునా వర్షం, ఆ పంక్చర్ల వల్ల ఆరున్నరయింది కడప చేరేసరికి. 

తెల్లారేసరికి కాస్త ధైర్యం వచ్చింది. భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిల్లలతో ఆడుతూ నేను, ఫ్రెండ్ తో కబుర్లలో పడి భరత్.. ఇద్దరం టైం మర్చిపోయాం. తొమ్మిదింటికి తేరుకుని అక్కడ బయలుదేరాం. 

బయలుదేరినపుడు తీసుకున్న ఫోటో
ఒక 20 మినిట్స్ బాగానే సాగింది జర్నీ. లైట్ గా తుపర పడుతూ, చల్లటి గాలితో  ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి చాలా ప్లెజెంట్‌గా ఉంది వాతావరణం. మేమూ అంతే ప్లెజెంట్‌గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ 40/45 స్పీడ్ లో వెళుతున్నాం. రోడ్డు పక్కగా గడ్డి మేస్తున్న ఒక గేదె, ఎవరో కొట్టి తరిమినట్లు బెంబేలెత్తిపోతూ మా బండికి అడ్డం వచ్చి నిలబడడం, నా కళ్ళ ముందే భరత్ ఎగిరి అవతల పడడం చూస్తుండగానే నా తల రోడ్ కి కొట్టుకోవడం క్షణాల్లోజరిగిపోయాయి. తేరుకోవడానికి 2 నిముషాలు పట్టింది. ఈలోగా జనాలు పోగయ్యారు. నేను లేచి భరత్ పడిన వైపు చూసేసరికి తను దూరంగా పడిన తన హెల్మెట్ తీసుకుంటూ కనిపించాడు. లక్కీగా ఆ రోజు జీన్స్ వేసుకోవడం వలన నా కాళ్ళు కొట్టుకుపోలేదు గాని చేతులు కొట్టుకోపోయి తలకు దెబ్బ తగిలింది. ఇవి ఓకే గాని నడుము దగ్గర ఎముకకి బైక్ హేండిల్ బాగా బలంగా తగిలింది. పాపం భరత్ కి మాత్రం మోకాళ్ళు, చేతులు రక్తాలు కారేలా దెబ్బలు తగిలాయి. తన ప్యాంటు కూడా చిరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వలన లక్కీ గా తలకి మాత్రం దెబ్బ తగల్లేదు. కాని ఓవరాల్ చెప్పాలంటే పరిస్థితి మరీ అంత దారుణం అయితే కాలేదు. ఇంకా అక్కడే నిలబడి ఉంటే సీన్ క్రియేట్ చేసినట్లు అవుతుందని, బాగానే ఉన్నామండీ అని చెబుతూ ముందు అక్కడి నుండి కదిలాం. 

భరత్ బాగానే భయపడ్డాడు. నాకైతే మనసు చాలా తేలికపడిపోయింది. అప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్ అంతా ఎగిరిపోయింది. చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండాలి కాని దేవుని కృప వల్ల చిన్న దెబ్బలతోనే తప్పించుకున్నాం. ఆ టైం కి రోడ్ కాళీగా ఉండడం కూడా పెద్ద +పాయింట్ అయింది. 

కాస్త ముందుకెళ్ళి ఆగి దెబ్బ తగిలిన చోట్ల వాటర్ తో క్లీన్ చేసుకున్నాం. చెన్నైలో బయలుదేరేడపుడే "బ్యాండ్ఎయిడ్ లాటి ఫస్ట్‌ఎయిడ్ కిట్ తీసుకువెళదాం అనూ.. ఎందుకూ మంచిది కదా" అని నేనంటే, "శుభం పలకరా మల్లన్నా అంటే పెళ్ళి కూతురు ముండెక్కడ చచ్చిందీ అన్నాడంట వెనకటికి నీలాంటి వాడెవడో. సరదాగా వెళ్ళోద్దాం రావే అంటే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అంటావెంటే? నోట్లో నుండి ఒక్క మంచి మాట కూడా రాదా?" అని కేకలేశాడు. అవి గుర్తు చేసుకుంటూ ధుమ ధుమలాడాను. తరువాత మేము గ్రహించిందేంటంటే పడిపోయిన తరువాత నుండి బ్యాక్ బ్రేక్స్ పనిచేయట్లేదు. ఇక బండి మీద ఈ పరిస్థితుల్లో చెన్నై వరకు రావడం అంటే కుదిరేపని కాదు. ఏం చేయాలో తెల్చుకోలేకపోయాం. సరే.. ముందు ఆ చుట్టుపక్కల మెకానిక్ షాప్ ఏమైనా ఉందేమో చూసి బైక్ పరిస్థితి కనుక్కుని తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకుని నిదానంగా ముందుకి వెళుతుంటే ఓ పది నిముషాల్లోనే రోడ్ పక్కన ఓ మెకానిక్ షాప్ కనబడింది. పరవాలేదు 20 మినిట్స్‌లో రిపేర్ అయిపొయింది. నెక్స్ట్, మా ఈ బైక్ ప్రయాణం కంటిన్యూ చేయాలా వద్దా అన్నది సమస్య. 

"రేణుగుంటలో నా x కొలీగ్ ఒకాయన ఇల్లు ఉంది. ముందు అక్కడి వరకు వెళదాం. ఎలాగూ సీరియస్ దెబ్బలేమీ తగల్లేదు కదా.. ఇప్పుడు కాస్త అడ్జస్ట్ అయితే ఒక తలనొప్పి వదిలిపోతుంది. ఇంకా నిదానంగా జాగ్రత్తగా వెళదాం. ఈలోపు దారి మధ్యలో ఎక్కడ అన్‌కంఫర్టబుల్ అనిపించినా we'll stop there. ఓకేనా?" అన్నాడు భరత్. నాకేం ప్రాబ్లం కనిపించలేదు. సరేనన్నాను. 

ఆక్సిడెంట్ తాలుకు భయం, ఆ గాయాల మంట వల్ల ఎంజాయ్ చేయలేకపోయాం గాని.. అబ్బాహ్ ఆ క్లైమెట్, ఆ రోడ్, చుట్టూ కొండలు.. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో! చూస్తారా.. ?

మధ్యలో నో బ్రేక్స్. రేణుగుంటకు వెళ్లేసరికి పావు తక్కువ మూడయింది.  దారి పొడవునా ఏదో ఒక ఆక్సిడెంట్ చూస్తూనే ఉన్నాం ప్రతి ఊరిలోనూ. బాధపెట్టే విషయం ఏంటంటే.. అన్నీ సీరియస్ ఆక్సిడెంట్సే.

చెప్పడం మర్చిపోయాను.. ఒక్క బ్రేక్ తీసుకున్నామండోయ్. ఒక ఊరిలో, "రైల్వేకోడూరు" అనుకుంట ఊరిపేరు (not sure). తినడం కోసం అని ఆగాం. "అన్నపూర్ణ" రెస్టారెంట్ అట.. అది చూడ్డానికే ఏమంత బాలేదు కాని తప్పదు కనుక నోరుమూసుకున్నాను. మీల్స్ ఆర్డర్ చేశాం. దేవుడో.. ఆ పప్పు ఎంత కారంగా ఉందో! సాధారణంగానే మా ఇంట్లో ఉప్పు, కారాలు బాగా తక్కువగా వాడతాం. అలాటిది ఆ పప్పు నోట్లో పెట్టుకోగానే కళ్ళు కూడా మండాయి. భరత్ ని చూస్తే తనూ ఒగుర్చుకుంటూనే తింటున్నాడు. నేనూ ఎలాగో ముక్కు చీదుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ నాలుగైదు ముద్దలు తిని, ఇది మన వల్ల కాదులే రసం అయినా పోసుకుందామని వైట్ రైస్ కాస్త ముందుకి తీసుకుంటే దానిలో చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఛీ!!! యాక్... నా మొహమంతా వికారంగా మారిపోయింది. కాని భరత్ ఇబ్బంది పడకూడదని ఏమి మాట్లాడకుండా "నాకు అస్సలు ఆకలిగా లేదు. ప్లీస్" అన్నాను. నా మొహం చూసి భరత్ ఇంకేమి మాట్లాడలేదు. "It's okay నాన్న. చెయ్యి కడిగేసుకో" అన్నాడు. "బ్రతికిపోయానురా దేవుడా" అనిపించింది. కాని అప్పటి వరకు ఆ అన్నమే తిన్నానన్న ఆలోచన వచ్చాక అబ్బో.. వర్ణనాతీతంలే. వాంతోస్తోంది. కాని భరత్ కంగారు పడతాడేమో లాటి ఆలోచనలతో బలవంతంగా ఆపుకుని ఎలా కూర్చున్నానంటే........ ...  అలా కూర్చున్నాను. అక్కడి నుండి బయలుదేరిపోయాక కూడా ఎటు చూసినా ఆ చిన్న మాంసపు ముక్కే కనిపించింది!! ఖర్మ ఖర్మ!!

రేణుగుంటకు వెళ్ళాక, భరత్ "ఈజీగానే వెళ్లిపోవచ్చు నాన్న. కనీసం ఏడున్నరకైనా ఇంటిని చేరుకోవచ్చు" అన్నాడు. అప్పటికే ఎముకలకు తగిలిన దెబ్బల తాలుకూ నొప్పులూ, వాటికి తోడు అంత సేపు ఆ "అప్పా ఛీ (ఇది నేను పెట్టిన పేరు)" బండి మీద కూర్చోవడం వల్ల వచ్చిన నొప్పులు. అసలు అంత సేపు మేనేజ్ చేయడానికే నానా తిప్పలూ పడితే, ఇప్పుడు రాత్రి ఏడున్నర వరకు అంటున్నాడు! ఇంకేమైనా ఉందా..??! నా ఫీలింగ్స్ ని గమనించినా, తను గమనించినట్లు నాకు తెలిస్తే నన్ను కన్విన్స్ చేయడానికి పట్టే టైం వేస్ట్ అవుతుందని నా మాట కోసం ఎదురు చూడలేదు.

నాకు మాటలకు కొదవా చెప్పండి..? ఈ కబుర్లు ఈవేళకి ఆగేట్లు నాకనిపించడంలేదు కాని ఇక నేను బలవంతంగా తక్కువ మాటలతో ముగించేస్తున్నాను :) ("ఇవి తక్కువ మాటలా.. మాయమ్మే!" అనుకుంటున్నారా...? హహ్హహ్హహహ్హ). అలా శ్రీకాళహస్తి మీదుగా తడ కి వచ్చి, చెన్నైని చేరుకునే NH5 చేరుకున్నాం. చాలానే కష్టపడ్డాంలెండి. వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం.. కాని దూరం మాత్రం అణువంతైనా తగ్గినట్లు అనిపించలేదు. హుం.. భగవంతుని దయ వల్ల అయినా ఎలాగో ఏడింటికి ఇంటికొచ్చి చేరుకున్నాం.

అడుగు తీసి అడుగు వేయగలిగితే ఒట్టు. మరుసటి రోజంతా నేను నిద్రావస్థలోనే గడిపాను. భరత్ అయితే మందులు, సూదులు, ఆయింటుమెంట్లు, ఆఫీస్.. ఇలా పండుగ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ గురించి చెప్పాలంటే.. హహ్హహ్హ.. అబ్బే.. అస్సలేమి అనలేదు హహ్హహ్హ.. :(  :P

41 comments:

Krishna Palakollu said...

ఏమి అనలేదా ఇంటిలో ! హహహ!

దెబ్బలు తగలకుండా ఉంటె రొమాంటిక్ జర్నీ లాగా ఉండేది

Bukya Sridhar said...

And Pics kooda Baavunnayi.. TVS Apache.. "Statutory Warning: Wear Helmets, It costs nothing. Not more than Life". We follow this everytime Sister.

Intaku TT Injections avi vesukunnara..? Head Injury Tagginda Priyamma..??

Priya said...

అవునండీ.. అస్సలేమీ అనలేదు :D (కనీసం అలా చెప్పుకునైనా ఆనందపడాలి కదండీ..)
నిజమే.. ఆ ఆక్సిడెంట్ గోల లేకపోతే చాలా ఎంజాయ్ చేసుండేవాళ్ళం. కాని ఏం చేస్తాం.. ఈ సారికి మాత్రం రొమాన్సున్నర అయింది :)

By the way.. welcome to my blog Krishna gaaru!

Anonymous said...

What a beautiful narration Priya garu. I am first time reader of your blog .Keep on writing. I am also first time blogger.

Bhanumurthy Varanasi said...

what a beautiful narration. I admire the narration of incident. keep on writing.

Priya said...

ఇప్పుడు బాగున్నామండీ.. థాంక్స్ :)

Green Star said...

Thank god, you both are safe.

Whatever happened, just remember it as a wonderful experience.

జీవితంలో ఇలాంటి experienceలు కూడా ఉంటేనే మజా కదా .

Priya said...

భానుమూర్తి గారూ.. నా బ్లాగ్ కి స్వాగతమండీ!
Thank you so much for the encouraging words :)

Priya said...

Definitely, Chandra gaaru.
ఎన్ని వేల సార్లు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనండి. నిజమే.. ఇదీ ఓ అద్భుతమైన అనుభవమే! జీవితమన్నాక అన్నీ ఉండాలి కదండీ.. ఏదైనా ఎక్కువైనా, తక్కువైనా, అసలు లేకపోయినా.. లైఫ్ చాలా చప్పగా అనిపిస్తుంది కదా :)

డేవిడ్ said...

పోస్ట్ ఏమో కాని ఇద్దరు క్షేమంగా ఉన్నారు అది చాలు... :)

Priya said...

ఒక చిన్న క్లారిఫికేషన్ అండీ.
"... లైఫ్ చప్పగా ఉంటుంది కదా" అని నేనన్న మాటలు జనరల్ గా అన్నాను. ఆక్సిడెంట్ల గురించి కాదు.

ఇద్దరు ముగ్గురు స్నేహితులు అపార్ధం చేసుకుని "లైఫ్ ఎంత చప్పగా ఉంటే మాత్రం ఆక్సిడెంట్లు కావాలా? :)" అంటూ మెయిల్ చేశారు :)

Priya said...

అంత సీరియస్ దెబ్బలేమీ తగల్లేదు డేవిడ్ గారు. అదృష్టం అని చెప్పను కాని కేవలం దేవుని కృప. అంతే.

మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు :)

డేవిడ్ said...

అయినా మీ సాహసానికి మెచ్చుకోవాలీ బైక్ పై అంత దూరం ప్రయాణించడానికి. approximately 280 కీలో మీటర్స్ దూరం ఉంటుందనుకుంటా.

Priya said...

ఏం చేస్తానండీ.. నా మొండి మానవుడు వింటేగా? "అవకాశం వచ్చింది, వాతావరణం బాగుంది, సరదాగానూ ఉంటుంది పైగా ఇప్పుడు వేరే దారి కూడా లేదు బండి తెచ్చుకోవడానికి" అంటూ బయలుదేరాడు. తనను ఒంటరిగా పంపడానికి మనసు రాక, భయంవేసి "ఏదైతే అదైంది.. ఇద్దరం కలిసే అనుభవిద్దాం పదా" అంటూ వెంట నడిచాను.

Bhanumurthy Varanasi said...

alaage naa blogs rendu chadavi mee abhprayaalu cheppandi.

వేణూశ్రీకాంత్ said...

అమ్మో.. పెద్ద అడ్వంచరే చేశారండీ.. నాకు ముపై నలబై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది. కానీ ఇదో మరుపురాని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా.. ఫోటోలు మాత్రం చాలా బాగున్నాయ్. మీరు రాసిన పద్దతికూడా బాగుంది.

MURALI said...

ఇద్దరూ క్షేమం అదే పదివేలు. కానీ అపాచీని ఏమీ అనకండి. అసలే ఐ బ్యాడ్లీ మిస్సింగ్ మై అపాచీ.

Priya said...

మీ "అక్షర యజ్ఞం" బ్లాగ్ చూశానండీ. బావుంది. రెండో బ్లాగ్ లింక్ దొరకలేదు మరి.. వీలు కుదిరినపుడు ఇవ్వండి :)

Priya said...

థాంక్స్ వేణూ గారు.
నిజమే.. మరచిపోలేని భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది.

30, 40 కిలోమీటర్స్ బండి మీద వెళ్ళే వాళ్ళను చూసినా భయమా మీకు?!! "వేణూ గారు చాలా ధైర్యవంతులు.. సాహసాలు కూడా ఎక్కువే చేస్తుంటారేమో" అనుకున్నానండీ మీ రాతలు (బ్లాగ్ లో దెయ్యం సినిమాల రివ్యూ లు వగైరా) చదివి :)

Anonymous said...

Hmm....Kshemanga vunnaru kada priya...mimmlani abinadinchali priya...bhayam tho bharat kuda vellaru chudandi....

Priya said...

అవును మురళి గారూ. దేవుని కృప.

సరేలెండి అయితే అపాచీ మీద మీరు పెట్టుకున్న ప్రేమ కోసం నా తిట్లను వెనక్కు తీసుకుంటున్నాను :P

Priya said...

క్షేమంగా ఉన్నామండీ..
మీ అభినందనలకు కృతజ్ఞతలు :)

srinivasarao vundavalli said...

ilanti adventures cheyalandi :) But safety kuda important..

Lasya Ramakrishna said...

మీ పోస్ట్ చదువుతుంటేనే భయం వేసింది. మీరు క్షేమం కదా అదే పదివేలు.

pallavi said...

Thank goodness that you are safe!!
and even I enjoy long rides very much.. and thats one imp reason i keep visiting few reletives places with my dad..
and I have been wanting to tell you from sometime.. that you enjoy every lil moment in life..thats wonderful!!
take care!

Priya said...

అవును శ్రీనివాస్ గారు.. కాకపోతే గ్రూప్ తో అయితే ఇంకా బావుంటాయి. అలా అయితే సేఫ్టీ గురించి పెద్ద బెంగ కూడా ఉండదు కదా..

Priya said...

అయ్యో భయం దేనికి లాస్య గారూ.. లైఫ్ అన్నాక ఇలాటివి జరగడం సాధారణమే కదా..
మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు :)

Priya said...

Nice to know that you too like long rides. And by visiting your relatives often with your dad, you enjoy the ride and the other thing is it would help you to maintain good relationships.

Thank you very much for the compliment that you've given me.
Sure.. will take care :)

ప్రియ said...

కెవ్వ్ ఎంత ఘోరం జరిగింది ప్రియా , ఇప్పుడెలా ఉన్నారు ...జాగ్రత్త....
తలకి తగిలిన దెబ్బ వల్ల ఏమీ తేడా పడలేదు కదా ;-)

ప్రియ said...

చెప్పడం మరిచా ఈ రైడ్స్ అవీ పెళ్ళయిన తర్వాత కూడా ఉండాలని ఒక ప్రామిసరీ నోట్ రాయించుకోండి , లేదంటే చాలా చాలా అన్యాయం జరిగిపోగలదు ...

Priya said...

నేను ఆల్రెడీ తేడానే అని ఫీల్ అవుతుంటారు కనుక కొత్తగా తేడాలేవీ కనుక్కోలేదు :P

హూం.. పెళ్ళికి ముందే షికార్లేవి లేవు.. ఇక పెళ్లైయ్యాక రైడ్స్ గురించి ఏం నోట్ రాయించుకునేది?! ఏదో బండితో అవసరపడి వెళ్ళాల్సి వచ్చింది కాని సాధారణంగా ఇలాటివి జరగవు ప్రియ గారు.. :( :P

Anonymous said...

mee long ride.. mee photos anni super andi.. aa okka accident tappa!! ela unnaru mari ippudu antha set ipoyara!!

mee adventurous journey ni chaala adbutam ga raasaru!!! take care..

Priya said...

Thank you soooooo much :)
తిరిగి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే సెట్ అయిపోయామండీ. మీ రైటింగ్ స్టైల్ చదువుతుంటే నా ఫ్రెండ్ ఎవరో గుర్తొచ్చారు. Thanks for the comment.

Anonymous said...

చాలా అడ్వెంచరస్ ప్రయాణం....కానీ రిస్క్ తీసుకున్నారు. Anyway...u both r fine now.

Priya said...

Yeah.. I am thanking god for this, Anu gaaru.

Anonymous said...

mee hospital tippalu post nundi mee blog follow ipotunna.. and mee writing ki oka chinna fan ipoyanandi!!

so regular ga mee post lu follow ipotunna!! inka ippatinundi mee chinna fan + frined ne anukondi!! :)

Priya said...

థాంక్స్ అండీ!
అంతా బాగానే ఉంది కాని పేరు కూడా తెలియకుండా ఫ్రెండ్ అనుకోమంటే ఎలాగండీ? మీరే చెప్పండి?

వేణూశ్రీకాంత్ said...

హహహ అంతలేదండీ నా సాహసాలన్నీ రిస్క్ ఎక్కువ లేని సాహసాలేననమాట :-) మీరన్నట్లు దెయ్యాల సినిమాలు చూడ్డం వరకే పరిమితం :-) అసలు నాకు బైక్ నడపడం రాదులెండి "రెండే చక్రాల మీద ఎలా బాలన్స్ చేస్తార్రా బాబు" అనిపిస్తుంది అందుకే హైవే లో బైక్ చూస్తే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది.

Anonymous said...

Yeah.. adi correct ne kada.. marchipoya!! :) naa name Prashanth!! from Hyderabad!!

Priya said...

:)

Priya said...

మీకు బైక్ నడపడం రాదా??!!!!!! లేదు లేదు.. మీరిలా ఉండకూడదు వేణూ గారు. బాగా మబ్బు పట్టినపుడు బైక్ మీద అలా ఓ రౌండ్ వేస్తే వచ్చే ఫీలే వేరండీ బాబు.. మిస్ అయిపోతున్నారు!

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, July 12, 2013

కడప - చెన్నై

రెండు మూడు నెలల క్రితం వరకు భరత్ కడపలో లెక్చరర్ గా వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళేప్పుడు అవసరమవుతుందని తన బైక్ ని కూడా తీసుకెళ్ళాడు. తీరా అక్కడి నుండి ఇక్కడకు వచ్చేసేడపుడు దాని RC పోయేసరికి వేరే దారి లేక దాన్ని తెలిసిన వాళ్ళింట్లో పెట్టి వచ్చాడు. 

కొత్త RC రావడానికి ఇంకా టైం పట్టేట్లుందని, "వీలు చూసుకుని బండి మీదే వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది.. అంత పెద్ద దూరమేమీ కాదు. ఉదయం ఆరింటికల్లా కడపలో బయలుదేరితే ఎంత నిదానంగా వచ్చినా సాయంతానికి ఇల్లు చేరుకోవచ్చు" అన్నాడు. అమ్మో.. బైక్ మీద అంత దూరమా? చాలా రిస్క్ బాబు అని భయంగా అనిపించింది కాని "ఆ.. ఇప్పుడు కాదుగా. బయలుదేరినపుడు చూద్దాంలే" అని ఊరుకున్నా. ఆ రోజు రానే వచ్చింది (పోయిన ఆదివారం, 7/7/13). వారించినా వినలేదు. భయపడుతూనే సరే అన్నాను. వెళ్ళేడపుడు బస్‌లో వెళ్లి వచ్చేడపుడు బైక్ మీద రావడం అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉన్నాను కాని తను బయలుదేరే టైంకి టెన్షన్ పడిపోయాను. అస్సలు మనసు ఒప్పుకోలేదు. తనేమో ఆగట్లేదు. దాంతో ఇంట్లో ఒప్పించి నేనూ తనతో బయలుదేరాను. 

కోయంబేడ్ బస్టాండ్ కి వెళ్ళడానికి లోకల్ బస్ ఎక్కాం. అప్పుడు మొదలయింది నాలో వణుకు. ఎందుకో మనసు చాలా కీడు శంకించింది. నాకు అదే ఆఖరు రాత్రేమో అనిపించింది! ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాను. భరత్ చెయ్యి గట్టిగా పట్టుకుని తనను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ కూర్చున్నా. ఏడుపొక్కటే తక్కువ. ఏవేవో ఆలోచనలు. బయటేమో ఒకటే వర్షం. కోయంబేడ్ బస్టాండ్‌లో దిగాక, "అనూ నాకేమి బాలేదు. మరో రోజు వెళదాంలే. ఎందుకో మనసు కీడు శంకిస్తోంది" అన్నాను. తను నా వైపు విసుగ్గా చూసి అంతలోనే తమాయించుకుని "ఏం పర్లేదు నాన్న. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. దేవుణ్ణి ప్రార్దించుకో" అన్నాడు. 

కడప బస్ ఎక్కాక కూడా నా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ఎప్పుడూ గడగడా వాగేదాన్నల్లా మౌన మునిలా కూర్చున్నాను. భోరున కురిసే వర్షాన్ని చూసి ఎప్పుడూ కేరింతలు కొట్టేదాన్నల్లా.. అమ్మో వర్షం అని భయపడ్డాను. కాసేపటికి భరత్ హాయిగా నిద్రపోయాడు. నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటే ఇంకెక్కడ నిద్ర? హుం.. కొరివిదెయ్యంలా చూస్తూ బెదురు బెదురుగా కూర్చున్నాను. 

మధ్యరాత్రిలో సడెన్‌గా బస్ డబ్బాలా ఊగుతూ ఆల్మోస్ట్ ఓ పక్కగా ఒరిగిపోయినంత పని అయి నిలదొక్కుకుంది! నేనసలే చాలా ధైర్యంగా ఉన్నానేమో.. అంత చలిలోనూ చెమటలు పట్టేసాయి. పక్కనున్న మానవుణ్ణి తట్టినా చనలంలేదాయే.. హాయిగా గుర్రు పెట్టి పడుకున్నాడు!! "యెహే.. లే" అని కసురుకున్నాను.. బస్ పంక్చర్ అయిందంటూ లైట్స్ వేసి జనాలంతా హడావిడి చేశారు.. అయినాసరే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. చక్కా నిద్రపోయాడు. "ఓరి దేవుడో.. ఇంత కష్టపడి నిశ్చితార్దం వరకూ వచ్చాం. ఇంకా ఆ మూడు ముళ్ళూ పడనేలేదు. భగవంతుడా... ఈ లోపు......... " ........ "ఛీ ఛీ ఏమీ కాదు. మరీ చెండాలంగా అయిపోయానేంటి నేను? అస్సలు బుద్ధిలేదు నాకు. చావాలని రాసి పెట్టి ఉంటే చస్తాం ఇక అందులో భయపడడానికి ఏముందీ? భయపడ్డం వల్ల జరిగేది ఆగదు కదా.. పైగా ఉన్న సమయం వేస్ట్ అయిపోతోంది" ఈ ఆలోచన వచ్చాక ఇక భయపడలేదు (ట్రై చేశాను). బలవంతంగా నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరాల్సింది.. దారి పొడవునా వర్షం, ఆ పంక్చర్ల వల్ల ఆరున్నరయింది కడప చేరేసరికి. 

తెల్లారేసరికి కాస్త ధైర్యం వచ్చింది. భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిల్లలతో ఆడుతూ నేను, ఫ్రెండ్ తో కబుర్లలో పడి భరత్.. ఇద్దరం టైం మర్చిపోయాం. తొమ్మిదింటికి తేరుకుని అక్కడ బయలుదేరాం. 

బయలుదేరినపుడు తీసుకున్న ఫోటో
ఒక 20 మినిట్స్ బాగానే సాగింది జర్నీ. లైట్ గా తుపర పడుతూ, చల్లటి గాలితో  ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి చాలా ప్లెజెంట్‌గా ఉంది వాతావరణం. మేమూ అంతే ప్లెజెంట్‌గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ 40/45 స్పీడ్ లో వెళుతున్నాం. రోడ్డు పక్కగా గడ్డి మేస్తున్న ఒక గేదె, ఎవరో కొట్టి తరిమినట్లు బెంబేలెత్తిపోతూ మా బండికి అడ్డం వచ్చి నిలబడడం, నా కళ్ళ ముందే భరత్ ఎగిరి అవతల పడడం చూస్తుండగానే నా తల రోడ్ కి కొట్టుకోవడం క్షణాల్లోజరిగిపోయాయి. తేరుకోవడానికి 2 నిముషాలు పట్టింది. ఈలోగా జనాలు పోగయ్యారు. నేను లేచి భరత్ పడిన వైపు చూసేసరికి తను దూరంగా పడిన తన హెల్మెట్ తీసుకుంటూ కనిపించాడు. లక్కీగా ఆ రోజు జీన్స్ వేసుకోవడం వలన నా కాళ్ళు కొట్టుకుపోలేదు గాని చేతులు కొట్టుకోపోయి తలకు దెబ్బ తగిలింది. ఇవి ఓకే గాని నడుము దగ్గర ఎముకకి బైక్ హేండిల్ బాగా బలంగా తగిలింది. పాపం భరత్ కి మాత్రం మోకాళ్ళు, చేతులు రక్తాలు కారేలా దెబ్బలు తగిలాయి. తన ప్యాంటు కూడా చిరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వలన లక్కీ గా తలకి మాత్రం దెబ్బ తగల్లేదు. కాని ఓవరాల్ చెప్పాలంటే పరిస్థితి మరీ అంత దారుణం అయితే కాలేదు. ఇంకా అక్కడే నిలబడి ఉంటే సీన్ క్రియేట్ చేసినట్లు అవుతుందని, బాగానే ఉన్నామండీ అని చెబుతూ ముందు అక్కడి నుండి కదిలాం. 

భరత్ బాగానే భయపడ్డాడు. నాకైతే మనసు చాలా తేలికపడిపోయింది. అప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్ అంతా ఎగిరిపోయింది. చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండాలి కాని దేవుని కృప వల్ల చిన్న దెబ్బలతోనే తప్పించుకున్నాం. ఆ టైం కి రోడ్ కాళీగా ఉండడం కూడా పెద్ద +పాయింట్ అయింది. 

కాస్త ముందుకెళ్ళి ఆగి దెబ్బ తగిలిన చోట్ల వాటర్ తో క్లీన్ చేసుకున్నాం. చెన్నైలో బయలుదేరేడపుడే "బ్యాండ్ఎయిడ్ లాటి ఫస్ట్‌ఎయిడ్ కిట్ తీసుకువెళదాం అనూ.. ఎందుకూ మంచిది కదా" అని నేనంటే, "శుభం పలకరా మల్లన్నా అంటే పెళ్ళి కూతురు ముండెక్కడ చచ్చిందీ అన్నాడంట వెనకటికి నీలాంటి వాడెవడో. సరదాగా వెళ్ళోద్దాం రావే అంటే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అంటావెంటే? నోట్లో నుండి ఒక్క మంచి మాట కూడా రాదా?" అని కేకలేశాడు. అవి గుర్తు చేసుకుంటూ ధుమ ధుమలాడాను. తరువాత మేము గ్రహించిందేంటంటే పడిపోయిన తరువాత నుండి బ్యాక్ బ్రేక్స్ పనిచేయట్లేదు. ఇక బండి మీద ఈ పరిస్థితుల్లో చెన్నై వరకు రావడం అంటే కుదిరేపని కాదు. ఏం చేయాలో తెల్చుకోలేకపోయాం. సరే.. ముందు ఆ చుట్టుపక్కల మెకానిక్ షాప్ ఏమైనా ఉందేమో చూసి బైక్ పరిస్థితి కనుక్కుని తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకుని నిదానంగా ముందుకి వెళుతుంటే ఓ పది నిముషాల్లోనే రోడ్ పక్కన ఓ మెకానిక్ షాప్ కనబడింది. పరవాలేదు 20 మినిట్స్‌లో రిపేర్ అయిపొయింది. నెక్స్ట్, మా ఈ బైక్ ప్రయాణం కంటిన్యూ చేయాలా వద్దా అన్నది సమస్య. 

"రేణుగుంటలో నా x కొలీగ్ ఒకాయన ఇల్లు ఉంది. ముందు అక్కడి వరకు వెళదాం. ఎలాగూ సీరియస్ దెబ్బలేమీ తగల్లేదు కదా.. ఇప్పుడు కాస్త అడ్జస్ట్ అయితే ఒక తలనొప్పి వదిలిపోతుంది. ఇంకా నిదానంగా జాగ్రత్తగా వెళదాం. ఈలోపు దారి మధ్యలో ఎక్కడ అన్‌కంఫర్టబుల్ అనిపించినా we'll stop there. ఓకేనా?" అన్నాడు భరత్. నాకేం ప్రాబ్లం కనిపించలేదు. సరేనన్నాను. 

ఆక్సిడెంట్ తాలుకు భయం, ఆ గాయాల మంట వల్ల ఎంజాయ్ చేయలేకపోయాం గాని.. అబ్బాహ్ ఆ క్లైమెట్, ఆ రోడ్, చుట్టూ కొండలు.. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో! చూస్తారా.. ?

మధ్యలో నో బ్రేక్స్. రేణుగుంటకు వెళ్లేసరికి పావు తక్కువ మూడయింది.  దారి పొడవునా ఏదో ఒక ఆక్సిడెంట్ చూస్తూనే ఉన్నాం ప్రతి ఊరిలోనూ. బాధపెట్టే విషయం ఏంటంటే.. అన్నీ సీరియస్ ఆక్సిడెంట్సే.

చెప్పడం మర్చిపోయాను.. ఒక్క బ్రేక్ తీసుకున్నామండోయ్. ఒక ఊరిలో, "రైల్వేకోడూరు" అనుకుంట ఊరిపేరు (not sure). తినడం కోసం అని ఆగాం. "అన్నపూర్ణ" రెస్టారెంట్ అట.. అది చూడ్డానికే ఏమంత బాలేదు కాని తప్పదు కనుక నోరుమూసుకున్నాను. మీల్స్ ఆర్డర్ చేశాం. దేవుడో.. ఆ పప్పు ఎంత కారంగా ఉందో! సాధారణంగానే మా ఇంట్లో ఉప్పు, కారాలు బాగా తక్కువగా వాడతాం. అలాటిది ఆ పప్పు నోట్లో పెట్టుకోగానే కళ్ళు కూడా మండాయి. భరత్ ని చూస్తే తనూ ఒగుర్చుకుంటూనే తింటున్నాడు. నేనూ ఎలాగో ముక్కు చీదుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ నాలుగైదు ముద్దలు తిని, ఇది మన వల్ల కాదులే రసం అయినా పోసుకుందామని వైట్ రైస్ కాస్త ముందుకి తీసుకుంటే దానిలో చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఛీ!!! యాక్... నా మొహమంతా వికారంగా మారిపోయింది. కాని భరత్ ఇబ్బంది పడకూడదని ఏమి మాట్లాడకుండా "నాకు అస్సలు ఆకలిగా లేదు. ప్లీస్" అన్నాను. నా మొహం చూసి భరత్ ఇంకేమి మాట్లాడలేదు. "It's okay నాన్న. చెయ్యి కడిగేసుకో" అన్నాడు. "బ్రతికిపోయానురా దేవుడా" అనిపించింది. కాని అప్పటి వరకు ఆ అన్నమే తిన్నానన్న ఆలోచన వచ్చాక అబ్బో.. వర్ణనాతీతంలే. వాంతోస్తోంది. కాని భరత్ కంగారు పడతాడేమో లాటి ఆలోచనలతో బలవంతంగా ఆపుకుని ఎలా కూర్చున్నానంటే........ ...  అలా కూర్చున్నాను. అక్కడి నుండి బయలుదేరిపోయాక కూడా ఎటు చూసినా ఆ చిన్న మాంసపు ముక్కే కనిపించింది!! ఖర్మ ఖర్మ!!

రేణుగుంటకు వెళ్ళాక, భరత్ "ఈజీగానే వెళ్లిపోవచ్చు నాన్న. కనీసం ఏడున్నరకైనా ఇంటిని చేరుకోవచ్చు" అన్నాడు. అప్పటికే ఎముకలకు తగిలిన దెబ్బల తాలుకూ నొప్పులూ, వాటికి తోడు అంత సేపు ఆ "అప్పా ఛీ (ఇది నేను పెట్టిన పేరు)" బండి మీద కూర్చోవడం వల్ల వచ్చిన నొప్పులు. అసలు అంత సేపు మేనేజ్ చేయడానికే నానా తిప్పలూ పడితే, ఇప్పుడు రాత్రి ఏడున్నర వరకు అంటున్నాడు! ఇంకేమైనా ఉందా..??! నా ఫీలింగ్స్ ని గమనించినా, తను గమనించినట్లు నాకు తెలిస్తే నన్ను కన్విన్స్ చేయడానికి పట్టే టైం వేస్ట్ అవుతుందని నా మాట కోసం ఎదురు చూడలేదు.

నాకు మాటలకు కొదవా చెప్పండి..? ఈ కబుర్లు ఈవేళకి ఆగేట్లు నాకనిపించడంలేదు కాని ఇక నేను బలవంతంగా తక్కువ మాటలతో ముగించేస్తున్నాను :) ("ఇవి తక్కువ మాటలా.. మాయమ్మే!" అనుకుంటున్నారా...? హహ్హహ్హహహ్హ). అలా శ్రీకాళహస్తి మీదుగా తడ కి వచ్చి, చెన్నైని చేరుకునే NH5 చేరుకున్నాం. చాలానే కష్టపడ్డాంలెండి. వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం.. కాని దూరం మాత్రం అణువంతైనా తగ్గినట్లు అనిపించలేదు. హుం.. భగవంతుని దయ వల్ల అయినా ఎలాగో ఏడింటికి ఇంటికొచ్చి చేరుకున్నాం.

అడుగు తీసి అడుగు వేయగలిగితే ఒట్టు. మరుసటి రోజంతా నేను నిద్రావస్థలోనే గడిపాను. భరత్ అయితే మందులు, సూదులు, ఆయింటుమెంట్లు, ఆఫీస్.. ఇలా పండుగ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ గురించి చెప్పాలంటే.. హహ్హహ్హ.. అబ్బే.. అస్సలేమి అనలేదు హహ్హహ్హ.. :(  :P

41 comments:

 1. ఏమి అనలేదా ఇంటిలో ! హహహ!

  దెబ్బలు తగలకుండా ఉంటె రొమాంటిక్ జర్నీ లాగా ఉండేది

  ReplyDelete
  Replies
  1. అవునండీ.. అస్సలేమీ అనలేదు :D (కనీసం అలా చెప్పుకునైనా ఆనందపడాలి కదండీ..)
   నిజమే.. ఆ ఆక్సిడెంట్ గోల లేకపోతే చాలా ఎంజాయ్ చేసుండేవాళ్ళం. కాని ఏం చేస్తాం.. ఈ సారికి మాత్రం రొమాన్సున్నర అయింది :)

   By the way.. welcome to my blog Krishna gaaru!

   Delete
 2. And Pics kooda Baavunnayi.. TVS Apache.. "Statutory Warning: Wear Helmets, It costs nothing. Not more than Life". We follow this everytime Sister.

  Intaku TT Injections avi vesukunnara..? Head Injury Tagginda Priyamma..??

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు బాగున్నామండీ.. థాంక్స్ :)

   Delete
 3. Anonymous12/7/13

  What a beautiful narration Priya garu. I am first time reader of your blog .Keep on writing. I am also first time blogger.

  ReplyDelete
 4. what a beautiful narration. I admire the narration of incident. keep on writing.

  ReplyDelete
  Replies
  1. భానుమూర్తి గారూ.. నా బ్లాగ్ కి స్వాగతమండీ!
   Thank you so much for the encouraging words :)

   Delete
  2. alaage naa blogs rendu chadavi mee abhprayaalu cheppandi.

   Delete
  3. మీ "అక్షర యజ్ఞం" బ్లాగ్ చూశానండీ. బావుంది. రెండో బ్లాగ్ లింక్ దొరకలేదు మరి.. వీలు కుదిరినపుడు ఇవ్వండి :)

   Delete
 5. Thank god, you both are safe.

  Whatever happened, just remember it as a wonderful experience.

  జీవితంలో ఇలాంటి experienceలు కూడా ఉంటేనే మజా కదా .

  ReplyDelete
  Replies
  1. Definitely, Chandra gaaru.
   ఎన్ని వేల సార్లు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనండి. నిజమే.. ఇదీ ఓ అద్భుతమైన అనుభవమే! జీవితమన్నాక అన్నీ ఉండాలి కదండీ.. ఏదైనా ఎక్కువైనా, తక్కువైనా, అసలు లేకపోయినా.. లైఫ్ చాలా చప్పగా అనిపిస్తుంది కదా :)

   Delete
  2. ఒక చిన్న క్లారిఫికేషన్ అండీ.
   "... లైఫ్ చప్పగా ఉంటుంది కదా" అని నేనన్న మాటలు జనరల్ గా అన్నాను. ఆక్సిడెంట్ల గురించి కాదు.

   ఇద్దరు ముగ్గురు స్నేహితులు అపార్ధం చేసుకుని "లైఫ్ ఎంత చప్పగా ఉంటే మాత్రం ఆక్సిడెంట్లు కావాలా? :)" అంటూ మెయిల్ చేశారు :)

   Delete
 6. పోస్ట్ ఏమో కాని ఇద్దరు క్షేమంగా ఉన్నారు అది చాలు... :)

  ReplyDelete
  Replies
  1. అంత సీరియస్ దెబ్బలేమీ తగల్లేదు డేవిడ్ గారు. అదృష్టం అని చెప్పను కాని కేవలం దేవుని కృప. అంతే.

   మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు :)

   Delete
 7. అయినా మీ సాహసానికి మెచ్చుకోవాలీ బైక్ పై అంత దూరం ప్రయాణించడానికి. approximately 280 కీలో మీటర్స్ దూరం ఉంటుందనుకుంటా.

  ReplyDelete
  Replies
  1. ఏం చేస్తానండీ.. నా మొండి మానవుడు వింటేగా? "అవకాశం వచ్చింది, వాతావరణం బాగుంది, సరదాగానూ ఉంటుంది పైగా ఇప్పుడు వేరే దారి కూడా లేదు బండి తెచ్చుకోవడానికి" అంటూ బయలుదేరాడు. తనను ఒంటరిగా పంపడానికి మనసు రాక, భయంవేసి "ఏదైతే అదైంది.. ఇద్దరం కలిసే అనుభవిద్దాం పదా" అంటూ వెంట నడిచాను.

   Delete
 8. అమ్మో.. పెద్ద అడ్వంచరే చేశారండీ.. నాకు ముపై నలబై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది. కానీ ఇదో మరుపురాని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా.. ఫోటోలు మాత్రం చాలా బాగున్నాయ్. మీరు రాసిన పద్దతికూడా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ వేణూ గారు.
   నిజమే.. మరచిపోలేని భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది.

   30, 40 కిలోమీటర్స్ బండి మీద వెళ్ళే వాళ్ళను చూసినా భయమా మీకు?!! "వేణూ గారు చాలా ధైర్యవంతులు.. సాహసాలు కూడా ఎక్కువే చేస్తుంటారేమో" అనుకున్నానండీ మీ రాతలు (బ్లాగ్ లో దెయ్యం సినిమాల రివ్యూ లు వగైరా) చదివి :)

   Delete
  2. హహహ అంతలేదండీ నా సాహసాలన్నీ రిస్క్ ఎక్కువ లేని సాహసాలేననమాట :-) మీరన్నట్లు దెయ్యాల సినిమాలు చూడ్డం వరకే పరిమితం :-) అసలు నాకు బైక్ నడపడం రాదులెండి "రెండే చక్రాల మీద ఎలా బాలన్స్ చేస్తార్రా బాబు" అనిపిస్తుంది అందుకే హైవే లో బైక్ చూస్తే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది.

   Delete
  3. మీకు బైక్ నడపడం రాదా??!!!!!! లేదు లేదు.. మీరిలా ఉండకూడదు వేణూ గారు. బాగా మబ్బు పట్టినపుడు బైక్ మీద అలా ఓ రౌండ్ వేస్తే వచ్చే ఫీలే వేరండీ బాబు.. మిస్ అయిపోతున్నారు!

   Delete
 9. ఇద్దరూ క్షేమం అదే పదివేలు. కానీ అపాచీని ఏమీ అనకండి. అసలే ఐ బ్యాడ్లీ మిస్సింగ్ మై అపాచీ.

  ReplyDelete
  Replies
  1. అవును మురళి గారూ. దేవుని కృప.

   సరేలెండి అయితే అపాచీ మీద మీరు పెట్టుకున్న ప్రేమ కోసం నా తిట్లను వెనక్కు తీసుకుంటున్నాను :P

   Delete
 10. Anonymous15/7/13

  Hmm....Kshemanga vunnaru kada priya...mimmlani abinadinchali priya...bhayam tho bharat kuda vellaru chudandi....

  ReplyDelete
  Replies
  1. క్షేమంగా ఉన్నామండీ..
   మీ అభినందనలకు కృతజ్ఞతలు :)

   Delete
 11. ilanti adventures cheyalandi :) But safety kuda important..

  ReplyDelete
  Replies
  1. అవును శ్రీనివాస్ గారు.. కాకపోతే గ్రూప్ తో అయితే ఇంకా బావుంటాయి. అలా అయితే సేఫ్టీ గురించి పెద్ద బెంగ కూడా ఉండదు కదా..

   Delete
 12. మీ పోస్ట్ చదువుతుంటేనే భయం వేసింది. మీరు క్షేమం కదా అదే పదివేలు.

  ReplyDelete
  Replies
  1. అయ్యో భయం దేనికి లాస్య గారూ.. లైఫ్ అన్నాక ఇలాటివి జరగడం సాధారణమే కదా..
   మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు :)

   Delete
 13. Thank goodness that you are safe!!
  and even I enjoy long rides very much.. and thats one imp reason i keep visiting few reletives places with my dad..
  and I have been wanting to tell you from sometime.. that you enjoy every lil moment in life..thats wonderful!!
  take care!

  ReplyDelete
  Replies
  1. Nice to know that you too like long rides. And by visiting your relatives often with your dad, you enjoy the ride and the other thing is it would help you to maintain good relationships.

   Thank you very much for the compliment that you've given me.
   Sure.. will take care :)

   Delete
 14. కెవ్వ్ ఎంత ఘోరం జరిగింది ప్రియా , ఇప్పుడెలా ఉన్నారు ...జాగ్రత్త....
  తలకి తగిలిన దెబ్బ వల్ల ఏమీ తేడా పడలేదు కదా ;-)

  ReplyDelete
 15. చెప్పడం మరిచా ఈ రైడ్స్ అవీ పెళ్ళయిన తర్వాత కూడా ఉండాలని ఒక ప్రామిసరీ నోట్ రాయించుకోండి , లేదంటే చాలా చాలా అన్యాయం జరిగిపోగలదు ...

  ReplyDelete
  Replies
  1. నేను ఆల్రెడీ తేడానే అని ఫీల్ అవుతుంటారు కనుక కొత్తగా తేడాలేవీ కనుక్కోలేదు :P

   హూం.. పెళ్ళికి ముందే షికార్లేవి లేవు.. ఇక పెళ్లైయ్యాక రైడ్స్ గురించి ఏం నోట్ రాయించుకునేది?! ఏదో బండితో అవసరపడి వెళ్ళాల్సి వచ్చింది కాని సాధారణంగా ఇలాటివి జరగవు ప్రియ గారు.. :( :P

   Delete
 16. Anonymous17/7/13

  mee long ride.. mee photos anni super andi.. aa okka accident tappa!! ela unnaru mari ippudu antha set ipoyara!!

  mee adventurous journey ni chaala adbutam ga raasaru!!! take care..

  ReplyDelete
  Replies
  1. Thank you soooooo much :)
   తిరిగి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే సెట్ అయిపోయామండీ. మీ రైటింగ్ స్టైల్ చదువుతుంటే నా ఫ్రెండ్ ఎవరో గుర్తొచ్చారు. Thanks for the comment.

   Delete
  2. Anonymous22/7/13

   mee hospital tippalu post nundi mee blog follow ipotunna.. and mee writing ki oka chinna fan ipoyanandi!!

   so regular ga mee post lu follow ipotunna!! inka ippatinundi mee chinna fan + frined ne anukondi!! :)

   Delete
  3. థాంక్స్ అండీ!
   అంతా బాగానే ఉంది కాని పేరు కూడా తెలియకుండా ఫ్రెండ్ అనుకోమంటే ఎలాగండీ? మీరే చెప్పండి?

   Delete
  4. Anonymous23/7/13

   Yeah.. adi correct ne kada.. marchipoya!! :) naa name Prashanth!! from Hyderabad!!

   Delete
 17. Anonymous18/7/13

  చాలా అడ్వెంచరస్ ప్రయాణం....కానీ రిస్క్ తీసుకున్నారు. Anyway...u both r fine now.

  ReplyDelete
  Replies
  1. Yeah.. I am thanking god for this, Anu gaaru.