Thursday, July 18, 2013

మా ఇంటి పక్షిగూడు!!

వెనుక వాషింగ్ మెషిన్ ఉన్న దగ్గర  ఒక అటక ఉంది. పాత చీపుర్లు, అనవసరపు డబ్బాలు దాని మీద దాచి, ఎక్కువ పోగయిన తరువాత చెత్త తీసుకెళ్ళడానికి వచ్చే ఆవిడకు ఇస్తుంటాను. నిన్న కూడా అలాగే నూనె డబ్బాలు అవీ కిందకు దించి ఇంకేమైనా ఉన్నాయేమోనని చూస్తే ఒక ప్లాస్టిక్ చీపురు కనబడింది. దాన్ని కూడా తీద్దామని లాగితే కాస్త బరువుగా ఉండి రాలేదు. నేను ఎక్కి నిలబడింది చిన్న స్టూల్ కావడంతో  పైన ఏముందో కనబడలేదు. ఇంకాస్త గట్టిగా లాగాను. రాలేదు. ఈ సారి బలమంతా ఉపయోగించి ఘాట్టిగా లాగితే కాస్త ముందుకొచ్చింది. దానితో పాటే రెండు మూడు సన్నటి పుల్లలాటివి ఎగిరొచ్చి నా నెత్తి మీద పడ్డాయి. డౌట్ వచ్చి పక్కనున్న ఐరన్ గ్రిల్ ఎక్కి, ఆ చీపురుని అటు ఇటు కదుపుతూ అప్పటికీ అక్కడేముందో సరిగా కనబడక ఎగిరెగిరి చూస్తుంటే.. అప్పుడే అటు వచ్చిన అమ్మ "మొన్ననేగా దెబ్బలు తగిలించుకుని వచ్చావు? అయినా బుద్ది రాదు రాక్షస జన్మకు. అన్నీ కోతి పనులే. ఆడపిల్లలా పుట్టినందుకైనా కుదురుగా ఓ చోట కూర్చోరాదు? అనుక్షణం నిన్ను కనిపెట్టుకోలేక చచ్చిపోతున్నాను. దిగు. రా ఇటు రా" అని కేకలందుకుంది. చప్పున కిందకి దిగేసాను (దూకేసాను). నేను కదిపినందుకో లేక దూకేడపుడు తెలియకుండా లాగేసానో కాని చిన్న కుప్ప లాటిది అటక చివరకు వచ్చింది. దానితో పాటే కాస్త చెత్త వాషింగ్ మెషిన్ మీద, ఇంకాస్త నేల మీదా పడింది. పైగా చెడ్డ వాసన కూడా వచ్చింది. ఆటోమేటిక్ గా అమ్మ కేకలు అలా కంటిన్యూ అయ్యాయి.

ఆఖరికి దాన్ని కిందకి దించమని చెప్పింది అమ్మ. దించాక చూద్దుము కదా.. అందమైన చిన్న గూడు ఉంది! ఆ కిటికీ మీదకి కొన్ని పావురాలు, ఇంకేదో పిట్టలూ (పేరు తెలియదు నాకు) అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటికి గింజలూ, నీళ్ళు  అవీ పెడుతుంటాను. ఈ మధ్య ప్రతి రోజూ ఆ పేరు తెలియని పిట్ట ఒకటి వచ్చి పోవడం గమనించాను కానీ గూడు పెట్టిందన్న విషయం తెలియదు.

ఈ పిట్టే అది (Google image) 
ఆ గూట్లో నాలుగు బ్లూ రంగు గుడ్లు ఉన్నాయి. అసలు ఆ గూడు ఎంత పగడ్బందీగా కట్టిందోనండీ! నేను ఇదే ఫస్ట్ టైం పక్షి గూడుని నేరుగా చూడడం. బయట అంతా కాస్త మందంగా గట్టిగా ఉండే పుల్లలు, దాని మీద ముళ్ళతో కూడిన పుల్లలు, వాటి మీద మామూలు పుల్లలు, ఆ పుల్లల మీద మెత్తని గడ్డి, మళ్ళీ ఆ గడ్డి మీద లేతగా ఉన్న పచ్చటి వేపాకులు!!! ఆ వేపాకుల మీద భద్రంగా ఉంచింది గుడ్లను! వావ్... ఎంత అద్భుతంగా అనిపించిందో.. ఎంతసేపు చూసినా ఆశ్చర్యంగానే, తనివి తీరనట్లే అనిపించింది. ఫోటో తీసుకుందామంటే సమయానికి కెమెరా ఇంట్లో లేదు. ఫ్రెండ్ తీసుకుంది. దాంతో లాప్టాప్ ని ఉపయోగించాను. అందుకే సరిగా తీయలేకపోయాను. మీరూ చూడండి ఈ ఫోటోలు. 

గూడు బావుంది కదూ..? కాని తరువాత మొదలయింది అసలు సమస్య. దించిన దాన్ని మళ్ళీ పైన పెట్టడం కుదరలేదు. కాసేపు ప్రయత్నించాను.. గుడ్లు పక్కకు వచ్చేయడం, పుల్లలు పడిపోవడం లాటివి జరిగాయి. ఏం చేయాలో అర్ధంకాలేదు. "అయ్యో.. అనవసరంగా తీసాను. ఛ ఛ" అని బాధపడ్డాను. అప్పుడు అమ్మ "ఏం పరవాలేదు. అక్కడ నేల మీద పెట్టేసి ఇలా వచ్చేయ్. తలుపు వేసేద్దాం.. సాయంత్రం అది వచ్చినపుడు తీసుకెళ్ళిపోతుంది" అంది. నాకస్సలు నమ్మకం కుదరలేదు. "అదెలా తీసుకెళ్లగలుగుతుంది అమ్మా" అంటూ నా ప్రశ్నలతో కాసేపు వేధించాను. "చెప్తున్నానా? నాకు తెలుసు. నువ్వు రా" అని విసుగ్గా అంది అమ్మ. వెంటనే వింటే నేను నేనెందుకవుతాను? హూం.. చివరికి అమ్మ చేత రెండు చరుపులు చరిపించుకుని లోపలికి వెళ్లాను. అమ్మ వీపు తట్టి  చెప్పినప్పటికీ నేను నమ్మలేదనుకోండీ..  ఆ పిట్ట వచ్చి తన గుడ్లను తీసుకేళుతుందని. ఈ అష్టదరిద్రాల్లో నిష్ఠదరిద్రంలా మళ్ళీ ఆ పక్కింటోళ్ళు పెంచుతున్న మాయదారి పిల్లి ఎక్కడొస్తుందోనని, అక్కడకు వెళితే అమ్మ మళ్ళీ కొడుతుందేమోనన్న భయం ఉన్నా సాయంత్రం వరకు ఆ డోర్ దగ్గరే పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. ఆల్రెడీ తన్నులు తిని ఉన్నానని అమ్మ ఇక ఏమీ అనలేదు. 

సాయంత్రం చీకటి పడే టైం కి ఆ పిట్ట వచ్చింది. రావడం రావడమే అది అటక మీదకు వెళ్ళి.. తరువాత బయటకు వచ్చి చూసి, ఒక్కో గుడ్డునూ ఎంతో జాగ్రత్తగా నోటితో పట్టుకొని ఎటో ఎగిరింది! ఆఖరి గుడ్డు తీసుకెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. అన్నిటినీ అది ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్లినందుకు సంతోషంగా అనిపించినా, అయ్యో.. అసలు ఆ గూడు దించకుండా ఉండి ఉంటే అది ఇక్కడే ఉండుండేది.. పిల్లలనూ చూసుండేదాన్ని అని బాధపడ్డాను. ఒక చోట నుండి గుడ్లు కదిపాక మళ్ళీ అదే చోటులో గుడ్లు పెట్టదని అమ్మ చెప్పింది. కాని ఉదయం నుండీ అది మళ్ళీ కొత్త పుల్లలు అటక మీదకు మోసుకొచ్చుకుంటూ ఉంది!! 

Beautiful experience! 

22 comments:

Mohana said...

మీ అనుభవం చాలా బావుంది.గూడు కూడా చాలా బాగుంది.

aruna innovative thoughts said...

nice priya.meeru epudu new post chesthara ani roju me blog open chesi check chesthanu antha istam anna maata me posts ante.

Bukya Sridhar said...

http://kaavyaanjali.blogspot.in/2013/07/blog-post_4.html

మేము ముద్దుగా పిలుచుకునె బంగారు ని మీరు ఇక్కడ చుడొచ్చు

శరత్ లిఖితం said...

chala baavundandi

Anonymous said...

Hmmm....Nice Priya...

చిన్ని ఆశ said...

అంటే గూడు మళ్ళీ కట్టటం మొదలెట్టిందా? ఈసారి పక్షి పిల్లల్నీ చూడండి, అవి పెరిగి పెద్ద అయ్యి ఒకరోజు అన్నీ గూడు వదలి వెళ్ళిననాడు ఓ మరపురాని అనుభూతిగా అవన్నీ మీ మదిన మిగిలిపోతాయి. జీవితం అంటేనే అనుభవాలు కదండీ?

Priya said...

హాయ్ మోహనా! ఇంటికొచ్చేశారా?
కదా.. ఎంత బావుందో కదూ ఆ గూడు. అది చూసినప్పటి నుండి నాకు అచ్చూ అలాటిదే ఒకటి కట్టుకుందామా అనిపిస్తోంది :)

Priya said...

చాలా చాలా థాంక్స్ అరుణ గారూ.. మీ అభిమానానికి.
నా బ్లాగ్ మీరెన్ని సార్లు చూశారో కాని మీ ఈ కామెంట్ మాత్రం నేను బోల్డన్ని సార్లు చదివి చదివి సంబరపడిపోయాను :D

Priya said...

చూశానండీ.. బావున్నాయి :)

Priya said...

Thanks, Sharath gaaru :)

Priya said...

Thank you..

డేవిడ్ said...

ఇలాంటి పనే నేను కొన్ని సంవత్సరాల క్రితం చేశాను ప్రియగారు. కాని తర్వాత తెలిసింది ఒకసారి ఆ గూడును ఎవరైన డిస్ట్రబ్ చేస్తే వాటికి (ఆ పక్షులకు,గుడ్లకు) అక్కడ రక్షణ ఉండదని ఆ పక్షి దానిని అక్కడినుంచి తరలిస్తుందని నేషనల్ జియోగ్రఫి చానల్ లో చూశాను అప్పటి నుంచి అటువంటి పని రిపిట్ చేయకుండా జాగ్రత పడ్డాను. పైగా ఆ గూడును కట్టడానికి ఆ తల్లి పక్షి ఎంత కష్ట పడుతుందో కదా అని తర్వాత అనిపించింది. మన ఆనందం కోసం వాటికి నిలువనీడ లేకుండా చేస్తున్నాం కదా అనిపించింది....ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా... అయినా మళ్ళీ కొత్తగా పుల్లలు అటకమీదకు మోసుకొచ్చుకుంటుందంటున్నారుగా చూద్దాం ఏం జరుగుతుందో....

Priya said...

ఏమో పండు గారు. నాకూ తెలియదు కాని ఉదయం నుండీ సాయంత్రం వరకు పుల్లలు చేరవేసుకుంటూనే ఉంది మరి. మీరన్నట్లు ఆ మరపురాని అనుభూతినీ నేను ఆస్వాదించగలిగితే అదృష్టవంతురాలినే. అవునండీ అనుభవాలే జీవితం. జీవితాన్ని అందంగా మలుచుకోవడం అనేది మన మీదే ఆధారపడిన విషయం :)

Anonymous said...

Hi priyaa! very interesting...waiting to see the l'l birds...really i am enjoying reading ur experiences.

ప్రియ said...

ఆ పిట్ట పేరు మైనాగోరింక ప్రియా...వీటిని ఇదివరకు ఇళ్ళలో పెంచేవారు
నేర్పిస్తే మాట్లాడేవి కూడా..మా ఊర్లో మాట్లాడే గోరింక ఉంది ..
(మా ఇంట్లో కాదు , నేనుండా ఇంకో వసపిట్టా(మాట్లాడే పక్షి ) అనవసరరం అని మా అమ్మ ఫీలింగ్ )

మేము కూడా మీ విండోలో రోజూ బియ్యం , నీళ్ళూ పెడుతూ ఉంటాం , ఎప్పుడైనా ప్లేట్ ఖాళీ ఐతే అది మా విండో అద్దం మీద ముక్కుతో పొడిచి , నోటితో వింత సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది ...
ఒకసారి అలవాటయ్యాయంటే చాలా మంచి స్నేహం కుదురుతుంది వాటితో

nagarani yerra said...

బాగుంది ప్రియ గారూ !పక్షి పిల్లలను చూడాలన్న మీ ఆశ తీరుతుంది లెండి . ఈమధ్య మాఇంట్లో కూడా పిట్ట గూడు పెట్టడం,పిల్లలు బైటకు రావడం జరిగింది . బుజ్జి బుజ్జిపిట్టల్ని నా బ్లాగు లో చూడండి .

Priya said...

మీ అనుభావాన్ని పంచుకున్నందుకు థాంక్స్ డేవిడ్ గారు. నేను కావాలని చేయలేదు. తెలియకుండా జరిగిపోయింది. ఇలాటి సంఘటన మళ్ళీ జరక్కుండా జాగ్రత్త తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కాని సంతోషకరమైన విషయం ఏవిటంటే ఆ పక్షి మళ్ళీ అదే చోటున ఇల్లు కడుతోంది! నిన్ననే చూశాను. ఇదిగో.. ఇప్పుడు కూడా తన గూడు కట్టుకునే పనిలోనే ఉంది. ఈ విషయం నాకు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది. లేకపోతే, అయ్యో చేతులారా దాని గూడుని తీసేసి ఇబ్బందులపాలు చేశానే అని గిల్టీ ఫీలింగ్ తో సతమతమవుతునే ఉండేదాన్ని.

Priya said...

Thank you sooo much, Anu gaaru :)
I am also very excited to see the little birds.

Priya said...

Thank you. భలే మంచి విషయాలు తెలిపారు ప్రియ గారు. మీ కామెంట్ చదివినప్పటి నుండి దానితో స్నేహం కోసం కుస్తీ పడుతున్నా :)

Priya said...

థాంక్స్ రాణి గారు. మీ ఇంటి పిట్టల్ని చూశానండోయ్.. అబ్బహ్!! ఎంత ముద్దుగా ఉన్నాయో... మనసు పారేసుకున్నాను అసలు.

మీ బ్లాగ్ లోని మరి కొన్ని పోస్ట్లు కూడా చూశాను. ఆ జాజులు, మల్లెలు.. చెప్పుకుంటూపోతే లిస్టు ఆగదులెండి :). మొత్తానికి ఫోటోలతో అలరిస్తూ మీ బ్లాగ్ చాలా బావుంది.

వేణూశ్రీకాంత్ said...

ఇంట్రెస్టింగ్.. మీకు తనతో చక్కని స్నేహం కుదరాలని మీరనుకున్నట్లు పక్షి పిల్లలను కూడా చూడగలగాలనీ కోరుకుంటున్నాను కానీ మళ్ళీ రోజూ గూడు చూడడానికి రకరకాల ఫీట్లు చేయకండి :-)

Priya said...

హహ్హహ్హ.. థాంక్స్ వేణూ గారు. అబ్బే.. లేదండీ ఈ సారి మాత్రం పక్షి పిల్లల అరుపులు వినిపించేంత వరకూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా ఉంటాను. ఒక్కసారి పిల్లల కేకలు విన్నాక మాత్రం చెప్పలేనండీ. ఆ.. ఇందులో చెప్పలేకపోవడానికి ఏముందిలెండి.. ఆ తల్లి పక్షి నా మీద యుద్ధం ప్రకటిస్తుంది గనుక అప్పటికీ నేను తిన్నగానే ఉండాలి. తప్పదు :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, July 18, 2013

మా ఇంటి పక్షిగూడు!!

వెనుక వాషింగ్ మెషిన్ ఉన్న దగ్గర  ఒక అటక ఉంది. పాత చీపుర్లు, అనవసరపు డబ్బాలు దాని మీద దాచి, ఎక్కువ పోగయిన తరువాత చెత్త తీసుకెళ్ళడానికి వచ్చే ఆవిడకు ఇస్తుంటాను. నిన్న కూడా అలాగే నూనె డబ్బాలు అవీ కిందకు దించి ఇంకేమైనా ఉన్నాయేమోనని చూస్తే ఒక ప్లాస్టిక్ చీపురు కనబడింది. దాన్ని కూడా తీద్దామని లాగితే కాస్త బరువుగా ఉండి రాలేదు. నేను ఎక్కి నిలబడింది చిన్న స్టూల్ కావడంతో  పైన ఏముందో కనబడలేదు. ఇంకాస్త గట్టిగా లాగాను. రాలేదు. ఈ సారి బలమంతా ఉపయోగించి ఘాట్టిగా లాగితే కాస్త ముందుకొచ్చింది. దానితో పాటే రెండు మూడు సన్నటి పుల్లలాటివి ఎగిరొచ్చి నా నెత్తి మీద పడ్డాయి. డౌట్ వచ్చి పక్కనున్న ఐరన్ గ్రిల్ ఎక్కి, ఆ చీపురుని అటు ఇటు కదుపుతూ అప్పటికీ అక్కడేముందో సరిగా కనబడక ఎగిరెగిరి చూస్తుంటే.. అప్పుడే అటు వచ్చిన అమ్మ "మొన్ననేగా దెబ్బలు తగిలించుకుని వచ్చావు? అయినా బుద్ది రాదు రాక్షస జన్మకు. అన్నీ కోతి పనులే. ఆడపిల్లలా పుట్టినందుకైనా కుదురుగా ఓ చోట కూర్చోరాదు? అనుక్షణం నిన్ను కనిపెట్టుకోలేక చచ్చిపోతున్నాను. దిగు. రా ఇటు రా" అని కేకలందుకుంది. చప్పున కిందకి దిగేసాను (దూకేసాను). నేను కదిపినందుకో లేక దూకేడపుడు తెలియకుండా లాగేసానో కాని చిన్న కుప్ప లాటిది అటక చివరకు వచ్చింది. దానితో పాటే కాస్త చెత్త వాషింగ్ మెషిన్ మీద, ఇంకాస్త నేల మీదా పడింది. పైగా చెడ్డ వాసన కూడా వచ్చింది. ఆటోమేటిక్ గా అమ్మ కేకలు అలా కంటిన్యూ అయ్యాయి.

ఆఖరికి దాన్ని కిందకి దించమని చెప్పింది అమ్మ. దించాక చూద్దుము కదా.. అందమైన చిన్న గూడు ఉంది! ఆ కిటికీ మీదకి కొన్ని పావురాలు, ఇంకేదో పిట్టలూ (పేరు తెలియదు నాకు) అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటికి గింజలూ, నీళ్ళు  అవీ పెడుతుంటాను. ఈ మధ్య ప్రతి రోజూ ఆ పేరు తెలియని పిట్ట ఒకటి వచ్చి పోవడం గమనించాను కానీ గూడు పెట్టిందన్న విషయం తెలియదు.

ఈ పిట్టే అది (Google image) 
ఆ గూట్లో నాలుగు బ్లూ రంగు గుడ్లు ఉన్నాయి. అసలు ఆ గూడు ఎంత పగడ్బందీగా కట్టిందోనండీ! నేను ఇదే ఫస్ట్ టైం పక్షి గూడుని నేరుగా చూడడం. బయట అంతా కాస్త మందంగా గట్టిగా ఉండే పుల్లలు, దాని మీద ముళ్ళతో కూడిన పుల్లలు, వాటి మీద మామూలు పుల్లలు, ఆ పుల్లల మీద మెత్తని గడ్డి, మళ్ళీ ఆ గడ్డి మీద లేతగా ఉన్న పచ్చటి వేపాకులు!!! ఆ వేపాకుల మీద భద్రంగా ఉంచింది గుడ్లను! వావ్... ఎంత అద్భుతంగా అనిపించిందో.. ఎంతసేపు చూసినా ఆశ్చర్యంగానే, తనివి తీరనట్లే అనిపించింది. ఫోటో తీసుకుందామంటే సమయానికి కెమెరా ఇంట్లో లేదు. ఫ్రెండ్ తీసుకుంది. దాంతో లాప్టాప్ ని ఉపయోగించాను. అందుకే సరిగా తీయలేకపోయాను. మీరూ చూడండి ఈ ఫోటోలు. 

గూడు బావుంది కదూ..? కాని తరువాత మొదలయింది అసలు సమస్య. దించిన దాన్ని మళ్ళీ పైన పెట్టడం కుదరలేదు. కాసేపు ప్రయత్నించాను.. గుడ్లు పక్కకు వచ్చేయడం, పుల్లలు పడిపోవడం లాటివి జరిగాయి. ఏం చేయాలో అర్ధంకాలేదు. "అయ్యో.. అనవసరంగా తీసాను. ఛ ఛ" అని బాధపడ్డాను. అప్పుడు అమ్మ "ఏం పరవాలేదు. అక్కడ నేల మీద పెట్టేసి ఇలా వచ్చేయ్. తలుపు వేసేద్దాం.. సాయంత్రం అది వచ్చినపుడు తీసుకెళ్ళిపోతుంది" అంది. నాకస్సలు నమ్మకం కుదరలేదు. "అదెలా తీసుకెళ్లగలుగుతుంది అమ్మా" అంటూ నా ప్రశ్నలతో కాసేపు వేధించాను. "చెప్తున్నానా? నాకు తెలుసు. నువ్వు రా" అని విసుగ్గా అంది అమ్మ. వెంటనే వింటే నేను నేనెందుకవుతాను? హూం.. చివరికి అమ్మ చేత రెండు చరుపులు చరిపించుకుని లోపలికి వెళ్లాను. అమ్మ వీపు తట్టి  చెప్పినప్పటికీ నేను నమ్మలేదనుకోండీ..  ఆ పిట్ట వచ్చి తన గుడ్లను తీసుకేళుతుందని. ఈ అష్టదరిద్రాల్లో నిష్ఠదరిద్రంలా మళ్ళీ ఆ పక్కింటోళ్ళు పెంచుతున్న మాయదారి పిల్లి ఎక్కడొస్తుందోనని, అక్కడకు వెళితే అమ్మ మళ్ళీ కొడుతుందేమోనన్న భయం ఉన్నా సాయంత్రం వరకు ఆ డోర్ దగ్గరే పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. ఆల్రెడీ తన్నులు తిని ఉన్నానని అమ్మ ఇక ఏమీ అనలేదు. 

సాయంత్రం చీకటి పడే టైం కి ఆ పిట్ట వచ్చింది. రావడం రావడమే అది అటక మీదకు వెళ్ళి.. తరువాత బయటకు వచ్చి చూసి, ఒక్కో గుడ్డునూ ఎంతో జాగ్రత్తగా నోటితో పట్టుకొని ఎటో ఎగిరింది! ఆఖరి గుడ్డు తీసుకెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. అన్నిటినీ అది ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్లినందుకు సంతోషంగా అనిపించినా, అయ్యో.. అసలు ఆ గూడు దించకుండా ఉండి ఉంటే అది ఇక్కడే ఉండుండేది.. పిల్లలనూ చూసుండేదాన్ని అని బాధపడ్డాను. ఒక చోట నుండి గుడ్లు కదిపాక మళ్ళీ అదే చోటులో గుడ్లు పెట్టదని అమ్మ చెప్పింది. కాని ఉదయం నుండీ అది మళ్ళీ కొత్త పుల్లలు అటక మీదకు మోసుకొచ్చుకుంటూ ఉంది!! 

Beautiful experience! 

22 comments:

 1. మీ అనుభవం చాలా బావుంది.గూడు కూడా చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. హాయ్ మోహనా! ఇంటికొచ్చేశారా?
   కదా.. ఎంత బావుందో కదూ ఆ గూడు. అది చూసినప్పటి నుండి నాకు అచ్చూ అలాటిదే ఒకటి కట్టుకుందామా అనిపిస్తోంది :)

   Delete
 2. nice priya.meeru epudu new post chesthara ani roju me blog open chesi check chesthanu antha istam anna maata me posts ante.

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా థాంక్స్ అరుణ గారూ.. మీ అభిమానానికి.
   నా బ్లాగ్ మీరెన్ని సార్లు చూశారో కాని మీ ఈ కామెంట్ మాత్రం నేను బోల్డన్ని సార్లు చదివి చదివి సంబరపడిపోయాను :D

   Delete
 3. http://kaavyaanjali.blogspot.in/2013/07/blog-post_4.html

  మేము ముద్దుగా పిలుచుకునె బంగారు ని మీరు ఇక్కడ చుడొచ్చు

  ReplyDelete
  Replies
  1. చూశానండీ.. బావున్నాయి :)

   Delete
 4. Anonymous18/7/13

  Hmmm....Nice Priya...

  ReplyDelete
 5. అంటే గూడు మళ్ళీ కట్టటం మొదలెట్టిందా? ఈసారి పక్షి పిల్లల్నీ చూడండి, అవి పెరిగి పెద్ద అయ్యి ఒకరోజు అన్నీ గూడు వదలి వెళ్ళిననాడు ఓ మరపురాని అనుభూతిగా అవన్నీ మీ మదిన మిగిలిపోతాయి. జీవితం అంటేనే అనుభవాలు కదండీ?

  ReplyDelete
  Replies
  1. ఏమో పండు గారు. నాకూ తెలియదు కాని ఉదయం నుండీ సాయంత్రం వరకు పుల్లలు చేరవేసుకుంటూనే ఉంది మరి. మీరన్నట్లు ఆ మరపురాని అనుభూతినీ నేను ఆస్వాదించగలిగితే అదృష్టవంతురాలినే. అవునండీ అనుభవాలే జీవితం. జీవితాన్ని అందంగా మలుచుకోవడం అనేది మన మీదే ఆధారపడిన విషయం :)

   Delete
 6. ఇలాంటి పనే నేను కొన్ని సంవత్సరాల క్రితం చేశాను ప్రియగారు. కాని తర్వాత తెలిసింది ఒకసారి ఆ గూడును ఎవరైన డిస్ట్రబ్ చేస్తే వాటికి (ఆ పక్షులకు,గుడ్లకు) అక్కడ రక్షణ ఉండదని ఆ పక్షి దానిని అక్కడినుంచి తరలిస్తుందని నేషనల్ జియోగ్రఫి చానల్ లో చూశాను అప్పటి నుంచి అటువంటి పని రిపిట్ చేయకుండా జాగ్రత పడ్డాను. పైగా ఆ గూడును కట్టడానికి ఆ తల్లి పక్షి ఎంత కష్ట పడుతుందో కదా అని తర్వాత అనిపించింది. మన ఆనందం కోసం వాటికి నిలువనీడ లేకుండా చేస్తున్నాం కదా అనిపించింది....ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా... అయినా మళ్ళీ కొత్తగా పుల్లలు అటకమీదకు మోసుకొచ్చుకుంటుందంటున్నారుగా చూద్దాం ఏం జరుగుతుందో....

  ReplyDelete
  Replies
  1. మీ అనుభావాన్ని పంచుకున్నందుకు థాంక్స్ డేవిడ్ గారు. నేను కావాలని చేయలేదు. తెలియకుండా జరిగిపోయింది. ఇలాటి సంఘటన మళ్ళీ జరక్కుండా జాగ్రత్త తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కాని సంతోషకరమైన విషయం ఏవిటంటే ఆ పక్షి మళ్ళీ అదే చోటున ఇల్లు కడుతోంది! నిన్ననే చూశాను. ఇదిగో.. ఇప్పుడు కూడా తన గూడు కట్టుకునే పనిలోనే ఉంది. ఈ విషయం నాకు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది. లేకపోతే, అయ్యో చేతులారా దాని గూడుని తీసేసి ఇబ్బందులపాలు చేశానే అని గిల్టీ ఫీలింగ్ తో సతమతమవుతునే ఉండేదాన్ని.

   Delete
 7. Anonymous18/7/13

  Hi priyaa! very interesting...waiting to see the l'l birds...really i am enjoying reading ur experiences.

  ReplyDelete
  Replies
  1. Thank you sooo much, Anu gaaru :)
   I am also very excited to see the little birds.

   Delete
 8. ఆ పిట్ట పేరు మైనాగోరింక ప్రియా...వీటిని ఇదివరకు ఇళ్ళలో పెంచేవారు
  నేర్పిస్తే మాట్లాడేవి కూడా..మా ఊర్లో మాట్లాడే గోరింక ఉంది ..
  (మా ఇంట్లో కాదు , నేనుండా ఇంకో వసపిట్టా(మాట్లాడే పక్షి ) అనవసరరం అని మా అమ్మ ఫీలింగ్ )

  మేము కూడా మీ విండోలో రోజూ బియ్యం , నీళ్ళూ పెడుతూ ఉంటాం , ఎప్పుడైనా ప్లేట్ ఖాళీ ఐతే అది మా విండో అద్దం మీద ముక్కుతో పొడిచి , నోటితో వింత సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది ...
  ఒకసారి అలవాటయ్యాయంటే చాలా మంచి స్నేహం కుదురుతుంది వాటితో

  ReplyDelete
  Replies
  1. Thank you. భలే మంచి విషయాలు తెలిపారు ప్రియ గారు. మీ కామెంట్ చదివినప్పటి నుండి దానితో స్నేహం కోసం కుస్తీ పడుతున్నా :)

   Delete
 9. బాగుంది ప్రియ గారూ !పక్షి పిల్లలను చూడాలన్న మీ ఆశ తీరుతుంది లెండి . ఈమధ్య మాఇంట్లో కూడా పిట్ట గూడు పెట్టడం,పిల్లలు బైటకు రావడం జరిగింది . బుజ్జి బుజ్జిపిట్టల్ని నా బ్లాగు లో చూడండి .

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాణి గారు. మీ ఇంటి పిట్టల్ని చూశానండోయ్.. అబ్బహ్!! ఎంత ముద్దుగా ఉన్నాయో... మనసు పారేసుకున్నాను అసలు.

   మీ బ్లాగ్ లోని మరి కొన్ని పోస్ట్లు కూడా చూశాను. ఆ జాజులు, మల్లెలు.. చెప్పుకుంటూపోతే లిస్టు ఆగదులెండి :). మొత్తానికి ఫోటోలతో అలరిస్తూ మీ బ్లాగ్ చాలా బావుంది.

   Delete
 10. ఇంట్రెస్టింగ్.. మీకు తనతో చక్కని స్నేహం కుదరాలని మీరనుకున్నట్లు పక్షి పిల్లలను కూడా చూడగలగాలనీ కోరుకుంటున్నాను కానీ మళ్ళీ రోజూ గూడు చూడడానికి రకరకాల ఫీట్లు చేయకండి :-)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ.. థాంక్స్ వేణూ గారు. అబ్బే.. లేదండీ ఈ సారి మాత్రం పక్షి పిల్లల అరుపులు వినిపించేంత వరకూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా ఉంటాను. ఒక్కసారి పిల్లల కేకలు విన్నాక మాత్రం చెప్పలేనండీ. ఆ.. ఇందులో చెప్పలేకపోవడానికి ఏముందిలెండి.. ఆ తల్లి పక్షి నా మీద యుద్ధం ప్రకటిస్తుంది గనుక అప్పటికీ నేను తిన్నగానే ఉండాలి. తప్పదు :)

   Delete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)