Tuesday, July 23, 2013

చిన్ననాటి దొంగతనం

లైఫ్ లో ఎప్పుడైనా దొంగతనం చేశారా మీరు?? "ఏవమ్మోయ్..! ఏదో రాస్తున్నావు కదా అని నీ పోస్ట్‌లు చదివిపెడుతుంటే దొంగతనం చేశారా అనడుగుతావా? ఎలా కనబడుతున్నామేం??" అని సీరియస్ అయిపోకండి. నేను, చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న దొంగతనాల గురించి అడుగుతున్నాను. అంటే.. స్కూల్ లో బలపాలు, పక్కింట్లో పువ్వులూ లాటివన్న మాట.

మీ సంగతేమో కాని నేనైతే కొంచెం ఎక్కువే చేశానండీ. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ నేను మొట్టమొదటిసారి దొంగతనం చేసింది జామకాయలు. చిన్నప్పుడు వేసవి సెలవులకు మా మేనత్తా వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ పక్కింట్లో నాగరత్ర్నం గారనీ ఓ బామ్మ ఉండేవారు. ఆవిడకు చాదస్తం ఎక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద విసుక్కుంటూ చిటపటలాడుతూ మళ్ళీ గ్యాప్ దొరికినపుడల్లా స్తోత్ర మంత్రాలు జపిస్తూ ఉండేవారు! తాతగారు కాలం చేసారట.. పిల్లలేమో విదేశాల్లో సెటిల్ అయ్యి అప్పుడపుడూ చూడ్డానికి మాత్రం వస్తారట. ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో. ముసలావిడ అన్న పేరే గానీ ఇంటి పనీ, పెరటి పనీ అంతా భలే చురుకుగా చేసుకునే వారు. ఆవిడ పెరట్లో రెండు రకాల పెద్ద పేద్ద జామచెట్లు, సపోటా చెట్టు, జీడిమామిడి చెట్టు, మామిడి చెట్లు, నిమ్మకాయ చెట్టు, గోరింటాకు చెట్టు, .. ఇలా పలు విధాలయిన చెట్లు, ఉయ్యాల కట్టుకోవడానికి వీలుగా ఉండడమే కాక కాయలతో తొంగుతూ నోరూరించేవి. వాటిని ఆవిడ తినలేరు.. అలాగని మరెవ్వరికీ పెట్టరు . ఎప్పుడైనా ఒక్కసారి..  బాగా మూడ్ వస్తే ఒక్క కాయను ఆరు ముక్కలు కోసి అందులో ఒక ముక్కను భద్రంగా తీసుకొచ్చి నా చేతిలోపెట్టి పండగ చేసుకోమనేవారు. "ఇది మాత్రం నాకెందుకూ? మీరే తినేయకపోయారా?" అన్న మాట గొంతు వరకూ వచ్చేది కాని మింగేసేదాన్ని. నేనామాట అనగానే సరే అని నిజంగానే తీసేసుకుంటుందని నా నమ్మకం. ఆ చిన్న ముక్క నాకూ నా పక్కనున్న పిల్లలకూ కలిపి సరిపోయేది కాదు. ఆ మాటే ఆవిడతో చెప్పి మరొక్కటి ఇవ్వమని అడిగితే కసురుకునేది. కనీసం కింద పడిపోయిన కాయలయినా ఏరుకుంటామని ఎన్నిసార్లు బ్రతిమాలినా ససేమేరా ఒప్పుకునేవారు కాదు. కోపమొచ్చి ఓ మాధ్యహ్నం పూట ఆవిడ నిద్ర పోతుండగా సైలెంట్‌గా జామ చెట్టెక్కి కావలసినన్ని కాయలు కోసుకొచ్చేసుకున్నాను. మా మేనమామ "తప్పు కదూ?? అలా చేయవచ్చునా? వెళ్లి అక్కడ పెట్టేసిరా" అని కోప్పడితే, మేనత్త మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. "ఆవిడ తింటుందా పెడుతుందా? కాయలన్నీ అలా నేలపాలయ్యి పాడయిపోవలసిందే కాని ఒకరికి ఇవ్వడానికి మాత్రం మనసురాదు. ఉండనివ్వండి సాయంత్రం పిల్లలకు పంచిపెడదాం" అంది. ఆ సాయంత్రం నిద్ర లేచాక ఆ బామ్మగారు తిట్టిన తిట్లైతే.. అబ్బాహ్ మానవతరం కాదు వర్ణించడానికి :P. నేను కాస్త ఎదిగాక ఈ విషయం గుర్తొస్తే అనిపిస్తుంది "ఛ ఛ అలా చేసుండాల్సింది కాదు" అని. నిజానికి ఆరోజు గాని మా అమ్మ ఉండుంటే.. ఇంకేంలేదు తీసుకెళ్ళి నాగరత్నం గారికి నన్ను అప్పగించి ఉండేది. ఆవిడ నా పెళ్లి చేసుండేవారు :)

హహ్హహా.. అమ్మ పేరు  తలవగానే ఒక సంఘటన గుర్తొస్తోంది. ఓ సారి ఏమైందంటే (నాకు పదహారేళ్లపుడు), మా ఫ్యామిలీ + మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీస్ కలిపి "యేర్కాడ్ " అనే ఊరు వెళ్లాం. మా డాడీకి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అంతగా నచ్చవు. ఆయన ట్రెక్కింగ్ ఇష్టపడతారు కనుక అక్కడేదో ఒక చిన్న కొండ ట్రెక్కింగ్ కి అనువుగా ఉందని తెలుసుకుని అక్కడికి తీసుకువెళ్ళారు. కార్స్ పార్క్ చేసి కొండ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఒక ఇంటి దగ్గర బోలెడన్ని రోజ్ చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు ఉన్నాయి. అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. నాన్నతో చెబితే "నీకు పువ్వులే కదా కావాలి? ఈ సీజన్లో ఇక్కడ పూసే మల్లెలు చాలా స్పెషల్ అని విని, ఉదయం వెళ్ళినపుడు అమ్మ కొంది. చెప్పడం మర్చిపోయాను. కార్ లో ఉన్నాయి తెచ్చుకో" అన్నారు. వెళ్లి తెచ్చుకుని తలలో పెట్టేసుకున్నాను. మా వాళ్ళంతా నవ్వారు నన్ను చూసి.  త్రీఫోర్త్, టాప్ మీద ఎవరైనా మల్లె పువ్వులు పెట్టుకుంటారా? నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి పాడైపోతున్నట్లున్నావ్" అంటూ ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేశారు. "ఏడిశారు పొండి..  ఇక్కడెవ్వరూ బయట వాళ్ళు లేరుగా? ఉంటే మాత్రం ఏంటీ? నాకు ఇష్టం కనుక పెట్టుకున్నాను" అని దులుపేసుకున్నాను. ముందుకెళ్ళాక మళ్ళీ ఇంకో ఇల్లు అచ్చు అంతకు ముందు చూసిన దానిలానే వాకిలంతా బోల్డన్ని పూల నిండిపోయి కనబడింది. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఈలోపు అక్క వచ్చి "వెళ్ళి రెండు పువ్వులు కోసుకురావే.. బావున్నాయి" అంది. "ఆహా! అంతొద్దులే.. నీక్కావాలంటే నువ్వెళ్ళు. అంతగా భయమయితే నేను తోడు వస్తా" అని బెట్టు చేశాను. తను ఒప్పుకోలేదు. సరే వచ్చేడపుడు చూసుకోవచ్చని వెళ్ళిపోయాం.

కిందకి దిగేడపుడు "రా అక్కా ఇద్దరం కోసుకొచ్చుకుందాం" అని బ్రతిమాలాను. తనకి పువ్వులు పెట్టుకోవడం పెద్దగా నచ్చదు. ఏదో అక్కడున్న రోజ్స్ డిఫరెంట్ స్మెల్ల్ తో ఉండేసరికి ఆశపడింది. "అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. చెప్పకుండా కోసుకుంటే అమ్మ తంతుంది. ఎలాగూ ఇది పూల పిచ్చిది.. కచ్చితంగా తెచ్చుకుంటుంది.. అప్పుడు చూసుకోవచ్చులే" అనుకుందిట (తర్వాత చెప్పింది).  "డాడీని అడుగు. మీ ఇద్దరూ వెళ్లి రండి. నేను అమ్మను మేనేజ్ చేస్తాను" అంది. సర్లే అని డాడీ ని అడిగితే "నేను ఇక్కడ నిలబడతాను. నువ్వెళ్ళి కోసుకో" అన్నారు. "మాతో పెట్టుకుంటే పూలను మిస్ అవ్వాల్సిందే.. గబుక్కున కోసుకొచ్చేసుకుంటే పోయే! లక్కీగా ఎవరూ లేరు" అన్న అక్క మాటలు విని, చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్లి రెండు పువ్వులు కోసుకుని అదే పరుగుతో సంబరంగా తిరిగొచ్చాను. "అక్క అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ పువ్వులు ఇలా ఇవ్వు పాకెట్లో పెట్టుకుంటాను. అమ్మ చూస్తే తిడుతుంది" అని డాడీ పువ్వులను జేబులో దాచారు. అక్కడి చెట్లు చేమల గురించి డిస్కస్ చేస్తూ కార్ దగ్గరకు వెళ్ళే సరికి మా అమ్మ కోపోద్రేకురాలై ఆయాసపడుతూ కనిపించింది. "కొంపదీసి ఇది చెప్పేసిందా ఏంటీ?" అని కంగారుపడుతూనే, ఏమైందన్నట్లు మా అక్కవైపు చూశాను. చేత్తో "పువ్వులు" అన్నట్లు సైగ చేసి చూయించింది. "మేము ఆల్రెడీ దాచేశాంగా? ఎలా కనబడతాయి? చీకట్లో రాయి వేస్తుందేమో.. ఎలాగయినా లేదని నమ్మించాలి" అనుకుంటూ దగ్గరకెళ్ళాను. అమ్మ వేసిన ప్రశ్నలకు నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు "లేదు" అని సమాధానం చెప్పాను. అమ్మ నమ్మలేదు సరికదా.. దొంగతనం చేసింది కాకుండా అబద్దాలు కూడా చెప్తావా అంటూ మీదకొచ్చింది. డాడీ అడ్డొస్తూ నా కంటే ఒక ఆకు ఎక్కువగా, "నేను ప్రియా ఇద్దరం కలిసే వచ్చాం. పూల గోల మాకు తెలియనే తెలియదు. నీ అనుమానాలకు ఓ హద్దు పద్దు లేకుండాపోతోంది" అని సీరియస్ అయ్యారు.  అమ్మ డాడీ వైపు విసురుగా చూసి రవి అంకుల్ కెమెరా అడిగి తీసుకొచ్చి డాడీకీ నాకూ చూయించింది. చూస్తే ఏముంది..?!! మీరే చూడండీ.రన్నింగ్ మోషన్లో కాప్చర్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నారట. బాగా వచ్చిందని అందరికీ చూయించారట! "ఖర్మ! ఈ దరిద్రుడు.. వీడికి వేరే పని లేదు. గొప్ప ఫోటోగ్రాఫర్ అని వీడి బోడి ఫీలింగ్. శనిలా దాపురించాడు.... .... ..." అని నానా విధాలుగా తిట్టుకున్నాను ( పెద్దయ్యాక సారీ చెప్పుకున్నానులెండి.. మనసులో తిట్టుకున్నాను కనుక మనసులోనే సారీ చెప్పుకున్నాను). ఫోటో మాట ఎలా ఉన్నా, ముందు డాడీ కి, ఆ తరువాత నాకూ అమ్మ క్లాస్ తో చుక్కలు కనిపించాయి. ఆ క్లాస్ రన్నింగ్ లో ఉండగానే ఆ ఇంటి ఓనర్లు రావడం, వాళ్లకి ఓ సారీ, వాళ్ళ పువ్వులు, వాటితో పాటు నన్నూ అప్పగించింది. పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు. "పోనీలేమ్మా రెండు పువ్వులేగా? చిన్నపిల్ల ఆశపడింది" అంటూ నన్ను వెనకేసుకొచ్చారు. స్టిల్! అమ్మ వదిలితేగా? ఆ క్లాస్ పూర్తయ్యేసరికి దెబ్బతో నాకు బుద్దోచ్చేసింది. ఆ తరువాత నుండి ఇంకెప్పుడైనా అడక్కుండా చెట్ల మీద చెయ్యేస్తే ఒట్టు!!! 

విలువైన ఈ జీవితానికి మరింత విలువనూ, అందాన్నీ చేకూర్చిన అమ్మకీ, నాన్నకీ, అక్కకీ, నా జీవితంలో పరిచయమయిన ప్రతి ఒక్కరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

By the way.. జీవితంలో నేను తీసిన మొట్టమొదటి ఫోటో ఇది :). అప్పుడు నాకు ఐదేళ్ళు. నాన్న ఫోటో పబ్లిష్ చేయడానికి పర్మిషన్ దొరకలేదు. అందుకే.. అమ్మా, అక్కా ఉన్న ఫోటో మాత్రం పెడుతున్నా :) 

27 comments:

Bukya Sridhar said...

భలే వారే మీరు.. నాకు అలాటివి ఎప్పుడు చేయ్యలనిపించలేదు, ఎందుకంటే అప్పట్లో చేతికందితే అది ఏమిటో అని తెలుసుకునే దాక నిడురపోలేదంటా. మచ్చుక్కి కొన్ని ఇందులో ప్రస్తావిస్తాను

చిన్నప్పుడు అంటే నా మొదటి ఏట నా బర్త్డేకని తెచ్చిన బూరబూట్లు అందులోంచి సౌండ్ వస్తే తీసి విసిరేసేవాడినుట, అది మొదలు మా బాబాయి అపురూపం గ చుస్కునే ఓ డొక్కు కెమెరా, ఓ కాసేట్ టేప్, ఓ ట్యూబ్‌లైట్ చొక్ అన్ని విరగకోట్టేసా.

ఇవి దొంగతనాలు కావు కాని, అందులో ఏమున్నదో తెలుసుకోవాలనే ఔత్సుకత మొదలయ్యింది. ఓ సారి మోదుగ పూల చెట్టు ఎక్కి పువ్వు కోస్తూ జారి పడ్డాను, చెయ్యి గీరుకుంది, ఇప్పటికి ఆ స్కార్ నా ఎడమ చేతికి ఉండిపోయింది.

ఇవి నా చిన్ననాటి జ్ఞాపకాలలో కొన్ని. మీ టపా ఆసాంతం బాగుంది.

Anonymous said...

super priya...nenu first time 5 years back friends antha chilipi donga thanalu chesthunte nenu cheddamani bandi meeda amme key chain kottesanu...tarvatha anipinchindi kasta jeevulu...valla daggara kotteyyadam correct kadu ani...mi story chaduvuthunte ade gurthu vachindi

చిన్ని ఆశ said...

చిన్ని చిన్ని చిన్ననాటి స్మృతులని మీరిలా గుర్తుచేసుకోవటం ఎంతో బాగుంది. ఫొటో లొ క్యాప్చర్ చేసి పెద్దయ్యాక చూసుకోవటం కన్నా గొప్ప అనుభూతి మరోటి లేదు.

Srinivasarao Vundavalli said...

ilanti chinna chinna dongatanalu cheyakapote adi childhood ela avutundandi :P school lo chinnappudu pens and pencils kottesevaadini..lucky ga evariki dorakaledu

Priya said...

థాంక్స్ శ్రీధర్ గారు :)
మీ జ్ఞాపకాలూ బావున్నాయి.

Priya said...

అయ్యో!! పోనీలెండి రియలైజ్ అయ్యారు కదా.. అదే సంతోషం.
తప్పుని ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను :)

Priya said...

కాని ఆ ఫోటో వల్ల నేనారోజు ఎన్ని తిట్లు తిన్నానో! దాన్ని చూసినపుడల్లా ముందు ఒక ఆడ్ ఫీలింగ్ ఒకటి ఆవరిస్తుంది. ఆ తర్వాత నవ్వొస్తుంది. అసలు దాన్ని కాప్చర్ చేసినందుకు ఆ రవి అంకుల్ ని ఎంత తిట్టుకున్నానో.. :P

చెప్పడం మర్చిపోయాను.. Thanks for the comment :)

Priya said...

హహ్హహ్హ్హ.. అన్ని కొట్టేసి ఒక్కసారి కూడా దొరకలేదంటే మీరు అసాధ్యులే శ్రీనివాస్ గారు :)

Padmarpita said...

అమ్మదొంగా.......:-)

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగున్నాయండీ మీ కబుర్లు :-))

Anonymous said...

chinnappudu chala chesamu memu kuda ilanti donga panulu Priya garu. maa amma ki eppudu dorakaledu anukondi adi vere vishayam. mee amma garu chala modern ga bagunnaru.

Priya said...

హహ్హహ్హ.. ఆ పాట ఎంత బావుంటుందో కద పద్మగారు? :))

Priya said...

థాంక్స్ వేణూ గారు.. :)
ఇంతకూ మీరేమైనా చేశారా లేదా?? మీ కబుర్లు కూడా పంచుకుంటే బావుంటుంది కదా? అంటే.. నేనొక్కతినే కాదులే మరికొంతమంది తోడున్నారని భరోసాగా ఫీల్ అవుదామని :P

Priya said...

చాలా థాంక్స్ :)
అయినా గ్రేట్ అండీ ఒక్కసారికూడా అమ్మ కి దొరక్కపోవడం..

K.V. Rao said...

మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

Anonymous said...

bagundandi mee chinnanaati gnapakam!!

chinnappudu avi poolu.. so adi dongatanam category loki raademonandi :) .......
-Prashanth

వేణూశ్రీకాంత్ said...

హహహ పబ్లిక్ గా చెప్పిన చెప్పకపోయినా మీకు చాలామందే తోడుంటారండీ నో డౌట్ :-) నా గురించి రాయాలంటే ఈ కామెంట్ బాక్స్ సరిపోదు అందుకే ఆగాను తొందర్లో ఓ పోస్టేస్తాలెండి :-)

Priya said...

మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాను వేణూ గారు. వీలైనంత త్వరగా రాసేయండి. మీ రాతల్లో ఆ చిన్ననాటి కబుర్లు చదవాలని ఉంది :)

Priya said...

థాంక్స్ ప్రశాంత్ గారు.
వస్తువు ఏదైనా.. పర్మిషన్ లేకుండా, ఎవ్వరూ చూడకూడదు అనుకుంటూ తీసుకుంటే అది దొంగతనం కిందకే వస్తుంది కదండీ.. :)

డేవిడ్ said...

very interesting....:)

Priya said...

హహ్హహ.. థాంక్స్ డేవిడ్ గారు. కాని మీ రహస్యాలు పంచుకోకుండా ఎస్కేప్ అయిపోతున్నారు..?

డేవిడ్ said...

:)

ప్రియ said...

దొంగతనం కాదు కానీ , మా పెరట్లో పూలు కోసుకెళ్ళే వాళ్ళని ముఖ్యంగా వేసవిలో పూసే ఆకుపచ్చ సంపెంగ దొంగల్ని మాత్రం తెగ పట్టుకునే దాన్ని ...ఒకోసారి గోరింటాకు దొంగల్ని కూడా పట్టకుని మా బామ్మ దగ్గరకి తీసుకెళ్ళేదాన్ని వాళ్ళు పువ్వులు / గోరింటాకు పూర్తిగా కోసేంతవరకు చూసి , చెట్టు మొత్తం ఖాళీ చేసాకా , అప్పుడు పెద్దగా కేకలు పెట్టి మా బామ్మని పిలిచే దాన్ని , మా బామ్మ అప్పట్లో కన్నాంబ టైపు
తాడులా కనిపించే త్రాచు అన్నమాట .
కోసిన పూవులు అన్నీ లాగేసుకుని ఒక పువ్వు రేకో , గోరింటాకు ఆకో చేతిలో పెట్టేది ..
ఆ కోసినవన్నీ నా జడలోకీ , నా చేతికి , పారాణీకి హాయిగా నేను కష్టపడే పనిలేకుండా వచ్చేసేవి ..

జడ కుట్టమంటే... మా బామ్మ... పూవులు కోయవే కుడతాను అనేది . నా బద్దకానికి ఇలాంటి వాళ్ళు దొరికేవాళ్ళు . ఒక విధంగా నాది ఘరానా (పని ) దొంగతనం…ఇప్పటికీ నేను పని దొంగనే : P

ఆ రవి అంకుల్ ఎవరో గానీ భలే చేసాడు ...

మీ అమ్మ గారు , మీ అక్క సూపర్ గా ఉన్నారు ఫోటోలో ...గొప్పతనం ఫొటో తీసేవాళ్ళలోనే కాదు . తీయించుకునే వాళ్ళలో ఉందని ఇప్పుడే తెలిసింది , వాళ్ళ ధైర్యానికి నా అభినందనలు ;)

Priya said...

హహ్హహ్హ.. బావున్నాయి మీ జ్ఞాపకాలు.
Thanks for the comment :)

Green Star said...

ఆహ ఎమ్ రాసారండి, ఓ అరగంట ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి నేను చిన్నప్పుడు చేసిన దొంగతనాలు టప టప గుర్తు చేసుకున్నాను, మదుర అనుభవాలు. బోలెడు థాంక్స్.

Priya said...

చాలా సంతోషం శేఖర్ గారు. నేనే మీకు థాంక్స్ చెప్పాలి. నా టపా ద్వారా మీ మధురానుభావాలను జ్ఞాపకం చేసుకున్నందుకు :)

Thank you.

Sridhar Bukya said...

ఏది ఈ పాటే కదా చెల్లి..

అమ్మదొంగా నిన్ను చూడకుంటే...

~శ్రీ~

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, July 23, 2013

చిన్ననాటి దొంగతనం

లైఫ్ లో ఎప్పుడైనా దొంగతనం చేశారా మీరు?? "ఏవమ్మోయ్..! ఏదో రాస్తున్నావు కదా అని నీ పోస్ట్‌లు చదివిపెడుతుంటే దొంగతనం చేశారా అనడుగుతావా? ఎలా కనబడుతున్నామేం??" అని సీరియస్ అయిపోకండి. నేను, చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న దొంగతనాల గురించి అడుగుతున్నాను. అంటే.. స్కూల్ లో బలపాలు, పక్కింట్లో పువ్వులూ లాటివన్న మాట.

మీ సంగతేమో కాని నేనైతే కొంచెం ఎక్కువే చేశానండీ. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ నేను మొట్టమొదటిసారి దొంగతనం చేసింది జామకాయలు. చిన్నప్పుడు వేసవి సెలవులకు మా మేనత్తా వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ పక్కింట్లో నాగరత్ర్నం గారనీ ఓ బామ్మ ఉండేవారు. ఆవిడకు చాదస్తం ఎక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద విసుక్కుంటూ చిటపటలాడుతూ మళ్ళీ గ్యాప్ దొరికినపుడల్లా స్తోత్ర మంత్రాలు జపిస్తూ ఉండేవారు! తాతగారు కాలం చేసారట.. పిల్లలేమో విదేశాల్లో సెటిల్ అయ్యి అప్పుడపుడూ చూడ్డానికి మాత్రం వస్తారట. ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో. ముసలావిడ అన్న పేరే గానీ ఇంటి పనీ, పెరటి పనీ అంతా భలే చురుకుగా చేసుకునే వారు. ఆవిడ పెరట్లో రెండు రకాల పెద్ద పేద్ద జామచెట్లు, సపోటా చెట్టు, జీడిమామిడి చెట్టు, మామిడి చెట్లు, నిమ్మకాయ చెట్టు, గోరింటాకు చెట్టు, .. ఇలా పలు విధాలయిన చెట్లు, ఉయ్యాల కట్టుకోవడానికి వీలుగా ఉండడమే కాక కాయలతో తొంగుతూ నోరూరించేవి. వాటిని ఆవిడ తినలేరు.. అలాగని మరెవ్వరికీ పెట్టరు . ఎప్పుడైనా ఒక్కసారి..  బాగా మూడ్ వస్తే ఒక్క కాయను ఆరు ముక్కలు కోసి అందులో ఒక ముక్కను భద్రంగా తీసుకొచ్చి నా చేతిలోపెట్టి పండగ చేసుకోమనేవారు. "ఇది మాత్రం నాకెందుకూ? మీరే తినేయకపోయారా?" అన్న మాట గొంతు వరకూ వచ్చేది కాని మింగేసేదాన్ని. నేనామాట అనగానే సరే అని నిజంగానే తీసేసుకుంటుందని నా నమ్మకం. ఆ చిన్న ముక్క నాకూ నా పక్కనున్న పిల్లలకూ కలిపి సరిపోయేది కాదు. ఆ మాటే ఆవిడతో చెప్పి మరొక్కటి ఇవ్వమని అడిగితే కసురుకునేది. కనీసం కింద పడిపోయిన కాయలయినా ఏరుకుంటామని ఎన్నిసార్లు బ్రతిమాలినా ససేమేరా ఒప్పుకునేవారు కాదు. కోపమొచ్చి ఓ మాధ్యహ్నం పూట ఆవిడ నిద్ర పోతుండగా సైలెంట్‌గా జామ చెట్టెక్కి కావలసినన్ని కాయలు కోసుకొచ్చేసుకున్నాను. మా మేనమామ "తప్పు కదూ?? అలా చేయవచ్చునా? వెళ్లి అక్కడ పెట్టేసిరా" అని కోప్పడితే, మేనత్త మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. "ఆవిడ తింటుందా పెడుతుందా? కాయలన్నీ అలా నేలపాలయ్యి పాడయిపోవలసిందే కాని ఒకరికి ఇవ్వడానికి మాత్రం మనసురాదు. ఉండనివ్వండి సాయంత్రం పిల్లలకు పంచిపెడదాం" అంది. ఆ సాయంత్రం నిద్ర లేచాక ఆ బామ్మగారు తిట్టిన తిట్లైతే.. అబ్బాహ్ మానవతరం కాదు వర్ణించడానికి :P. నేను కాస్త ఎదిగాక ఈ విషయం గుర్తొస్తే అనిపిస్తుంది "ఛ ఛ అలా చేసుండాల్సింది కాదు" అని. నిజానికి ఆరోజు గాని మా అమ్మ ఉండుంటే.. ఇంకేంలేదు తీసుకెళ్ళి నాగరత్నం గారికి నన్ను అప్పగించి ఉండేది. ఆవిడ నా పెళ్లి చేసుండేవారు :)

హహ్హహా.. అమ్మ పేరు  తలవగానే ఒక సంఘటన గుర్తొస్తోంది. ఓ సారి ఏమైందంటే (నాకు పదహారేళ్లపుడు), మా ఫ్యామిలీ + మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీస్ కలిపి "యేర్కాడ్ " అనే ఊరు వెళ్లాం. మా డాడీకి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అంతగా నచ్చవు. ఆయన ట్రెక్కింగ్ ఇష్టపడతారు కనుక అక్కడేదో ఒక చిన్న కొండ ట్రెక్కింగ్ కి అనువుగా ఉందని తెలుసుకుని అక్కడికి తీసుకువెళ్ళారు. కార్స్ పార్క్ చేసి కొండ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఒక ఇంటి దగ్గర బోలెడన్ని రోజ్ చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు ఉన్నాయి. అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. నాన్నతో చెబితే "నీకు పువ్వులే కదా కావాలి? ఈ సీజన్లో ఇక్కడ పూసే మల్లెలు చాలా స్పెషల్ అని విని, ఉదయం వెళ్ళినపుడు అమ్మ కొంది. చెప్పడం మర్చిపోయాను. కార్ లో ఉన్నాయి తెచ్చుకో" అన్నారు. వెళ్లి తెచ్చుకుని తలలో పెట్టేసుకున్నాను. మా వాళ్ళంతా నవ్వారు నన్ను చూసి.  త్రీఫోర్త్, టాప్ మీద ఎవరైనా మల్లె పువ్వులు పెట్టుకుంటారా? నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి పాడైపోతున్నట్లున్నావ్" అంటూ ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేశారు. "ఏడిశారు పొండి..  ఇక్కడెవ్వరూ బయట వాళ్ళు లేరుగా? ఉంటే మాత్రం ఏంటీ? నాకు ఇష్టం కనుక పెట్టుకున్నాను" అని దులుపేసుకున్నాను. ముందుకెళ్ళాక మళ్ళీ ఇంకో ఇల్లు అచ్చు అంతకు ముందు చూసిన దానిలానే వాకిలంతా బోల్డన్ని పూల నిండిపోయి కనబడింది. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఈలోపు అక్క వచ్చి "వెళ్ళి రెండు పువ్వులు కోసుకురావే.. బావున్నాయి" అంది. "ఆహా! అంతొద్దులే.. నీక్కావాలంటే నువ్వెళ్ళు. అంతగా భయమయితే నేను తోడు వస్తా" అని బెట్టు చేశాను. తను ఒప్పుకోలేదు. సరే వచ్చేడపుడు చూసుకోవచ్చని వెళ్ళిపోయాం.

కిందకి దిగేడపుడు "రా అక్కా ఇద్దరం కోసుకొచ్చుకుందాం" అని బ్రతిమాలాను. తనకి పువ్వులు పెట్టుకోవడం పెద్దగా నచ్చదు. ఏదో అక్కడున్న రోజ్స్ డిఫరెంట్ స్మెల్ల్ తో ఉండేసరికి ఆశపడింది. "అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. చెప్పకుండా కోసుకుంటే అమ్మ తంతుంది. ఎలాగూ ఇది పూల పిచ్చిది.. కచ్చితంగా తెచ్చుకుంటుంది.. అప్పుడు చూసుకోవచ్చులే" అనుకుందిట (తర్వాత చెప్పింది).  "డాడీని అడుగు. మీ ఇద్దరూ వెళ్లి రండి. నేను అమ్మను మేనేజ్ చేస్తాను" అంది. సర్లే అని డాడీ ని అడిగితే "నేను ఇక్కడ నిలబడతాను. నువ్వెళ్ళి కోసుకో" అన్నారు. "మాతో పెట్టుకుంటే పూలను మిస్ అవ్వాల్సిందే.. గబుక్కున కోసుకొచ్చేసుకుంటే పోయే! లక్కీగా ఎవరూ లేరు" అన్న అక్క మాటలు విని, చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్లి రెండు పువ్వులు కోసుకుని అదే పరుగుతో సంబరంగా తిరిగొచ్చాను. "అక్క అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ పువ్వులు ఇలా ఇవ్వు పాకెట్లో పెట్టుకుంటాను. అమ్మ చూస్తే తిడుతుంది" అని డాడీ పువ్వులను జేబులో దాచారు. అక్కడి చెట్లు చేమల గురించి డిస్కస్ చేస్తూ కార్ దగ్గరకు వెళ్ళే సరికి మా అమ్మ కోపోద్రేకురాలై ఆయాసపడుతూ కనిపించింది. "కొంపదీసి ఇది చెప్పేసిందా ఏంటీ?" అని కంగారుపడుతూనే, ఏమైందన్నట్లు మా అక్కవైపు చూశాను. చేత్తో "పువ్వులు" అన్నట్లు సైగ చేసి చూయించింది. "మేము ఆల్రెడీ దాచేశాంగా? ఎలా కనబడతాయి? చీకట్లో రాయి వేస్తుందేమో.. ఎలాగయినా లేదని నమ్మించాలి" అనుకుంటూ దగ్గరకెళ్ళాను. అమ్మ వేసిన ప్రశ్నలకు నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు "లేదు" అని సమాధానం చెప్పాను. అమ్మ నమ్మలేదు సరికదా.. దొంగతనం చేసింది కాకుండా అబద్దాలు కూడా చెప్తావా అంటూ మీదకొచ్చింది. డాడీ అడ్డొస్తూ నా కంటే ఒక ఆకు ఎక్కువగా, "నేను ప్రియా ఇద్దరం కలిసే వచ్చాం. పూల గోల మాకు తెలియనే తెలియదు. నీ అనుమానాలకు ఓ హద్దు పద్దు లేకుండాపోతోంది" అని సీరియస్ అయ్యారు.  అమ్మ డాడీ వైపు విసురుగా చూసి రవి అంకుల్ కెమెరా అడిగి తీసుకొచ్చి డాడీకీ నాకూ చూయించింది. చూస్తే ఏముంది..?!! మీరే చూడండీ.రన్నింగ్ మోషన్లో కాప్చర్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నారట. బాగా వచ్చిందని అందరికీ చూయించారట! "ఖర్మ! ఈ దరిద్రుడు.. వీడికి వేరే పని లేదు. గొప్ప ఫోటోగ్రాఫర్ అని వీడి బోడి ఫీలింగ్. శనిలా దాపురించాడు.... .... ..." అని నానా విధాలుగా తిట్టుకున్నాను ( పెద్దయ్యాక సారీ చెప్పుకున్నానులెండి.. మనసులో తిట్టుకున్నాను కనుక మనసులోనే సారీ చెప్పుకున్నాను). ఫోటో మాట ఎలా ఉన్నా, ముందు డాడీ కి, ఆ తరువాత నాకూ అమ్మ క్లాస్ తో చుక్కలు కనిపించాయి. ఆ క్లాస్ రన్నింగ్ లో ఉండగానే ఆ ఇంటి ఓనర్లు రావడం, వాళ్లకి ఓ సారీ, వాళ్ళ పువ్వులు, వాటితో పాటు నన్నూ అప్పగించింది. పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు. "పోనీలేమ్మా రెండు పువ్వులేగా? చిన్నపిల్ల ఆశపడింది" అంటూ నన్ను వెనకేసుకొచ్చారు. స్టిల్! అమ్మ వదిలితేగా? ఆ క్లాస్ పూర్తయ్యేసరికి దెబ్బతో నాకు బుద్దోచ్చేసింది. ఆ తరువాత నుండి ఇంకెప్పుడైనా అడక్కుండా చెట్ల మీద చెయ్యేస్తే ఒట్టు!!! 

విలువైన ఈ జీవితానికి మరింత విలువనూ, అందాన్నీ చేకూర్చిన అమ్మకీ, నాన్నకీ, అక్కకీ, నా జీవితంలో పరిచయమయిన ప్రతి ఒక్కరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

By the way.. జీవితంలో నేను తీసిన మొట్టమొదటి ఫోటో ఇది :). అప్పుడు నాకు ఐదేళ్ళు. నాన్న ఫోటో పబ్లిష్ చేయడానికి పర్మిషన్ దొరకలేదు. అందుకే.. అమ్మా, అక్కా ఉన్న ఫోటో మాత్రం పెడుతున్నా :) 

27 comments:

 1. భలే వారే మీరు.. నాకు అలాటివి ఎప్పుడు చేయ్యలనిపించలేదు, ఎందుకంటే అప్పట్లో చేతికందితే అది ఏమిటో అని తెలుసుకునే దాక నిడురపోలేదంటా. మచ్చుక్కి కొన్ని ఇందులో ప్రస్తావిస్తాను

  చిన్నప్పుడు అంటే నా మొదటి ఏట నా బర్త్డేకని తెచ్చిన బూరబూట్లు అందులోంచి సౌండ్ వస్తే తీసి విసిరేసేవాడినుట, అది మొదలు మా బాబాయి అపురూపం గ చుస్కునే ఓ డొక్కు కెమెరా, ఓ కాసేట్ టేప్, ఓ ట్యూబ్‌లైట్ చొక్ అన్ని విరగకోట్టేసా.

  ఇవి దొంగతనాలు కావు కాని, అందులో ఏమున్నదో తెలుసుకోవాలనే ఔత్సుకత మొదలయ్యింది. ఓ సారి మోదుగ పూల చెట్టు ఎక్కి పువ్వు కోస్తూ జారి పడ్డాను, చెయ్యి గీరుకుంది, ఇప్పటికి ఆ స్కార్ నా ఎడమ చేతికి ఉండిపోయింది.

  ఇవి నా చిన్ననాటి జ్ఞాపకాలలో కొన్ని. మీ టపా ఆసాంతం బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీధర్ గారు :)
   మీ జ్ఞాపకాలూ బావున్నాయి.

   Delete
 2. Anonymous23/7/13

  super priya...nenu first time 5 years back friends antha chilipi donga thanalu chesthunte nenu cheddamani bandi meeda amme key chain kottesanu...tarvatha anipinchindi kasta jeevulu...valla daggara kotteyyadam correct kadu ani...mi story chaduvuthunte ade gurthu vachindi

  ReplyDelete
  Replies
  1. అయ్యో!! పోనీలెండి రియలైజ్ అయ్యారు కదా.. అదే సంతోషం.
   తప్పుని ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను :)

   Delete
 3. చిన్ని చిన్ని చిన్ననాటి స్మృతులని మీరిలా గుర్తుచేసుకోవటం ఎంతో బాగుంది. ఫొటో లొ క్యాప్చర్ చేసి పెద్దయ్యాక చూసుకోవటం కన్నా గొప్ప అనుభూతి మరోటి లేదు.

  ReplyDelete
  Replies
  1. కాని ఆ ఫోటో వల్ల నేనారోజు ఎన్ని తిట్లు తిన్నానో! దాన్ని చూసినపుడల్లా ముందు ఒక ఆడ్ ఫీలింగ్ ఒకటి ఆవరిస్తుంది. ఆ తర్వాత నవ్వొస్తుంది. అసలు దాన్ని కాప్చర్ చేసినందుకు ఆ రవి అంకుల్ ని ఎంత తిట్టుకున్నానో.. :P

   చెప్పడం మర్చిపోయాను.. Thanks for the comment :)

   Delete
 4. ilanti chinna chinna dongatanalu cheyakapote adi childhood ela avutundandi :P school lo chinnappudu pens and pencils kottesevaadini..lucky ga evariki dorakaledu

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ్హ.. అన్ని కొట్టేసి ఒక్కసారి కూడా దొరకలేదంటే మీరు అసాధ్యులే శ్రీనివాస్ గారు :)

   Delete
 5. అమ్మదొంగా.......:-)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ.. ఆ పాట ఎంత బావుంటుందో కద పద్మగారు? :))

   Delete
  2. ఏది ఈ పాటే కదా చెల్లి..

   అమ్మదొంగా నిన్ను చూడకుంటే...

   ~శ్రీ~

   Delete
 6. హహహ బాగున్నాయండీ మీ కబుర్లు :-))

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ వేణూ గారు.. :)
   ఇంతకూ మీరేమైనా చేశారా లేదా?? మీ కబుర్లు కూడా పంచుకుంటే బావుంటుంది కదా? అంటే.. నేనొక్కతినే కాదులే మరికొంతమంది తోడున్నారని భరోసాగా ఫీల్ అవుదామని :P

   Delete
  2. హహహ పబ్లిక్ గా చెప్పిన చెప్పకపోయినా మీకు చాలామందే తోడుంటారండీ నో డౌట్ :-) నా గురించి రాయాలంటే ఈ కామెంట్ బాక్స్ సరిపోదు అందుకే ఆగాను తొందర్లో ఓ పోస్టేస్తాలెండి :-)

   Delete
  3. మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాను వేణూ గారు. వీలైనంత త్వరగా రాసేయండి. మీ రాతల్లో ఆ చిన్ననాటి కబుర్లు చదవాలని ఉంది :)

   Delete
 7. Anonymous23/7/13

  chinnappudu chala chesamu memu kuda ilanti donga panulu Priya garu. maa amma ki eppudu dorakaledu anukondi adi vere vishayam. mee amma garu chala modern ga bagunnaru.

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ :)
   అయినా గ్రేట్ అండీ ఒక్కసారికూడా అమ్మ కి దొరక్కపోవడం..

   Delete
 8. మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

  www.poodanda.blogspot.com

  ReplyDelete
 9. Anonymous26/7/13

  bagundandi mee chinnanaati gnapakam!!

  chinnappudu avi poolu.. so adi dongatanam category loki raademonandi :) .......
  -Prashanth

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ప్రశాంత్ గారు.
   వస్తువు ఏదైనా.. పర్మిషన్ లేకుండా, ఎవ్వరూ చూడకూడదు అనుకుంటూ తీసుకుంటే అది దొంగతనం కిందకే వస్తుంది కదండీ.. :)

   Delete
 10. Replies
  1. హహ్హహ.. థాంక్స్ డేవిడ్ గారు. కాని మీ రహస్యాలు పంచుకోకుండా ఎస్కేప్ అయిపోతున్నారు..?

   Delete
 11. దొంగతనం కాదు కానీ , మా పెరట్లో పూలు కోసుకెళ్ళే వాళ్ళని ముఖ్యంగా వేసవిలో పూసే ఆకుపచ్చ సంపెంగ దొంగల్ని మాత్రం తెగ పట్టుకునే దాన్ని ...ఒకోసారి గోరింటాకు దొంగల్ని కూడా పట్టకుని మా బామ్మ దగ్గరకి తీసుకెళ్ళేదాన్ని వాళ్ళు పువ్వులు / గోరింటాకు పూర్తిగా కోసేంతవరకు చూసి , చెట్టు మొత్తం ఖాళీ చేసాకా , అప్పుడు పెద్దగా కేకలు పెట్టి మా బామ్మని పిలిచే దాన్ని , మా బామ్మ అప్పట్లో కన్నాంబ టైపు
  తాడులా కనిపించే త్రాచు అన్నమాట .
  కోసిన పూవులు అన్నీ లాగేసుకుని ఒక పువ్వు రేకో , గోరింటాకు ఆకో చేతిలో పెట్టేది ..
  ఆ కోసినవన్నీ నా జడలోకీ , నా చేతికి , పారాణీకి హాయిగా నేను కష్టపడే పనిలేకుండా వచ్చేసేవి ..

  జడ కుట్టమంటే... మా బామ్మ... పూవులు కోయవే కుడతాను అనేది . నా బద్దకానికి ఇలాంటి వాళ్ళు దొరికేవాళ్ళు . ఒక విధంగా నాది ఘరానా (పని ) దొంగతనం…ఇప్పటికీ నేను పని దొంగనే : P

  ఆ రవి అంకుల్ ఎవరో గానీ భలే చేసాడు ...

  మీ అమ్మ గారు , మీ అక్క సూపర్ గా ఉన్నారు ఫోటోలో ...గొప్పతనం ఫొటో తీసేవాళ్ళలోనే కాదు . తీయించుకునే వాళ్ళలో ఉందని ఇప్పుడే తెలిసింది , వాళ్ళ ధైర్యానికి నా అభినందనలు ;)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ.. బావున్నాయి మీ జ్ఞాపకాలు.
   Thanks for the comment :)

   Delete
 12. ఆహ ఎమ్ రాసారండి, ఓ అరగంట ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి నేను చిన్నప్పుడు చేసిన దొంగతనాలు టప టప గుర్తు చేసుకున్నాను, మదుర అనుభవాలు. బోలెడు థాంక్స్.

  ReplyDelete
  Replies
  1. చాలా సంతోషం శేఖర్ గారు. నేనే మీకు థాంక్స్ చెప్పాలి. నా టపా ద్వారా మీ మధురానుభావాలను జ్ఞాపకం చేసుకున్నందుకు :)