Friday, July 26, 2013

వంటలు - గీతక్క

ఒక ఫ్రెండ్ ద్వారా గీతక్క నాకు పరిచయమయింది. రెండేళ్ళ క్రితం వచ్చారు వాళ్ళు చెన్నై కి. తెలుగు వాళ్ళే. "హాయ్, బాగున్నారా, బాయ్" కొత్తలో ఇంతకంటే ఇంకేమి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అక్క కి రెండున్నరేళ్ళ (అప్పుడు) బాబు. వాడి మూలానే కాస్త త్వరగా ఫ్రెండ్స్ అయిపోయాం మేము. ఒక విధంగా మేము ఫ్రెండ్స్ అవ్వడానికి వంటలే ఇంకా పెద్ద పాత్ర పోషించాయి.

ఆవిడ పరిచయమయ్యే సరికే నేను వంటలు చేసేదాన్ని కాని పూర్తిస్థాయి వంటలు రావు. అమ్మ దగ్గర నేర్చుకుందామని దగ్గర కూర్చున్నా, పాఠాల కంటే పాట్లే ఎక్కువగా ఉండేవి. అందుకే.. నాకు వచ్చిందేదో చేసుకునే దాన్ని కాని కొత్తవాటి జోలికి పోలేదు. అప్పట్లో నాకు వచ్చిన వంటలంటే.. బంగాళదుంప వేపుడు, కూర, వంకాయ కూర, అరటి పువ్వు పెసరపప్పు, ఆకు కూర, కొన్ని కూరగాయల వేపుళ్ళు, బీరకాయ ఇగురు, దొండకాయ కూర, వెజ్ నూడల్స్ (ఇవి చేయడంలో మాత్రం నేను ఎక్స్పర్ట్ ని) టమాటా రైస్. ఇంతే. ఇవి కూడా ఎప్పుడూ ఒకే స్టైల్ లో. ఇంటికి ఎవరొచ్చినా ఇవి వండి పెట్టేసేదాన్ని. నాన్న ఇష్టంగా తింటారు. అక్కకి పని చెప్పనంత వరకూ ఏదైనా "గుడ్" అనే అంటుంది. కాని అమ్మకి మాత్రం నా వంటలు నచ్చవు (పిల్లల వంటలు అంటూ కూరలో కరివేపాకులా తీసేస్తుంది. బ్రతిమాలినా ఒక్క ముద్దకంటే ఎక్కువ తినదు).  అలాటిది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకు భరత్ దొరికాడు. వచ్చిన వాటితో పాటు ఇంటర్నెట్ లో చూసినవీ ఎడాపెడా వండిపెట్టేసేదాన్ని. పాపం అప్పట్లో తను హాస్టల్ లో ఉండేవాడు కనుక గోల చేయకుండా "బావుంది" అంటూ తినేవాడు. నేనింకా రెచ్చిపోయి ప్రయోగాలు చేసి "ప్రియ వంటలు చాలా బావుంటాయి" అని ఇంటా, బయటా, ఆఫీస్ లో పేరు తెచ్చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే నేను చేసిన వాటి కోసం కొట్టుకునే వారు! ఇంకేముందీ.. ఇవన్ని చూసి నేను క్లౌడ్ 9 ఎక్కి కూర్చున్నాను. 

ఇంటికి ఎవరైనా మొదటిసారి వచ్చినపుడు కచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆచారం/అలవాటు. అలాగే ఎవరు వచ్చినా తినకుండా మాత్రం పంపను. అలాగే ఓ సారి గీతక్కా వాళ్ళు ఇంటికి వచ్చినపుడు ఏదో వండాను. ఆవిడ చాలా బావుందని మరీ మరీ చెప్పడంతో పొంగిపొర్లిపోయాను. తరువాత వాళ్ళబ్బాయి పుట్టిన రోజుకి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాం. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా వంటలు అసలు నథింగ్. ఆవిడ చేసినవన్నీ ఎంత బావున్నాయో!! నేనైతే ఫిదా అయిపోయాను. ఏ వంట ఎలా చేసిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఓ వైపు, అడిగితే ఏమనుకుంటారో అన్న సందేహం ఓ వైపు. మొహమాటపడుతూనే "చాలా బాగా చేశారు అక్కా. మీరేమి అనుకోకపోతే నాకూ నేర్పగలరా? నాకు చాలా ఇష్టం వంట చేయడమంటే" అన్నాను. ఆవిడ నవ్వేసి "దానిదేముంది ప్రియా.. తప్పకుండా" అన్నారు. 

అప్పుడు మొదలు.. తన దగ్గర నా శిష్యరికం. పప్పు, గుత్తొంకాయ కూరా, పాయసం, పకోడీ, చికెన్ (భరత్ కోసం), అబ్బా.. ఈ లిస్టు ఇక ఆగదండి. ఈ రోజు "నీ వంట చాలా బావుంది" అంటూ నాకొచ్చిన ప్రతీ కాంప్లిమెంట్ గీతక్కకే చెందుతుంది. ఎంతో ఓపికతో నా సందేహాలన్నీ తీరుస్తూ, ఎన్నో చిట్కాలు చెబుతూ నన్ను మంచి(?) కుక్ గా మలచిన తనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరే.. వంటల విషయంలో తృష్ణ గారి "రుచి.." బ్లాగ్ కూడా నాకు ఎంతో తోడ్పడింది. ఆవిడకూ బ్లాగ్ ముఖంగా థాంక్స్ చెబుతున్నాను. 

నిజానికి నేనే వంటల బ్లాగ్ మొదలుపెడదాం అనుకున్నాను కాని, నాకంటే నా గురువు స్టార్ట్ చేస్తే ఇంకా బావుంటుందని "ఇంత బాగా వంట చేస్తున్నావు కదక్కా.. వీటిని వీలైనంత ఎక్కువ మందికి నేర్పొచ్చు కదా? ఒక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం.. ఏమంటావు" అన్నాను. తనకీ ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ వేళే బ్లాగ్ మొదలుపెట్టారు. తన బ్లాగ్ లింక్: http://geethavanta.blogspot.in, తనను ప్రోత్సహించి మరిన్ని మంచి వంటలు బ్లాగ్ ద్వారా మనతో పంచుకోవడానికి  మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. 

థాంక్స్ :)

28 comments:

Geetha Pavani said...

మరీ ఇన్ని కృతజ్ఞతలను మోయలేను ప్రియ. నీవల్లె నేను ఇంత బాగావంట చేయగలనని తెలుసుకున్నాను. చూద్దాం ఇంకా ఎందరికి నా వంటలు నచ్చుతాయో

Pratap Reddy said...

pirya maa adida kante nuvve better ... pelli ki munde vanta anta nerchukunav ...

Priya said...

:) Thanks.

Priya said...

కచ్చితంగా చాలా మందికి నచ్చుతాయి గీతక్కా. ఫ్రీక్వెంట్ గా పోస్ట్లు రాస్తుండండి :)

డేవిడ్ said...

ప్రియగారు బాగుంది మీ వంటల ప్రయత్నం అండ్ గీతక్క పరిచయం :)....బైదివే మీ గీత గారు వంటల గురించి ఒక బ్లాగ్ మొదలెట్టిందని ఒక శుభవార్త చెప్పారు...చూద్దాం ఆ వంటలు నాలాంటి వారికి ఎమైన ఉపయోగపడతాయోమో.

Priya said...

Thanks a lot డేవిడ్ గారు :)
కచ్చితంగా ఉపయోగపడతాయి. అయినా రూప గారు ఉండగా మీకెందుకండీ మళ్ళీ ఈ వంట గోల?

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయండీ మీ కబుర్లు, మీ గీతక్క గారికి ఆల్ ద బెస్ట్ :-)

Priya said...

చాలా చాలా థాంక్స్ వేణూ గారు :)

Mohana said...

కొత్త బ్లాగ్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.మీ వంట గురించి బాగా వ్రాశారు.

జయ said...

బాగుందండి:) . మీ గీతక్క గారి బ్లాగ్ పరిచయం చేసి మంచిపని చేసారు. నా థాంక్స్ చెప్పండి.

డేవిడ్ said...

అప్పుడప్పుడు నేను కూడా నేను కూడా వంట చేయాలి కదండీ

Priya said...

వావ్.. నిజంగా మీరు వంట చేస్తారా!? అయితే మరి ఎప్పుడు రుచి చూపిస్తారు డేవిడ్ గారు?

రాధిక(నాని ) said...

మీ గీతక్క గారి వంటల బ్లాగ్ కి స్వగతమండి.

చిన్ని ఆశ said...

ఇంకేం, గురువుని మించిన శిష్యురాలయిపోండి మరి ;)

Priya said...

థాంక్స్ మోహనా :)

Priya said...

జయ గారు.. thank you so much అండీ. తప్పకుండా చెబుతాను :)

Priya said...

థాంక్స్ రాధిక గారు :)

Priya said...

హహ్హహ్హ.. అమ్మబాబోయ్ మీరలా అనకండి పండు గారు. గీతక్క వింటే ఏమనుకుంటుందో.. :P

Priya said...

గీతక్క బ్లాగ్ లో కామెంట్స్ ద్వారా ఆమెను ప్రోత్సహించిన వేణూ, పండు (చిన్ని ఆశ), శ్రావ్య, రాధిక, మోహన, వనజవనమాలి, మోహన, నాగరాణి గార్లకు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా బ్లాగ్ ద్వారా ఆమె బ్లాగ్ ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు :)

డేవిడ్ said...

మీరు నా వట రుచి చూడాలంటే హైదరాబాద్ రావాల్సిందే ప్రియ గారు...మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో చెప్పండి అప్పుడు నా వంట రుచి చుపిస్తాను.

Praveena said...

Priya, thanks for introducing the new food blog.
Mee anni posts chaala chaala interesting ga vunnayi. I always keep checking if you have posted a new one.

Priya said...

నాకు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళెవరూ లేరండీ. కాని మీ వంట రుచి చూడ్డానికైనా మీ ఇంటికి వచ్చేస్తాను. లేకపోతే నా పెళ్ళికి వచ్చేడపుడు మీరేమైనా వండి తీసుకురండి :)
ఏమంటారు డేవిడ్ గారు?

Priya said...

Thank you so much, ప్రవీణ గారు.
మీ అభిమానాన్ని మూటగట్టుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు :)

డేవిడ్ said...

హైదరాబాదులో మేము ఉన్నాము కదండీ తెలిసిన వాళ్లం మా ఇంటికి వచ్చేయండి...మీ పెళ్ళికి వచ్చే టప్పుడు తీసుకురావాలంటున్నారు కానీ మీ పెళ్ళి ఎప్పుడో చెప్పనే లేదు...పైగా ఇక్కడి నుంచి అక్కడివరకు తీసుకు వచ్చే వరకు పాడవుతుందండీ.అందుకే మీరూ, భరత్ ఓసారు హైదరాబాద్ కు రండీ మాంచి స్పెషల్ వంటకాలు అరెంజ్ చేస్తాము మా ఆతిథ్యాన్ని స్వికరించి వెల్లొచ్చు

Priya said...

థాంక్స్ డేవిడ్ గారు. భరత్ కి సెప్టెంబర్ వరకు సెలవు దొరకదట. కొత్తగా బ్యాంకు లో జాయిన్ అయ్యాడు కదా.. సో నవంబర్ లో పెళ్లి పెట్టుకుంటున్నారు. కాని ఇంకా డేట్ ఫిక్స్ అవలేదు. అయ్యాక మీకు చెబుతాను. తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీ ప్రేమపూర్వక ఆతిధ్యాన్ని మనసారా నింపుకుంటాం :)

తరువాత మీరూ, రూప గారు మా ఇంటికి వచ్చి నా చేతి వంట కూడా రుచి చూద్దురు :)

డేవిడ్ said...

:)

Praveena said...

Priya, I hope you are aware of this Jeevani site
http://jeevani2009.blogspot.com/2013/08/blog-post_5.html

Priya said...

Sorry for the late reply, Praveena gaaru.

I am not aware of that blog. But after seeing your comment, I visited. Thanks for introducing it. Will surely do what I can :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Friday, July 26, 2013

వంటలు - గీతక్క

ఒక ఫ్రెండ్ ద్వారా గీతక్క నాకు పరిచయమయింది. రెండేళ్ళ క్రితం వచ్చారు వాళ్ళు చెన్నై కి. తెలుగు వాళ్ళే. "హాయ్, బాగున్నారా, బాయ్" కొత్తలో ఇంతకంటే ఇంకేమి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అక్క కి రెండున్నరేళ్ళ (అప్పుడు) బాబు. వాడి మూలానే కాస్త త్వరగా ఫ్రెండ్స్ అయిపోయాం మేము. ఒక విధంగా మేము ఫ్రెండ్స్ అవ్వడానికి వంటలే ఇంకా పెద్ద పాత్ర పోషించాయి.

ఆవిడ పరిచయమయ్యే సరికే నేను వంటలు చేసేదాన్ని కాని పూర్తిస్థాయి వంటలు రావు. అమ్మ దగ్గర నేర్చుకుందామని దగ్గర కూర్చున్నా, పాఠాల కంటే పాట్లే ఎక్కువగా ఉండేవి. అందుకే.. నాకు వచ్చిందేదో చేసుకునే దాన్ని కాని కొత్తవాటి జోలికి పోలేదు. అప్పట్లో నాకు వచ్చిన వంటలంటే.. బంగాళదుంప వేపుడు, కూర, వంకాయ కూర, అరటి పువ్వు పెసరపప్పు, ఆకు కూర, కొన్ని కూరగాయల వేపుళ్ళు, బీరకాయ ఇగురు, దొండకాయ కూర, వెజ్ నూడల్స్ (ఇవి చేయడంలో మాత్రం నేను ఎక్స్పర్ట్ ని) టమాటా రైస్. ఇంతే. ఇవి కూడా ఎప్పుడూ ఒకే స్టైల్ లో. ఇంటికి ఎవరొచ్చినా ఇవి వండి పెట్టేసేదాన్ని. నాన్న ఇష్టంగా తింటారు. అక్కకి పని చెప్పనంత వరకూ ఏదైనా "గుడ్" అనే అంటుంది. కాని అమ్మకి మాత్రం నా వంటలు నచ్చవు (పిల్లల వంటలు అంటూ కూరలో కరివేపాకులా తీసేస్తుంది. బ్రతిమాలినా ఒక్క ముద్దకంటే ఎక్కువ తినదు).  అలాటిది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకు భరత్ దొరికాడు. వచ్చిన వాటితో పాటు ఇంటర్నెట్ లో చూసినవీ ఎడాపెడా వండిపెట్టేసేదాన్ని. పాపం అప్పట్లో తను హాస్టల్ లో ఉండేవాడు కనుక గోల చేయకుండా "బావుంది" అంటూ తినేవాడు. నేనింకా రెచ్చిపోయి ప్రయోగాలు చేసి "ప్రియ వంటలు చాలా బావుంటాయి" అని ఇంటా, బయటా, ఆఫీస్ లో పేరు తెచ్చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే నేను చేసిన వాటి కోసం కొట్టుకునే వారు! ఇంకేముందీ.. ఇవన్ని చూసి నేను క్లౌడ్ 9 ఎక్కి కూర్చున్నాను. 

ఇంటికి ఎవరైనా మొదటిసారి వచ్చినపుడు కచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆచారం/అలవాటు. అలాగే ఎవరు వచ్చినా తినకుండా మాత్రం పంపను. అలాగే ఓ సారి గీతక్కా వాళ్ళు ఇంటికి వచ్చినపుడు ఏదో వండాను. ఆవిడ చాలా బావుందని మరీ మరీ చెప్పడంతో పొంగిపొర్లిపోయాను. తరువాత వాళ్ళబ్బాయి పుట్టిన రోజుకి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాం. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా వంటలు అసలు నథింగ్. ఆవిడ చేసినవన్నీ ఎంత బావున్నాయో!! నేనైతే ఫిదా అయిపోయాను. ఏ వంట ఎలా చేసిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఓ వైపు, అడిగితే ఏమనుకుంటారో అన్న సందేహం ఓ వైపు. మొహమాటపడుతూనే "చాలా బాగా చేశారు అక్కా. మీరేమి అనుకోకపోతే నాకూ నేర్పగలరా? నాకు చాలా ఇష్టం వంట చేయడమంటే" అన్నాను. ఆవిడ నవ్వేసి "దానిదేముంది ప్రియా.. తప్పకుండా" అన్నారు. 

అప్పుడు మొదలు.. తన దగ్గర నా శిష్యరికం. పప్పు, గుత్తొంకాయ కూరా, పాయసం, పకోడీ, చికెన్ (భరత్ కోసం), అబ్బా.. ఈ లిస్టు ఇక ఆగదండి. ఈ రోజు "నీ వంట చాలా బావుంది" అంటూ నాకొచ్చిన ప్రతీ కాంప్లిమెంట్ గీతక్కకే చెందుతుంది. ఎంతో ఓపికతో నా సందేహాలన్నీ తీరుస్తూ, ఎన్నో చిట్కాలు చెబుతూ నన్ను మంచి(?) కుక్ గా మలచిన తనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరే.. వంటల విషయంలో తృష్ణ గారి "రుచి.." బ్లాగ్ కూడా నాకు ఎంతో తోడ్పడింది. ఆవిడకూ బ్లాగ్ ముఖంగా థాంక్స్ చెబుతున్నాను. 

నిజానికి నేనే వంటల బ్లాగ్ మొదలుపెడదాం అనుకున్నాను కాని, నాకంటే నా గురువు స్టార్ట్ చేస్తే ఇంకా బావుంటుందని "ఇంత బాగా వంట చేస్తున్నావు కదక్కా.. వీటిని వీలైనంత ఎక్కువ మందికి నేర్పొచ్చు కదా? ఒక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం.. ఏమంటావు" అన్నాను. తనకీ ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ వేళే బ్లాగ్ మొదలుపెట్టారు. తన బ్లాగ్ లింక్: http://geethavanta.blogspot.in, తనను ప్రోత్సహించి మరిన్ని మంచి వంటలు బ్లాగ్ ద్వారా మనతో పంచుకోవడానికి  మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. 

థాంక్స్ :)

28 comments:

 1. మరీ ఇన్ని కృతజ్ఞతలను మోయలేను ప్రియ. నీవల్లె నేను ఇంత బాగావంట చేయగలనని తెలుసుకున్నాను. చూద్దాం ఇంకా ఎందరికి నా వంటలు నచ్చుతాయో

  ReplyDelete
  Replies
  1. కచ్చితంగా చాలా మందికి నచ్చుతాయి గీతక్కా. ఫ్రీక్వెంట్ గా పోస్ట్లు రాస్తుండండి :)

   Delete
 2. Pratap Reddy26/7/13

  pirya maa adida kante nuvve better ... pelli ki munde vanta anta nerchukunav ...

  ReplyDelete
 3. ప్రియగారు బాగుంది మీ వంటల ప్రయత్నం అండ్ గీతక్క పరిచయం :)....బైదివే మీ గీత గారు వంటల గురించి ఒక బ్లాగ్ మొదలెట్టిందని ఒక శుభవార్త చెప్పారు...చూద్దాం ఆ వంటలు నాలాంటి వారికి ఎమైన ఉపయోగపడతాయోమో.

  ReplyDelete
  Replies
  1. Thanks a lot డేవిడ్ గారు :)
   కచ్చితంగా ఉపయోగపడతాయి. అయినా రూప గారు ఉండగా మీకెందుకండీ మళ్ళీ ఈ వంట గోల?

   Delete
 4. బాగున్నాయండీ మీ కబుర్లు, మీ గీతక్క గారికి ఆల్ ద బెస్ట్ :-)

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా థాంక్స్ వేణూ గారు :)

   Delete
 5. కొత్త బ్లాగ్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.మీ వంట గురించి బాగా వ్రాశారు.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ మోహనా :)

   Delete
 6. బాగుందండి:) . మీ గీతక్క గారి బ్లాగ్ పరిచయం చేసి మంచిపని చేసారు. నా థాంక్స్ చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. జయ గారు.. thank you so much అండీ. తప్పకుండా చెబుతాను :)

   Delete
 7. అప్పుడప్పుడు నేను కూడా నేను కూడా వంట చేయాలి కదండీ

  ReplyDelete
  Replies
  1. వావ్.. నిజంగా మీరు వంట చేస్తారా!? అయితే మరి ఎప్పుడు రుచి చూపిస్తారు డేవిడ్ గారు?

   Delete
 8. మీ గీతక్క గారి వంటల బ్లాగ్ కి స్వగతమండి.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాధిక గారు :)

   Delete
 9. ఇంకేం, గురువుని మించిన శిష్యురాలయిపోండి మరి ;)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ.. అమ్మబాబోయ్ మీరలా అనకండి పండు గారు. గీతక్క వింటే ఏమనుకుంటుందో.. :P

   Delete
 10. గీతక్క బ్లాగ్ లో కామెంట్స్ ద్వారా ఆమెను ప్రోత్సహించిన వేణూ, పండు (చిన్ని ఆశ), శ్రావ్య, రాధిక, మోహన, వనజవనమాలి, మోహన, నాగరాణి గార్లకు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా బ్లాగ్ ద్వారా ఆమె బ్లాగ్ ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు :)

  ReplyDelete
 11. మీరు నా వట రుచి చూడాలంటే హైదరాబాద్ రావాల్సిందే ప్రియ గారు...మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో చెప్పండి అప్పుడు నా వంట రుచి చుపిస్తాను.

  ReplyDelete
  Replies
  1. నాకు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళెవరూ లేరండీ. కాని మీ వంట రుచి చూడ్డానికైనా మీ ఇంటికి వచ్చేస్తాను. లేకపోతే నా పెళ్ళికి వచ్చేడపుడు మీరేమైనా వండి తీసుకురండి :)
   ఏమంటారు డేవిడ్ గారు?

   Delete
 12. Priya, thanks for introducing the new food blog.
  Mee anni posts chaala chaala interesting ga vunnayi. I always keep checking if you have posted a new one.

  ReplyDelete
  Replies
  1. Thank you so much, ప్రవీణ గారు.
   మీ అభిమానాన్ని మూటగట్టుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు :)

   Delete
 13. హైదరాబాదులో మేము ఉన్నాము కదండీ తెలిసిన వాళ్లం మా ఇంటికి వచ్చేయండి...మీ పెళ్ళికి వచ్చే టప్పుడు తీసుకురావాలంటున్నారు కానీ మీ పెళ్ళి ఎప్పుడో చెప్పనే లేదు...పైగా ఇక్కడి నుంచి అక్కడివరకు తీసుకు వచ్చే వరకు పాడవుతుందండీ.అందుకే మీరూ, భరత్ ఓసారు హైదరాబాద్ కు రండీ మాంచి స్పెషల్ వంటకాలు అరెంజ్ చేస్తాము మా ఆతిథ్యాన్ని స్వికరించి వెల్లొచ్చు

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ డేవిడ్ గారు. భరత్ కి సెప్టెంబర్ వరకు సెలవు దొరకదట. కొత్తగా బ్యాంకు లో జాయిన్ అయ్యాడు కదా.. సో నవంబర్ లో పెళ్లి పెట్టుకుంటున్నారు. కాని ఇంకా డేట్ ఫిక్స్ అవలేదు. అయ్యాక మీకు చెబుతాను. తప్పకుండా మీ ఇంటికి వచ్చి మీ ప్రేమపూర్వక ఆతిధ్యాన్ని మనసారా నింపుకుంటాం :)

   తరువాత మీరూ, రూప గారు మా ఇంటికి వచ్చి నా చేతి వంట కూడా రుచి చూద్దురు :)

   Delete
 14. Priya, I hope you are aware of this Jeevani site
  http://jeevani2009.blogspot.com/2013/08/blog-post_5.html

  ReplyDelete
  Replies
  1. Sorry for the late reply, Praveena gaaru.