Wednesday, July 31, 2013

ఎదురుచూపులు

"కాలం ఒక్కసారి వెనక్కి వెళితే ఎంత బావుండో" ఈ మాట తరచూగా అనుకుంటున్నానండీ ఈ మధ్య. మీతో సరదాగా గడిపిన సన్నివేశాలాను గుర్తు చేసుకోవాలంటే గతంలోకి వెళ్ళక తప్పడంలేదు. ఏదైనా.. "అప్పట్లో, ఆ రోజుల్లో" అంటూ మొదలుపెట్టుకోవాల్సి వస్తోందే తప్ప..  నిన్న, మొన్న, పోయిన వారం, అంతెందుకు? గడిచిన రెండేళ్లలో కూడా మన ఇద్దరికీ సంబంధించి ఒక్క తియ్యటి జ్ఞాపకం కూడా గుర్తురావడం లేదు. ఉంటేగా గుర్తు రావడానికి? నేను మిమ్మల్ని తప్పుపట్టను, పట్టలేను. మీ ప్రేమ నాకు తెలుసు. నాకోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని తెలుసు. తెలిసీ ఎందుకో బాధ.

ఉదయం లేస్తూనే మీ మొహం చూడాలని, మీ నుదిటి మీద ముద్దు పెడుతూ నా రోజు ప్రారంభించాలని ఆశ పడుతుంటాను. బ్యాడ్ లక్. మీకు చీకటితో లేచే అలవాటు ఉండడం, నేను లేవలేకపోవడం వల్ల ఆరుగంటలకు నిద్రకళ్ళతో మిమ్మల్ని వెతుక్కునే సమయానికి మీరు హాల్లో ఇంటర్నెట్ తో బిజీ గా ఉంటారు. నిట్టూర్చి, మీకంటే ముందు లేవనందుకు బాధపడుతూ ఆ బాధను మీపై కోపంగా మార్చి "పొద్దున్నే మొదలు పెట్టేసారా? ఎన్ని సార్లు చెప్పాలి? మీరు లేచినపుడే నన్నూ లేపమని? అయినా ఆ చేసుకునే పనేదో నా పక్కనే ఉండి చేసుకోవచ్చుగా" అన్న మాటలతో నా రోజు మొదలవుతోంది. రేపైనా ఇలా జరక్కూడదనుకుంటూ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి, స్నానానికి కావలసిన ఏర్పాట్లు చేసి, మీరు వచ్చేలోపు ఇల్లు ఊడ్చుకుని, వచ్చాక "లేట్ అవుతోంది" అంటూ మీరు హడావిడిగా తింటుంటే.. కసురుకుని, ఆఫీస్ కి సాగనంపేడపుడు పదే పదే జాగ్రత్తలు చెప్పి "ఆఫీస్ చేరుకున్నాను" అంటూ మీరు పంపే sms కోసం ఎదురుచూడడంతో మొదలు. సాయంత్రం మీరు వచ్చే వరకూ ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ.. "ఎప్పుడెపుడు మీరు ఇంటికి వస్తారా.. సరదాగా కాసేపు మీతో ముచ్చట్లాడదామా" అని ఎదురుచూస్తూనే ఉంటాను.

Google image 
రాత్రి ఏడున్నర అయే సరికి మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. అప్పటికి వంట పని, ఇంటి పని ముగించుకుని.. స్నానం చేసి తయారయి టీవీ ముందు కూర్చుంటాను. టీవీ చూస్తానన్న మాటే కాని నా మనసంతా గేట్ దగ్గరే ఉంటుంది. ఏ చిన్న చప్పుడు వినిపించినా మీరేనేమో చూద్దామని కిటికీ దగ్గరకు పరుగు పెడతాను. అలా ఎన్నోసార్లు నేను తిరిగాక మీరు వస్తారు. సంతోషంగా ఎదురొచ్చి నీళ్ళందించి, ఫ్రెష్అప్ అయ్యే వరకూ వెయిట్ చేసి మీతో ఏమైనా మాట్లాడదామని మొదలుపెట్టేలోపు, మీరే మీ ఆఫీస్ కబుర్లు మొదలుపెడతారు. రోజంతా మీరేం చేశారో, మీ ఆఫీస్ లో మనుషులు ఎలాటి వారో తెలుసుకోవడం.. అదీ మీ మాటల్లో! నాకు చాలా సంతోషం. కాని అదే నా సంతోషం కాదు. 

నా మాటలు మీకు బోర్ గా అనిపిస్తాయన్నారు. "సరేలే ఆయన చెప్పే కబుర్లే విందాం. ఆయన గొంతు వినడం కంటేనా" అనుకున్నాను. కాని కొన్ని రోజులకు నా మనసు మొరాయించడం మొదలుపెట్టింది. మీ గొంతు  
వింటున్నానన్న సంతోషం కంటే, "ఇక ఎప్పుడూ ఈ కబుర్లేనా? మా ఇద్దరికీ సంబంధించినవి ఏవీ లేవా మాట్లాడుకోవడానికి? ఈ రోజు ఆయనకు ఇష్టమైన చీర కట్టుకున్నాను.. కనీసం గుర్తించడేం? ప్రతి రోజూ "మధ్యాహ్నం సరిగా భోంచేశారా.. బావుందా?" అని అడుగుతాను. కాని ఒక్క పూటైన "నువ్వు లంచ్ చేశావా?" అని ఆయనకు ఆయనగా అడగరేం? ఇంటికి రావడం, తినడం, ఫోన్ లో మాట్లాడ్డం కాసేపు నెట్ చూసుకోవడం, నిద్రపోవడం.. ఇంతేనా? ఇంకేం లేదా? ఈ మాత్రం దానికి భార్య ఎందుకు? పనిమనిషిని పెట్టుకోవచ్చుగా? అసలు ఎన్నాళ్ళయింది నవ్వే ఆయన కళ్ళు చూసి?  ఎన్నాళ్ళయింది ఆయన చేతిని పట్టుకుని సరదాగా నడిచి? ఎన్నాళ్ళయింది ఆయన నన్ను బాగున్నావా అని అడిగి? నేనేమైనా అతిగా ఆశపడుతున్నానా??" మనసు పదే పదే అడిగే ఈ ప్రశ్నల తాలూకూ భాదే ఎక్కువవుతోంది.

మరో వైపు "పాపం రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తారు.. అప్పటి వరకూ ఎవ్వరితోనూ మాట్లాడే వీలు కుదరదు కనుక ఇంటికి వచ్చాక మాట్లాడతారు. ఆయనకంటూ కొన్ని ఇష్టాలు, పనులు ఉంటాయి కదా.. అవి చేసుకోకపోతే మనిషి ఎలా ఆనందంగా ఉండగలరు? ఎప్పటికీ పెళ్ళైన కొత్తలోలా ఉండమంటే ఎలా.. బాధ్యతలు పెరిగేకొద్దీ సమయం తగ్గుతుంది. అర్ధం చేసుకును మసలుకోవాలి కాని ఇలా "నా చీర చూడలేదు. తిన్నావా అని అడగలేదు" అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసుకుని బాధ పడి, ఆయనను బాధపెట్టకూడదు. ఇంటికి కావలసినవన్నీ అమర్చిపెడుతున్నారు. ఉన్నంతలో ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. అది చాలదా?" అనిపిస్తుంది.

నా బాధ చూడ్డానికి చిన్నదిగా కనిపించినా అది మనసు మీద ఎంత ఒత్తిడి కలిగిస్తుందో చెప్పలేను. ఇది మీకు తెలియంది కాదు. మీతో నేనెన్నోసార్లు చెప్పాను. నేను కాకుండా..  వర్క్, ఫ్రెండ్స్,  అవీ ఇవీ అంటూ మీ ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు. కాని మీరే నా ప్రపంచం. మీతో గడిపే సమయంలో కలిగే సంతోషం నాకు మరి ఎందులోనూ దొరకదు. నాకూ కొన్ని వ్యాపకాలు ఉన్నాయి. కాని అవన్నీ నాకు మీ తరువాతే.

మీ నుండి నేను కోరుకునేది కాస్త ప్రేమ, నా ప్రేమకు మరికాస్త గుర్తింపు. అంతే. మీరు నాతో గంటలు గంటలు కబుర్లు చెప్పనవసరం లేదు. మాట్లాడే పది నిముషాలు చిరునవ్వుతో మాట్లాడితే చాలు. నా అందాన్ని పొగుడుతూ నా కొంగు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక్క సారి ఈ చీర నీకు బావుందనో, ఈ వేళ చక్కగా కనిపిస్తున్నావనో చెబితే చాలు. టీనేజ్ కుర్రాడిలా నాతో సరసాలాడనవసరం లేదు. అప్పుడప్పుడు నా చెయ్యి పట్టుకుని మీరు నాకు ఉన్నారన్న భరోసాను కలిగిస్తే చాలు. నిజమే.. మీరు నాకోసమే కష్టపడుతున్నారు. నాతో పాటు మీ లైఫ్ లో ఇంకా కొన్ని పనులు ఉంటాయి. కాదనను. కాని నేనూ మీ లైఫ్ లో ఒక భాగాన్నే. అప్పుడపుడు నా మనసులోకి కూడా తొంగి చూడడంలో తప్పు లేదు. క్షమించండి. కాస్త కటినంగా మాట్లాడాను కదూ? మీ మాటలు గుర్తొచ్చాయి.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను మిమ్మల్ని తప్పు పట్టడంలేదు. మీ మనసు అర్ధం చేసుకుని మీకు అనుగుణంగా నడుచుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా మీరూ నన్ను అర్ధం చేసుకుంటే బావుండని ఆశపడుతున్నాను. మీ బిజీ లైఫ్ లో నా గురించి ఆలోచించడం కష్టమే.. కాని అది ఏదో ఒక రోజు సాధ్యపడుతుందని ఎదురుచూస్తున్నాను.

ఇట్లు,
మీ నేను

మన ప్రియ కి పెళ్ళే కాలేదు కదా ఈ లెటర్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? హహ్హహ్హ.. ఈ లెటర్ నాకు సంబంధించింది కాదండీ. నా స్నేహితురాలు తన భర్త గురించి కంప్లైంట్ చేస్తూ చెప్పిన విషయాలను విని "మరీ ఇంత నెగిటీవ్ గా మాట్లాడితే అర్ధం చేసుకోవడం సంగతి దేవుడెరుగు ఇంకాస్త దూరమైపోతాడే తల్లీ. కాస్త పాజిటీవ్గా నీ బాధలను వివరిస్తూ ఒక లెటర్ రాయి. అన్నీ పట్టించుకోకపోయినా కనీసం ఒక్క మాటైనా మనసుని తాకకపోతుందా?" అన్నాను. దానికి తను, నేను మాట్లాడ్డం లో బాగా వీక్ నీకు తెలుసు కదా.. బాబ్బాబు ఆ లెటర్ ఏదో నువ్వే రాసి పెట్టేయవా అంటూ బ్రతిమాలింది. ఉన్నది ఉన్నట్లు రాయగలను గాని ఊహించి రాయడం నాకు చేత కాదు. ఆ మాటే తనతో చెప్పాక, మళ్ళీ ఓ గంట సేపు ఫోన్ లో తన కష్టాల చిట్టాను విప్పింది. నాకు తను చెప్పిన విధానం అస్సలు నచ్చలేదు. నేను ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతానో ఊహించుకుని, నేనైతే ఎలా స్పందిస్తానో అలా ఈ లెటర్ రాశాను. చూడాలి తనకు నచ్చుతుందో లేదో.

నా పర్సనల్ లైఫ్ లో ఇలాటి లెటర్ రాయవలసి వస్తుందని నేననుకోను.. కాని ఎందుకైనా మంచిదని (ముందస్తు బెయిల్లాగ అన్నమాట) దాచిపెట్టుకుంటూ నా "మనసులోని మౌనరాగం" లో జత చేస్తున్నాను :P

39 comments:

Anonymous said...

ఉత్త్రం జాగ్రత్త పెట్టుకుంటే ముందస్తుగా పనికొస్తుంది :)

Priya said...

తప్పదంటారా తాతయ్య గారు?? మీరు అంత కచ్చితంగా చెబుతుంటే భయం వేస్తోంది.. :)

Anonymous said...

Iam sure priya...niku aa situation radu lee...and meeru "sarocharu" mve chusaraa...kastha ela ne anipisthundii...raviteja richa madya seens..

Priya said...

థాంక్స్ :)
ఆ సినిమా నేను చూడలేదండీ. అలాటివి చూసే ధైర్యం కూడా చేయలేను.

చిన్ని ఆశ said...

ఊహించి రాసిందేనా పెద్ద అనుభవజ్ఞుల్లా రాశారే? ఆడపిల్ల ఆలోచనలకి అనుభవం అవసరం లేదేమో కదూ!
అటువైపు కూడా అర్ధం చేసుకుని స్పందించే మనసుంటే ఆ ఆ బంధం సంబంధం కన్నా అనుబంధం గా ఉంటుందేమో....

Anonymous said...

ఒహ్ ప్రియా...ఎలా అన్నీ నిజాలే రాయగలిగారు? తప్పక దాచుకోండి...future లో పనికొస్తుందనే అనుకుంటున్నా ఒక్కసారైనా.

డేవిడ్ said...

ప్రియ గారు చాల చక్కగా రాసారు లెటరు. మీ లెటర్ చదివాక నాకు, చాలా మంది గృహిణులు ఇలాగే ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది..ఇంతకూ ఈ లెటర్ మీ ఫ్రెండ్ కు నచ్చిందా? వాళ్ళ ఆయనకు ఇచ్చిందా?....మీ లెటర్ చదివాకా మా రూప నా గురించి ఏమనుకుంటుందో అని డౌట్ వస్తుంది....తనను కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాయమని అడగాలి.

Lasya Ramakrishna said...

EE letter ki bharat response chudalani undi :).

Priya said...

పూర్తిగా ఊహించి రాసిందేమి కాదు పండు గారు. నా స్నేహితురాలు గంటసేపు తన కష్టాల గురించి ఎంతో ఇదిగా చెప్పినా నేను తనదే తప్పు అన్నాను. ఆ అమ్మాయికి ఒళ్ళు మండింది. "ఏంటీ నేను తప్పు చేశానా?" అంటూ నా మీద విరుచుకుపడింది. అప్పుడు "నీ బాధ తప్పనడంలేదు. కాని తన వైపు నుండి ఆలోచించకుండా ఎప్పుడూ నిందిస్తూనే ఉండడం తప్పు అంటున్నాను" అన్నాను. తను రోషంగా "ఆహా! నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావేం?" అంది. దానికి బదులే.. ఆ లేఖ.

అవునండీ.. రిలేషన్షిప్స్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు మన వైపు నుండి మాత్రమే కాక ఎప్పుడైతే అవతలి వారి వైపు నుండి కూడా ఆలోచిస్తామో.. అప్పుడే సగం సమస్య తీరిపోతుందని నా అభిప్రాయం. అప్పుడు మీరన్నట్లు ఆ బంధం సంబంధం కంటే అనుబంధంగా మారుతుంది.

Thank you very much for the comment :)

Priya said...

అంతేనంటారా అనూ గారు? దాచుకోవల్సిందేనా? ప్రతి ఆడపిల్లా కంపల్సరిగా జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి బాధకు గురవ్వల్సిందేనేమో? బాబోయ్ భయం వేస్తోంది. నాకు అస్సలు ఆ పెయిన్ వద్దు. అయినా భరత్ బంగారంలెండి :)

Priya said...

చాలా థాంక్స్ డేవిడ్ గారు :)
ఈ లెటర్ చదివాక వాళ్లాయన తడి కళ్ళతో కౌగిలించుకున్నారట. సాయంత్రం ఫోన్ చేసి చెప్పింది.

మీరు కచ్చితంగా రూప గారిని అడగడండి. అభ్యంతరం లేకపోతే ఏమని రాశారో నాకూ చెప్పండి :)

Praveena said...

Heart touching, meticulous writing :)

వేణూశ్రీకాంత్ said...

చాలా చాలా బాగుందండీ.. చాలా మెచ్యూర్డ్ గా బాలెన్స్ కోల్పోకుండా అద్భుతంగా రాశారు. కానీ మీరిలా దాచుకుంటాననడం నాకు నచ్చలేదు :-)) మీకు ఈ లెటర్ ఎప్పటికీ అవసరపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరత్ గారు ఆ అవసరం రానివ్వరులెండి :-) కాకపోతే మీరు రాసిన ఈ లెటర్ ఈ కాలపు కొందరు గృహిణులకు అవసరమవచ్చు. అలాగే మీ బ్లాగ్ చదివే అబ్బాయిల మనసులమీద ఆలోచనాతీరుమీద కూడా ప్రభావం చూపచ్చు. ఆ విధంగా చూస్తే ఈ లెటర్ ఇక్కడ పోస్ట్ చేసి మంచిపని చేశారు :-)

అన్నట్లు మీ లెటర్ చదువుతుంటే ఆ మధ్య చూసిన మల్లెలతీరం సినిమా గుర్తొచ్చిందండీ. అందులో హీరోయిన్ లక్ష్మికి ఈ లెటర్ దొరికి ఉంటే సినిమా ముగింపు వేరేలా ఉండి ఉండేదేమో :-)

Anonymous said...

bavundandi meeru raasina latter!! chaala feel iyyi raasinattu unnaru mee frnd feelings ni.

ee latter meeku future lo use avutundo ledo cheppalenu kaani (any way use avakudadu ani korukuntunnanu :) ) ... meeru raasina letter lo paragraph 7 loni information naalanti vallaki future lo use avutundi anukunta :)) ...
-Prashanth

డేవిడ్ said...

హమ్మయ్యా అయితే మీ ద్వారా ఆమెకు ఓ మంచి జరిగిందన్నమాట...నేను తప్పకుండా రూపను అడిగి మీకు చెపుతానులేండి.

Sri Latha said...

చాలా బాగుంది ప్రియా. ఆ లెటర్ use చేసే రోజు మీకెప్పటికి రాకుడదని కోరుకుంటున్నాం.
మొన్న మీరు పరిచయం చేసిన వంటల బ్లాగ్ చూశాను. ఆ రైటింగ్ స్టైల్ మీదే కదా? మీరే రాస్తున్నారా? బాగుందండి.

Priya said...

Thank you sooooo much Praveena gaaru :)

Priya said...

హహ్హహ్హా.. మాములుగానే భరత్ దేనికీ పెద్దగా రెస్పాండ్ అయినట్లు కనిపించడు లాస్య గారు. ఇక పక్క వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం, అందులోను ఒక కపుల్ కి సంబంధించిన విషయానికి సరే సరి :)

కానీ కదా.. రెస్పాండ్ అయితే నాకూ చూడాలని ఉంది.

Priya said...

I am so glad that you like it so much, వేణూ గారు. అలాగే నాకు ఈ లెటర్ అవసరపడకూడదని కోరుకున్నందుకు కూడా :)

నిజంగా ఈ లెటర్ చదివిన వారిలో ఒక్కరైనా తన భార్యను అర్ధం చేసుకుంటే నాకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదండీ.

మీరు మళ్ళీ ఆ సినిమాను గుర్తు చేశారూ.. హూం.. ఎక్కడో మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు రివ్యూ చదివి సినిమా ఎక్కడ దొరుకుతుందా అని కాగడా పట్టుకుని మరీ వెదికాను. దొరకలేదు. బాధపడి ఇప్పుడిప్పుడే దాని సంగతి మర్చిపోతున్నాను మళ్ళీ మీరిలా.. :(
ఈ పాపం మీదే గనుక నాకు ఆ సినిమా చూపించే బాధ్యత కూడా మీదే :)

Priya said...

హహ్హహ.. థాంక్స్ ప్రశాంత్ గారు. భలే తెలివిగా అనువైన ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నారు కదూ?

Priya said...

అవునండీ. చాలా సంతోషంగా ఉంది.

రూప గారు చెప్పబోయే విషయాల కోసం ఎదురుచూస్తున్నాను :)

Priya said...

థాంక్స్ శ్రీలత గారు :)

అవునండీ. మరి కొంతమంది మిత్రులు కూడా అడిగారు. అక్కకు కొత్త అవడంతో ఇప్పటి వరకూ నేనే రాశాను. త్వరలో ఆవిడ రాస్తారు :)

Priya said...

By the way.. పోస్ట్స్ మాత్రమేనండోయ్. కామెంట్స్ అక్కే రాస్తున్నారు. బాబుతో ఉండి వీలుకదరకపోతేనూ నేను రాస్తున్నాను అంతే.

లక్ష్మీదేవి said...

బాగా వ్రాసినారండీ .

jyothi sanka said...

Every married women needs this letter.Your narration is so good.

Priya said...

Thank you very much, జ్యోతి గారు :)

Priya said...

నా బ్లాగ్ కి స్వాగతమండీ :)
Thanks for the comment.

Sri Latha said...

అలాగా? డౌట్ క్లియర్ చేసినందుకు థాంక్సండీ. అయితే ఆ బ్లాగుకి మీ ఇద్దరికీ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఉన్న్నయ ప్రియగారు?

Priya said...

అబ్బే కాదు శ్రీలత గారు. తను బ్లాగ్గింగ్ కి కొత్త అవడం వలన తన జ్ఞాపకాలు నాతో పంచుకుని నన్ను రాసి పెట్టమన్నారు. నేను రాసి ఆవిడకు మెయిల్ చేస్తే తను పబ్లిష్ చేశారు. అంతే. వీలైనంత త్వరగా ఆవిడే రాస్తారు.

Anonymous said...

మిత్ర దినోత్సవ శుభకామనలు.

Priya said...

తాతయ్య గారూ.. thank you very much. మీక్కూడా మిత్ర దినోత్సవ శుభాకాంక్షలు :)

sri mee snehithudu said...

chala baga vraseru priya garu...:)

Priya said...

Thanks andi :)

నవజీవన్ said...

మీ స్నేహితురాలి భావాలైనా మీ సృజనతో బాగానే ఉత్తరం రాయగలిగారు. ఆమె మదిలోని అలోచనలకు మరింత గాఢత మీ ఉత్తరం తీసుకువచ్చింది. మంచి బ్లాగరి గానె కాకుండా మంచి లేఖకురాలిగా కూడా రాణిస్తున్నారు..సంతోషం..

నాగరాజ్ said...

రమణగారి ‘‘పని లేక’’ బ్లాగులోంచి మీ బ్లాగులోకి షార్ట్ కట్ లో దూకేసి, హడావుడిగా పోస్టు చదివేసి పేజీ నుండి జంప్ అయిపోదామనుకుంటున్న రాహుగడియల్లో చివర్న మీ వార్నింగ్ చూసి, పోనీలే, మనదగ్గర మణులేలాగూ లేవ్, మాణిక్యాలసలే లేవ్, ఓ కామెంట్ రాస్తే పోయేదేముందని డిసైడైన వాడనై.... ‘‘పరకాయప్రవేశపు తాలూకు లేఖాస్త్రం చాలా బావుంది. రాసే శైలి బావుంది. ఆ శైలి మున్ముందు మరింత హాస్య, కరుణ రసాలతో దినదినప్రవర్ధమానమగుగాక! థాంక్యూ :)

Priya said...

మళ్ళీ చాన్నాళ్ళకు కామెంటారు నా బ్లాగ్ లో.. థాంక్స్ నవజీవన్ గారు :)

Priya said...

హహ్హహ్హ! నా బ్లాగ్ కి స్వాగతం నాగరాజ్ గారు..
అలాగే నా మాటలను మన్నించి కామెంటినందుకు చాలా చాలా థాంక్స్. వస్తుండండీ :)

sndp said...

ayina priya neku future lo ala em undau le

elagu govt job kada :p

Priya said...

Thank you.. కాని ఇక్కడ సమస్య జాబ్ కాదుగా సందీప్ :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Wednesday, July 31, 2013

ఎదురుచూపులు

"కాలం ఒక్కసారి వెనక్కి వెళితే ఎంత బావుండో" ఈ మాట తరచూగా అనుకుంటున్నానండీ ఈ మధ్య. మీతో సరదాగా గడిపిన సన్నివేశాలాను గుర్తు చేసుకోవాలంటే గతంలోకి వెళ్ళక తప్పడంలేదు. ఏదైనా.. "అప్పట్లో, ఆ రోజుల్లో" అంటూ మొదలుపెట్టుకోవాల్సి వస్తోందే తప్ప..  నిన్న, మొన్న, పోయిన వారం, అంతెందుకు? గడిచిన రెండేళ్లలో కూడా మన ఇద్దరికీ సంబంధించి ఒక్క తియ్యటి జ్ఞాపకం కూడా గుర్తురావడం లేదు. ఉంటేగా గుర్తు రావడానికి? నేను మిమ్మల్ని తప్పుపట్టను, పట్టలేను. మీ ప్రేమ నాకు తెలుసు. నాకోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని తెలుసు. తెలిసీ ఎందుకో బాధ.

ఉదయం లేస్తూనే మీ మొహం చూడాలని, మీ నుదిటి మీద ముద్దు పెడుతూ నా రోజు ప్రారంభించాలని ఆశ పడుతుంటాను. బ్యాడ్ లక్. మీకు చీకటితో లేచే అలవాటు ఉండడం, నేను లేవలేకపోవడం వల్ల ఆరుగంటలకు నిద్రకళ్ళతో మిమ్మల్ని వెతుక్కునే సమయానికి మీరు హాల్లో ఇంటర్నెట్ తో బిజీ గా ఉంటారు. నిట్టూర్చి, మీకంటే ముందు లేవనందుకు బాధపడుతూ ఆ బాధను మీపై కోపంగా మార్చి "పొద్దున్నే మొదలు పెట్టేసారా? ఎన్ని సార్లు చెప్పాలి? మీరు లేచినపుడే నన్నూ లేపమని? అయినా ఆ చేసుకునే పనేదో నా పక్కనే ఉండి చేసుకోవచ్చుగా" అన్న మాటలతో నా రోజు మొదలవుతోంది. రేపైనా ఇలా జరక్కూడదనుకుంటూ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి, స్నానానికి కావలసిన ఏర్పాట్లు చేసి, మీరు వచ్చేలోపు ఇల్లు ఊడ్చుకుని, వచ్చాక "లేట్ అవుతోంది" అంటూ మీరు హడావిడిగా తింటుంటే.. కసురుకుని, ఆఫీస్ కి సాగనంపేడపుడు పదే పదే జాగ్రత్తలు చెప్పి "ఆఫీస్ చేరుకున్నాను" అంటూ మీరు పంపే sms కోసం ఎదురుచూడడంతో మొదలు. సాయంత్రం మీరు వచ్చే వరకూ ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ.. "ఎప్పుడెపుడు మీరు ఇంటికి వస్తారా.. సరదాగా కాసేపు మీతో ముచ్చట్లాడదామా" అని ఎదురుచూస్తూనే ఉంటాను.

Google image 
రాత్రి ఏడున్నర అయే సరికి మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. అప్పటికి వంట పని, ఇంటి పని ముగించుకుని.. స్నానం చేసి తయారయి టీవీ ముందు కూర్చుంటాను. టీవీ చూస్తానన్న మాటే కాని నా మనసంతా గేట్ దగ్గరే ఉంటుంది. ఏ చిన్న చప్పుడు వినిపించినా మీరేనేమో చూద్దామని కిటికీ దగ్గరకు పరుగు పెడతాను. అలా ఎన్నోసార్లు నేను తిరిగాక మీరు వస్తారు. సంతోషంగా ఎదురొచ్చి నీళ్ళందించి, ఫ్రెష్అప్ అయ్యే వరకూ వెయిట్ చేసి మీతో ఏమైనా మాట్లాడదామని మొదలుపెట్టేలోపు, మీరే మీ ఆఫీస్ కబుర్లు మొదలుపెడతారు. రోజంతా మీరేం చేశారో, మీ ఆఫీస్ లో మనుషులు ఎలాటి వారో తెలుసుకోవడం.. అదీ మీ మాటల్లో! నాకు చాలా సంతోషం. కాని అదే నా సంతోషం కాదు. 

నా మాటలు మీకు బోర్ గా అనిపిస్తాయన్నారు. "సరేలే ఆయన చెప్పే కబుర్లే విందాం. ఆయన గొంతు వినడం కంటేనా" అనుకున్నాను. కాని కొన్ని రోజులకు నా మనసు మొరాయించడం మొదలుపెట్టింది. మీ గొంతు  
వింటున్నానన్న సంతోషం కంటే, "ఇక ఎప్పుడూ ఈ కబుర్లేనా? మా ఇద్దరికీ సంబంధించినవి ఏవీ లేవా మాట్లాడుకోవడానికి? ఈ రోజు ఆయనకు ఇష్టమైన చీర కట్టుకున్నాను.. కనీసం గుర్తించడేం? ప్రతి రోజూ "మధ్యాహ్నం సరిగా భోంచేశారా.. బావుందా?" అని అడుగుతాను. కాని ఒక్క పూటైన "నువ్వు లంచ్ చేశావా?" అని ఆయనకు ఆయనగా అడగరేం? ఇంటికి రావడం, తినడం, ఫోన్ లో మాట్లాడ్డం కాసేపు నెట్ చూసుకోవడం, నిద్రపోవడం.. ఇంతేనా? ఇంకేం లేదా? ఈ మాత్రం దానికి భార్య ఎందుకు? పనిమనిషిని పెట్టుకోవచ్చుగా? అసలు ఎన్నాళ్ళయింది నవ్వే ఆయన కళ్ళు చూసి?  ఎన్నాళ్ళయింది ఆయన చేతిని పట్టుకుని సరదాగా నడిచి? ఎన్నాళ్ళయింది ఆయన నన్ను బాగున్నావా అని అడిగి? నేనేమైనా అతిగా ఆశపడుతున్నానా??" మనసు పదే పదే అడిగే ఈ ప్రశ్నల తాలూకూ భాదే ఎక్కువవుతోంది.

మరో వైపు "పాపం రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తారు.. అప్పటి వరకూ ఎవ్వరితోనూ మాట్లాడే వీలు కుదరదు కనుక ఇంటికి వచ్చాక మాట్లాడతారు. ఆయనకంటూ కొన్ని ఇష్టాలు, పనులు ఉంటాయి కదా.. అవి చేసుకోకపోతే మనిషి ఎలా ఆనందంగా ఉండగలరు? ఎప్పటికీ పెళ్ళైన కొత్తలోలా ఉండమంటే ఎలా.. బాధ్యతలు పెరిగేకొద్దీ సమయం తగ్గుతుంది. అర్ధం చేసుకును మసలుకోవాలి కాని ఇలా "నా చీర చూడలేదు. తిన్నావా అని అడగలేదు" అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసుకుని బాధ పడి, ఆయనను బాధపెట్టకూడదు. ఇంటికి కావలసినవన్నీ అమర్చిపెడుతున్నారు. ఉన్నంతలో ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. అది చాలదా?" అనిపిస్తుంది.

నా బాధ చూడ్డానికి చిన్నదిగా కనిపించినా అది మనసు మీద ఎంత ఒత్తిడి కలిగిస్తుందో చెప్పలేను. ఇది మీకు తెలియంది కాదు. మీతో నేనెన్నోసార్లు చెప్పాను. నేను కాకుండా..  వర్క్, ఫ్రెండ్స్,  అవీ ఇవీ అంటూ మీ ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు. కాని మీరే నా ప్రపంచం. మీతో గడిపే సమయంలో కలిగే సంతోషం నాకు మరి ఎందులోనూ దొరకదు. నాకూ కొన్ని వ్యాపకాలు ఉన్నాయి. కాని అవన్నీ నాకు మీ తరువాతే.

మీ నుండి నేను కోరుకునేది కాస్త ప్రేమ, నా ప్రేమకు మరికాస్త గుర్తింపు. అంతే. మీరు నాతో గంటలు గంటలు కబుర్లు చెప్పనవసరం లేదు. మాట్లాడే పది నిముషాలు చిరునవ్వుతో మాట్లాడితే చాలు. నా అందాన్ని పొగుడుతూ నా కొంగు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక్క సారి ఈ చీర నీకు బావుందనో, ఈ వేళ చక్కగా కనిపిస్తున్నావనో చెబితే చాలు. టీనేజ్ కుర్రాడిలా నాతో సరసాలాడనవసరం లేదు. అప్పుడప్పుడు నా చెయ్యి పట్టుకుని మీరు నాకు ఉన్నారన్న భరోసాను కలిగిస్తే చాలు. నిజమే.. మీరు నాకోసమే కష్టపడుతున్నారు. నాతో పాటు మీ లైఫ్ లో ఇంకా కొన్ని పనులు ఉంటాయి. కాదనను. కాని నేనూ మీ లైఫ్ లో ఒక భాగాన్నే. అప్పుడపుడు నా మనసులోకి కూడా తొంగి చూడడంలో తప్పు లేదు. క్షమించండి. కాస్త కటినంగా మాట్లాడాను కదూ? మీ మాటలు గుర్తొచ్చాయి.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను మిమ్మల్ని తప్పు పట్టడంలేదు. మీ మనసు అర్ధం చేసుకుని మీకు అనుగుణంగా నడుచుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా మీరూ నన్ను అర్ధం చేసుకుంటే బావుండని ఆశపడుతున్నాను. మీ బిజీ లైఫ్ లో నా గురించి ఆలోచించడం కష్టమే.. కాని అది ఏదో ఒక రోజు సాధ్యపడుతుందని ఎదురుచూస్తున్నాను.

ఇట్లు,
మీ నేను

మన ప్రియ కి పెళ్ళే కాలేదు కదా ఈ లెటర్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? హహ్హహ్హ.. ఈ లెటర్ నాకు సంబంధించింది కాదండీ. నా స్నేహితురాలు తన భర్త గురించి కంప్లైంట్ చేస్తూ చెప్పిన విషయాలను విని "మరీ ఇంత నెగిటీవ్ గా మాట్లాడితే అర్ధం చేసుకోవడం సంగతి దేవుడెరుగు ఇంకాస్త దూరమైపోతాడే తల్లీ. కాస్త పాజిటీవ్గా నీ బాధలను వివరిస్తూ ఒక లెటర్ రాయి. అన్నీ పట్టించుకోకపోయినా కనీసం ఒక్క మాటైనా మనసుని తాకకపోతుందా?" అన్నాను. దానికి తను, నేను మాట్లాడ్డం లో బాగా వీక్ నీకు తెలుసు కదా.. బాబ్బాబు ఆ లెటర్ ఏదో నువ్వే రాసి పెట్టేయవా అంటూ బ్రతిమాలింది. ఉన్నది ఉన్నట్లు రాయగలను గాని ఊహించి రాయడం నాకు చేత కాదు. ఆ మాటే తనతో చెప్పాక, మళ్ళీ ఓ గంట సేపు ఫోన్ లో తన కష్టాల చిట్టాను విప్పింది. నాకు తను చెప్పిన విధానం అస్సలు నచ్చలేదు. నేను ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతానో ఊహించుకుని, నేనైతే ఎలా స్పందిస్తానో అలా ఈ లెటర్ రాశాను. చూడాలి తనకు నచ్చుతుందో లేదో.

నా పర్సనల్ లైఫ్ లో ఇలాటి లెటర్ రాయవలసి వస్తుందని నేననుకోను.. కాని ఎందుకైనా మంచిదని (ముందస్తు బెయిల్లాగ అన్నమాట) దాచిపెట్టుకుంటూ నా "మనసులోని మౌనరాగం" లో జత చేస్తున్నాను :P

39 comments:

 1. Anonymous31/7/13

  ఉత్త్రం జాగ్రత్త పెట్టుకుంటే ముందస్తుగా పనికొస్తుంది :)

  ReplyDelete
  Replies
  1. తప్పదంటారా తాతయ్య గారు?? మీరు అంత కచ్చితంగా చెబుతుంటే భయం వేస్తోంది.. :)

   Delete
 2. Anonymous31/7/13

  Iam sure priya...niku aa situation radu lee...and meeru "sarocharu" mve chusaraa...kastha ela ne anipisthundii...raviteja richa madya seens..

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ :)
   ఆ సినిమా నేను చూడలేదండీ. అలాటివి చూసే ధైర్యం కూడా చేయలేను.

   Delete
 3. ఊహించి రాసిందేనా పెద్ద అనుభవజ్ఞుల్లా రాశారే? ఆడపిల్ల ఆలోచనలకి అనుభవం అవసరం లేదేమో కదూ!
  అటువైపు కూడా అర్ధం చేసుకుని స్పందించే మనసుంటే ఆ ఆ బంధం సంబంధం కన్నా అనుబంధం గా ఉంటుందేమో....

  ReplyDelete
  Replies
  1. పూర్తిగా ఊహించి రాసిందేమి కాదు పండు గారు. నా స్నేహితురాలు గంటసేపు తన కష్టాల గురించి ఎంతో ఇదిగా చెప్పినా నేను తనదే తప్పు అన్నాను. ఆ అమ్మాయికి ఒళ్ళు మండింది. "ఏంటీ నేను తప్పు చేశానా?" అంటూ నా మీద విరుచుకుపడింది. అప్పుడు "నీ బాధ తప్పనడంలేదు. కాని తన వైపు నుండి ఆలోచించకుండా ఎప్పుడూ నిందిస్తూనే ఉండడం తప్పు అంటున్నాను" అన్నాను. తను రోషంగా "ఆహా! నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావేం?" అంది. దానికి బదులే.. ఆ లేఖ.

   అవునండీ.. రిలేషన్షిప్స్ లో ఏదైనా సమస్య వచ్చినపుడు మన వైపు నుండి మాత్రమే కాక ఎప్పుడైతే అవతలి వారి వైపు నుండి కూడా ఆలోచిస్తామో.. అప్పుడే సగం సమస్య తీరిపోతుందని నా అభిప్రాయం. అప్పుడు మీరన్నట్లు ఆ బంధం సంబంధం కంటే అనుబంధంగా మారుతుంది.

   Thank you very much for the comment :)

   Delete
 4. Anonymous31/7/13

  ఒహ్ ప్రియా...ఎలా అన్నీ నిజాలే రాయగలిగారు? తప్పక దాచుకోండి...future లో పనికొస్తుందనే అనుకుంటున్నా ఒక్కసారైనా.

  ReplyDelete
  Replies
  1. అంతేనంటారా అనూ గారు? దాచుకోవల్సిందేనా? ప్రతి ఆడపిల్లా కంపల్సరిగా జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి బాధకు గురవ్వల్సిందేనేమో? బాబోయ్ భయం వేస్తోంది. నాకు అస్సలు ఆ పెయిన్ వద్దు. అయినా భరత్ బంగారంలెండి :)

   Delete
  2. ayina priya neku future lo ala em undau le

   elagu govt job kada :p

   Delete
  3. Thank you.. కాని ఇక్కడ సమస్య జాబ్ కాదుగా సందీప్ :)

   Delete
 5. ప్రియ గారు చాల చక్కగా రాసారు లెటరు. మీ లెటర్ చదివాక నాకు, చాలా మంది గృహిణులు ఇలాగే ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది..ఇంతకూ ఈ లెటర్ మీ ఫ్రెండ్ కు నచ్చిందా? వాళ్ళ ఆయనకు ఇచ్చిందా?....మీ లెటర్ చదివాకా మా రూప నా గురించి ఏమనుకుంటుందో అని డౌట్ వస్తుంది....తనను కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాయమని అడగాలి.

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ డేవిడ్ గారు :)
   ఈ లెటర్ చదివాక వాళ్లాయన తడి కళ్ళతో కౌగిలించుకున్నారట. సాయంత్రం ఫోన్ చేసి చెప్పింది.

   మీరు కచ్చితంగా రూప గారిని అడగడండి. అభ్యంతరం లేకపోతే ఏమని రాశారో నాకూ చెప్పండి :)

   Delete
 6. EE letter ki bharat response chudalani undi :).

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హా.. మాములుగానే భరత్ దేనికీ పెద్దగా రెస్పాండ్ అయినట్లు కనిపించడు లాస్య గారు. ఇక పక్క వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం, అందులోను ఒక కపుల్ కి సంబంధించిన విషయానికి సరే సరి :)

   కానీ కదా.. రెస్పాండ్ అయితే నాకూ చూడాలని ఉంది.

   Delete
 7. Heart touching, meticulous writing :)

  ReplyDelete
  Replies
  1. Thank you sooooo much Praveena gaaru :)

   Delete
 8. చాలా చాలా బాగుందండీ.. చాలా మెచ్యూర్డ్ గా బాలెన్స్ కోల్పోకుండా అద్భుతంగా రాశారు. కానీ మీరిలా దాచుకుంటాననడం నాకు నచ్చలేదు :-)) మీకు ఈ లెటర్ ఎప్పటికీ అవసరపడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరత్ గారు ఆ అవసరం రానివ్వరులెండి :-) కాకపోతే మీరు రాసిన ఈ లెటర్ ఈ కాలపు కొందరు గృహిణులకు అవసరమవచ్చు. అలాగే మీ బ్లాగ్ చదివే అబ్బాయిల మనసులమీద ఆలోచనాతీరుమీద కూడా ప్రభావం చూపచ్చు. ఆ విధంగా చూస్తే ఈ లెటర్ ఇక్కడ పోస్ట్ చేసి మంచిపని చేశారు :-)

  అన్నట్లు మీ లెటర్ చదువుతుంటే ఆ మధ్య చూసిన మల్లెలతీరం సినిమా గుర్తొచ్చిందండీ. అందులో హీరోయిన్ లక్ష్మికి ఈ లెటర్ దొరికి ఉంటే సినిమా ముగింపు వేరేలా ఉండి ఉండేదేమో :-)

  ReplyDelete
  Replies
  1. I am so glad that you like it so much, వేణూ గారు. అలాగే నాకు ఈ లెటర్ అవసరపడకూడదని కోరుకున్నందుకు కూడా :)

   నిజంగా ఈ లెటర్ చదివిన వారిలో ఒక్కరైనా తన భార్యను అర్ధం చేసుకుంటే నాకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదండీ.

   మీరు మళ్ళీ ఆ సినిమాను గుర్తు చేశారూ.. హూం.. ఎక్కడో మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు రివ్యూ చదివి సినిమా ఎక్కడ దొరుకుతుందా అని కాగడా పట్టుకుని మరీ వెదికాను. దొరకలేదు. బాధపడి ఇప్పుడిప్పుడే దాని సంగతి మర్చిపోతున్నాను మళ్ళీ మీరిలా.. :(
   ఈ పాపం మీదే గనుక నాకు ఆ సినిమా చూపించే బాధ్యత కూడా మీదే :)

   Delete
 9. Anonymous1/8/13

  bavundandi meeru raasina latter!! chaala feel iyyi raasinattu unnaru mee frnd feelings ni.

  ee latter meeku future lo use avutundo ledo cheppalenu kaani (any way use avakudadu ani korukuntunnanu :) ) ... meeru raasina letter lo paragraph 7 loni information naalanti vallaki future lo use avutundi anukunta :)) ...
  -Prashanth

  ReplyDelete
  Replies
  1. హహ్హహ.. థాంక్స్ ప్రశాంత్ గారు. భలే తెలివిగా అనువైన ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నారు కదూ?

   Delete
 10. హమ్మయ్యా అయితే మీ ద్వారా ఆమెకు ఓ మంచి జరిగిందన్నమాట...నేను తప్పకుండా రూపను అడిగి మీకు చెపుతానులేండి.

  ReplyDelete
  Replies
  1. అవునండీ. చాలా సంతోషంగా ఉంది.

   రూప గారు చెప్పబోయే విషయాల కోసం ఎదురుచూస్తున్నాను :)

   Delete
 11. చాలా బాగుంది ప్రియా. ఆ లెటర్ use చేసే రోజు మీకెప్పటికి రాకుడదని కోరుకుంటున్నాం.
  మొన్న మీరు పరిచయం చేసిన వంటల బ్లాగ్ చూశాను. ఆ రైటింగ్ స్టైల్ మీదే కదా? మీరే రాస్తున్నారా? బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీలత గారు :)

   అవునండీ. మరి కొంతమంది మిత్రులు కూడా అడిగారు. అక్కకు కొత్త అవడంతో ఇప్పటి వరకూ నేనే రాశాను. త్వరలో ఆవిడ రాస్తారు :)

   Delete
  2. By the way.. పోస్ట్స్ మాత్రమేనండోయ్. కామెంట్స్ అక్కే రాస్తున్నారు. బాబుతో ఉండి వీలుకదరకపోతేనూ నేను రాస్తున్నాను అంతే.

   Delete
  3. Every married women needs this letter.Your narration is so good.

   Delete
  4. Thank you very much, జ్యోతి గారు :)

   Delete
  5. అలాగా? డౌట్ క్లియర్ చేసినందుకు థాంక్సండీ. అయితే ఆ బ్లాగుకి మీ ఇద్దరికీ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఉన్న్నయ ప్రియగారు?

   Delete
  6. అబ్బే కాదు శ్రీలత గారు. తను బ్లాగ్గింగ్ కి కొత్త అవడం వలన తన జ్ఞాపకాలు నాతో పంచుకుని నన్ను రాసి పెట్టమన్నారు. నేను రాసి ఆవిడకు మెయిల్ చేస్తే తను పబ్లిష్ చేశారు. అంతే. వీలైనంత త్వరగా ఆవిడే రాస్తారు.

   Delete
 12. బాగా వ్రాసినారండీ .

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతమండీ :)
   Thanks for the comment.

   Delete
 13. Anonymous4/8/13

  మిత్ర దినోత్సవ శుభకామనలు.

  ReplyDelete
  Replies
  1. తాతయ్య గారూ.. thank you very much. మీక్కూడా మిత్ర దినోత్సవ శుభాకాంక్షలు :)

   Delete
 14. chala baga vraseru priya garu...:)

  ReplyDelete
 15. మీ స్నేహితురాలి భావాలైనా మీ సృజనతో బాగానే ఉత్తరం రాయగలిగారు. ఆమె మదిలోని అలోచనలకు మరింత గాఢత మీ ఉత్తరం తీసుకువచ్చింది. మంచి బ్లాగరి గానె కాకుండా మంచి లేఖకురాలిగా కూడా రాణిస్తున్నారు..సంతోషం..

  ReplyDelete
  Replies
  1. మళ్ళీ చాన్నాళ్ళకు కామెంటారు నా బ్లాగ్ లో.. థాంక్స్ నవజీవన్ గారు :)

   Delete
 16. రమణగారి ‘‘పని లేక’’ బ్లాగులోంచి మీ బ్లాగులోకి షార్ట్ కట్ లో దూకేసి, హడావుడిగా పోస్టు చదివేసి పేజీ నుండి జంప్ అయిపోదామనుకుంటున్న రాహుగడియల్లో చివర్న మీ వార్నింగ్ చూసి, పోనీలే, మనదగ్గర మణులేలాగూ లేవ్, మాణిక్యాలసలే లేవ్, ఓ కామెంట్ రాస్తే పోయేదేముందని డిసైడైన వాడనై.... ‘‘పరకాయప్రవేశపు తాలూకు లేఖాస్త్రం చాలా బావుంది. రాసే శైలి బావుంది. ఆ శైలి మున్ముందు మరింత హాస్య, కరుణ రసాలతో దినదినప్రవర్ధమానమగుగాక! థాంక్యూ :)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ! నా బ్లాగ్ కి స్వాగతం నాగరాజ్ గారు..