Saturday, August 31, 2013

కృతజ్ఞతలు, క్షమాపణలు, విశేషాలు

హమ్మయ్య.. నేటితో నా ఇంటర్నెట్ కష్టాలు తీరాయి. ముందుగా, నా పుట్టినరోజుని జ్ఞాపకం ఉంచుకుని పర్సనల్ మెయిల్స్ ద్వారానూ..  బ్లాగ్ లో కామెంట్స్ ద్వారానూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు (లాస్య గారూ.. మరి ముఖ్యoగా మీకు), "కష్టేఫలే" శర్మ తాతయ్య గారికి క్షమాపణలు.

కృతజ్ఞతలు ఓకే కానీ, క్షమాపణలు ఎందుకు చెబుతున్నానో మీకు తెలియదు కదూ? చెప్తాను.. చెప్తాను. ఏమైందంటే.. తాతయ్య గారి బ్లాగ్లో భలే మంచి మంచి కబుర్లు చెబుతుంటారు. ఒకసారి ఎందుకో.. ఆ! ఎందుకంటే, ఆయన చిన్నతనంలో వారి అమ్మగారు చేసే వంటలను ప్రస్తావిస్తూ రాసిన పోస్ట్ చదివి.. "బామ్మ గారు చేసే వంటల్లో మీకు నచ్చే వంటకం ఏదైనా బ్లాగ్ ద్వారా మాకూ నేర్పించొచ్చు కద తాతయ్య గారూ?" అని అడిగితే, "బామ్మని అడిగి చేబుతానులేమ్మా" అన్నారు.

రెండు వారాల క్రితం మరో సందర్భంలో ఆయన రాస్తున్న పోస్ట్ (పెళ్ళిలో అలకపాన్పు) గురించి చెప్పగా "అబ్బా! టైటిలే చాలా బావుంది తాతయ్య గారు.. త్వరగా పోస్ట్ చేసేయండి" అన్నాను. దానికి ఆయన, నువ్వు అడిగావని శనగల పాటోళీ ఎలా చేసుకోవాలో రాసి నీ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయంటూ ఆడకనే నిష్టూరమాడారు. ఆయన రాసే ప్రతి పోస్టూ చదువుతాను మరి. ఎలా మిస్ అయ్యానో?! వెంటనే నాలుక కరుచుకుని క్షమాపణలు చెబుతూ, శనగలు నానబోసాను. దానికి ప్రతిగా తాతయ్య గారు, నేను కామెంట్ రాసిన విధానాన్ని మెచ్చుకుంటూ ఆయన అభిమాన రచయిత (శ్రీపాదవారు) మాటలను గుర్తుచేసుకుంటూ, "తెనుగు నేర్పిన తల్లులు" పోస్ట్ గురించి చెప్పి, ఈ లోపు "పెళ్ళిలో అలకపాన్పు" కూడా పోస్ట్ చేసేశారు.

మరుసటి రోజు ఆయన కామెంట్ చూసి సంబరంగా ఆ రెండు పోస్ట్లు చదివేసి కామెంట్ చేయబోతుంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎయిర్టెల్ వాడికి కంప్లైంట్ చేస్తే వారం, పది రోజులు పడుతుందన్నాడు సరిచేయడానికి! ఇంకేముందీ.. పొంగే పొంగే పాల మీద నీళ్ళు చల్లినట్లయిపోయింది నా పరిస్థితి. "ఆయన ఏమనుకుంటున్నారో ఏవిటో.. ఈ పిల్ల ఇకపై ఏమైనా అడిగితే చెయ్యకూడదు అనుకుంటారేమో? నొచ్చుకుంటారేమో" అని బాధపడిపోయాను. ఈ మాత్రానికే ఇంత ఇదయిపోవాలా అని మీరు అనుకోవచ్చు. కాని ఏమో.. నేను ఇష్టపడే వాళ్ళ మనసు నొచ్చుకుంటే తట్టుకోలేను. అందుకే ఈ క్షమాపణలు.

నా మట్టుకు నేను ఎవరి బ్లాగ్లోనైనా కామెంట్ చేశానంటే, వాళ్ళు దానికి రిప్లై ఇచ్చేవరకు కాలుకాలిన పిల్లిలా వాళ్ళ బ్లాగ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను. కొంతమంది పబ్లిష్ చేసి ఊరుకుని ఒకటి రెండు రోజుల తరువాత రిప్లై ఇస్తారు. భలే కోపమొస్తుంది. "ఏం.. ఎలాగూ పబ్లిష్ చేశారుగా ఒక్క ముక్క రిప్లై ఇచ్చేస్తే నాకీ తిరుగుడు ఉండదు కదా" అని :P. కాని ఒక్కోసారి నేను కూడా వెంటనే రిప్లైలు ఇవ్వడం కుదరక మరుసటి రోజు ఇస్తుంటాను. అంతకంటే లేట్ అయితే మాత్రం మనసు గింజుకుంటూ ఉంటుంది "అయ్యయ్యో.. నన్నెలా తిట్టుకుంటున్నారో ఏవిటో" నని :D

సరిగ్గా.. అలాటి బాధే మొన్న నా పుట్టినరోజున కూడా కలిగింది. అంటే తిట్టుకుంటారని కాదుగాని... ...  ఏమో.. చెప్పలేకపోతున్నాను. "అంత బాధ అయితే ఆఫీసు నుండి రిప్లై ఇచ్చుండొచ్చుగా" అని మీరనుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే.. నేను మా ఆఫీస్ గురించి మీకు చూయించిన పిక్చర్ అలాటిది మరి! కాని నిజానికి ఆఫీస్ లో వర్క్ ఎక్కువగానే ఉంటుంది. ఏదో నా వర్క్ మీద నాకున్న ప్రేమను బట్టి ఆఫీస్లో ఉన్నంతసేపూ సరదాగా అనిపిస్తుంది గానీ చెప్పాలంటే కళ్ళు బాగానే స్ట్రైన్ అవుతాయి. ఇంటికి వచ్చాక ఇంకేమీ చేసేందుకు ఓపిక ఉండదు. మెదడు, మనసూ రెండూ "నిద్రా నిద్రా నిద్రా" అంటాయి. హ్మ్మ్.. పైగా బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి నేనే ఆఫీస్లో కూర్చొని బ్లాగర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నానంటే.. హహ్హహ్హహ ఇంకేం లేదు "నా పనీ పాటా" పోస్ట్ కి కామెంట్ చేసిన నాగరాజ్ గారు అన్నట్లు "అనగనగా మా ఆఫీసూ" అని చెప్పుకోవలసి వస్తుంది :).

ఇహపోతే.. నా పుట్టిన రోజు విశేషాలు. అంతకంటే ముందు 18న మా బావగారి పుట్టిన రోజు. అంచేత ఆదివారమంతా అక్కావాళ్ళింట్లో అభి గాడి అల్లరితో సరిపోయింది. 19న ఆఫీస్ కి వెళ్లాను. హహ్హ! నేనసలు మరిచేపోయాను మరుసటిరోజు నా పుట్టినరోజని! సాయంత్రం ఇంటికి వెళ్లేడపుడు కొలీగ్స్ అందరూ "రేపు స్పెషల్ ఏంటీ? పార్టీ ఎక్కడా" అని అడిగినా గుర్తు రాలేదు. కేవలం ఆ రోజు పంపాల్సిన పుస్తక పేజీలే నా బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. విసిగిపోయిన నా క్లోజ్ ఫ్రెండ్ (ఆఫీస్లో నేను పర్సనల్ రిలేషన్షిప్స్ మైంటైన్ చేయను. బట్, ఈ అమ్మాయి ఎక్సెప్షన్. వీలైతే తన గురించి ఒక పోస్ట్ రాస్తాను) సుగన్య నెత్తిమీద మొత్తుతూ గుర్తు చేసింది. అప్పుడు బల్బ్ వెలిగి అటు నుండి అటు "పోతీస్" కి వెళ్లి చీర కొనుక్కున్నాను.

రాత్రికి రాత్రి బ్లౌస్ ఎవరు కుడతారు చెప్పండి? లక్కీగా నేను సెలెక్ట్ చేసుకున్న చీర మీద బ్లాక్ డిజైన్ రావడంతో నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌస్ తో మేనేజ్ చేశాను. పుట్టిన రోజునాడు నా డెస్క్ అంతా పూలతో నిండిపోయింది! మెయిల్స్, కాల్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, సర్ప్రైజ్స్, వర్క్.. బిజీ బిజీగా గడిచిపోయింది. చిన్నపాటి బాధేంటంటే ఎక్కడా అనూ తో టైం స్పెండ్ చేయలేకపోయాను. "ఇంతకూ తనేం సర్ప్రైజ్ ఇచ్చాడు?" అని మాత్రం అడగొద్దు. నేను చెప్పలేను :).

హహ్హహ్హహహ్ నా బొంద! మీరు ఊహించుకుంటున్నట్లేం కాదు. చెప్పాలంటే పెద్ద పోస్ట్ రాయాలి. ఇందులో కుదరదు.  అందుకే చెప్పలేను అన్నాను. వచ్చేవారం ఎప్పుడైనా రాస్తానేం..

ఒకే ఒకే.. ఇక ఫోటోలు చూడండి.

ఇది మా బావగారి పుట్టిన రోజున తీసిన ఫోటోలలో ఒకటి. 

ఉదయం నిద్ర లేచి మొట్టమొదటిగా చూసిన అక్క రాతలు :)

జీవితంలో మొట్టమొదటి సారిగా అక్క నాకిచ్చిన సర్ప్రైజ్! పెళ్లైయ్యాక చెల్లెలి విలువ తెలిసొచ్చినట్లుంది మా అక్కకి :P.  

సుగన్యా, నేను. ఈ ఫోటో చూసి మా అమ్మ ఎంత షాక్ అయిపోయిందో..! "నువ్వు కూడా ఇంత ఒద్దికగా నిలబడతావుటే?!" అంటూ. హహ్హ్హహ.. ఆఫీస్ కదా అందుకే ఇంత ఒద్దిక. లేకపోతే.. నాకస్సలు పళ్ళు కనబడకుండా నవ్వడం చేతకాదు బాబూ మీరేమైనా అనుకోండి. By the way.. ఇదే నా పుట్టినరోజు చీర. 

అబ్బా.. ఏంటో ఏమీ చెప్పకుండానే పేద్ద పోస్ట్ అయిపోయింది! నెక్స్ట్  టపాలో భరత్ నాకిచ్చిన సర్ప్రైజ్ సంగతి చెబుతానేం? 

ఒక చిన్న మాట. అందరికీ కాదులే.. నా బ్లాగ్ రెగులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి మాత్రం. ఏంటంటే.. మరీ ముఖ్యమైన విషయాలో, సెలవులో అయితే తప్ప సాధారణంగా వీక్ డేస్ (సోమ - శుక్ర వారాల్లో) లో ఇకపై పోస్ట్స్ పబ్లిష్ చేయను (చేయలేను). కామెంట్స్ కి మాత్రం స్పందించగలనని గమనించగలరు. థాంక్స్. 

36 comments:

Anonymous said...

అయ్యో! నెట్ పోయిందా? ఏమయ్యేవోనని ఒకటే ...:) ఉద్యోగంలో ఉన్నపుడు ఎవరికీ ఇంతకాలం ఫోన్ పని చేయకుండా చేయలేదు, నేనూ ఆ జాతివాడినేగా. దారుణం గా పదిరోజులా హన్నా! ఇక్కడ బి.ఎస్.ఎన్.ల్, మా వాళ్ళూ అలాగే ఉన్నారు. ఫోన్ పోయిందిరా అని చెబితే వారానికీ దిక్కుండటం లేదు. మొన్ననెళ్ళి ఒక సారి నాకే దిక్కు లేకపోతే మిగిలినవాళ్ళ పనేమిరా అబ్బాయ్ అంటే.... వె...యను నేను ఉత్త వె...యను నేను అని పాటందుకున్నాడు. పోన్లే ఇప్పుడు నిన్ను క్షమించాలా? వద్దా? చెప్పు అల్లరి పిల్లా?

నాగరాజ్ said...

హేవిటీ... కామెంటు రాసేసి కాలు కాలిన పిల్లిలా బ్లాగు చుట్టూరా తిరుగుతుంటారా? కర్మ కాలిపోయి రిప్లై ఇవ్వకపోతే మీరేదో అఘాయిత్యం చేసుకునేట్టుందే? హన్నన్నా... ఓ పన్చేయండి! కామెంటుతో పాటే, నాకు వెంఠనే, విధిగా రిప్లై ఇవ్వగలరు అని కూడా రాసేయండి. ఓ పనైపోద్ది!! జాటర్ ఢమాల్! :)

చిన్ని ఆశ said...

ప్రియ గారూ,
కృతజ్ఞతలు, క్షమాపణలు అంటూనే మరిన్ని విశేషాలతో విచ్చేశారు.
ఎందుకో ఈ పోస్ట్ చదువుతుంటే మీ బ్లాగ్ టైటిల్ కి తగ్గట్టుగానే మీ మనసులో మౌన రాగాలకి పదాలతో ఖచ్ఛితమైన రూపం ఇస్తున్నారనిపించింది. మీ మాటల స్వచ్ఛతా ముచ్చటగా అనిపించింది. అన్ని అనుభూతులూ ఫొటోల రూపంలో భద్రపరచుకునే మీ అలవాటుని మెచ్చుకోకుండా ఉండలేము, వెరీ నైస్!
ఆలశ్యమే అయినా... పుట్టిన రోజు శుభాకాంక్షలు, మీకూ మీ బావ గారికి కూడా!

Priya said...

హహ్హహ్హా.. తాతయ్య గారూ అన్యాయం, అక్రమం. ఇన్నిసార్లు క్షమించండి అన్నాక కూడా క్షమించకపోతే బావుండదు చెబుతున్నా :)

సరే గాని, "ఏమయ్యావోనని .....:)" అంటూ వదిలేశారు. దయచేసి ఆ ఖాళీని పూరించేద్దురు.. ప్లీజ్?

Priya said...

నాగరాజ్ గారూ, మీరెందుకు మరీ అంత ఎక్స్ట్రీం లెవెల్ లో ఆలోచిస్తున్నారు?! మొన్న, ఏదో ఆఫీస్ లో సరదాగా ఉంటుంది అంటే.. అనగనగా మా ఆఫీస్ అని చెప్పుకోవలసి వస్తుందన్నారు. ఈ వేళ, వాళ్ళిచ్చే రిప్లై కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటాను అంటే.. రిప్లై ఇవ్వకపోతే అఘాయిత్యం చేసుకునేట్లున్నారే అంటున్నారు!

లాస్ట్ లో ఆ చిరునవ్వు స్మైలీ లేకపోతే ఘాటుగా సమాధానం ఇచ్చేసి ఉండేదాన్ని :P

Anyway.. thanks for the comment :)

రాధిక(నాని ) said...

ఏమిటీ చాలా రోజులుగా ప్రియగారి జాడలేదు అనుకున్నా ఇదన్నమాట సంగతి!ఆలస్యంగా పుట్టినరోజు శుభాకంక్షల చెపుతున్నా.....ఫోటోలు బాగున్నాయి .

వేణూశ్రీకాంత్ said...

ఓహ్ మీ పుట్టినరోజు మిస్ అయిపోయానా. కాస్త ఆలశ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియగారు :-)

Anonymous said...

అమ్మాయ్ ప్రియా!
ప్రేమ ఉన్న చోట అలకలు బుజ్జగింపులే కాని కోపాలు క్షమాపణలు ఉండవురా తల్లీ! :) మనవల మీద కోపమా? అబ్బే ఊహించలేను. ఇక మనవరాళ్ళ మీద కోపమా? అసలు ఆలోచించనే లేను. చిట్టి తల్లులు ఎంత కష్టపడతారని....ఎంత ఓపిక, అందుకు కోపం కాదు, ఆవేదన,బాధ కష్టపడిపోతున్నారే అని...అల్లరి పిల్ల మీద కోపమా.... :) ఇక ఖాళీ అంటావా? అది, ఆతృత, ఆవేదన,ఇటువంటి మాటలింకా ఉన్నాయా... అదనమాట సంగతి :)

Priya said...

చాలా థాంక్స్ పండు గారు! మా బావ గారికి కూడా మీ శుభాకాంక్షలు అందజేస్తాను.

తెలుసా..? నా బ్లాగ్ పేరు మీద మొట్టమొదటిసారిగా కామెంట్ చేసింది మీరే! Thank you soooo much for the lovely comment :) :)

Priya said...

Thank you. మీరూ నన్ను వెదుక్కున్నారా? హహ్హ్హహ.. మీ కామెంట్ కి రిప్లై ఇవ్వలేదనే కదు రాధిక గారు? పోనీలెండి ఇప్పటికైనా మీకు విషయాన్ని చేరవేయగలిగాను :)

Priya said...

మరేం పరవాలేదు వేణు గారు. Thank you so much for the wishes :)

Priya said...

ఇంకేం మాట్లాడగలను తాతయ్య గారు? ఆప్యాయపూరిత మాటలతో నా నోరు మూసేశారు :).
Thanks for the comment :).

Sravya V said...

ఓహో పుట్టినరోజు పార్టీ మిస్సయ్యనా నేను ? సరే చాక్లెట్ కూడా ఇవ్వకపోయినా కొంచెం లేట్ గనన్నా విషెస్ చెప్తానులే :-)
Belated Birthday wishes Priya !

పెళ్లి అయ్యాక చెల్లి విలువ తెలిసిందా మీ అక్కకు :-) హ హ తమరికి అంతే అనుకుంటారేమో ఆవిడ ఫ్యూచర్ లో :-) అదేదో లంగా వోణి చూపించి చీర అని మోసమా :-)

Priya said...

హహ్హహ్హ అన్యాయమమ్మా.. చాక్ట్లేట్ ఇవ్వలేదని విషెస్ లేట్ గా చెబుతున్నారా? :P

తనకి పెళ్లై వెళ్ళాక బాగా తెలిసింది :(
సో.. కొత్తగా తెలియబోయే విలువ లేదనే అనుకుంటున్నాను :).

అన్నట్లూ, శ్రావ్య గారూ అది లంగావోణి కాదండీ. చీరే! ఆ మోడల్ లో ఉంటుంది అంతే. కావాలంటే చూడండి.. కుచ్చిళ్ళు కూడా ఉన్నాయి. అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పండి??

Sravya V said...

అది చీర అని తెలుసు కానీ ఆ స్టైల్ లో ఉంది కదా అని జోకానన్నమాట :-)

ప్రియ said...

బుజ్జిగాడితో భలే ఉన్నారు ప్రియా :) ...
లంగాఓణీ మోడల్ చీర బావుంది కానీ ఫొటోని ఇంతదారుణంగా ఎడిట్ మా కళ్ళకి సైట్ వచ్చేలా చేసారు ..చాలా అన్యాయం :( అని మనవి చేసుకుంటున్నాను యువరానర్ :ఫ్

చిన్ని ఆశ said...

అవునా? మొదట మీ బ్లాగ్ పేరు స్పందనలలో మాదేనా? చక్కగా గమనించి చెప్పారు కూడ. చాలా సంతోషం అండీ!

డేవిడ్ said...

:)

Priya said...

ఎంచక్కా బ్రాకెట్లో రాసుండొచ్చు కద శ్రావ్యా జోక్ అనీ? ఇప్పుడు చూడండి.. నా తెలివితేటల రహస్యం బయటపడిపోలేదూ.. :( :P

Priya said...

:) :)

Anonymous said...

Belated wishes on Ur b'day priyaa!
I have posted wishes da day before....but not seen...anyway...hope u enjoyed

Priya said...

థాంక్స్ ప్రియ గారు. అయినా ఆ మాత్రం ఎడిట్ చేయకపోతే ఎలాగండీ? అందరూ మంచోళ్ళే ఉంటారా మరి? ఆడపిల్ల నీడ కనబడినా డేంజరే కదా ఈ రోజుల్లో? నా పిచ్చి కొద్దీ నేను ఈ మాత్రం ధైర్యం చేస్తున్నాను.

Priya said...

:) :)

Priya said...

Thank you so much, Anu gaaru :)
I haven't received that comment. The one which you wrote about my work, I've published. But.. as I explained in this post, was unable to reply. Sorry.

I really enjoyed my b'day. ఆ విశేషాలు ఈ శనివారం చెప్తాను :).
Once again, thanks for the wishes.

ధాత్రి said...

ఆలస్యంగా..
మీ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియగారు..:))

Anonymous said...

bavunnayandi.. mee krutagnathalu.. kshamapanalu... & photos... :) ... so mee b'day super ga gadiparu annamaata... :)) .. meeru elage super ga every year b'days jarupukovalani.. aashisthu :))

-Prashanth

ప్రియ said...

నిజానికి, మీ థీం నచ్చింది ...మీ ధైర్యానికి నా వీరతాడు :D

Meraj Fathima said...

ప్రియ గారూ, మీ బ్లాగ్ చూశాను, బాగుందమ్మా. తీరిగ్గా అన్నీ చదువుతాను.

Vidya Sagar said...

హాయ్ ప్రియ . బాగున్నావా. ఏరా మళ్ళా ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అని తిట్టకు. అలా తిడతావని భయం వేసే ఫోన్ చేయకుండా కామెంట్ వేస్తున్నా. నీ పుట్టినరోజు నాడు మా వాడు నీకేం బహుమానం ఇచ్చాడో తెలుసుకోవాలనుంది. త్వరగా వ్రాయి. ఎదురుచూస్తున్నాం అందరం....;)

Anonymous said...

enthaki premayanam part 9 eppudu priya...ika rayadalachukoleda enti...eppudoo july lo rasaru...

sndp said...

:)

రాజ్ కుమార్ said...

చాలా ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలండీ.
కొన్ని నెలల తర్వాత బ్లాగుల వైపు వచ్చి చదివిన ఫస్ట్ పోస్ట్ అన్న మాట ;)

Priya said...

థాంక్స్ రాజ్ గారు. మీరూ బ్రేక్ తీసుకున్నారన్నమాట. నేనైతే కావాలని బ్రేక్ తీసుకోలేదు కాని అదలా వచ్చేసిందండీ. అందుకే, మీరే ఆలశ్యంగా విషెస్ చెబితే నేను అంతకన్నా ఆలస్యంగా థాంక్స్ చెప్తున్నాను. ఏమీ అనుకోకండి.

బ్లాగుల వైపు రాగానే ముందు నా బ్లాగింటికి వచ్చినందుకు మరోసారి థాంక్స్ :) :)

Priya said...

కదా..! రాసేయాలనే అనుకుంటున్నానండీ. పైగా ఇక రెండు పార్ట్సే ఉన్నాయి కూడానూ! కాని వీలు కుదరక రాయలేకపోతున్నాను. ఈ నెలలో కచ్చితంగా ఒక పార్ట్ రాస్తాను. వచ్చేనెలలో శుభం కార్డుతో ఆఖరి పార్ట్ పబ్లిష్ చేసేస్తాను :)

Priya said...

బావున్నాను. అయినా నా బాగు గురించి కనుక్కునే మొహమే అది? ఏదో నువ్వూ బ్లాగింగ్ మొదలుపెట్టావు కాబట్టి అనుకోకుండా నేను గుర్తొచ్చి ఒక అడుగు ఇటు వేసుంటావు అంతే :-/

హమ్మయ్య! బొజ్జ చల్లారింది. ఆ ఇప్పుడు చెప్పూ.. మీ వాడు ఇచ్చిన గిఫ్టా.. రాస్తాను రాస్తాను (ఎప్పుడో చెప్పలేనురా.. ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. ఏ పోస్ట్ ముందు రాయాలో తెలియక).

Mahathi said...

Priya,

Many Happy returns of the day. enti intha thondaraga wish chesthunnananaa....edo inka half year migile vundi kada....adi haayiga gadapaalani, ilaanti bdays chala jarupukovaalani aashisthu....

-Mahathi

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Saturday, August 31, 2013

కృతజ్ఞతలు, క్షమాపణలు, విశేషాలు

హమ్మయ్య.. నేటితో నా ఇంటర్నెట్ కష్టాలు తీరాయి. ముందుగా, నా పుట్టినరోజుని జ్ఞాపకం ఉంచుకుని పర్సనల్ మెయిల్స్ ద్వారానూ..  బ్లాగ్ లో కామెంట్స్ ద్వారానూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు (లాస్య గారూ.. మరి ముఖ్యoగా మీకు), "కష్టేఫలే" శర్మ తాతయ్య గారికి క్షమాపణలు.

కృతజ్ఞతలు ఓకే కానీ, క్షమాపణలు ఎందుకు చెబుతున్నానో మీకు తెలియదు కదూ? చెప్తాను.. చెప్తాను. ఏమైందంటే.. తాతయ్య గారి బ్లాగ్లో భలే మంచి మంచి కబుర్లు చెబుతుంటారు. ఒకసారి ఎందుకో.. ఆ! ఎందుకంటే, ఆయన చిన్నతనంలో వారి అమ్మగారు చేసే వంటలను ప్రస్తావిస్తూ రాసిన పోస్ట్ చదివి.. "బామ్మ గారు చేసే వంటల్లో మీకు నచ్చే వంటకం ఏదైనా బ్లాగ్ ద్వారా మాకూ నేర్పించొచ్చు కద తాతయ్య గారూ?" అని అడిగితే, "బామ్మని అడిగి చేబుతానులేమ్మా" అన్నారు.

రెండు వారాల క్రితం మరో సందర్భంలో ఆయన రాస్తున్న పోస్ట్ (పెళ్ళిలో అలకపాన్పు) గురించి చెప్పగా "అబ్బా! టైటిలే చాలా బావుంది తాతయ్య గారు.. త్వరగా పోస్ట్ చేసేయండి" అన్నాను. దానికి ఆయన, నువ్వు అడిగావని శనగల పాటోళీ ఎలా చేసుకోవాలో రాసి నీ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయంటూ ఆడకనే నిష్టూరమాడారు. ఆయన రాసే ప్రతి పోస్టూ చదువుతాను మరి. ఎలా మిస్ అయ్యానో?! వెంటనే నాలుక కరుచుకుని క్షమాపణలు చెబుతూ, శనగలు నానబోసాను. దానికి ప్రతిగా తాతయ్య గారు, నేను కామెంట్ రాసిన విధానాన్ని మెచ్చుకుంటూ ఆయన అభిమాన రచయిత (శ్రీపాదవారు) మాటలను గుర్తుచేసుకుంటూ, "తెనుగు నేర్పిన తల్లులు" పోస్ట్ గురించి చెప్పి, ఈ లోపు "పెళ్ళిలో అలకపాన్పు" కూడా పోస్ట్ చేసేశారు.

మరుసటి రోజు ఆయన కామెంట్ చూసి సంబరంగా ఆ రెండు పోస్ట్లు చదివేసి కామెంట్ చేయబోతుంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎయిర్టెల్ వాడికి కంప్లైంట్ చేస్తే వారం, పది రోజులు పడుతుందన్నాడు సరిచేయడానికి! ఇంకేముందీ.. పొంగే పొంగే పాల మీద నీళ్ళు చల్లినట్లయిపోయింది నా పరిస్థితి. "ఆయన ఏమనుకుంటున్నారో ఏవిటో.. ఈ పిల్ల ఇకపై ఏమైనా అడిగితే చెయ్యకూడదు అనుకుంటారేమో? నొచ్చుకుంటారేమో" అని బాధపడిపోయాను. ఈ మాత్రానికే ఇంత ఇదయిపోవాలా అని మీరు అనుకోవచ్చు. కాని ఏమో.. నేను ఇష్టపడే వాళ్ళ మనసు నొచ్చుకుంటే తట్టుకోలేను. అందుకే ఈ క్షమాపణలు.

నా మట్టుకు నేను ఎవరి బ్లాగ్లోనైనా కామెంట్ చేశానంటే, వాళ్ళు దానికి రిప్లై ఇచ్చేవరకు కాలుకాలిన పిల్లిలా వాళ్ళ బ్లాగ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను. కొంతమంది పబ్లిష్ చేసి ఊరుకుని ఒకటి రెండు రోజుల తరువాత రిప్లై ఇస్తారు. భలే కోపమొస్తుంది. "ఏం.. ఎలాగూ పబ్లిష్ చేశారుగా ఒక్క ముక్క రిప్లై ఇచ్చేస్తే నాకీ తిరుగుడు ఉండదు కదా" అని :P. కాని ఒక్కోసారి నేను కూడా వెంటనే రిప్లైలు ఇవ్వడం కుదరక మరుసటి రోజు ఇస్తుంటాను. అంతకంటే లేట్ అయితే మాత్రం మనసు గింజుకుంటూ ఉంటుంది "అయ్యయ్యో.. నన్నెలా తిట్టుకుంటున్నారో ఏవిటో" నని :D

సరిగ్గా.. అలాటి బాధే మొన్న నా పుట్టినరోజున కూడా కలిగింది. అంటే తిట్టుకుంటారని కాదుగాని... ...  ఏమో.. చెప్పలేకపోతున్నాను. "అంత బాధ అయితే ఆఫీసు నుండి రిప్లై ఇచ్చుండొచ్చుగా" అని మీరనుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే.. నేను మా ఆఫీస్ గురించి మీకు చూయించిన పిక్చర్ అలాటిది మరి! కాని నిజానికి ఆఫీస్ లో వర్క్ ఎక్కువగానే ఉంటుంది. ఏదో నా వర్క్ మీద నాకున్న ప్రేమను బట్టి ఆఫీస్లో ఉన్నంతసేపూ సరదాగా అనిపిస్తుంది గానీ చెప్పాలంటే కళ్ళు బాగానే స్ట్రైన్ అవుతాయి. ఇంటికి వచ్చాక ఇంకేమీ చేసేందుకు ఓపిక ఉండదు. మెదడు, మనసూ రెండూ "నిద్రా నిద్రా నిద్రా" అంటాయి. హ్మ్మ్.. పైగా బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి నేనే ఆఫీస్లో కూర్చొని బ్లాగర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నానంటే.. హహ్హహ్హహ ఇంకేం లేదు "నా పనీ పాటా" పోస్ట్ కి కామెంట్ చేసిన నాగరాజ్ గారు అన్నట్లు "అనగనగా మా ఆఫీసూ" అని చెప్పుకోవలసి వస్తుంది :).

ఇహపోతే.. నా పుట్టిన రోజు విశేషాలు. అంతకంటే ముందు 18న మా బావగారి పుట్టిన రోజు. అంచేత ఆదివారమంతా అక్కావాళ్ళింట్లో అభి గాడి అల్లరితో సరిపోయింది. 19న ఆఫీస్ కి వెళ్లాను. హహ్హ! నేనసలు మరిచేపోయాను మరుసటిరోజు నా పుట్టినరోజని! సాయంత్రం ఇంటికి వెళ్లేడపుడు కొలీగ్స్ అందరూ "రేపు స్పెషల్ ఏంటీ? పార్టీ ఎక్కడా" అని అడిగినా గుర్తు రాలేదు. కేవలం ఆ రోజు పంపాల్సిన పుస్తక పేజీలే నా బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. విసిగిపోయిన నా క్లోజ్ ఫ్రెండ్ (ఆఫీస్లో నేను పర్సనల్ రిలేషన్షిప్స్ మైంటైన్ చేయను. బట్, ఈ అమ్మాయి ఎక్సెప్షన్. వీలైతే తన గురించి ఒక పోస్ట్ రాస్తాను) సుగన్య నెత్తిమీద మొత్తుతూ గుర్తు చేసింది. అప్పుడు బల్బ్ వెలిగి అటు నుండి అటు "పోతీస్" కి వెళ్లి చీర కొనుక్కున్నాను.

రాత్రికి రాత్రి బ్లౌస్ ఎవరు కుడతారు చెప్పండి? లక్కీగా నేను సెలెక్ట్ చేసుకున్న చీర మీద బ్లాక్ డిజైన్ రావడంతో నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌస్ తో మేనేజ్ చేశాను. పుట్టిన రోజునాడు నా డెస్క్ అంతా పూలతో నిండిపోయింది! మెయిల్స్, కాల్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, సర్ప్రైజ్స్, వర్క్.. బిజీ బిజీగా గడిచిపోయింది. చిన్నపాటి బాధేంటంటే ఎక్కడా అనూ తో టైం స్పెండ్ చేయలేకపోయాను. "ఇంతకూ తనేం సర్ప్రైజ్ ఇచ్చాడు?" అని మాత్రం అడగొద్దు. నేను చెప్పలేను :).

హహ్హహ్హహహ్ నా బొంద! మీరు ఊహించుకుంటున్నట్లేం కాదు. చెప్పాలంటే పెద్ద పోస్ట్ రాయాలి. ఇందులో కుదరదు.  అందుకే చెప్పలేను అన్నాను. వచ్చేవారం ఎప్పుడైనా రాస్తానేం..

ఒకే ఒకే.. ఇక ఫోటోలు చూడండి.

ఇది మా బావగారి పుట్టిన రోజున తీసిన ఫోటోలలో ఒకటి. 

ఉదయం నిద్ర లేచి మొట్టమొదటిగా చూసిన అక్క రాతలు :)

జీవితంలో మొట్టమొదటి సారిగా అక్క నాకిచ్చిన సర్ప్రైజ్! పెళ్లైయ్యాక చెల్లెలి విలువ తెలిసొచ్చినట్లుంది మా అక్కకి :P.  

సుగన్యా, నేను. ఈ ఫోటో చూసి మా అమ్మ ఎంత షాక్ అయిపోయిందో..! "నువ్వు కూడా ఇంత ఒద్దికగా నిలబడతావుటే?!" అంటూ. హహ్హ్హహ.. ఆఫీస్ కదా అందుకే ఇంత ఒద్దిక. లేకపోతే.. నాకస్సలు పళ్ళు కనబడకుండా నవ్వడం చేతకాదు బాబూ మీరేమైనా అనుకోండి. By the way.. ఇదే నా పుట్టినరోజు చీర. 

అబ్బా.. ఏంటో ఏమీ చెప్పకుండానే పేద్ద పోస్ట్ అయిపోయింది! నెక్స్ట్  టపాలో భరత్ నాకిచ్చిన సర్ప్రైజ్ సంగతి చెబుతానేం? 

ఒక చిన్న మాట. అందరికీ కాదులే.. నా బ్లాగ్ రెగులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి మాత్రం. ఏంటంటే.. మరీ ముఖ్యమైన విషయాలో, సెలవులో అయితే తప్ప సాధారణంగా వీక్ డేస్ (సోమ - శుక్ర వారాల్లో) లో ఇకపై పోస్ట్స్ పబ్లిష్ చేయను (చేయలేను). కామెంట్స్ కి మాత్రం స్పందించగలనని గమనించగలరు. థాంక్స్. 

36 comments:

 1. Anonymous31/8/13

  అయ్యో! నెట్ పోయిందా? ఏమయ్యేవోనని ఒకటే ...:) ఉద్యోగంలో ఉన్నపుడు ఎవరికీ ఇంతకాలం ఫోన్ పని చేయకుండా చేయలేదు, నేనూ ఆ జాతివాడినేగా. దారుణం గా పదిరోజులా హన్నా! ఇక్కడ బి.ఎస్.ఎన్.ల్, మా వాళ్ళూ అలాగే ఉన్నారు. ఫోన్ పోయిందిరా అని చెబితే వారానికీ దిక్కుండటం లేదు. మొన్ననెళ్ళి ఒక సారి నాకే దిక్కు లేకపోతే మిగిలినవాళ్ళ పనేమిరా అబ్బాయ్ అంటే.... వె...యను నేను ఉత్త వె...యను నేను అని పాటందుకున్నాడు. పోన్లే ఇప్పుడు నిన్ను క్షమించాలా? వద్దా? చెప్పు అల్లరి పిల్లా?

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హా.. తాతయ్య గారూ అన్యాయం, అక్రమం. ఇన్నిసార్లు క్షమించండి అన్నాక కూడా క్షమించకపోతే బావుండదు చెబుతున్నా :)

   సరే గాని, "ఏమయ్యావోనని .....:)" అంటూ వదిలేశారు. దయచేసి ఆ ఖాళీని పూరించేద్దురు.. ప్లీజ్?

   Delete
  2. Anonymous1/9/13

   అమ్మాయ్ ప్రియా!
   ప్రేమ ఉన్న చోట అలకలు బుజ్జగింపులే కాని కోపాలు క్షమాపణలు ఉండవురా తల్లీ! :) మనవల మీద కోపమా? అబ్బే ఊహించలేను. ఇక మనవరాళ్ళ మీద కోపమా? అసలు ఆలోచించనే లేను. చిట్టి తల్లులు ఎంత కష్టపడతారని....ఎంత ఓపిక, అందుకు కోపం కాదు, ఆవేదన,బాధ కష్టపడిపోతున్నారే అని...అల్లరి పిల్ల మీద కోపమా.... :) ఇక ఖాళీ అంటావా? అది, ఆతృత, ఆవేదన,ఇటువంటి మాటలింకా ఉన్నాయా... అదనమాట సంగతి :)

   Delete
  3. ఇంకేం మాట్లాడగలను తాతయ్య గారు? ఆప్యాయపూరిత మాటలతో నా నోరు మూసేశారు :).
   Thanks for the comment :).

   Delete
 2. హేవిటీ... కామెంటు రాసేసి కాలు కాలిన పిల్లిలా బ్లాగు చుట్టూరా తిరుగుతుంటారా? కర్మ కాలిపోయి రిప్లై ఇవ్వకపోతే మీరేదో అఘాయిత్యం చేసుకునేట్టుందే? హన్నన్నా... ఓ పన్చేయండి! కామెంటుతో పాటే, నాకు వెంఠనే, విధిగా రిప్లై ఇవ్వగలరు అని కూడా రాసేయండి. ఓ పనైపోద్ది!! జాటర్ ఢమాల్! :)

  ReplyDelete
  Replies
  1. నాగరాజ్ గారూ, మీరెందుకు మరీ అంత ఎక్స్ట్రీం లెవెల్ లో ఆలోచిస్తున్నారు?! మొన్న, ఏదో ఆఫీస్ లో సరదాగా ఉంటుంది అంటే.. అనగనగా మా ఆఫీస్ అని చెప్పుకోవలసి వస్తుందన్నారు. ఈ వేళ, వాళ్ళిచ్చే రిప్లై కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటాను అంటే.. రిప్లై ఇవ్వకపోతే అఘాయిత్యం చేసుకునేట్లున్నారే అంటున్నారు!

   లాస్ట్ లో ఆ చిరునవ్వు స్మైలీ లేకపోతే ఘాటుగా సమాధానం ఇచ్చేసి ఉండేదాన్ని :P

   Anyway.. thanks for the comment :)

   Delete
 3. ప్రియ గారూ,
  కృతజ్ఞతలు, క్షమాపణలు అంటూనే మరిన్ని విశేషాలతో విచ్చేశారు.
  ఎందుకో ఈ పోస్ట్ చదువుతుంటే మీ బ్లాగ్ టైటిల్ కి తగ్గట్టుగానే మీ మనసులో మౌన రాగాలకి పదాలతో ఖచ్ఛితమైన రూపం ఇస్తున్నారనిపించింది. మీ మాటల స్వచ్ఛతా ముచ్చటగా అనిపించింది. అన్ని అనుభూతులూ ఫొటోల రూపంలో భద్రపరచుకునే మీ అలవాటుని మెచ్చుకోకుండా ఉండలేము, వెరీ నైస్!
  ఆలశ్యమే అయినా... పుట్టిన రోజు శుభాకాంక్షలు, మీకూ మీ బావ గారికి కూడా!

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ పండు గారు! మా బావ గారికి కూడా మీ శుభాకాంక్షలు అందజేస్తాను.

   తెలుసా..? నా బ్లాగ్ పేరు మీద మొట్టమొదటిసారిగా కామెంట్ చేసింది మీరే! Thank you soooo much for the lovely comment :) :)

   Delete
  2. అవునా? మొదట మీ బ్లాగ్ పేరు స్పందనలలో మాదేనా? చక్కగా గమనించి చెప్పారు కూడ. చాలా సంతోషం అండీ!

   Delete
 4. ఏమిటీ చాలా రోజులుగా ప్రియగారి జాడలేదు అనుకున్నా ఇదన్నమాట సంగతి!ఆలస్యంగా పుట్టినరోజు శుభాకంక్షల చెపుతున్నా.....ఫోటోలు బాగున్నాయి .

  ReplyDelete
  Replies
  1. Thank you. మీరూ నన్ను వెదుక్కున్నారా? హహ్హ్హహ.. మీ కామెంట్ కి రిప్లై ఇవ్వలేదనే కదు రాధిక గారు? పోనీలెండి ఇప్పటికైనా మీకు విషయాన్ని చేరవేయగలిగాను :)

   Delete
 5. ఓహ్ మీ పుట్టినరోజు మిస్ అయిపోయానా. కాస్త ఆలశ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియగారు :-)

  ReplyDelete
  Replies
  1. మరేం పరవాలేదు వేణు గారు. Thank you so much for the wishes :)

   Delete
 6. ఓహో పుట్టినరోజు పార్టీ మిస్సయ్యనా నేను ? సరే చాక్లెట్ కూడా ఇవ్వకపోయినా కొంచెం లేట్ గనన్నా విషెస్ చెప్తానులే :-)
  Belated Birthday wishes Priya !

  పెళ్లి అయ్యాక చెల్లి విలువ తెలిసిందా మీ అక్కకు :-) హ హ తమరికి అంతే అనుకుంటారేమో ఆవిడ ఫ్యూచర్ లో :-) అదేదో లంగా వోణి చూపించి చీర అని మోసమా :-)

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ అన్యాయమమ్మా.. చాక్ట్లేట్ ఇవ్వలేదని విషెస్ లేట్ గా చెబుతున్నారా? :P

   తనకి పెళ్లై వెళ్ళాక బాగా తెలిసింది :(
   సో.. కొత్తగా తెలియబోయే విలువ లేదనే అనుకుంటున్నాను :).

   అన్నట్లూ, శ్రావ్య గారూ అది లంగావోణి కాదండీ. చీరే! ఆ మోడల్ లో ఉంటుంది అంతే. కావాలంటే చూడండి.. కుచ్చిళ్ళు కూడా ఉన్నాయి. అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పండి??

   Delete
  2. అది చీర అని తెలుసు కానీ ఆ స్టైల్ లో ఉంది కదా అని జోకానన్నమాట :-)

   Delete
  3. ఎంచక్కా బ్రాకెట్లో రాసుండొచ్చు కద శ్రావ్యా జోక్ అనీ? ఇప్పుడు చూడండి.. నా తెలివితేటల రహస్యం బయటపడిపోలేదూ.. :( :P

   Delete
 7. బుజ్జిగాడితో భలే ఉన్నారు ప్రియా :) ...
  లంగాఓణీ మోడల్ చీర బావుంది కానీ ఫొటోని ఇంతదారుణంగా ఎడిట్ మా కళ్ళకి సైట్ వచ్చేలా చేసారు ..చాలా అన్యాయం :( అని మనవి చేసుకుంటున్నాను యువరానర్ :ఫ్

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ప్రియ గారు. అయినా ఆ మాత్రం ఎడిట్ చేయకపోతే ఎలాగండీ? అందరూ మంచోళ్ళే ఉంటారా మరి? ఆడపిల్ల నీడ కనబడినా డేంజరే కదా ఈ రోజుల్లో? నా పిచ్చి కొద్దీ నేను ఈ మాత్రం ధైర్యం చేస్తున్నాను.

   Delete
  2. నిజానికి, మీ థీం నచ్చింది ...మీ ధైర్యానికి నా వీరతాడు :D

   Delete
 8. Anonymous2/9/13

  Belated wishes on Ur b'day priyaa!
  I have posted wishes da day before....but not seen...anyway...hope u enjoyed

  ReplyDelete
  Replies
  1. Thank you so much, Anu gaaru :)
   I haven't received that comment. The one which you wrote about my work, I've published. But.. as I explained in this post, was unable to reply. Sorry.

   I really enjoyed my b'day. ఆ విశేషాలు ఈ శనివారం చెప్తాను :).
   Once again, thanks for the wishes.

   Delete
 9. ఆలస్యంగా..
  మీ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియగారు..:))

  ReplyDelete
 10. Anonymous3/9/13

  bavunnayandi.. mee krutagnathalu.. kshamapanalu... & photos... :) ... so mee b'day super ga gadiparu annamaata... :)) .. meeru elage super ga every year b'days jarupukovalani.. aashisthu :))

  -Prashanth

  ReplyDelete
  Replies
  1. ప్రియ గారూ, మీ బ్లాగ్ చూశాను, బాగుందమ్మా. తీరిగ్గా అన్నీ చదువుతాను.

   Delete
 11. హాయ్ ప్రియ . బాగున్నావా. ఏరా మళ్ళా ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అని తిట్టకు. అలా తిడతావని భయం వేసే ఫోన్ చేయకుండా కామెంట్ వేస్తున్నా. నీ పుట్టినరోజు నాడు మా వాడు నీకేం బహుమానం ఇచ్చాడో తెలుసుకోవాలనుంది. త్వరగా వ్రాయి. ఎదురుచూస్తున్నాం అందరం....;)

  ReplyDelete
  Replies
  1. బావున్నాను. అయినా నా బాగు గురించి కనుక్కునే మొహమే అది? ఏదో నువ్వూ బ్లాగింగ్ మొదలుపెట్టావు కాబట్టి అనుకోకుండా నేను గుర్తొచ్చి ఒక అడుగు ఇటు వేసుంటావు అంతే :-/

   హమ్మయ్య! బొజ్జ చల్లారింది. ఆ ఇప్పుడు చెప్పూ.. మీ వాడు ఇచ్చిన గిఫ్టా.. రాస్తాను రాస్తాను (ఎప్పుడో చెప్పలేనురా.. ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. ఏ పోస్ట్ ముందు రాయాలో తెలియక).

   Delete
 12. Anonymous18/9/13

  enthaki premayanam part 9 eppudu priya...ika rayadalachukoleda enti...eppudoo july lo rasaru...

  ReplyDelete
  Replies
  1. కదా..! రాసేయాలనే అనుకుంటున్నానండీ. పైగా ఇక రెండు పార్ట్సే ఉన్నాయి కూడానూ! కాని వీలు కుదరక రాయలేకపోతున్నాను. ఈ నెలలో కచ్చితంగా ఒక పార్ట్ రాస్తాను. వచ్చేనెలలో శుభం కార్డుతో ఆఖరి పార్ట్ పబ్లిష్ చేసేస్తాను :)

   Delete
 13. చాలా ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలండీ.
  కొన్ని నెలల తర్వాత బ్లాగుల వైపు వచ్చి చదివిన ఫస్ట్ పోస్ట్ అన్న మాట ;)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాజ్ గారు. మీరూ బ్రేక్ తీసుకున్నారన్నమాట. నేనైతే కావాలని బ్రేక్ తీసుకోలేదు కాని అదలా వచ్చేసిందండీ. అందుకే, మీరే ఆలశ్యంగా విషెస్ చెబితే నేను అంతకన్నా ఆలస్యంగా థాంక్స్ చెప్తున్నాను. ఏమీ అనుకోకండి.

   బ్లాగుల వైపు రాగానే ముందు నా బ్లాగింటికి వచ్చినందుకు మరోసారి థాంక్స్ :) :)

   Delete
 14. Priya,