Saturday, October 12, 2013

పెళ్ళా మజాకా!

"లేడికి లేచిందే పరుగన్నట్లు.. ఏంటా తొందరా? ఆడపిల్లంటే నెమ్మదిగా అణుకువతో ఉండాలి" ఈ మాట ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నోటి నుండి ఎన్నిసార్లు వినుంటానో లెక్కే లేదు! ఆ మాటలోనే తెలుస్తోంది కదా నాకెంత కుదురో? :) 

నా స్వభావానికి తగ్గట్లే లైఫ్ లో అన్నీ చాలా త్వర త్వరగా జరిగిపోయాయి. సాధారణంగా ఆరో నెలలో బోర్లా పడతారట పిల్లలు. నేను ఐదో నెలలో అడుగిడిన వారానికే బోర్లాపడడం మాత్రమే కాకుండా పాకడానికి కూడా ప్రయత్నించేదాన్నిట! ఎనిమిదో నెలలో "వద్దేయ్" అన్న మాటతో మొదలయిన మాటల ప్రవాహం గురించి అడపాదడపా మా ఇంట్లో అందరూ బాధపడుతూనే ఉంటారు. ఇక చదువు ఎప్పుడు మొదలయిందో, ఎప్పుడు అయిపోయిందో తెలియనంత త్వరగా అయిపొయింది. ఇలా నా లైఫ్లో ప్రతీది చాలా ఫాస్ట్ గా, అంత కన్నా స్మూత్ గా జరిగిపోయాయి. ఒక్క నా పెళ్లి తప్ప!

నాకంటే రెండేళ్ళు పెద్దదైన అక్క ఉన్నా కూడా ఎప్పుడూ నా పెళ్లి గురించే ఎక్కువ ఆరాటపడేది అమ్మ (బహుశా నన్ను తొందరగా బయటకు పంపేస్తే తర్వాత కాస్త ప్రశాంతంగా ఉందామని కాబోలు?!). నాన్నకేమో "పెళ్లి" అన్న టాపికే నచ్చదు. దానికి కారణం, మమ్మల్ని దూరంగా పంపించాల్సి వస్తుందన్నది మొదటి కారణమైతే.. రెండోది he is too possessive. ఆయన కన్నా అమ్మను ఎక్కువ ప్రేమించినా కూడా భరించలేరు. అన్ని విషయాల్లోనూ ఎంతో మెచ్యూర్డ్ గా ఉండే డాడీ మా విషయంలో మాత్రం డిఫరెంట్ గా (ఎలా డిఫైన్ చేయాలో అర్ధంకావడంలేదు అందుకే డిఫరెంట్ అంటున్నా) ఉంటారు. 

ఉదాహరణకి, ఓసారి మేమందరం కలిసి బయటకు వెళుతూ ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగాము. సాధారణంగా కార్ లో కూర్చునే తాగుతాం కాని, ఆ రోజు క్లైమేట్ బావుండి ప్లెజెంట్ గా ఉందని బయట నిలబడ్డాం. మాకు కాస్త పక్కగా ఓ ముగ్గురు, నలుగురు కుర్రాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. వాడిలో ఒకడు మాటిమాటికి మా అక్క ను చూస్తూ వెకిలిగా పళ్ళికిలించాడట.. జ్యూస్ వచ్చే వరకు ఓర్చుకుని, వచ్చాక నేరుగా వాడి దగ్గరకెళ్ళి ఆ జ్యూస్ వాడి మొహం మీద కొట్టారు.  ఊహించని ఈ పరిమాణానికి వాళ్ళూ, మేమూ అందరం షాక్!  జ్యూస్ మొహం మీద పోయడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని వార్నింగ్ ఇవ్వడం, మళ్ళీ అసలే వాళ్ళు నలుగురున్నారు తిరిగి ఏమైనా చేస్తారేమో అని భయంతో గబగబా మమ్మల్ని లాక్కెళ్ళి స్పీడ్ గా కార్ ఇంకో రూట్లోకి మార్చేయడం అంతా నిముషంలో జరిగిపోయింది. "ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా? లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవడానికి కాకపోతే?" అంటూ తర్వాత అమ్మ తాండవం చేసిందనుకొండీ.. అది వేరే విషయం.

క్లాస్మేట్స్ తో కాని, బంధువుల్లో కాని ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతున్నపుడు.. కొంత వరకూ ఓకే కాని ఏ మాత్రం నవ్వు శృతి మించినా, అవసరానికి మించి ఒక మాట ఎక్ష్త్రా అయినా.. అంతే సంగతులు. అలాగని స్ట్రిక్ట్ గా ఎవ్వరితోనూ మాట్లాడకూడదంటూ షరతులు విధించి చాదస్తంగా ప్రవర్తించరు. కానీ.. చూపులతోనే కట్టిపడేస్తారు. మాకు సంబంధించిన విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో అన్నీ తీసుకుంటారు. అయినా ఎక్కడా ఓవర్ ప్రొటెక్టీవ్ గా ఉన్నట్లు అనిపించనివ్వరు. మా ఇష్టాలను, అభిప్రాయాలనూ ఎంతో గౌరవిస్తారు. ఎలాటి విషయమైనా పంచుకునేంత ప్రేమగా, ఆత్మవిశ్వాసంతో పెంచారు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చెయ్యి చేసుకోలేదు! తిట్టను కూడా తిట్టలేదు. ఏదైనా ఇష్యూ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతారు, లేకపోతే మేము మాట్లాడే వరకూ మౌనంగా ఉంటూ ఆయన మా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు అర్ధమయ్యేలా చేస్తారు.

అమ్మోయ్! హహ్హహ..  నా పెళ్లి గురించి మొదలుపెట్టి నాన్న గురించి రాసేస్తున్నాను. ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఈ పోస్ట్ కి ఇక అంతముండదు. అంచేత మళ్ళీ నా పెళ్లి మాటలోకి వచ్చేద్దాం. నా ప్రేమను ఆయన అంగీకరించడానికి నేను పడిన తిప్పలు ఎలాగూ "ప్రేమాయణం" లో చెప్తాను కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడను. 

భరత్, వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పడానికే ఏడాది టైం తీసుకున్నాడు! విషయం విన్నాక అవునో కాదో చెప్పడానికి మా మావయ్యగారు నాలుగు నెలలు టైం తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారులే.. ఆయనకు పూర్తి ఇష్టం లేకపోయినా వాళ్ళ అబ్బాయి తీసుకునే నిర్ణయాల మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. అప్పుడు మా అమ్మ దగ్గర భరత్ తో పెళ్ళి మాట ఎత్తితే అంతెత్తున ఎగిరిపడింది నా మీద! బుద్ధిమంతుడు, చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన కుటుంబం, చూడ్డానికి కూడా బావుంటాడు. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా అంటే, కులాలు వేరు, అబ్బాయి లావుగా ఉన్నాడు అని ససెమేర వద్దంది. నాన్న నో కామెంట్స్.. "ఏదైనా ముందు అమ్మతో తేల్చుకుని రా. ఆవిడ ఎలా అంటే అలా" అన్నారు. అక్క "నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు చెల్లీ" అని చేతులెత్తేసింది. 

పైగా నెల తిరిగేలోపు అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసేసింది! ఏడ్చి, గగ్గోలు పెట్టి మా అమ్మా నాన్నలను ఒప్పించేసరికి హమ్మా! ఆరు నెలలు పట్టింది (అప్పటికీ అమ్మ పూర్తిగా ఒప్పుకోలేదనుకోండీ..). మొత్తానికి 2012 జూలై నెలకి అటూ ఇటూ రెండు వైపులా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని ఈ లోపు భరత్ కి మరో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. పోస్టింగ్ కోసం నవంబర్ వరకూ ఆగాల్సి వచ్చింది. జనవరిలో నిశ్చితార్దం పెట్టుకోవాలనుకున్నారు. కాని ఏ కారణమూ లేకుండానే అది కాన్సిల్ అయి, ఆఖరికి మే 7 న జరిగింది. అది కూడా జస్ట్ నిశ్చితార్దానికి నాలుగు రోజులు ముందు మా అమ్మ ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడ్డం, అందరూ మంచి మూడ్ లోనే ఉండడంతో క్షణాల మీద అన్ని ఏర్పాట్లూ జరిగి మొత్తానికి సక్సెస్స్ అయింది! 

ఆ.. ఏం సక్సెస్స్ లెండి.. సరిగ్గా ఆ ముందు రోజు నాకు చక్కటి జ్వరం. నిశ్చితార్దానికి అరగంట ముందు వరకూ బెగ్గర్ గెటప్ లో ఓ మూల పడుకుని ఉండి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారని హడావిడి చేసేసరికి వెళ్లి తల స్నానం చేసి చీర చుట్టుకుని వచ్చాను. హహ్హహ్హ.. తలస్నానం అంటే గుర్తొచ్చిందండోయ్.. ఆ రోజు ఉదయం నుండి సాయత్రం వరకూ కరెంట్ లేదు! ఉన్న నీళ్లన్నీ, వంటలకీ, క్లీనింగ్ కి, బంధువుల స్నానాలకీ అయిపోయాయి. పాపం.. పెళ్లికూతిరినైన నేను కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు. ఆ హడావిడిలో డాడీ ఎక్కడున్నారో కూడా తెలియలేదు. మెసేజ్ చేస్తే, అప్పటికప్పుడు రెండు వాటర్ కాన్స్ (25 లీటర్స్ వి) కొనుక్కొని వచ్చారు. ఇక ఆ నీటితో స్నానం చేశాను. ఒక్కసారి ఆ పెళ్లి కుర్చీలో కూర్చున్నాక నా ఆనందం అనారోగ్యాన్ని జయించింది కనుక ఆల్ హ్యపీస్. 

కాని ఈ ప్రోగ్రాం అయిపోయాక అంతా పిన్ డ్రాప్ సైలెన్స్! మళ్ళీ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి ఇదిగో.. ఇన్ని నెలలు పట్టింది. ముందు అక్టోబర్ నెలాఖరికి అన్నారు. మా డాడీకి కుదరలేదు. నవంబర్ మొదటి వారం అనుకున్నాం.. మా మరిది గారికి ఎక్షామ్స్ ఉన్నాయని, 22న అనుకున్నాం.. మళ్ళీ మా అత్తగారికి ఆఫీస్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన మీటింగ్స్ ఉండడంతో 29 అనుకున్నారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఊరుకుంటే, "డిసెంబర్ 1న నాకు ఎక్షామ్ ఉంది" అని భరత్ అన్నాడు. ఇక నాకు తిక్కరేగింది. "పెళ్ళీ వద్దు కిళ్ళీ వద్దు పో. జనవరిలో పెట్టుకుందాం. ఈ ఏడాది నేను బిజీ" అన్నాను. అవును మరీ.. అటొచ్చి ఇటొచ్చీ కాళీగా ఉంది నేనేనేవిటీ? లేదు లేదు తొక్కలో ఎక్షామ్దేముందిలే.. 29 ఫిక్స్ అన్నారు.  హమ్మయ ఎలాగో డేట్ ఫిక్స్ అయిపోయింది అని మిగతా ఏర్పాట్లు చూసుకుంటూ,  అంతా కాస్త స్మూత్ గా  వెళుతోంది కదా అని ఊపిరి పీల్చుకోబోయేసరికి.. సమైఖ్యాంద్రా సెగ గురించి భయం పట్టుకుంది. టూ వీలర్స్ ని కూడా రోడ్ మీద తిరగనివ్వడం లేదుట.. ఏంటో.. నా పెళ్ళికి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి మరి. చూద్దాం.. ఏం జరుగుతుందో..!

13 comments:

రాధిక(నాని ) said...

అభినందనలు ప్రియ గారు .బెంగ పడకండి మీ పెళ్లినాటికి అంతా సర్దుకోవచ్చు లెండి .

Anonymous said...

అమ్మమ్మ నీకు వస బాగాపోసేసింది. భయం లేదు బాలా వివాహం బాగానే జరుగుగాక!శుభం భూయాత్!!!

Anonymous said...

GOOD

Anonymous said...

Hi priyaa! Don't worry.Everything will be fine.
Enjoy da beautiful days.
Mari tckt reserve cheyinchukomaa....

Priya said...

థాంక్స్ రాధిక గారూ. నేనూ ఆ ధైర్యంతోనే ఉన్నాను :)

Priya said...

ఆశీర్వాదాలు అందుకున్నానుగా.. అయితే అంతా శుభమే.
Thanks a lot తాతయ్య గారు :)

Priya said...

Thanks :)

Priya said...

Thanks అను గారు. కచ్చితంగా.. :)
అయినా భలేవారే మీరు. ఇంకా టికెట్స్ బుక్ చేయకుండా ఉంటానా?! నా గురించి తెలియదా మీకు? పోయిన వారమే చేసేసాను ;)

చిన్ని ఆశ said...

మరి, ప్రేమ పెళ్ళా ...మజాకా? అందరినీ ఒప్పించి ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ చివరికి కలిసి వేసే ఏడడుగుల పండగ అంతా శుభం గానే అవుగాక! నిశ్చింతగా ఉండండి. ఒక్కొకటీ అన్నీ పెళ్ళినాటికల్లా సమైక్యంగా సర్దుకుంటాయి.

వేణూశ్రీకాంత్ said...

పెళ్ళి పనులకు ఏ ఆటంకాలు కలుగకుండా అన్నీ సజావుగా జరిగిపోవాలని కోరుకుంటున్నానండీ. అలాగే జరుగుతుంది మీరేం టెన్షన్ పడకండి ఆల్ ద వెరీ బెస్ట్ :-)

Priya said...

@ పండు గారు, వేణూ గారు: అంతా శుభమే జరగాలని నా తరుపున మీరూ కోరుకుంటున్నందుకు చాలా థాంక్స్ అండీ.. :)

డేవిడ్ said...

:)...

MURALI said...

పోనీలెండి అవాంతరాలన్నీ జయించేసారు.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Saturday, October 12, 2013

పెళ్ళా మజాకా!

"లేడికి లేచిందే పరుగన్నట్లు.. ఏంటా తొందరా? ఆడపిల్లంటే నెమ్మదిగా అణుకువతో ఉండాలి" ఈ మాట ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నోటి నుండి ఎన్నిసార్లు వినుంటానో లెక్కే లేదు! ఆ మాటలోనే తెలుస్తోంది కదా నాకెంత కుదురో? :) 

నా స్వభావానికి తగ్గట్లే లైఫ్ లో అన్నీ చాలా త్వర త్వరగా జరిగిపోయాయి. సాధారణంగా ఆరో నెలలో బోర్లా పడతారట పిల్లలు. నేను ఐదో నెలలో అడుగిడిన వారానికే బోర్లాపడడం మాత్రమే కాకుండా పాకడానికి కూడా ప్రయత్నించేదాన్నిట! ఎనిమిదో నెలలో "వద్దేయ్" అన్న మాటతో మొదలయిన మాటల ప్రవాహం గురించి అడపాదడపా మా ఇంట్లో అందరూ బాధపడుతూనే ఉంటారు. ఇక చదువు ఎప్పుడు మొదలయిందో, ఎప్పుడు అయిపోయిందో తెలియనంత త్వరగా అయిపొయింది. ఇలా నా లైఫ్లో ప్రతీది చాలా ఫాస్ట్ గా, అంత కన్నా స్మూత్ గా జరిగిపోయాయి. ఒక్క నా పెళ్లి తప్ప!

నాకంటే రెండేళ్ళు పెద్దదైన అక్క ఉన్నా కూడా ఎప్పుడూ నా పెళ్లి గురించే ఎక్కువ ఆరాటపడేది అమ్మ (బహుశా నన్ను తొందరగా బయటకు పంపేస్తే తర్వాత కాస్త ప్రశాంతంగా ఉందామని కాబోలు?!). నాన్నకేమో "పెళ్లి" అన్న టాపికే నచ్చదు. దానికి కారణం, మమ్మల్ని దూరంగా పంపించాల్సి వస్తుందన్నది మొదటి కారణమైతే.. రెండోది he is too possessive. ఆయన కన్నా అమ్మను ఎక్కువ ప్రేమించినా కూడా భరించలేరు. అన్ని విషయాల్లోనూ ఎంతో మెచ్యూర్డ్ గా ఉండే డాడీ మా విషయంలో మాత్రం డిఫరెంట్ గా (ఎలా డిఫైన్ చేయాలో అర్ధంకావడంలేదు అందుకే డిఫరెంట్ అంటున్నా) ఉంటారు. 

ఉదాహరణకి, ఓసారి మేమందరం కలిసి బయటకు వెళుతూ ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగాము. సాధారణంగా కార్ లో కూర్చునే తాగుతాం కాని, ఆ రోజు క్లైమేట్ బావుండి ప్లెజెంట్ గా ఉందని బయట నిలబడ్డాం. మాకు కాస్త పక్కగా ఓ ముగ్గురు, నలుగురు కుర్రాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. వాడిలో ఒకడు మాటిమాటికి మా అక్క ను చూస్తూ వెకిలిగా పళ్ళికిలించాడట.. జ్యూస్ వచ్చే వరకు ఓర్చుకుని, వచ్చాక నేరుగా వాడి దగ్గరకెళ్ళి ఆ జ్యూస్ వాడి మొహం మీద కొట్టారు.  ఊహించని ఈ పరిమాణానికి వాళ్ళూ, మేమూ అందరం షాక్!  జ్యూస్ మొహం మీద పోయడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని వార్నింగ్ ఇవ్వడం, మళ్ళీ అసలే వాళ్ళు నలుగురున్నారు తిరిగి ఏమైనా చేస్తారేమో అని భయంతో గబగబా మమ్మల్ని లాక్కెళ్ళి స్పీడ్ గా కార్ ఇంకో రూట్లోకి మార్చేయడం అంతా నిముషంలో జరిగిపోయింది. "ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా? లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవడానికి కాకపోతే?" అంటూ తర్వాత అమ్మ తాండవం చేసిందనుకొండీ.. అది వేరే విషయం.

క్లాస్మేట్స్ తో కాని, బంధువుల్లో కాని ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతున్నపుడు.. కొంత వరకూ ఓకే కాని ఏ మాత్రం నవ్వు శృతి మించినా, అవసరానికి మించి ఒక మాట ఎక్ష్త్రా అయినా.. అంతే సంగతులు. అలాగని స్ట్రిక్ట్ గా ఎవ్వరితోనూ మాట్లాడకూడదంటూ షరతులు విధించి చాదస్తంగా ప్రవర్తించరు. కానీ.. చూపులతోనే కట్టిపడేస్తారు. మాకు సంబంధించిన విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో అన్నీ తీసుకుంటారు. అయినా ఎక్కడా ఓవర్ ప్రొటెక్టీవ్ గా ఉన్నట్లు అనిపించనివ్వరు. మా ఇష్టాలను, అభిప్రాయాలనూ ఎంతో గౌరవిస్తారు. ఎలాటి విషయమైనా పంచుకునేంత ప్రేమగా, ఆత్మవిశ్వాసంతో పెంచారు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చెయ్యి చేసుకోలేదు! తిట్టను కూడా తిట్టలేదు. ఏదైనా ఇష్యూ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతారు, లేకపోతే మేము మాట్లాడే వరకూ మౌనంగా ఉంటూ ఆయన మా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు అర్ధమయ్యేలా చేస్తారు.

అమ్మోయ్! హహ్హహ..  నా పెళ్లి గురించి మొదలుపెట్టి నాన్న గురించి రాసేస్తున్నాను. ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఈ పోస్ట్ కి ఇక అంతముండదు. అంచేత మళ్ళీ నా పెళ్లి మాటలోకి వచ్చేద్దాం. నా ప్రేమను ఆయన అంగీకరించడానికి నేను పడిన తిప్పలు ఎలాగూ "ప్రేమాయణం" లో చెప్తాను కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడను. 

భరత్, వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పడానికే ఏడాది టైం తీసుకున్నాడు! విషయం విన్నాక అవునో కాదో చెప్పడానికి మా మావయ్యగారు నాలుగు నెలలు టైం తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారులే.. ఆయనకు పూర్తి ఇష్టం లేకపోయినా వాళ్ళ అబ్బాయి తీసుకునే నిర్ణయాల మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. అప్పుడు మా అమ్మ దగ్గర భరత్ తో పెళ్ళి మాట ఎత్తితే అంతెత్తున ఎగిరిపడింది నా మీద! బుద్ధిమంతుడు, చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన కుటుంబం, చూడ్డానికి కూడా బావుంటాడు. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా అంటే, కులాలు వేరు, అబ్బాయి లావుగా ఉన్నాడు అని ససెమేర వద్దంది. నాన్న నో కామెంట్స్.. "ఏదైనా ముందు అమ్మతో తేల్చుకుని రా. ఆవిడ ఎలా అంటే అలా" అన్నారు. అక్క "నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు చెల్లీ" అని చేతులెత్తేసింది. 

పైగా నెల తిరిగేలోపు అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసేసింది! ఏడ్చి, గగ్గోలు పెట్టి మా అమ్మా నాన్నలను ఒప్పించేసరికి హమ్మా! ఆరు నెలలు పట్టింది (అప్పటికీ అమ్మ పూర్తిగా ఒప్పుకోలేదనుకోండీ..). మొత్తానికి 2012 జూలై నెలకి అటూ ఇటూ రెండు వైపులా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని ఈ లోపు భరత్ కి మరో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. పోస్టింగ్ కోసం నవంబర్ వరకూ ఆగాల్సి వచ్చింది. జనవరిలో నిశ్చితార్దం పెట్టుకోవాలనుకున్నారు. కాని ఏ కారణమూ లేకుండానే అది కాన్సిల్ అయి, ఆఖరికి మే 7 న జరిగింది. అది కూడా జస్ట్ నిశ్చితార్దానికి నాలుగు రోజులు ముందు మా అమ్మ ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడ్డం, అందరూ మంచి మూడ్ లోనే ఉండడంతో క్షణాల మీద అన్ని ఏర్పాట్లూ జరిగి మొత్తానికి సక్సెస్స్ అయింది! 

ఆ.. ఏం సక్సెస్స్ లెండి.. సరిగ్గా ఆ ముందు రోజు నాకు చక్కటి జ్వరం. నిశ్చితార్దానికి అరగంట ముందు వరకూ బెగ్గర్ గెటప్ లో ఓ మూల పడుకుని ఉండి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారని హడావిడి చేసేసరికి వెళ్లి తల స్నానం చేసి చీర చుట్టుకుని వచ్చాను. హహ్హహ్హ.. తలస్నానం అంటే గుర్తొచ్చిందండోయ్.. ఆ రోజు ఉదయం నుండి సాయత్రం వరకూ కరెంట్ లేదు! ఉన్న నీళ్లన్నీ, వంటలకీ, క్లీనింగ్ కి, బంధువుల స్నానాలకీ అయిపోయాయి. పాపం.. పెళ్లికూతిరినైన నేను కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు. ఆ హడావిడిలో డాడీ ఎక్కడున్నారో కూడా తెలియలేదు. మెసేజ్ చేస్తే, అప్పటికప్పుడు రెండు వాటర్ కాన్స్ (25 లీటర్స్ వి) కొనుక్కొని వచ్చారు. ఇక ఆ నీటితో స్నానం చేశాను. ఒక్కసారి ఆ పెళ్లి కుర్చీలో కూర్చున్నాక నా ఆనందం అనారోగ్యాన్ని జయించింది కనుక ఆల్ హ్యపీస్. 

కాని ఈ ప్రోగ్రాం అయిపోయాక అంతా పిన్ డ్రాప్ సైలెన్స్! మళ్ళీ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి ఇదిగో.. ఇన్ని నెలలు పట్టింది. ముందు అక్టోబర్ నెలాఖరికి అన్నారు. మా డాడీకి కుదరలేదు. నవంబర్ మొదటి వారం అనుకున్నాం.. మా మరిది గారికి ఎక్షామ్స్ ఉన్నాయని, 22న అనుకున్నాం.. మళ్ళీ మా అత్తగారికి ఆఫీస్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన మీటింగ్స్ ఉండడంతో 29 అనుకున్నారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఊరుకుంటే, "డిసెంబర్ 1న నాకు ఎక్షామ్ ఉంది" అని భరత్ అన్నాడు. ఇక నాకు తిక్కరేగింది. "పెళ్ళీ వద్దు కిళ్ళీ వద్దు పో. జనవరిలో పెట్టుకుందాం. ఈ ఏడాది నేను బిజీ" అన్నాను. అవును మరీ.. అటొచ్చి ఇటొచ్చీ కాళీగా ఉంది నేనేనేవిటీ? లేదు లేదు తొక్కలో ఎక్షామ్దేముందిలే.. 29 ఫిక్స్ అన్నారు.  హమ్మయ ఎలాగో డేట్ ఫిక్స్ అయిపోయింది అని మిగతా ఏర్పాట్లు చూసుకుంటూ,  అంతా కాస్త స్మూత్ గా  వెళుతోంది కదా అని ఊపిరి పీల్చుకోబోయేసరికి.. సమైఖ్యాంద్రా సెగ గురించి భయం పట్టుకుంది. టూ వీలర్స్ ని కూడా రోడ్ మీద తిరగనివ్వడం లేదుట.. ఏంటో.. నా పెళ్ళికి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి మరి. చూద్దాం.. ఏం జరుగుతుందో..!

13 comments:

 1. అభినందనలు ప్రియ గారు .బెంగ పడకండి మీ పెళ్లినాటికి అంతా సర్దుకోవచ్చు లెండి .

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ రాధిక గారూ. నేనూ ఆ ధైర్యంతోనే ఉన్నాను :)

   Delete
 2. Anonymous12/10/13

  అమ్మమ్మ నీకు వస బాగాపోసేసింది. భయం లేదు బాలా వివాహం బాగానే జరుగుగాక!శుభం భూయాత్!!!

  ReplyDelete
  Replies
  1. ఆశీర్వాదాలు అందుకున్నానుగా.. అయితే అంతా శుభమే.
   Thanks a lot తాతయ్య గారు :)

   Delete
 3. Anonymous12/10/13

  GOOD

  ReplyDelete
 4. Anonymous13/10/13

  Hi priyaa! Don't worry.Everything will be fine.
  Enjoy da beautiful days.
  Mari tckt reserve cheyinchukomaa....

  ReplyDelete
  Replies
  1. Thanks అను గారు. కచ్చితంగా.. :)
   అయినా భలేవారే మీరు. ఇంకా టికెట్స్ బుక్ చేయకుండా ఉంటానా?! నా గురించి తెలియదా మీకు? పోయిన వారమే చేసేసాను ;)

   Delete
 5. మరి, ప్రేమ పెళ్ళా ...మజాకా? అందరినీ ఒప్పించి ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ చివరికి కలిసి వేసే ఏడడుగుల పండగ అంతా శుభం గానే అవుగాక! నిశ్చింతగా ఉండండి. ఒక్కొకటీ అన్నీ పెళ్ళినాటికల్లా సమైక్యంగా సర్దుకుంటాయి.

  ReplyDelete
 6. పెళ్ళి పనులకు ఏ ఆటంకాలు కలుగకుండా అన్నీ సజావుగా జరిగిపోవాలని కోరుకుంటున్నానండీ. అలాగే జరుగుతుంది మీరేం టెన్షన్ పడకండి ఆల్ ద వెరీ బెస్ట్ :-)

  ReplyDelete
 7. @ పండు గారు, వేణూ గారు: అంతా శుభమే జరగాలని నా తరుపున మీరూ కోరుకుంటున్నందుకు చాలా థాంక్స్ అండీ.. :)

  ReplyDelete
 8. పోనీలెండి అవాంతరాలన్నీ జయించేసారు.