Thursday, December 12, 2013

పెళ్ళి ఫోటోలు
అసలేం గుర్తుకురాదూ నా కన్నుల ముందు నువ్వు ఉండగా...!

ఇప్పుడు ఇలా డ్యూయెట్లు పాడేసుకుంటున్నాం కానీ, అందుకు లైసెన్స్ ఎలా తీసుకున్నామో మీరు చూడరా?? "ఎందుకు చూడం? ఆత్రుతగా ఎదురుచూస్తుంటేనూ.." అంటారా? హహ్హహ! అయితే ఇంకెందుకండీ ఆలశ్యం? కిందకు స్క్రోల్ చేసేయండి మరి.  ఐదు రోజులు పసుపు వేయడంతో మొదలయింది నా పెళ్లి తంతు (మా అత్తగారింట్లో ఇలాటి పద్ధతులు ఆచరించరట కానీ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు). ప్రధానానికి ముందు రోజు "రోజంతటిలో ఏదో ఒక టైంలో అభీ గాడు పడుకుంటాడుగా అప్పుడు అక్క చేత గోరింటాకు పెట్టించుకోవాలి" అనుకున్నాను. కానీ మా వాడు కరుణించలేదు. అదేంటో.. రోజులో కనీసం నాలుగు గంటలైనా పడుకునే పిల్లాడు నిముషమైనా నిద్రపోలేదు! ఇంకెవ్వరూ పెట్టొద్దు. పెడితే అక్కే పెట్టాలని నేను మొండి పట్టు పట్టి కూర్చున్నాను. ఆఖరికి ఆ రాత్రి 11.30 వాడు పడుకున్నాక తను నిద్ర మానుకుని మరీ గోరింటాకు పెట్టింది అక్క. రైట్ హాండ్ కంప్లీట్ అయ్యేలోపే నేను నిద్రలోకి జారుకున్నాననుకోండీ.. అది వేరే విషయం. ఎంతో ఓపికతో ఆల్మోస్ట్ పెట్టేసి నిద్ర కళ్ళతో సరిగా చూసుకోక లెఫ్ట్ హాండ్ చిటికెన వేలు, బొటన వేలు పక్కన కాస్త ప్లేస్ వదిలేసిందట ఉదయం లేచాక చూసుకుని ఎంత బాధపడిందో..!

మరుసటి  రోజు పెళ్లి వారొచ్చేసరికి ఇదిగో.. ఇలా తయారయి కూర్చున్నాను. వాళ్ళేమో నాకోసం ఈ కింది వస్తువులతో పాటు ఒక మేకప్ కిట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చాలా తీసుకురావాలిట కానీ.. "అవన్నీ అవసరంలేదండీ. నామకార్దానికి ముఖ్యమైనవి మాత్రం తెచ్చి, పిల్ల మెడలో బొందు వేయండి చాలు. అసలే తుఫాను కదా" అని అమ్మ అంది.

ఇదిగో.. ఇలా ఐదుగురు ముత్తైదువులు నా మెడలో బొందు (పసుపు దారం) వేశారు. 

తరువాత వాళ్ళు నాకొక బంగారు గొలుసు బహుకరించారు. దాన్ని ఇలా మా చిన్నత్తగారు నా మెడలో వేశారు. 

ప్రధానంలో ఓ తాతయ్య నాకు కల్యాణ ఉంగరాన్ని గిఫ్ట్ చేశారు.  

ప్రధానం ఏలూరులో జరిగింది. భరత్ వాళ్ళ ఊరికి రెండు గంటల ప్రయాణం అక్కడి నుండి. పెళ్ళేమో ఉదయం పది గంటలకు. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడమంటే కష్టమని, ప్రధానం అయిన వెంటనే అందరం కలిసి బయలుదేరిపోయాం. అప్పుడు తీసిన ఫోటో ఇది.  

విడిది ఇంటి దగ్గర నుండి చర్చ్ కి బయలుదేరబోయే ముందు తీసిన ఫోటో ఇది. చీర కట్టుకోవడం దగ్గర నుండి ముడి వరకూ అన్నీ నేనే చేసుకున్నాను. పువ్వులు, వైల్ మాత్రం మా అత్తగారి తరపు ఆవిడ ఎవరో పెట్టారు. ఇహపోతే ఇలా నన్ను చూసి "మరీ ఇంత సింపుల్ గా ఉన్నావేంటీ? నగలు వేసుకో మేకప్ వేసుకో.." అదీ ఇదీ అంటూ గొడవ పెట్టారు అందరూ. నాకేమో ఎంత సింపుల్ గా ఉంటే అంత నచ్చుతుంది.. కంఫర్టబుల్గానూ ఉంటుంది. అందుకే.. నవ్వుతూ అందర్నీ మేనేజ్ చేసేసి ఆఖరికి ఇలాగే కంటిన్యూ అయిపోయాను :)

ఇది నన్ను చర్చ్ లోకి వెళుతున్నపుడు. నిజానికి అప్పుడు డాడీ నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాలిట. కానీ ఆయన వెనుక కార్ లో వస్తూ ఉన్నారు. అప్పటికే సమయం మించిపోతోందని ఇలా పిల్లలతో కలిసి వెళ్ళిపోయాం. 

నేను వెళ్ళేసరికే భరత్ అక్కడ ఉన్నాడు. నన్ను తన పక్కన కూర్చోపెట్టారు. ఆ పక్కా ఈ పక్కా పిల్లలు కూర్చున్నారు. 

ఈ  కింది ఫోటో ప్రామిస్ చేయడానికి లేస్తున్నపుడు తీసింది. వైల్ ని నా చేతికి అందిస్తున్న పాప ఉంది చూశారూ.. తన పేరు టీనా. మా రెండో మామగారి కూతురు. అంటే నా ఆడపడుచు. అమ్మోయ్..! మహా గడుగ్గాయి. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి నన్ను చూసి అందరూ "నీకెలాటి మొగుడొస్తాడో చూడాలి, పెళ్ళైయ్యాక ఎలా ఉంటావో చూడాలి" అంటే వినడమే గానీ, ఇప్పటి వరకూ నేను ఎవర్ని చూసీ అనుకోలేదు. దీన్ని కలిసాక అనిపించింది :). మా అత్తగారింట్లో ఉన్నంతసేపూ "వదినా వదినా" అంటూ చుట్టూ తిరిగింది. భలే అల్లరి పిల్ల!

మేము లేచి నిలబడ్డాక పాస్టర్ గారు అందరి వైపూ తిరిగి "ఈ పెళ్లి జరగడంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. లేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేరు" అని, "ఎవరెవరికి ఈ పెళ్లి ఇష్టమో చేతులెత్తండి" అన్నారు. అందరూ చేతులెత్తారు. అయినా ఆయన పెళ్ళి చేయనన్నారు! 

అదేంటీ అంటే.. "పెళ్ళి కూతురూ, పెళ్ళి కొడుకూ చేతులెత్తలేదు. వారికి ఇష్టం లేని వివాహం నేను చేయలేను" అన్నారు. అంచేత మేమూ చేతులెత్తాల్సి వచ్చింది. అదే ఈ కింది ఫోటో :)

ఇదిగో.. తరువాత ఇలా ఇద్దరి చేతా ప్రమాణాలు చెప్పించారు. 

"ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చూపుల్లో చూసింది? ముఖం తెరచాటున ఉంది కదా.. తెర తీసి సరిగా చూడు. ఆ అమ్మాయే అయితే తాళి కట్టేద్దువు" అన్నారు పాస్టర్ గారు. అప్పుడు భరత్ నా ముఖం మీద నుండి వైల్ ని వెనక్కి తీసి ఆ అమ్మాయినేనని కన్ఫార్మ్ చేసి తాళి కట్టాడు. అప్పుడు తీసిన ఫోటో ఇది. "ఏంటీ నువ్వొక్కదానివే ఉన్నావు.. భరత్ చేతులు తప్ప మనిషి కనబడడం లేదూ. కుళ్ళు నీకు. కట్ చేసేసావా?" అంటూ తిట్ల దండకాలు మొదలుపెట్టకండి. తనే బ్రతిమాలినా ఒప్పుకోలేదు! "మిగతా ఫోటోల్లో పెట్టావుగా చాల్లే. ఈ ఫోటోలో నేను మరీ బొద్దుగా కనిపిస్తున్నాను" అన్నాడు. నా చప్ప ముక్కు మాత్రం కనిపించడంలేదా.. దానిదేముందిలే అని బుజ్జగించబోయినా ఊరుకోలేదు :D   

హమ్మయ్యా! ఇంకేముందీ.. పెళ్లైపోయింది. తరువాత ఇలా ఇద్దరం నవ్వుతూ రిసెప్షన్ లో నిలబడ్డాం. ఆ ఫోటోలు కూడా పెట్టమంటారేమో? ఇప్పటికే పేద్ద పోస్ట్ అయిపొయింది కదా అని ఇక్కడితే ఆల్బం క్లోజ్ చేస్తున్నాను. 

మ్మ్.. ఇప్పుడు చెప్పండి. ఎలా ఉన్నాయి పెళ్ళి ఫోటోలు? వీటన్నిటిలో మీకు నచ్చిన ఫోటో ఏది? నాకయితే ఫస్ట్ పిక్ బాగా నచ్చింది :). మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా చెప్పాలి మీరు.  

29 comments:

శ్యామలీయం said...

బొమ్మలతో సహా మీ టపా చాలా బాగుంది.

నాక్కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన విషయాలు ఒకటి రెండి ఉన్నాయండి. క్రిస్టియన్ వివాహాల్లో పసుపు కుంకుమల ప్రసక్తి ఉంటుందా? తాళి కట్టటంకూడా ఉంటుందా? ఇవి హిందూ సంప్రదాయాలు అంటారు కదా?

Krishna Palakollu said...

Wow, so nice! you are right, first 3 pics are beautiful!
and they lived happily ever after....:-)

Vijay Reddy said...

You are two beautiful people,
Now teamed as a man and a wife.
Congratulations on tying the knot! Take a moment to enjoy all the special memories
that you both will remember for the rest of your lives.

Anonymous said...

u r rite...first pic..n first white saree pic are awesome...priya....mi akka nijam ga ne marhcipoyaru fingers daggara...telisipothundi pics looo..em posture...Bapu Bomma laa...

--Roopa

Green Star said...

మీ పెళ్లి ఫోటోలు చూసి ఆనందించాను. పై నుండి మూడో ఫోటో నాకు బాగా నచ్చింది. యు ఆర్ ఆసమ్.

వేణూశ్రీకాంత్ said...

ఫోటోస్ చాలా బాగున్నాయ్ ప్రియ గారు, మాకూ పెళ్ళి చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మీరన్నట్లు ఫస్ట్ పిక్ విన్నర్ అద్భుతంగా వచ్చింది :-) సెకండ్ ప్లేస్ మీరు చర్చ్ కి బయల్దేరే ముందు పిక్ ది చక్కటి ఫోజ్ లో అంతకన్నా చక్కటి నవ్వుతో భలే ఉంది. అలాగే చివరి ఫోటోల్లో మీ ఇద్దరి నవ్వులు కూడా అద్భుతం :-) మరోసారీ మీ ఇద్దరికీ శుభాసీస్సులు :-)) హావ్ ఎ వండర్ ఫుల్ టైమ్ టుగెదర్.

బాల said...

Obviously first pic......

Anonymous said...

Good pics

శోభ said...

ప్రియా..

ఫొటోల్ని చూస్తుంటే... నేరుగా మీ పెళ్లి చూసినంత సంబరంగా ఉంది. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.

విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్... గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ... :-)

అన్ని ఫొటోలూ బాగున్నాయి.. గోరింటాకు చేతులు, పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో.. :-) భలే ఎర్రగా పండిందమ్మాయ్.

గోరింటాకు ఎంత ఎర్రగా పండితే, అంత మంచి మొగుడు వస్తాడని చిన్నప్పుడు చెప్పేవాళ్లు. నీ చేతులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మీకెలా తెలుసు మా ఆయన మంచోరో కాదో అని అడగకు. మంచి అబ్బాయి కాబట్టే మా ప్రియమ్మ వలచి గెలిచింది... :)

మంచుపూలు... said...

హాయ్ ప్రియా...గూగుల్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే మీ మొగలిపూల వాసన తగిలింది...అంతే...అక్కడినుండి మీ బ్లాగ్ మొత్తం చదివేదాకా మనసు శాంతించలేదు...చెప్పొద్దూ..ఇంకా రాస్తే బాగుండేది అనిపించింది. మీ రైటింగ్స్ లో మీ ఎక్స్ ప్రెషన్స్ సూపర్...చాలా అబ్జర్వేషన్ ఉంది మీకు...ప్రతిదాన్నీ చక్కగా ఫొటోలతో సహా బధ్రపరచుకోవడం చాలా బాగుంది. కొన్నిసార్లు మీ టపాల్లో నాకు నేనే కనిపించాను...అల్లరిలో కాదండోయ్...మీరన్నట్టే ఇంటికి పెద్దదాన్ని సో ఒద్దిక కాస్త ఎక్కువే..ముఖ్యంగా మీ ప్రేమాయణం బాగుంది.మీ అక్కతో అనుబంధం చాలా బాగుంది. మీ ఆఫీస్ కబుర్లు ఇంకా బాగున్నాయి...మీ నాన్నగారు మీకు బుక్ రీడింగ్ అలవాటు చేసిన తీరు సూపర్బ్...ఇలా రాసుకుంటూ పోతే నా స్పందన మీ పోస్ట్ కంటే ఎక్కువయ్యేలా ఉంది..సో ఇక్కడితో ఆపేస్తున్నా...ఫస్ట్ టైం ఇలా బ్లాగ్ అంతా ఏకబిగిన చదవడం..అలా చదివించిన మీకు కృతజ్ఞతలు...

మంచుపూలు... said...

నేనేప్పుడూ బ్లాగ్ ల్లోకి రాలేదు..ఎప్పుడో రాద్దామని మొదలెట్టినా కుదరక పేరు మాత్రమే ఇలా మిగిలిపోయింది..ఇక పోతే గూగుల్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే మీ మొగలిపూలు తగిలాయి...దాని వాసన ఇలా లాక్కొంచింది. మొత్తం బ్లాగ్ అంతా ఏకబిగినా చదివేశాను...ఇదే మొదటిసారి ఇలా ఒక బ్లాగ్ మొత్తం చదివేయడం..నాకు చాలా నచ్చింది. మీ అబ్జర్వేషన్..మీ నాటీనెస్..దాన్ని చక్కగా రాయడం...ఫొటోలతో సహా పోస్ట్ చేయడం బాగున్నాయి...అసలు విషయం ఏంటంటే నేను చెప్పదలచుకున్నదంతా రాసి పబ్లిష్ అనగానే గూగుల్ అకౌంట్ అడిగింది...దాన్ని తెరిచేలోపు కొట్టిందంతా మాయం..సో..చదవగానే వచ్చిన మూడ్ లో కొట్టిందంతా పోయింది...మీకు రావాల్సిన కాంప్లిమెంట్స్ సగమే మిగిలాయి ఇలా...

Sravya V said...

Hey, congrats both of you !

సింపుల్ గా , comfortable గా ఉన్నాను అని చెబుతున్నారే ఆ ఫోటో సూపర్బ్ అసలు :-) మిగిలినవి కూడా బావున్నాయి ! All the best for your new phase of life :-)

MURALI said...

ఫోటోలు బావున్నాయి. పెళ్ళిసందడిగా జరిగిందని మీ మొహాల్లో నవ్వులే చెబుతున్నాయి. నో డౌట్ మొదటి ఫోటోనే విన్నర్.

Priya said...

థాంక్స్ అండీ!
మీ సందేహాలను నేను క్లియర్ చేయలేనండీ. ఎందుకంటే నేనూ అప్పుడపుడూ ఆ సందేహాలతోనే తికమకపడుతుంటాను. తాళి గురించి చెప్పాలంటే, భరత్ ముందు అస్సలు ఒప్పుకోలేదు. బ్రతిమాలి, పోట్లాడి ఒప్పించాను.

Priya said...

"they lived happily ever after" హహ్హహ! కృష్ణ గారూ.. thanks for the comment:)

Priya said...

Sure. Thank you very much for the lovely comment, Vijay gaaru :)

Priya said...

Thanks Roopa gaaru! ఆ ఫోటోని చూసి మీరు బాపు గారి బొమ్మను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొగడ్తలు అబద్దాలయినా తియ్యగా ఉంటాయంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడేగా తెలుస్తోంది :)

Priya said...

:) :) .. (మెలికలు తిరుగుతూ)

Thank you, చంద్రశేఖర్ గారు !

Priya said...

నిజానికి ఈ పోస్ట్ కి వచ్చిన కామెంట్స్ చదివి మనసారా సంతోషించి కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప నాకు మరో మాట రావడం లేదు! వేణూ గారు, బాల గారు, శర్మ తాతయ్య గారు, శోభ గారూ, శ్రావ్య గారు , మురళి గారూ.. మీ మీ అభిప్రాయాలను తెలిపినందుకూ, అభినందనలకూ, పేరు పేరునా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు :) :)

Priya said...

చాలా చాలా థాంక్స్ అండీ. మీరు చదివినందుకు కాదు. చదివిన విషయం నాతో చెప్పినందుకు! నా బ్లాగ్లో ఒక్కోరోజు 900+ పేజ్ వ్యూస్ ఉంటాయి. కాని ఎవరో కానీ కామెంట్ చేయరు. అందుకే మీ కామెంట్ నాకు చాలా స్పెషల్. అందుకే మీకు నా స్పెషల్ థాంక్స్ :) :)

అన్వేష్ said...

Obviously first photo is good :)

Congratulations Mrs. Priya...

I wish this new season in your life would bring you a great many blessings to your life. And I wish you both together have a memorable and a great moments ahead for the beautiful life going to fall in front of you.
With a Best wishes,
Anvesh.

ప్రియ గారు, ఇక నా శుభాకా౦క్షలు అటు౦చితే, శ్యామలీయ౦ గారికి వచ్చిన స౦దేహ౦....

>>>>క్రిస్టియన్ వివాహాల్లో పసుపు కుంకుమల ప్రసక్తి ఉంటుందా? తాళి కట్టటంకూడా ఉంటుందా? ఇవి హిందూ సంప్రదాయాలు అంటారు కదా? <<<<

మీ జవాబు....
>>>మీ సందేహాలను నేను క్లియర్ చేయలేనండీ. ఎందుకంటే నేనూ అప్పుడపుడూ ఆ సందేహాలతోనే తికమకపడుతుంటాను. <<<

If you don't mis-understand, I am clarifying it here...

సాదారణ౦గా, క్రైస్తవ వివాహ సా౦ప్రదాయ౦ ప్రకార౦, తాళి కట్టడ౦ అనే ఆచార౦ లేదు... క్రైస్తవ వివాహా౦ లో వధూవరుల ప్రమాణాలే(Marriage Oath) ప్రదాన౦. తాళి కట్టడ౦ హి౦దూ దేశ ఆచార౦. భారతీయులు గా ఆ ఆచారాన్ని క్రైస్తవ వివాహ౦లో భాగ౦గా ఉపయోగిస్తున్నారు.

Anonymous said...

nice:) Happy Married life priya:)

Reddy Sekhar said...

హాయ్ ప్రియ గారు, ఏదో గూగుల్ చూస్తూ అలా మీ బ్లాగ్ ఓపెన్ చెసాను... మీరు మీ పెళ్లి గురించి వర్ణించిన విధానం చాల బాగా నచ్చింది. నేను ఇంత వరకు ఎప్పుడూ ఇలా చూడలేదు. Comment పెట్టె వరకు మనసు ఆగలెదు.

Really I'm speechless.. :)

mamatha said...

Hai Priya, Congratulations loved all the pics you both look so awesome. Wishing you and Bharath a wonderful life ahead.

రాజ్ కుమార్ said...

బాగు బాగు..

ఫోటోగ్రాఫర్ ఎవరండీ? అన్ని ఫొటోలూ షేక్ వచ్చేసాయి? మొహాలు కనిపించకుండా ;))))

ప్రియ said...

పెళ్ళి ఆల్బం చాలా బాగుంది ప్రియా ...మీ ఫస్ట్ ఫొటో చాలా చాలా బాగుంది ...మీరు చొక్కా బొత్తాలు పీకుతున్నా కూడా భరత్ నవ్వుతున్నారంటే ...అబ్బబ్బాబ్బా ఏమదృష్టం .
మూడో ఫొటో చూస్తే ఇంకోటి కూడా అర్థమైంది ...(మనలో మనమాట మీదే ఫుల్లు డామినేషను ) మీకు ఎదురులేదు ...:D

కంగ్రాట్స్ ప్రియా ...

అనామిక said...

Congratulations to both you...

nagarani yerra said...

ముందుగా శుభాకాంక్షలు ప్రియా! రెండు చేతులు కలిపితే కనబడేలా ప్రేమగుర్తును మీ చేతుల్లో పూయించిన మీ అక్క గ్రేట్.ఫోటోలు బావున్నాయి. ముఖ్యంగా తెల్లచీరలో బావున్నావమ్మా! నీ మాటల్ని బట్టి ,మీరు ఇరువురి పధ్ధతుల్ని కలిపి ,పెళ్ళి చేసుకున్నట్లు అన్పిస్తుంది. ఇదేదో బాగుంది .రెండు పధ్ధతుల్లో రెండు రకాలుగా హైరానా లేకుండా.ముఖాలు సరిగా కనబడేలా ఫోటోలు పెట్టొచ్చు కదమ్మా! ఇంకా బావుండేది.

జ్యోతిర్మయి said...

Wish you happy married life

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Thursday, December 12, 2013

పెళ్ళి ఫోటోలు
అసలేం గుర్తుకురాదూ నా కన్నుల ముందు నువ్వు ఉండగా...!

ఇప్పుడు ఇలా డ్యూయెట్లు పాడేసుకుంటున్నాం కానీ, అందుకు లైసెన్స్ ఎలా తీసుకున్నామో మీరు చూడరా?? "ఎందుకు చూడం? ఆత్రుతగా ఎదురుచూస్తుంటేనూ.." అంటారా? హహ్హహ! అయితే ఇంకెందుకండీ ఆలశ్యం? కిందకు స్క్రోల్ చేసేయండి మరి.  ఐదు రోజులు పసుపు వేయడంతో మొదలయింది నా పెళ్లి తంతు (మా అత్తగారింట్లో ఇలాటి పద్ధతులు ఆచరించరట కానీ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు). ప్రధానానికి ముందు రోజు "రోజంతటిలో ఏదో ఒక టైంలో అభీ గాడు పడుకుంటాడుగా అప్పుడు అక్క చేత గోరింటాకు పెట్టించుకోవాలి" అనుకున్నాను. కానీ మా వాడు కరుణించలేదు. అదేంటో.. రోజులో కనీసం నాలుగు గంటలైనా పడుకునే పిల్లాడు నిముషమైనా నిద్రపోలేదు! ఇంకెవ్వరూ పెట్టొద్దు. పెడితే అక్కే పెట్టాలని నేను మొండి పట్టు పట్టి కూర్చున్నాను. ఆఖరికి ఆ రాత్రి 11.30 వాడు పడుకున్నాక తను నిద్ర మానుకుని మరీ గోరింటాకు పెట్టింది అక్క. రైట్ హాండ్ కంప్లీట్ అయ్యేలోపే నేను నిద్రలోకి జారుకున్నాననుకోండీ.. అది వేరే విషయం. ఎంతో ఓపికతో ఆల్మోస్ట్ పెట్టేసి నిద్ర కళ్ళతో సరిగా చూసుకోక లెఫ్ట్ హాండ్ చిటికెన వేలు, బొటన వేలు పక్కన కాస్త ప్లేస్ వదిలేసిందట ఉదయం లేచాక చూసుకుని ఎంత బాధపడిందో..!

మరుసటి  రోజు పెళ్లి వారొచ్చేసరికి ఇదిగో.. ఇలా తయారయి కూర్చున్నాను. వాళ్ళేమో నాకోసం ఈ కింది వస్తువులతో పాటు ఒక మేకప్ కిట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చాలా తీసుకురావాలిట కానీ.. "అవన్నీ అవసరంలేదండీ. నామకార్దానికి ముఖ్యమైనవి మాత్రం తెచ్చి, పిల్ల మెడలో బొందు వేయండి చాలు. అసలే తుఫాను కదా" అని అమ్మ అంది.

ఇదిగో.. ఇలా ఐదుగురు ముత్తైదువులు నా మెడలో బొందు (పసుపు దారం) వేశారు. 

తరువాత వాళ్ళు నాకొక బంగారు గొలుసు బహుకరించారు. దాన్ని ఇలా మా చిన్నత్తగారు నా మెడలో వేశారు. 

ప్రధానంలో ఓ తాతయ్య నాకు కల్యాణ ఉంగరాన్ని గిఫ్ట్ చేశారు.  

ప్రధానం ఏలూరులో జరిగింది. భరత్ వాళ్ళ ఊరికి రెండు గంటల ప్రయాణం అక్కడి నుండి. పెళ్ళేమో ఉదయం పది గంటలకు. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడమంటే కష్టమని, ప్రధానం అయిన వెంటనే అందరం కలిసి బయలుదేరిపోయాం. అప్పుడు తీసిన ఫోటో ఇది.  

విడిది ఇంటి దగ్గర నుండి చర్చ్ కి బయలుదేరబోయే ముందు తీసిన ఫోటో ఇది. చీర కట్టుకోవడం దగ్గర నుండి ముడి వరకూ అన్నీ నేనే చేసుకున్నాను. పువ్వులు, వైల్ మాత్రం మా అత్తగారి తరపు ఆవిడ ఎవరో పెట్టారు. ఇహపోతే ఇలా నన్ను చూసి "మరీ ఇంత సింపుల్ గా ఉన్నావేంటీ? నగలు వేసుకో మేకప్ వేసుకో.." అదీ ఇదీ అంటూ గొడవ పెట్టారు అందరూ. నాకేమో ఎంత సింపుల్ గా ఉంటే అంత నచ్చుతుంది.. కంఫర్టబుల్గానూ ఉంటుంది. అందుకే.. నవ్వుతూ అందర్నీ మేనేజ్ చేసేసి ఆఖరికి ఇలాగే కంటిన్యూ అయిపోయాను :)

ఇది నన్ను చర్చ్ లోకి వెళుతున్నపుడు. నిజానికి అప్పుడు డాడీ నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాలిట. కానీ ఆయన వెనుక కార్ లో వస్తూ ఉన్నారు. అప్పటికే సమయం మించిపోతోందని ఇలా పిల్లలతో కలిసి వెళ్ళిపోయాం. 

నేను వెళ్ళేసరికే భరత్ అక్కడ ఉన్నాడు. నన్ను తన పక్కన కూర్చోపెట్టారు. ఆ పక్కా ఈ పక్కా పిల్లలు కూర్చున్నారు. 

ఈ  కింది ఫోటో ప్రామిస్ చేయడానికి లేస్తున్నపుడు తీసింది. వైల్ ని నా చేతికి అందిస్తున్న పాప ఉంది చూశారూ.. తన పేరు టీనా. మా రెండో మామగారి కూతురు. అంటే నా ఆడపడుచు. అమ్మోయ్..! మహా గడుగ్గాయి. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి నన్ను చూసి అందరూ "నీకెలాటి మొగుడొస్తాడో చూడాలి, పెళ్ళైయ్యాక ఎలా ఉంటావో చూడాలి" అంటే వినడమే గానీ, ఇప్పటి వరకూ నేను ఎవర్ని చూసీ అనుకోలేదు. దీన్ని కలిసాక అనిపించింది :). మా అత్తగారింట్లో ఉన్నంతసేపూ "వదినా వదినా" అంటూ చుట్టూ తిరిగింది. భలే అల్లరి పిల్ల!

మేము లేచి నిలబడ్డాక పాస్టర్ గారు అందరి వైపూ తిరిగి "ఈ పెళ్లి జరగడంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. లేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేరు" అని, "ఎవరెవరికి ఈ పెళ్లి ఇష్టమో చేతులెత్తండి" అన్నారు. అందరూ చేతులెత్తారు. అయినా ఆయన పెళ్ళి చేయనన్నారు! 

అదేంటీ అంటే.. "పెళ్ళి కూతురూ, పెళ్ళి కొడుకూ చేతులెత్తలేదు. వారికి ఇష్టం లేని వివాహం నేను చేయలేను" అన్నారు. అంచేత మేమూ చేతులెత్తాల్సి వచ్చింది. అదే ఈ కింది ఫోటో :)

ఇదిగో.. తరువాత ఇలా ఇద్దరి చేతా ప్రమాణాలు చెప్పించారు. 

"ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చూపుల్లో చూసింది? ముఖం తెరచాటున ఉంది కదా.. తెర తీసి సరిగా చూడు. ఆ అమ్మాయే అయితే తాళి కట్టేద్దువు" అన్నారు పాస్టర్ గారు. అప్పుడు భరత్ నా ముఖం మీద నుండి వైల్ ని వెనక్కి తీసి ఆ అమ్మాయినేనని కన్ఫార్మ్ చేసి తాళి కట్టాడు. అప్పుడు తీసిన ఫోటో ఇది. "ఏంటీ నువ్వొక్కదానివే ఉన్నావు.. భరత్ చేతులు తప్ప మనిషి కనబడడం లేదూ. కుళ్ళు నీకు. కట్ చేసేసావా?" అంటూ తిట్ల దండకాలు మొదలుపెట్టకండి. తనే బ్రతిమాలినా ఒప్పుకోలేదు! "మిగతా ఫోటోల్లో పెట్టావుగా చాల్లే. ఈ ఫోటోలో నేను మరీ బొద్దుగా కనిపిస్తున్నాను" అన్నాడు. నా చప్ప ముక్కు మాత్రం కనిపించడంలేదా.. దానిదేముందిలే అని బుజ్జగించబోయినా ఊరుకోలేదు :D   

హమ్మయ్యా! ఇంకేముందీ.. పెళ్లైపోయింది. తరువాత ఇలా ఇద్దరం నవ్వుతూ రిసెప్షన్ లో నిలబడ్డాం. ఆ ఫోటోలు కూడా పెట్టమంటారేమో? ఇప్పటికే పేద్ద పోస్ట్ అయిపొయింది కదా అని ఇక్కడితే ఆల్బం క్లోజ్ చేస్తున్నాను. 

మ్మ్.. ఇప్పుడు చెప్పండి. ఎలా ఉన్నాయి పెళ్ళి ఫోటోలు? వీటన్నిటిలో మీకు నచ్చిన ఫోటో ఏది? నాకయితే ఫస్ట్ పిక్ బాగా నచ్చింది :). మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా చెప్పాలి మీరు.  

29 comments:

 1. బొమ్మలతో సహా మీ టపా చాలా బాగుంది.

  నాక్కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన విషయాలు ఒకటి రెండి ఉన్నాయండి. క్రిస్టియన్ వివాహాల్లో పసుపు కుంకుమల ప్రసక్తి ఉంటుందా? తాళి కట్టటంకూడా ఉంటుందా? ఇవి హిందూ సంప్రదాయాలు అంటారు కదా?

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ అండీ!
   మీ సందేహాలను నేను క్లియర్ చేయలేనండీ. ఎందుకంటే నేనూ అప్పుడపుడూ ఆ సందేహాలతోనే తికమకపడుతుంటాను. తాళి గురించి చెప్పాలంటే, భరత్ ముందు అస్సలు ఒప్పుకోలేదు. బ్రతిమాలి, పోట్లాడి ఒప్పించాను.

   Delete
 2. Wow, so nice! you are right, first 3 pics are beautiful!
  and they lived happily ever after....:-)

  ReplyDelete
  Replies
  1. "they lived happily ever after" హహ్హహ! కృష్ణ గారూ.. thanks for the comment:)

   Delete
 3. You are two beautiful people,
  Now teamed as a man and a wife.
  Congratulations on tying the knot! Take a moment to enjoy all the special memories
  that you both will remember for the rest of your lives.

  ReplyDelete
  Replies
  1. Sure. Thank you very much for the lovely comment, Vijay gaaru :)

   Delete
 4. Anonymous12/12/13

  u r rite...first pic..n first white saree pic are awesome...priya....mi akka nijam ga ne marhcipoyaru fingers daggara...telisipothundi pics looo..em posture...Bapu Bomma laa...

  --Roopa

  ReplyDelete
  Replies
  1. Thanks Roopa gaaru! ఆ ఫోటోని చూసి మీరు బాపు గారి బొమ్మను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొగడ్తలు అబద్దాలయినా తియ్యగా ఉంటాయంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడేగా తెలుస్తోంది :)

   Delete
 5. మీ పెళ్లి ఫోటోలు చూసి ఆనందించాను. పై నుండి మూడో ఫోటో నాకు బాగా నచ్చింది. యు ఆర్ ఆసమ్.

  ReplyDelete
  Replies
  1. :) :) .. (మెలికలు తిరుగుతూ)

   Thank you, చంద్రశేఖర్ గారు !

   Delete
 6. ఫోటోస్ చాలా బాగున్నాయ్ ప్రియ గారు, మాకూ పెళ్ళి చూసిన ఫీలింగ్ వచ్చేసింది. మీరన్నట్లు ఫస్ట్ పిక్ విన్నర్ అద్భుతంగా వచ్చింది :-) సెకండ్ ప్లేస్ మీరు చర్చ్ కి బయల్దేరే ముందు పిక్ ది చక్కటి ఫోజ్ లో అంతకన్నా చక్కటి నవ్వుతో భలే ఉంది. అలాగే చివరి ఫోటోల్లో మీ ఇద్దరి నవ్వులు కూడా అద్భుతం :-) మరోసారీ మీ ఇద్దరికీ శుభాసీస్సులు :-)) హావ్ ఎ వండర్ ఫుల్ టైమ్ టుగెదర్.

  ReplyDelete
 7. Obviously first pic......

  ReplyDelete
 8. Anonymous13/12/13

  Good pics

  ReplyDelete
 9. ప్రియా..

  ఫొటోల్ని చూస్తుంటే... నేరుగా మీ పెళ్లి చూసినంత సంబరంగా ఉంది. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.

  విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్... గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ... :-)

  అన్ని ఫొటోలూ బాగున్నాయి.. గోరింటాకు చేతులు, పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో.. :-) భలే ఎర్రగా పండిందమ్మాయ్.

  గోరింటాకు ఎంత ఎర్రగా పండితే, అంత మంచి మొగుడు వస్తాడని చిన్నప్పుడు చెప్పేవాళ్లు. నీ చేతులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మీకెలా తెలుసు మా ఆయన మంచోరో కాదో అని అడగకు. మంచి అబ్బాయి కాబట్టే మా ప్రియమ్మ వలచి గెలిచింది... :)

  ReplyDelete
 10. హాయ్ ప్రియా...గూగుల్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే మీ మొగలిపూల వాసన తగిలింది...అంతే...అక్కడినుండి మీ బ్లాగ్ మొత్తం చదివేదాకా మనసు శాంతించలేదు...చెప్పొద్దూ..ఇంకా రాస్తే బాగుండేది అనిపించింది. మీ రైటింగ్స్ లో మీ ఎక్స్ ప్రెషన్స్ సూపర్...చాలా అబ్జర్వేషన్ ఉంది మీకు...ప్రతిదాన్నీ చక్కగా ఫొటోలతో సహా బధ్రపరచుకోవడం చాలా బాగుంది. కొన్నిసార్లు మీ టపాల్లో నాకు నేనే కనిపించాను...అల్లరిలో కాదండోయ్...మీరన్నట్టే ఇంటికి పెద్దదాన్ని సో ఒద్దిక కాస్త ఎక్కువే..ముఖ్యంగా మీ ప్రేమాయణం బాగుంది.మీ అక్కతో అనుబంధం చాలా బాగుంది. మీ ఆఫీస్ కబుర్లు ఇంకా బాగున్నాయి...మీ నాన్నగారు మీకు బుక్ రీడింగ్ అలవాటు చేసిన తీరు సూపర్బ్...ఇలా రాసుకుంటూ పోతే నా స్పందన మీ పోస్ట్ కంటే ఎక్కువయ్యేలా ఉంది..సో ఇక్కడితో ఆపేస్తున్నా...ఫస్ట్ టైం ఇలా బ్లాగ్ అంతా ఏకబిగిన చదవడం..అలా చదివించిన మీకు కృతజ్ఞతలు...

  ReplyDelete
 11. నేనేప్పుడూ బ్లాగ్ ల్లోకి రాలేదు..ఎప్పుడో రాద్దామని మొదలెట్టినా కుదరక పేరు మాత్రమే ఇలా మిగిలిపోయింది..ఇక పోతే గూగుల్ లో ఏదో సెర్చ్ చేస్తుంటే మీ మొగలిపూలు తగిలాయి...దాని వాసన ఇలా లాక్కొంచింది. మొత్తం బ్లాగ్ అంతా ఏకబిగినా చదివేశాను...ఇదే మొదటిసారి ఇలా ఒక బ్లాగ్ మొత్తం చదివేయడం..నాకు చాలా నచ్చింది. మీ అబ్జర్వేషన్..మీ నాటీనెస్..దాన్ని చక్కగా రాయడం...ఫొటోలతో సహా పోస్ట్ చేయడం బాగున్నాయి...అసలు విషయం ఏంటంటే నేను చెప్పదలచుకున్నదంతా రాసి పబ్లిష్ అనగానే గూగుల్ అకౌంట్ అడిగింది...దాన్ని తెరిచేలోపు కొట్టిందంతా మాయం..సో..చదవగానే వచ్చిన మూడ్ లో కొట్టిందంతా పోయింది...మీకు రావాల్సిన కాంప్లిమెంట్స్ సగమే మిగిలాయి ఇలా...

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా థాంక్స్ అండీ. మీరు చదివినందుకు కాదు. చదివిన విషయం నాతో చెప్పినందుకు! నా బ్లాగ్లో ఒక్కోరోజు 900+ పేజ్ వ్యూస్ ఉంటాయి. కాని ఎవరో కానీ కామెంట్ చేయరు. అందుకే మీ కామెంట్ నాకు చాలా స్పెషల్. అందుకే మీకు నా స్పెషల్ థాంక్స్ :) :)

   Delete
 12. Hey, congrats both of you !

  సింపుల్ గా , comfortable గా ఉన్నాను అని చెబుతున్నారే ఆ ఫోటో సూపర్బ్ అసలు :-) మిగిలినవి కూడా బావున్నాయి ! All the best for your new phase of life :-)

  ReplyDelete
 13. ఫోటోలు బావున్నాయి. పెళ్ళిసందడిగా జరిగిందని మీ మొహాల్లో నవ్వులే చెబుతున్నాయి. నో డౌట్ మొదటి ఫోటోనే విన్నర్.

  ReplyDelete
 14. నిజానికి ఈ పోస్ట్ కి వచ్చిన కామెంట్స్ చదివి మనసారా సంతోషించి కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప నాకు మరో మాట రావడం లేదు! వేణూ గారు, బాల గారు, శర్మ తాతయ్య గారు, శోభ గారూ, శ్రావ్య గారు , మురళి గారూ.. మీ మీ అభిప్రాయాలను తెలిపినందుకూ, అభినందనలకూ, పేరు పేరునా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు :) :)

  ReplyDelete
 15. Obviously first photo is good :)

  Congratulations Mrs. Priya...

  I wish this new season in your life would bring you a great many blessings to your life. And I wish you both together have a memorable and a great moments ahead for the beautiful life going to fall in front of you.
  With a Best wishes,
  Anvesh.

  ప్రియ గారు, ఇక నా శుభాకా౦క్షలు అటు౦చితే, శ్యామలీయ౦ గారికి వచ్చిన స౦దేహ౦....

  >>>>క్రిస్టియన్ వివాహాల్లో పసుపు కుంకుమల ప్రసక్తి ఉంటుందా? తాళి కట్టటంకూడా ఉంటుందా? ఇవి హిందూ సంప్రదాయాలు అంటారు కదా? <<<<

  మీ జవాబు....
  >>>మీ సందేహాలను నేను క్లియర్ చేయలేనండీ. ఎందుకంటే నేనూ అప్పుడపుడూ ఆ సందేహాలతోనే తికమకపడుతుంటాను. <<<

  If you don't mis-understand, I am clarifying it here...

  సాదారణ౦గా, క్రైస్తవ వివాహ సా౦ప్రదాయ౦ ప్రకార౦, తాళి కట్టడ౦ అనే ఆచార౦ లేదు... క్రైస్తవ వివాహా౦ లో వధూవరుల ప్రమాణాలే(Marriage Oath) ప్రదాన౦. తాళి కట్టడ౦ హి౦దూ దేశ ఆచార౦. భారతీయులు గా ఆ ఆచారాన్ని క్రైస్తవ వివాహ౦లో భాగ౦గా ఉపయోగిస్తున్నారు.

  ReplyDelete
 16. Anonymous16/12/13

  nice:) Happy Married life priya:)

  ReplyDelete
 17. హాయ్ ప్రియ గారు, ఏదో గూగుల్ చూస్తూ అలా మీ బ్లాగ్ ఓపెన్ చెసాను... మీరు మీ పెళ్లి గురించి వర్ణించిన విధానం చాల బాగా నచ్చింది. నేను ఇంత వరకు ఎప్పుడూ ఇలా చూడలేదు. Comment పెట్టె వరకు మనసు ఆగలెదు.

  Really I'm speechless.. :)

  ReplyDelete
 18. Hai Priya, Congratulations loved all the pics you both look so awesome. Wishing you and Bharath a wonderful life ahead.

  ReplyDelete
 19. బాగు బాగు..

  ఫోటోగ్రాఫర్ ఎవరండీ? అన్ని ఫొటోలూ షేక్ వచ్చేసాయి? మొహాలు కనిపించకుండా ;))))

  ReplyDelete
 20. పెళ్ళి ఆల్బం చాలా బాగుంది ప్రియా ...మీ ఫస్ట్ ఫొటో చాలా చాలా బాగుంది ...మీరు చొక్కా బొత్తాలు పీకుతున్నా కూడా భరత్ నవ్వుతున్నారంటే ...అబ్బబ్బాబ్బా ఏమదృష్టం .
  మూడో ఫొటో చూస్తే ఇంకోటి కూడా అర్థమైంది ...(మనలో మనమాట మీదే ఫుల్లు డామినేషను ) మీకు ఎదురులేదు ...:D

  కంగ్రాట్స్ ప్రియా ...

  ReplyDelete
 21. Congratulations to both you...

  ReplyDelete
 22. ముందుగా శుభాకాంక్షలు ప్రియా! రెండు చేతులు కలిపితే కనబడేలా ప్రేమగుర్తును మీ చేతుల్లో పూయించిన మీ అక్క గ్రేట్.ఫోటోలు బావున్నాయి. ముఖ్యంగా తెల్లచీరలో బావున్నావమ్మా! నీ మాటల్ని బట్టి ,మీరు ఇరువురి పధ్ధతుల్ని కలిపి ,పెళ్ళి చేసుకున్నట్లు అన్పిస్తుంది. ఇదేదో బాగుంది .రెండు పధ్ధతుల్లో రెండు రకాలుగా హైరానా లేకుండా.ముఖాలు సరిగా కనబడేలా ఫోటోలు పెట్టొచ్చు కదమ్మా! ఇంకా బావుండేది.

  ReplyDelete

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)