Monday, December 9, 2013

శ్రీవారి పుట్టినరోజు

మొన్న (డిసెంబర్ 7) శనివారం  తన పుట్టినరోజు. మావయ్య గారు బిజీగా ఉండి రాలేకపోవడంతో అత్తయ్యగారూ, మరిది మాత్రం శుక్రవారం ఉదయమే ఇక్కడికి వచ్చారు. ఇంట్లో నాన్ వెజ్ వండితే నేనేమనుకుంటానో అనుకున్నారట, వచ్చేడపుడే చేపల కూర వండి తీసుకొచ్చుకున్నారు. ఆ ఉదయం దోశలు వేశాను. కూరగాయలు, వగైరాల కోసం బయటకు వెళ్ళడంతో భరత్ కోసం ఏమీ వండే టైం లేక పెరుగన్నం పెట్టేసాను లంచ్ బాక్స్ లో. భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక అత్తయ్యగారికి స్నానానికి వేన్నీళ్ళు పెట్టి ఇంటి పనిలో పడ్డాను. ఒంటిగంటకో ఎప్పుడో భోజనానికి కూర్చున్నాం. వాళ్ళు చేపల కూరా, నేను పెరుగన్నం. తరువాత మా మరిది గారు ఇంటర్నెట్ తో, నేనూ అత్తయ్యా కబుర్లతో బిజీ బిజీ. 

చెప్పలేదు కదూ.. పెళ్లైయ్యాక గీతక్క వాళ్ళ పక్కింట్లోకే వచ్చాం. ఇంకొక విషయం ఏవిటంటే నా అక్టివా హోండా ఇక పనిచేయట్లేదు. దాన్ని బాగుచేయలేమని చేతులెత్తేశారు కంపెనీ వాళ్ళు. ఆ వేళ గీతక్క బండిని అడిగి, మరిదిగారిని వెంటపెట్టుకుని కేకు షాప్ కి వెళ్లాను. చక్కని ఫ్రూట్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఆరింటికి తయారవుతుంది అప్పుడు రండి అన్నాడు షాప్ వాడు. సర్లెమ్మని పక్కనే ఉన్న Archies కి వెళ్లి ముగ్గురం ఇవ్వగలిగేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చేశాం (నేను పెళ్ళికి ముందే తన పుట్టిన రోజు కోసమని కార్డ్, గిఫ్ట్ కొనేశానులెండి). 

బాగా ముసురుపట్టి ఉండడంతో 5.30 కే చాలా చీకటిగా అయిపోయింది. ఆ రోజే కాదు.. వాళ్ళున్న మూడు రోజులూ అలాగే మిట్టమధ్యాహ్నం కూడా రగ్గులు కప్పుకునేంత చలితో, అప్పుడపుడు  చినుకులు పడుతూ ఉంది. సర్లెండి.. సరిగ్గా ఆరింటికి వెళితే ఎక్కడ వెయిట్ చేయిస్తాడోనని.. ఎలాగు దగ్గరే కదా నడుస్తూ వెళితే పావుగంట పడుతుంది అనుకుంటూ మళ్ళీ నేనూ మా మరిదిగారూ బయలుదేరాం. జాగ్రత్తగా చదవండి. ఇది నా మార్కు ఇన్సిడెంటు. కాకపోతే మరిదిగారి ముందు జరగడం బాధాకరం. హూం.. ఏవైందంటే మా ఇంటి పక్క సందు మలుపు తిరిగాక రోడ్ నిండుగా నీళ్ళున్నాయి. దాంతో ఫుట్ పాత్ ఎక్కాం. కాస్త ముందుకి వెళ్ళాక అడ్డంగా ఓ కుక్క పడుకుని ఉంది. దాన్ని దాటడానికి భయపడి, "చై" అన్నాను. అది "భౌ" అంది. నేను కెవ్వుమంటూ రోడ్ మీదకు దూకాను (బోర్లా పడ్డాను). కట్ చేస్తే.. అరచేతులు కొట్టుకుపోయి రక్తం కారుతూ, బలంగా రాళ్ళ మీద పడడంతో ఒళ్ళు నొప్పులు. పడిపోతే కనీసం లేపకుండా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ తో నిలబడి, కష్టపడి నేను లేచాక "దెబ్బలు తగిలాయా వదినా?" అని మరిది అడిగేసరికి అసలు బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోయింది. కుంటితే బావోదని బింకం ప్రదర్శిస్తూ ఎలాగో కేక్ తీసుకుని ఇంటి వరకూ వచ్చాను. తీరా చూస్తే భరత్ బండి కనిపించింది. వీళ్ళున్నారని తను కాస్త త్వరగా వచ్చాడో లేక నా దెబ్బల కార్యక్రమం వల్ల లేట్ గా వచ్చానో తెలియదు (టైం చూసుకోలేదు). 

ఏ మాత్రం సౌండ్ చేయకుండా పైకి వెళ్లి కేక్ ని డాబా మీద పెట్టి, "ఇప్పుడు మీ అన్నయ్య ను బయటకు తీసుకువెళతాను.. ఆ గాప్ లో కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టు లేకపోతే ఫ్రెష్ క్రీం కదా పాడయిపోతుంది" అని మరిదికి హితబోధ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే మా అత్తగారు "ఏమ్మాయ్ కేక్ ఏదీ?" అన్నారు భరత్ ముందు. నాకు నీరసం వచ్చేసింది. నేనెంతో కష్టపడి సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఇలా తన ముందే అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు. ఇంతలో ఏదో పట్టుకోమంటూ భరత్ గబుక్కున చేతులు పట్టుకున్నాడు. అబ్బహ్! ప్రాణం విలవిల్లాడిపోయింది. మొత్తానికి ఏం జరిగిందో చెప్పాల్సి వచ్చి చెప్పాను. "దారిపోయేదానివి తిన్నగా వెళ్లక కుక్కలతో నీకెందుకే?" అంటూ భరత్ తిట్లు, "అసలు అలా ఎలా చేశావమ్మాయ్?" అంటూ అత్తగారు కడుపుబ్బేలా నవ్వు! హూం.. కాసేపటికి మళ్ళీ కేక్ గురించి అడిగారు. "ఇంకేం కేకు? దెబ్బలకు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా కేక్ ముందు రోజే ఆర్డర్ ఇవ్వాలిట. ఈ నొప్పి భరించలేక తిరిగివచ్చేసాం" అన్నాను. ఇంకా నయం మా మరిదిగారు భరత్ కన్నా చక్కగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కనుక సరిపోయింది. 

తరువాత నాకు బాండ్ ఎయిడ్ కావాలి అదీ ఇదీ అని చెప్పి భరత్ ని బయటకు లాక్కెళ్ళాను. ఇంటికొచ్చేసరికి అంతా గప్చిప్ గా ఉంది. ముందుగా నేను ప్లాన్ చేసిన దాని ప్రకారం నాకు నిద్రోస్తోందంటే నాకు నిద్రోస్తోందని మా ముగ్గురం ముసుగు తన్నేసాం. బాగానే అలసిపోయినట్లున్నాడు.. భరత్ కూడా త్వరగానే పడుకున్నాడు. వీళ్ళని పడుకున్నట్లు నటించి, తను పడుకున్నాక నాకు సాయం చేయమంటే.. నిజంగానే గుర్రు పెట్టేసారు. వేరే దారిలేక నేనే 10.30 నుండి రెండు పాకెట్ల బుడగలు ఊది, టార్చ్ వెలుగులో ఫ్రాగ్రెంట్ కాండిల్స్ అన్ని "I లవ్ సింబల్ U" అని రాసి మిగతా కాండిల్స్ ని ఆకాశంలో చుక్కల్లాగా హాల్ అంతా పరిచి వెలిగించాను. ఇక కేక్ తీద్దామని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతూ ఒక బుడగ మీద కాలు వేసేసరికి అది టప్ మంది. ఆ సౌండ్ కి అందరూ లేచారు. అప్పటికి ఇంకా 11.45. అయినా వేరే ఆప్షన్ లేక.. "Happy Birthday అనూ!" అన్నాను సంబరంగా. 

భరత్ త్రిల్ అయిపోతూ థాంక్స్ అనలేదు సరికదా.. కనీసం రూం అంతా నిండుకున్న ఆ బుడగల్ని, కొవ్వొత్తుల వెలుగుల్ని.. నా కళ్ళలో కాంతినీ ఏమాత్రం గమనించకుండా "అర్ధరాత్రిలో ఏంటే..? నిద్దరొస్తోంది.." అంటూ దుప్పటిని మొహం మీదకు లాక్కున్నాడు. ముందు కోపమొచ్చింది.. "దెబ్బ తగిలిన ఈ చేతులతో కష్టంగా ఉన్నా, ప్రాణమంతా గాలిగా చేసి అన్ని బుడగలు ఊది.. కుంటుకుంటూ అన్ని దీపాలు వెలిగించి.. ఎంత ఇష్టపడి చేశాను? ఏంటి ఈ మనిషి" అనిపించింది. ఆ ఉక్రోషంతోనే లేస్తావా లేదా అంటూ దుప్పటి లాగి పడేసాను. ఇక తప్పదన్నట్లు లేచి కూర్చున్నాడు. మిగిలిన గదుల్లోంచి అత్తయ్యా, మరిదిగారూ కూడా వచ్చారు. అక్కడి నుండి అంతా హుషారుగానే జరిగిందిలెండి. నాలుగు గ్రీటింగ్ కార్డ్స్, తనకోసం కొన్న గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చెప్పి కేక్ కట్ చేయించాం. నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రతి చిన్న దాన్ని ఫోటో తీసి బద్రపరచుకునే నేను ఆ రాత్రి ఫోటో తీయలేకపోయాను. ముందు తోచలేదు... గుర్తొచ్చేసరికి అంతా అయిపోయి నిద్రకు ఉపక్రమించేశాం! ఇవండీ... పెళ్లి తరువాత జరుపుకున్న మావారి మొదటి పుట్టినరోజు విశేషాలు. రేపు (10 డిసెంబర్) అభీ గాడి 1st birthday. Please bless him. 

15 comments:

Anonymous said...

bavundi andi mi Experience....meeku surprises ivvadam ante entha estamoo kada...Belated happy birth day to Anu garu...

--Roopa

Krishna Palakollu said...

:-)
sweet!!! and sorry that you are injured!

శ్యామలీయం said...

అవునండీ. మీరింత కష్టపడి మీ‌ శ్రీవారి జన్మదినోత్సవం బ్రహ్మాండంగా నిర్వహిస్తే చదివేసి మెచ్చుకోకుండా ఎలా పేజీ తిప్పెయ్యటం? మీకు బోలెడు అభినందనలు, మీ అభికి శుభాశీస్సులు.

నా పుట్టినరోజును కూడా ఎవరైనా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది!

Anonymous said...

Wow Naade First cmt aa...!!!!!!!!!!!! :D

_-Roopa

రాజ్ కుమార్ said...

కుక్క భౌ అన్నప్పుదూ, మీరు బోర్లా పడినప్పుడూ, తీసిన ఫోటోలేవండీ? ;)

భరత్ గారికి పుట్టిన్రోజు మేల్తలపులు.

Priya said...

అవును రూప గారూ.. మీదే ఫస్ట్ కామెంట్! Thank you so much for that.

మీ విషెస్ ని భద్రంగా భరత్ కి అందజేసాను. తను చాలా సంతోషపడ్డాడు. నిజమేనండీ.. నాకు సర్ప్రైసెస్ ఇవ్వడమంటే చాలా ఇష్టం. ఆ క్షణంలో ఆ వ్యక్తి కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం.. పెదవులపై చిరునవ్వూ చూస్తే ఎంత సంబరంగా ఉంటుందో నాకు!

చెప్పడం మర్చిపోయాను.. ఇంత లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు ఏమీ అనుకోకండేం.

Priya said...

అయ్యో! What a big deal అండీ. నా టైం బాడ్ అయిపోతే మీరేం చేస్తారు? :)

Thanks for the comment.

Priya said...

అభినందనలకు, ఆశిస్సులకూ హృదయపూర్వక కృతజ్ఞతలండీ :)

మీ పుట్టినరోజెప్పుడో చెప్పండి. నేను గుర్తుంచుకుని విషెస్ చెబుతాను :)

Priya said...

గుర్ర్.... అసలే మరిదిగారి ముందు బోర్లాపడ్డ బాధలో నేనుంటే, నన్ను ఒదార్చకపోగా మిత్రులై ఉండి ఇలా ఆటపట్టించడం భావ్యమా??

విషెస్ కి భరత్ మీకు థాంక్స్ చెప్పానని చెప్పమన్నాడు రాజ్ గారు :)

శ్యామలీయం said...

హమ్మయ్య. ఇన్నాళ్ళకు ఒక్కరైనా ఈ‌ మాట అడిగారు. చాలా సంతోషం. తారీఖుల్లెక్క ప్రకారం మే 6న వస్తుందండి.

వేణూశ్రీకాంత్ said...

హహహహ సో స్వీట్.. బాగుందండీ మీరు సెలబ్రేషన్ దానికోసం పడిన పాట్లు :-)) కాస్త ఆలశ్యంగా భరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ అభికి శుభాశీస్సులు :-) అన్నట్లు ఇంతకూ దెబ్బలు తగ్గాయాండీ.. :)

బాల said...

"చై" అన్నాను. అది "భౌ" అంది. నేను కెవ్వుమంటూ రోడ్ మీదకు దూకాను......
ఇది కెవ్వు కేక :-P
భారత్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు....

బాల said...

"అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు.... " అని
బోర్లాపడినందుకు కాదు, మరిదిగారి ముందు బోర్లాపడినందుకు feel అవుతున్నారా???
(just kidding)

శోభ said...

hmmm......ఈ పోస్ట్ చూడటం ఆలస్యం.. కామెంటూ ఆలస్యం... సారీ రా... ఆ మధ్య మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మన పరిచయానికి సంవత్సరం అయ్యిందన్నావు... సంబరపడిపోయాను... కానీ తరువాత ఆ విషయం గుర్తులేదు.. ఈ పోస్ట్ చూస్తుంటే మళ్లీ గుర్తొచ్చింది..

భరత్ కి జన్మదిన శుభాకాంక్షలు.. మీ ఇద్దరూ కలకాలం చల్లగా ఉండాలి..

అభీ విషయం కూడా సరిగా గుర్తులేదు.. ఆ విషయం ఈ పోస్ట్ ద్వారానే...

అభీకి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాబుద్ధుల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ... భరత్‌కి, అభీకి హ్యాపీ హ్యీపీ బర్త్ డే.. :)

Green Star said...

అయ్యో ... అలా అయ్యిందా.

అయినా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, నేను ఈ పోస్టు చదివే సరికి మీ గాయాలు, ఆ గుర్తులు కూడా మానిపోయి ఉంటాయి. Thanks for sharing your wonderful moments. ఫోటో లేకపోతెనేం, ఆ రోజు మీకు నచ్చిన సన్నివేశంను గుర్తు చేసుకొని, బొమ్మ గీసి దాచిపెట్టుకోండి, ఆ బొమ్మ ఎలా వచ్చిననూ .....అదో రకం గుర్తు.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Monday, December 9, 2013

శ్రీవారి పుట్టినరోజు

మొన్న (డిసెంబర్ 7) శనివారం  తన పుట్టినరోజు. మావయ్య గారు బిజీగా ఉండి రాలేకపోవడంతో అత్తయ్యగారూ, మరిది మాత్రం శుక్రవారం ఉదయమే ఇక్కడికి వచ్చారు. ఇంట్లో నాన్ వెజ్ వండితే నేనేమనుకుంటానో అనుకున్నారట, వచ్చేడపుడే చేపల కూర వండి తీసుకొచ్చుకున్నారు. ఆ ఉదయం దోశలు వేశాను. కూరగాయలు, వగైరాల కోసం బయటకు వెళ్ళడంతో భరత్ కోసం ఏమీ వండే టైం లేక పెరుగన్నం పెట్టేసాను లంచ్ బాక్స్ లో. భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక అత్తయ్యగారికి స్నానానికి వేన్నీళ్ళు పెట్టి ఇంటి పనిలో పడ్డాను. ఒంటిగంటకో ఎప్పుడో భోజనానికి కూర్చున్నాం. వాళ్ళు చేపల కూరా, నేను పెరుగన్నం. తరువాత మా మరిది గారు ఇంటర్నెట్ తో, నేనూ అత్తయ్యా కబుర్లతో బిజీ బిజీ. 

చెప్పలేదు కదూ.. పెళ్లైయ్యాక గీతక్క వాళ్ళ పక్కింట్లోకే వచ్చాం. ఇంకొక విషయం ఏవిటంటే నా అక్టివా హోండా ఇక పనిచేయట్లేదు. దాన్ని బాగుచేయలేమని చేతులెత్తేశారు కంపెనీ వాళ్ళు. ఆ వేళ గీతక్క బండిని అడిగి, మరిదిగారిని వెంటపెట్టుకుని కేకు షాప్ కి వెళ్లాను. చక్కని ఫ్రూట్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఆరింటికి తయారవుతుంది అప్పుడు రండి అన్నాడు షాప్ వాడు. సర్లెమ్మని పక్కనే ఉన్న Archies కి వెళ్లి ముగ్గురం ఇవ్వగలిగేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చేశాం (నేను పెళ్ళికి ముందే తన పుట్టిన రోజు కోసమని కార్డ్, గిఫ్ట్ కొనేశానులెండి). 

బాగా ముసురుపట్టి ఉండడంతో 5.30 కే చాలా చీకటిగా అయిపోయింది. ఆ రోజే కాదు.. వాళ్ళున్న మూడు రోజులూ అలాగే మిట్టమధ్యాహ్నం కూడా రగ్గులు కప్పుకునేంత చలితో, అప్పుడపుడు  చినుకులు పడుతూ ఉంది. సర్లెండి.. సరిగ్గా ఆరింటికి వెళితే ఎక్కడ వెయిట్ చేయిస్తాడోనని.. ఎలాగు దగ్గరే కదా నడుస్తూ వెళితే పావుగంట పడుతుంది అనుకుంటూ మళ్ళీ నేనూ మా మరిదిగారూ బయలుదేరాం. జాగ్రత్తగా చదవండి. ఇది నా మార్కు ఇన్సిడెంటు. కాకపోతే మరిదిగారి ముందు జరగడం బాధాకరం. హూం.. ఏవైందంటే మా ఇంటి పక్క సందు మలుపు తిరిగాక రోడ్ నిండుగా నీళ్ళున్నాయి. దాంతో ఫుట్ పాత్ ఎక్కాం. కాస్త ముందుకి వెళ్ళాక అడ్డంగా ఓ కుక్క పడుకుని ఉంది. దాన్ని దాటడానికి భయపడి, "చై" అన్నాను. అది "భౌ" అంది. నేను కెవ్వుమంటూ రోడ్ మీదకు దూకాను (బోర్లా పడ్డాను). కట్ చేస్తే.. అరచేతులు కొట్టుకుపోయి రక్తం కారుతూ, బలంగా రాళ్ళ మీద పడడంతో ఒళ్ళు నొప్పులు. పడిపోతే కనీసం లేపకుండా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ తో నిలబడి, కష్టపడి నేను లేచాక "దెబ్బలు తగిలాయా వదినా?" అని మరిది అడిగేసరికి అసలు బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోయింది. కుంటితే బావోదని బింకం ప్రదర్శిస్తూ ఎలాగో కేక్ తీసుకుని ఇంటి వరకూ వచ్చాను. తీరా చూస్తే భరత్ బండి కనిపించింది. వీళ్ళున్నారని తను కాస్త త్వరగా వచ్చాడో లేక నా దెబ్బల కార్యక్రమం వల్ల లేట్ గా వచ్చానో తెలియదు (టైం చూసుకోలేదు). 

ఏ మాత్రం సౌండ్ చేయకుండా పైకి వెళ్లి కేక్ ని డాబా మీద పెట్టి, "ఇప్పుడు మీ అన్నయ్య ను బయటకు తీసుకువెళతాను.. ఆ గాప్ లో కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టు లేకపోతే ఫ్రెష్ క్రీం కదా పాడయిపోతుంది" అని మరిదికి హితబోధ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే మా అత్తగారు "ఏమ్మాయ్ కేక్ ఏదీ?" అన్నారు భరత్ ముందు. నాకు నీరసం వచ్చేసింది. నేనెంతో కష్టపడి సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఇలా తన ముందే అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు. ఇంతలో ఏదో పట్టుకోమంటూ భరత్ గబుక్కున చేతులు పట్టుకున్నాడు. అబ్బహ్! ప్రాణం విలవిల్లాడిపోయింది. మొత్తానికి ఏం జరిగిందో చెప్పాల్సి వచ్చి చెప్పాను. "దారిపోయేదానివి తిన్నగా వెళ్లక కుక్కలతో నీకెందుకే?" అంటూ భరత్ తిట్లు, "అసలు అలా ఎలా చేశావమ్మాయ్?" అంటూ అత్తగారు కడుపుబ్బేలా నవ్వు! హూం.. కాసేపటికి మళ్ళీ కేక్ గురించి అడిగారు. "ఇంకేం కేకు? దెబ్బలకు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా కేక్ ముందు రోజే ఆర్డర్ ఇవ్వాలిట. ఈ నొప్పి భరించలేక తిరిగివచ్చేసాం" అన్నాను. ఇంకా నయం మా మరిదిగారు భరత్ కన్నా చక్కగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కనుక సరిపోయింది. 

తరువాత నాకు బాండ్ ఎయిడ్ కావాలి అదీ ఇదీ అని చెప్పి భరత్ ని బయటకు లాక్కెళ్ళాను. ఇంటికొచ్చేసరికి అంతా గప్చిప్ గా ఉంది. ముందుగా నేను ప్లాన్ చేసిన దాని ప్రకారం నాకు నిద్రోస్తోందంటే నాకు నిద్రోస్తోందని మా ముగ్గురం ముసుగు తన్నేసాం. బాగానే అలసిపోయినట్లున్నాడు.. భరత్ కూడా త్వరగానే పడుకున్నాడు. వీళ్ళని పడుకున్నట్లు నటించి, తను పడుకున్నాక నాకు సాయం చేయమంటే.. నిజంగానే గుర్రు పెట్టేసారు. వేరే దారిలేక నేనే 10.30 నుండి రెండు పాకెట్ల బుడగలు ఊది, టార్చ్ వెలుగులో ఫ్రాగ్రెంట్ కాండిల్స్ అన్ని "I లవ్ సింబల్ U" అని రాసి మిగతా కాండిల్స్ ని ఆకాశంలో చుక్కల్లాగా హాల్ అంతా పరిచి వెలిగించాను. ఇక కేక్ తీద్దామని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతూ ఒక బుడగ మీద కాలు వేసేసరికి అది టప్ మంది. ఆ సౌండ్ కి అందరూ లేచారు. అప్పటికి ఇంకా 11.45. అయినా వేరే ఆప్షన్ లేక.. "Happy Birthday అనూ!" అన్నాను సంబరంగా. 

భరత్ త్రిల్ అయిపోతూ థాంక్స్ అనలేదు సరికదా.. కనీసం రూం అంతా నిండుకున్న ఆ బుడగల్ని, కొవ్వొత్తుల వెలుగుల్ని.. నా కళ్ళలో కాంతినీ ఏమాత్రం గమనించకుండా "అర్ధరాత్రిలో ఏంటే..? నిద్దరొస్తోంది.." అంటూ దుప్పటిని మొహం మీదకు లాక్కున్నాడు. ముందు కోపమొచ్చింది.. "దెబ్బ తగిలిన ఈ చేతులతో కష్టంగా ఉన్నా, ప్రాణమంతా గాలిగా చేసి అన్ని బుడగలు ఊది.. కుంటుకుంటూ అన్ని దీపాలు వెలిగించి.. ఎంత ఇష్టపడి చేశాను? ఏంటి ఈ మనిషి" అనిపించింది. ఆ ఉక్రోషంతోనే లేస్తావా లేదా అంటూ దుప్పటి లాగి పడేసాను. ఇక తప్పదన్నట్లు లేచి కూర్చున్నాడు. మిగిలిన గదుల్లోంచి అత్తయ్యా, మరిదిగారూ కూడా వచ్చారు. అక్కడి నుండి అంతా హుషారుగానే జరిగిందిలెండి. నాలుగు గ్రీటింగ్ కార్డ్స్, తనకోసం కొన్న గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చెప్పి కేక్ కట్ చేయించాం. నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రతి చిన్న దాన్ని ఫోటో తీసి బద్రపరచుకునే నేను ఆ రాత్రి ఫోటో తీయలేకపోయాను. ముందు తోచలేదు... గుర్తొచ్చేసరికి అంతా అయిపోయి నిద్రకు ఉపక్రమించేశాం! ఇవండీ... పెళ్లి తరువాత జరుపుకున్న మావారి మొదటి పుట్టినరోజు విశేషాలు. రేపు (10 డిసెంబర్) అభీ గాడి 1st birthday. Please bless him. 

15 comments:

 1. Anonymous9/12/13

  bavundi andi mi Experience....meeku surprises ivvadam ante entha estamoo kada...Belated happy birth day to Anu garu...

  --Roopa

  ReplyDelete
  Replies
  1. Anonymous10/12/13

   Wow Naade First cmt aa...!!!!!!!!!!!! :D

   _-Roopa

   Delete
  2. అవును రూప గారూ.. మీదే ఫస్ట్ కామెంట్! Thank you so much for that.

   మీ విషెస్ ని భద్రంగా భరత్ కి అందజేసాను. తను చాలా సంతోషపడ్డాడు. నిజమేనండీ.. నాకు సర్ప్రైసెస్ ఇవ్వడమంటే చాలా ఇష్టం. ఆ క్షణంలో ఆ వ్యక్తి కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం.. పెదవులపై చిరునవ్వూ చూస్తే ఎంత సంబరంగా ఉంటుందో నాకు!

   చెప్పడం మర్చిపోయాను.. ఇంత లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు ఏమీ అనుకోకండేం.

   Delete
 2. :-)
  sweet!!! and sorry that you are injured!

  ReplyDelete
  Replies
  1. అయ్యో! What a big deal అండీ. నా టైం బాడ్ అయిపోతే మీరేం చేస్తారు? :)

   Thanks for the comment.

   Delete
 3. అవునండీ. మీరింత కష్టపడి మీ‌ శ్రీవారి జన్మదినోత్సవం బ్రహ్మాండంగా నిర్వహిస్తే చదివేసి మెచ్చుకోకుండా ఎలా పేజీ తిప్పెయ్యటం? మీకు బోలెడు అభినందనలు, మీ అభికి శుభాశీస్సులు.

  నా పుట్టినరోజును కూడా ఎవరైనా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది!

  ReplyDelete
  Replies
  1. అభినందనలకు, ఆశిస్సులకూ హృదయపూర్వక కృతజ్ఞతలండీ :)

   మీ పుట్టినరోజెప్పుడో చెప్పండి. నేను గుర్తుంచుకుని విషెస్ చెబుతాను :)

   Delete
  2. హమ్మయ్య. ఇన్నాళ్ళకు ఒక్కరైనా ఈ‌ మాట అడిగారు. చాలా సంతోషం. తారీఖుల్లెక్క ప్రకారం మే 6న వస్తుందండి.

   Delete
 4. కుక్క భౌ అన్నప్పుదూ, మీరు బోర్లా పడినప్పుడూ, తీసిన ఫోటోలేవండీ? ;)

  భరత్ గారికి పుట్టిన్రోజు మేల్తలపులు.

  ReplyDelete
  Replies
  1. గుర్ర్.... అసలే మరిదిగారి ముందు బోర్లాపడ్డ బాధలో నేనుంటే, నన్ను ఒదార్చకపోగా మిత్రులై ఉండి ఇలా ఆటపట్టించడం భావ్యమా??

   విషెస్ కి భరత్ మీకు థాంక్స్ చెప్పానని చెప్పమన్నాడు రాజ్ గారు :)

   Delete
  2. "అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు.... " అని
   బోర్లాపడినందుకు కాదు, మరిదిగారి ముందు బోర్లాపడినందుకు feel అవుతున్నారా???
   (just kidding)

   Delete
 5. హహహహ సో స్వీట్.. బాగుందండీ మీరు సెలబ్రేషన్ దానికోసం పడిన పాట్లు :-)) కాస్త ఆలశ్యంగా భరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ అభికి శుభాశీస్సులు :-) అన్నట్లు ఇంతకూ దెబ్బలు తగ్గాయాండీ.. :)

  ReplyDelete
 6. "చై" అన్నాను. అది "భౌ" అంది. నేను కెవ్వుమంటూ రోడ్ మీదకు దూకాను......
  ఇది కెవ్వు కేక :-P
  భారత్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు....

  ReplyDelete
 7. hmmm......ఈ పోస్ట్ చూడటం ఆలస్యం.. కామెంటూ ఆలస్యం... సారీ రా... ఆ మధ్య మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మన పరిచయానికి సంవత్సరం అయ్యిందన్నావు... సంబరపడిపోయాను... కానీ తరువాత ఆ విషయం గుర్తులేదు.. ఈ పోస్ట్ చూస్తుంటే మళ్లీ గుర్తొచ్చింది..

  భరత్ కి జన్మదిన శుభాకాంక్షలు.. మీ ఇద్దరూ కలకాలం చల్లగా ఉండాలి..

  అభీ విషయం కూడా సరిగా గుర్తులేదు.. ఆ విషయం ఈ పోస్ట్ ద్వారానే...

  అభీకి ప్రేమపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాబుద్ధుల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ... భరత్‌కి, అభీకి హ్యాపీ హ్యీపీ బర్త్ డే.. :)

  ReplyDelete
 8. అయ్యో ... అలా అయ్యిందా.