Saturday, February 15, 2014

కొత్త కాపురం

ఏంటండీ.. ఎలా ఉన్నారు? చాలా రోజులయిపోయింది మిమ్మల్ని పలకరించి. "ఏమైపోయావ్ అమ్మాయ్..?" అంటూ మెయిల్స్, కామెంట్స్ చేసిన స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. "ఈ సారి ఏం సాకు చెబుతావ్" అని గుర్రుగా చూడకండి. మీకు తెలియనిదేముందండీ... కొత్తగా పెళ్లైంది కదా.. :) కొత్త జీవితంలో కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. అందుకే బ్లాగింటి తలుపులు తెరవలేదు. అలా అని రాయడం మానేశానని కాదు.. మరీ పర్సనల్ విషయాలు కావడంతో డైరీతో చెప్పాల్సి వచ్చింది కబుర్లన్నీను ;) 

అదిగో.. అలా మూతి విరుపులెందుకండీ? నా కొత్త జీవితం ఎలా ఉందో మీకూ చెప్పాలనే కదా ఇప్పుడు రాస్తోంది? "ఈ అల్లరి గడుగ్గాయికి పెళ్లవుతోంది కదా.. ఇహ బుద్ధిగా ఉంటుంది, ఆ వసపిట్ట వాగుడికి ఈ మూడు ముళ్ళతో ఆనకట్ట పడుతుంద" ని పెద్దవాళ్ళు అంటుంటే, చాటుగా నవ్వుకున్నాను. "నాదేమైనా అరేంజెడ్ మ్యారేజేవిటీ ఇవన్నీ జరగడానికి? హహ్హహ..  భరత్ చాలా మంచోడు నా అల్లరికి వచ్చిన డోఖా ఏమీలేదు" అనుకున్నాను! ఇప్పుడు అర్ధమవుతోంది పెద్దల మాట పెరుగన్నపు మూట అని ఎందుకంటారో :)

ఉదయం ఆరున్నరా ఏడు కి మొదలవుతోంది నా రోజు (అంతకన్నా ముందు రోజూ లేవాలంటే నావల్ల కాదు బాబూ). ఇంట్లో అంటే అమ్మ లేపేది కనుక సరిపోయేది. ఒకవేళ ఆవిడ లేకపోతే అలారం పెట్టుకుని దాన్ని స్నూజ్ చేస్తూ నా ఇష్టమొచ్చినంతసేపు పడుకునేదాన్ని. ఇప్పుడు నాకా సౌలభ్యం లేదు మరి! అయినా నాకు కాస్త మొహమాటం తక్కువా, భరత్ కి ఎక్కువా కావడంతో ఇంట్లోలానే సాగిపోతోందనుకోండీ.. :P 

గబగబా బ్రష్ చేసి నాలుగు చెంబులు నీళ్ళు ఒంటిమీద దిమ్మరించుకుని కిచెన్ లోకి అడుగుపెడతాను. పాపం మావారు నాలా కాదండోయ్.. రాత్రి ఏ వేళకు పడుకున్నా, ఐదు ఐదున్నర కల్లా టంచనుగా లేచి కూర్చుంటారు. మనం అప్పుడు మాంచి నిద్రలో ఉంటాం. కాస్త పొద్దెక్కనిదే మనకు మెలకువ రాదు :(. ఎలాగైనా తనతోపాటుగా లేవాలని నడుంకట్టుకుని బాగా కృషి చేశాను కానీ, నా ఖర్మకొద్దీ అలా ప్రయత్నించిన రోజుల్లో ఇంకో అరగంట లేట్ అవుతోంది గానీ కనీసం మామూలు టైం కి ఐదు నిముషాలు కూడా ముందు అవడంలేదు! అయినా సరే ఇప్పటికీ నా నడుం కట్టు వదల్లెదనుకోండీ.. పట్టు వదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను (ఇందుకు చక్కటి ఇల్లాలవ్వాలన్న తాపత్రయంతో పాటు మరో ముఖ్య కారణం కూడా ఉంది. సమయం వచ్చినపుడు చెబుతాను). సర్లే.. ఇప్పటికే నా నిద్ర గురించి ఎక్కువ రాసేశాను. లేనిపోయింది.. ఇది చదివి చదివి మీకు నిద్రొచ్చేస్తుందేమో?! 

ఉమ్మ్.. అలా కిచెన్ రూం లోకి వెళ్లి గబగబా పాలు కాచి, ఏ ఇడ్లీయో.. దోశలో చేస్తూ పనిలో పనిగా  రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. కూర.... ...... కొత్తలో చాలా ఉత్సాహంగా వండేదాన్ని. కానీ రోజులు పోగాపోగా కూర వండాలంటేనే విసుగ్గా ఉంటోంది. ఇంట్లో అమ్మని "ఈ వేళ కూరమ్మా?" అని రోజుకి రెండు సార్లు అడిగినా విన్న సమాధానమే వింటున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.  అదే ఇప్పుడు భరత్ నన్ను "ఈ వేళ ఏం వండుతున్నావ్ ప్రియా?" అని అడిగితే ఏడుపొచ్చేస్తోంది! కాయగూరల కోసం మార్కెట్ కి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది! ఏమీ అర్ధం కావడంలేదా మీకు? హుం హుం హుం! ఊ ఊ ఊ...  రోజూ అవే కూరలండీ బాబు. విసుగొచ్చేస్తోంది. అందులోనూ ఈయన బంగాళదుంప, వంకాయ, బెండకాయ, అప్పుడపుడూ మునక్కాయా, పప్పూ తోటకూరా (ఏ ఆకు కూరైనా సరే పప్పులో వేస్తేనే తింటాడు తప్ప తాలింపు పెడితే గిట్టదు), పనీర్, మష్రూమ్.  అంతే. మరో కూరగాయ వైపు కన్నెత్తైనా చూడడు, చూడనివ్వడు. కారెట్, బీట్రూట్లను పచ్చిగానో, జ్యూస్ రూపంలోనో తీసుకుంటాడు కానీ వేపుడు చేస్తే తాకడు. మరి నేనేమో తినని కాయగూరంటూ లేదు. పొట్లకాయ, బీరకాయ, కంద, చేమ దుంప, అరటి, అరటి దూట, చౌ చౌ, చిక్కుడు కాయ, కాకరకాయ, దుంపలు, కాలిఫ్లవర్, క్యాబేజ్, ఇలా అది ఇదీ అని లేకుండా అన్నీ తింటాను. చక్కగా అంత పప్పూ, రెండు వేపుళ్ళూ, ఇంత ఆవకాయ వేసుకుని తినే ప్రాణం..  ఇప్పుడు ఈయనగారి పుణ్యమా అని ఆయనకు నచ్చిన ఆ నాలుగైదు కూరలనే (పైగా తనకు ఏవైనా రెండు కూరలను కలిపి తినడం నచ్చదు. రోజుకి ఒక్క కూరే. అంతెందుకు పప్పులోకి దుంప వేపుడు కూడా నచ్చదు) తినీ తినీ ప్రాణం బిక్క చచ్చిపోతోంది. తనేమో "ఏం కూరగాయలే బాబూ.. నాలుక చచ్చిపోతోంది. నిన్ను కట్టుకున్నాక మరీ మేక బ్రతుకయిపోయింది. అసలు మేక మాంసం తిని ఎన్ని రోజులయిపోతోందో.." అని ఏడుపు!! 

అవీ నా కూర కష్టాలు. సో.. అలా  రొటీన్గా ఏదో ఒక కూర చేసి బాక్స్ పెట్టి తనను ఆఫీసు కి పంపించేశాక, నేనూ ఏదో తిన్నాననిపించి ఇక పెయింట్లు, పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంటున్నాను. పగలు నిద్రపోయే అలవాటు లేదు కనుక బోర్ కొడితే కాసేపు గీతక్కతో కబుర్లు, కాసేపు టీవీ కాలక్షేపం. మధ్య మధ్యలో అంట్లూ, బట్టలూ, ఊడ్చడాలూ, తుడవడాలూ యధామామూలు :)

ఈ వంటలు, మంటల మాటలు పక్కన పెడితే.. మా కాపురం చాలా బావుంది. పూర్తిగా తియ్యగా ఉందని చెప్పను. ఉగాది పచ్చడిలా వివిధ రకాల రుచులతో ఎంతో బావుంది. మా సాంప్రదాయాలు, వ్యక్తిత్వాలూ, అలవాట్లు, అభిరుచులూ, మేము పెరిగిన వాతావరణాలు, అన్నీ వేరు. కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు తను నాకోసం, మరికొన్నిసార్లు నేను తన కోసం అడ్జస్ట్ అవుతూ ఇద్దరం ఒక్కరవుతున్నాం. 
పెళ్ళికి ముందు "ఆ ఏముందిలే పెళ్ళిలో.. కలిసి ఉండడం అంతే కదా" అనిపించేది. కానీ కాదు. పెళ్ళిలో ఏదో మేజిక్ ఉంది. నిన్న మొన్నటి వరకూ నాన్న, అక్కా, అమ్మా వీళ్ళే నా ప్రపంచం. వాళ్ళ తరువాతే భరత్ అయినా. కాని ఇప్పుడు? వాళ్ళ ముగ్గుర్ని పక్కకు నెట్టి మొదటి స్థానం భరత్ తీసేసుకున్నాడు! చాలా విచిత్రంగా ఉంది. ఈ మేజిక్ పెళ్ళైతేనే అర్ధమవుతుందనుకుంటాను. కదూ??

31 comments:

Kalyan Tej said...

పప్పులో దుంపల వేపుడు! - కొట్టారు ప్రియగారు. ఈంటి వంటకాలని బాగా గుర్తుచేసారు. Good update after a long time! :D

Priya said...

Thanks కళ్యాణ్ గారు :)
ఎలాగూ ఇంటి వంట గుర్తొచ్చేసింది కనుక ఓ సారి ఇంటికెళ్ళొచ్చేయండి. అమ్మ సంతోషపడతారు. వీలు కుదరకపోతే స్వయం పాకమయినా మొదలుపెట్టేయండి అంతేకాని మంచి భోజనాన్ని మాత్రం మిస్ అవకండి.

Kalyan Tej said...

Egjactly! :P True that! :D

నాగరాజ్ said...

భలే చక్కగా రాశారండి, కొత్త కాపురం కబుర్లు!!
కాలం- ఓ అంతులేని ప్రవాహం! మార్పు- దాని నైజం!! ఈ కాలప్రవాహం వెంట పరుగులు తీయడమే, మార్పును అంతర్గతం చేసుకోవడమే... మనిషి చేయగలిగిందల్లా అంటుంటారు పెద్దలు!!! డార్విన్ మహాశయుడు చెప్పిన Struggle For Existence & Survival Of The Fittest అన్న నియమాలు జీవితంలో అనుక్షణం కనిపిస్తూనే ఉంటాయనుకుంటా. కాలక్రమంలో ప్రయారిటీస్ మారడం కూడా సహజమేనేమో!! కూరగాయల కష్టాలను కట్టగట్టి ఫ్రిజ్జులో దాచేసి, అంతా మన మంచికే- అనే ఓ తారకమంత్రం నేర్చేసుకుని, మీ జంట... నిండు నూరేళ్లూ చిలకా గోరింకల్లా జీవించేసేయండి :-)

ఎగిసే అలలు.... said...

Priyaa gaaroo, after long days blog worldku vacchaaru. mee kotha life..hha..hha..chaalaa bagundi.papam Bharath gaaru, meeru vanta saalalo chese experiments resultski bali avutunnaadu.:-):-):-)

naveen said...

Mee blog kosam daily wait chestunna,,,kotta jevitham kadha update cheyyata ledhu anukonnam,,,mee kurala kabruluto maa Blog akali terindi

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగున్నాయండీ కబుర్లు :-))

Krishna Palakollu said...

yo! super!
enjoy ur days :-0

pallavi said...

:) :)
I was waiting for the next post..
photo chala bavundi.. mee premayanam series resume cheyandi malli..

sndp said...

akka super ba enjoying...:p

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

ఏది ఏమైన భరత్ గారు చాల అదృష్ట వంతులని తేలిపోయింది చాళా బాగా రాసారు ప్రియా గారు

Priya said...

థాంక్స్ నాగరాజ్ గారు. చక్కటి కామెంట్ రాసారు. మా జంటే కాదు.. ప్రతి జంటా ఇలాటి సిల్లీ కష్టాలను మూటగట్టి అటక మీద పెట్టేసి నవ్వుతూ తుళ్ళుతుండాలి :)

Priya said...

ఇదిగో కార్తీక్ గారూ, ఇలా జోల పాడి బుగ్గ గిల్లడం ఏమీ బావోలేదు :-/ . నా వంటలు ఎక్స్పరిమెంట్స్.. పాపం భరత్ అంటారా?? నేను అలిగాను.. :-P

Priya said...

మీ అభిమానానికి లెక్కలేనన్ని కృతజ్ఞతలు నవీన్ గారూ. మీ కామెంట్ చదివి నా మనసు నిండింది :)

Priya said...

చాలా థాంక్స్ వేణూ గారు :)

Priya said...

హహ్హహ! కృష్ణ గారూ.. thank you :)

Priya said...

థాంక్ యూ పల్లవి గారు :)
నేనే అనుకుంటూ ఉన్నానండీ నెక్స్ట్ పార్ట్ త్వరగా రాయాలని. మరొక పోస్ట్ కాస్త రాసి ఆపేశాను. అది పబ్లిష్ చేశాక ప్రేమాయణం పార్ట్ 9 రాస్తాను.

Priya said...

:)

Priya said...

హహ్హహ భలే వారే! Thanks for the comment.

శ్రీ said...

entandi bottiaga mari nallaposalayyayi mee postlu....mee love story migata baghalu eppudu rastaru.. anyway innalakayina mari mee oosulato maaku tirigi kanipincharu..
keep writing ..

ధాత్రి said...

Sweet..;))

Priya said...

మీ అభిమానానికి చాలా థాంక్స్ శ్రీ గారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీక్వెంట్గా రాసేస్తున్నాను కదండీ.. ఇదిగో ప్రేమాయణం పార్ట్ 9 కూడా రేపే పబ్లిష్ చేసేస్తాను. వీలు కుదిరితే ఈ రోజే.. :)

Priya said...

Thank you so much, ధాత్రి గారు :)

Green Star said...

మా పెళ్లి కొత్త రోజులు గుర్తొస్తున్నాయండి, మాది సేం టు సేం. నేను ఎంత లేటుగా పడుకున్న 5-5.30 దాని పడుకోలేను, మా గృహ లక్ష్మికి వర్క్ డే లో 7.30, సెలవు రోజుల్లో 9.30 కానిదే తెల్లారదు. రెండు మూడు కూరలు కలిపి వండితే, లేక కలిపి తింటే కాని తిన్నట్లు ఉండదు. వారానికి కనీసం రెండు సార్లయినా 'ఏం వండాలి' అని తనడగటం, ఏదోకటి కనిచ్చేయ్ అని నేనటం, ఆ ఏదోకటి ఎదో చెప్పొచ్చు కదా అని తను విసుక్కోవటం, నేను కోప్పడటం, తను దేబ్బలడటం .... .. ఈ సారి కలిసినప్పుడు భరత్ గారితో నేను పంచుకోవలసినవి చాలా ఉన్నాయన్న మాట.

Green Star said...

By the way, that photo looks fantastic. పడుకునే ముందు మీరిద్దరూ దిష్టి తియించుకోగలరు. తరువాత నేను చెప్పలేదని అనొద్దు :)

Priya said...

హహ్హ్హాహ.. కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారండీ మీ ఇద్దరూ? మా ఆవిడ నిద్రపోతంటే మా ఆవిడ నిద్రపోతనా??? ఏం మాట్లాడుకున్నా మా వరకూ ఆ మాటలు రాకపోవూ.. తరువాత మీరు ఇళ్ళకు వచ్చాక దానికి ప్రతిఫలం పొందకపోరూ :P

మీ ఇద్దరి అలవాట్లూ మాలాగే అని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇక ఆ ఫోటో గురించి మీరు చేసిన కామెంట్ కి చాలా చాలా థాంక్స్ అండీ. మీ కామెంట్ చదివాక రాత్రి కాస్త ఉప్పుతో దిష్టి తీసేశాను ;)

Anonymous said...

edainaa post raayandi...it's too late we're waiting........

Priya said...

ఇదిగో ఇదిగో.. ఆ పనిలోనే ఉన్నానండీ..
Thanks for the comment :)

prakashpasupuleti007 said...

2 days pattindi me blog motham tirigi ravadaniki.
tirigi tirigi kallu (kaallu kadandi kallu means eyes) noppedutunai.
kanee manasu matram anamdaga undi.
actually rajkumarneelam2.blogspot.in ane blog 1st time chadivanu. Comedy punch latho movie review latho emotions tho excellent blog adi. Adi chadivina ventane blog pichi pattindi naku. Pichi taggadaniki manchi blog chadavadame solution ani search chestunte lucky ga athanu follow aye blogs lo me blog kanapadindi.
rajkumar blog e antha baunte athanu follow aye blog inkentha super ga untundo ani immediate ga me blog lo ki dukanu.
anukunamtha kakapoina me blog kuda chala lively ga undi. Oka amai emotions, feelings and totally a woman's journey kallaku kattinatlu (malle eyes ye andi babu) chuparu. Simple and super.
me blog lo naku nachandi okkate. Suspense thriller la me love story ni 2years aina complete cheyakapovatam darunam andi. Daya chesi ma weak hearts ni suspense tho champaka toraga migilina parts post cheyochu kada andi.
love cheyatam goppa kadu, parents

prakashpasupuleti007 said...

love cheyatam goppa kadu, parents ni oppinchi success chesukotam nijamga great. Andarikee aa luck undadu. Congrats andi priyagaru. Wish you a very happy married life andi.

Priya said...

ప్రకాష్ గారూ, అంత ఓపిగ్గా నా బ్లాగ్ అంతా చదివారని తెలుసుకుని చాలా సంబరపడ్డాను. థాంక్స్. మీ కామెంట్స్ కి, విషెస్ కి!

కదా.. నాకూ ఎంతో ఇష్టమైన బ్లాగ్స్ లో రాజ్ కుమార్ గారి బ్లాగ్ కూడా ఒకటండీ. ఆయన బ్లాగ్ ద్వారా ఇటు వచ్చానన్నారు కనుక ఆయనకూ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Saturday, February 15, 2014

కొత్త కాపురం

ఏంటండీ.. ఎలా ఉన్నారు? చాలా రోజులయిపోయింది మిమ్మల్ని పలకరించి. "ఏమైపోయావ్ అమ్మాయ్..?" అంటూ మెయిల్స్, కామెంట్స్ చేసిన స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. "ఈ సారి ఏం సాకు చెబుతావ్" అని గుర్రుగా చూడకండి. మీకు తెలియనిదేముందండీ... కొత్తగా పెళ్లైంది కదా.. :) కొత్త జీవితంలో కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. అందుకే బ్లాగింటి తలుపులు తెరవలేదు. అలా అని రాయడం మానేశానని కాదు.. మరీ పర్సనల్ విషయాలు కావడంతో డైరీతో చెప్పాల్సి వచ్చింది కబుర్లన్నీను ;) 

అదిగో.. అలా మూతి విరుపులెందుకండీ? నా కొత్త జీవితం ఎలా ఉందో మీకూ చెప్పాలనే కదా ఇప్పుడు రాస్తోంది? "ఈ అల్లరి గడుగ్గాయికి పెళ్లవుతోంది కదా.. ఇహ బుద్ధిగా ఉంటుంది, ఆ వసపిట్ట వాగుడికి ఈ మూడు ముళ్ళతో ఆనకట్ట పడుతుంద" ని పెద్దవాళ్ళు అంటుంటే, చాటుగా నవ్వుకున్నాను. "నాదేమైనా అరేంజెడ్ మ్యారేజేవిటీ ఇవన్నీ జరగడానికి? హహ్హహ..  భరత్ చాలా మంచోడు నా అల్లరికి వచ్చిన డోఖా ఏమీలేదు" అనుకున్నాను! ఇప్పుడు అర్ధమవుతోంది పెద్దల మాట పెరుగన్నపు మూట అని ఎందుకంటారో :)

ఉదయం ఆరున్నరా ఏడు కి మొదలవుతోంది నా రోజు (అంతకన్నా ముందు రోజూ లేవాలంటే నావల్ల కాదు బాబూ). ఇంట్లో అంటే అమ్మ లేపేది కనుక సరిపోయేది. ఒకవేళ ఆవిడ లేకపోతే అలారం పెట్టుకుని దాన్ని స్నూజ్ చేస్తూ నా ఇష్టమొచ్చినంతసేపు పడుకునేదాన్ని. ఇప్పుడు నాకా సౌలభ్యం లేదు మరి! అయినా నాకు కాస్త మొహమాటం తక్కువా, భరత్ కి ఎక్కువా కావడంతో ఇంట్లోలానే సాగిపోతోందనుకోండీ.. :P 

గబగబా బ్రష్ చేసి నాలుగు చెంబులు నీళ్ళు ఒంటిమీద దిమ్మరించుకుని కిచెన్ లోకి అడుగుపెడతాను. పాపం మావారు నాలా కాదండోయ్.. రాత్రి ఏ వేళకు పడుకున్నా, ఐదు ఐదున్నర కల్లా టంచనుగా లేచి కూర్చుంటారు. మనం అప్పుడు మాంచి నిద్రలో ఉంటాం. కాస్త పొద్దెక్కనిదే మనకు మెలకువ రాదు :(. ఎలాగైనా తనతోపాటుగా లేవాలని నడుంకట్టుకుని బాగా కృషి చేశాను కానీ, నా ఖర్మకొద్దీ అలా ప్రయత్నించిన రోజుల్లో ఇంకో అరగంట లేట్ అవుతోంది గానీ కనీసం మామూలు టైం కి ఐదు నిముషాలు కూడా ముందు అవడంలేదు! అయినా సరే ఇప్పటికీ నా నడుం కట్టు వదల్లెదనుకోండీ.. పట్టు వదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను (ఇందుకు చక్కటి ఇల్లాలవ్వాలన్న తాపత్రయంతో పాటు మరో ముఖ్య కారణం కూడా ఉంది. సమయం వచ్చినపుడు చెబుతాను). సర్లే.. ఇప్పటికే నా నిద్ర గురించి ఎక్కువ రాసేశాను. లేనిపోయింది.. ఇది చదివి చదివి మీకు నిద్రొచ్చేస్తుందేమో?! 

ఉమ్మ్.. అలా కిచెన్ రూం లోకి వెళ్లి గబగబా పాలు కాచి, ఏ ఇడ్లీయో.. దోశలో చేస్తూ పనిలో పనిగా  రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. కూర.... ...... కొత్తలో చాలా ఉత్సాహంగా వండేదాన్ని. కానీ రోజులు పోగాపోగా కూర వండాలంటేనే విసుగ్గా ఉంటోంది. ఇంట్లో అమ్మని "ఈ వేళ కూరమ్మా?" అని రోజుకి రెండు సార్లు అడిగినా విన్న సమాధానమే వింటున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.  అదే ఇప్పుడు భరత్ నన్ను "ఈ వేళ ఏం వండుతున్నావ్ ప్రియా?" అని అడిగితే ఏడుపొచ్చేస్తోంది! కాయగూరల కోసం మార్కెట్ కి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది! ఏమీ అర్ధం కావడంలేదా మీకు? హుం హుం హుం! ఊ ఊ ఊ...  రోజూ అవే కూరలండీ బాబు. విసుగొచ్చేస్తోంది. అందులోనూ ఈయన బంగాళదుంప, వంకాయ, బెండకాయ, అప్పుడపుడూ మునక్కాయా, పప్పూ తోటకూరా (ఏ ఆకు కూరైనా సరే పప్పులో వేస్తేనే తింటాడు తప్ప తాలింపు పెడితే గిట్టదు), పనీర్, మష్రూమ్.  అంతే. మరో కూరగాయ వైపు కన్నెత్తైనా చూడడు, చూడనివ్వడు. కారెట్, బీట్రూట్లను పచ్చిగానో, జ్యూస్ రూపంలోనో తీసుకుంటాడు కానీ వేపుడు చేస్తే తాకడు. మరి నేనేమో తినని కాయగూరంటూ లేదు. పొట్లకాయ, బీరకాయ, కంద, చేమ దుంప, అరటి, అరటి దూట, చౌ చౌ, చిక్కుడు కాయ, కాకరకాయ, దుంపలు, కాలిఫ్లవర్, క్యాబేజ్, ఇలా అది ఇదీ అని లేకుండా అన్నీ తింటాను. చక్కగా అంత పప్పూ, రెండు వేపుళ్ళూ, ఇంత ఆవకాయ వేసుకుని తినే ప్రాణం..  ఇప్పుడు ఈయనగారి పుణ్యమా అని ఆయనకు నచ్చిన ఆ నాలుగైదు కూరలనే (పైగా తనకు ఏవైనా రెండు కూరలను కలిపి తినడం నచ్చదు. రోజుకి ఒక్క కూరే. అంతెందుకు పప్పులోకి దుంప వేపుడు కూడా నచ్చదు) తినీ తినీ ప్రాణం బిక్క చచ్చిపోతోంది. తనేమో "ఏం కూరగాయలే బాబూ.. నాలుక చచ్చిపోతోంది. నిన్ను కట్టుకున్నాక మరీ మేక బ్రతుకయిపోయింది. అసలు మేక మాంసం తిని ఎన్ని రోజులయిపోతోందో.." అని ఏడుపు!! 

అవీ నా కూర కష్టాలు. సో.. అలా  రొటీన్గా ఏదో ఒక కూర చేసి బాక్స్ పెట్టి తనను ఆఫీసు కి పంపించేశాక, నేనూ ఏదో తిన్నాననిపించి ఇక పెయింట్లు, పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంటున్నాను. పగలు నిద్రపోయే అలవాటు లేదు కనుక బోర్ కొడితే కాసేపు గీతక్కతో కబుర్లు, కాసేపు టీవీ కాలక్షేపం. మధ్య మధ్యలో అంట్లూ, బట్టలూ, ఊడ్చడాలూ, తుడవడాలూ యధామామూలు :)

ఈ వంటలు, మంటల మాటలు పక్కన పెడితే.. మా కాపురం చాలా బావుంది. పూర్తిగా తియ్యగా ఉందని చెప్పను. ఉగాది పచ్చడిలా వివిధ రకాల రుచులతో ఎంతో బావుంది. మా సాంప్రదాయాలు, వ్యక్తిత్వాలూ, అలవాట్లు, అభిరుచులూ, మేము పెరిగిన వాతావరణాలు, అన్నీ వేరు. కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు తను నాకోసం, మరికొన్నిసార్లు నేను తన కోసం అడ్జస్ట్ అవుతూ ఇద్దరం ఒక్కరవుతున్నాం. 
పెళ్ళికి ముందు "ఆ ఏముందిలే పెళ్ళిలో.. కలిసి ఉండడం అంతే కదా" అనిపించేది. కానీ కాదు. పెళ్ళిలో ఏదో మేజిక్ ఉంది. నిన్న మొన్నటి వరకూ నాన్న, అక్కా, అమ్మా వీళ్ళే నా ప్రపంచం. వాళ్ళ తరువాతే భరత్ అయినా. కాని ఇప్పుడు? వాళ్ళ ముగ్గుర్ని పక్కకు నెట్టి మొదటి స్థానం భరత్ తీసేసుకున్నాడు! చాలా విచిత్రంగా ఉంది. ఈ మేజిక్ పెళ్ళైతేనే అర్ధమవుతుందనుకుంటాను. కదూ??

31 comments:

 1. పప్పులో దుంపల వేపుడు! - కొట్టారు ప్రియగారు. ఈంటి వంటకాలని బాగా గుర్తుచేసారు. Good update after a long time! :D

  ReplyDelete
 2. Thanks కళ్యాణ్ గారు :)
  ఎలాగూ ఇంటి వంట గుర్తొచ్చేసింది కనుక ఓ సారి ఇంటికెళ్ళొచ్చేయండి. అమ్మ సంతోషపడతారు. వీలు కుదరకపోతే స్వయం పాకమయినా మొదలుపెట్టేయండి అంతేకాని మంచి భోజనాన్ని మాత్రం మిస్ అవకండి.

  ReplyDelete
 3. భలే చక్కగా రాశారండి, కొత్త కాపురం కబుర్లు!!
  కాలం- ఓ అంతులేని ప్రవాహం! మార్పు- దాని నైజం!! ఈ కాలప్రవాహం వెంట పరుగులు తీయడమే, మార్పును అంతర్గతం చేసుకోవడమే... మనిషి చేయగలిగిందల్లా అంటుంటారు పెద్దలు!!! డార్విన్ మహాశయుడు చెప్పిన Struggle For Existence & Survival Of The Fittest అన్న నియమాలు జీవితంలో అనుక్షణం కనిపిస్తూనే ఉంటాయనుకుంటా. కాలక్రమంలో ప్రయారిటీస్ మారడం కూడా సహజమేనేమో!! కూరగాయల కష్టాలను కట్టగట్టి ఫ్రిజ్జులో దాచేసి, అంతా మన మంచికే- అనే ఓ తారకమంత్రం నేర్చేసుకుని, మీ జంట... నిండు నూరేళ్లూ చిలకా గోరింకల్లా జీవించేసేయండి :-)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ నాగరాజ్ గారు. చక్కటి కామెంట్ రాసారు. మా జంటే కాదు.. ప్రతి జంటా ఇలాటి సిల్లీ కష్టాలను మూటగట్టి అటక మీద పెట్టేసి నవ్వుతూ తుళ్ళుతుండాలి :)

   Delete
 4. Priyaa gaaroo, after long days blog worldku vacchaaru. mee kotha life..hha..hha..chaalaa bagundi.papam Bharath gaaru, meeru vanta saalalo chese experiments resultski bali avutunnaadu.:-):-):-)

  ReplyDelete
  Replies
  1. ఇదిగో కార్తీక్ గారూ, ఇలా జోల పాడి బుగ్గ గిల్లడం ఏమీ బావోలేదు :-/ . నా వంటలు ఎక్స్పరిమెంట్స్.. పాపం భరత్ అంటారా?? నేను అలిగాను.. :-P

   Delete
 5. Mee blog kosam daily wait chestunna,,,kotta jevitham kadha update cheyyata ledhu anukonnam,,,mee kurala kabruluto maa Blog akali terindi

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి లెక్కలేనన్ని కృతజ్ఞతలు నవీన్ గారూ. మీ కామెంట్ చదివి నా మనసు నిండింది :)

   Delete
 6. హహహ బాగున్నాయండీ కబుర్లు :-))

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ వేణూ గారు :)

   Delete
 7. Krishna Palakollu15/2/14

  yo! super!
  enjoy ur days :-0

  ReplyDelete
  Replies
  1. హహ్హహ! కృష్ణ గారూ.. thank you :)

   Delete
 8. :) :)
  I was waiting for the next post..
  photo chala bavundi.. mee premayanam series resume cheyandi malli..

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ పల్లవి గారు :)
   నేనే అనుకుంటూ ఉన్నానండీ నెక్స్ట్ పార్ట్ త్వరగా రాయాలని. మరొక పోస్ట్ కాస్త రాసి ఆపేశాను. అది పబ్లిష్ చేశాక ప్రేమాయణం పార్ట్ 9 రాస్తాను.

   Delete
 9. akka super ba enjoying...:p

  ReplyDelete
 10. ఏది ఏమైన భరత్ గారు చాల అదృష్ట వంతులని తేలిపోయింది చాళా బాగా రాసారు ప్రియా గారు

  ReplyDelete
  Replies
  1. హహ్హహ భలే వారే! Thanks for the comment.

   Delete
 11. entandi bottiaga mari nallaposalayyayi mee postlu....mee love story migata baghalu eppudu rastaru.. anyway innalakayina mari mee oosulato maaku tirigi kanipincharu..
  keep writing ..

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి చాలా థాంక్స్ శ్రీ గారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీక్వెంట్గా రాసేస్తున్నాను కదండీ.. ఇదిగో ప్రేమాయణం పార్ట్ 9 కూడా రేపే పబ్లిష్ చేసేస్తాను. వీలు కుదిరితే ఈ రోజే.. :)

   Delete
 12. Replies
  1. Thank you so much, ధాత్రి గారు :)

   Delete
 13. మా పెళ్లి కొత్త రోజులు గుర్తొస్తున్నాయండి, మాది సేం టు సేం. నేను ఎంత లేటుగా పడుకున్న 5-5.30 దాని పడుకోలేను, మా గృహ లక్ష్మికి వర్క్ డే లో 7.30, సెలవు రోజుల్లో 9.30 కానిదే తెల్లారదు. రెండు మూడు కూరలు కలిపి వండితే, లేక కలిపి తింటే కాని తిన్నట్లు ఉండదు. వారానికి కనీసం రెండు సార్లయినా 'ఏం వండాలి' అని తనడగటం, ఏదోకటి కనిచ్చేయ్ అని నేనటం, ఆ ఏదోకటి ఎదో చెప్పొచ్చు కదా అని తను విసుక్కోవటం, నేను కోప్పడటం, తను దేబ్బలడటం .... .. ఈ సారి కలిసినప్పుడు భరత్ గారితో నేను పంచుకోవలసినవి చాలా ఉన్నాయన్న మాట.

  ReplyDelete
 14. By the way, that photo looks fantastic. పడుకునే ముందు మీరిద్దరూ దిష్టి తియించుకోగలరు. తరువాత నేను చెప్పలేదని అనొద్దు :)

  ReplyDelete
  Replies
  1. హహ్హ్హాహ.. కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారండీ మీ ఇద్దరూ? మా ఆవిడ నిద్రపోతంటే మా ఆవిడ నిద్రపోతనా??? ఏం మాట్లాడుకున్నా మా వరకూ ఆ మాటలు రాకపోవూ.. తరువాత మీరు ఇళ్ళకు వచ్చాక దానికి ప్రతిఫలం పొందకపోరూ :P

   మీ ఇద్దరి అలవాట్లూ మాలాగే అని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇక ఆ ఫోటో గురించి మీరు చేసిన కామెంట్ కి చాలా చాలా థాంక్స్ అండీ. మీ కామెంట్ చదివాక రాత్రి కాస్త ఉప్పుతో దిష్టి తీసేశాను ;)

   Delete
 15. Anonymous19/5/14

  edainaa post raayandi...it's too late we're waiting........

  ReplyDelete
  Replies
  1. ఇదిగో ఇదిగో.. ఆ పనిలోనే ఉన్నానండీ..
   Thanks for the comment :)

   Delete
 16. 2 days pattindi me blog motham tirigi ravadaniki.
  tirigi tirigi kallu (kaallu kadandi kallu means eyes) noppedutunai.
  kanee manasu matram anamdaga undi.
  actually rajkumarneelam2.blogspot.in ane blog 1st time chadivanu. Comedy punch latho movie review latho emotions tho excellent blog adi. Adi chadivina ventane blog pichi pattindi naku. Pichi taggadaniki manchi blog chadavadame solution ani search chestunte lucky ga athanu follow aye blogs lo me blog kanapadindi.
  rajkumar blog e antha baunte athanu follow aye blog inkentha super ga untundo ani immediate ga me blog lo ki dukanu.
  anukunamtha kakapoina me blog kuda chala lively ga undi. Oka amai emotions, feelings and totally a woman's journey kallaku kattinatlu (malle eyes ye andi babu) chuparu. Simple and super.
  me blog lo naku nachandi okkate. Suspense thriller la me love story ni 2years aina complete cheyakapovatam darunam andi. Daya chesi ma weak hearts ni suspense tho champaka toraga migilina parts post cheyochu kada andi.
  love cheyatam goppa kadu, parents

  ReplyDelete
 17. love cheyatam goppa kadu, parents ni oppinchi success chesukotam nijamga great. Andarikee aa luck undadu. Congrats andi priyagaru. Wish you a very happy married life andi.

  ReplyDelete
 18. ప్రకాష్ గారూ, అంత ఓపిగ్గా నా బ్లాగ్ అంతా చదివారని తెలుసుకుని చాలా సంబరపడ్డాను. థాంక్స్. మీ కామెంట్స్ కి, విషెస్ కి!