Tuesday, February 18, 2014

ఏమ్మా.. ఏదైనా విశేషమా??

(ఈ పోస్ట్ పెళ్ళైన వారికి మాత్రమే)

ఈ 2 నెలల్లో ఇప్పటికి ఈ ప్రశ్న ఎన్నిసార్లు విన్నానో! ముందు సిగ్గేసింది, తరువాత తమాషాగా అనిపించిది, ఆ తరువాత విసుగొచ్చింది, ఇప్పుడు కోపమొస్తోంది! కనబడితే చాలు "ఏమ్మా.. ఏదైనా విశేషమా??" అని అడుగుతున్నారు.

డిసెంబరు నెలలో అక్కావాళ్ళింటికి వెళ్లి, ప్రయాణం చేసి ఉండడంతో అలసిపోయి అలా నడుం వాల్చాను. ఈ లోపు వాళ్ళ అత్తగారు వచ్చారు "ఏమ్మా.. ఏదైనా విశేషమా?" అన్నారు. నేను లేస్తూ.. "అబ్బే బాబుగాడు నడిచేస్తున్నాడని అక్క చెబితేనూ చూసి వెళదామని వచ్చానండీ" అన్నాను. "అది సర్లేమ్మా. నీరసంగా కనబడుతున్నావే అనడుగుతున్నాను" అన్నారు. నాకు ఆ ప్రశ్నలోని గూడార్ధం తెలియక చాలా మాములుగా "ఆ.. మొన్న జ్వరమొచ్చినప్పటి నుండీ కాస్త నీరసంగానే ఉంటోందండీ. అందునా ప్రయాణం చేసి వచ్చానేమో కాస్త తలనొప్పిగా ఉంది" చెప్పాను. "మరింకేవమ్మా? అదృష్టవంతురాలివే! స్వీట్లు ఎప్పుడు పంచిపెడుతున్నారు?" అని, వెలిగిపోతున్న మొహంతో నా పక్కకొచ్చి కూర్చొని నా చేతులు నిరిమారు. "ఇదేం ఖర్మరా బాబు! బాలేదంటే సంతోషపడిపోతూ స్వీట్లు పంచమంటారేవిటీ? పైగా అదృష్టవంతురాలినట!? నాకు నీ మీద స్పెషల్ అభిమానం ప్రియా అంటుంటారుగా.. ఇదే కాబోలు" అనుకుంటూ ఓ వింత ఎక్ష్ప్రెషన్ తో నోరెళ్ళబెట్టుకుని నేను చూస్తుంటే, మా అక్క కంగారుపడిపోతూ "అబ్బే.. అదేం లేదత్తయ్యా. దానికి వట్టినే కాస్త తలనొప్పని పడుకుందంతే" అని నా చెయ్యి వాళ్లత్తగారి చేతుల నుండి విడిపించి, "నువ్వు లేవవే. వెళ్లి కాళ్ళూ చేతులూ కడుక్కుని రా భోంచేద్దువ్" అంటూ బయటకు తరిమేసింది.

భోజనాలూ అవీ అయ్యాక, నిదానంగా చెప్పింది. ఆవిడ ఏ విశేషం గురించి అడిగారో. నాకు అర్ధమై చస్తే ఒట్టు. బాలేకపోవడానికి దీనికీ సంబంధమేంటో తెలియక తికమక పడి, అక్కని అడిగినా దాని సమాధానాలు నాకెలాగూ అర్ధంకావని లైట్ తీసుకున్నాను. అది మొదలు తెలిసిన వాళ్ళూ, తెలియని వాళ్ళూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఈ ప్రశ్న వేస్తూ చావగొట్టేస్తున్నారు. నీరసంగా కనిపించినా విశేషమే, ఫ్రెష్ గా కనిపించినా విశేషమే! మొన్న ఎందుకో మూడ్ బావుండి చక్కగా కొత్త కాటన్ చీర కట్టుకుని, ముందు రోజు మాల కట్టుకున్న జాజుల మాల తల్లో తురుముకున్నాను. అంత రెడీ అయ్యాక బయటకు వెళ్ళకపోతే ఎలా మరీ? అందుకే, పక్కన కాయగూరల కొట్టుకెళ్ళి ఆకుకూరేమైనా తెచ్చుకుందామని బయలుదేరాను. వచ్చేప్పుడు భరత్ అడిగాడని గుడ్లు కూడా కొన్నాను. నాకసలే కుదురెక్కువా.. ఎక్కడ పగులుతాయోనని నిదానంగా నడుచుకుంటూ వచ్చి గేట్ తీశాను. ఇంతలో పక్కింటి ఆంటీ పలకరించారు చీర బావుందంటూ. నవ్వుతూ థాంక్స్ చెప్తున్నానూ.. అంతలోనే ఆవిడ "చాలా కళగా కనబడుతున్నావు. ఏవైనా విశేషమా ఏంటమ్మాయ్?" అనేసారు. బలవంతాన పెదాల మీది చిరునవ్వు చెరగనీయకుండా, "అదేం లేదాంటీ. మొన్ననేగా పెళ్లైంది.. అప్పుడేనా? సరే వెళ్ళొస్తాను" అని గబగబా కదిలాను. ఆవిడ వదిలితేనా?? "ఏం మొన్నమ్మాయ్? మీ పెళ్లై మూడు నెలలు అయిపోవడంలేదా? ఇంకా లేకపోవడం ఏంటీ? త్వరగా కనేయండి. నేనెందుకు చెప్తున్నానంటే..... ......... ................" అంటూ పావుగంట వాయించేశారు!

అది బయటి వాళ్ళగోల. మా అత్తగారైతే మొన్న సంక్రాంతి పండుగ నుండి పట్టుకున్నారు. "వద్దనుకుని మందులేమైనా మింగుతున్నావా అమ్మాయ్? ఇదిగో అలాటివేం చేయకండి చెప్తున్నాను. ముందు వద్దు అనుకున్నారంటే తరువాత కావాలన్నా పుట్టరు. .... ... .. .. ......." అంటూ రోజుకోసారి క్లాసులు తీసుకుంటున్నారు. అక్కడికీ సిగ్గుని పక్కన పెట్టి, "అయ్యో అలాటిదేం లేదు అత్తయ్యా. దేవుడు కనికరించొద్దూ" అన్నాను కూడాను. అయినా విననిదే! పై పెచ్చు "నాకసలే ఒంట్లో బావుండడం లేదమ్మాయ్. మనవరాలు పుడితే దాన్ని చూసి సంతోషంగా ఈ నాలుగు రోజులూ గడుపుదామనీ అంతే" అంటూ 80 ఏళ్ళ ముసలావిడలా బాధపడుతున్నారు. ఆవిడని సముదాయించేలోపు నా తల ప్రాణం తోకకొచ్చేస్తోంది. ఏదో పెళ్లై పద్నాలుగేళ్ళైనా పిల్లలు కలగనట్లు వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ నన్నూ లాగుతున్నారు.

దీనికి కొసరుమెరుపు "అప్పుడే మనకు పిల్లలెందుకు? ఇంకాస్త కెరీర్లో సెటిల్ అయ్యాక చూసుకుందాం. ఈ బ్యాంకు ఉద్యోగాలతో ఎక్కడ వేగేది అస్తమాను ట్రాన్స్ఫర్స్ తో? వాళ్ళు కబుర్లు చెప్తారు కానీ కన్నాక వచ్చి ఉండి చూసుకోలేరుగా.. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకున్నాయి. నేనూ ఆఫీసు కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయలేవ్. పిల్లల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. మీ అక్క అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంది కనుక సరిపోతోంది" అంటూ చల్లగా అయినా నిక్కచ్చిగా భరత్ చెప్పడం.

మీ లైఫ్ లో ఇలాటి పరిస్థితి ఎదురైందా? మీరేమంటారు? అనుభవముంటే తోడపుట్టిన దాన్నో, స్నేహితురాలినో అనుకుని కాస్త మంచి సలహాలివ్వండి.

20 comments:

డేవిడ్ said...

:)....

జ్యోతిర్మయి said...

అమ్మాయ్ ప్రియా వాళ్ళ మాటలు అస్సలు వినకు. పిల్లలు పుట్టాక ప్రియ ఉండదు. ఫలానా వాళ్ళ అమ్మే ఉంటుంది. ముందు లైఫ్ ఎంజాయ్ చెయ్యండి.

నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి said...

emo meevaru cheppinattu vinu edi na salahaa Friend

Anonymous said...

Priya,

Bharath cheppindi chala correct. Ye vishayam ayina lothu thelusukoni digatame machidi. Ayina ippude kada pellayyindi appude pillalenti. Pilllalu anedi chala pedha responsibility. Manaku okka roju break theesukundaam anna veelu vundadu. So mundu decide chesukune mundu okatikli padi saarlu aalochinchi plan chesukunte manchidi ani naa salaha. cheppe vallu chepthaaru kaani vundi evvaru cheyyaru. entha amma vallu chusukunna konni nelale, but its a life long responsibility.

Anonymous said...

పెళ్ళయిన తరవాత పెద్దాళ్ళు అడిగే ప్రశ్న ఇదే! ఆ పనేదో తొందరగా పూర్తిచేసేయకూడదూ!!! :)

Priya said...

"మీరే తేల్చుకోవలసిన విషయం ఇది" అంటారు? సరే.. .. :)
ఇంతకూ రూప గారు ఎక్కడండీ?

Priya said...

జ్యోతిర్మయి గారూ.. నా బ్లాగ్ కి ఘనస్వాగతమండీ :)
అడగ్గానే స్పందించి సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు :)

Priya said...

Thanks!

Priya said...

True!
భరత్ అభిప్రాయమే మీరూ వెళ్ళబుచ్చారు. Thanks for the advice :)

Priya said...

మనలో మన మాట. మీరు నా మంచి తాతయ్య కనుక చెబుతున్నాను :)
నాకూ ఆశగానే ఉంది తాతయ్యా గారూ.. కాకపోతే మీ మనవడు చెప్పే మాటలకు భయం వేస్తోంది :(. అందుకే.. అనుభవమున్న పెద్దలు ఏం చెబుతారోనని చూస్తే ఇద్దరు, ముగ్గురు తప్ప అందరూ వద్దనే సలహా ఇస్తున్నారు!!! కథ మళ్ళీ మొదటికొచ్చింది. అందుకే ఇహ భగవంతుని పై భారం వేస్తున్నా.

Anonymous said...

ఎంతమందిని కనదలుచుకున్నారో తేల్చుకోండి ముందు :)'' కాలం లో సంపాదించిన బిడ్డలయినా ఉండాలి, లేదా సొమ్మయినా ఉండాలని'' సామెత. ఎప్పుడో అనుకుంటే ఆ తరవాత పరిస్థితులెలా ఉంటాయో తెలియదు.కనవలసినవారిని కనేస్తే ఆ తరవాత అంతా ..... బలవంతంగా ఏదీ ఆపద్దు, ఆపైన భగవంతుని దయ.

Priya said...

చక్కటి మాట చెప్పారు తాతయ్య గారూ. Thank you!
ఈ కామెంట్ ప్రత్యేకంగా చూయిస్తాను తనకు :)

రాజ్ కుమార్ said...

హ హా..హహ

Vidya Sagar said...

Mi iddari pani bhalae undi asalu...... Ni blogs making me feel good... Ikkadanae inni cheptae niku call chestae inkenni Kaburlu vastayo.... Manchi holiday chuskuni miku call chestha

Green Star said...

మా పెళ్ళయిన కొత్తలో కూడా ఇదే గొడవ, మేం ఒక అయిదేళ్ళు ఆగుదాం అనుకున్నాం, మేం ఇండియాలో లేము కాబట్టి ఇంత తాకిడి లేదు కాని, ఇంటికి ఫోన్ చేస్తే ఇదే గొడవ, ప్రతి ఏడూ ఇండియా వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు, క్లాసులతో చెవులు వాచిపోయేవి. ఇండియా వచ్చినప్పడు బంధువులు అందరు కలుస్తారు కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కో రోజు తలంటు. ఒక మూడేళ్ళు ఆగాక ఇవన్ని తట్టుకోలేక పిల్లలు కలిగితే కాని ఇండియా రానని మా గృహ లక్షి తెగేసే నాతొ చెపితే నాలుగేళ్ళు అయ్యాకా ఆ శుభ తరుణం వచ్చింది :)

పిల్లలు కలిగితే జీవితం మారిపోతుంది, కాబట్టి కెరీర్ లో కష్ట పడేది, లైఫ్ ఎంజాయ్ చేసేది, ఏవైనా చూడాలనుకుంటే ట్రావెల్ చేసేది లాంటివన్నీ ఇప్పుడే చేసెయ్యండి. ఇద్దరు పిల్లలు ప్లాన్ చేసుకున్నమనుకోండి ఎంత లేదన్న 6-8 ఇయర్స్ బ్లాక్ అయిపోతాము.

ఇక చివరికి, ఎవరి పరసనల్ ప్రేఫరేన్స్ వారిది. మీకు ఎలా అనిపిస్తే అలా ప్లాన్ చేసుకోండి. Good luck.

Priya said...

:) thanks రా. మేమే అనుకుంటూ ఉన్నాం "ఈ సాగర్ గాడు ఏమైపోయాడో.. మాట్లాడి చాలా రోజులు అయిపోతోంది ఓసారి ఫోన్ చేయాలి" అని. కానీ మీరు చాలా బిజీ కద సార్.. అందుకే చేయలేదు. తమరి ఫొటోస్ చూసి బెంగ తీర్చుకున్నాం :)

Priya said...

:)

Priya said...

చాలా చాలా థాంక్స్ చంద్రశేఖర్ గారూ మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మీరిచ్చిన సలహా కూడా బావుంది. Thank you once again :)

అనామిక said...

నేను పోస్ట్ చదివేసి, దీనికి మనమేం కామెంట్ పెడతాంలే అని క్లోజ్ చెయ్యబోయా, కామెంట్ బాక్స్ పైన మీ statement చూసి కామెంట్ రాసేసా..అయినా పైన Green star గారు చెప్పింది బావుంది కదా ..

Priya said...

హహ్హహ! Sorry for the late reply, and thanks for the comment అనామిక గారు. కదా.. గ్రీన్ స్టార్ గారి కామెంట్ నాక్కూడా చాలా యూజ్ఫుల్ గా అనిపించిందండీ.

"ఏం రాస్తాంలే.." అనిపించినా, నా స్టేట్మెంట్ ని గౌరవించి కామెంట్ చేసినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతలు :) :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, February 18, 2014

ఏమ్మా.. ఏదైనా విశేషమా??

(ఈ పోస్ట్ పెళ్ళైన వారికి మాత్రమే)

ఈ 2 నెలల్లో ఇప్పటికి ఈ ప్రశ్న ఎన్నిసార్లు విన్నానో! ముందు సిగ్గేసింది, తరువాత తమాషాగా అనిపించిది, ఆ తరువాత విసుగొచ్చింది, ఇప్పుడు కోపమొస్తోంది! కనబడితే చాలు "ఏమ్మా.. ఏదైనా విశేషమా??" అని అడుగుతున్నారు.

డిసెంబరు నెలలో అక్కావాళ్ళింటికి వెళ్లి, ప్రయాణం చేసి ఉండడంతో అలసిపోయి అలా నడుం వాల్చాను. ఈ లోపు వాళ్ళ అత్తగారు వచ్చారు "ఏమ్మా.. ఏదైనా విశేషమా?" అన్నారు. నేను లేస్తూ.. "అబ్బే బాబుగాడు నడిచేస్తున్నాడని అక్క చెబితేనూ చూసి వెళదామని వచ్చానండీ" అన్నాను. "అది సర్లేమ్మా. నీరసంగా కనబడుతున్నావే అనడుగుతున్నాను" అన్నారు. నాకు ఆ ప్రశ్నలోని గూడార్ధం తెలియక చాలా మాములుగా "ఆ.. మొన్న జ్వరమొచ్చినప్పటి నుండీ కాస్త నీరసంగానే ఉంటోందండీ. అందునా ప్రయాణం చేసి వచ్చానేమో కాస్త తలనొప్పిగా ఉంది" చెప్పాను. "మరింకేవమ్మా? అదృష్టవంతురాలివే! స్వీట్లు ఎప్పుడు పంచిపెడుతున్నారు?" అని, వెలిగిపోతున్న మొహంతో నా పక్కకొచ్చి కూర్చొని నా చేతులు నిరిమారు. "ఇదేం ఖర్మరా బాబు! బాలేదంటే సంతోషపడిపోతూ స్వీట్లు పంచమంటారేవిటీ? పైగా అదృష్టవంతురాలినట!? నాకు నీ మీద స్పెషల్ అభిమానం ప్రియా అంటుంటారుగా.. ఇదే కాబోలు" అనుకుంటూ ఓ వింత ఎక్ష్ప్రెషన్ తో నోరెళ్ళబెట్టుకుని నేను చూస్తుంటే, మా అక్క కంగారుపడిపోతూ "అబ్బే.. అదేం లేదత్తయ్యా. దానికి వట్టినే కాస్త తలనొప్పని పడుకుందంతే" అని నా చెయ్యి వాళ్లత్తగారి చేతుల నుండి విడిపించి, "నువ్వు లేవవే. వెళ్లి కాళ్ళూ చేతులూ కడుక్కుని రా భోంచేద్దువ్" అంటూ బయటకు తరిమేసింది.

భోజనాలూ అవీ అయ్యాక, నిదానంగా చెప్పింది. ఆవిడ ఏ విశేషం గురించి అడిగారో. నాకు అర్ధమై చస్తే ఒట్టు. బాలేకపోవడానికి దీనికీ సంబంధమేంటో తెలియక తికమక పడి, అక్కని అడిగినా దాని సమాధానాలు నాకెలాగూ అర్ధంకావని లైట్ తీసుకున్నాను. అది మొదలు తెలిసిన వాళ్ళూ, తెలియని వాళ్ళూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఈ ప్రశ్న వేస్తూ చావగొట్టేస్తున్నారు. నీరసంగా కనిపించినా విశేషమే, ఫ్రెష్ గా కనిపించినా విశేషమే! మొన్న ఎందుకో మూడ్ బావుండి చక్కగా కొత్త కాటన్ చీర కట్టుకుని, ముందు రోజు మాల కట్టుకున్న జాజుల మాల తల్లో తురుముకున్నాను. అంత రెడీ అయ్యాక బయటకు వెళ్ళకపోతే ఎలా మరీ? అందుకే, పక్కన కాయగూరల కొట్టుకెళ్ళి ఆకుకూరేమైనా తెచ్చుకుందామని బయలుదేరాను. వచ్చేప్పుడు భరత్ అడిగాడని గుడ్లు కూడా కొన్నాను. నాకసలే కుదురెక్కువా.. ఎక్కడ పగులుతాయోనని నిదానంగా నడుచుకుంటూ వచ్చి గేట్ తీశాను. ఇంతలో పక్కింటి ఆంటీ పలకరించారు చీర బావుందంటూ. నవ్వుతూ థాంక్స్ చెప్తున్నానూ.. అంతలోనే ఆవిడ "చాలా కళగా కనబడుతున్నావు. ఏవైనా విశేషమా ఏంటమ్మాయ్?" అనేసారు. బలవంతాన పెదాల మీది చిరునవ్వు చెరగనీయకుండా, "అదేం లేదాంటీ. మొన్ననేగా పెళ్లైంది.. అప్పుడేనా? సరే వెళ్ళొస్తాను" అని గబగబా కదిలాను. ఆవిడ వదిలితేనా?? "ఏం మొన్నమ్మాయ్? మీ పెళ్లై మూడు నెలలు అయిపోవడంలేదా? ఇంకా లేకపోవడం ఏంటీ? త్వరగా కనేయండి. నేనెందుకు చెప్తున్నానంటే..... ......... ................" అంటూ పావుగంట వాయించేశారు!

అది బయటి వాళ్ళగోల. మా అత్తగారైతే మొన్న సంక్రాంతి పండుగ నుండి పట్టుకున్నారు. "వద్దనుకుని మందులేమైనా మింగుతున్నావా అమ్మాయ్? ఇదిగో అలాటివేం చేయకండి చెప్తున్నాను. ముందు వద్దు అనుకున్నారంటే తరువాత కావాలన్నా పుట్టరు. .... ... .. .. ......." అంటూ రోజుకోసారి క్లాసులు తీసుకుంటున్నారు. అక్కడికీ సిగ్గుని పక్కన పెట్టి, "అయ్యో అలాటిదేం లేదు అత్తయ్యా. దేవుడు కనికరించొద్దూ" అన్నాను కూడాను. అయినా విననిదే! పై పెచ్చు "నాకసలే ఒంట్లో బావుండడం లేదమ్మాయ్. మనవరాలు పుడితే దాన్ని చూసి సంతోషంగా ఈ నాలుగు రోజులూ గడుపుదామనీ అంతే" అంటూ 80 ఏళ్ళ ముసలావిడలా బాధపడుతున్నారు. ఆవిడని సముదాయించేలోపు నా తల ప్రాణం తోకకొచ్చేస్తోంది. ఏదో పెళ్లై పద్నాలుగేళ్ళైనా పిల్లలు కలగనట్లు వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ నన్నూ లాగుతున్నారు.

దీనికి కొసరుమెరుపు "అప్పుడే మనకు పిల్లలెందుకు? ఇంకాస్త కెరీర్లో సెటిల్ అయ్యాక చూసుకుందాం. ఈ బ్యాంకు ఉద్యోగాలతో ఎక్కడ వేగేది అస్తమాను ట్రాన్స్ఫర్స్ తో? వాళ్ళు కబుర్లు చెప్తారు కానీ కన్నాక వచ్చి ఉండి చూసుకోలేరుగా.. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకున్నాయి. నేనూ ఆఫీసు కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయలేవ్. పిల్లల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. మీ అక్క అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంది కనుక సరిపోతోంది" అంటూ చల్లగా అయినా నిక్కచ్చిగా భరత్ చెప్పడం.

మీ లైఫ్ లో ఇలాటి పరిస్థితి ఎదురైందా? మీరేమంటారు? అనుభవముంటే తోడపుట్టిన దాన్నో, స్నేహితురాలినో అనుకుని కాస్త మంచి సలహాలివ్వండి.

20 comments:

 1. Replies
  1. "మీరే తేల్చుకోవలసిన విషయం ఇది" అంటారు? సరే.. .. :)
   ఇంతకూ రూప గారు ఎక్కడండీ?

   Delete
 2. అమ్మాయ్ ప్రియా వాళ్ళ మాటలు అస్సలు వినకు. పిల్లలు పుట్టాక ప్రియ ఉండదు. ఫలానా వాళ్ళ అమ్మే ఉంటుంది. ముందు లైఫ్ ఎంజాయ్ చెయ్యండి.

  ReplyDelete
  Replies
  1. జ్యోతిర్మయి గారూ.. నా బ్లాగ్ కి ఘనస్వాగతమండీ :)
   అడగ్గానే స్పందించి సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు :)

   Delete
 3. Anonymous19/2/14

  Priya,

  Bharath cheppindi chala correct. Ye vishayam ayina lothu thelusukoni digatame machidi. Ayina ippude kada pellayyindi appude pillalenti. Pilllalu anedi chala pedha responsibility. Manaku okka roju break theesukundaam anna veelu vundadu. So mundu decide chesukune mundu okatikli padi saarlu aalochinchi plan chesukunte manchidi ani naa salaha. cheppe vallu chepthaaru kaani vundi evvaru cheyyaru. entha amma vallu chusukunna konni nelale, but its a life long responsibility.

  ReplyDelete
  Replies
  1. True!
   భరత్ అభిప్రాయమే మీరూ వెళ్ళబుచ్చారు. Thanks for the advice :)

   Delete
 4. Anonymous19/2/14

  పెళ్ళయిన తరవాత పెద్దాళ్ళు అడిగే ప్రశ్న ఇదే! ఆ పనేదో తొందరగా పూర్తిచేసేయకూడదూ!!! :)

  ReplyDelete
  Replies
  1. మనలో మన మాట. మీరు నా మంచి తాతయ్య కనుక చెబుతున్నాను :)
   నాకూ ఆశగానే ఉంది తాతయ్యా గారూ.. కాకపోతే మీ మనవడు చెప్పే మాటలకు భయం వేస్తోంది :(. అందుకే.. అనుభవమున్న పెద్దలు ఏం చెబుతారోనని చూస్తే ఇద్దరు, ముగ్గురు తప్ప అందరూ వద్దనే సలహా ఇస్తున్నారు!!! కథ మళ్ళీ మొదటికొచ్చింది. అందుకే ఇహ భగవంతుని పై భారం వేస్తున్నా.

   Delete
  2. Anonymous19/2/14

   ఎంతమందిని కనదలుచుకున్నారో తేల్చుకోండి ముందు :)'' కాలం లో సంపాదించిన బిడ్డలయినా ఉండాలి, లేదా సొమ్మయినా ఉండాలని'' సామెత. ఎప్పుడో అనుకుంటే ఆ తరవాత పరిస్థితులెలా ఉంటాయో తెలియదు.కనవలసినవారిని కనేస్తే ఆ తరవాత అంతా ..... బలవంతంగా ఏదీ ఆపద్దు, ఆపైన భగవంతుని దయ.

   Delete
  3. చక్కటి మాట చెప్పారు తాతయ్య గారూ. Thank you!
   ఈ కామెంట్ ప్రత్యేకంగా చూయిస్తాను తనకు :)

   Delete
 5. Mi iddari pani bhalae undi asalu...... Ni blogs making me feel good... Ikkadanae inni cheptae niku call chestae inkenni Kaburlu vastayo.... Manchi holiday chuskuni miku call chestha

  ReplyDelete
  Replies
  1. :) thanks రా. మేమే అనుకుంటూ ఉన్నాం "ఈ సాగర్ గాడు ఏమైపోయాడో.. మాట్లాడి చాలా రోజులు అయిపోతోంది ఓసారి ఫోన్ చేయాలి" అని. కానీ మీరు చాలా బిజీ కద సార్.. అందుకే చేయలేదు. తమరి ఫొటోస్ చూసి బెంగ తీర్చుకున్నాం :)

   Delete
 6. మా పెళ్ళయిన కొత్తలో కూడా ఇదే గొడవ, మేం ఒక అయిదేళ్ళు ఆగుదాం అనుకున్నాం, మేం ఇండియాలో లేము కాబట్టి ఇంత తాకిడి లేదు కాని, ఇంటికి ఫోన్ చేస్తే ఇదే గొడవ, ప్రతి ఏడూ ఇండియా వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు, క్లాసులతో చెవులు వాచిపోయేవి. ఇండియా వచ్చినప్పడు బంధువులు అందరు కలుస్తారు కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కో రోజు తలంటు. ఒక మూడేళ్ళు ఆగాక ఇవన్ని తట్టుకోలేక పిల్లలు కలిగితే కాని ఇండియా రానని మా గృహ లక్షి తెగేసే నాతొ చెపితే నాలుగేళ్ళు అయ్యాకా ఆ శుభ తరుణం వచ్చింది :)

  పిల్లలు కలిగితే జీవితం మారిపోతుంది, కాబట్టి కెరీర్ లో కష్ట పడేది, లైఫ్ ఎంజాయ్ చేసేది, ఏవైనా చూడాలనుకుంటే ట్రావెల్ చేసేది లాంటివన్నీ ఇప్పుడే చేసెయ్యండి. ఇద్దరు పిల్లలు ప్లాన్ చేసుకున్నమనుకోండి ఎంత లేదన్న 6-8 ఇయర్స్ బ్లాక్ అయిపోతాము.

  ఇక చివరికి, ఎవరి పరసనల్ ప్రేఫరేన్స్ వారిది. మీకు ఎలా అనిపిస్తే అలా ప్లాన్ చేసుకోండి. Good luck.

  ReplyDelete
  Replies
  1. చాలా చాలా థాంక్స్ చంద్రశేఖర్ గారూ మీ అనుభవాన్ని పంచుకున్నందుకు. మీరిచ్చిన సలహా కూడా బావుంది. Thank you once again :)

   Delete
 7. నేను పోస్ట్ చదివేసి, దీనికి మనమేం కామెంట్ పెడతాంలే అని క్లోజ్ చెయ్యబోయా, కామెంట్ బాక్స్ పైన మీ statement చూసి కామెంట్ రాసేసా..అయినా పైన Green star గారు చెప్పింది బావుంది కదా ..

  ReplyDelete
  Replies
  1. హహ్హహ! Sorry for the late reply, and thanks for the comment అనామిక గారు. కదా.. గ్రీన్ స్టార్ గారి కామెంట్ నాక్కూడా చాలా యూజ్ఫుల్ గా అనిపించిందండీ.