Friday, September 5, 2014

వెళ్లొస్తానే చెన్నై..!!

హ్మ్మ్! చెన్నై ని విడిచి వెళ్ళాలన్న ఆలోచన కూడా నాకెంత భారంగా, బాధగా ఉందో..! అప్పుడపుడూ ఓ నాలుగు రోజులకు అత్తవారింటికి ప్రయాణమైతేనే మనసు బిక్క మొహం వేస్తుంది. సెంట్రల్ లో ట్రైన్ ఎక్కి ఎక్కగానే బెంగ మొదలవుతుంది! అలాటిది ఇప్పుడు చుట్టం చూపుకు తప్ప ఇక్కడకు రావడం పెద్దగా జరగదన్న నిజం మరీ చేదుగా ఉంది.

ఎన్నెన్ని జ్ఞాపకాలు ఈ ఊరితో? అమ్మ ఒడిలో ఉన్నట్లే ఉంటుంది ఇక్కడ నాకు. నడక నేర్వడంతో మొదలు, నేటి వరకూ జీవితమంతా (మధ్యలో రెండు మూడేళ్ళు మినహా) ఇక్కడే గడిచింది. అసలు మా ఇంటిని వదిలి మరో ఏరియాకి వచ్చినందుకే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది! ఇహ ఇపుడు ఊరే వదిలి వెళ్ళడం అంటే, మూలిగే పిల్లి మీద పేద్ద పనసకాయ పడినట్లుంది.

"ఇకపై రోజూ బీచ్ కి వెళ్లి లేచి పడే అలలను చూస్తూ.. ఇళయరాజా సంగీతం కంటే శ్రావ్యంగా వినిపించే దాని ఊసులు వింటూ ప్రపంచాన్ని మరచిపోవడం కుదర్దు కదా? ఒంటరిగా నడిచినా ఏదో ప్రాణస్నేహితురాలితో నడుస్తున్నట్లనిపించే ఈ వీధులని విడిచి వెళ్లక తప్పదు కదా?" అని బాధపడిపోయాను అప్పుడు. అయినా, "ఏముందిలే.. అరగంట ప్రయాణం. అనుకున్నపుడల్లా చూసి వెళ్ళొచ్చు అని తమాయించుకున్నాను. ఇక్కడకు వచ్చాక నాకు ఏర్పడిన తియ్యని అనుబంధాలు ఇప్పుడు నా భారాన్ని మరింత పెంచుతున్నాయి.

శాన్వి, విజ్జి అక్క, లక్కీ. వీళ్ళ తోడే ప్రపంచం అయిపోయింది ఈ మధ్య. 5. 30 కి లేచి కింద ఉంటున్న విజ్జక్క కి ఫోన్ చేసి తననూ లేపి, ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్ళడం, వచ్చాక గబగబా స్నానం అదీ ముగించుకుని వంట చేసి భరత్ ని ఆఫీస్ కి పంపేసి లక్కీ గాడిని ఇంటికి తెచ్చుకోవడం. వాడికి పాలు పట్టే సమయానికి శాన్వి స్కూల్ నుండి వచ్చేస్తుంది. ఆ తరువాత 'ఇది జరుగుతుంది' అని చెప్పలేం. దాని మూడ్ ని బట్టి! అప్పటి నుండి రాత్రి వరకూ అన్నం, నీళ్ళు, నిద్రా అన్నీ నాతోనే. ఇక ఆటలు, పాటలు, కథలు, కబుర్లూ సరేసరి. మధ్య మధ్యలో నేను పని చేసుకుంటుంటే తన చిన్ని చిన్ని చేతులతో నాకు సాయం చేస్తుంటుంది. మొదట్లో భరత్ ఆఫీసు నుండి ఇంట్లోకి రావడమే ఇది వాళ్ళింటికి పరుగుపెట్టేదనుకోండీ... ఈ మధ్య తన బొజ్జ మీద పడుకుని కబుర్లు చెప్పుకునేంత క్లోజ్ అయిపోయారు!

వాళ్ళమ్మ, అదే.. విజ్జక్క అయితే "నాకు ఓ కూతురు ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నాను. నాకు తను కావాలంటే నిన్ను దత్తత చేసుకోవాలి కాబోలు" అని నవ్వుతుంది. ఆమె మైండ్ సెట్ అచ్చూ నాలానే ఉండడంతో చాలా కొద్ది సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నాకు.

ఇప్పటికి మీకు శాన్వి, విజ్జక్క ల గురించి క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు లక్కీ గాడి గురించి చెప్తాను. వాడు మరెవరో కాదూ.. గీతక్క రెండో కొడుకు. మొన్న 12కి మూడో నెల వచ్చింది. వాళ్ళ పెద్దబాయి ప్రీతం కి తన తమ్ముడిని ఆక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉండి, చిన్నాణ్ణి పట్టుకుని కొట్టడం, గిల్లడం, పీక నొక్కేయడం లాటివి చేస్తున్నాడు. ఈ గోల తప్పించడానికి గీతక్క లక్కీ గాడికి పాలు పెట్టేసి నాకిచ్చేస్తుంది.

అలా సడెన్ గా నా లైఫ్ చాలా కలర్ఫుల్ గా మారిపోయింది. ఎంతగా అంటే, మరీ.. దేశ భక్తులెవరూ నా మీద గొడవకు రాకూడదు మరి? సరేనంటున్నారా? అయితే ఒకే :). నిజానికి చిన్నప్పటి నుండి మొన్న ఆగస్టు పదిహేను వరకూ ఆ రోజు సెలవు అన్న ఆనందం తప్ప ఇంకేమీ స్పెషల్ కాదండి నాకు. కానీ, ఈ ఏడాది నాకు ఆ రోజు ఎంత స్పెషల్ గా అనిపించిందంటే.. ప్రతి రోజూ ఆగస్టు పదిహేనయితే ఎంత బావుణ్నో అనిపించింది. ఎదుకంటే... మీరే చూడండి.హహ్హహ్హః! జైహింద్ చెప్పమన్నందుకు వాడి ఏడుపు 
ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని కత్తి పట్టుకుందే.. తనే నా డార్లింగ్! శాన్వి ప్రియ!!
చూశారా పిల్లలంతా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో? అబ్బా.. వాళ్ళ చేష్టలూ, కబుర్లూ వింటుంటే అసలు టైమే తెలియలేదు. I was completely lost.

లక్కీ గాడి గురించి చెప్పాలంటే మాటలు రావు నాకు. 'వాడు నా కొడుకే.. అప్పుడపుడూ గీతక్క తీసుకువెళుతుంది అంతే' అనిపిస్తుంటుంది :-P. వాడి ఉంగా ఉంగా కబుర్లూ, ఊ రాగాలతో నన్ను నేనే మర్చిపోతాను. ఎలా అంటే.. ఇలా!

 రోజూ మధ్యాహ్నం ఇదే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో.  లక్కీ గాడిని నిద్రపుచ్చేసి శాన్వీ నేనూ ఆడుకుంటాం. నేను ఎక్కువసేపు వాడితో కబుర్లాడితే దానికి కోపం వస్తుంది. అంతెందుకూ? మొన్న అక్కావాళ్ళు ఇంటికొచ్చినపుడు నేను అభీ గాణ్ణి ఎత్తుకున్నానని శాన్వీ ఎంత అలిగిందో నా మీద!!

పుట్టింట్లో ఉన్నపుడు చినుకులు మొదలవగానే సైకిల్ వేసుకుని బీచ్ కి వెళ్ళడం, ఇక్కడకు వచ్చాక ట్యాంక్ ఎక్కి కూర్చోవడం అలవాటు. ఈ మధ్యైతే ఇదిగో.. ఇలా. తను నాకు అదేంత దూరంలోనే ఉన్నా, 'అయ్యో పట్టుకోలేకపోతున్నా.. చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నావ్.. అక్క పరిగెట్టలేకపోతోంది. ప్లీజ్ ఆగు' అని తనని బ్రతిమాలుకోవడం, దానికి నచ్చినపుడు దొరకడం. ఈలోపు నేను పట్టుకుంటే అది నా మీద అలిగి పోట్లాడడం. హహ్హహా!!! 

వర్షం కంటే తనతో ఆటలు నచ్చాయి నాకు. ఇందుకు విజ్జక్క కి థాంక్స్ చెప్పుకోవాలి. "జలుబుదేముందిలే.. వస్తే ఓ వారంలో తగ్గిపోతుంది. కానీ ఈ సంతోషం దానికి నేనేవిధంగా ఇవ్వగలను? రోజులు మళ్ళీ తిరిగి రావుగా? Let her enjoy" అంటుంది :)

గీతక్క, నేను, విజ్జి అక్క 
భరత్ కి ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అవడం వలన వీళ్ళందరికీ దూరంగా వెళ్ళాల్సి వస్తోంది. అందుకు నాకు చాలా బాధగా ఉన్నా, అక్కడికి వెళ్ళాక నా జీవితంలోకి రాబోయే కొత్త స్నేహితులను తలుచుకుంటే ఉత్సాహంగా ఉంది. ఇదే కదా జీవితం?! లైఫే ఒక జర్నీ అయినపుడు ఒకే చోట ఆగిపోవాలనుకుంటే ఎలా..?? అలా అనుకుని పట్టిబట్టి మా ఇంట్లోనే ఉండిపోతే ఈ ఆనందాన్నంతా మిస్ అయ్యేదాన్ని కాదూ?? 

అందుకే, "వెళ్ళడం నీకు ఇష్టమేనా? లేదంటే వద్దని ఆఫీస్ లో చెప్పేస్తాను" అని భరత్ అన్నపుడు.. "ఇష్టమే.. వెళదాం. అత్తయ్య వాళ్లకు దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది" అని చెప్పాను. 

హూo.. వెళ్లొస్తానే చెన్నై..!!

5 comments:

sarma said...

నువ్వు ఎక్కడున్నా పిల్లా పాపలతో కులాసాగా ఉండాలని కోరుతూ, ఉంటానూ!

nagarani yerra said...

Welcome to andhra.

Priya said...

అందుకు చాలా కృతజ్ఞతలు తాతయ్య గారూ. కానీ, 'ఉంటాను' అంటూ వీడ్కోలు మాత్రం చెప్పకండి. మీ బ్లాగ్ మూసివేసినప్పటికీ మీతో టచ్ లో ఉండేందుకు (మీకు అభ్యంతరం లేకపోతే) దయచేసి మీ ఇమెయిల్ అడ్రెస్స్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఇవ్వగలరు.

Priya said...

Thank you, Nagarani gaaru :)

David Raj said...

:)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

 1. నువ్వు ఎక్కడున్నా పిల్లా పాపలతో కులాసాగా ఉండాలని కోరుతూ, ఉంటానూ!

  ReplyDelete
  Replies
  1. అందుకు చాలా కృతజ్ఞతలు తాతయ్య గారూ. కానీ, 'ఉంటాను' అంటూ వీడ్కోలు మాత్రం చెప్పకండి. మీ బ్లాగ్ మూసివేసినప్పటికీ మీతో టచ్ లో ఉండేందుకు (మీకు అభ్యంతరం లేకపోతే) దయచేసి మీ ఇమెయిల్ అడ్రెస్స్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఇవ్వగలరు.

   Delete
 2. Replies
  1. Thank you, Nagarani gaaru :)