Tuesday, September 23, 2014

దా బావా.. పోదాము!!

మొన్నొక రోజు పెయింటింగ్ చేసినంత శ్రద్ధగా నేను గుమ్మడి పులుసు చేసుకుంటోంటే లోపలికి వచ్చారు బావా మరదళ్ళిద్దరూ. రావడమే చెరో బీన్ బాగ్ లో పక్కపక్కన సెటిల్ అయ్యారు.

"లల్లీ.. రా రా రా" "ఏంటి ప్రీతం ఈ వేళ స్కూల్ కి వెళ్ళలేదా?" పలకరించాను ఇద్దర్నీ.

"బావ పోలే. చూల్ కి. ఆతాడుతుంతునాం" చేతిలో ఉన్న బొమ్మను చూపిస్తూ చెప్పింది లల్లి.

"ఊహు. మా మమ్మీ... .. నన్నందీ స్కూల్ కి పొవొద్దూ, నీకు జొరంగుందని"  "ప్రియక్కా.. నీకు తెల్సునా నాకెంత జొరముందో... .. అస్సలు బుడ్డిదానికైతే చెయ్ కాలిపోయింది!" గొప్పగా చెప్పాడు ప్రీతం.

"జ్వరమా? ఏదీ చూడని.." వాడి నుదుటి మీద చెయ్యి పెట్టాను.   

"పీక్కా (ప్రియక్కా).. ఏంతి మా బావ చే పత్తునావూ? వొదియ్" ప్రీతంగాడి వైపు తిరిగి, "పేద్ద. దా బావా పోదాము" అంది ఉడుక్కుంటూ.

నవ్వొచ్చింది నాకు. "మీ బావ చెయ్యి నేనెక్కడ పట్టుకున్నానే? జ్వరమెంతుందో చూద్దామని నుదుటి మీద చెయ్యి వేశాను. అయినా మరీ బావుంది. ఏం.. మీ బావని తాకితే మాసిపోతాడుటే?" నిష్టూరమాడాను.

"జలమా (జ్వరమా). ఆ చెప్పుతా" లేచి వాడి దగ్గరకెళ్ళి, జ్వరం చూసే పేరుతో వాడి కళ్ళు మూసి, "పీక్కా.. పోయే. జలమంతా పోయే" సినిమాల్లో ఆపరేషన్ సక్సెస్ అయినపుడు డాక్టర్ మొహం పెట్టినట్లు పెట్టింది.

"మ్మ్.. నిజమా??! ఇందాక నే చూసినపుడు ఉందిగా మరి?" ఆశ్చర్యంగా మొహం పెట్టాను.

మొహమంతా చిట్లించి "లే పీక్కా. చల్లుంతే (చల్లగా ఉంటేనూ అనన్నమాట :P). నువ్వు చే పెత్తు" ప్రీతం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నా టాబ్ తో ఆడుకుంటున్నాడు.

"నేను చూడను పో. ఇందాక పెట్టొద్దన్నావ్ గా?" అలిగినట్లు మూతి ముడిచాను.

దానికెంత కోపం వచ్చేసిందో! నావైపు చుర చురా చూసి "పేద్ద. దా బావా పోదాము" వాడేమో సబ్వే సర్ఫేస్ తో బిజీగా ఉన్నాడాయే.. ఇంకెక్కడ పట్టించుకునేది?

"అవునా..? సరే ప్రీతం. వెళ్ళిపొండి. అయితే బెల్లం నేనొక్కదాన్నే తినేస్తాను" పులుసులో వేయడానికని పెట్టిన బెల్లం చేతిలోకి తీసుకుంటూ అన్నాను.

కళ్ళింతింత చేసుకుని, తియ్యటి నవ్వుతో నా దగ్గరకొస్తూ "పీక్కా బత్తన్న (భరత్ అన్న) తెచ్చింద? ఎదీ పెత్తు" అడిగింది.

ఈలోపు ఓ బిస్కెట్ పాకెట్టూ, స్కెచ్ పెన్నూ పట్టుకుని లోపలి వస్తూనే "దీదీ.. I need a book" అంటూ లోపలికి వచ్చింది శాన్వి. దాన్ని చూడగానే ప్రీతం, చేతిలో ఉన్న టాబ్ ని పక్కన పెట్టేసి స్ట్రైట్ గా కూర్చున్నాడు. నేను ఊరిపి పీల్చుకున్నాను.  హమ్మయ్యా బ్రతికిపోయింది నా టాబ్, అని :-P.

శాన్వి వచ్చి ప్రీతం పక్కన కూర్చుంది. వెంటనే లల్లీ లేచి వచ్చి తను కూడా వాళ్ళిద్దరూ కూర్చున్న దాని మీదే ఎలాగో సర్దుకుంది. కూర్చోవడానికి ఓ బీన్ బాగ్ ఖాళీ అయినందుకు నేను హ్యాపీ :).

ప్రీతం తన జ్వరం కథను శాన్వికి వివరించాడు. దానికి తను "Oh! I also got fever so many times. But... I still went to school... you know? My mamma said, .. .. only..  bad children will sit at home on school days" గుక్క తిప్పుకోకుండా సీరియస్గా లెక్చర్ ఇచ్చేసింది.

పాపం ప్రీతంకి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. "నువ్వే బాడ్ గాళ్" అనేసి దాని చేతిలోని బిస్కెట్ పాకెట్ తీసుకుని తింటూ కూర్చున్నాడు. నేను నవ్వుకుంటూ కిచెన్ రూం లోకి వెళ్ళిపోయాను. ఏవో వాదనలు వినిపిస్తున్నాయి గానీ పట్టించుకోలేదు. ఓ ఐదు నిముషాలకు శాన్వి ఏడుపు మొహంతో వచ్చి నా నడుముకి చుట్టుకుని "దీదీ..  Preetham.. ..  is eating ALL .......  my biscuits" అంది. "Ohh! It's okay baby. He is your friend, and sharing is a good habit right? Don't worry. I'll give you another packet" అని చెప్పాను. దానికి తను "Lalli baby took my sketch pen. And shez not giving me......  I want it for a minute దీదీ. Sharing is a good habit హేనా? You come and tell her" అంటూ నన్ను లాక్కెళ్ళింది.

నాకు తెలుసు ఆ కంచు నుండి ఒక వస్తువు తీసుకోవడం అసాధ్యమని :-P. కానీ శాన్వి తృప్తి కోసం వెళ్ళి లల్లిని బుజ్జగించి బ్రతిమాలాను. "యే... నాతి. నాతి" అంటూ చెయ్యి వెనుక దాచేసుకుంది. శాన్వి కి తెలుగు రాకపోయినా, అక్కడేం జరుగుతోందో అర్ధమయింది. చాల కోపం వచ్చేసింది దానికి. "దీదీ... you are saying please and still shez not giving na? Okay" అంటూ నడుం మీద చెయ్యి పెట్టుకుని కోపంగా, "Lalli baby, that pen is mine. Give me" అంది. లల్లి తన వైపు కూడా చూడలేదు. పాపం ఇది ఓ నిముషం చూసి ప్రీతం వైపు తిరిగి "Preetham, enough. That's my biscuit packet. Give it to me" అంది. వాడసలు ఏమీ వినబడనట్లే తింటూ తన పని తను చూసుకుంటున్నాడు. పాపం బేలగా నావైపు చూసింది. నేను నిస్సహాయంగా చూస్తూనే "It's okay. I'll get you another one" అంటూ దగ్గరకు తీసుకున్నాను. తను ఉక్రోషాన్ని ఆపుకోలేక "Get out. Both of you. Bad children.... I will not play with you again. Get out" అని అరిచింది. వెంటనే నా చేతిని తన నోటికి అడ్డు పెడుతూ "No, Saanvi. You shouldn't use such words. Say sorry to them" అన్నాను.

అప్పటి వరకూ ఏమీ పట్టనట్లు ఉన్న లల్లీకి కోపం వచ్చేసింది! చుర చురా లేచి "దా బావా పోదాము. పేద్ద. దా బావా" అంటూ ప్రీతం ని చైర్లోంచి లాగేసింది. వాడేమో కదలడంలేదు. "ఏమైంది? వెళ్ళిపోవాల్నా? శాన్వి అందా" అని అడుగుతున్నాడు.

ఇంతలో శాన్వి "But they took off my things and not giving me back.... దీదీ. They are...  bad children" అంది. "Yeah.. but its not that they are bad, baby. Sometimes small children will behave like that" అని సర్ది చెప్పబోయాను. తను వెంటనే "I am also small" అంది. నాకేం చెప్పాలో తోచలేదు. అంతలో మళ్ళీ తనే "It's okay" అని, తల దించుకుని "sorry" అంది.

లల్లి ఒక్కక్షణం శాన్వి వైపు చూసింది. మళ్ళీ వెంటనే "దా బావా పోదాము" అంటూ వాడిని లాక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది!

మర్చిపోయిన బొమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చినపుడు తీశాను ఈ ఫోటోని

హూం!!! Of-course, మరుసటి రోజు ముగ్గురూ మళ్ళీ కలిసిపోయి ఆడుకున్నారనుకోండీ. అయినప్పటికీ.. ఆ ... హహ్హహహ్! No comments.

ఏవండోయ్.. నో కామెంట్స్ అన్నది నా అభిప్రాయం చెప్పలేక. మరేం పరవాలేదు..  మీరేమనుకున్నారో కాస్త చెప్పి వెళ్ళండి :)

13 comments:

Anonymous said...

Ina meeru entandi...Premayanam complete cheyyakunda evevoo rastharu...Hmmm :P

--Roopa

Anonymous said...

its nice :D రా బావా పొదాము.........:P

Vajra said...

రా బావా పొదాము....Ha ha..Awesome Post Priya Garu...
చిన్న పిల్లల చిన్నతనపు కబుర్లు , ముచ్చట్లు మరువలేని మధుర క్షణాలు...
Tnq for such a wonderful post.

Priya said...

Do you really like it to that extent?? Wow! I'm very glad.. thank you so much, Vajra గారు :) :)

Priya said...

హహ్హహ్హహ.. మొన్నటి ఇన్సిడెంట్ తరువాత ప్రేమాయణం రాయడానికి కాస్త ఆలోచిస్తున్నానండీ. కాస్త ఆగి రాస్తాను :)

Thanks for asking, రూప గారూ!

Priya said...

Thank you!!

నాగరాజ్ said...

అరమరికల్లేని పిల్లల మనస్తత్వాల్ని గమనిస్తే ఎంతో ముచ్చటేస్తుంది!
సరదాగా భలే రాశారు :)

Priya said...

చాన్నాళ్ళ తరువాత కనిపించారు అన్నయ్యా నా బ్లాగ్ లో :)

నిజమే.. thanks for the comment!

నవజీవన్ said...

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ..ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా! శ్రీ శ్రీ పసిపిల్లల మనస్తత్వాన్ని ఎక్కడ చూశాడోఎ గానీ... చాలా చక్కాగానే గమనించాడు. మీ టపా చూస్తే నాకెందుకో ఆ కవిత గుర్తుకొచ్చింది.. అలాగే ఆ చిన్న పిల్లల నిత్య జీవితాల్లోన్ని ఆ చిట్టి సంగతులను అంత ఓపికతో గమనించినందుకు మిమ్మలని కూడా మెచ్చుకోవాల్సిందే...

swarajya lakshmi mallampalli said...

ప్రియా, ఎమైపొయావురా, అసలు టపాలే వ్రాయటం లేదు.నేను రెగ్యులర్ గా నీ టపాలు చదువుతూఉండేదాన్ని. చాలా ఆసక్తిగా సాగుతున్న నీ ప్రేమాయణం చదువుతున్న మాకు ఇంత విరామం నచ్చలేదు. త్వరగా నీ ప్రేమయణన్ని పూర్తిచేయి.

swarajya lakshmi mallampalli said...

ప్రియా గారూ, బాగున్నారా? ఏమైనా ఇది బాగుందా? ఇన్ని రోజులా టపా వ్రాయడానికి. మీ ప్రేమాయణం తరువాతి భాగం చదవాలని మేమెంత ఎదురు చూస్తున్నామో. మీరింత టైం తీసికుంటే ఎలా?. మీ రచనా శైలి నచ్చి ఇన్ని రోజులూ చదువుతూ వచ్చాను. మీరేమో ముగించకుండా సస్పెన్సులో ఉంచారు. త్వరగా టపా వ్రాస్తారని ఆశిస్తాను.

Priya said...

నవజీవన్ గారూ, నా పోస్ట్ చూసి అంత చక్కని కవితను మీరు గుర్తుచేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you very much for the comment, and sorry for the late reply!

Priya said...

స్వరాజ్య లక్ష్మి గారూ.. ముందుగా మీకు కృతజ్ఞతలండీ.

మీ సెకండ్ కామెంట్ లోని పిలుపుకంటే మొదటి కామెంట్ లోని పిలుపే నచ్చింది నాకు! మీరు అంత అభిమానంగా పెట్టిన కామెంట్ ని చాలా ఆలశ్యంగా చూసి స్పందిస్తున్నాను. మరోలా అనుకోకండి. ఇటు రావడానికి వీలుపడలేదు. ఇకపై టైం తీసుకోను. త్వరలోనే ప్రేమాయణం పూర్తి చేస్తాను :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, September 23, 2014

దా బావా.. పోదాము!!

మొన్నొక రోజు పెయింటింగ్ చేసినంత శ్రద్ధగా నేను గుమ్మడి పులుసు చేసుకుంటోంటే లోపలికి వచ్చారు బావా మరదళ్ళిద్దరూ. రావడమే చెరో బీన్ బాగ్ లో పక్కపక్కన సెటిల్ అయ్యారు.

"లల్లీ.. రా రా రా" "ఏంటి ప్రీతం ఈ వేళ స్కూల్ కి వెళ్ళలేదా?" పలకరించాను ఇద్దర్నీ.

"బావ పోలే. చూల్ కి. ఆతాడుతుంతునాం" చేతిలో ఉన్న బొమ్మను చూపిస్తూ చెప్పింది లల్లి.

"ఊహు. మా మమ్మీ... .. నన్నందీ స్కూల్ కి పొవొద్దూ, నీకు జొరంగుందని"  "ప్రియక్కా.. నీకు తెల్సునా నాకెంత జొరముందో... .. అస్సలు బుడ్డిదానికైతే చెయ్ కాలిపోయింది!" గొప్పగా చెప్పాడు ప్రీతం.

"జ్వరమా? ఏదీ చూడని.." వాడి నుదుటి మీద చెయ్యి పెట్టాను.   

"పీక్కా (ప్రియక్కా).. ఏంతి మా బావ చే పత్తునావూ? వొదియ్" ప్రీతంగాడి వైపు తిరిగి, "పేద్ద. దా బావా పోదాము" అంది ఉడుక్కుంటూ.

నవ్వొచ్చింది నాకు. "మీ బావ చెయ్యి నేనెక్కడ పట్టుకున్నానే? జ్వరమెంతుందో చూద్దామని నుదుటి మీద చెయ్యి వేశాను. అయినా మరీ బావుంది. ఏం.. మీ బావని తాకితే మాసిపోతాడుటే?" నిష్టూరమాడాను.

"జలమా (జ్వరమా). ఆ చెప్పుతా" లేచి వాడి దగ్గరకెళ్ళి, జ్వరం చూసే పేరుతో వాడి కళ్ళు మూసి, "పీక్కా.. పోయే. జలమంతా పోయే" సినిమాల్లో ఆపరేషన్ సక్సెస్ అయినపుడు డాక్టర్ మొహం పెట్టినట్లు పెట్టింది.

"మ్మ్.. నిజమా??! ఇందాక నే చూసినపుడు ఉందిగా మరి?" ఆశ్చర్యంగా మొహం పెట్టాను.

మొహమంతా చిట్లించి "లే పీక్కా. చల్లుంతే (చల్లగా ఉంటేనూ అనన్నమాట :P). నువ్వు చే పెత్తు" ప్రీతం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నా టాబ్ తో ఆడుకుంటున్నాడు.

"నేను చూడను పో. ఇందాక పెట్టొద్దన్నావ్ గా?" అలిగినట్లు మూతి ముడిచాను.

దానికెంత కోపం వచ్చేసిందో! నావైపు చుర చురా చూసి "పేద్ద. దా బావా పోదాము" వాడేమో సబ్వే సర్ఫేస్ తో బిజీగా ఉన్నాడాయే.. ఇంకెక్కడ పట్టించుకునేది?

"అవునా..? సరే ప్రీతం. వెళ్ళిపొండి. అయితే బెల్లం నేనొక్కదాన్నే తినేస్తాను" పులుసులో వేయడానికని పెట్టిన బెల్లం చేతిలోకి తీసుకుంటూ అన్నాను.

కళ్ళింతింత చేసుకుని, తియ్యటి నవ్వుతో నా దగ్గరకొస్తూ "పీక్కా బత్తన్న (భరత్ అన్న) తెచ్చింద? ఎదీ పెత్తు" అడిగింది.

ఈలోపు ఓ బిస్కెట్ పాకెట్టూ, స్కెచ్ పెన్నూ పట్టుకుని లోపలి వస్తూనే "దీదీ.. I need a book" అంటూ లోపలికి వచ్చింది శాన్వి. దాన్ని చూడగానే ప్రీతం, చేతిలో ఉన్న టాబ్ ని పక్కన పెట్టేసి స్ట్రైట్ గా కూర్చున్నాడు. నేను ఊరిపి పీల్చుకున్నాను.  హమ్మయ్యా బ్రతికిపోయింది నా టాబ్, అని :-P.

శాన్వి వచ్చి ప్రీతం పక్కన కూర్చుంది. వెంటనే లల్లీ లేచి వచ్చి తను కూడా వాళ్ళిద్దరూ కూర్చున్న దాని మీదే ఎలాగో సర్దుకుంది. కూర్చోవడానికి ఓ బీన్ బాగ్ ఖాళీ అయినందుకు నేను హ్యాపీ :).

ప్రీతం తన జ్వరం కథను శాన్వికి వివరించాడు. దానికి తను "Oh! I also got fever so many times. But... I still went to school... you know? My mamma said, .. .. only..  bad children will sit at home on school days" గుక్క తిప్పుకోకుండా సీరియస్గా లెక్చర్ ఇచ్చేసింది.

పాపం ప్రీతంకి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. "నువ్వే బాడ్ గాళ్" అనేసి దాని చేతిలోని బిస్కెట్ పాకెట్ తీసుకుని తింటూ కూర్చున్నాడు. నేను నవ్వుకుంటూ కిచెన్ రూం లోకి వెళ్ళిపోయాను. ఏవో వాదనలు వినిపిస్తున్నాయి గానీ పట్టించుకోలేదు. ఓ ఐదు నిముషాలకు శాన్వి ఏడుపు మొహంతో వచ్చి నా నడుముకి చుట్టుకుని "దీదీ..  Preetham.. ..  is eating ALL .......  my biscuits" అంది. "Ohh! It's okay baby. He is your friend, and sharing is a good habit right? Don't worry. I'll give you another packet" అని చెప్పాను. దానికి తను "Lalli baby took my sketch pen. And shez not giving me......  I want it for a minute దీదీ. Sharing is a good habit హేనా? You come and tell her" అంటూ నన్ను లాక్కెళ్ళింది.

నాకు తెలుసు ఆ కంచు నుండి ఒక వస్తువు తీసుకోవడం అసాధ్యమని :-P. కానీ శాన్వి తృప్తి కోసం వెళ్ళి లల్లిని బుజ్జగించి బ్రతిమాలాను. "యే... నాతి. నాతి" అంటూ చెయ్యి వెనుక దాచేసుకుంది. శాన్వి కి తెలుగు రాకపోయినా, అక్కడేం జరుగుతోందో అర్ధమయింది. చాల కోపం వచ్చేసింది దానికి. "దీదీ... you are saying please and still shez not giving na? Okay" అంటూ నడుం మీద చెయ్యి పెట్టుకుని కోపంగా, "Lalli baby, that pen is mine. Give me" అంది. లల్లి తన వైపు కూడా చూడలేదు. పాపం ఇది ఓ నిముషం చూసి ప్రీతం వైపు తిరిగి "Preetham, enough. That's my biscuit packet. Give it to me" అంది. వాడసలు ఏమీ వినబడనట్లే తింటూ తన పని తను చూసుకుంటున్నాడు. పాపం బేలగా నావైపు చూసింది. నేను నిస్సహాయంగా చూస్తూనే "It's okay. I'll get you another one" అంటూ దగ్గరకు తీసుకున్నాను. తను ఉక్రోషాన్ని ఆపుకోలేక "Get out. Both of you. Bad children.... I will not play with you again. Get out" అని అరిచింది. వెంటనే నా చేతిని తన నోటికి అడ్డు పెడుతూ "No, Saanvi. You shouldn't use such words. Say sorry to them" అన్నాను.

అప్పటి వరకూ ఏమీ పట్టనట్లు ఉన్న లల్లీకి కోపం వచ్చేసింది! చుర చురా లేచి "దా బావా పోదాము. పేద్ద. దా బావా" అంటూ ప్రీతం ని చైర్లోంచి లాగేసింది. వాడేమో కదలడంలేదు. "ఏమైంది? వెళ్ళిపోవాల్నా? శాన్వి అందా" అని అడుగుతున్నాడు.

ఇంతలో శాన్వి "But they took off my things and not giving me back.... దీదీ. They are...  bad children" అంది. "Yeah.. but its not that they are bad, baby. Sometimes small children will behave like that" అని సర్ది చెప్పబోయాను. తను వెంటనే "I am also small" అంది. నాకేం చెప్పాలో తోచలేదు. అంతలో మళ్ళీ తనే "It's okay" అని, తల దించుకుని "sorry" అంది.

లల్లి ఒక్కక్షణం శాన్వి వైపు చూసింది. మళ్ళీ వెంటనే "దా బావా పోదాము" అంటూ వాడిని లాక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది!

మర్చిపోయిన బొమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చినపుడు తీశాను ఈ ఫోటోని

హూం!!! Of-course, మరుసటి రోజు ముగ్గురూ మళ్ళీ కలిసిపోయి ఆడుకున్నారనుకోండీ. అయినప్పటికీ.. ఆ ... హహ్హహహ్! No comments.

ఏవండోయ్.. నో కామెంట్స్ అన్నది నా అభిప్రాయం చెప్పలేక. మరేం పరవాలేదు..  మీరేమనుకున్నారో కాస్త చెప్పి వెళ్ళండి :)

13 comments:

 1. Anonymous23/9/14

  Ina meeru entandi...Premayanam complete cheyyakunda evevoo rastharu...Hmmm :P

  --Roopa

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హహ.. మొన్నటి ఇన్సిడెంట్ తరువాత ప్రేమాయణం రాయడానికి కాస్త ఆలోచిస్తున్నానండీ. కాస్త ఆగి రాస్తాను :)

   Thanks for asking, రూప గారూ!

   Delete
 2. Anonymous23/9/14

  its nice :D రా బావా పొదాము.........:P

  ReplyDelete
 3. రా బావా పొదాము....Ha ha..Awesome Post Priya Garu...
  చిన్న పిల్లల చిన్నతనపు కబుర్లు , ముచ్చట్లు మరువలేని మధుర క్షణాలు...
  Tnq for such a wonderful post.

  ReplyDelete
  Replies
  1. Do you really like it to that extent?? Wow! I'm very glad.. thank you so much, Vajra గారు :) :)

   Delete
 4. అరమరికల్లేని పిల్లల మనస్తత్వాల్ని గమనిస్తే ఎంతో ముచ్చటేస్తుంది!
  సరదాగా భలే రాశారు :)

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళ తరువాత కనిపించారు అన్నయ్యా నా బ్లాగ్ లో :)

   నిజమే.. thanks for the comment!

   Delete
 5. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ..ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే
  అవి మీకే అని ఆనందించే కూనల్లారా! శ్రీ శ్రీ పసిపిల్లల మనస్తత్వాన్ని ఎక్కడ చూశాడోఎ గానీ... చాలా చక్కాగానే గమనించాడు. మీ టపా చూస్తే నాకెందుకో ఆ కవిత గుర్తుకొచ్చింది.. అలాగే ఆ చిన్న పిల్లల నిత్య జీవితాల్లోన్ని ఆ చిట్టి సంగతులను అంత ఓపికతో గమనించినందుకు మిమ్మలని కూడా మెచ్చుకోవాల్సిందే...

  ReplyDelete
  Replies
  1. నవజీవన్ గారూ, నా పోస్ట్ చూసి అంత చక్కని కవితను మీరు గుర్తుచేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you very much for the comment, and sorry for the late reply!

   Delete
 6. ప్రియా, ఎమైపొయావురా, అసలు టపాలే వ్రాయటం లేదు.నేను రెగ్యులర్ గా నీ టపాలు చదువుతూఉండేదాన్ని. చాలా ఆసక్తిగా సాగుతున్న నీ ప్రేమాయణం చదువుతున్న మాకు ఇంత విరామం నచ్చలేదు. త్వరగా నీ ప్రేమయణన్ని పూర్తిచేయి.

  ReplyDelete
 7. ప్రియా గారూ, బాగున్నారా? ఏమైనా ఇది బాగుందా? ఇన్ని రోజులా టపా వ్రాయడానికి. మీ ప్రేమాయణం తరువాతి భాగం చదవాలని మేమెంత ఎదురు చూస్తున్నామో. మీరింత టైం తీసికుంటే ఎలా?. మీ రచనా శైలి నచ్చి ఇన్ని రోజులూ చదువుతూ వచ్చాను. మీరేమో ముగించకుండా సస్పెన్సులో ఉంచారు. త్వరగా టపా వ్రాస్తారని ఆశిస్తాను.

  ReplyDelete
  Replies
  1. స్వరాజ్య లక్ష్మి గారూ.. ముందుగా మీకు కృతజ్ఞతలండీ.