Friday, January 23, 2015

అమ్మా..Google image  

అమ్మా..  రోజులు గడిచేకొద్దీ రోజులో ఏదో ఒక సందర్భంలో నీ మాటలు గుర్తొస్తునే ఉన్నాయి.  

"అలా అందరికీ అంత చనువివ్వకూడదు ప్రియమ్మా.. మంచిది కాదు' అని నువ్వంటుంటే.. 'నేనెక్కడ చనువిచ్చాను?ఇందులో ఏముందీ?' అనుకున్నాను. బయటి వాళ్ళతో పళ్ళు కనబడేలా నవ్వుతూ మాట్లాడితే కోప్పడేదానివా.. 'అమ్మకు ఎవరితో మాట్లాడినా నచ్చదు. నవ్వుతూ మాట్లాడితే ఏమైంది?' అనిపించింది.  పని వాళ్ళ కబుర్లు వినడం గానీ, వాళ్లకు మేం కబుర్లు చెప్పడం గానీ చూస్తే ఆ రోజు క్లాస్ తప్పేదికాదు కదా.. 'పాపం. వాళ్ళూ మనుషులేగా.. మరీ మూగవాళ్ళలా మాట్లాడకుండా ఎలా ఉంటారు? అయినా ఇప్పుడు ఏం మాట్లాడేశానని కోప్పడుతోంది అమ్మ?' అని నొచ్చుకున్నాను. ఇక ఏ విశేషం లేకుండా ఎవరింట్లోనైనా భోంచేసినపుడు నువ్వు అరుస్తుంటే 'అంత ఆప్యాయంగా మొహమాటపెడుతుంటే ఎలా కాదంటాం? ఇది కూడా తప్పేనా? నేనేమైనా అడిగి పెట్టించుకున్నానా?' అనుకుని, ఈ మాటలు పైకి అంటే చంపేస్తావని నోరుమూసుకుని తిట్లు తినేదాన్ని. అక్క ఎలాగు అవేవీ చేయదు కనుక దానికి గొడవలేదు కానీ.. ఇలాటి విషయాల్లో నీ కాన్సంట్రేషన్ అంతా నా సొంతమై భలే ఇబ్బంది పడేదాన్నిలేమ్మా.     

అయినా అమ్మా.. నేనేం మాట్లాడకపోయినా నా మనసులోని మాటలన్నీ నీకు ఎలా తెలిసిపోయేవో?! ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది.  

"అమ్మకసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలీదు. కలివిడిగా ఉండదు అనుకుంటావు కదూ? నీ వయసులో ఉండగా నీకంటే ఎక్కువగా అందరితోనూ స్నేహం చేసేదాన్ని. అందరూ మనలా, మనం అనుకున్నట్లు ఉండరు ప్రియమ్మా. ఆడపిల్లయినా, మగపిల్లాడయినా ఎంతవరకూ మాట్లాడాలో అంత వరకూ మాట్లాడితేనే బావుంటుంది. 'అబ్బో! నేను భలే కలివిడిగా ఉన్నాను.. అందరూ నన్నెంత ప్రేమిస్తున్నారో' అనుకుంటున్నావేమో? పప్పులో కాలేసినట్లే! నువ్వు వాగినంతసేపూ బాగానే వింటారు. అదో కాలక్షేపం కాసేపు. నువ్వు వెళ్ళిపోయాక, 'పాపం వెర్రిది' అని వెకిలిగా నవ్వుకుంటారు. ఈ పనివాళ్ళతో పళ్ళికిలిస్తూ కబుర్లు చెప్తావూ..  వాళ్ళు నీ మాటలకు తోడు తలా, తోకా, ఓ రూపం ఇచ్చి వాళ్ళు పనిచేసే వేరే ఇళ్ళల్లో వాళ్ళ మెప్పు, కాలక్షేపం కోసం కథలు కథలుగా చెబుతారు. నీ అతి వాగుడు, బయటి వాళ్లకు నువ్విచ్చే చనువు వాళ్ళ ముందు నువ్వు చులకనవ్వడానికి తప్ప మరెందుకూ పనికిరాదు. ఇదిగో.. అడిగారు కదా అని ఎవరింట్లోనైనా ఏవైనా తిన్నావా.. మరుముఖ్యంగా, భోజనం చేశావా.. నీ పిలక వాళ్లకి దొరికినట్లే! జాగ్రత్త!! 'అమ్మా.. అందరూ అలాగే ఎందుకుంటారూ? ఒకరిద్దర్ని బట్టి అందర్నీ అలాగే అనుకుంటే ఎలా?' అంటావేమో? నూటికి 98 మంది అలాగే ఉంటారు. ఆ మిగిలిన ఇద్దరే నీకు తెలిసిన వాళ్ళని భ్రమపడొద్దు. నోటిని అదుపులో పెట్టుకుని ఆచి తూచి మాట్లాడాలి. అర్ధమవుతోందా? మొహామాటం వలన అన్నీ నష్టాలే. తరువాత బాధపడాల్సి వస్తుంది. వినబడుతోందా??  హూం! ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే.. ఏదో నా పిచ్చికొద్దీ వాగుతుంటాను .. ... " ఇలా విధవిధాలుగా వివిధ సందర్భాల్లో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా బుర్రకెక్కేది కాదు.

 కానీ అమ్మో! అమ్మా.. నువ్వు  చెప్పిన ప్రతీ మాటా ఎంతటి సత్యమో! కాస్త బాధాకరమైన అనుభవాల వల్లే జ్ఞానోదయం అయినా, అంటే ఇప్పటికీ  పూర్తిగా కాకపోయినా..  మొత్తానికి కాస్త తెలివి వచ్చినందుకు సంతోషంగా ఉంది.       

సారీ అమ్మా.. నేనప్పుడు అర్ధం చేసుకోలేకపోయాను. ఎంత విసిగించానో కదా నిన్ను? "ఒక్కముద్ద తింటేనే కదవే  బావుందో లేదో తెలిసేది? పిల్లలు తింటారు కదా అని కష్టపడి చేస్తే అసలు చూసే వద్దంటే ఎలా?" ఎన్నిసార్లు నిన్నిలా అరిపించానో కదా..? మాకు కావలసినవన్నీ వేళ వేళకి అమర్చిపెట్టడం, తినమంటూ మమ్మల్ని బుజ్జగించడం, జాగ్రత్తలు చెప్పడం, కంటిపాపలా చూసుకోవడం..  వీటన్నిటి వెనుక ఎంత ప్రేమ ఉంది కదమ్మా? ఆ ప్రేమ ముందే తెలిసినా, నేనూ ఇల్లాలినై బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఇప్పుడు మరీ మరీ తెలుస్తొందమ్మా! 

అమ్మా.. ఇలా ఒకటి రెండు కాదు. రోజూలో ఆల్మోస్ట్ అన్ని విషయాలూ నిన్నే గుర్తు చేస్తున్నాయి. అమ్మా.. ఇప్పటి వరకూ చాలాసార్లు "you are the most wonderful mom in this world" అని చెప్పాను. అప్పుడు కేవలం ప్రేమా, సంతోషాలతో చెప్పాను. ఇప్పుడు నీ విలువ నిజంగా అర్ధమై రెట్టింపు ప్రేమా, గౌరవాలతో చెబుతున్నాను.

అమ్మా.. thank you. Thank you soo much for all the love and care. You are the most wonderful mom in this world. అమ్మా.. and I love you so much! Thank you so much for being so wonderful!       

నీ
ప్రియ                                     