Wednesday, September 2, 2015

ఫోన్ పోయింది

మొన్న 21 సాయంత్రం తుపర పడుతోంటే క్లైమెట్ బావుందని ఎంచక్కా అక్టివా వేసుకుని అక్టీవ్ గా డ్రైవ్ కి వెళ్లాను. వెళ్తూ వెళ్తూ ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ ని చూసి  "అవసరమా? డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేసేది ఏమీలేదు కదా..? హాం.. అయినా సేఫ్టీ కి ఉంటుందిలే" అనుకుంటూ పాకెట్ లో వేసుకున్నాను.  వెళుతుండగా "పాకెట్ లో ఎందుకు.. ఫోన్ తీసి డిక్కీలో వేసేసుకుంటే ఓ గొడవ వదిలిపోతుంది కదా.." అనుకుని, "వర్షం పెద్దగా పడితే అప్పుడు చూద్దాంలే..  చూసుకుంటుంనుగా.. అలా పడిపోనిస్తానేవిటీ? మరీను.." అని సర్దిచెప్పుకుని ( ఒక్క నిముషం ఆగదానికి బద్ధకించి), చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు చూసి మైమరచిపోతూ హుషారుగా ముందుకు వెళ్లాను. కాసేపటికి కాస్త పెద్దగా చినుకులు మొదలయ్యేసరికి నా హుషారు జోరు పెరిగి ఆ జోరులో ఫోన్ సంగతి మర్చిపోయాను. ఓ నాలుగైదు కిలోమీటర్స్ వెళ్ళాక, సరే ఇక ఇంటికి వెళదాం.. టైం ఎంతైందో ఏవిటోనని  మొబైల్ కోసం చూస్తే లేదు! గుండె జారిపోయింది. ఊపిరి ఆగిపోయింది. అప్పటి వరకూ హాయిగా అనిపించిన వర్షపు చినుకులు నిప్పురవ్వల్లా అనిపించాయి. అసలే ఆ రోడ్  అంత బావుండలేదు. ఎక్కడ పడిపోయిందో ఏవిటో?  దిక్కుమాలిన వర్షంలో ఫోన్ ని ఎక్కడని వెతకను? బరువెక్కిన గుండెతో వచ్చిన దారంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి ముఖం పట్టాను. దారిలో తెలిసిన వాళ్ళు కనబడితే, విషయం చెప్పి వాళ్ళ ఫోన్ నుండి ట్రై చేస్తే "స్విచ్ ఆఫ్". 
ఏడుపు మొహంతోటే  ముందు అందులో సైన్ ఇన్ అయి ఉన్న అకౌంట్స్ పాస్వర్డ్స్ మార్చి, Android mobile device లో ఎరేస్ డేటా, లాక్ ఫోన్ లాటివి సెట్ చేసి భరత్ ని పేస్ చేయడానికి ధైర్యం కూడదీసుకున్నాను. పాపం నేనే ఆల్రెడీ చాలా బాధలో ఉన్నానని కాబోలు భరత్ ఏమీ అనలేదు. అందుకు మరీ బాధపడ్డాననుకోండీ.. 32GB మెమరీ కార్డ్, ఆ ఫోన్ తో ఉన్న మెమరీస్.. కాంటాక్ట్స్, డేటా.. అన్నీ పోయినట్లే. అంతా నా నిర్లక్ష్యం వల్లేనని నా మీద నాకు పీకల వరకూ కోపం. బూతులు రావు కాబట్టి కుదరలేదు కానీ వచ్చిన తిట్లన్నీ తిట్టుకున్నాను నన్ను నేను.

 "అమ్మా... ముద్దుల Moto E.. ఎక్కడున్నావమ్మా.?" అంటూ  దాన్ని తలుచుకోని రోజు లేదు ;(. అలాగే మొన్న శనివారం యధాపలంగా నా ఫోన్ కి ట్రై చేస్తే   రింగ్ అయింది!! ఫోన్ ఎత్తి మాట్లాడాడు కూడాను! నా ఫోన్, మీకు దొరికింది కాబోలు.. దయచేసి మీరెక్కడ ఉన్నారో చెబితే వచ్చి తీసుకుంటానండి" అని ఎంతో మర్యాదగా అడిగితే, "నాకు ఈ సిమ్ బస్సు లో దొరికింది, బాలన్స్ ఉందని వాడుకుంటున్నాను. మీరేం చేయగలరో చేసుకోం"డంటూ కాల్ కట్ చేసి మళ్ళీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. నా పిచ్చి పీక్స్ కి వెళ్ళింది. మొబైల్ కొన్న బిల్, IMEI నెంబర్ ఎలాగూ ఉన్నాయి కనుక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను. BSNL ఆఫీస్ లో 21st తరువాత చేసిన అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ రిక్వెస్ట్ చేశాం. ఈ రోజు వస్తుంది. చూడాలి మరి.. ఏమౌతుందో..!? 

మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారాండీ? మళ్ళీ అది మీకు దొరికిందా? నా ఫోన్ ని ట్రేస్ చేయడానికి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయంటారా? తెలిస్తే చెప్పరూ.. ప్లీజ్.. 

**
ఈ సంఘటన వల్ల నాకో నీతి అర్ధమైంది. నాలాటి వారు ఇంకెవరైనా ఉంటే దయచేసి మీరూ తెలుసుకోండి.   

4 comments:

లక్ష్మీ'స్ మయూఖ said...

ఎన్ని రోజులైందిరా ప్రియా నీ పోస్టు చదివి.ఎలావున్నావ్?.ఏమైపోయావ్?.చూశావా మనం చేయవలసిన పనిని చిన్న వాయిదా వేసినామంటే ఎంతనష్టమో!.వాయిదా వలన కలిగే నష్టాలివి.దొరుకుతుందిలే,కానీ నీకో మంచివిషయమైతే తెలిసిందిగా.అమ్మలాంటివాళ్ళం చెప్పే మాటలే ఇవి.సరేనా...

Anonymous said...

https://kastephale.wordpress.com/?s=IMEI&submit=%E0%B0%B5%E0%B1%86%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B1%81

Priya said...

బాగా తెలిసొచ్చిందండి. నిజమే చాలా రోజులయిపోయింది! బావున్నానండి. కాస్త విరామం తీసుకున్నాను. ఇకపై రాస్తుంటానుగా.. :)

Priya said...

Thanks :)

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Wednesday, September 2, 2015

ఫోన్ పోయింది

మొన్న 21 సాయంత్రం తుపర పడుతోంటే క్లైమెట్ బావుందని ఎంచక్కా అక్టివా వేసుకుని అక్టీవ్ గా డ్రైవ్ కి వెళ్లాను. వెళ్తూ వెళ్తూ ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ ని చూసి  "అవసరమా? డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేసేది ఏమీలేదు కదా..? హాం.. అయినా సేఫ్టీ కి ఉంటుందిలే" అనుకుంటూ పాకెట్ లో వేసుకున్నాను.  వెళుతుండగా "పాకెట్ లో ఎందుకు.. ఫోన్ తీసి డిక్కీలో వేసేసుకుంటే ఓ గొడవ వదిలిపోతుంది కదా.." అనుకుని, "వర్షం పెద్దగా పడితే అప్పుడు చూద్దాంలే..  చూసుకుంటుంనుగా.. అలా పడిపోనిస్తానేవిటీ? మరీను.." అని సర్దిచెప్పుకుని ( ఒక్క నిముషం ఆగదానికి బద్ధకించి), చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు చూసి మైమరచిపోతూ హుషారుగా ముందుకు వెళ్లాను. కాసేపటికి కాస్త పెద్దగా చినుకులు మొదలయ్యేసరికి నా హుషారు జోరు పెరిగి ఆ జోరులో ఫోన్ సంగతి మర్చిపోయాను. ఓ నాలుగైదు కిలోమీటర్స్ వెళ్ళాక, సరే ఇక ఇంటికి వెళదాం.. టైం ఎంతైందో ఏవిటోనని  మొబైల్ కోసం చూస్తే లేదు! గుండె జారిపోయింది. ఊపిరి ఆగిపోయింది. అప్పటి వరకూ హాయిగా అనిపించిన వర్షపు చినుకులు నిప్పురవ్వల్లా అనిపించాయి. అసలే ఆ రోడ్  అంత బావుండలేదు. ఎక్కడ పడిపోయిందో ఏవిటో?  దిక్కుమాలిన వర్షంలో ఫోన్ ని ఎక్కడని వెతకను? బరువెక్కిన గుండెతో వచ్చిన దారంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి ముఖం పట్టాను. దారిలో తెలిసిన వాళ్ళు కనబడితే, విషయం చెప్పి వాళ్ళ ఫోన్ నుండి ట్రై చేస్తే "స్విచ్ ఆఫ్". 
ఏడుపు మొహంతోటే  ముందు అందులో సైన్ ఇన్ అయి ఉన్న అకౌంట్స్ పాస్వర్డ్స్ మార్చి, Android mobile device లో ఎరేస్ డేటా, లాక్ ఫోన్ లాటివి సెట్ చేసి భరత్ ని పేస్ చేయడానికి ధైర్యం కూడదీసుకున్నాను. పాపం నేనే ఆల్రెడీ చాలా బాధలో ఉన్నానని కాబోలు భరత్ ఏమీ అనలేదు. అందుకు మరీ బాధపడ్డాననుకోండీ.. 32GB మెమరీ కార్డ్, ఆ ఫోన్ తో ఉన్న మెమరీస్.. కాంటాక్ట్స్, డేటా.. అన్నీ పోయినట్లే. అంతా నా నిర్లక్ష్యం వల్లేనని నా మీద నాకు పీకల వరకూ కోపం. బూతులు రావు కాబట్టి కుదరలేదు కానీ వచ్చిన తిట్లన్నీ తిట్టుకున్నాను నన్ను నేను.

 "అమ్మా... ముద్దుల Moto E.. ఎక్కడున్నావమ్మా.?" అంటూ  దాన్ని తలుచుకోని రోజు లేదు ;(. అలాగే మొన్న శనివారం యధాపలంగా నా ఫోన్ కి ట్రై చేస్తే   రింగ్ అయింది!! ఫోన్ ఎత్తి మాట్లాడాడు కూడాను! నా ఫోన్, మీకు దొరికింది కాబోలు.. దయచేసి మీరెక్కడ ఉన్నారో చెబితే వచ్చి తీసుకుంటానండి" అని ఎంతో మర్యాదగా అడిగితే, "నాకు ఈ సిమ్ బస్సు లో దొరికింది, బాలన్స్ ఉందని వాడుకుంటున్నాను. మీరేం చేయగలరో చేసుకోం"డంటూ కాల్ కట్ చేసి మళ్ళీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. నా పిచ్చి పీక్స్ కి వెళ్ళింది. మొబైల్ కొన్న బిల్, IMEI నెంబర్ ఎలాగూ ఉన్నాయి కనుక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను. BSNL ఆఫీస్ లో 21st తరువాత చేసిన అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ రిక్వెస్ట్ చేశాం. ఈ రోజు వస్తుంది. చూడాలి మరి.. ఏమౌతుందో..!? 

మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారాండీ? మళ్ళీ అది మీకు దొరికిందా? నా ఫోన్ ని ట్రేస్ చేయడానికి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయంటారా? తెలిస్తే చెప్పరూ.. ప్లీజ్.. 

**
ఈ సంఘటన వల్ల నాకో నీతి అర్ధమైంది. నాలాటి వారు ఇంకెవరైనా ఉంటే దయచేసి మీరూ తెలుసుకోండి.   

4 comments:

  1. ఎన్ని రోజులైందిరా ప్రియా నీ పోస్టు చదివి.ఎలావున్నావ్?.ఏమైపోయావ్?.చూశావా మనం చేయవలసిన పనిని చిన్న వాయిదా వేసినామంటే ఎంతనష్టమో!.వాయిదా వలన కలిగే నష్టాలివి.దొరుకుతుందిలే,కానీ నీకో మంచివిషయమైతే తెలిసిందిగా.అమ్మలాంటివాళ్ళం చెప్పే మాటలే ఇవి.సరేనా...

    ReplyDelete
    Replies
    1. బాగా తెలిసొచ్చిందండి. నిజమే చాలా రోజులయిపోయింది! బావున్నానండి. కాస్త విరామం తీసుకున్నాను. ఇకపై రాస్తుంటానుగా.. :)

      Delete
  2. Anonymous2/9/15