Tuesday, April 26, 2016

కళ్యాణరాగం - Part 1

 నన్ను ఎంతమంది అడిగారో ఇప్పటికి! "మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా.. లైఫ్ ఎలా ఉందీ? హ్యాపీగా ఉన్నారా ?"అని. 

మీకూ ఆ ప్రశ్న మెదిలిందా మనసులో? అయితే చెప్తాను వినండి. 

ఏ ఇద్దరి మనుషులైనా ఎప్పుడూ ఏకాభిప్రాయంతో ఎలా ఉండగలరండీ? అంతెందుకు? అమ్మానాన్నలతో మనకెపుడూ మాటా మాటా రాదా చెప్పండి? ఇదీ అంతే. కచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. మాకూ వచ్చాయి. వస్తాయి. కాని ఏ సమస్యనీ  బంధాన్ని తెంపేంత బలం కూడబెట్టుకోనివ్వలేదు.  

ప్రేమికులూ, భార్యాభర్తలనే కాదు.  ఏ బంధానికైనా.. అహం, అపనమ్మకం బద్ధ శత్రువులు. 'అడ్జస్ట్మెంట్ అంటే జీవితంలో రాజి పడినట్లే.. బాబోయ్ అలా అడ్జస్ట్ అయి బ్రతికే కంటే it's better to move on' అనుకునేదాన్ని. కాని నిజం చెప్పనా? అర్ధం చేసుకుని సర్దుకుపోగలగడం ఓ వరం. అది ఉన్నపుడు బంధం పటిష్టంగా ఉంటుంది. అందుకే ఎంత కష్టపడైనా దాన్ని సంపాదించుకోవాలి. నేను కష్టపడ్డాను.. పడుతూనే ఉన్నాను.

కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లూ ఆచారాలు. అన్నిటినీ అర్ధం చేసుకోవడానికి అంగీకరించడానికి కాస్త సమయం పట్టింది. పెళ్ళికి ముందు భరత్ వేరు, పెళ్లి తరువాత భరత్ వేరు. అంటే నన్ను ప్రేమగా చూసుకోలేదు, పట్టించుకోలేదు అని కాదండోయ్ :)! తనెప్పుడూ ఒకేలా ఉండి ఉండచ్చు.. కాని దూరంగా చూడ్డం వేరు దగ్గరగా చూడ్డం వేరు కదా? ఆ మాటకొస్తే నేను కూడా తనకు కొత్తగానే కనిపించి ఉంటాను. 

ఎంత కష్టపడి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాము?! తియ్యగా ఊహించుకున్నాను  భవిష్యత్తు గురించి. ఏ అమ్మాయయినా అంతే కదా.. ? కాని పెళ్ళైన మొదటిరోజే మొదలయ్యాయి అత్తగారి ఆరళ్ళు. నాక్కాదండోయ్.. భరత్ కి! నాకు అన్ని  కష్టాలేం లేవులెండి (అంటే.. తనక్కూడా. ఏదో ప్రాస బావుందని వాడాను :P).  

పెళ్ళైన సాయంత్రానికి మా పుట్టింటికి తీసుకువెళ్ళారు. ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. నా  మట్టుకు నాకు తప్పేం అనిపించట్లేదు.    
 
ఏం..? మనలో మన మాట. మరేమో మరి.. సినిమాల్లో చూపించిన అలంకరణలన్నీ ఊహించుకుంటూ.. అక్క పెళ్లపుడు మేం చేసిన హడావిడి కళ్ళ ముందు కదులుతుంటే, మనసు లోలోపల 
 'ఈ రేయి తీయనిది.. ఈ చిరు గాలి మనసైనదీ
 ఈ హాయి మాయనిదీ..  ఇంతకూ మించి యెమున్నదీ
 ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి 
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి 
పన్నీటి తలపులు నిండగా... ఇన్నాళ్ళ కలలే పండ.' అంతే. 'పండ' దగ్గరే గతుక్కుమన్నాను. కలలు 'పండగా' అని పాడుకోవాల్సిన నేను 'దండగా' అని పాడుకోవాల్సి వచ్చింది ;-( 

ఛ! ఆ రోజు చేతిలో ఫోన్ లేకపోయిందిగాని లేకపోతే మీకూ చూయిద్దును ఆ రూం ఎలా ఉందో. ఆ సాయంత్రానికే ఎక్కడి బంధువులక్కడ గప్చుప్. ఇంట్లో అక్క, బావ, చిన్ను, అమ్మ, మా ఇద్దరం. నాన్న అర్జెంటు పని ఉండి బెంగుళూరు వెళ్ళారు. బయటి వాళ్ళెవరూ లేకపోవడంతో మా అమ్మ తన "ప్రేమతో కూడిన క్రియేటివిటీ" ప్రదర్శించింది. 

మంచం నిండుగా మాసినవి ఉతికినవి అన్న తేడా లేకుండా బట్టలు, అంత పాత చెండాలపు దిండ్లు మా ఇంట్లో లేవని ఎక్కడో బయటి నుండి తెప్పించినట్లుంది పాపం. నల్లగా మురుగ్గొట్టుకుపోయి మచ్చా మరకలతో తళతళ్ళాడిపోతూ కనిపించాయి. చుట్టూ నేల మీదేమో అంగుళం కూడా చోటు లేకుండా భోజనాలు పెట్టించడానికి బయటనుండి తెప్పించిన పాత్రలతో పాటు  స్టోర్ రూం నుండి వెలికి తీసిన సామాను. అంత వరకూ బాగానే ఉంది కాని ఆ దుమ్మూ అదీ కూడా ఆవిడ స్వయంగా తెచ్చి పోసిందంటే నమ్మలేకపోయాను. 

"ఏమీ అనుకోకండమ్మా.. పెళ్లి ఇల్లు కదా.. కాస్త చిందరవందరగా ఉంది. పాలు తెచ్చిస్తాను ఆగు ప్రియా. తలుపు వేయకు" అనేసి వెళ్ళిపోయింది అమ్మ. 

భరత్ మొహం చూడ్డానికి భయం వేసింది నాకు. ఆవిడ అటు వెళ్ళగానే భరత్ పెద్దగా నవ్వాడు "ఏంటే బాబూ ఇదీ.. మీ అమ్మ కు నా మీద మరీ ఇంత కక్ష ఉందనుకోలేదు" అంటూ. పాపం అత్తయ్య అక్కడికీ అంటూనే ఉన్నారు. అక్కడ ఎందుకులే.. మాకు పట్టింపులు లేవు. పైగా దూర ప్రయాణం.. అలసిపోతారూ. ఇక్కడైతే అందరం ఉన్నాం" అని. మా ఇంటికి కొడుకుని ఒక్కడ్నే పంపడానికి భయం. మా అమ్మ ఎలా చూస్తుందోనని. పైగా నాన్న కూడా ఊర్లో లేరుగా. కాని అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. సరికదా.. ఆమె అలా అన్నందుకు ఇల్లు పీకి పందిరేసింది. 

మొత్తానికి 'ఇదిగో పాలు తెస్తాను తలుపు వేయోద్ద'న్న మా అమ్మ ఎప్పుడు వచ్చిందో, అసలు వచ్చిందో లేదో తెలియదు. చాలాసేపు బిక్కుబిక్కుమంటూ చెరోవైపూ దోమలు కొట్టుకుంటూ కూర్చొని, అలసిపోయి ఉన్నామేమో..   తెలియకుండానే  నిద్రపోయాం. అన్నట్లు.. చెప్పలేదు కదూ.. ఆ రోజే ఆ గదిలో ఫ్యాన్ కూడా పాడయింది!

అలా మా మొదటిరాత్రి ఎంతో మధురంగా గడిచాక, మరుసటి రోజు ఉదయం అక్కావాళ్ళు సైలెంట్  గా బ్యాగ్ సర్దేసుకున్నారు. భరత్ గొడవ. "పద వెళ్ళిపోదాం.. మీ అమ్మ అన్నమైనా పెడుతుందో లేదో? పెట్టినా, ఏమైనా కలిపిందనుకో.. రోజంతా బాత్రూం చుట్టూ ప్రదక్షణలు చేయాలి. నావల్ల కాదే.. పదా పదా" అంటూ ఒకటే పాట. అలా చేస్తే తెల్లారేసరికల్లా వచ్చేసినందుకు మా అత్తగారు ఏమనుకుంటారోనని నా భయం. ఆ భయమే తన ముందు ఉంచితే.. "మీ బాబాయ్ భోజనానికి పిలిచారుగా.. వాళ్ళింటికి పోదాం పద. పాపం ఆ ముసలావిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మరీ చెప్పారు, మరీ మరీ రమ్మని" అన్నాడు. అస్సలు ఇల్లు కదలడానికి గాని, కొత్త మనుషులను చూడ్డానికి గాని, పైగా ఆ మనిషిని ఏమాత్రం ఇష్టపడని భరత్, అలా చంటి పిల్లలు చిరుతిండ్లు కోసం పాడినట్లు ఒకటే పాట పాడుతోంటే నాకు మనసాగలేదు. యుద్ధమైనా పరవాలేదు. ఏదైతే అదైందని ధైర్యం చేసి చెప్పేశాను అమ్మకి. 

కోప్పడుతుందనుకుంటే, "పోన్లే, మంచిది. నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నా.. మీకు కావాలంటే బయటి నుండి తెచ్చుకోమని చెబ్దాం అనుకున్నా" అంది. 

ఇంటి నుండి బయటకు వచ్చి అలా మా ఇంటి సందు తిరగ్గానే, పంజరం నుండి బయట పడిన పక్షి ఫీలింగ్ ఏంటో అనుభవానికి వచ్చింది మా ఇద్దరికీ :)

నవ్వుతూ, తుళ్ళుతూ.. సరదాగా చిలిపి కబుర్లు చెప్పుకుంటూ డ్రైవ్ ని ఎంజాయ్ చేయడం లాటి  చిల్లరి పనులు చేయకుండా.. ( :( ) చక్కగా ఆ చుట్టు పక్కల భూమి రేట్లు, ఏ ఏ పంటలు ఎప్పుడెపుడు వేస్తారు, వాటిలో ఉండే లాభనష్టాలూ..,   దారిలో కనబడిన ఫ్లెక్సీల్లో నాయకులు ఎవరెవరు ఎప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారూ.. వారు ఎప్పుడు ఏ పార్టీల కి మారారూ.. అలాగే, మేం ప్రయాణం చేస్తున్న ప్రతి ఊరి నాయకుడి పేరూ, చరిత్ర, అదేవిధంగా మరీ.. మాకు ఎదురైన వాహనాల ప్రైజూ, పనితం.. ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తూ (నేను మధ్య మధ్య కాస్త కునుకు తీస్తూ).. చక్కగా ఆ ఊరు చేరుకున్నాం. 

పాపం, ఏ మాటకామాటే.. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత సంతోషపడ్డారో మమ్మల్ని చూసి! చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఓ యాభైమంది వరకూ ఉన్నారు అక్కడ. "ఏడీ.. ప్రియమ్మ మొగుడూ.. కాస్త చూడనీ" అంటూ సాధారణంగా బయటకు రాని భామ్మలు కూడా వచ్చారు. 

"మనవడా.. బంగారంలా ఉన్నావయ్యా.., అక్కా.. నీ కంటే బావే బావున్నాడు.. , నువ్వేం సరిపోతావే మా అబ్బాయి ముందూ.., పిల్ల బంగారం.. నీ మనసూ వెన్నపూసేయ్యా పెళ్ళిలో చూశాంగా (ఎలా తెలిసిందో మరి?!!) పిల్లని బాగా చూసుకో బాబూ..., ముత్యాలు రాలిపోతాయా ఏంటయ్యా? ఓ మాటైనా మాటాడొచ్చుగా" ఇలా అందరూ వాళ్లకు వాళ్ళే చుట్టరికం కలుపుకుని చనువుగా ఎంత మాట్లాడినా.. తను కనీసం పన్నైనా కనబడనివ్వలేదు! అన్నిటికీ చిరుమందహాసమే సమాధానం! నా గురించి మీకు తెలుసుగా... :) వాళ్ళతో సమానంగా నేనూ వాగాను. హీ.. :)

భరత్ కునికి పాట్లు పడుతుంటే, "పాపం. నావల్ల తనకి రాత్రంతా నిద్రలేదు. బాగా ఇబ్బంది పెట్టేశాను" అన్నా. నా ఉద్దేశం ఏంటంటే.. పాపం ఉన్న కొద్ది చోటులో తన ప్లేస్ కూడా నేనే ఆక్రమించుకుని, పైగా రాత్రంతా తనతో విసిరించుకుంటూ హాయిగా పడుకున్నానూ.. ఎటొచ్చీ తనకే నిద్రలేదని. వాళ్లకి వేరే విధంగా అర్ధమయింది. ముసి ముసి నవ్వులు రువ్వారు! వాళ్లకనేముందిలెండి. భరత్ చుర్రున చూశాడు! నా మట్టి బుర్రకి తట్టలేదు అప్పటికీ. 

తను పరవాలేదు, అదేంకాదంటుంటే..  కాదు నిద్రపోలేదని, అందుకు కారణం నేనేనని వాళ్ళందరికీ చెప్పి.. మొత్తానికి అందరం బలవంతం చేసి తనను పడుకోబెట్టేసాం. చిటికెలో నిద్రపోయాడు. "మీలో ఎవరు కోటీశ్వరుడు" నాగార్జున గారి చిటిక కాదులెండి. మాములిది :)

అప్పటికి ఇంకా వంట జరుగుతూ ఉంది అక్కడ. నేనూ కాస్త సాయం చేస్తానంటే "అమ్మో.. కొత్త పెళ్లికూతురువి. వద్దు. కబుర్లు చెప్పూ" అన్నారు బాబాయ్ గారి భార్య (ఈవిడ గురించి చాంతాడంత ఉంది చెప్పడానికి. మా నిశ్చితార్దానికొచ్చి చీరలు, క్లిప్పులు, మరీ చిరాగ్గా నైల్పోలిష్లు దొబ్బేసింది దొంగమొహంది. ఛీ ఛీ! తప్పు తప్పు! సారీ.. ఏమనుకోకండెం? స్వయంగా ఆవిడ బ్యాగ్లో చూశాను కదా.. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఓకే ఓకే). 

ఏదో పిచ్చాపాటి కబుర్లు దొర్లుతున్నాయి. ఓ స్టవ్ మీద ఉల్లిపాయలు వేగుతున్నాయి, మరో స్టవ్ మీద పాయసం ఉంది. ఈ లోపు ఎర్రటి నీళ్ళతో ఉన్న చికెన్ గిన్నెను మూత తీసింది ఆవిడ. నేను కంగారు పడి, ఇప్పుడు ఇందెందుకండీ? అన్నాను. ఆ ఉల్లిపాయాల్లో వేయడానికంటూ చెప్పడం, వేయడం జరిగిపోయాయి (ఆ రక్తపు నీళ్ళతో సహా!). 

"బాబోయ్! పాపం భరత్.. మా అమ్మ ఏదో 'కలిపి' తెస్తుందనుకున్నతిప్పలు ఈవిడ 'కడక్కుండా' చేసి తెచ్చిపెట్టేట్టుంది. అయ్యో.. చికెన్ కూర పక్కనే పాయాసమా? ఏమైనా చుక్కలు పడతాయేమో? ఇప్పుడా పాయసం నేను తినాలా?" అని నేను తర్జనభర్జన  పడుతోంటే.. చికెన్ కూరని గిరాగిరా తిప్పి ఆ గరిటను, ఇందాక చికెన్ తెచ్చిన గిన్నెలో పడేసింది. అసలే అందులో ఇంకా కొద్దిగ నీళ్ళు కూడా ఉన్నాయి. చూడలేక నేను మొహం తిప్పుకుంటున్న తరుణంలో.. పాయసం కూడా సేం టు సేం అలాగే తిప్పి ఆ గరిటెను కూడా అందులోనే వేసేసింది! పైగా.. "బెల్లం సరిగా కలవలేదనుకుంటా" అంటూ మళ్ళీ ఆ గరిటెను పాయసంలో పెట్టి ఓ తిప్పు తిప్పింది!!

నా ఫీలింగ్స్ & ఎక్ష్ప్రెషన్స్ మీ ఊహకి వదిలేస్తున్నా. 

బయటకు వెళ్ళే పనుందండీ.. అమ్మో! లేట్ అయిపోతోంది! రేపో ఎల్లుండో తరువాత జరిగిన విషయాలు చెప్తాను. ఉంటానేం? 
 
16 comments:

జ్యోతిర్మయి said...

ఏం రాసినా భలే సరదాగా రాస్తారు. చెప్పండి తరువాతేమైంది...

శ్రీ said...

నమస్తే ప్రియ గారు చాన్నాళ్లకు దర్శనం..ఇకపై కొంచం విరామ సమయం తగ్గించండి..మీ బ్లాగుకు రావడం..కొత్త పోస్టు ఏదైన ఉందా అని చూడడం .. లేదని తెలిసి కొంచం నిరాశతొ వెనతిరుగడం..హమ్మయ్య ఇప్పటికైన మీకు వీలు దొరికింది..keep writing..

Priya said...

చాలా కృతజ్ఞతలు, జ్యోతిర్మయి గారు :)
తరువాతా.. తరువాతా.. తరువాతేమైందంటే.. పార్ట్ - 2 లో చెప్తానండి :) :) :)

Priya said...

నమస్కారమండీ!
అయ్యో.. అవునా? అయినా చాలా కృతజ్ఞతలు శ్రీ గారూ. లేదులెండి ఈ సారి అంత గ్యాప్ రాదు. Thank you so much for the lovely comment :) :)

వేణూశ్రీకాంత్ said...

నాదీ జ్యోతీర్మయి గారి మాటేనండీ.. మీరేం చెప్పినా సరదాగా చదివేసేట్లు చెప్తారు :-) బాగుంది మీ కళ్యాణ రాగం.. కానివ్వండి పాపం తర్వాతేం తిప్పలు పడ్డారో అని తెలుసుకోడానికి ఎదురు చూస్తున్నాం :-)

vainika said...

చాలా రోజుల తర్వాత...బాగుంది..మాకు చదవడానికి సరదాగా ఉంది కానీ మీ పరిస్థితి తలచుకుంటేనే..పాపం.. :-)
ఏమైనా మీ ప్రేమకథ అలా మధ్యలో ఆపేయటం మాత్రం కష్టంగా ఉంది..

sarma said...

తరువాయి కై ఎదురుచూపు :)

Harish Kanna Yelsoju said...

very happy to saw you post, please write part 2, i am very much waiting for that.

Lalitha TS said...

ప్చ్ :( ముందు ముందు విశేషాలు బావుండాలని కోరుకుంటూ ...

~ లలిత

Sridhar Bukya said...

హేయి చెల్లి.. వణక్కం తంగచ్చి.. నీ ఎప్పటి ఎరుకా.. నా నల్ల ఇర్రుక్కేన్.. ప్రియమ్మ.. ఎలా ఉన్నావ్.. దాదాపు మూడేళ్ళవుతోంది నిను పలకరించి.. కళ్యాణరాగం బాగుంది.. టేక్ కేర్.. భరత్ ను అడిగానని చెప్పమ్మ..

(శ్రీధర్..)

కొద్ది నెలల క్రితం ఇక్కడికి వచ్చి చూశా.. ఈ ఇంటికి (మీ బ్లాగింటికి) బయిటినుండి గొళ్ళెం వేసుంది.. చాలా సంతోషంగా ఉంది మరల పలకరించి.. థ్యాంక్యూ ఫర్ రి-ఓపెనింగ్ దీ బ్లాగ్ టూ జనరల్ పబ్లిక్..

లాస్ట్ కన్వర్జేషన్ వజ్ డ్యూరింగ్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ సిస్..! బాయి చెల్లి..

విన్నకోట నరసింహా రావు said...

ఇటువంటి టపాలు వ్రాయకుండా ఉండడం శ్రేయస్కరం, మీకే మంచిది (నాది ఉ.బో.స. అనుకున్నా ఫరవాలేదు).

Anonymous said...

Hello Priya garu, It has been more than 6 months you blogged. Please try to post at least one per month. Thank you

Anonymous said...

Waiting for next post.

Anonymous said...

Really informative and fantastic anatomical structure of subject material, now that's user friendly (:.

Anonymous said...

Attractive portion of content. I just stumbled upon your weblog and in accession capital to claim that I acquire actually enjoyed account your blog posts.
Anyway I'll be subscribing in your feeds and even I success you
get entry to constantly rapidly.

Post a Comment

ఏవండీ.. ఇదేమైనా బావుందా?? అదే.. చదివేసి కామెంట్ చేయకుండా పేజ్ మార్చేయడం? అయినా మణులడిగానా మాణిక్యాలడిగానా కామెంటేగా రాసేద్ధురూ.. :)

Tuesday, April 26, 2016

కళ్యాణరాగం - Part 1

 నన్ను ఎంతమంది అడిగారో ఇప్పటికి! "మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా.. లైఫ్ ఎలా ఉందీ? హ్యాపీగా ఉన్నారా ?"అని. 

మీకూ ఆ ప్రశ్న మెదిలిందా మనసులో? అయితే చెప్తాను వినండి. 

ఏ ఇద్దరి మనుషులైనా ఎప్పుడూ ఏకాభిప్రాయంతో ఎలా ఉండగలరండీ? అంతెందుకు? అమ్మానాన్నలతో మనకెపుడూ మాటా మాటా రాదా చెప్పండి? ఇదీ అంతే. కచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. మాకూ వచ్చాయి. వస్తాయి. కాని ఏ సమస్యనీ  బంధాన్ని తెంపేంత బలం కూడబెట్టుకోనివ్వలేదు.  

ప్రేమికులూ, భార్యాభర్తలనే కాదు.  ఏ బంధానికైనా.. అహం, అపనమ్మకం బద్ధ శత్రువులు. 'అడ్జస్ట్మెంట్ అంటే జీవితంలో రాజి పడినట్లే.. బాబోయ్ అలా అడ్జస్ట్ అయి బ్రతికే కంటే it's better to move on' అనుకునేదాన్ని. కాని నిజం చెప్పనా? అర్ధం చేసుకుని సర్దుకుపోగలగడం ఓ వరం. అది ఉన్నపుడు బంధం పటిష్టంగా ఉంటుంది. అందుకే ఎంత కష్టపడైనా దాన్ని సంపాదించుకోవాలి. నేను కష్టపడ్డాను.. పడుతూనే ఉన్నాను.

కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లూ ఆచారాలు. అన్నిటినీ అర్ధం చేసుకోవడానికి అంగీకరించడానికి కాస్త సమయం పట్టింది. పెళ్ళికి ముందు భరత్ వేరు, పెళ్లి తరువాత భరత్ వేరు. అంటే నన్ను ప్రేమగా చూసుకోలేదు, పట్టించుకోలేదు అని కాదండోయ్ :)! తనెప్పుడూ ఒకేలా ఉండి ఉండచ్చు.. కాని దూరంగా చూడ్డం వేరు దగ్గరగా చూడ్డం వేరు కదా? ఆ మాటకొస్తే నేను కూడా తనకు కొత్తగానే కనిపించి ఉంటాను. 

ఎంత కష్టపడి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాము?! తియ్యగా ఊహించుకున్నాను  భవిష్యత్తు గురించి. ఏ అమ్మాయయినా అంతే కదా.. ? కాని పెళ్ళైన మొదటిరోజే మొదలయ్యాయి అత్తగారి ఆరళ్ళు. నాక్కాదండోయ్.. భరత్ కి! నాకు అన్ని  కష్టాలేం లేవులెండి (అంటే.. తనక్కూడా. ఏదో ప్రాస బావుందని వాడాను :P).  

పెళ్ళైన సాయంత్రానికి మా పుట్టింటికి తీసుకువెళ్ళారు. ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. నా  మట్టుకు నాకు తప్పేం అనిపించట్లేదు.    
 
ఏం..? మనలో మన మాట. మరేమో మరి.. సినిమాల్లో చూపించిన అలంకరణలన్నీ ఊహించుకుంటూ.. అక్క పెళ్లపుడు మేం చేసిన హడావిడి కళ్ళ ముందు కదులుతుంటే, మనసు లోలోపల 
 'ఈ రేయి తీయనిది.. ఈ చిరు గాలి మనసైనదీ
 ఈ హాయి మాయనిదీ..  ఇంతకూ మించి యెమున్నదీ
 ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి 
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి 
పన్నీటి తలపులు నిండగా... ఇన్నాళ్ళ కలలే పండ.' అంతే. 'పండ' దగ్గరే గతుక్కుమన్నాను. కలలు 'పండగా' అని పాడుకోవాల్సిన నేను 'దండగా' అని పాడుకోవాల్సి వచ్చింది ;-( 

ఛ! ఆ రోజు చేతిలో ఫోన్ లేకపోయిందిగాని లేకపోతే మీకూ చూయిద్దును ఆ రూం ఎలా ఉందో. ఆ సాయంత్రానికే ఎక్కడి బంధువులక్కడ గప్చుప్. ఇంట్లో అక్క, బావ, చిన్ను, అమ్మ, మా ఇద్దరం. నాన్న అర్జెంటు పని ఉండి బెంగుళూరు వెళ్ళారు. బయటి వాళ్ళెవరూ లేకపోవడంతో మా అమ్మ తన "ప్రేమతో కూడిన క్రియేటివిటీ" ప్రదర్శించింది. 

మంచం నిండుగా మాసినవి ఉతికినవి అన్న తేడా లేకుండా బట్టలు, అంత పాత చెండాలపు దిండ్లు మా ఇంట్లో లేవని ఎక్కడో బయటి నుండి తెప్పించినట్లుంది పాపం. నల్లగా మురుగ్గొట్టుకుపోయి మచ్చా మరకలతో తళతళ్ళాడిపోతూ కనిపించాయి. చుట్టూ నేల మీదేమో అంగుళం కూడా చోటు లేకుండా భోజనాలు పెట్టించడానికి బయటనుండి తెప్పించిన పాత్రలతో పాటు  స్టోర్ రూం నుండి వెలికి తీసిన సామాను. అంత వరకూ బాగానే ఉంది కాని ఆ దుమ్మూ అదీ కూడా ఆవిడ స్వయంగా తెచ్చి పోసిందంటే నమ్మలేకపోయాను. 

"ఏమీ అనుకోకండమ్మా.. పెళ్లి ఇల్లు కదా.. కాస్త చిందరవందరగా ఉంది. పాలు తెచ్చిస్తాను ఆగు ప్రియా. తలుపు వేయకు" అనేసి వెళ్ళిపోయింది అమ్మ. 

భరత్ మొహం చూడ్డానికి భయం వేసింది నాకు. ఆవిడ అటు వెళ్ళగానే భరత్ పెద్దగా నవ్వాడు "ఏంటే బాబూ ఇదీ.. మీ అమ్మ కు నా మీద మరీ ఇంత కక్ష ఉందనుకోలేదు" అంటూ. పాపం అత్తయ్య అక్కడికీ అంటూనే ఉన్నారు. అక్కడ ఎందుకులే.. మాకు పట్టింపులు లేవు. పైగా దూర ప్రయాణం.. అలసిపోతారూ. ఇక్కడైతే అందరం ఉన్నాం" అని. మా ఇంటికి కొడుకుని ఒక్కడ్నే పంపడానికి భయం. మా అమ్మ ఎలా చూస్తుందోనని. పైగా నాన్న కూడా ఊర్లో లేరుగా. కాని అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. సరికదా.. ఆమె అలా అన్నందుకు ఇల్లు పీకి పందిరేసింది. 

మొత్తానికి 'ఇదిగో పాలు తెస్తాను తలుపు వేయోద్ద'న్న మా అమ్మ ఎప్పుడు వచ్చిందో, అసలు వచ్చిందో లేదో తెలియదు. చాలాసేపు బిక్కుబిక్కుమంటూ చెరోవైపూ దోమలు కొట్టుకుంటూ కూర్చొని, అలసిపోయి ఉన్నామేమో..   తెలియకుండానే  నిద్రపోయాం. అన్నట్లు.. చెప్పలేదు కదూ.. ఆ రోజే ఆ గదిలో ఫ్యాన్ కూడా పాడయింది!

అలా మా మొదటిరాత్రి ఎంతో మధురంగా గడిచాక, మరుసటి రోజు ఉదయం అక్కావాళ్ళు సైలెంట్  గా బ్యాగ్ సర్దేసుకున్నారు. భరత్ గొడవ. "పద వెళ్ళిపోదాం.. మీ అమ్మ అన్నమైనా పెడుతుందో లేదో? పెట్టినా, ఏమైనా కలిపిందనుకో.. రోజంతా బాత్రూం చుట్టూ ప్రదక్షణలు చేయాలి. నావల్ల కాదే.. పదా పదా" అంటూ ఒకటే పాట. అలా చేస్తే తెల్లారేసరికల్లా వచ్చేసినందుకు మా అత్తగారు ఏమనుకుంటారోనని నా భయం. ఆ భయమే తన ముందు ఉంచితే.. "మీ బాబాయ్ భోజనానికి పిలిచారుగా.. వాళ్ళింటికి పోదాం పద. పాపం ఆ ముసలావిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మరీ చెప్పారు, మరీ మరీ రమ్మని" అన్నాడు. అస్సలు ఇల్లు కదలడానికి గాని, కొత్త మనుషులను చూడ్డానికి గాని, పైగా ఆ మనిషిని ఏమాత్రం ఇష్టపడని భరత్, అలా చంటి పిల్లలు చిరుతిండ్లు కోసం పాడినట్లు ఒకటే పాట పాడుతోంటే నాకు మనసాగలేదు. యుద్ధమైనా పరవాలేదు. ఏదైతే అదైందని ధైర్యం చేసి చెప్పేశాను అమ్మకి. 

కోప్పడుతుందనుకుంటే, "పోన్లే, మంచిది. నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నా.. మీకు కావాలంటే బయటి నుండి తెచ్చుకోమని చెబ్దాం అనుకున్నా" అంది. 

ఇంటి నుండి బయటకు వచ్చి అలా మా ఇంటి సందు తిరగ్గానే, పంజరం నుండి బయట పడిన పక్షి ఫీలింగ్ ఏంటో అనుభవానికి వచ్చింది మా ఇద్దరికీ :)

నవ్వుతూ, తుళ్ళుతూ.. సరదాగా చిలిపి కబుర్లు చెప్పుకుంటూ డ్రైవ్ ని ఎంజాయ్ చేయడం లాటి  చిల్లరి పనులు చేయకుండా.. ( :( ) చక్కగా ఆ చుట్టు పక్కల భూమి రేట్లు, ఏ ఏ పంటలు ఎప్పుడెపుడు వేస్తారు, వాటిలో ఉండే లాభనష్టాలూ..,   దారిలో కనబడిన ఫ్లెక్సీల్లో నాయకులు ఎవరెవరు ఎప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారూ.. వారు ఎప్పుడు ఏ పార్టీల కి మారారూ.. అలాగే, మేం ప్రయాణం చేస్తున్న ప్రతి ఊరి నాయకుడి పేరూ, చరిత్ర, అదేవిధంగా మరీ.. మాకు ఎదురైన వాహనాల ప్రైజూ, పనితం.. ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తూ (నేను మధ్య మధ్య కాస్త కునుకు తీస్తూ).. చక్కగా ఆ ఊరు చేరుకున్నాం. 

పాపం, ఏ మాటకామాటే.. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత సంతోషపడ్డారో మమ్మల్ని చూసి! చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఓ యాభైమంది వరకూ ఉన్నారు అక్కడ. "ఏడీ.. ప్రియమ్మ మొగుడూ.. కాస్త చూడనీ" అంటూ సాధారణంగా బయటకు రాని భామ్మలు కూడా వచ్చారు. 

"మనవడా.. బంగారంలా ఉన్నావయ్యా.., అక్కా.. నీ కంటే బావే బావున్నాడు.. , నువ్వేం సరిపోతావే మా అబ్బాయి ముందూ.., పిల్ల బంగారం.. నీ మనసూ వెన్నపూసేయ్యా పెళ్ళిలో చూశాంగా (ఎలా తెలిసిందో మరి?!!) పిల్లని బాగా చూసుకో బాబూ..., ముత్యాలు రాలిపోతాయా ఏంటయ్యా? ఓ మాటైనా మాటాడొచ్చుగా" ఇలా అందరూ వాళ్లకు వాళ్ళే చుట్టరికం కలుపుకుని చనువుగా ఎంత మాట్లాడినా.. తను కనీసం పన్నైనా కనబడనివ్వలేదు! అన్నిటికీ చిరుమందహాసమే సమాధానం! నా గురించి మీకు తెలుసుగా... :) వాళ్ళతో సమానంగా నేనూ వాగాను. హీ.. :)

భరత్ కునికి పాట్లు పడుతుంటే, "పాపం. నావల్ల తనకి రాత్రంతా నిద్రలేదు. బాగా ఇబ్బంది పెట్టేశాను" అన్నా. నా ఉద్దేశం ఏంటంటే.. పాపం ఉన్న కొద్ది చోటులో తన ప్లేస్ కూడా నేనే ఆక్రమించుకుని, పైగా రాత్రంతా తనతో విసిరించుకుంటూ హాయిగా పడుకున్నానూ.. ఎటొచ్చీ తనకే నిద్రలేదని. వాళ్లకి వేరే విధంగా అర్ధమయింది. ముసి ముసి నవ్వులు రువ్వారు! వాళ్లకనేముందిలెండి. భరత్ చుర్రున చూశాడు! నా మట్టి బుర్రకి తట్టలేదు అప్పటికీ. 

తను పరవాలేదు, అదేంకాదంటుంటే..  కాదు నిద్రపోలేదని, అందుకు కారణం నేనేనని వాళ్ళందరికీ చెప్పి.. మొత్తానికి అందరం బలవంతం చేసి తనను పడుకోబెట్టేసాం. చిటికెలో నిద్రపోయాడు. "మీలో ఎవరు కోటీశ్వరుడు" నాగార్జున గారి చిటిక కాదులెండి. మాములిది :)

అప్పటికి ఇంకా వంట జరుగుతూ ఉంది అక్కడ. నేనూ కాస్త సాయం చేస్తానంటే "అమ్మో.. కొత్త పెళ్లికూతురువి. వద్దు. కబుర్లు చెప్పూ" అన్నారు బాబాయ్ గారి భార్య (ఈవిడ గురించి చాంతాడంత ఉంది చెప్పడానికి. మా నిశ్చితార్దానికొచ్చి చీరలు, క్లిప్పులు, మరీ చిరాగ్గా నైల్పోలిష్లు దొబ్బేసింది దొంగమొహంది. ఛీ ఛీ! తప్పు తప్పు! సారీ.. ఏమనుకోకండెం? స్వయంగా ఆవిడ బ్యాగ్లో చూశాను కదా.. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఓకే ఓకే). 

ఏదో పిచ్చాపాటి కబుర్లు దొర్లుతున్నాయి. ఓ స్టవ్ మీద ఉల్లిపాయలు వేగుతున్నాయి, మరో స్టవ్ మీద పాయసం ఉంది. ఈ లోపు ఎర్రటి నీళ్ళతో ఉన్న చికెన్ గిన్నెను మూత తీసింది ఆవిడ. నేను కంగారు పడి, ఇప్పుడు ఇందెందుకండీ? అన్నాను. ఆ ఉల్లిపాయాల్లో వేయడానికంటూ చెప్పడం, వేయడం జరిగిపోయాయి (ఆ రక్తపు నీళ్ళతో సహా!). 

"బాబోయ్! పాపం భరత్.. మా అమ్మ ఏదో 'కలిపి' తెస్తుందనుకున్నతిప్పలు ఈవిడ 'కడక్కుండా' చేసి తెచ్చిపెట్టేట్టుంది. అయ్యో.. చికెన్ కూర పక్కనే పాయాసమా? ఏమైనా చుక్కలు పడతాయేమో? ఇప్పుడా పాయసం నేను తినాలా?" అని నేను తర్జనభర్జన  పడుతోంటే.. చికెన్ కూరని గిరాగిరా తిప్పి ఆ గరిటను, ఇందాక చికెన్ తెచ్చిన గిన్నెలో పడేసింది. అసలే అందులో ఇంకా కొద్దిగ నీళ్ళు కూడా ఉన్నాయి. చూడలేక నేను మొహం తిప్పుకుంటున్న తరుణంలో.. పాయసం కూడా సేం టు సేం అలాగే తిప్పి ఆ గరిటెను కూడా అందులోనే వేసేసింది! పైగా.. "బెల్లం సరిగా కలవలేదనుకుంటా" అంటూ మళ్ళీ ఆ గరిటెను పాయసంలో పెట్టి ఓ తిప్పు తిప్పింది!!

నా ఫీలింగ్స్ & ఎక్ష్ప్రెషన్స్ మీ ఊహకి వదిలేస్తున్నా. 

బయటకు వెళ్ళే పనుందండీ.. అమ్మో! లేట్ అయిపోతోంది! రేపో ఎల్లుండో తరువాత జరిగిన విషయాలు చెప్తాను. ఉంటానేం? 
 
16 comments:

 1. ఏం రాసినా భలే సరదాగా రాస్తారు. చెప్పండి తరువాతేమైంది...

  ReplyDelete
  Replies
  1. చాలా కృతజ్ఞతలు, జ్యోతిర్మయి గారు :)
   తరువాతా.. తరువాతా.. తరువాతేమైందంటే.. పార్ట్ - 2 లో చెప్తానండి :) :) :)

   Delete
 2. నమస్తే ప్రియ గారు చాన్నాళ్లకు దర్శనం..ఇకపై కొంచం విరామ సమయం తగ్గించండి..మీ బ్లాగుకు రావడం..కొత్త పోస్టు ఏదైన ఉందా అని చూడడం .. లేదని తెలిసి కొంచం నిరాశతొ వెనతిరుగడం..హమ్మయ్య ఇప్పటికైన మీకు వీలు దొరికింది..keep writing..

  ReplyDelete
  Replies
  1. నమస్కారమండీ!
   అయ్యో.. అవునా? అయినా చాలా కృతజ్ఞతలు శ్రీ గారూ. లేదులెండి ఈ సారి అంత గ్యాప్ రాదు. Thank you so much for the lovely comment :) :)

   Delete
 3. నమస్తే ప్రియ గారు చాన్నాళ్లకు దర్శనం..ఇకపై కొంచం విరామ సమయం తగ్గించండి..మీ బ్లాగుకు రావడం..కొత్త పోస్టు ఏదైన ఉందా అని చూడడం .. లేదని తెలిసి కొంచం నిరాశతొ వెనతిరుగడం..హమ్మయ్య ఇప్పటికైన మీకు వీలు దొరికింది..keep writing..

  ReplyDelete
 4. నాదీ జ్యోతీర్మయి గారి మాటేనండీ.. మీరేం చెప్పినా సరదాగా చదివేసేట్లు చెప్తారు :-) బాగుంది మీ కళ్యాణ రాగం.. కానివ్వండి పాపం తర్వాతేం తిప్పలు పడ్డారో అని తెలుసుకోడానికి ఎదురు చూస్తున్నాం :-)

  ReplyDelete
 5. చాలా రోజుల తర్వాత...బాగుంది..మాకు చదవడానికి సరదాగా ఉంది కానీ మీ పరిస్థితి తలచుకుంటేనే..పాపం.. :-)
  ఏమైనా మీ ప్రేమకథ అలా మధ్యలో ఆపేయటం మాత్రం కష్టంగా ఉంది..

  ReplyDelete
 6. తరువాయి కై ఎదురుచూపు :)

  ReplyDelete
 7. very happy to saw you post, please write part 2, i am very much waiting for that.

  ReplyDelete
 8. ప్చ్ :( ముందు ముందు విశేషాలు బావుండాలని కోరుకుంటూ ...

  ~ లలిత

  ReplyDelete
 9. హేయి చెల్లి.. వణక్కం తంగచ్చి.. నీ ఎప్పటి ఎరుకా.. నా నల్ల ఇర్రుక్కేన్.. ప్రియమ్మ.. ఎలా ఉన్నావ్.. దాదాపు మూడేళ్ళవుతోంది నిను పలకరించి.. కళ్యాణరాగం బాగుంది.. టేక్ కేర్.. భరత్ ను అడిగానని చెప్పమ్మ..

  (శ్రీధర్..)

  కొద్ది నెలల క్రితం ఇక్కడికి వచ్చి చూశా.. ఈ ఇంటికి (మీ బ్లాగింటికి) బయిటినుండి గొళ్ళెం వేసుంది.. చాలా సంతోషంగా ఉంది మరల పలకరించి.. థ్యాంక్యూ ఫర్ రి-ఓపెనింగ్ దీ బ్లాగ్ టూ జనరల్ పబ్లిక్..

  లాస్ట్ కన్వర్జేషన్ వజ్ డ్యూరింగ్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ సిస్..! బాయి చెల్లి..

  ReplyDelete
 10. ఇటువంటి టపాలు వ్రాయకుండా ఉండడం శ్రేయస్కరం, మీకే మంచిది (నాది ఉ.బో.స. అనుకున్నా ఫరవాలేదు).

  ReplyDelete
 11. Anonymous11/1/17

  Hello Priya garu, It has been more than 6 months you blogged. Please try to post at least one per month. Thank you

  ReplyDelete
 12. Anonymous11/2/17

  Waiting for next post.

  ReplyDelete
 13. Anonymous10/3/18

  Really informative and fantastic anatomical structure of subject material, now that's user friendly (:.

  ReplyDelete
 14. Anonymous11/3/18